Print

యహువః ద్వారా పుట్టిన

ఇది WLC యేతర వ్యాసం. బయటి రచయితల వనరులను ఉపయోగించినప్పుడు, బైబిలుకు మరియు డబ్ల్యుఎల్‌సి ప్రస్తుత నమ్మకాలకు 100% అనుగుణంగా ఉండెనని భావించిన వాటిని మాత్రమే మేము ప్రచురిస్తాము. కాబట్టి అలాంటి వ్యాసాలను డబ్ల్యుఎల్‌సి నుండి నేరుగా వచ్చినట్లుగా పరిగణించవచ్చు. యహువః యొక్క అనేక మంది సేవకుల పరిచర్య ద్వారా మేము ఎంతగానో ఆశీర్వదించబడ్డాము. అయితే ఈ రచయితల యొక్క ఇతర రచనలను అన్వేషించమని మేము మా సభ్యులకు సలహా ఇవ్వము. అటువంటి రచనలు, లోపాలను కలిగి ఉన్నందున మేము వాటిని ప్రచురణల నుండి మినహాయించాము. విచారకరంగా, లోపం లేని మంత్రిత్వ శాఖను మనం ఇంకనూ కనుగొనలేదు. డబ్ల్యుఎల్‌సి వి కాని కొన్ని ప్రచురించబడిన వ్యాసాలు / ఎపిసోడ్లు చూసి మీరు దిగ్బ్రాంతి చెందినచో, సామెతలు 4:18 జ్ఞాపకం చేసుకోండి. మన మార్గంలో మరింత కాంతి వెలువడు కొద్దీ ఆయన సత్యాన్ని గూర్చిన మన అవగాహన అభివృద్ధి చెందుతూ ఉంటుంది. మేము సత్యాన్ని ప్రాణం కంటే ఎక్కువగా ఆదరిస్తాము మరియు అది దొరికిన చోటు ఏదైనా అక్కడ వెతుకుతాము.

యహువః ద్వారా పుట్టిన

విశ్వాసపాత్రులైన బైబిలు పాఠకుల యొక్క ఆనందానికి గొప్ప మూలం ఏమిటంటే, యహూషువః మరియు క్రైస్తవులు యహువః ద్వారా పుట్టారనే సత్యంతో అన్యోన్య సంబంధాన్ని కలిగి ఉండటం. క్రైస్తవులు పాపభరితమైన జీవనశైలిని వెంబడించకుండా ఒక ఆచరణాత్మక మార్గంలో‌ ఉండాలనే వారి నిబద్ధతలో శక్తివంతంగా సహాయం చేయబడ్డారు. మానవ మధ్యవర్తి అయిన యహూషువః ద్వారా వారు అద్భుతంగా పర్యవేక్షించబడ్డారు మరియు చెడు నుండి రక్షింపబడ్డారు. యహూషువః స్వయంగా యహువః ద్వారా విశిష్టమైన రీతిలో అద్భుతంగా ఉనికిలోకి తీసుకురాబడ్డాడు. ఇవన్నీ ఎంతటి విశ్వాసాన్ని ప్రేరేపించాలి! “యహువః మూలముగా పుట్టియున్నవాడెవడును పాపము చేయడని యెరుగుదుము. యహువః మూలముగా పుట్టినవాడు తన్ను భద్రము చేసికొనును గనుక దుష్టుడు వాని ముట్టడు.” (1 యోహాను 5:18). ఈ వచనంలో క్రైస్తవులకు సూచనగా ఉపయోగించిన "మూలంగా పుట్టిన" అనే పదం మొదటిగా గ్రీకులో Perfect tense/పరిపూర్ణ కాలంలో ఉపయోగించబడి, ముందు నుండి ఉనికిలో ఉన్న నిరంతర స్థితిని సూచిస్తుంది. ఈ పదాన్ని అక్షరాలా అనేక విధాలుగా అనువదించవచ్చు: “మూలంగా పుట్టిన, పుట్టుట, ఉత్పత్తియగుట, ఉద్భవించుట లేదా ఉనికిలోకి వచ్చుట.” "తండ్రి" అనే పదం యొక్క ఈ ఉపయోగం యహువఃతో క్రైస్తవులకు కొనసాగుతున్న సంబంధాన్ని వివరిస్తుంది. "తిరిగి జన్మించిన" అనే పదజాలం యొక్క బైబిల్ ఉపయోగాలను వీక్షించినప్పుడు, అటువంటి పరిభాషలు ఆత్మీయ భావంలో ప్రేమతో "జన్మింపజేసిన" తండ్రి పట్ల క్రైస్తవుల నిరంతర ప్రతిస్పందనను సూచిస్తున్నట్లు స్పష్టమవుతుంది.

