Print

రాబోయే యహువః రాజ్యం యొక్క నిజమైన సువార్తను తిరిగి పొందడం

ఇది WLC యేతర వ్యాసం. బయటి రచయితల వనరులను ఉపయోగించినప్పుడు, బైబిలుకు మరియు డబ్ల్యుఎల్‌సి ప్రస్తుత నమ్మకాలకు 100% అనుగుణంగా ఉండెనని భావించిన వాటిని మాత్రమే మేము ప్రచురిస్తాము. కాబట్టి అలాంటి వ్యాసాలను డబ్ల్యుఎల్‌సి నుండి నేరుగా వచ్చినట్లుగా పరిగణించవచ్చు. యహువః యొక్క అనేక మంది సేవకుల పరిచర్య ద్వారా మేము ఎంతగానో ఆశీర్వదించబడ్డాము. అయితే ఈ రచయితల యొక్క ఇతర రచనలను అన్వేషించమని మేము మా సభ్యులకు సలహా ఇవ్వము. అటువంటి రచనలు, లోపాలను కలిగి ఉన్నందున మేము వాటిని ప్రచురణల నుండి మినహాయించాము. విచారకరంగా, లోపం లేని మంత్రిత్వ శాఖను మనం ఇంకనూ కనుగొనలేదు. డబ్ల్యుఎల్‌సి వి కాని కొన్ని ప్రచురించబడిన వ్యాసాలు / ఎపిసోడ్లు చూసి మీరు దిగ్బ్రాంతి చెందినచో, సామెతలు 4:18 జ్ఞాపకం చేసుకోండి. మన మార్గంలో మరింత కాంతి వెలువడు కొద్దీ ఆయన సత్యాన్ని గూర్చిన మన అవగాహన అభివృద్ధి చెందుతూ ఉంటుంది. మేము సత్యాన్ని ప్రాణం కంటే ఎక్కువగా ఆదరిస్తాము మరియు అది దొరికిన చోటు ఏదైనా అక్కడ వెతుకుతాము.

పరిణితి చెందిన జంట

యహువః మానవులను ఎందుకు సృష్టించాడు? ఆయన మనల్ని ఏ ఉద్దేశ్యంతో చేసాడు? అన్నింటిలో అత్యంత ప్రాథమికమైన ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ ఆలోచిస్తూ, చర్చిస్తూ, తర్కిస్తూ ఉండాలని మీరు ఆశించవచ్చు. కానీ వారు అలా లేరు! ప్రజల మరియు సంఘ మనస్సు కూడా ఇతర విషయాలపై ఉంది. మానవ సమాజంలో సాతాను చేసిన మోసం అలాంటిది.

మరియు నిజంగా యహువఃకు ఒక ఉద్దేశ్యం ఉంటే, దానిని అమలు చేయడానికి ఆయన ప్రణాళిక ఏమిటి? మీ గమ్యాన్ని తెలుసుకోవడం కంటే మీరు కలిగి ఉండాల్సిన ఎక్కువ ప్రాధమిక సమాచారం ఏదైనా ఉందా? పోల్చి చూసినప్పుడు సమస్త ఇతర జ్ఞానం మరియు కృషి ఖచ్చితంగా తేలిపోతుంది. మీకు దగ్గరగా ఉన్న వారితో లేదా మీరు రోజువారీ కలుసుకునే ఇతరులతో చర్చకు ప్రారంభంగా దీన్ని ఉపయోగించండి.

బైబిలులో ఒక ప్రముఖ వ్యక్తి, యహువః తన స్వంత హృదయాలనుసారుడుగా చెప్పుకున్న వ్యక్తి, తన ఉనికికి సంబంధించిన ప్రశ్నకు అత్యధిక ప్రాధాన్యతనిచ్చాడని తెలుసుకొనుటలో ఆశ్చర్యం లేదు. చరిత్రలో అత్యంత శక్తివంతమైన వ్యక్తులలో ఒకడైన దావీదు రాజు, అతని (మరియు మన) అంతిమ విధిని తెలిసికొనుట ద్వారా తగ్గించుకున్నాడు. దాదాపు 3,000 సంవత్సరాల క్రితం ఇశ్రాయేలు రాజు ఒక నక్షత్రాల రాత్రిని చూస్తూ, విశాల విశ్వాన్ని సృష్టించిన సృష్టికర్త ఈ చిన్న గ్రహం మీద మిక్కిలి అల్పమైన మానవులుగా అనిపించే మన కోసం చేసిన ప్రణాళిక విషయంలో తన విస్మయాన్ని మరియు ఆశ్చర్యాన్ని ప్రకటించాడు:

