Print

కఠినమైన వాస్తవాలు

ఇది WLC యేతర వ్యాసం. బయటి రచయితల వనరులను ఉపయోగించినప్పుడు, బైబిలుకు మరియు డబ్ల్యుఎల్‌సి ప్రస్తుత నమ్మకాలకు 100% అనుగుణంగా ఉండెనని భావించిన వాటిని మాత్రమే మేము ప్రచురిస్తాము. కాబట్టి అలాంటి వ్యాసాలను డబ్ల్యుఎల్‌సి నుండి నేరుగా వచ్చినట్లుగా పరిగణించవచ్చు. యహువః యొక్క అనేక మంది సేవకుల పరిచర్య ద్వారా మేము ఎంతగానో ఆశీర్వదించబడ్డాము. అయితే ఈ రచయితల యొక్క ఇతర రచనలను అన్వేషించమని మేము మా సభ్యులకు సలహా ఇవ్వము. అటువంటి రచనలు, లోపాలను కలిగి ఉన్నందున మేము వాటిని ప్రచురణల నుండి మినహాయించాము. విచారకరంగా, లోపం లేని మంత్రిత్వ శాఖను మనం ఇంకనూ కనుగొనలేదు. డబ్ల్యుఎల్‌సి వి కాని కొన్ని ప్రచురించబడిన వ్యాసాలు / ఎపిసోడ్లు చూసి మీరు దిగ్బ్రాంతి చెందినచో, సామెతలు 4:18 జ్ఞాపకం చేసుకోండి. మన మార్గంలో మరింత కాంతి వెలువడు కొద్దీ ఆయన సత్యాన్ని గూర్చిన మన అవగాహన అభివృద్ధి చెందుతూ ఉంటుంది. మేము సత్యాన్ని ప్రాణం కంటే ఎక్కువగా ఆదరిస్తాము మరియు అది దొరికిన చోటు ఏదైనా అక్కడ వెతుకుతాము.

కఠినమైన వాస్తవాలు

"ఉన్నత విద్య వలన స్పష్టంగా-అర్ధంలేని వాటిని విశ్వసించే ప్రవృత్తి తగ్గుముఖం పట్టడానికి బదులు పెరుగుతుందని నొక్కిచెప్పడానికి కొంత ఋజువు ఉంది." 1

"మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున, ఆయన మిమ్మును పిలిచిన పిలుపువల్లనైన నిరీక్షణ యెట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యము యొక్క మహిమైశ్వర్యమెట్టిదో . . మన ప్రభువైన యహూషువః క్రీస్తు యొక్క దేవుడైన మహిమ స్వరూపియగు తండ్రి, తన్ను తెలిసికొనుటయందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయునుగల మనస్సు అనుగ్రహించునట్లు..." (ఎఫెసీ. 1:17-18).

దురదృష్టవశాత్తూ, కొంతమంది తమ తోటివారి అంగీకారాన్ని విడనాడడానికి ఇష్టపడి తమ సొంత మనస్సులలో తాము నిజమని అనుమానించిన దాని కోసం నిలబడతారు, కానీ వారు సమస్యాత్మకమైన మనస్సాక్షిని రక్షించడానికి అజ్ఞానాన్ని ఊహించుకుంటారు లేదా "మర్మమును" ఆలింగనం చేసుకుంటారు మరియు గుంపుతో ఏకీభవిస్తారు.