1 యోహాను 5:18 నుండి పై ఉల్లేఖనంలో, యహూషువఃకు విషయంలో "మూలంగా పుట్టిన" అని అనువదించబడిన పదం, అయోరిస్ట్ కాలంలోని గ్రీకు క్రియ, ఇది ఒకప్పటి/గత సంఘటనను సూచిస్తుంది. ఇది గాబ్రియేలు కన్య మరియకు ప్రకటించినట్లుగా, పరిశుద్ధాత్మ ఆమెపైకి వచ్చినప్పుడు (మహోన్నతుని శక్తి ఆమెను కమ్మినప్పుడు) మరియలో సృష్టించబడిన యాహువః యొక్క అక్షరార్థమైన, సృజనాత్మక అద్భుతాన్ని స్పష్టంగా సూచిస్తుంది. "సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై యహువః కుమారుడనబడును." (లూకా 1:35). యహూషువః అక్షరాలా తన మూలాన్ని కలిగి ఉన్నాడు మరియు మరియలో తాను గర్భం ధరింపబడినప్పుడు ఈ అద్భుతమైన రీతిలో యహువః ద్వారా తండ్రిని పొందాడు.

యహువః యొక్క పిల్లలుగా, యహువః వారసులుగా మరియు మెస్సీయతో సహ వారసులుగా మనకు కృపతో క్రైస్తవ గుర్తింపును అందించడం అనేది మొత్తం కొత్త నిబంధన అంతటా అందంగా వివరించబడిన ప్రధాన అంశం. యహూషువఃతో సమానంగా మనము కూడా గుర్తింపబడియున్న దృష్ట్యా, అలా విశిష్టమైన రీతిలో తండ్రిని పొందిన వ్యక్తిగా ఆయన తన సోదరులు మరియు సోదరీమణుల పెద్ద కుటుంబంలో "మొదటి జన్మించిన" వ్యక్తిగా ఉన్నాడు. యహూషువః, మన బలహీనతలను (తీవ్రంగా శోధించబడిన మరియు విపరీతమైన బాధలను అనుభవించిన) లోతుగా అనుభవించగల రక్తమాంసములను కలిగియున్న మానవునిగా మన వలె రూపింపబడ్డాడు, అలా మనల్ని తన సోదరులు మరియు సోదరీమణులు అని పిలవడానికి సిగ్గుపడడు! మనపట్ల చూపబడే అపారమైన కరుణ విషయంలో అలాంటి అద్భుతమైన సత్యాలు మనల్ని విస్మయానికి గురిచేస్తాయి! మనకు సహాయం అవసరమైనప్పుడు ధైర్యంగా కృపతో కూడిన సింహాసనాన్ని చేరుకోవడానికి మనము ఎల్లప్పుడూ స్వాగతించబడతాము!

మంచి నేల

"కాబట్టి చిన్న పిల్లలారా, ఆయన ప్రత్యక్షమగునప్పుడు ఆయన రాకడయందు మనము ఆయన యెదుట సిగ్గుపడక ధైర్యము కలిగియుండునట్లు మీరాయన యందు నిలిచియుండుడి, ఆయన నీతిమంతుడని మీరెరిగియున్న యెడల నీతిని జరిగించు ప్రతివాడును ఆయన మూలముగా పుట్టియున్నాడని యెరుగుదురుము. మనము యహువః పిల్లలమని పిలువబడునట్లు తండ్రి మనకెట్టి ప్రేమ ననుగ్రహించెనో చూడుడి; మనము దేవుని పిల్లలమే." (1 యోహాను 2:28-3:1).

