Print

యహూషువః సువార్తను నమ్ముట

ఇది WLC యేతర వ్యాసం. బయటి రచయితల వనరులను ఉపయోగించినప్పుడు, బైబిలుకు మరియు డబ్ల్యుఎల్‌సి ప్రస్తుత నమ్మకాలకు 100% అనుగుణంగా ఉండెనని భావించిన వాటిని మాత్రమే మేము ప్రచురిస్తాము. కాబట్టి అలాంటి వ్యాసాలను డబ్ల్యుఎల్‌సి నుండి నేరుగా వచ్చినట్లుగా పరిగణించవచ్చు. యహువః యొక్క అనేక మంది సేవకుల పరిచర్య ద్వారా మేము ఎంతగానో ఆశీర్వదించబడ్డాము. అయితే ఈ రచయితల యొక్క ఇతర రచనలను అన్వేషించమని మేము మా సభ్యులకు సలహా ఇవ్వము. అటువంటి రచనలు, లోపాలను కలిగి ఉన్నందున మేము వాటిని ప్రచురణల నుండి మినహాయించాము. విచారకరంగా, లోపం లేని మంత్రిత్వ శాఖను మనం ఇంకనూ కనుగొనలేదు. డబ్ల్యుఎల్‌సి వి కాని కొన్ని ప్రచురించబడిన విషయాలను [వ్యాసాలు/ఎపిసోడ్లు] చూసి మీరు దిగ్బ్రాంతి చెందినచో, సామెతలు 4:18 జ్ఞాపకం చేసుకోండి. మన మార్గంలో మరింత కాంతి వెలువడు కొద్దీ ఆయన సత్యాన్ని గూర్చిన మన అవగాహన అభివృద్ధి చెందుతూ ఉంటుంది. మేము సత్యాన్ని ప్రాణం కంటే ఎక్కువగా ఆదరిస్తాము మరియు అది దొరికిన చోటు ఏదైనా అక్కడ వెతుకుతాము.

ఆకర్షణీయమైన యువతిసువార్తను నమ్ముట రక్షింపబడుటకు; సువార్తను నమ్ముట శిక్షింపబడుటకు కాదు (మార్కు 16:15, 16; రోమా 1:16; మార్కు 8:38; లూకా 9:26). కుమారుడిని నమ్ముట నిత్యజీవము పొందుట కొరకు; కుమారుడిని నమ్మకపోవుట నిత్యజీవము పొందుటకు కాదు, కానీ యహువః ఉగ్రతకు లోనవుటకు. (యోహాను 3:36; cf. vv. 5-8 మరియు 1 యోహాను 5: 10- 13). అందువలన, ఒకడు దేనిని విశ్వసిస్తున్నాడో లేదా విశ్వసించుటలేదో అనేది ఈ ప్రస్తుత జీవితానికి మించిన పరిణామాలను కలిగియున్న చాలా ముఖ్యమైన విషయం. కానీ ఒకడు దేనిని నమ్మాలి? యహూషువః యొక్క సువార్త ఏమిటి? “కుమారుని నమ్ముట” అంటే ఏమిటి?

