Print

యహువఃతో జీవించుటకు సిద్ధపడుట

జచయించినవారికి ఇవ్వబడు గొప్ప బహుమానం అమరత్వం కాదు. బదులుగా, ఆ బహుమానం, భూమిపై రాబోయే రాజ్యంలో యహువః సమక్షంలో జీవించే అవకాశమై యున్నది. యహువఃతో కలిసి జీవించుటకు సన్నాహకంగా రక్షణను అంగీకరించుటకు మీరు మీ విశ్వాసాన్ని అవలంబించినప్పుడు, ఆ చర్య మీకు నీతిగా లెక్కించబడుతుంది.

పాపపు గోడ

పాపం ఆత్మను సృష్టికర్త నుండి వేరు చేస్తుంది. పౌలు యహువఃను ఇలా వర్ణించెను: "శ్రీమంతుడు ... సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునైయున్నాడు. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వముగలవాడైయున్నాడు. మనుష్యులలో ఎవడును ఆయనను చూడలేదు, ఎవడును చూడనేరడు; ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగియుండును గాక (1 తిమోతి 6: 15-16)." దైవిక పాత్ర యొక్క చక్కదనంతో ఆశ్చర్యపోయిన మోషే, యహువఃను ముఖాముఖిగా చూడాలని వేడుకున్నప్పుడు, యహువః ఓపికగా ఇలా వివరించాడు, “నీవు నా ముఖమును చూడజాలవు; ఏ నరుడును నన్ను చూచి బ్రదుకడు.” (నిర్గమకాండము 33:20).

అటువంటి, చాలా ఉన్నతమైన మరియు ఘనమైన, అత్యంత పవిత్రమైన, సమీపింపరాని తేజస్సులో నివసించువానితో, పడిపోయిన పాపియైన మానవుడు సంబంధాన్ని కలిగి ఉండలేడు. యహూషువః పాపుల కోసం మరణించుట కంటే మరి ఎక్కువగా చేసాడు: ఆయన తన జీవితం ద్వారా, పూర్తి మానవుడిగా, మానవ జాతి యొక్క సభ్యుడిగా, తండ్రి మానవుడిగా వస్తే ఎలా ఉంటాడో చూపించాడు.

తల్లులను మరియు పిల్లలను అంగీకరిస్తూ సమాజం చిన్న చూపు చూచిన వారిని చేతులు చాచి స్వీకరించుట ద్వారా యహూషువః తండ్రిని చూపించాడు.

"నేనును నీకు శిక్ష విధింపను; నీవు వెళ్లి ఇక పాపము చేయకుము” అని పలుకుతూ, అర్థం చేసుకునే చిరునవ్వుతో, క్షమించుటకు సిద్ధంగా మరియు ఆత్రంగా ఉంటూ తండ్రిని చూపించుచుండెను.

యహూషువః రోగంతో ఉన్నవారిని స్వస్థపరిచాడు మరియు విరిగిన హృదయాలను ఓదార్చాడు, మానవాళిని ఆలింగనం చేసుకొనుటకు వంగి, తనకు సాధ్యమైన చోట సహాయం చేస్తూ తండ్రిని చూపించాడు.

నీతిమంతుల కొరకు ఎదురుచూస్తున్న ప్రతిఫలానికి మానవ హృదయాలను సిద్ధం చేసే అనంతమైన ప్రేమ గల తండ్రి పాత్రయే ఈ ప్రత్యక్షత:

అప్పుడు "ఇదిగో ఎలోహీం నివాసము మనుష్యులతో కూడ ఉన్నది, ఆయన వారితో కాపుర ముండును, వారాయన ప్రజలైయుందురు, ఎలోహీం తానే వారి ఎలోహీమై యుండి వారికి తోడైయుండును. ఆయన వారి కన్నుల ప్రతి బాష్పబిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనయైనను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించిపోయెనని సింహాసనములోనుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని.” (ప్రకటన గ్రంథము 21:3-4.)

