Print

మెల్కీసెదకు: ఒకప్పటి & భవిష్యత్తు రాజు

మేరీ జోసెఫిన్ షార్లెట్ డు వాల్ డి ఓగ్నెస్ (1786-1868) 1801 మేరీ డెనిస్ విల్లర్స్ ఫ్రెంచ్ప్రారంభ 1970 ల్లో ఒక ప్రాచుర్యం పొందిన పాట ఈ శోధన పదాలతో ప్రారంభమవుతుంది: “ఒక చిత్రం వెయ్యి పదాలను వర్ణిస్తే, నేను నిన్ను ఎందుకు చిత్రించకూడదు? నేను తెలుసుకున్న ఈ పదాలు నిన్ను ఎప్పటికీ చూపించవు.” 1

ఒక చిత్రం “వెయ్యి పదాలను వర్ణించునని” చెప్పబడుతుంది, ఎందుకంటే ఒక చిత్రం, అది చేతిచిత్రం అయినా లేక ఛాయాచిత్రం అయినా, పేజీల మరియు పేజీలలో పదాల వర్ణనకు అవసరమైన సమాచారాన్ని తెలియజేస్తుంది మరియు అప్పుడు కూడా కొన్ని వివరాలు తప్పిపోవచ్చు. (ఎడమ వైపున ఉన్న చిత్రం: మేరీ జోసెఫిన్ షార్లెట్ డు వాల్ డి ఓగ్నెస్ (1786-1868) 1801 - మేరీ డెనిస్ విల్లర్స్ ఫ్రెంచ్)

చిహ్నాలు వెయ్యి పదాలను వర్ణించే గ్రంథం యొక్క చిత్రాలు. ఒక చిహ్నం సూక్ష్మ సంపదను తెలియజేస్తుంది, లేకపోతే అది కోల్పోతుంది. బైబిల్ చిహ్న/సంకేతాలకు ఒక ప్రధాన ఉదాహరణ బాప్తీస్మమిచ్చు యోహాను రక్షకుడిని "లోక పాపములను మోసికొనిపోవు యః గొర్రెపిల్ల" అని చెప్పుటలో కనబడుతుంది. (యోహాను 1:29). వేరే ఇతర పదాలను ఉపయోగించకుండా, పడిపోయిన మానవుని విమోచించుటకు అమలుచేయబడిన మొత్తం త్యాగ వ్యవస్థను ఈ వాక్యం వెంటనే గుర్తుకు తెస్తుంది.

గ్రంథంలో చూపబడిన మరొక చిహ్నం మెల్కీసెదెకు. కీర్తన 110: 4 ఇలా చెబుతోంది: మెల్కీసెదెకు క్రమము చొప్పున నీవు నిరంతరము యాజకుడవైయుందువని యహువః ప్రమాణము చేసియున్నాడు, ఆయన మాట తప్పనివాడు. హెబ్రీ పత్రిక రచయిత హెబ్రీయులకు 7:17 లో ఈ వచనంలోని పద పదాన్ని వివరించినప్పుడు ఈ అస్పష్టమైన సూచన యొక్క ప్రాముఖ్యత నొక్కిచెప్పబడింది: ఏలయనగా నీవు నిరంతరము మెల్కీసెదెకు క్రమము చొప్పున యాజకుడవై యున్నావు అని ఆయన విషయమై సాక్ష్యము చెప్పబడెను.

ఈ చిహ్నాన్ని అర్థం చేసుకొనుటకు బైబిల్ ఎల్లప్పుడూ తనను తాను వివరిస్తుంది, మనము చేయవలసిందల్లా ఆదికాండము 14 కు వెళ్లి మెల్కీసెదెకు ఎవరో మరియు ఆయన దేని నిమిత్తం ఎరుగబడెనో తెలుసుకోవాలి.