మొదట, హెబ్రీయులకు పత్రిక 11: 6 ను పరిశీలించండి: “విశ్వాసములేకుండ ఎలోహీమ్ కి ఇష్టుడైయుండుట అసాధ్యము; ఎలోహీమ్ యొద్దకు వచ్చువాడు ఆయన యున్నాడనియు, తన్ను వెదకువారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను గదా.” తన తండ్రిని ఉద్దేశించి యహూషువః ఇలా అన్నారు, “అద్వితీయ సత్య ఎలోహీమ్ అయిన నిన్నును, నీవు పంపిన యహూషువః క్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము.” (యోహాను 17: 3; 1 యోహాను 5:20). ఆయనను పంపిన తండ్రితో పాటు పంపబడిన యహూషువఃను కూడా నమ్మాలి. కుమారుని నమ్ముట అంటే ఆయన ఎవరో నమ్ముటయై ఉన్నది: క్రీస్తు, సజీవుడైయున్న యహూవః కుమారుడు (యోహాను 20:31; 8:24; మత్త. 16:16). అప్పుడు యోహాను 3:36 ప్రకారం “కుమారునియందు విశ్వాసముంచుట” అంటే ఆయన చెప్పినదాన్ని నమ్ముట. ఆయన మాట్లాడిన మాటలు "ప్రకటించుటకు యహువః ఇచ్చిన" మాటలు; అందువల్ల, ఆయన మాటలను నమ్మకపోవుట అనగా యహువః మాటలను తిరస్కరించుట అవుతుంది. (యోహాను 3:34; 8:26, 46, 47; 12: 44-49; 14:10, 23, 24; 17: 8; మార్క్ 8:38 ). ప్రవక్తల ద్వారా మాట్లాడిన యహువః, తన కుమారుని ద్వారా కూడా మాట్లాడెను (హెబ్రీ. 1: 1, 2). మోషే లాంటి ప్రవక్త అయిన యహూషువః మాటలు విననివాడు “ సర్వనాశనమగునని ప్రవక్తగా మోషేయు మరియు గ్రహింపు ద్వారా పేతురును చెప్పారు” (ద్వితీ. 18:18, 19; అపొస్తలుల కార్యములు 3:22, 23). మరోవైపు, ఆయన మాటలను నమ్ముట “నిత్యజీవము” (రాబోయే యుగంలో జీవితం) లేదా పరలోకానికి నిశ్చయమైన అవకాశాన్ని కలిగి ఉండటం, ఎందుకంటే ఆయన మాటలు శక్తివంతమైనవి మరియు ప్రాణాధారమైనవి (యోహాను 5:24; 6:47, 63, 68; 1 తిమో. 6: 3, 4; 2 తిమో. 1:10; హెబ్రీ. 2: 3; రోమా. 1:16). యహూషువః మాటలను వినుట మాత్రమే కాదు, విధేయతతో వాటిని “గైకొనాలి” మరియు కొనసాగించాలి (యోహాను 8: 30-32, 51; 14:23; లూకా 6: 46-49; మార్కు 16:15, 16).

సువార్తను నమ్ముట రక్షింపబడుటకు; సువార్తను నమ్ముట శిక్షింపబడుటకు కాదు. కుమారుడిని నమ్ముట నిత్యజీవము పొందుట కొరకు; కుమారుడిని నమ్మకపోవుట నిత్యజీవము పొందుటకు కాదు, కానీ యహువః ఉగ్రతకు లోనగుటకు.

అప్పుడు యహూషువః బోధించిన సందేశం ఏమిటి? లేఖనాలను సాక్ష్యమీయనివ్వండి: “... తరువాత యహూషువః

కాలము సంపూర్ణమైయున్నది, ఎలోహీం రాజ్యము సమీపించియున్నది; మారుమనస్సు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు ఎలోహీం సువార్త ప్రకటించుచు, గలిలయకు వచ్చెను.” (మార్కు 1:14, 15). “యహూషువః వారి సమాజమందిరములలో బోధించుచు, (ఎలోహీం) రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటించుచు, ప్రజలలోని ప్రతి వ్యాధిని, రోగమును స్వస్థపరచుచు గలిలయయందంతట సంచరించెను.” (మత్త. 4:23). "వెంటనే ఆయన ఎలోహీం రాజ్యసువార్తను తెలుపుచు, ప్రకటించుచు, ప్రతి పట్టణములోను ప్రతి గ్రామములోను సంచారము చేయుచుండగా" (లూకా 8: 1). "ఆయన పరమునకు చేర్చుకొనబడిన దినమువరకు ఆయన చేయుటకును బోధించుటకును ఆరంభించిన వాటినన్నిటినిగూర్చి నా మొదటి గ్రంథమును రచించితిని" అని లూకా తన తరువాతి రచనలో పేర్కొన్నాడు (అపొస్తలుల కార్యములు 1: 1). అప్పుడు యహూషువః అపొస్తలులకు కనిపించెనని చెప్పాడు. "ఆయన శ్రమపడిన తరువాత నలువది దినములవరకు వారి కగపడుచు, ఎలోహీం రాజ్యవిషయములనుగూర్చి బోధించుచు, అనేక ప్రమాణములను (లేక, రుజువులను) చూపి వారికి తన్నుతాను సజీవునిగా కనుపరచుకొనెను. " (అపొస్తలుల కార్యములు 1: 3). యహూషువః తన పరిచర్య అంతటా “యహువః రాజ్య సువార్తను” బోధించాడు.

