Print

యోహాను సువార్తకు ఉపోద్ఘాతం

ఇది WLC యేతర వ్యాసం. బయటి రచయితల వనరులను ఉపయోగించినప్పుడు, బైబిలుకు మరియు డబ్ల్యుఎల్‌సి ప్రస్తుత నమ్మకాలకు 100% అనుగుణంగా ఉండెనని భావించిన వాటిని మాత్రమే మేము ప్రచురిస్తాము. కాబట్టి అలాంటి వ్యాసాలను డబ్ల్యుఎల్‌సి నుండి నేరుగా వచ్చినట్లుగా పరిగణించవచ్చు. యహువః యొక్క అనేక మంది సేవకుల పరిచర్య ద్వారా మేము ఎంతగానో ఆశీర్వదించబడ్డాము. అయితే ఈ రచయితల యొక్క ఇతర రచనలను అన్వేషించమని మేము మా సభ్యులకు సలహా ఇవ్వము. అటువంటి రచనలు, లోపాలను కలిగి ఉన్నందున మేము వాటిని ప్రచురణల నుండి మినహాయించాము. విచారకరంగా, లోపం లేని మంత్రిత్వ శాఖను మనం ఇంకనూ కనుగొనలేదు. డబ్ల్యుఎల్‌సి వి కాని కొన్ని ప్రచురించబడిన వ్యాసాలు / ఎపిసోడ్లు చూసి మీరు దిగ్బ్రాంతి చెందినచో, సామెతలు 4:18 జ్ఞాపకం చేసుకోండి. మన మార్గంలో మరింత కాంతి వెలువడు కొద్దీ ఆయన సత్యాన్ని గూర్చిన మన అవగాహన అభివృద్ధి చెందుతూ ఉంటుంది. మేము సత్యాన్ని ప్రాణం కంటే ఎక్కువగా ఆదరిస్తాము మరియు అది దొరికిన చోటు ఏదైనా అక్కడ వెతుకుతాము.

ఆదియందు వాక్యముండెను

ఇటీవలి దశాబ్దాల్లో, గణనీయమైన సంఖ్యలో వేదాంతవేత్తలు యోహాను 1: 1 ఒకే వ్యక్తి కోసం అనగా, తండ్రి కోసం మాత్రమే చెప్పుచుండెననియు మరియు “వాక్యం” మరొక వ్యక్తి కాదనియు, అనగా యహూషువః క్రీస్తు కాదనియు; నిజానికి అది కీర్తన 33: 6 లో ఉన్నట్లుగా ఆదికాండపు సృష్టిని కలిగించిన యహువః మాట అని వర్ణించుచున్నారు: “యహువః వాక్కు చేత ఆకాశములు కలిగెను.” ఆదికాండము 1 మరియు యోహాను 1 మధ్య గల సమాంతరత స్పష్టంగా ఉంది. యహువః తన మాట ద్వారా సృష్టిని ఉనికిలోకి తెచ్చాడు. కొత్త సృష్టి యహువః కుమారుడైన యహూషువఃలో ప్రారంభించబడింది.

“వాక్యం” యొక్క హెబ్రీ పదం డావర్, అరామిక్ పదం మెమ్రా మరియు గ్రీకు లోగోస్ అనేవి కేవలం “వాక్యం” అను దాని కంటే ఎక్కువ అర్థాన్ని కలిగియున్నవి. అవి యహువః యొక్క స్వీయ-ప్రత్యక్షత, ఆయన స్వీయ వ్యక్తీకరణ గురించి మాట్లాడతాయి. అనేక నిఘంటువులు లోగోస్ అర్థాన్ని ఇలా చూపిస్తాయి: ఉచ్చారణ, ఆదేశం, ఆజ్ఞ, ప్రణాళిక, మనస్సు యొక్క వ్యక్తీకరణ, సృజనాత్మక ఆలోచన, ఉద్దేశ్యం, వాగ్దానం, సందేశం, జ్ఞానం లేదా కారణం. "వాక్యం" లోగోస్ కు సరియైన అనువాదం కాదు ఎందుకంటే లోగోస్ "ఆలోచన," "మాట" మరియు "చర్య" ను కలిగి ఉంటాయి. కాబట్టి “యహువః యొక్క సృజనాత్మక ఆలోచనలు కార్యాచరణలో వ్యక్తీకరించబడ్డాయి,” “యహువః వ్యక్తీకరించిన/ నిర్ణయించిన ఉద్దేశం లేదా ప్రణాళిక,” “యహువః యొక్క ఉద్దేశపూర్వక ఆదేశం”, ఇలాంటి పదబంధాలు లోగోస్ యొక్క అర్ధాన్ని మరింత ఖచ్చితంగా ప్రతిబింబిస్తాయి. కాబట్టి యోహాను, సాధారణ యూదుల పద్ధతిలో, యహువః యొక్క గొప్ప ప్రణాళిక — ఆయన ఉద్దేశ్యం మరియు ఆయన మనస్సు, ఆయన నిత్యజీవ కార్యక్రమం గురించి మాట్లాడాడు.