“నీ చేతిపనియైన నీ ఆకాశములను నీవు కలుగజేసిన చంద్రనక్షత్రములను నేను చూడగా, నీవు మనుష్యుని జ్ఞాపకము చేసికొనుటకు వాడేపాటి వాడు? నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటివాడు? దేవదూతలకంటె (KJV) వానిని కొంచెము తక్కువవానిగా చేసియున్నావు. మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసి యున్నావు. నీ చేతిపనుల మీద వానికి అధికారమిచ్చి యున్నావు.” (కీర్తనల గ్రంథము. 8:3-6).

దాదాపు 1,000 సంవత్సరాల తర్వాత, కొత్త నిబంధనలోని హెబ్రీయులకు పత్రిక రచయిత దావీదు యొక్క ఈ ప్రోత్సాహకరమైన మరియు సానుకూల ప్రకటనను పునరావృతం చేసాడు, కానీ ఇది మన తాత్కాలిక నిరోధమును తెలియజేస్తుంది: “ఆయన [యహువః] సమస్తమును లోపరచినప్పుడు వానికి [మానవజాతికి] లోపరచకుండ దేనిని విడిచిపెట్టలేదు. ప్రస్తుతమందు మనము సమస్తమును వానికి లోపరచబడుట ఇంకను చూడలేదుగాని..” (హెబ్రీ. 2:8).

ఈ రోజు వరకు, మానవాళి అంతా కలిగి ఉండేలా రూపొందించబడిన మహిమను కేవలం ఒకే వ్యక్తి, మెస్సీయ అయిన యహూషువః మాత్రమే సాధించాడని రచయిత చూపిస్తున్నాడు. 2,000 సంవత్సరాల క్రితం తన కాలంలోని మత పెద్దలచే చంపబడిన ఇదే అద్వితీయుడు మరియు దైవభక్తిగల వ్యక్తి యైన యహూషువః, తాను ఏదో ఒక దినాన ఈ భూమికి తిరిగి వస్తానని మరియు ఆ మహిమను ఇతరులతో పంచుకుంటానని తన గురించి తాను చెప్పుకున్నాడు: “తన మహిమతో మనుష్యకుమారుడును ఆయనతో కూడ సమస్త దూతలును వచ్చునప్పుడు ఆయన తన మహిమగల సింహాసనముమీద ఆసీనుడై యుండును. అప్పుడు సమస్త జనములు ఆయనయెదుట పోగు చేయబడుదురు; గొల్లవాడు మేకలలోనుండి గొఱ్ఱెలను వేరుపరచునట్లు ఆయన వారిని వేరుపరచి, తన కుడివైపున గొఱ్ఱెలను నిలువబెట్టి.. నా తండ్రిచేత ఆశీర్వదింపబడినవారలారా, రండి; లోకము పుట్టినది మొదలుకొని మీకొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి..” (మత్త. 25:31-34).

నిజానికి, యహూషువః చెప్పినట్లే, లోక పునాది సమయంలో యహువః స్త్రీ పురుషుల కోసం ఒక రాజ్యాన్ని సిద్ధం చేశాడు. మానవ చరిత్ర ప్రారంభంలో మన తండ్రి అయిన యహువః ఈ మాటలతో మనల్ని ప్రోత్సహిస్తున్నట్లు మనం చూస్తాము: “యహువః వారిని ఆశీర్వ దించెను; ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధిపొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరచుకొనుడి; సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమిమీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని యహువః వారితో చెప్పెను.” (ఆదికాండము 1:28).