ఈ విషయాలను గూర్చి ఉపమానం ద్వారా (ఆయన తరచూ చేసినట్లుగా) యహూషువః మాట్లాడినప్పుడు, విత్తనాలను విత్తుటకు బయలు వెళ్ళినవాని గూర్చి వివరించెను. విత్తనం వివిధ రకాల నేలలపై పడి తదనుగుణంగా ఉత్పత్తిని ఇస్తుంది: కొన్ని పక్షులచే నాశనం చేయబడ్డాయి; కొన్ని రాతి మట్టిలో కొద్దికాలం మాత్రమే వృద్ధి చెందాయి; కొన్ని ముళ్ళతో అణచివేయబడ్డాయి; కొన్ని వేర్వేరు మొత్తాలలో ఫలించాయి. మత్తయి 13: 3- 23 మరియు లూకా 8: 1-15 లోని వృత్తాంతాలను పోల్చడం ద్వారా మనం ఈ క్రింది వాటిని గమనిస్తాము: ఈ విత్తనం “యహువః వాక్యం” లేదా “రాజ్య వాక్యం” ను సూచిస్తుంది. నేల మానవ హృదయాలను సూచిస్తుంది. పక్షులు దుష్టుని సూచిస్తాయి, వాడు "వీరి హృదయాలలో విత్తబడిన వాక్యాన్ని నమ్మకుండా మరియు రక్షింపబడకుండా నిరోధించుటకు" నిశ్చయించుకున్నాడు. రాతి నేలలో విత్తబడిన విత్తనం అది నిలిచియండుటకు తగినంత వేరును వృద్ధిచేసుకోలేదు. నిస్సారమైన విశ్వాసానికి శ్రమల కాలాన్ని లేదా హింసను భరించే బలం ఉండదు కనుక అది పడిపోతుంది. లేత మొక్కలను అణచివేయు ముళ్ళపొదలు ఈ జీవితంలో గల కోరికలను మరియు ఆనందాలను మరియు ధన మోసాన్ని సూచిస్తాయి, ఇవి విశ్వాసాన్ని నాశనం చేస్తాయి. మంచి నేలను పడిన వివిధ విత్తనాల యొక్క వివిధ స్థాయిల ఫలాలు “నిజాయితీగల మరియు మంచి హృదయంలో” జరిగే వాటిని సూచిస్తాయి - రాజ్య వాక్యాన్ని వినడం, దానిని అర్థం చేసుకోవడం, దానిని గైకొనటం మరియు విశ్వాసం యొక్క కొలత ప్రకారం శాశ్వతమైన ఫలాలను ఉత్పత్తి చేయడం. ఈ “రాజ్య వాక్యం” మరేదో కాదు “రాజ్య సువార్త.” రాజ్య సువార్తను విశ్వసించుట క్రైస్తవ జీవనానికి (రోమా. 14:17) మరియు పరలోకానికి దారితీస్తుంది. యహువః/రాజ్య వాక్యాన్ని వినుట మరియు నమ్ముట రక్షింపబడుటతో సమానమని లూకా చెప్పెను. రాబోయే యుగంలో, యహువః రాజ్యంలో రక్షణను పూర్తిగా పొందుకోవాలి. (మార్కు 10:30; అపొస్తలుల కార్యములు 3: 19-21). మత్తయి 19: 13-30 లో ఉపయోగించిన పదాలను విశ్లేషించడం ద్వారా ఈ విషయం ధృవీకరించబడుతుంది. ఈ వాక్య భాగంలో “నిత్యజీవము” (వ‌. 16), “జీవము” (వ.17) లోకి ప్రవేశించడం, “పరలోక రాజ్యము/యహువః రాజ్యము” (వ. 23, 24) లోకి ప్రవేశించడం, “రక్షణ‌ పొందుట” (V. 25), మరియు“ నిత్యజీవము” (వ. 29) ఇవన్నియు సమాన అర్థాలు గలవి.