జీవవాక్యమును గూర్చినది, ఆదినుండి ఏది యుండెనో, మేమేది వింటిమో, కన్నులార ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో, అది మీకు తెలియజేయుచున్నాము‌ — ఆ జీవము ప్రత్యక్షమాయెను; తండ్రియొద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్యజీవమును మేము చూచి, ఆ జీవమునుగూర్చి సాక్ష్యమిచ్చుచు, దానిని మీకు తెలియ పరచుచున్నాము — మాతో కూడ మీకును సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకును తెలియజేయుచున్నాము. మన సహవాసమైతే తండ్రితో కూడను ఆయన కుమారుడైన యహూషువః క్రీస్తుతో కూడను ఉన్నది. (1 యోహాను 1: 1-3)

మన అవగాహనకు గొప్ప సహాయం యోహాను మొదటి పత్రిక యొక్క ఉపోద్ఘాతం/ముందుమాట లో కనుగొనబడింది, ఇది అతని సువార్త యొక్క ఉపోద్ఘాతంపై పాక్షిక వ్యాఖ్యానాన్ని అందిస్తుంది. 1 యోహాను 1: 1-3 నుండి “వాక్యం” అనేది మానవులకు నిత్యజీవమును లేదా “రాబోయే యుగం యొక్క జీవమును” ఇచ్చుటకు యహువః యొక్క నిర్ణయ ప్రణాళిక లేదా వాగ్దానం అని తెలుసుకున్నాము. కాబట్టి ఈ వాగ్దానం, ప్రకటించబడినన ప్రణాళిక లేదా ప్రణాళికాబద్ధమైన వ్యక్తీకరణ చర్య “మొదటి నుండి ఉండినది, మనం విన్నది, మనం చూసినది ... అది జీవ వాక్యాన్ని గూర్చినది ... ఆ జీవము ప్రత్యక్షమాయెను,” “కనిపించెను”, అంటే “రాబోవు యుగ జీవితాన్ని అందించుటకు నిర్ణయించిన ప్రణాళిక శరీరంగా మారినప్పుడు” శిష్యులు దానిని చూడగలరు మరియు తాకగలరు. ఇది అసలు సృష్టిని కలుగజేసిన యహువః యొక్క స్వీయ-వ్యక్తీకరణ చర్యలకు సమాంతరంగా ఉంటుంది.

యోహాను తన మొదటి లేఖలో ఇలా చెప్పాడు: “రాబోయే యుగం యొక్క జీవము/నిత్యజీవం యహువఃతో ఉన్నది” (1 యోహాను 1: 2). ఆ వివరణలో యోహాను దీనిని నిత్యజీవ వాగ్దానం అని, అది ప్రారంభంలో యహువఃతో ఉండెనని, అయితే, అది యహువః కుమారుడు కాదు అని చెప్పుచున్నాడు. కుమారుడు మరియ ద్వారా జన్మించినప్పుడు మాత్రమే ఉనికిలోకి వచ్చాడు.

ఈ ఉపోద్ఘాతం యహువఃకు మరియు "వాక్యానికి" మధ్య సంభాషణలను చూపించుటలేదు. యహూషువః జన్మించిన తరువాత యోహాను యహువః మరియు యహూషువః మధ్య చాలా సంభాషణలను నమోదు చేశాడు. ఇక్కడ "వాక్యం" యహువః నుండి వచ్చుచూ, వ్యక్తిగతంగా కనబడినప్పటికీ, యహూషువః జన్మించే వరకు యహువఃకు వేరుగా ఉన్న ప్రత్యేక వ్యక్తి మాత్రం కాదని ఇది మరింత నిరూపిస్తుంది.

మనం దాని అంతర్గత వివరాలను పరిశీలిస్తే అది ఈ ఉపోద్ఘాతాన్ని మరింతగా అర్థం చేసుకొనేలా మనకు సహాయపడుతుంది. ఇవి దాని వివిధ భాగాలను అర్థం చేసుకొనుటకు కావలసిన ఆధారాలను ఇస్తాయి. ఉదాహరణకు, యోహాను యొక్క సూచన, మిగతా కొత్త నిబంధన కూడా చెప్పినట్లు, “యహువః వలన జన్మించుట” అనగా (యోహాను 1:12, 13) క్రొత్త సృష్టిని చేయుటలోని యహువః యొక్క నిర్ణయాత్మక ప్రణాళిక అని చూచిస్తుంది. మరియు 18 వ వచనం “ఎవరును ఎప్పుడును యహువఃను చూడలేదు” అని చూపిస్తుంది మరియు అందువల్ల “యహువః యొక్క మోక్ష ప్రణాళిక” “వివరించబడుటకు,” బహిర్గతం చేయబడుటకు లేదా ప్రకటించబడుటకు (వ. 18) మానవ రూపంలో పంపబడుతుంది (వ.14). 17 వ వచనం ప్రకారం, అలాంటి ప్రత్యక్షత ధర్మశాస్త్రం ద్వారా పాక్షికంగా మాత్రమే సాధించబడింది, కాని కృప మరియు సత్యం మరియు యహువఃను గూర్చిన పూర్తి జ్ఞానం యహుషువః క్రీస్తు ద్వారా తెలియబడినవి.

ఆసక్తికరంగా, ఈ ఉపోద్ఘాతం సామెతలు 8: 22-30 తో అద్భుతమైన సమాంతరాలను కలిగి ఉంటుంది, ఇక్కడ జ్ఞానం వ్యక్తీకరించబడింది, కానీ ఎప్పుడూ భౌతికీకరించబడలేదు, అనగా, నిజమైన వ్యక్తి కాదు. యోహాను 1: 1 మరియు హెబ్రీయులకు రాసిన పత్రిక యొక్క పరిచయం మధ్య కూడా ఒక నిర్దిష్ట సారూప్యత ఉంది.

న్యూ అమెరికన్ బైబిలు కావ్య మరియు గద్య విన్యాసాన్ని ప్రదర్శిస్తుంది, ఇది యోహాను యొక్క ఉపోద్ఘాతాన్ని రూపిస్తుంది. ఉపోద్ఘాతం యొక్క కొంచెం భిన్నమైన కావ్య రూపాన్ని కాథలిక్ వేదాంత శాస్త్రవేత్త రేమండ్ బ్రౌన్ ఇలా పేర్కొన్నాడు: 1 వ పద్యం 1 మరియు 2 వచనాలు మరియు 3 వ పద్యం 10 నుండి 12 బి వచనాలు, 2 వ పద్యం 3 నుండి 5 వచనాలు, 4 వ పద్యం 14, 16 వచనాలు.