అయినప్పటికీ, హెబ్రీ పత్రిక రచయిత చెప్పినట్లుగా, యహువః ఉద్దేశించిన విధంగా సృష్టి ఇంకా మనిషికి లోబడలేదు. మనం సమస్త దేశాలకు ఆశీర్వాదకరంగా ఉంటూ వాటిని దైవిక విధేయతలోకి తీసుకువచ్చే విధంగా యహువః సృష్టిని పాలించుటలో విఫలమయ్యాము. నిజానికి, సృష్టి మనల్ని (ముళ్ళతో) పాలించింది మరియు మనల్ని అధిగమించింది (మన విధి మనం వచ్చిన మట్టికి తిరిగి చేరుట). అలాంటప్పుడు యహూషువః మనల్ని ఒక దినాన మన కోసం సిద్ధపరచబడిన రాజ్యాన్ని వారసత్వంగా పొందేలా చేసి, మనల్ని సహాయకులుగా (దానియేలు 7:27) చేసుకొని, దాన్ని సరిగ్గా పరిపాలించడం ఎలా ప్రారంభిస్తాడు? నిజంగా, ఇది యహువః యొక్క అద్భుతమైన ఉద్దేశ్యం ఎలా నెరవేరబోతుందనే దాని యొక్క అద్భుతమైన ప్రణాళిక! మనం యహువః కృపతో భూమిపై ఆ రాజ్యాన్ని వారసత్వంగా పొందెదము అనే వాస్తవం మొదటి నుండి మన కోసం సిద్ధం చేయబడిన మొత్తం బైబిల్ యొక్క సమగ్ర కథ. రచయిత జాన్ బ్రైట్ తెలివిగా ఇలా చెప్పాడు: “బైబిల్ [పాత మరియు కొత్త నిబంధనలు] ఒక పుస్తకం. ఒకవేళ మనం ఆ పుస్తకానికి ఒక శీర్షిక పెట్టినట్లయితే, మనం దానిని న్యాయంగా ‘రాబోయే యహువః రాజ్యం' అని పిలవాలి.1

ఆశ్చర్యానికి గురైన ఆడ మరియు మగ

మనం బైబిల్ అని పిలిచే ఈ అద్భుతమైన పుస్తకం యొక్క పేజీలలో కనిపించే కథ ముగింపుకు వెళ్లినట్లయితే, మానవుల కోసం యహువః వేసిన నిత్యజీవ ప్రణాళికను విజయవంతంగా పూర్తి చేయుటలోని ప్రోత్సాహకరమైన ధృవీకరణను కనుగొంటాము: “ఈ లోక రాజ్యము మన ప్రభువు రాజ్యమును ఆయన క్రీస్తు [యహూషువః] రాజ్యము నాయెను; ఆయన యుగయుగముల వరకు ఏలుననెను." (ప్రకటన 11:15). మరియు అన్ని యుగాల్లోనూ జీవించిన లోక విశ్వాసుల గురించి మాట్లాడుతూ, "మా యహువఃకు వారిని ఒక రాజ్యముగాను యాజకులనుగాను చేసితివి; గనుక వారు భూలోకమందు ఏలుదురని క్రొత్తపాట పాడుదురు." (ప్రకటన 5:10).

పైన పేర్కొన్నది, వాస్తవానికి, ఈ ప్రస్తుత యుగపు ముగింపులో ఏమి జరుగుతుందనే దాని గురించి 2,500 సంవత్సరాల క్రితం ప్రవక్తయైన దానియేలుకు యహువః చూపించిన విషయం యొక్క ధృవీకరణ, ఆయన ఇలా వాగ్దానం చేశాడు: “ఆ రాజుల కాలములలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యము స్థాపించును. దానికెన్నటికిని నాశనము కలుగదు, ఆ రాజ్యము దాని పొందినవారికి గాక మరెవరికిని చెందదు; అది ముందు చెప్పిన రాజ్యములన్నిటిని పగులగొట్టి నిర్మూలము చేయును గాని అది యుగములవరకు నిలుచును.” (దానియేలు 2:44). మరియు ఆ రాజ్యం ఇక్కడే భూమిపై ఉంటుంది, క్రీస్తు పరిశుద్ధులు అతనితో ప్రేమతో పరిపాలిస్తారు: “​ఆకాశమంతటి క్రిందనున్న రాజ్యమును అధికారమును రాజ్య మహాత్మ్యమును మహోన్నతుని పరిశుద్ధులకు చెందును. ఆయన రాజ్యము నిత్యము నిలుచును, అధికారులందరును దానికి దాసులై విధేయులగుదురు. ఇంతలో సంగతి సమాప్తమాయెను అని చెప్పెను.” (దానియేలు 7:27).