“యహువః సమయాన్ని వృధా చేయడం” గురించి ఎంతటి బూటకపు మాటలు లేదా ఊక దంపుడు పాండిత్యం చెప్పినా సంఘానికి వెళ్లేవారు నమ్మే కొన్ని విషయాలు నిజానికి అర్ధంలేనివి అనే వాస్తవాన్ని సహేతుకమైన మనస్సు నుండి దాయలేమని మేము దృఢమైన వ్యక్తిగత నిర్ధారణకు వచ్చాము. సనాతన ధర్మం యొక్క నీచమైన చరిత్ర వారు తెలుసునని చెప్పుకొనుచున్న మరియు బోధిస్తున్న వ్యక్తి నామమును గౌరవించదు. కాబట్టి, కలుషితమైన బావి నుండి మంచినీళ్ళు లేదా ముళ్ల పొదల నుండి ద్రాక్షపండ్లు తీసుకోలేరు అనే యహూషువః యొక్క పరీక్షను మాత్రమే ఎవరైనా వర్తింపజేయాలి. దురదృష్టవశాత్తూ, కొంతమంది తమ తోటివారి అంగీకారాన్ని విడనాడడానికి ఇష్టపడి తమ సొంత మనస్సులలో తాము నిజమని అనుమానించిన దాని కోసం నిలబడతారు, కానీ వారు సమస్యాత్మకమైన మనస్సాక్షిని రక్షించడానికి అజ్ఞానాన్ని ఊహించుకుంటారు లేదా "మర్మమును" ఆలింగనం చేసుకుంటారు మరియు గుంపుతో ఏకీభవిస్తారు. అప్పుడు సత్యం విఫలమవుతుంది!

జర్మన్ తత్వవేత్త ఆర్థర్ స్కోపెన్‌హౌర్ (1788-1860) సమర్థంగా వివరించినట్లుగా, క్రైస్తవులు జనాదరణ పొందిన అభిప్రాయానికి అనుగుణంగా వెళ్లడం చాలా సులభం: "సాధారణంగా అవలంబించబడుతున్న విశ్వాసం వద్దకు తీసుకురాబడిన వెంటనే మనుష్యులు ఆలింగనం చేసుకోనటువంటి అభిప్రాయం ఏదీ లేదు, అది అసంబద్ధమైనప్పటికీ కూడా."

సాధారణ జనులను “లోబడి” ఉండునట్లు చేయుటకు సనాతన ధర్మం ద్వారా ప్రకటించబడిన ఒక విధమైన సిద్ధాంతపు ఉదాహరణ ఇలా ఉంటుంది: “యహువః కుమారుడు మరణించాడు; ఇది అసంబద్ధం కాబట్టి ఖచ్చితంగా నమ్మాలి. మరియు అతను సమాధి చేయబడ్డాడు మరియు తిరిగి లేచాడు; అది అసాధ్యం కాబట్టి వాస్తవం ఖచ్చితంగా ఉంది.” 2 ఆ విధమైన వాదనను గుడ్డిగా నమ్మాలి (“విశ్వాసం ద్వారా”) లేదా దురదృష్టవశాత్తూ, ప్రపంచంలోని చాలా మంది చేయునట్లు దీన్ని అర్ధంలేనిదానిగా విసిరివేయాలి. బైబిల్ ఎప్పుడూ ఇలా మాట్లాడదు, అయితే, యహువః కుమారుడు (కుమారుడైన యహువః కాదు) మరణించాడు మరియు అతని తండ్రి అతనిని మృతులలో నుండి లేపి మహిమపరిచాడు. వివరంగా అపోస్తలు 2:14-36 లో చూడండి.

ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ కూడా గొప్ప భౌతిక శాస్త్రవేత్త మరియు వేదాంతవేత్త అయిన ఐజాక్ న్యూటన్‌కు నివాళులర్పించాడు, అతను సృష్టిలో యహువః యొక్క బాహువును గ్రహించాడు మరియు త్రిత్వాన్ని ఒప్పుకొనుటకు నిరాకరించాడు; అందువల్ల న్యూటన్ యొక్క అనేక వేదాంత రచనలు ప్రజలకు అందుబాటులో ఉండవు. న్యూటన్ "మానవ జాతి రహస్యాలను తెలుసుకుంటుంది మరియు అర్థం చేసుకోలేని పవిత్రమైనది మరియు పరిపూర్ణమైనది ఏదీ ఉండదు" అని వ్రాశాడు, కానీ "సత్యం ఎప్పుడూ సరళతలో కనుగొనబడుతుంది, గుణకారం మరియు విషయాల గందరగోళంలో కాదు" అని సలహా ఇచ్చాడు. ఎంత నిజం!