మత్తయి 13:18-23లోని విత్తువాని ఉపమానం యొక్క వివరణ ప్రకారం, మన “కొత్త జననం” ఒక విత్తబడిన విత్తనం వలె యహువః రాజ్య సువార్తకు మన స్వచ్ఛంద‌ పశ్చాత్తాపంతో ప్రారంభమవుతుంది. మనం “మంచి నేల” గా అవ్వాలంటే మనం “విత్తనాన్ని” (వాక్య సందేశాన్ని) వినాలి మరియు అర్థం చేసుకోవాలి మరియు “ఫలాలు ఇచ్చే” వరకు ఆ సందేశంలో కొనసాగాలి. అదేవిధంగా పైన 1 యోహాను 2:28-29లో చూసినట్లుగా మనము "ఆయనలో నిలిచియుండాలి," "సరైనది చేయాలి." "యహువః ద్వారా పుట్టిన" విషయానికి సంబంధించి విశ్వాసులకు ఇవ్వబడిన అన్ని కొత్త నిబంధన ప్రస్తావనలు వాటి సందర్భాలలో వాక్య సందేశం యొక్క వివరాల ప్రకారం కొనసాగుతున్న మన విధేయతతో సమ్మిళితం చేయబడునట్టి ఉదారమైన, ప్రేమపూర్వక దయ యొక్క సాధారణ అవగాహనను కలిగి ఉంటాయి.

విత్తనాలను విత్తుట

విధేయత కలిగి ఉండుటకు చేసే ఆచరణాత్మక ప్రయత్నాలు పెరిగేకొద్దీ, లోపాల విషయంలో సర్వవ్యాప్త క్షమాపణ ఎల్లప్పుడూ గొప్పగా అందించబడుతుంది. పైగా, ఏవైనా అపార్థాలు లేదా బలహీనతలలో విషయంలో సుదూర సహాయం అనేది సంబంధిత అనేక లేఖనాలలో నిరంతరం సూచించబడినది లేదా పేర్కొనబడినది.

మునుపు పేర్కొన్న కొన్ని వచనాలతో పాటు, ఈ క్రింది వచనాలు, పాక్షిక ఉల్లేఖనాలు మరియు సూచనలు ఈ చక్కటి సమతుల్యమైన, లేఖనాధార ఇతివృత్తం యొక్క విస్తారమైన దృశ్యాన్ని క్లుప్తంగా వివరించాయి. యహువః ద్వారా పుట్టటం యొక్క శక్తిశీలతలు మన పిలుపుకు మరియు తన పిల్లలుగా మన బాధ్యతకు రెండింటికీ సమగ్రమైనవి.

ఉదాహరణకు, జనులు “అన్యాయంగా” ఉన్నప్పుడు కూడా యహువః చూపే పరిపూర్ణమైన మార్గాన్ని మనం అనుకరించాలి. ఈ విధంగా, మనం మన శత్రువులను ప్రేమించినప్పుడు మరియు మనలను హింసించే వారి కోసం ప్రార్థించినప్పుడు, మనం "పరలోకంలో ఉన్న మన తండ్రికి పిల్లలము" (మత్త. 5:43-48). యహువః యొక్క అచంచలమైన మంచితనాన్ని ప్రదర్శించే మరొక సందర్భంలో, యాకోబు పుస్తకం ఇలా వెల్లడిస్తుంది, "తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారము కనెను." "అందుచేత … లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి." (యాకోబు 1:18, 21). చెడు క్రియలు మరియు ఉద్దేశ్యాలకు (క్రియాశీల కోపం యొక్క మనస్తత్వంతో సహా) తప్పనిసరిగా దూరంగా ఉండాలని సందర్భం వివరిస్తుంది. విశ్వాసులు విత్తబడిన సందేశాన్ని వినువారు మాత్రమై ఉండి మర్చిపోయేవారిలా కాకుండా, దానిని ఆచరించుటలో జాగ్రత్త కలిగి ఉండాలని హెచ్చరించబడ్డారు.