ఈ వారసత్వం మరియు గమ్యం క్రీస్తు తన శక్తితో మరియు మహిమతో తిరిగి వచ్చినప్పుడు మనకు వస్తుంది, ఆ సమయంలో ఆయన విశ్వాసులుగా ఉండి మరణించిన వారిని సమాధుల నుండి లేపుతాడు. ఇది చివరి శ్రమల కాలం తరువాత జరుగుతుంది. ఆ సమయంలో ఈ విశ్వాసులు తమ నిద్ర నుండి మేల్కొని, యహువః రాజ్యంలో నిత్యజీవాన్ని (అక్షరానుసారంగా "జీవించే కాలం") పొందుతారు. ఇది ఎలా జరుగుతుందనే విషయంలో బైబిలు దృష్టిని ఆస్వాదించండి మరియు బలపడండి:

1 మొదటి థెస్సలొనీకయులకు 4:16,17: "ఆర్భాటముతోను, ప్రధానదూత శబ్దముతోను, యహువః బూరతోను పరలోకమునుండి ప్రభువు [యహూషువః] దిగివచ్చును; క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితోకూడ ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశమండలమునకు మేఘములమీద కొనిపోబడుదుము.

కాబట్టి, మనం పొందవలసిన వారసత్వం కోసం, భవిష్యత్తులో ఒక దినాన మనం పాలు పొందబోయే ఈ యహువః రాజ్యం కోసమే మొత్తం బైబిలు మొదటి నుండి చివరి వరకు తెలియజేస్తుంది. రాబోయే రాజ్యానికి సంబంధించిన ఇదే సువార్త సందేశాన్ని (సువార్తను) ప్రకటించుటకు 2,000 సంవత్సరాల క్రితం యహూషువః వచ్చాడు (లూకా 4:43; మార్కు 1:14 మరియు అనేక ఇతర వచనాలు). ఈ సువార్త సందేశంపై మరియు రాజుగా ఉన్న యహూషువఃను గూర్చిన విషయాలపై విశ్వాసం ద్వారా, ఆయన పేరిట బాప్తీస్మం పొంది, తద్వారా రక్షింపబడాలని అపోస్తలులు జనులను ఒప్పించారు (అపోస్తలు 8:12; అపోస్తలు 2:38). యహూషువః క్రీస్తు (మెస్సీయ, రాజు) అధికారం క్రింద భూమిపై రానున్న ఈ వారసత్వంపై విశ్వాసం కలిగియుండుట ఈ లోకంలో ఆరోగ్యంగా జీవించడానికి మరియు రాబోయే యుగంలో శాశ్వతమైన మోక్షానికి ప్రాధమిక అవసరమై ఉన్నది. (మత్త. 13:11-15; లూకా 8:10-12).

దురదృష్టవశాత్తూ, క్రీస్తు మరియు అతని అపొస్తలుల మరణం తరువాత గత 2,000 సంవత్సరాల కాలంలో సాధారణంగా బోధించబడిన మరియు సువార్తగా ప్రకటించబడిన సందేశం ఇది కాదు. మరియు స్పష్టంగా, విననిదాన్ని ఒకరు నమ్మలేరు. రాజ్యాన్ని గూర్చిన ఈ సువార్త విషయంలో చెవిటి నిశ్శబ్దం ఉండటమే కాకుండా, వేరొక సువార్త దాని స్థానంలో ఉంది, తద్వారా మనిషి యొక్క అంతిమ గమ్యాన్ని గూర్చిన సత్యాన్ని తిరిగి పొందడం మరింత సమస్యాత్మకంగా మారుతుంది. సువార్త సత్యాన్ని తారుమారు చేసి దానిని స్థానంలో చేరినదానిని మొదట విడిచిపెట్టాలి, దీని అర్థం లోతుగా పాతుకుపోయిన సంప్రదాయాలు తారుమారు చేయబడాలి. ఇది జరిగే వరకు, ఇవే సంప్రదాయాలు రక్షణకు దారితీసే విషయాలను అర్థం చేసుకొనుటలో మరియు విశ్వసించుటలో మరియు యహువః అసలు మనల్ని దేనికోసం సృష్టించెనో దానిని సాధించు విషయంలో అడ్డంకులుగా నిలుస్తాయి.