మెల్కీసెదెకు: మర్మ మానవుడు

ఇస్సాకు పుట్టుకకు కొన్ని సంవత్సరాల ముందు, అబ్రాహాము కంటిలో ఒక వెలుగును, సారాయి పెదవులపై నవ్వును కలిగించిన కాలంలో, లోతు మరియు అతని కుటుంబం కనాను రాజుల మధ్య జరిగిన యుద్ధంలో బందీలుగా పట్టబడిరి. అబ్రాము ఈ వార్త విన్న వెంటనే, అతడు ఒక చిన్న సేవక సైన్యాన్ని ఏర్పాటు చేసి, ఉత్తరాన ఉన్న శతృసైన్యాన్ని వెంబడించి అపహరించబడిన ప్రతి ఒక్కరినీ, మైదాన నగరాల నుండి దోచుకున్న సమస్త సామాగ్రితో పాటు తిరిగి విడిపించాడు.

అబ్రాహాము తన ప్రత్యేక సైన్యంతో పాటు తిరిగి దక్షిణాదికి వచ్చినప్పుడు, అతడిని ఎదుర్కొనుటకు ఒక మర్మమైన వ్యక్తి వస్తాడు. ఆదికాండము 14:18 చెబుతోంది, "మరియు షాలేము రాజైన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షారసమును తీసికొనివచ్చెను. అతడు సర్వోన్నతుడగు ఎలోహీంకి యాజకుడు."

మెల్కీసెదెకు ఒక రాజు మరియు అతడు “సర్వోన్నత దేవుడైన” యహువఃను ఆరాధించువాడు. కానీ ఆ కథ అక్కడితో అంతం కాదు. మెల్కీసెదెకు అబ్రామునకు దీవెనలు ప్రకటించెను తరువాత అబ్రాము అతడికి దశమభాగములను చెల్లించెను.

అబ్రాహాము నుండి దశమభాగములను పొందిన తరువాత, ఈ మర్మమైన వ్యక్తి సుదూర ప్రాంతమునకు తిరిగి వెళ్ళెను మరియు అతడు మరలా ఎప్పటికీ కనబడలేదు. అతడు ఎక్కడ నుండి వచ్చెనో మనకు తెలియదు; అతడి పూర్వీకులు ఎవరో మనకు తెలియదు; అతడు యః యొక్క యాజకునిగా ఎలా వచ్చాడో మనకు తెలియదు. అంతగా అవసరం కాని సమాచారం అంతయు తీసివేయబడి మరియు చాలా అవసరమైన సమాచారం మాత్రమే గ్రంథంలో అందించబడినది. అతడు పవిత్రమైన పుటలలో క్లుప్తంగా కనిపిస్తాడు, మరియు అంతే వేగంగా కనుమరుగైపోతాడు, కానీ ఈ మర్మమైన వ్యక్తిలో పునరుత్థానం చేయబడిన రక్షకుని పరిచర్యను గూర్చి గొప్ప పాఠాలు నేర్పే వివరాలు దాగి ఉన్నాయి.

మెల్కీసెదెకునకు బహుమానము

నీతికి రాజు

మెల్కీసెదెకు అనే పేరుకు “నీతికి రాజు” అని అర్ధం. యః యొక్క అత్యంత నిబద్ధత గల అనుచరుల వైఫల్యాలు మరియు బలహీనతల గురించి లేఖనం ఒక స్పష్టమైన జాబితాను అందిస్తుంది, కాని మెల్కీసెదెకు గురించి అలాంటి జాబితాలు లేవు. ఇందులో, అతడు యహూషువఃకు తగిన చిహ్నం. మెల్కీసెదెకు కంటే మరే ఇతర మానవుడు మెస్సీయ వైపు పూర్తిగా చూపబడలేదు.

హెబ్రీ పత్రిక రచయిత ఇలా వివరించాడు:

ఇతడెంత ఘనుడో చూడుడి. మూలపురుషుడైన అబ్రాహాము అతనికి కొల్లగొన్న శ్రేష్ఠమైన వస్తువులలో పదియవ వంతు ఇచ్చెను. మరియు లేవి కుమాళ్లలోనుండి యాజకత్వము పొందువారు, తమ సహోదరులు అబ్రాహాము గర్భవాసమునుండి పుట్టినను, ధర్మశాస్త్రము చొప్పున వారియొద్ద, అనగా ప్రజలయొద్ద పదియవవంతును పుచ్చుకొనుటకు ఆజ్ఞను పొందియున్నారు గాని, వారితో సంబంధించిన వంశావళి లేనివాడైన మెల్కీసెదెకు అబ్రాహామునొద్ద పదియవవంతు పుచ్చుకొని వాగ్దానములను పొందినవానిని ఆశీర్వదించెను. తక్కువవాడు ఎక్కువ వానిచేత ఆశీర్వదింపబడునను మాట కేవలము నిరాక్షేపమై యున్నది. మరియు లేవిక్రమము చూడగా చావునకు లోనైనవారు పదియవవంతులను పుచ్చుకొనుచున్నారు. అయితే ఈ క్రమము చూడగా, జీవించుచున్నాడని సాక్ష్యము పొందినవాడు పుచ్చుకొనుచున్నాడు. అంతే కాక ఒక విధమున చెప్పినయెడల పదియవవంతులను పుచ్చుకొను లేవియు అబ్రాహాముద్వారా దశమాంశములను ఇచ్చెను. ఏలాగనగా మెల్కీ సెదెకు అతని పితరుని కలిసికొనినప్పుడు లేవి తన పితరుని గర్భములో ఉండెను. (హెబ్రీయులు 7: 4-10)

అహరోను యొక్క పూర్వీకుడు మరియు తన యాజక వంశీయుడైన అబ్రాహాముపై మెల్కీసెదెకు ఒక ఆశీర్వాదమును ప్రకటించెననే వాస్తవం, మెల్కీసెదెకు యొక్క యాజకత్వం తరువాత వచ్చిన లేవీ యాజకత్వం కంటే గొప్పదని నిర్ధారిస్తుంది.

సమాధానపు రాజు

మెల్కీసెదెకు “నీతికి రాజు” కంటే ఎక్కువ. షాలేము రాజుగా, అతడు “శాంతికి కూడా రాజు”, ఎందుకంటే షాలేము అనగా శాంతి. ఇది మళ్ళీ, "శాంతికి రాజు" అయిన యహుషువఃకు మరో సుందరమైన చిహ్నం.

మెల్కీసెదెకును పరిశుద్ధాత్మ లేదా క్రీస్తు యొక్క పూర్వ అవతారము అని త్రిత్వ బోధకులు చాలాకాలంగా అభిప్రాయపడుతున్నారు. మరికొందరైతే మెల్కీసెదెకు మానవ రూపంలో ఉన్న తండ్రి అని కూడా అభిప్రాయపడిరి. అయితే, ఇటువంటి ఊహాగానాలు అన్యమత త్రిమూర్తుల సిద్ధాంతం నుండి మిగిలిపోయిన లోపం తప్ప మరొకటి కాదు. మెల్కీసెదెకు పూర్తిగా మానవుడు. అందువల్ల, లేఖనములు రక్షకునిగా వెల్లడిస్తున్న యహుషువః కూడా పూర్తిగా మానవుడు అని అతడి ద్వారా వెల్లడియగుచున్నది.

ఆదాము అను ఒక మనుష్యుని ద్వారా పడిపోయిన మానవ జాతిని విమోచించుటకు, యహుషువః పూర్తిగా మానవుడై ఉండాలి. "ఎట్లనగా ఒకని అపరాధమువలన అనేకులు చనిపోయినయెడల మరి యెక్కువగా ఎలోహీం కృపయు, యహూషువః మెస్సీయ అను ఒక మనుష్యుని కృపచేతనైన దానమును, అనేకులకు విస్తరించెను. (రోమీయులకు ​​5:15)

కేవలం ఒక పూర్తి మానవ రూపం (చిహ్నం) మాత్రమే పూర్తిగా మానవ ప్రతి-రూపమైన (వాస్తవం), యహూషువఃను సూచించగలదు.