తనకు పుట్టబోయే బిడ్డ సర్వోన్నతుని శక్తి యొక్క కార్యం ద్వారా ఉద్భవించుననియు, కావున అతడు యహువః కుమారుడని పిలువబడుననియు‌ మరియకు తెలియజేయబడెను.

యహూషువః బోధించిన అదే సువార్తను లోకమందంతట బోధించుటకు ఆయన తన శిష్యులను నియమించాడు (మార్కు 16:15, 16; మత్త. 28:19, 20). "మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్ష్యార్థమై లోకమందంతటను ప్రకటింపబడును; అటుతరువాత అంతము వచ్చును. (మత్త. 24:14). కాబట్టి సువార్త తప్పనిసరిగా ప్రతిచోటా వ్యాప్తి చెందాలి. (రోమా. 10: 8-18; కొలొ. 1: 5, 6, 23). మరియు ఇది “యుగసమాప్తి” వరకు కొనసాగాలి (మత్త. 28:20).

యహూషువః జన్మించిన సమయంలో, మరియ యోసేపులకు దేవదూత చెప్పిన విషయాలను గమనించండి. మరియ గర్భము ధరించునది పరిశుద్ధాత్మవలన కలిగినది అని యోసేపునకు తెలియజేయబడెను. "ఆమె యొక కుమారుని కనును; తన ప్రజలను వారి పాపములనుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యహూషువః (యహూషువః అను శబ్దమునకు రక్షకుడని అర్థము.) అను పేరు పెట్టుదువనెను. ”(మత్త. 1: 18-21). తనకు పుట్టబోయే బిడ్డ సర్వోన్నతుని శక్తి యొక్క కార్యం ద్వారా ఉద్భవించుననియు, కావున అతడు యహువః కుమారుడని పిలువబడుననియు‌ మరియకు తెలియజేయబడెను. “ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యహూషువః అను పేరు పెట్టుదువు; ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడనబడును; అదోనాయ్ అయిన ఎలోహీం ఆయన తండ్రియైన దావీదు సింహాసనమును ఆయన కిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును; ఆయన రాజ్యము అంతములేనిదై యుండునని ఆమెతో చెప్పెను. పరిశుద్ధాత్మ నీమీదికి వచ్చును; సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై ఎలోహీమ్ కుమారుడనబడును. ”(లూకా 1: 31-35).

ఈ విధంగా వారు అతని మొదటి రాకడ మరియు రెండవ రాకడ రెండింటిని గూర్చి నేర్చుకున్నారు. బెత్లెహేముకి బయట ఉన్న గొర్రెల కాపరులకు దేవదూతలు ప్రకటించిన వర్తమానంలో మనం చూసినట్లుగా, ఈ సువార్త విషయాలు ఉన్నాయి: “భయపడకుడి; ఇదిగో ప్రజలందరికిని కలుగబోవు మహాసంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను; దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి యున్నాడు, ఈయన ప్రభువైన మెస్సీయ ”(లూకా 2:10, 11). లేదా పేతురు ప్రకటించినట్లుగా, ఇశ్రాయేలునకు మారుమనస్సును పాపక్షమాపణను దయచేయుటకై ఎలోహీం ఆయనను అధిపతినిగాను రక్షకునిగాను తన దక్షిణహస్తబలముచేత (కుడిచేయి) హెచ్చించియున్నాడు.” (అపొస్తలుల కార్యములు 5: 31).

అపోస్తలుల సందేశం యొక్క సారాంశాన్ని "యహువః రాజ్యానికి మరియు యహూషువః క్రీస్తుకి సంబంధించిన విషయాలు" గా క్రొత్త నిబంధన పేర్కొనెను. ఫిలిప్పు సమరయలోకి వెళ్లి “వారికి క్రీస్తును బోధించినప్పుడు” వారు వినిన మరియు నమ్మిన విషయాలు ఈ విధంగా ఉన్నాయి: “అయితే ఫిలిప్పు ఎలోహీం రాజ్యమును గూర్చియు యహూషువః క్రీస్తు నామమును గూర్చియు సువార్త ప్రకటించుచుండగా వారతని నమ్మి, పురుషులును స్త్రీలును బాప్తిస్మము పొందిరి. ”(అపొస్తలుల కార్యములు 8: 5, 12).