ఈ కావ్య కారకం మునుపటి కాలాల్లో గుర్తించబడనందున, ఉపోద్ఘాతం అక్షరానుసారంగా తీసుకోబడింది. ఇది 1-5 వచనాలలో వాక్యం యొక్క భౌతికీకరణకు దారితీసింది (అనగా, ఈ వాక్యాన్ని యహువఃకు వేరుగా ఉన్న వ్యక్తిగా మార్చడం). ఇది యోహాను ఉద్దేశం యొక్క అపార్థానికి దారితీసింది. ఒక సాహిత్య భాగం కవితా రూపంలో ఉన్నప్పుడు, అది సహజంగా రూపక భాషను కలిగి ఉంటుంది, ఈ సందర్భంలో ఇది వ్యక్తిత్వం యొక్క అలంకారిక భాష.

జెసూవిట్ స్కాలర్ రోజర్ హైట్ ఇలా వివరించాడు: “భౌతికీకరణ అంటే ఒక ఆలోచనను లేదా భావనను నిజమైన వస్తువుగా మార్చడం ... యూదుల గ్రంథాలలో కనిపించే మరియు యహువఃను సూచించే వివేకం, వాక్యం మరియు ఆత్మ అనే చిహ్నాలు భౌతికీకరణలు కాదు, వ్యక్తిత్వాలు ... ఒక వ్యక్తిత్వం భౌతికీకరణగా మారినప్పుడు ఒక పెద్ద మార్పు జరిగింది.” 1

ఆ పెద్ద మార్పు యోహాను యొక్క ఉద్దేశ్యాన్ని వక్రీకరించడానికి మరియు భగవంతునిలో రెండవ వ్యక్తిని సృష్టించడానికి దారితీసింది. ఏకదైవవాదం అణగదొక్కబడెను. యహువఃను ఇద్దరు వ్యక్తులుగా చేశారు మరియు అది ఒక విపత్తు.

యోహాను యొక్క ఉపోద్ఘాతంలో వ్యక్తిత్వం సముచితమే ఎందుకంటే యోహాను యొక్క మూలాలు హెబ్రీ / అరామిక్ సాహిత్యం, ఇక్కడ వ్యక్తిత్వం స్వేచ్చగా ఉపయోగించబడింది. ఉదాహరణకు, “వాక్యం” అని అనువదించబడిన డావర్ అనే హెబ్రీ పదం తరచుగా హెబ్రీ లేఖనాల్లో వ్యక్తీకరించబడింది (“ఆయన వాక్యము బహు వేగముగా పరుగెత్తును,” కీర్త. 147: 15). “వాక్యం” ఒక వ్యక్తిలాగా పరిగణించబడుతుంది, కానీ అది అక్షరాలా వ్యక్తి కాదు.

కాబట్టి వ్యక్తిగతమైన లోగోస్ యోహాను లేదా అతని పాఠకులకు కొత్త విషయం కాదు. లోగోస్ గ్రీకులో లింగం ప్రకారం, వ్యాకరణపరంగా అవి పుల్లింగముగా ఉండును, కానీ ఆంగ్లంలోకి అనువదించినప్పుడు అది లైంగికంగా పురుషత్వమని అర్థం కాదు. కాబట్టి, ఉదాహరణకు, ఫ్రెంచ్‌లో ఒక బల్ల స్త్రీలింగం గా ఉంటుంది కాని ఆంగ్లంలో అది “ఆమె” కాదు! ఒక పదం, “అది.” “సమస్తమును దాని ద్వారానే కలిగెను” (వాక్యం, వచనం 3).

“యోహాను 1: 1 ని ‘ఆదియందు కుమారుడు ఉండెను’ గా చదవడం, స్పష్టంగా తప్పు.” -డా. కోలిన్ బ్రౌన్

లోగోస్ అనే గ్రీకు పదం LXX (పాత నిబంధన యొక్క గ్రీకు భాషాంతరంలో) లో 1500 సార్లు కనిపిస్తుంది. ఇది అక్షరానుసార వ్యక్తిని ఎప్పుడూ వర్ణించదు. ఇది క్రైస్తవ గ్రంథాలలో 300 కన్నా ఎక్కువ సార్లు కనిపిస్తుంది మరియు యోహాను 1 లో మాత్రమే ఒక వ్యక్తిగా (తప్పుగా) పెద్ద అక్షరం చేయబడింది. పెద్ద అక్షరం అనువాదకుల సంపాదకీయ కూర్పుగా ఉంది. (ప్రకటన 19:13 లో “Word”/వాక్యానికి హేతుబద్ధంగా పెద్ద అక్షరం వాడబడింది, ఇక్కడ యహూషువః రెండవ రాకడలో, “Word”/వాక్యం", అప్పుడు ఒక వ్యక్తిగా ఉంటుంది.) ఫుల్లర్ సెమినరీకి చెందిన డాక్టర్ కోలిన్ బ్రౌన్ ఇలా వ్యాఖ్యానించాడు: “యోహాను 1: 1 ని ‘ఆదియందు కుమారుడు ఉండెను’ గా చదవడం, స్పష్టంగా తప్పు.”

వేదాంతశాస్త్ర ప్రొఫెసర్ హైడెల్బర్గ్ హెచ్.హెచ్. వెండ్ట్ ఇలా అంటాడు: ఫిలో యొక్క అర్ధం నుండి ‘word’/“వాక్యాన్ని ... ముందుగా ఉన్న వ్యక్తి అని మనము వాదించకూడదు.” మరో మాటలో చెప్పాలంటే, మనము యూదా తత్వవేత్త ఫిలోను అనుసరించాల్సిన అవసరం లేదు మరియు వాక్యాన్ని ప్రత్యేకమైన వ్యక్తిత్వంగా భావించాల్సిన అవసరం లేదు.