క్రైస్తవ ఆశ

మెల్కీసెదెకు పూర్తిగా మానవునిగా ఉంటూనే మెల్కీసెదెకు యాజకునిగానూ మరియు రాజుగానూ ఉండెనను వాస్తవం యహూషువఃను గూర్చి చాలా ముఖ్యమైన పాఠాన్ని బోధిస్తుంది, అనగా, ఈయన కూడా పూర్తిగా మానవునిగా ఉన్న రాజు మరియు యాజకుడు. తనకు ముందుగల మెల్కీసెదెకు మాదిరిగా, యహూషువః ఈ ఉన్నత, పవిత్ర కార్యాలయానికి యహువః ద్వారా స్వయంగా నియమింపబడెను. ఇది యహూషువః యొక్క యాజకత్వాన్ని తమ తల్లిదండ్రుల వల్ల వారసత్వంగా పొందిన లేవీ యాజకత్వముకంటే ఉన్నతమైనదిగా చేస్తుంది.

అతడు [యహూషువః] ప్రమాణం లేకుండా యాజకునిగా చేయబడలేదు. వారైతే ప్రమాణము లేకుండ యాజకులగుదురు గాని యీయనను నీవు నిరంతరము యాజకుడవై యున్నావని అదోనాయ్ ప్రమాణము చేసెను:

మరియు ప్రమాణములేకుండ యహూషువః యాజకుడు కాలేదు
గనుక ఆయన మరి శ్రేష్ఠమైన నిబంధనకు పూటకాపాయెను.
ఆయన పశ్చాత్తాపపడడు అని
యీయనతో చెప్పినవానివలన ప్రమాణపూర్వకముగా యాజకుడాయెను. (హెబ్రీయులకు 7:20-22.)

లేవీ యాజకత్వం శిలువ వద్ద ముగిసింది, కాని యాహూషువః యాజకత్వం ఎప్పటికీ కొనసాగుతుంది. ఇది క్రైస్తవుని ఆశ:

మరియు ఆ యాజకులు [లేవీ సంబంధమైన యాజకులు] మరణము పొందుటచేత ఎల్లప్పుడును ఉండ సాధ్యము కానందున, అనేకులైరి గాని, ఈయన [యహూషువః] నిరంతరము ఉన్నవాడు గనుక మార్పులేని యాజకత్వము కలిగిన వాడాయెను. ఈయన తనద్వారా ఎలోహీం యొద్దకు వచ్చువారి పక్షమున, విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై యున్నాడు.

పవిత్రుడును, నిర్దోషియు, నిష్కల్మషుడును, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును, ఆకాశ మండలముకంటె మిక్కిలి హెచ్చయినవాడునైన యిట్టి ప్రధానయాజకుడు మనకు సరిపోయినవాడు. ధర్మశాస్త్రము బలహీనతగల మనుష్యులను యాజకులనుగా నియమించును గాని ధర్మశాస్త్రమునకు తరువాత వచ్చిన ప్రమాణపూర్వకమైన వాక్యము నిరంతరమును సంపూర్ణ సిద్ధిపొందిన కుమారుని నియమించెను గనుక, ఈయన ఆ ప్రధానయాజకులవలె మొదట తన సొంత పాపములకొరకు తరువాత ప్రజల పాపములకొరకును దినదినము బలులను అర్పింపవలసిన అవసరము గలవాడు కాడు; తన్నుతాను అర్పించుకొన్నప్పుడు ఒక్కసారే యీ పనిచేసి ముగించెను. (హెబ్రీయులకు 7:23-28.)

యహూషువః, మెల్కీసెదెకు వలె, ఒక ప్రత్యేక కార్యాలయానికి నేరుగా యహువః ద్వారా నియమింపబడెను. మరియు ఆయన స్వరక్తం ద్వారా, ఆయన మరణం, పునరుత్థానం మరియు పరిచర్యను తమ జీవితాల్లో అంగీకరించిన వారందరూ, ఎన్నడూ పాపం చేయనివారివలె యహువః ముందు నిలుచుదురు.

మెల్కీసెదెకు గురించి మరింత సమాచారం కోసం మరియు రక్షకుని గూర్చి & విముక్తి ప్రణాళిక గూర్చి ఈ పురాతన యాజక-రాజు ఏమి వెల్లడించెనో తెలుసుకొనుటకు, WLC రేడియో ఎపిసోడ్ చూడండి: “Melchizedek: Once & Future King.”


మెల్కీసెదెకు కిరీటమలు
 
1 “ఇఫ్,” డేవిడ్ గేట్స్.