విలియం టిండేల్
విలియం టిండేల్

విలియం టిండేల్ మాట్లాడుతూ, పదాల యొక్క స్పష్టమైన అర్థాల వెనుక ఉన్న అర్థాల గురించి వాదించే పండితులు "నిష్క్రియ వివాదాలు చేయుచూ వ్యర్థమైన పదాల గురించి గొడవ చేయువారై ఉందురు, మరియు వారు ఎల్లప్పుడూ చేదు బెరడును కొరుకుతూ మరియు లోపల ఉన్న తీపిని ఎప్పటికీ పొందలేరు." టిండేల్‌కి, బైబిల్‌ను పూర్తిగా చదవాలి మరియు ఆ పదాలు ఎలా ఉంటే అలా అంగీకరించాలి, ఎందుకంటే "అది ఏ పురుషుడు లేదా స్త్రీ అయినా అర్థం చేసుకోగలిగే ఒక కథను చెబుతుంది, చర్చింపబడకుండా లేదా వేదాంతశాస్త్రాన్ని అధ్యయనం చేయకుండా." తన విశ్వాసం కారణంగా సంఘం టిండేల్‌ను కాల్చివేయడానికి కొద్ది కాలం ముందు, అతను ఇలా వ్రాశాడు, "యహువః సహాయం అనే బండను గట్టిగా హత్తుకోండి మరియు సమస్త విషయాల ముగింపును ఆయనకు అప్పగించండి" మరియు "మనుష్యుల నిర్ణయాలను అధిగమించనీయవద్దు." 3

ఐజాక్ వాట్స్, గొప్ప తర్కవేత్త మరియు గీత రచయిత ("వెన్ ఐ సర్వే ది వండ్రస్ క్రాస్," "జాయ్ టు ది వరల్డ్," "ఓ యాహువా, అవర్ హెల్ప్ ఇన్ ఏజెస్ పాస్ట్" మరియు ఇంకా 500 కంటే ఎక్కువ వ్రాసాడు), తర్కంపై తన క్లాసిక్ పాఠ్యపుస్తకంలో ఇలా ఎత్తి చూపారు, “మన సృష్టికర్త మనకు తార్కిక శక్తిని అందించాడు, దీని ద్వారా సత్యాన్ని వెంబడించడానికి; అయితే ప్రకృతి యొక్క ఏదైనా నీచమైన శక్తులు లేదా ఈ జీవితం యొక్క నశించిపోతున్న ఆసక్తుల ద్వారా మనం తప్పుదారి పట్టించినట్లయితే మనం ఆయన అత్యంత గొప్ప బహుమానాల్లో ఒకదానిని దుర్వినియోగం చేస్తాము. హేతువు, నిజాయితీగా విధేయత చూపినట్లయితే, సువార్త యొక్క దైవిక ప్రత్యక్షతను స్వీకరించడానికి మనల్ని నడిపిస్తుంది, అక్కడ అది సక్రమంగా ప్రతిపాదించబడుతుంది మరియు అది మనకు నిత్యజీవానికి మార్గాన్ని చూపుతుంది.” 4

ఐజాక్ వాట్స్ యొక్క తర్కశాస్త్ర అధ్యయనానికి మరియు తాను త్రిత్వాన్ని తిరస్కరించడానికి మధ్య సన్నిహిత సంబంధం ఉందని స్పష్టంగా తెలుస్తుంది. యహువః యొక్క స్వభావాన్ని గూర్చి 20 సంవత్సరాల సమయాన్ని తీవ్రమైన లేఖన అధ్యయనానికి వెచ్చించిన తర్వాత, వాట్స్ ఇలా వ్రాశాడు: “అయితే అటువంటి బలహీనమైన జీవులు ఇటువంటి [త్రిత్వం] విచిత్రమైన, కష్టమైన మరియు నిగూఢమైన సిద్ధాంతాన్ని వివరణ మరియు రక్షణ కోసం ఎలా తీసుకుంటారు. అనేకమంది జనులు, నేర్చుకొనేవారు మరియు దైవభక్తి ఉన్నవారు కూడా, అనంతమైన వివాదాల మరియు అంతులేని చిట్టడవుల చీకటిలో తమను తాము కోల్పోయారు. మరియు ఒక నిజమైన దేవుడిని తయారు చేయబోతున్న ముగ్గురు నిజమైన వ్యక్తుల గురించి ఈ వింత మరియు కలవరపరిచే భావన ఆ క్రైస్తవ సిద్ధాంతంలో చాలా అవసరం మరియు చాలా ముఖ్యమైనది కావచ్చు, ఇది పాత నిబంధన మరియు కొత్త నిబంధనలో, చాలా సాదాసీదాగా మరియు చాలా తేలికగా, కొంచెం అవగాహనలకు అయినా ప్రాతినిధ్యం వహిస్తుందా?” 5