కొత్త వృద్ధి

కొత్త జన్మను "విత్తన" సందేశంతో అనుసంధానం ‌చేయుట (యహూషువః పునరుత్థానం మరియు మన భవిష్యత్ నిరీక్షణ యొక్క వాస్తవికతతో పాటు) మొదటి పేతురులో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. “మన ప్రభువగు యహూషువః క్రీస్తు తండ్రియైన యహువః స్తుతింపబడునుగాక. మృతులలో నుండి యహూషువః క్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు.. స్వాస్థ్యము మనకు కలుగునట్లు, ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరల జన్మింపజేసెను. మీరు క్షయ బీజమునుండి కాక, శాశ్వతమగు జీవముగల యహువః వాక్యమూలముగా అక్షయ బీజమునుండి పుట్టింపబడినవారు." (మొదటి పేతురు 1:3,4,21). “కొత్త జననం” ను గూర్చిన ఈ రెండు వాక్యాల మొత్తం సందర్భం అవసరమైన, చురుకైన ప్రతిస్పందన యొక్క అనేక కోణాలను స్పష్టం చేస్తుంది. విశ్వాసులు సత్యానికి విధేయత చూపడం, ఒకరినొకరు తీవ్రంగా ప్రేమించడం మరియు చెడును దూరంగా ఉంచడం ద్వారా శుద్ధి చేయబడుతూ, వాక్యాన్ని ("నశించని" సందేశాన్ని) హృదయపూర్వకంగా కోరుకోవాలి. మెస్సీయ యొక్క విలువైన రక్తం (బంగారం మరియు వెండి వంటి "నాశనమయ్యే" వస్తువులులా కాదు) ద్వారా నెరవేర్చబడిన దాని వెలుగులో ఇవన్నీ ఆచరించబడతాయి.

“తన్ను ఎందరంగీకరించిరో వారికందరికి, అనగా తన నామమునందు విశ్వాసముంచినవారికి, యహువః పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. వారు యహువః వలన పుట్టినవారే గాని, రక్తమువలననైనను శరీరేచ్ఛవలననైనను మానుషేచ్ఛవలననైనను పుట్టినవారు కారు.” (యోహాను సువార్త 1:12- 13).

నికోదేము తప్పుగా అర్థం చేసుకున్నప్పటికీ, అతడితో యహూషువః యొక్క సంభాషణ (యోహాను మూడవ అధ్యాయంలో) పిల్లలను ఆత్మీయంగా జన్మింపజేయాలనే పరలోక తండ్రి సంకల్పాన్ని గూర్చిన సత్యాన్ని ఎత్తి చూపుతుంది, తద్వారా వారు రాబోయే యహువః రాజ్యంలోకి ప్రవేశించవచ్చు. “పైనుండి జన్మించిన” అనే ప్రత్యేకమైన పదం, వాక్యపు వెలుగులో, పశ్చాత్తాపపడే వారిని యహువః తిరిగి జన్మింపజేసే చర్యను సూచిస్తుంది.

అందుకు యహూషువః అతనితో: "ఒకడు క్రొత్తగా (లేక,పైనుండి) జన్మించితేనే కాని అతడు యహువః రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను."

అందుకు నీకొదేము "ముసలివాడైన మనుష్యుడేలాగు జన్మింపగలడు? రెండవమారు తల్లి గర్బమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయనను అడుగగా.."

"యహూషువః ఇట్లనెను; ఒకడు నీటిమూలము గాను ఆత్మమూలము గాను జన్మించితేనే గాని యహువః రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. శరీర మూలముగా జన్మించినది శరీరమును ఆత్మమూలముగా జన్మించినది ఆత్మయునైయున్నది. మీరు క్రొత్తగా జన్మింపవలెనని నేను నీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు." (యోహాను సువార్త 3:3-7).

యోహాను 3వ అధ్యాయంలో ఇదే సంభాషణ, యహువః ప్రేమ ద్వారా అందించబడిన యహూషువః యొక్క భవిష్యత్తు త్యాగంపై విశ్వాసం ఉంచుటలోని ఆవశ్యకతను నొక్కి చెబుతుంది. "యహువః లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయకుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను." (యోహాను 3:16). అలాగే, ఈ సంభాషణ చీకటిని ప్రేమింపక మరియు చీకటి క్రియలలో ఉండక మెస్సీయ యొక్క వెలుగుకు నిజంగా ప్రతిస్పందించుట యొక్క ప్రాముఖ్యతను సూచిస్తుంది.

మొలక

“యహువః మూలముగా పుట్టిన ప్రతివానిలో ఆయన బీజము నిలుచును గనుక వాడు పాపముచేయడు; వాడు యహువః మూలముగా పుట్టినవాడు గనుక పాపము చేయజాలడు.” (1 యోహాను 3:9).