నీతిమంతుల యొక్క ప్రతిఫలం… సర్వశక్తిమంతుని సమక్షంలో జీవించగలగలుగుట; వర్ణించలేని స్వచ్ఛమైన మరియు అనంతమైన ప్రేమ యొక్క ముఖాన్ని చూచుట. యహూషువః ప్రకటించిన శుభవార్త ఏమిటంటే, తండ్రి ముఖాన్ని ముఖాముఖిగా చూడగలిగే విధంగా, పాపిని యహ్ యొక్క బిడ్డగా మార్చే ఆత్మ-సిద్ధపాటు ప్రక్రియయే దైవిక కృప యొక్క బహుమానం. ఈ బహుమానం అందరికీ, వారు పాపంలో ఎంత లోతుగా మునిగిపోయినా, విశ్వాసం ద్వారా అంగీకరించిన ప్రతి మానవునికి లభిస్తుంది.

విశ్వాసం ద్వారా పరివర్తన

రోమా ​​3:10 నిస్సందేహంగా ఇలా చెబుతోంది: “నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు.” నీతి దైవిక ధర్మశాస్త్రంపై ఆధారపడి ఉంటుంది. మీ అంతట మీరు పాపపు తిరుగుబాటు నుండి నీతిమంతులుగా మారలేరు. నేను కూడా. కాని యహూషువః చేయగలడు. మీరు చేయాల్సిందల్లా మీ విశ్వాసం వాగ్దానాన్ని గ్రహించేలా చేయటం. అప్పుడు వాస్తవికత తక్షణం మీదే!

సువార్త సందేశాన్ని అన్యజనులకు తీసుకువెళ్ళిన పౌలు, రోమాలోని విశ్వాసులకు దయ యొక్క ఈ అద్భుతమైన లావాదేవీని వివరించాడు.

లేఖనమేమి చెప్పుచున్నది? అబ్రాహాము ఎలోహీంని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. పని చేయువానికి జీతము ఋణమేగాని దానమని యెంచబడదు.

పనిచేయక, భక్తిహీనుని నీతిమంతునిగా తీర్చు వానియందు విశ్వాసముంచు వానికి వాని విశ్వాసము నీతిగా ఎంచబడుచున్నది. ఆ ప్రకారమే క్రియలు లేకుండ ఎలోహీం ఎవనిని నీతిమంతుడుగా ఎంచునో ఆ మనుష్యుడు ధన్యుడని దావీదుకూడ చెప్పుచున్నాడు. ఏలాగనగా తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. యహువః చేత నిర్దోషియని ఎంచబడినవాడు ధన్యుడు.” (రోమీయులకు 4:3-8.)

అంగీకరించుటకు మీరు విశ్వాసం యొక్క చేతిని చాచినప్పుడు, ఆ విశ్వాసమే మీకు నీతిగా లెక్కించబడుతుంది!

పైకి చూస్తుండుట

దానిని ఒక్క క్షణం ఆలోచించండి: విశ్వాసం ద్వారా రక్షణను అంగీకరించే చర్య మీకు నీతిగా లెక్కించబడుతుంది.

దానిని సంపాదించుటకు మీరు ఏమీ చేయనవసరం లేదు. నిజానికి, మీరు దానిని సంపాదించుటకు ఏమీ చేయలేరు. మీరు చేయగలిగేది విశ్వాసం ద్వారా అంగీకరించుట. బహుమానమును అంగీకరించుటకు మీరు అవలంబించే విశ్వాసం కూడా ఒక బహుమానమే!

“తన్నుతాను ఎంచుకొనతగిన దానికంటె ఎక్కువగా ఎంచుకొనక, ఎలోహీం ఒక్కొక్కనికి విభజించి యిచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము, తాను స్వస్థబుద్ధిగలవాడగుటకై తగిన రీతిగా తన్ను ఎంచుకొనవలెనని, నాకు అను గ్రహింపబడిన కృపనుబట్టి మీలోనున్న ప్రతి వానితోను చెప్పుచున్నాను.” (రోమీయులకు 12:3.)