దావీదు సంబంధించిన ఒడంబడిక వాగ్దానాలు మెస్సీయ జననం మరియు పునరుత్థానాలను మాత్రమే కాక, పునరుద్ధరించబడిన దావీదు రాజ్యంలో దావీదు సింహాసనం నుండి ఆయన పాలనను కూడా తెలియజేస్తుండెను.

పౌలు ఇలా అన్నాడు, "యహువః యహూషువఃను లేపి, పితరులకు చేసిన వాగ్దానమును మన పిల్లలకు నెరవేర్చియున్నాడని మేమును మీకు సువార్త ప్రకటించుచున్నాము." (అపొస్తలుల కార్యములు 13:32). ఇది అబ్రాహాము యొక్క ఆశీర్వాదాన్ని గూర్చి అపొస్తలుల కార్యములు 3:25, 26 లో పేతురు చెప్పినదానితో సమానంగా ఉంటుంది, ఇందులో యహూషువః పునరుత్థానం (అపొస్తలుల కార్యములు 13:34) మరియు ఆయనలో గల క్షమాపణ కూడా ఉంటుంది. (గలతీయులకు. 8: 6-9,13,14, 26 -29; రోమా. 4: 3-8,13-16). సందర్భానుసారం, అంతియొకయలో జరిగిన సంభాషణలో (అపొస్తలుల కార్యములు 13) ఇశ్రాయేలు యొక్క దావీదు వంశానికి చెందిన రక్షకుని కోసం చెప్పబడెను. (22, 23; 2 తిమో. 2: 8; లూకా 1: 68- 75). దావీదు సంబంధించిన ఒడంబడిక వాగ్దానాలు మెస్సీయ జననం మరియు పునరుత్థానాలను మాత్రమే కాక, పునరుద్ధరించబడిన దావీదు రాజ్యంలో దావీదు సింహాసనం నుండి ఆయన పాలనను కూడా తెలియజేస్తుండెను. (యెషయా. 55:3; 2వ సమూయేలు. 7: 12-16; కీర్తనలు. 89: 19- 37; 16: 8-11; అపొస్తలుల కార్యములు 2: 22-36; 5:30, 31; 13: 34-37; లూకా 1: 30-33; 2:10,11). పౌలు తన సందేశాన్ని పితరుల యొక్క వాగ్దానాలతో మరియు ఇశ్రాయేలు యొక్క ఆశతో అనుసంధానిస్తాడు (అపొస్తలుల కార్యములు 26:6,7; గలతీయులు. 3: 6-9,13,14, 26-29; రోమా.15: 8). యెషయా వెల్లడించిన “ఇశ్రాయేలు ఆశ” కి ఆధారం అయిన “శుభవార్త” లో, మెస్సీయ ద్వారా యహువః పాలన (52: 7; 40: 9, 10) మరియు శ్రమల నుండి యహువః రక్షణ రెండూ ఉన్నాయి. (53: 1-12). ఇశ్రాయేలు యొక్క ఆశే క్రీస్తు యహూషువః నందు విశ్వాసం ద్వారా అందరి యొక్క ఆశ (ఎఫెసీయులకు. 2:11-3: 6).

పౌలు ఎఫెసీయులకు వ్రాస్తూ “యహువః యెదుట పశ్చాత్తాపం, మన ప్రభువైన యహూషువః క్రీస్తుపై విశ్వాసం” గురించి సాక్ష్యమిచ్చాడు. ఇది “యహువః కృపా సువార్త” మరియు “యహువః రాజ్యాన్ని ప్రకటించట” కు సాక్ష్యం. ఈ విషయాలు “యహువః ఆలోచనంతటికీ” సమానం. (అపొస్తలుల కార్యములు 20: 20- 27). మోక్షాన్ని దయచేసే యహువః కృప ఆయన కుమారుని యొక్క బహుమానంలో కనబడుతుంది. (ఎఫెసీయులకు 1: 7; 2: 4-8, 13-16; తీతు 2:11; యోహాను 3:15, 16) మరియు రాబోయే యుగాలలో దీని యొక్క “గొప్పతనాలలో” ఇంకా ఎక్కువ చూడవచ్చు. (ఎఫెసీయులకు 2: 7; 1:10; 1 పేతురు 1:13).