ఈ యుగాంతంలో మరణించినవారి పునరుత్థానానికి సంబంధించిన సాధారణ బైబిలు బోధనకు బదులుగా, మరణానంతరం తక్షణమే దేహరహిత జీవిగా (కొందరు "ఆత్మ" అని అంటారు) మరొకచోట జీవించుటయయే మనిషి యొక్క విధి అని సంప్రదాయం బోధించింది. ఈ భూమిపై యహువః యొక్క అక్షరానుసార రాజ్యంలో మన బహుమానాన్ని గూర్చిన శుభవార్త/సువార్తను "స్వర్గ రాజ్య" సువార్త భర్తీ చేసింది, ఇది హెబ్రీ బైబిలు రచయితలు ఎన్నడూ వినని సువార్త. మరణం తరువాత దేహరహిత జీవులుగా స్వర్గానికి వెళ్తారనే తప్పుడు ఆలోచనతో 16వ శతాబ్దపు సంస్కర్త మార్టిన్ లూథర్ ఏకీభవించలేదని "ది థియాలజీ ఆఫ్ మార్టిన్ లూథర్" అనే తన పుస్తకంలో పాల్ అల్తాస్ చెప్పారు:

"లూథర్ సాధారణంగా మరణానికి మరియు పునరుత్థానానికి మధ్యగల స్థితిని స్పృహ మరియు అనుభూతి లేని లోతైన, కలలు లేని నిద్రగా అర్థం చేసుకుంటాడు. మరణించినవారు అంత్య దినాన మేల్కొనునప్పుడు, వారు — ఉదయాన్నే నిద్రలేచిన వ్యక్తి వలె — వారు ఎక్కడ ఉన్నారో లేదా వారు ఎంతసేపు విశ్రాంతి తీసుకున్నారో వారికి తెలియదు ... కాబట్టి లూథర్ పునరుత్థానానికి ముందు శరీరాలు లేకుండా నిజమైన జీవితాన్ని మరియు ఆశీర్వాదాన్ని ఆస్వాదిస్తున్న ఆత్మల గురించి ఏమీ చెప్పలేదు. వారు 'క్రీస్తు యొక్క శాంతి' లో నిద్రిస్తారు. తరువాత లూథరన్ సంఘ వేదాంతశాస్త్రం ఈ విషయంలో లూథర్‌ను అనుసరించలేదు... పదిహేడవ శతాబ్దపు లూథరన్లు ఆత్మలు మరణంలో నిద్రపోతాయనే లూథర్ ఆలోచన నుండి దూరంగా ఉన్నారు... శరీరం మాత్రమే నిద్రిస్తుంది, ఆత్మ మేల్కొని ఉంటుంది.” (పేజీలు 414, 417). అన్య బోధనకు తిరిగి రావడం స్పష్టంగా ఉంది!

మరణం ఆత్మకు నిద్ర

అల్తాస్ స్వయంగా లూథర్ యొక్క అంచనాతో ఏకీభవించాడు: “ప్రారంభ సంఘం యొక్క ఆశ అంత్య దినపు పునరుత్థానంపై కేంద్రీకృతమై ఉంది. ఈ పునరుత్థానం శరీరానికి మాత్రమే కాకుండా మనిషికి జరుగుతుంది... అసలైన బైబిల్ బోధనలు హెలెనిస్టిక్ గ్నోస్టిక్ ద్వంద్వవాదం నుండి వచ్చిన ఆలోచనలతో భర్తీ చేయబడ్డాయి. పూర్తి మనిషిని ప్రభావితం చేసే పునరుత్థానం యొక్క క్రొత్త నిబంధన ఆలోచన కేవలం ఆత్మ యొక్క అమరత్వం అనే ఆలోచనకు దారితీసింది. దీనికి మరియు క్రొత్త నిబంధన యొక్క నిరీక్షణకు మధ్య గల వ్యత్యాసం చాలా గొప్పది” (పేజీలు 413-414).