వేదాంత ప్రొఫెసర్ జేమ్స్ డున్ ఇలా అంటాడు, "[యోహాను 1] పద్యం యొక్క ప్రారంభ దశలలో, మనము ఇంకా వివేకంతో వ్యవహరిస్తున్నాము ... వ్యక్తిగత జీవిగా కాదు, యహువః యొక్క జ్ఞానమైన మాటలు వ్యక్తీకరించబడినట్లు."

మరలా రోజర్ హైట్ ఇలా అంటాడు: “ఒక విషయం నిశ్చయం. యోహాను యొక్క ఉపోద్ఘాతం ఒక దైవిక వ్యక్తి యొక్క ప్రత్యక్ష వివరణాత్మక జ్ఞానాన్ని సూచించదు అనగా, వాక్యం అని పిలువబడుతూ, అది తిరిగి మానవునిగా దిగి వచ్చెనని సూచించదు. ఒక రూపకాన్ని అక్షరానుసార మాటగా చదవడం తప్పుడు విధానం.”

మన అవగాహనను ప్రారంభ సంఘ ఫాదర్లు కొందరు కలిగియున్నారు. యోహాను గురించి ఆరిజెన్ యొక్క వ్యాఖ్యానం ఇలా చెబుతోంది: "లోగోస్ - తండ్రి చెప్పిన మాటగా మాత్రమే ఉండి, అది యహూషువః గర్భం దాల్చబడినప్పుడు కుమారునిలో వ్యక్తమైనది." టెర్టూలియన్ (155-230) లోగోస్ ను “వాక్యం” అని అనువదిస్తూ ఇలా చెప్పాడు: “ప్రత్యక్షతా వాక్యం యహువఃతో ఉందని [యోహాను 1] చెప్పడం మన ప్రజల సాధారణ విధానం.” ఈ అభిప్రాయం స్పెయిన్ మరియు దక్షిణ గౌల్‌లో కనీసం 7 వ శతాబ్దం వరకు ఉండిపోయింది.

కింగ్-జేమ్స్-వెర్షన్-బైబిల్-మొదటి-ఎడిషన్-టైటిల్-పేజి 1611.png1611 కెజెవి కి ముందుటి అనువాదాలకు సంబంధించి, ఏడు ప్రధాన అనువాదాలు వాక్యం/word లో చిన్న అక్షరం “w” ను ఉపయోగించాయి మరియు 1611 తరువాత అనేక అనువాదాలు ఉన్నాయి, ఇవి యోహాను 1: 1 లో రెండవ వ్యక్తిని గురించి మాట్లాడలేదు (ఉదా. కాంకర్డెంట్, డయాగ్లోట్, యూదు చరిత్రకారుడు హ్యూ జె. స్కోన్‌ఫీల్డ్ యొక్క 1985 అనువాదం మరియు రాబర్ట్ డబ్ల్యూ. ఫంక్ యొక్క 1993 అనువాదం).

ఆధునిక ఆంగ్ల ఉదాహరణలు:

“ఆదియందు యహువః తనను తాను వ్యక్తం చేసుకున్నాడు. ఆ వ్యక్తిగత వ్యక్తీకరణ, ఆ వాక్యం, యహువఃతో ఉండెను మరియు యహువఃయై ఉండెను ”(J.B. ఫిలిప్స్).

“ఆదియందు ఉద్దేశ్యం ఉండెను, అది యహువః మనస్సులో ఉన్న ఉద్దేశ్యం, అది యహువః యొక్క సొంత ఉనికి ... ఈ ఉద్దేశ్యం యహూషువఃలో మానవ రూపాన్ని సంతరించుకుంది” (జి.బి. కైర్డ్, క్రొత్త నిబంధన వేదాంతశాస్త్రం).

“ఆదియందు దైవిక వాక్యం మరియు జ్ఞానం ఉండెను. దైవిక వాక్యం మరియు జ్ఞానం యహువఃతో ఉండెను. ఇది మొదటి నుండి యహువఃతో ఉండెను. సమస్తమూ దాని ద్వారానే కలిగెను. ”(రాబర్ట్ ఫంక్).

పై వాటి నుండి 1a వచనం యొక్క సరైన అనువాదం ఇలా ఉంటుంది: “ఆదియందు నిర్ణయాత్మక ప్రణాళిక మరియు ఉద్దేశ్యం యహువఃతో ఉండెను.”

ఈ పద్యం “మెట్ల సమాంతరత/staircase parallelism” రూపంలో అమర్చబడిందనేది గమనించదగినది, దీనిలో ఒక పదబంధం యొక్క చివరి పదం తరువాతి పదబంధం యొక్క మొదటి పదం అవుతూ చివరికి ముగింపుకు వెళ్ళును.

1 వ వచనంపై మరిన్ని అనువాద వ్యాఖ్యలు క్రింద ఉన్నాయి.

1 బి వచనం: “మరియు నిర్ణయాత్మక ఉద్దేశ్యం యహువః స్వభావం.”

వ్యాకరణపరంగా దీనిని "ఆ వాక్యం యహువఃయై ఉండెను" లేదా "ఆ వాక్యం యహువః వలె ఉండెను" (యహువః యొక్క సొంత స్వభావం మరియు గుణం లేదా "దైవికం") అని అనువదించవచ్చు. “ఖచ్చితమైన ఆర్టికల్ లేకపోవడం గుర్తింపునకు బదులు తెలుపుటను సూచిస్తుంది” (NAB గమనికలు). అనగా, ఈ వాక్యానికి యహువః గుణం ఉందని అర్థం. ఇది యహువఃతో సమానంగా లేదు.

