Print

యహువః నీతిని పొందుట

తన వీడ్కోలు ప్రసంగంలో, యహూషువః తన శిష్యులకు “మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి, నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును; నమ్మని వానికి శిక్ష విధింపబడును.” అని ఆదేశించాడు. (మార్కు 16:15,16)

సర్వసృష్టికి ప్రకటించవలసిన ఈ సువార్త ఏమిటి?

తన శిష్యులలో ఒకనిగా ఈ సువార్తను ప్రకటించుటకు నియమింపబడిన పౌలు, యహూషువః సువార్త అనగా "నమ్ము ప్రతివానికి రక్షణ కలుగజేయుటకు యహువః శక్తి" అని ధృవీకరించాడు. (రోమా 1:16)

యహూషువః యొక్క సువార్త ప్రతి ఒక్కరిని కాపాడుటకు యహువః యొక్క శక్తిని ఎలా ప్రతిబింబిస్తుంది?

పౌలు రహస్యమును వెల్లడిచేస్తున్నాడు: “ఎందుకనిన నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించునని వ్రాయబడిన ప్రకారము విశ్వాసమూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు ఎలోహీం నీతి దానియందు బయలుపరచబడుచున్నది.” (రోమీయులకు 1:17). సువార్తను నమ్మువారు రక్షింపబడుదురు, నమ్మనివారు శిక్షింపబడుదురు.

యహూషువః మనకు ఇలా ఉపదేశించాడు: “కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి; అప్పుడవన్నియు మీకనుగ్రహింపబడును.” (మత్తయి 6:33). సువార్త యహువః నీతిని పొందు మార్గాన్ని వెల్లడిస్తుంది, మరియు మనము ఆయన నీతిని కలిగి ఉన్నప్పుడు, మనకు ఏదియు కొదువ ఉండదు!

నీతి అనుసరించువారలారా, నా మాట వినుడి నా బోధను హృదయమందుంచుకొన్న జనులారా, ఆలకించుడి మనుష్యులు పెట్టు నిందకు భయపడకుడి వారి దూషణ మాటలకు దిగులుపడకుడి..” (యెషయా 51:7)

“ఏలాగనగా ఆ దినములైన తరువాత నేను వారితో చేయబోవు నిబంధన ఇదే. నా ధర్మవిధులను వారి హృదయమునందుంచి వారి మనస్సుమీద వాటిని వ్రాయుదును … వారి పాపములను వారి అక్రమములను ఇకను ఎన్నటికిని జ్ఞాపకముచేసికొనను అని యహువః చెప్పుచున్నాడు.” (హెబ్రీయులకు 10:16-17)

యహువః నీతి ఆయన ధర్మశాస్త్రంలో బహిర్గతమవుతుంది. నీతిమంతులైనవారు తమ హృదయములో ఆయన ధర్మశాస్త్రాన్ని కలిగివుంటారు, తద్వారా ఆయనయొద్ద నీతిమంతులుగా నడుచుకోగలరు.

కాబట్టి మనము యహువః యొక్క క్రియలను ఎలా చేయగలము? మనము ఆయన నీతిని ఎలా పొందవచ్చు?

తన కుమారునియందు విశ్వాసం ద్వారా.

“వారు మేము యహువః క్రియలు జరిగించుటకు ఏమి చేయవలెనని ఆయనను అడుగగా, యహూషువః ఆయన పంపిన వానియందు మీరు విశ్వాసముంచుటయే యహువః క్రియయని వారితో చెప్పెను.” (యోహాను 6:28-29)

తన కుమారునిలో కేంద్రీకరించబడియున్న యహువః యొక్క ప్రణాళికను నమ్ముట ద్వారా, మనము ఆయన క్రియలను చేయుటకు అవసరమైన శక్తిని పొందెదము. వేరొక మాటలో చెప్పాలంటే, ఆయన ధర్మశాస్త్రాన్ని ఆచరించగల శక్తిని పొందెదము.

మన సొంత క్రియల ద్వారా ఆయన ముందు నీతిమంతులుగా మారగలమా?

అసాధ్యం.

“నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించును.” (రోమీయులకు 1:17)

యహువః నీతిని పొందుటలో మన క్రియలు ఏదైనా పాత్రను పోషించునని మనం అనుకుంటే, అప్పుడు మనము ఆయన వాక్యానికి మరికొంత కలుపినట్లే. ఆయన మాటలతో ఏమియు చేర్చకూడదని మనం హెచ్చరించబడ్డాము.

“ఆయన మాటలతో ఏమియు చేర్చకుము ఆయన నిన్ను గద్దించునేమో అప్పుడు నీవు అబద్ధికుడవగుదువు.” (సామెతలు 30:6)

యహువః యొక్క నీతిని మనం పొందుకొనటకు ఆయన మననుండి కోరేదంతా యహూషువః యొక్క సువార్తపై విశ్వాసం ఉంచుటయే. కేవలం ఆయన నీతి మాత్రమే ఆయన ధర్మశాస్త్రాన్ని ఆచరించునట్లు మనకు సహాయపడుతుంది. ఆయన సువార్తలో మన సొంత క్రియలకు చోటులేదు.

“మేమందరము అపవిత్రులవంటివారమైతిమి మా నీతిక్రియలన్నియు మురికిగుడ్డవలె నాయెను మేమందరము ఆకువలె వాడిపోతిమి గాలివాన కొట్టుకొనిపోవునట్లుగా మా దోషములు మమ్మును కొట్టుకొనిపోయెను.” (యెషయా 64:6)

అలాంటప్పుడు వరల్డ్స్ లాస్ట్ చాన్స్ ఎందుకు లూనార్ సబ్బాతు మరియు మరణించినవారి స్థితి, వెయ్యేండ్లు, విచారణాత్మక తీర్పు మొదలైన వాటికి సంబంధించిన సిద్దాంతాలను ఉద్ఘాటిస్తున్నది?

ఈ బైబిలు సిద్ధాంతాలను గైకొనుట మరియు అవగాహన చేసికొనుట ఒక విషయంపై ఆధారపడి ఉంటుంది: యహువః యొక్క నీతిలో నివాసము చేయుట. దీనిని యహూషువః యొక్క రక్షక సువార్తయందలి విశ్వాసం ద్వారా మాత్రమే పొందగలము.

“ఎందుకనగా మనమాయనయందు ఎలోహీం నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మనకోసము పాపముగాచేసెను.” (2 రెండవ కొరింథీయులకు 5:21)

మోక్షాన్ని ప్రకటిస్తున్న ఏ సువార్త అయినా విశ్వాసంతో ఇతర అంశాలను జోడించినయెడల అది తప్పుడు సువార్త.

భూచరిత్ర యొక్క ఈ ముగింపు క్షణాల్లో ప్రకటించగల అత్యుత్తమ వార్త ఏమిటంటే మనము మన రక్షకునిగా యహూషువఃకు పూర్తిగా లోబడి, తన ధర్మశాస్త్రాన్ని అన్ని సమయాలలో ఆచరించునట్లు ఆయన మనకు శక్తినిచ్చునని విశ్వసించిన యెడల యహువః యొక్క నీతి ఉచితంగా లభిస్తుంది.

మనము రక్షణపొందు నిమిత్తం ధర్మమును పాటించుటలేదు; మనము రక్షణపొందాము గనుక ధర్మమును పాటించుచున్నాము! హల్లెలూయః!

మనము తన శక్తినిచ్చు కృప ద్వారా యహువః యొక్క ధర్మాన్ని పాటించినప్పుడు, మనము వెంటనే నీతిమంతులుగా తీర్చబడుదుము, ఎందుకంటే ఆయన ధర్మము ఆయన నీతిని ప్రతిబింబిస్తుంది. ఇది సువార్త యొక్క సారాంశం, ఈ చివరి దినాలలో నశించుచున్న ప్రపంచానికి ఇవ్వబడిన ఉత్తమ వార్త.

పౌలు ఇలా ఆనందంగా ప్రకటించుటలో ఆశ్చర్యం లేదు:

“సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను. ఏలయనగా నమ్ము ప్రతివానికి . . . రక్షణ కలుగజేయుటకు అది యహువః శక్తియై యున్నది. ఎందుకనిన నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించునని వ్రాయబడిన ప్రకారము విశ్వాసమూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు యహువః నీతి దానియందు బయలుపరచబడుచున్నది. (రోమీయులకు:16-17)