Print

రాజ్యం యొక్క సహ వారసులు

ఇది WLC యేతర వ్యాసం. బయటి రచయితల వనరులను ఉపయోగించినప్పుడు, బైబిలుకు మరియు డబ్ల్యుఎల్‌సి ప్రస్తుత నమ్మకాలకు 100% అనుగుణంగా ఉండెనని భావించిన వాటిని మాత్రమే మేము ప్రచురిస్తాము. కాబట్టి అలాంటి వ్యాసాలను డబ్ల్యుఎల్‌సి నుండి నేరుగా వచ్చినట్లుగా పరిగణించవచ్చు. యహువః యొక్క అనేక మంది సేవకుల పరిచర్య ద్వారా మేము ఎంతగానో ఆశీర్వదించబడ్డాము. అయితే ఈ రచయితల యొక్క ఇతర రచనలను అన్వేషించమని మేము మా సభ్యులకు సలహా ఇవ్వము. అటువంటి రచనలు, లోపాలను కలిగి ఉన్నందున మేము వాటిని ప్రచురణల నుండి మినహాయించాము. విచారకరంగా, లోపం లేని మంత్రిత్వ శాఖను మనం ఇంకనూ కనుగొనలేదు. డబ్ల్యుఎల్‌సి వి కాని కొన్ని ప్రచురించబడిన వ్యాసాలు / ఎపిసోడ్లు చూసి మీరు దిగ్బ్రాంతి చెందినచో, సామెతలు 4:18 జ్ఞాపకం చేసుకోండి. మన మార్గంలో మరింత కాంతి వెలువడు కొద్దీ ఆయన సత్యాన్ని గూర్చిన మన అవగాహన అభివృద్ధి చెందుతూ ఉంటుంది. మేము సత్యాన్ని ప్రాణం కంటే ఎక్కువగా ఆదరిస్తాము మరియు అది దొరికిన చోటు ఏదైనా అక్కడ వెతుకుతాము.

రాజ్యం యొక్క సహ వారసులు

9నేను ఎడ్విన్ లూట్జర్ యొక్క పుస్తకమైన, వన్ మినిట్ ఆఫ్టర్ యు డై ని మళ్ళీ తీసుకొని, అధ్యాయం 3: "ది ఆసెంట్ ఇన్ గ్లోరీ" ని చదవడం ప్రారంభించాను.

అతని మాటలు చాలా మధురంగా ​​ఉన్నా, అవి పికిల్ జ్యూస్ రుచి, వాసన కలిగి ఉన్నాయి. నా ఉద్దేశ్యం ఏమిటి?

లూట్జెర్ రచన, విచారకరంగా, తప్పు వివరణల కల్పన. అతని పుస్తక శీర్షిక, "వన్ మినిట్ ఆఫ్టర్ యు డై" మోసపూరితమైనదని లేఖనం వెంటనే బహిర్గతం చేసింది. ఒకటి మరియు రెండు అధ్యాయాలు తప్పుడు వ్యాఖ్యానం యొక్క విపత్తు, కానీ ఇప్పుడు మేము మూడవ అధ్యాయానికి వెళ్ళి మరియు ప్లేటో త్రయం నుండి నేరుగా చదువుతున్నట్లుగా మిస్టర్ లూట్జర్ తన కల్పనలను కొనసాగించడాన్ని మేము కనుగొన్నాము!

అధ్యాయం 3లోని కొన్ని ప్రకటనలను నేను తీసుకుంటాను. 55వ పేజీలో, అతను 1వ కొరింథీయులు 3: 21-23ని ఉటంకించాడు: "సమస్తమును మీవి, మరియు మీరు క్రీస్తు వారు; క్రీస్తు దేవునివాడు," మనకు మరణం అనేది యహువః యొక్క బహుమానంగా పేర్కొంటూ ఉటంకించాడు. అతడు చూడనిది త్రిత్వ వాదులకు (ఇతరుల మధ్య) ఒక అవరోధంగా ఉన్న సంబంధం. ఈ భాగము యహూషువః, క్రీస్తుపై యహువఃకు గల స్పష్టమైన అధీనతను వెల్లడిస్తుంది. త్రిత్వ సిద్ధాంతం యహూషువఃను యహువః అని ప్రతిపాదిస్తున్నందున, ఈ సందర్భంలో త్రిత్వ వాదులు యహువః యహువఃకు ఎలా అధీనంలో ఉండగలడో వివరించలేరు. "మీరు క్రీస్తు వారు; క్రీస్తు దేవునివాడు" అని ప్రకరణము ముగింసింది.

56వ పేజీలో, లూట్జర్ మళ్లీ పైకి వెళ్తూ, అన్యమతస్థులు క్రైస్తవులను యహువః సన్నిధికి చేర్చే మరణ బహుమతి నుండి విముక్తి చేయలేకపోయారని పేర్కొన్నాడు. మీరు మిస్టర్ E.R. లుట్జర్‌కు "మరణ" లేఖనాల యొక్క విస్తృతమైన జాబితాను మెయిల్ చేయాలనుకోవచ్చు. మరణ సమయంలో ఎవ్వరూ యహువః వద్దకు తీసుకెళ్లబడరు. యహూషువః క్రీస్తు రెండవ రాకడ మరియు పునరుత్థానం జరుగు వరకు అలా జరగదు. నేను పౌలు యొక్క సొంత మాటలను లూట్జర్‌కి గుర్తు చేస్తాను: "కాగా [పునరుత్థానం లేదా ఆయన రాకడలో యహూషువఃని కలుసుకోవడానికి చేరుకోవడం ద్వారా] మనము సదా కాలము యహుషువఃతో కూడ ఉందుము" (1 థెస్సలోనీ 4:13-17).