ఫిలిప్ హార్నర్ యొక్క “క్వాంటిటేటివ్ అనాథ్రస్ ప్రిడికేట్ నౌన్స్” అనే వ్యాసంలో “క్రియకు ముందు ఉండే ఆర్టికల్స్ లేకుండా ఉండే నామవాచకాలు [యోహాను 1: 1 లోని థియోస్ యొక్క రెండవ ప్రస్తావన ఒక ఉదాహరణ] ప్రధానంగా కర్త యొక్క స్వభావాన్ని లేదా గుణాన్ని వ్యక్తీకరించుటకు పని చేయవచ్చు అని చెప్పెను .. తెలుపుట యొక్క గుణాత్మక శక్తి చాలా ప్రాముఖ్యమైనది మరియు నామవాచకం ఖచ్చితమైనదిగా పరిగణించబడదు.” గ్రీకు క్రొత్త నిబంధన యొక్క డానా మరియు మాంటీ మాన్యువల్ వ్యాకరణం కూడా ఇదే విషయాన్ని తెలియజేస్తుంది. ఇది యుబిఎస్ హ్యాండ్‌బుక్ సిరీస్ చెప్పినట్లు చెబుతోంది: “యహువఃకి ముందు ఆర్టికల్ లేనందున,' యహువః 'స్పష్టంగా "తెలుపుట" అవగా 'వాక్యం' "కర్త" అవుతుంది. అనగా ఇక్కడ యహువః ఒక విశేషణానికి సమానం, మరియు అలా వాక్యం యహువః మాదిరిగానే ఉంది’ అని అన్వయించడాన్ని సమర్థిస్తుంది.” ఈ క్రింది అనువాదాలు ఈ వ్యాకరణ అంశాన్ని ప్రతిబింబిస్తాయి:

“వాక్యం యహువఃతో ఉండి ఆయన స్వభావాన్ని కలిగియుండెను” (ది ట్రాన్స్లేటర్స్ ట్రాన్స్లేషన్).

“మరియు యహువఃయే, వాక్యం” (రివైజ్డ్ ఇంగ్లీష్ బైబిల్).

“వాక్యం యొక్క స్వభావం యహువః స్వభావం వలె ఉండెను” (బార్క్లే).

“వాక్యం దైవికమై ఉండెను” (మోఫాట్, స్మిత్ మరియు గుడ్‌స్పీడ్ కూడా).

“వాక్యం” రెండవ వ్యక్తి అని అర్ధం చేసుకున్నట్లైతే “వాక్యమే యహువః” అనే పదబంధంలో “వాక్యానికి/word” కి పెద్ద అక్షరం వాడుటలో ఎటువంటి సమర్థన లేదు. యహువఃతో ఒకరికి-ఒకరి-పోలిక తప్పు, ఎందుకంటే ఇది లేఖనాల్లోని ఏకీకృత ఏకదైవవాదాన్ని (యహువః ఒక వ్యక్తి) నాశనం చేస్తుంది. "మనకు ఒక్కడే యహువః, ఆయన తండ్రి" (1 కొరిం. 8: 6. అలాగే యోహాను 17: 1, 3 మరియు 1 తిమో. 2: 5).

అలాగే, (యెహోవా సాక్షుల అనువాదం అయిన) “ఒక దేవుడు” అనువాదం వ్యాకరణపరంగా తప్పు మరియు పదబంధంలోని గుణాత్మక అంశాన్ని బయటకు తీసుకురావడంలో విఫలమైంది. “ఇటువంటి అనువాదం భయంకరమైన తప్పుడు అనువాదం” (బ్రూస్ మెట్జెర్). ఇది వేదాంతపరంగా కూడా తప్పు, ఎందుకంటే ద్వితీయోపదేశకాండము 32:39 ఇలా చెబుతోంది: “నేను తప్ప వేరొక దేవుడు లేడు.” యోహాను "దైవిక" అని చెప్పాలనుకుంటే, అతడు థియోస్ అనే గ్రీకు పదాన్ని ఉపయోగించగలడు. ఇంకా “దైవిక” బలహీనంగా ఉన్నప్పటికీ, అర్థాన్ని వ్యక్తపరుస్తుంది.

యోహాను తాత్పర్యం

ఆదినుండి యహువఃకు ఒక ఉద్దేశ్యం ఉండెనని చూపించుటకు యోహాను తన ఉపోద్ఘాతాన్ని వ్రాస్తున్నాడు. ఉద్దేశ్యం పూర్తి అయ్యేవరకు ఆఖరి వరకు యోహాను ఈ ఉద్దేశ్యం ముందుకు ప్రయాణించుటను చూపిస్తాడు (యోహాను 1:14). ఆ ఉద్దేశ్యం మానవ యహూషువః అయ్యాడు.

ఆదినుండి యహువఃకు ఒక ఉద్దేశ్యం ఉండెనని చూపించుటకు యోహాను తన ఉపోద్ఘాతాన్ని వ్రాస్తున్నాడు. ఉద్దేశ్యం పూర్తి అయ్యేవరకు ఆఖరి వరకు యోహాను ఈ ఉద్దేశ్యం ముందుకు ప్రయాణించుటను చూపిస్తాడు (యోహాను 1:14). ఆ ఉద్దేశ్యం మానవ యహూషువః ఆయెను.

"ఉపోద్ఘాతం అంతర్గతంగా క్రియాశీల కదలికను కలిగి ఉంది మరియు అది దాని సొంత కేంద్ర బిందువును నిర్ణయిస్తుంది. ఇది విశ్వవ్యాప్తంగా ప్రారంభమై స్పష్టమైన మార్గంలో ముగుస్తుంది." (కుషెల్).