కొరింథీయులకు వ్రాస్తూ, “మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరచుచున్నాను. మీరు దానిని అంగీకరించితిరి, దానియందే నిలిచియున్నారు. మీ విశ్వాసము వ్యర్థమైతేనే గాని, నేను ఏ ఉపదేశ రూపముగా సువార్త మీకు ప్రకటించితినో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకొనియున్న యెడల ఆ సువార్తవలననే మీరు రక్షణపొందువారై యుందురు. నాకియ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించితిని. అదేమనగా, లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతిపొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము మూడవ దినమున లేపబడెను.” (1 కొరింథీయులకు 15: 1-4). క్రీస్తు యొక్క పునరుత్థానం మరియు ఆయన వచ్చినప్పుడు అక్కడ ఉన్నవారి యొక్క రుజువును మరియు అవసరతను వివరించుట ద్వారా పౌలు ముందుకు సాగుతాడు (5-23). తన ఆలోచనకు ఎటువంటి విరామం ఇవ్వకుండా, తాను క్రీస్తు పాలన కోసం మరియు యహువః రాజ్యం చివరిగా తండ్రికి అప్పగించబడుట కోసం మాట్లాడుతాడు, అప్పుడు “యహువః సర్వములో సర్వమగును” (24-28). కావున ఇక్కడ పౌలు యొక్క సువార్తలో యహూషువః మొదటి రాకడలో మరియు సిలువలో సాధించిన విజయాలు మరియు ఆయన రెండవ రాకడ మరియు రాజ్యంలో సాధించబోవు విజయాలు ఉన్నాయి. “క్రీస్తు శ్రమలు మరియు తరువాత ఆయన పొందే మహిమ గురించి ప్రవక్తలు ప్రవచించి ముందుగా సాక్ష్యమిచ్చినప్పుడు” వ్రాసినది ఈ రక్షణ కోసమే (1 పేతు. 1: 9-11).

పువ్వులు పట్టుకున్న స్త్రీ

పౌలు తన పరిచర్య చివరిలో, రోమాలో గృహ నిర్బంధంలో ఉన్నాడు. అతడు తన బసలో చాలామందికి సువార్తను ప్రకటించాడు. అతడు "ఎలోహీం రాజ్యమునుగూర్చి పూర్తిగా సాక్ష్యమిచ్చుచు, మోషే ధర్మశాస్త్రములో నుండియు ప్రవక్తలలోనుండియు సంగతులెత్తి యహూషువఃను గూర్చి వివరముగా బోధించుచు వారిని ఒప్పించుచుండెను. అతడు చెప్పిన సంగతులు కొందరు నమ్మిరి, కొందరు నమ్మకపోయిరి.” (అపొస్తలుల కార్యములు 28:23, 24). 28 వ వచనంలో, తన మాటలను సాధారణ యూదులు తిరస్కరించుటను గూర్చి ప్రస్తావించిన తరువాత, “కాబట్టి ఎలోహీమ్ వలననైన యీ రక్షణ అన్యజనుల యొద్దకు పంపబడి యున్నదని మీరు తెలిసికొందురు గాక, వారు దాని విందురు అని చెప్పెను. (అపొస్తలుల కార్యములు 28:28; మత్త. వ. 21:43). ఆ విధంగా అతడు యహూషువః మరియు యహువః రాజ్య విషయాలను రక్షణ సందేశంతో సమానం చేశాడు. అప్పుడు మనకు ఇలా చెప్పబడింది, “పౌలు రెండు సంవత్సరములు పూర్తిగా తన అద్దె యింట కాపురముండి, తనయొద్దకు వచ్చువారినందరిని సన్మానించి ఏ ఆటంకమును లేక పూర్ణ ధైర్యముతో ఎలోహీం రాజ్యమునుగూర్చి ప్రకటించుచు, ప్రభువైన యహూషువః క్రీస్తును గూర్చిన సంగతులు బోధించుచు ఉండెను.” (వ.30,31).