యహువః రూపంలోకి పునఃసృష్టి చేయబడుట

మీకు ఇవ్వబడిన విశ్వాసాన్ని మీరు అవలంబించి, యహూషువః యొక్క నీతి ద్వారా ఇవ్వబడిన యహువః బహుమానమును అంగీకరించిన తర్వాత, యహువః మిమ్మల్ని తన స్వరూపంలోకి పునః సృష్టిస్తాడు. మళ్ళీ, ఇది మీ అంతట మీరు చేయగలిగేది కాదు. ఈ పని యహువఃది, మరియు యహువఃది మాత్రమే.

మీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధజలము చల్లుదును, మీ విగ్రహములవలన మీకు కలిగిన అపవిత్రత అంతయు తీసివేసెదను. నూతన హృదయము మీ కిచ్చెదను, నూతన స్వభావము మీకు కలుగజేసెదను, రాతిగుండె మీలోనుండి తీసివేసి మాంసపు గుండెను మీకిచ్చెదను. నా ఆత్మను మీయందుంచి, నా కట్టడల ననుసరించువారినిగాను నా విధులను గైకొను వారినిగాను మిమ్మును చేసెదను. ​నేను మీ పితరుల కిచ్చిన దేశములో మీరు నివసించెదరు, మీరు నా జనులై యుందురు నేను మీ ఎలోహీంనై యుందును. మీ సకలమైన అపవిత్రతను పోగొట్టి నేను మిమ్మును రక్షింతును, మీకు కరవురానియ్యక ధాన్యమునకు ఆజ్ఞ ఇచ్చి అభివృద్ధి పరతును. (యెహెజ్కేలు 36:25-29)

రక్షింపబడుటకు మీకు కావలసిన ప్రతిదాన్ని యహువః మీకు అందించాడు.

ఎంపిక మీ చేతిలో ఉంది

ఎంపిక

అంతిమంగా, ఇది వ్యక్తిగత ఎంపికకు అవకాశం ఇస్తుంది మరియు మీ కోసం ఎవరూ ఆ ఎంపిక చేయలేరు. మీరు ఎన్నుకుంటే, మీరు సమస్త ఆనందాలకు మూలమైన యహువః సమక్షంలో శాశ్వతంగా జీవించవచ్చు. మరియు, అరణ్యంలో మోషేలా కాకుండా, తండ్రిని ముఖాముఖిగా చూసే అవకాశం మీకు ఉంటుంది.

"ఇప్పుడు అద్దములో చూచినట్టు సూచనగా చూచుచున్నాము; అప్పుడు ముఖాముఖిగా చూతుము. ఇప్పుడు కొంతమట్టుకే యెరిగియున్నాను; అప్పుడు నేను పూర్తిగా ఎరుగబడిన ప్రకారము పూర్తిగా ఎరుగుదును." (మొదటి కొరింథీయులకు 13:12).

ఇది మీ చేతిలో ఉంది: యహువః మీకు అందిస్తున్న బహుమానమును అంగీకరించండి. క్రీస్తు నీతిని మీకు అందించుటకు తండ్రి వర్ణించలేని కోరికతో ఎదురు చూస్తున్నాడు. మీరు ఈ బహుమానమును అంగీకరించినప్పుడు, ఆయన ఆనందానికి హద్దులు తెలియవు. ఆయన చాలా సంతోషించును, ఆయన ఆనందం కీర్తన రూపంలో పొంగిపొర్లుతుంది:

తాను మీకు విధించిన శిక్షను యహువః కొట్టివేసియున్నాడు;
మీ శత్రువులను ఆయన వెళ్లగొట్టియున్నాడు;
ఇశ్రాయేలుకు రాజైన యహువః మీ మధ్య ఉన్నాడు,
ఇక మీదట మీకు అపాయము సంభవింపదు.

నీ ఎలోహీం అయిన యహువః నీమధ్య ఉన్నాడు;
ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మును రక్షించును,
ఆయన బహు ఆనందముతో నీయందు సంతోషించును,
నీయందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి
నీయందలి సంతోషముచేత ఆయన హర్షించును. (జెఫన్యా 3:15 మరియు 17 చూడండి.)

ఈ బహుమానమును అంగీకరించండి మరియు మీరు యహూషువః యొక్క పరిపూర్ణతలో యహువః ముందు నిలబడతారు. అప్పుడు యహువః గానం చేయుచూ మీ యందు ఆనందించును.

స్తోత్రం