పైన పేర్కొన్న విషయాల వెలుగులో, నా ప్రశ్న ఏమిటంటే: బైబిల్ ఆధారితమైనది మరియు "క్రీస్తు కేంద్రీకృతమైనది" అని చెప్పుకునే ఏ సంస్థయైనా ఏ ప్రాతిపదికన యహూషువః లేదా అపొస్తలులు ప్రస్తావించిన సిద్ధాంతాన్ని సమర్థిస్తుంది, అది రోమా మతం యొక్క విశ్వాసాలను మరియు సంఘం యొక్క బోధనను మరియు బైబిలుపై సంఘ సంప్రదాయం యొక్క ఆధిపత్యాన్ని అనుసరిస్తే తప్ప? యహువః ముందు నిజాయితీగా ఉండాలంటే మీరు ఆ ప్రశ్నకు సమాధానం చెప్పాలి మరియు చర్య తీసుకోవాలి.

క్రింది బైబిలు భాగాలను పరిగణించండి. వాటిని అలాగే చదవండి; కొన్ని ముందస్తు సిద్ధాంతాల ప్రకారం వాటిని "అర్థం" చేసుకోవడానికి ప్రయత్నించవద్దు:

అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును, నీవు పంపిన యహూషువః క్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము.

యహూషువః ఇలా ప్రార్ధించెను: "తండ్రీ, నా గడియ వచ్చియున్నది. నీ కుమారుడు నిన్ను మహిమ పరచునట్లు నీ కుమారుని మహిమ పరచుము. నీవు నీ కుమారునికిచ్చిన వారికందరికిని ఆయన నిత్యజీవము అనుగ్రహించునట్లు సర్వశరీరుల మీదను ఆయనకు అధికారమిచ్చితివి. అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును, నీవు పంపిన యహూషువః క్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. [ ఇక్కడ “పంపిన” అనగా “పరలోకం నుండి” అని కాదు, బాప్తీస్మమిచ్చు యోహాను మరియు ప్రవక్తలు అందరూ “పంపబడిన” వారే. దీని అర్థం "నియమించబడిన"]. చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమ పరచితిని. (యోహాను 17:2-4)

పైన ముద్దగా ఇవ్వబడిన పదాలు సహ-సమాన, సహ-శాశ్వత జీవుల మధ్య వింత ప్రకటనలు!

"అయితే పేతురు ఆ పదునొకరితోకూడ లేచి నిలిచి బిగ్గరగా వారితో ఇట్లనెను; యూదయ మనుష్యులారా, యెరూషలేములో కాపురమున్న సమస్త జనులారా, యిది మీకు తెలియుగాక, చెవియొగ్గి నా మాటలు వినుడి. ఇశ్రాయేలువారలారా, యీ మాటలువినుడి: యహువః నజరేయుడగు యహూషువః చేత అద్భుతములను మహత్కార్యములను సూచకక్రియలను మీ మధ్యను చేయించి, ఆయనను తనవలన మెప్పుపొందినవానిగా మీకు కనబరచెను; ఇది మీరే యెరుగుదురు. యహువః నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యద్‌ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన యీయనను మీరు దుష్టులచేత(లేక, అక్రమకారులచేత) సిలువ వేయించి చంపితిరి. ఈ యహూషువఃను యహువః లేపెను; దీనికి(లేక, ఈయనకు) మేమందరము సాక్షులము. కాగా ఆయన యహువః కుడిపార్శ్వమునకు హెచ్చింపబడి, పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానమును తండ్రివలన పొంది, మీరు చూచుచు వినుచునున్న దీనిని కుమ్మరించి యున్నాడు. మీరు సిలువవేసిన యీ యహూషువఃనే యహువః ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలిసికొనవలెనని చెప్పెను. (అపొస్తలుల కార్యములు 2:14- 36).

అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనినవాడై ఆకాశమువైపు తేరిచూచి, యహువః మహిమను యహూషువః దేవుని కుడిపార్శ్వమందు నిలిచి యుండుటను చూచి ఆకాశము తెరవబడుటయు, మనుష్యకుమారుడు యహువః కుడిపార్శ్వమందు నిలిచి యుండుటయు చూచుచున్నానని చెప్పెను.

… ప్రభువును గూర్చి మొరపెట్టుచు యహూషువః ప్రభువా, నా ఆత్మను చేర్చుకొనుమని స్తెఫను పలుకుచుండగా వారు అతనిని రాళ్లతో కొట్టిరి. అతడు మోకాళ్లూని ప్రభువా, వారిమీద ఈ పాపము మోపకుమని గొప్ప శబ్దముతో పలికెను; ఈ మాట పలికి నిద్రించెను. సౌలు అతని చావునకు సమ్మతించెను. (అపొస్తలుల కార్యములు 7:55-60).

ఇశ్రాయేలూ వినుము; మన దేవుడైన యహువః అద్వితీయుడగు యహువః. (ద్వితీయోప. 6:4)

మరియు యహూషువఃయే యహువః అనే లేదా యహువః ముగ్గురు వ్యక్తులు అనే ఆలోచనను వ్యతిరేకించే ఇంకా చాలా స్పష్టమైన ప్రకటనలు లేఖనాలలో ఉన్నాయి:


1 పీటర్ బెర్గర్, ఎ ఫార్ గ్లోరీ: ది క్వెస్ట్ ఆఫ్ ఫెయిత్ ఇన్ ఏజ్ ఆఫ్ క్రెడ్యులిటీ, ఫ్రీ ప్రెస్, 1992, పేజీ. 163.

2 ఇ.జి. బెవ్క్స్, ది వెస్ట్రన్ హెరిటేజ్ ఆఫ్ ఫెయిత్ అండ్ రీజన్, హోల్ట్, రైన్‌హార్ట్, 1971.

3 విలియం టిండేల్ వ్రాసిన: ఇఫ్ గాడ్ స్పేర్ మై లైఫ్ బై బ్రియాన్ మొయినాహన్.

4 లాజిక్, 1724లో మొదటిసారిగా ప్రచురించబడింది, సోలి డియో గ్లోరియా పబ్లికేషన్స్ ద్వారా పునర్ముద్రించబడింది, మోర్గాన్, PA, 1996, పేజీ. 325.

5 విలియం జి. ఎలియట్‌లో ఉల్లేఖించబడింది, డిస్కోర్సెస్ ఆన్ ది డాక్ట్రిన్స్ ఆఫ్ క్రిస్టియానిటీ, అమెరికన్ యూనిటేరియన్ అస్సెన్., 1877, పేజీలు. 97, 100.


ఇది కీత్ రెల్ఫ్ రాసిన వ్యాసం. WLC వ్యాసం కాదు.

మేము అసలు వ్యాసం నుండి సమస్త అన్య నామములను మరియు తండ్రి - కుమారుడు అనే శీర్షికలను తొలగించి, వాటి స్థానాన్ని అసలు నామములతో భర్తీ చేసాము. ఇంకా, ఇక్కడ ఇవ్వబడిన లేఖనాలలో తండ్రి మరియు కుమారుని నామములను బైబిల్ యొక్క మొదటి ప్రేరేపిత రచయితలచే వ్రాయబడిన విధంగా మేము పునరుద్ధరించాము. -డబ్ల్యుఎల్‌సి బృందం.