హెబ్రీయులు 9: 24-28 ఇలా చెప్పుచుండెను: యహూషువః తన్ను తానే బలిగా అర్పించుకొనుట ద్వారా పాపాన్ని దూరం చేయునట్లు ప్రత్యక్షమాయెను; ఆయన ఇప్పుడు యహువః సమక్షంలో మరొకసారి కనిపిస్తాడు; రక్షణను పూర్తి చేస్తూ భూమిపై రెండవసారి త్వరలో ప్రత్యక్షమవుతాడు.

హెబ్రీయులు 9: 24-28 ఇలా చెప్పుచుండెను: యహూషువః తన్ను తానే బలిగా అర్పించుకొనుట ద్వారా పాపాన్ని దూరం చేయునట్లు ప్రత్యక్షమాయెను (వ. 26); ఆయన ఇప్పుడు యహువః సమక్షంలో మన కొరకు కనిపిస్తాడు (వ. 24); మరియు రక్షణను పూర్తి చేస్తూ భూమిపై రెండవసారి త్వరలో ప్రత్యక్షమవును. (v. 28). ఈ విధంగా సువార్త సందేశంలో మనకు మొదటి రాకడ మరియు రెండవ రాకడ ఉంది; బాధ మరియు కీర్తి; పేరు మరియు రాజ్యం; సిలువ మరియు కిరీటం.

దేవదూతలు మరియు యహూషువః మరియు అపొస్తలులు ఒకే సువార్త సందేశాన్ని ఇచ్చారు, దీనియందు నమ్మిక ఉంచి దీనిలో కొనసాగువారందరికీ ఇది రక్షణ కొరకు విశ్వాసాన్ని అందిస్తుంది. సువార్త ఒక్కటే (గల. 1: 6-9) మరియు రక్షణకు నడిపించే విశ్వాసం ఒక్కటే మరియు నిరీక్షణ ఒక్కటే (ఎఫె. 4: 4, 5; యూదా 3). నేడు సంఘం ఇదే పూర్తి సువార్త సందేశాన్ని ఇవ్వాలి. నేడు విశ్వాసి ఇదే రాజ్య సువార్తను నమ్మాలి.

మేము ఈ విధంగా ముగించెదము: “నిరీక్షణ అనేది సువార్తలోని నెరవేరని వాగ్దానాలపై విశ్వాసం ద్వారా ఏర్పడిన ప్రభావం. అందువల్ల, ఒకే నిరీక్షణను కలిగి ఉండటానికి ఒకే విశ్వాసం మాత్రమే ఉండాలి: మరియు ఒకే విశ్వాసాన్ని కలిగి ఉండటానికి, ఒకే సువార్త మాత్రమే ఉండాలి … ఒకే ఒక్క నిరీక్షణ మాత్రమే ఉన్నదని బైబిల్ గ్రంధం బోధిస్తుంది; తత్ఫలితంగా ఈ ఒక్క నిరీక్షణను ఉత్పత్తి చేయడానికి ఒకే విశ్వాసం మరియు ఒకే సువార్త ఉంటుంది” — J.M. స్టీఫెన్సన్. ది హెరాల్డ్ ఆఫ్ మెస్సీయాస్ రెయిన్ రచనలో.

సముద్రం వద్ద మనిషి


ఇది ఆర్లెన్ ఎఫ్. రాంకిన్ రాసిన WLC యేతర వ్యాసం. (ఫోకస్ ఆన్ ది కింగ్డమ్, వాల్యూమ్ 8, నం 6, మార్చి, 2006)

మేము అసలు వ్యాసం నుండి సమస్త అన్య నామములను మరియు తండ్రి - కుమారుడు అనే శీర్షికలను తొలగించి, వాటి స్థానాన్ని అసలు నామములతో భర్తీ చేసాము. ఇంకా, ఇక్కడ ఇవ్వబడిన లేఖనాలలో తండ్రి మరియు కుమారుని నామములను బైబిల్ యొక్క మొదటి ప్రేరేపిత రచయితలచే వ్రాయబడిన విధంగా మేము పునరుద్ధరించాము. -WLC బృందం.