ముందుకు గల ఈ కదలిక 14 వ వచనం వైపుకు నెట్టినట్లు అనిపిస్తుంది, ఇది ఉపోద్ఘాతం యొక్క ముగింపు స్థానం. కాబట్టి ప్రారంభంలో “వాక్యం” కేవలం స్వల్ప వ్యక్తీకరణతో చిత్రీకరించబడింది.

యహూషువః యొక్క వాస్తవ వ్యక్తిగత భౌతిక రూపం కనిపించుటకు ఈ కావ్యం 14 వ వచనానికి నడిపించేటప్పుడు 10-12 వచనాల ద్వారా వ్యక్తీకరణ బలపడుతుంది. ఇది విశ్వవ్యాప్తత నుండి క్రమంగా తన దృష్టిని తగ్గిస్తుంది: “ఆదియందు” నుండి (వచనాలు 1, 2, 3a) క్రమంగా "లోకమాయనను (మానవ జాతి) ... తెలుసుకొనలేదు" వరకు తగ్గెను (వచనాలు 3b-5, 10), మరింత తగ్గుతూ "ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు" వరకు (వచనం 11), మళ్లీ ఇంకా తగ్గుతూ "ఆయనను అంగీకరించిన వారి" యొద్దకు వచ్చెను” (వచనాలు 12, 13). చివరగా దృష్టి “వాక్యం శరీరధారిగా మారుట” వరకు తగ్గించబడెను (వచనాలు 14a). 14b, 16 మరియు 17 వ వచనాలు ప్రత్యేకంగా జన్మించిన కుమారునియందు ఉనికిలో ఉన్న యహువః ప్రణాళికలోని చివరి దశ యొక్క ఆధిపత్యాన్ని చూపుతాయి. ఈ దశ మోషే (తోరా) ద్వారా వచ్చిన మునుపటి దశ కంటే గొప్పది. ఈ ప్రత్యేకమైన కుమారుని ద్వారా మాత్రమే, యహువః పూర్తిగా వెల్లడాయెనని 18 వ వచనం చూపిస్తుంది. ఈ నేపథ్యంతో మనం ఇప్పుడు యోహాను సువార్త‌ యొక్క ఉపోద్ఘాతంపై మన అవగాహనను ప్రదర్శించగలము.

వ్యక్తి కాని వాక్యం వ్యక్తిగతీకరించబడెను.

1 మరియు 2 వచనాలు: కావ్యం యొక్క 1 వ పద్యం

"ఆదియందు నిర్ణయాత్మక ఉద్దేశ్యం ఉండెను, ఆ ఉద్దేశ్యం యహువఃతో ఉండెను, ఆ ఉద్దేశ్యం యహువః యొక్క స్వభావమై ఉండెను. అది ఆదియందు యహువఃతో కూడ ఉండెను."

"ఆదియందు" అనేది ఆదికాండపు సృష్టిని నేరుగా సూచించుట లేదు, కానీ మానవులను నిత్యజీవానికి శక్తిగల అభ్యర్థులుగా మార్చుటకు యహువః ఒక ఉద్దేశ్యాన్ని కలిగియున్న ఆ సృష్టి ముందటి కాలాన్ని సూచిస్తుంది. “ఆదియందు” లో క్రొత్త సృష్టి‌ మోక్షానికి సంబంధించిన పదాలు కూడా ఉన్నాయి (వచనం 13).

"యహువఃతో ఉండెను" అనే పదానికి అర్ధం యోబు 27: 11 లో ఉన్నట్లుగా అది (వాక్యం) ఆయనతో ఉద్భవించింది: "సర్వశక్తుడు చేయు క్రియలను [జ్ఞానం] నేను దాచిపెట్టను." 3-5 వచనాలు: 2 వ పద్యం

"సమస్తమును [విశ్వం] దాని మూలముగా కలిగెను, కలిగియున్నదేదియు అది లేకుండ కలుగలేదు. దానిలో జీవముండెను [రాబోవు లోకంలో, నిత్యజీవము]; ఆ జీవము మనుష్యులకు వెలుగైయుండెను. ఆ వెలుగు [యహువః ఉద్దేశ్యం యొక్క సత్యము] చీకటిలో [ఏదేనులో మొదలైన సాతాను యొక్క అసత్యాలు] ప్రకాశించుచున్నది గాని చీకటి దాని గ్రహింపకుండెను. [ఆదికాండం 3:15 మరియు తరువాత].”

1611 KJV2 కి ముందు మరియు కొన్ని ఆధునిక అనువాదాలలో 3, 4 వ వచనాలను, డియా ఆటో [dia autou] ను "ఆయన మూలముగా" అని కాకుండా "దాని మూలముగా" అని అనువదించారు. "వాక్యం" కోసం "అది/దాని" అనే సర్వనామం ఉపయోగించడం సముచితం ఎందుకంటే కావ్యం ఎప్పటికీ బలపరిచే వ్యక్తీకరణతో ముందుకు కదులుతుంది. చివరగా ఈ వాక్యం యహూషువః గా అవుతుంది. 1 వ మరియు 2 వ పద్యాలలో “వ్యక్తి కాని వాక్యం” ను “వెలుగు” యొక్క దగ్గరి పర్యాయపదంగా చెప్పవచ్చు, ఇది "అది/దాని" అనే తటస్థ సర్వనామాన్ని కూడా తీసుకుంటుంది.

ఆయన వాక్యము

గమనిక: రేమండ్ బ్రౌన్ ఇలా వ్యాఖ్యానించాడు, “జో/zoe (జీవం) అనే గ్రీకు పదం యోహాను రచనలలో సహజ జీవితం అని ఎప్పుడూ అర్ధం కాదు” మరియు “ఉపోద్ఘాతం నిత్యజీవం కోసం మాట్లాడుతుంది.” అనగా “రాబోయే యుగంలో జీవితం,” భవిష్యత్ రాజ్యంలో జీవితం, దానిని ఇప్పుడు ఆత్మ ద్వారా రుచి చూడవచ్చు.