56వ పేజీ దిగువన, మన రచయిత ఈ ఆలోచనను అందిస్తున్నారు: “అలాగే, మన ఆత్మలు స్వర్గ ద్వారాల గుండా వెళుతున్నప్పుడు మన శరీరాలు విశ్రాంతి తీసుకునే మార్గమే మరణం.” ఎవరి ద్వారా వెళుతున్నాయి? నాకు బైబిల్ రెఫరెన్స్ ఇవ్వండి. మరణ సమయంలో "మన ఆత్మలు స్వర్గానికి వెళ్తాయా"? మానవుడు మరణించినప్పుడు, శరీరం మరియు ఆత్మ యొక్క కలయిక/రెండూ కలిసి చనిపోతాయి; శరీరం/ఆత్మ కలయిక మర్త్యమైనది. గ్రీకులు (ప్లేటో) శరీరం పనికిరాదని బోధించారు మరియు ఆత్మ శరీరాన్ని విడిచిపెట్టి, ఎప్పటికీ దాని సొంత జీవితాన్ని జీవించునట్లు మరణం ఆత్మను అనుమతిస్తుంది. గ్రీకు శిక్షణ పొందిన జ్ఞానవాద క్రైస్తవులు, బైబిల్ అనంతర కాలంలో, విడిపోయిన ఆత్మకు గమ్యస్థానాన్ని ఇవ్వాలని సిఫార్సు చేసారు: మంచివారు స్వర్గానికి (పైకి), మరియు చెడ్డవారు హేడిస్ యొక్క దౌర్భాగ్యమైన గదులకు లేదా తక్షణ నరక అగ్నికి వెళతారు. వాస్తవానికి, అయితే, 7వ బూర ధ్వని వద్ద యహూషువః తిరిగి వచ్చినప్పుడు జరిగే పునరుత్థానం వరకు మర్త్య శరీరం/ఆత్మ, (మొత్తం వ్యక్తి) విశ్రాంతి తీసుకొనును లేదా మరణంలో నిద్రించును (దానియేలు 12: 2) అని గ్రంథం చెబుతోంది (ప్రకటన 11:15-18). నేడు అధిక సంఖ్యలో క్రైస్తవులు, ప్రత్యేకించి క్యాథలిక్‌లు మరియు కాల్వినిస్ట్‌లచే సమర్థించబడుతున్న ఈ గ్రీకు తప్పుడు బోధన గత వెయ్యి సంవత్సరాలుగా "సనాతన ధర్మశాస్త్రం" గా మారిన తెలివిగా రూపొందించిన తప్పు.

తన పుస్తకంలోని ఇదే పేరాలో, లూట్జర్ మన “ఆత్మలు” స్వర్గానికి తీసుకెళ్లబడుటను సూచిస్తాడు. కానీ ఇది స్వర్గంలో స్పృహతో కూడిన తక్షణ జీవితం అని సులభంగా తప్పుగా అర్థం చేసుకోబడవచ్చు. మనిషి పుట్టినప్పుడు యహువః తన ఆత్మ యొక్క ప్రసరణమును శిశువులలో జీవాన్ని ఉత్పత్తి చేయడానికి పంపుతాడు. యహువః యొక్క ఆ ఆత్మ అతను/ఆమె చనిపోయే వరకు ఆ వ్యక్తిలో ఉంటుంది. ఆత్మకు రూపం లేదా గుర్తింపు లేదు, కానీ జీవితం, మన జీవిత చక్రం ముగిసినప్పుడు యహువః దానిని వెనక్కి తీసుకుంటాడు. ఇక్కడ రుజువు ఉంది: "నరుల ఆత్మ పరమున కెక్కిపోవునో లేదో, మృగముల ప్రాణము భూమికి దిగిపోవునో లేదో యెవరికి తెలియును?" (ప్రసంగి 3:21). "మమన్నయినది వెనుకటివలెనే మరల భూమికి చేరును, ఆత్మ దాని దయచేసిన యహువః యొద్దకు మరల పోవును." (ప్రసంగి 12:7). అదే సమయంలో "చనిపోయిన వారు ఏమియు ఎరుగరు ... పాతాళమునందు [స్మశానవాటిక, పాతాళం, హేడిస్] పనియైనను ఉపాయమైనను తెలివియైనను జ్ఞానమైనను లేదు" (ప్రసంగి 9:5, 10). మరణం నుండి బయటపడే ఏకైక మార్గం పునరుత్థానం (యోహాను 11: 11, 14)!


ఇది వేన్ స్టాల్స్‌మిత్ రాసిన వ్యాసం. WLC వ్యాసం కాదు.

మేము అసలు వ్యాసం నుండి సమస్త అన్య నామములను మరియు తండ్రి - కుమారుడు అనే శీర్షికలను తొలగించి, వాటి స్థానాన్ని అసలు నామములతో భర్తీ చేసాము. ఇంకా, ఇక్కడ ఇవ్వబడిన లేఖనాలలో తండ్రి మరియు కుమారుని నామములను బైబిల్ యొక్క మొదటి ప్రేరేపిత రచయితలచే వ్రాయబడిన విధంగా మేము పునరుద్ధరించాము. -డబ్ల్యుఎల్‌సి బృందం.