“ప్రియులారా, మనము ఒకనినొకడు ప్రేమింతము; ఏలయనగా ప్రేమ యహువః మూలముగా కలుగుచున్నది; ప్రేమించు ప్రతివాడును యహువః మూలముగా పుట్టినవాడై దేవుని ఎరుగును.” (1 యోహాను 4:7).

“1 యహూషువఃయే క్రీస్తై యున్నాడని నమ్ము ప్రతివాడును యహువః మూలముగా పుట్టియున్నాడు. పుట్టించిన వానిని ప్రేమించు ప్రతివాడును ఆయన మూలముగా పుట్టిన వానిని ప్రేమించును. మనము యహువఃను ప్రేమించుచు ఆయన ఆజ్ఞలను నెరవేర్చువారమైతిమా యహువః పిల్లలను ప్రేమించుచున్నామని దానివలననే యెరుగుదుము. మనమాయన ఆజ్ఞలను గైకొనుటయే యహువఃను ప్రేమించుట; ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. యహువః మూలముగా పుట్టిన వారందరును లోకమును జయించుదురు; లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. యహూషువః యహువః కుమారుడని నమ్మువాడు తప్ప లోకమును జయించువాడు మరి ఎవడు?” (1 యోహాను 5:1-4).

“యహువః ద్వారా పుట్టిన,” “తిరిగి జన్మించిన,” లేదా “పై నుండి పుట్టిన” అనే మాటలు ఒక క్షణంలో కలిగే కొన్ని ఆలోచనలకు నిలకడలేని మానసిక ఒప్పందం కంటే చాలా ఎక్కువ ప్రతిస్పందనను కలిగి ఉంటాయి. అయినప్పటికీ, నిరీక్షణకు సంబంధించిన విశ్వాసం మరియు విజయ భావం (హెబ్రీ. 3:6, 14) పై అంతమువరకు దృఢంగా, నిబ్బరంగా నిలబడి ఉంటే, క్రైస్తవులు నిజంగా మెస్సీయ (యహువః ఇల్లుగా) జీవితాన్ని పంచుకుంటారు! కొత్త జన్మ యొక్క అపారమైన గొప్ప ఆశీర్వాదాలు అత్యంత నిజం!

ప్రస్తుత కాలంలో మరియు భవిష్యత్తులో "యహువః ద్వారా పుట్టుట" వలన కలిగే ప్రయోజనాలు ప్రతిస్పందించే వారికి విస్తారంగా కుమ్మరించబడతాయి. యహువః తన అద్వితీయ కుమారుని ద్వారా ప్రపంచాన్ని జయించడం అనేది మనం ఇప్పుడు విశ్వాసం ద్వారా ఆనందిస్తున్న వాస్తవికత. మనం రాబోయే యుగంలో చెరగని వారసత్వంలోకి ప్రవేశిస్తాము అని కూడా దీని అర్థం. ప్రేమపూర్వకమైన విధేయతతో కూడిన ప్రతిస్పందనలో నిలబడి ఉండుట తేలికగా చేయగలిగినది; ఇది భరించలేనంత చాలా బరువైనది కాదు! శాశ్వతమైన మన వారసత్వాన్ని కాపాడుటకు యహువః మరియు ఆయన కుమారుడు నిజమైన "భారీ బరువంతటిని ఎత్తడం" పూర్తి చేసియున్న నేపథ్యంలో మనం ఇప్పుడు మెస్సీయ యొక్క కాడిని "తేలికైన కాడిని" ఎత్తుకొనవచ్చును. తన ప్రియమైన పిల్లలను యహువః రాజ్యంలోనికి స్వాగతించడం పరలోక తండ్రి యొక్క దయగల ఆనందం!

స్తోత్రం


ఇది కెన్నెత్ లాప్రేడ్ రాసిన వ్యాసం. WLC కాని వ్యాసం కాదు.

మేము అసలు వ్యాసం నుండి సమస్త అన్య నామములను మరియు తండ్రి - కుమారుడు అనే శీర్షికలను తొలగించి, వాటి స్థానాన్ని అసలు నామములతో భర్తీ చేసాము. ఇంకా, ఇక్కడ ఇవ్వబడిన లేఖనాలలో తండ్రి మరియు కుమారుని నామములను బైబిల్ యొక్క మొదటి ప్రేరేపిత రచయితలచే వ్రాయబడిన విధంగా మేము పునరుద్ధరించాము. -డబ్ల్యుఎల్‌సి బృందం.