మొదటి గద్య విభాగం

6-9, 12 , 13 మరియు 15, 17 మరియు 18 వచనాలు అప్పటికే నిర్మించబడిన పద్యాన్ని చొప్పించిన గద్యం కావచ్చు.

6 వ వచనం: “యహువః యొద్ద నుండి పంపబడిన యొక మనుష్యుడు ఉండెను; అతని పేరు యోహాను.”

8 వ వచనం: “అతడు ఆ వెలుగైయుండ లేదు గాని ఆ వెలుగును గూర్చి సాక్ష్యమిచ్చుటకు వచ్చెను.

9 వ వచనం: “నిజమైన వెలుగు ఉండెను [యహూషువః ద్వారా యహువః యొక్క స్వీయ-ప్రత్యక్షత]; అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది.” (వర్డ్ బైబిల్ కామెంటరీ ప్రకారం యూదులలో ఒక సాధారణ పదబంధం).

వాక్యం యొక్క వ్యక్తీకరణ బలమైన 3 వ పద్యం అవుతుంది

10 వ వచనం: “ఆయన [వాక్యం, యహువః యొక్క వ్యక్తీకరణ ఉద్దేశ్యం] లోకము [మానవజాతి, కోస్మోస్] లో ఉండెను, లోక మాయన మూలముగా కలిగెను గాని లోకమాయనను తెలిసికొనలేదు.

11 వ వచనం: “ఆయన [యాహువా యొక్క ఉద్దేశ్యం వ్యక్తీకరించబడింది, శరీరం ధరించిన ఉద్దేశ్యం ఇప్పుడు కనిపించెను] తన స్వకీయుల [ఇశ్రాయేలు] యొద్దకు వచ్చెను [ధర్మశాస్త్రం ద్వారా]; ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు.

యహువః యొక్క ఉద్దేశ్యం గతంలో తోరా రూపంలో ఇశ్రాయేలీయుల ద్వారా తిరస్కరించబడెను అనే ప్రత్యక్షతతో వ్యక్తీకరణను మరింత బలోపేతం చేయుట ద్వారా పద్యం ఈ ముగింపు దిశగా మరొక దశకు వెళుతుంది. ఏది ఏమయినప్పటికీ, 9 వ వచనంలో “నిజమైన వెలుగు” ను ఆయన ప్రవేశపెట్టినందున, యహూషువః, యహువః యొక్క శరీరం ధరించిన ఉద్దేశ్యం వలె, ఇశ్రాయేలీయుల యొద్దకు వచ్చాడని మరియు అంగీకరించబడలేదని చూపించుట యోహాను యొక్క ఉద్దేశం కావచ్చు. తద్వారా యోహాను 14 వ వచనంలోని అంతిమ ప్రకటనకు మమ్మల్ని సిద్ధం చేస్తున్నాడు.

12 వ వచనం: “తన్ను ఎందరంగీకరించిరో [వెలిగింపబడిన మనుష్యులు] వారికందరికి, అనగా తన నామమునందు విశ్వాసముంచిన [మెస్సీయ‌‌ యొద్దకు నడిపించిన వారి బోధకుడైన తోరాను ఆచరించుట ద్వారా] వారికి, దేవుని పిల్లలగుటకు ఆయన [యహువః వ్యక్తీకరించబడిన ఉద్దేశ్యం] అధికారము [తద్వారా వారు మెస్సీయను అంగీకరిస్తారు] అనుగ్రహించెను.

రెండవ గద్య విభాగం

వచనం: 12c: “ఆయన నామమును విశ్వసించేవారికి” (అనగా ఆయనయందు, శరీరధారియైన “ఉద్దేశ్యం” పై నమ్మిక ఉంచుట)

వచనం 13: “వారు దేవునివలన పుట్టినవారే గాని, రక్తమువలననైనను శరీరేచ్ఛవలననైనను మానుషేచ్ఛవలననైనను పుట్టినవారు కారు. (“పైనుండి పుట్టినవారు,” NAB).

“14 వ వచనం‌ తరువాత మాత్రమే మనం వ్యక్తిగత లోగోస్ గురించి మాట్లాడగలం. 14 వ వచనానికి ముందు మనం జ్ఞానము మరియు లోగోస్ విషయంలో క్రైస్తవ-పూర్వ సంఘాల మాదిరిగానే ఉన్నాము ... వ్యక్తుల కంటే వ్యక్తిత్వాలతో వ్యవహరించడం, అనగా వ్యక్తిగత దైవిక వ్యక్తి కాకుండా యహువః యొక్క వ్యక్తిగతీకరించిన క్రియలు." 3

కుషెల్ ఇలా అంగీకరించెను: “10 వ వచనం నుండి మాత్రమే లోగోస్ ఎనార్కోస్ గురించి మాట్లాడవచ్చు [అనగా. మానవుడైన, యహూషువః]. కానీ ‘ఈ వాక్యం శరీరధారిగా మారెను’ అని మొదటిగా 14 వ వచనం ‘క్రైస్తవ’ పరంగా స్పష్టం స్పష్టం చేస్తుంది మరియు తద్వారా లోగోస్ అసార్కోస్‌ను ఒక నిర్దిష్ట వ్యక్తితో గుర్తిస్తుంది.”

శరీరం ధరించిన వాక్యం గురించి ఆఖరి వివరణ

4 వ మరియు చివరి పద్యం

14 వ వచనం: యహువః యొక్క నిర్ణయాత్మక ఉద్దేశ్యం మర్త్యమైన మనిషిగా మారెను మరియు శరీరధారియై [ఆయన ప్రజలలో యహువః యొక్క క్రొత్త సన్నిధి రూపం వలె] మనమధ్య నివసించెను; తండ్రివలన కలిగిన అద్వి తీయకుమారుని మహిమవలె మనము ఆయన మహిమను [శరీరం ధరించిన యహువః ఉద్దేశ్యమును] కనుగొంటిమి.

16 వ వచనం: “ఆయన పరిపూర్ణతలో నుండి మనమందరము కృప [తోరా నెరవేరిన తర్వాత అది మసకబారుతుంది] వెంబడి కృపను [17 వ వచనం యహూషువః ద్వారా క్రొత్త నిబంధనకు దారితీసింది] పొందితిమి." (లేదా ఎన్ఐవి ప్రకారం “కృప వెంబడి కృపను పొందితిమి” లేదా ఎన్‌జెబి ప్రకారం “ఒక బహుమానము మరొకదానిని భర్తీ చేస్తుంది.”)

ఆఖరి గద్య విభాగం

17, 18 వచనాలు: .ధర్మశాస్త్రము మోషేద్వారా అను గ్రహింపబడెను; కృపయు సత్యమును యహూషువః క్రీస్తుద్వారా కలిగెను. ఎవడును ఎప్పుడైనను యహువఃను చూడలేదు; తండ్రి హృదయానికి సమీపంగా [ఎన్‌జెబి మరియు ఎన్‌ఆర్‌ఎస్‌వి] ఉన్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలు పరచెను.

క్లుప్తంగా

లోగోస్ యొక్క అర్ధాన్ని వ్యక్తీకరించడానికి “వాక్యం” అనే పదం సరిపోదని మరియు ఉపోద్ఘాతం యొక్క పెద్ద భాగం కావ్యం అని అర్థం చేసుకోవడం చాలా సహాయకారిగా ఉంటుంది, ఇది సామెతలు 8 (“జ్ఞానం”) యొక్క సమాంతర వాక్యాలలో ఉన్నట్లుగానే “వాక్యం” కోసం రూపక అర్ధం యొక్క బలమైన సంభావ్యతను సూచిస్తుంది. అలాగే, కుషెల్ చెప్పినట్లుగా, "ఉపోద్ఘాతం అంతర్గతంగా క్రియాశీల కదలికను కలిగి ఉంటుంది మరియు అది దాని సొంత కేంద్ర బిందువును నిర్ణయిస్తుంది. ఇది విశ్వవ్యాప్తంగా ప్రారంభమై స్పష్టమైన మార్గంలో ముగుస్తుంది.” ఇది ఉపోద్ఘాతం యొక్క ఏదైనా మునుపటి దశకు తిరిగి వెళ్లుటను నిజంగా కష్టతరం చేస్తుంది. 14 వ వచనం నుండి మాత్రమే వాక్యం యహుషువఃగా మారెనని కావ్యంలో ఇటువంటి (ముందుకు) కదలిక తెలియజేస్తుంది, మనం అభిప్రాయపడినట్లు 11 వ వచనం కంటే ముందు కాదు - దీనిని బట్టి యోహాను 1: 1 వద్ద ముందస్తు ఉనికిలో గల వ్యక్తి ఉండుట అసాధ్యం. అలా అయితే రెండవ వ్యక్తి, అనగా యహువః, మిగిలిన లేఖనలకు విరుద్ధంగా ఉంటూ మరియు యోహాను 17: 3 లోని యహూషువఃకి విరుద్ధంగా ఉంటాడు. “అద్వితీయ సత్య ఎలోహీమ్ అయిన నిన్ను...”

ప్రసిద్ధ ప్రొఫెసర్ NT T.W. మాన్సన్ మన ఆలోచనను ఇలా చక్కగా చెబుతున్నాడు: “యోహాను లోగోస్ ను వ్యక్తిగా భావించాడా అనే సందేహం నాకు చాలా ఉంది. సన్నివేశంలో ఉన్న ఏకైక వ్యక్తిత్వం నజరేతుకు చెందిన యోసేపు కుమారుడైన యహూషువః. ఆ వ్యక్తిలో లోగోస్ ను పూర్తిగా శరీరం ధరిస్తూ, తద్వారా యహూషువః యహువః యొక్క పూర్తి ప్రత్యక్షతగా మారతాడు. కానీ మనం "ధరించెను' అనే పదాన్ని ఏ కోణంలో ఉపయోగిస్తున్నాం? ... యోహాను ప్రకారం యహూషువః యొక్క ప్రతి మాట ప్రభువు మాట.” 4

బైబిలు పఠనం


1 జీసస్: సింబల్ ఆఫ్ గాడ్, పే. 257.

2 వైక్లిఫ్ యొక్క అనువాదం మినహాయింపు. ఇది లాటిన్ నుండి వచ్చింది గ్రీకు భాష నుండి కాదు.

3 జేమ్స్ డన్, క్రిస్టాలజీ ఇన్ ది మేకింగ్, పే. 243.

4 ఆన్ పాల్ మరియు జాన్, పే. 156.


ఇది రే ఫెయిర్‌క్లాత్ (ఫోకస్ ఆన్ ది కింగ్‌డమ్, ఆగస్టు, 2006) రాసిన కథనం. WLC కథనం కాదు.

మేము అసలు వ్యాసం నుండి సమస్త అన్య నామములను మరియు తండ్రి - కుమారుడు అనే శీర్షికలను తొలగించి, వాటి స్థానాన్ని అసలు నామములతో భర్తీ చేసాము. ఇంకా, ఇక్కడ ఇవ్వబడిన లేఖనాలలో తండ్రి మరియు కుమారుని నామములను బైబిల్ యొక్క మొదటి ప్రేరేపిత రచయితలచే వ్రాయబడిన విధంగా మేము పునరుద్ధరించాము. -డబ్ల్యుఎల్‌సి బృందం.