హెబ్రీ లేఖనం యొక్క నిజమైన రాజ్య సందేశానికి విజయవంతంగా తిరిగి రావాలంటే (మీ పని!), దేహరహిత ఆత్మ అనే ఈ తప్పుడు గ్రీకు తాత్విక భావనను మొదటగా యహువః మరియు క్రీస్తు అనుచరులందరి మనస్సుల నుండి తీసివేయాలి. ఈ భూమిపై తన రాజ్యాన్ని పునరుద్ధరించుదుననే యహువః వాగ్దానం ఇప్పటివరకు ఎలా నెరవేరింది మరియు తరువాత ఎలా నెరవేరుతుందనే దాని గురించి మరింత వివరమైన కథనం ఉంది, అయితే ఈ కథను మరణం గురించి బైబిలు ఏమి చెబుతుంది, ప్రత్యేకించీ మనం మరణించినప్పుడు ఏమి జరుగుతుంది అనే విషయాలలో సరైన అవగాహన కోణంలో చెప్పాలి. మనం పూర్తిగా భిన్నమైన రెండు ఆలోచనలను (యుగాంతపు పునరుత్థానం & మరణించిన తక్షణం దేహరహిత జీవిగా ఉండటం) ఉపచేతనంగా మిళితం చేయడం వల్ల ఏర్పడే గందరగోళాన్ని మనం తొలగించాలి. ఈ విషయంపై చివరి మాటగా పవిత్ర గ్రంథాన్ని అనుమతించినట్లయితే, దీన్ని చేయడం కష్టం కాదు. క్రొత్త మరియు పాత నిబంధనలు వాటి బోధనలలో సంపూర్ణంగా ఏకీకృతం చేయబడ్డాయని మనము కనుగొంటాము.

పాత నిబంధనలో, మరణంలో మనకు ఆలోచనలు గానీ లేదా స్పృహ గానీ లేవని తెలుసుకోవడం జరుగుతుంది:

ప్రసంగి 9:5: "బ్రదికి యుండువారు తాము చత్తురని ఎరుగుదురు. అయితే చచ్చినవారు ఏమియు ఎరుగరు."

ప్రసంగి 9:10: “నీవు పోవు పాతాళమునందు పనియైనను ఉపాయమైనను తెలివియైనను జ్ఞానమైనను లేదు.”

కీర్తనలు 146:4: “వారి ప్రాణము వెడలిపోవును వారు మంటిపాలగుదురు. వారి సంకల్పములు నాడే నశించును.”

ఇంకా, చనిపోయినప్పుడు మనం యహువఃను జ్ఞాపకం చేసుకోలేము లేదా ఆయనను స్తుతించలేము. మనం నిజానికి స్వర్గంలో గాని నరకంలో గాని దేహరహిత జీవులుగా జీవిస్తున్నట్లయితే ఇది ఒక విచిత్రమైన పరిస్థితి.

కీర్తనలు 6:4-5: “యహువః, తిరిగి రమ్ము, నన్ను విడిపింపుము నీ కృపనుబట్టి నన్ను రక్షించుము. మరణమైనవారికి నిన్ను గూర్చిన జ్ఞాపకము లేదు పాతాళములో ఎవరు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు?”

కీర్తనలు 115:17: “మృతులును మౌనస్థితిలోనికి దిగిపోవువారును యహువఃను స్తుతింపరు.”

క్రొత్త నిబంధనలో, మరణించినవారు యుగాంతంలో గల పునరుత్థాన దినం వరకు మరణించి ఉందురనే ఆలోచన, ఈ విషయంపై క్రైస్తవ విశ్వాసం ఎలా ఉండాలి అనేదానికి సంపూర్ణ నిర్ధారణను ఇస్తుంది:

యోహాను 5:28-29: “దీనికి ఆశ్చర్యపడకుడి; ఒక కాలము వచ్చుచున్నది; ఆ కాలమున సమాధులలో నున్నవారందరు ఆయన శబ్దము విని మేలు చేసినవారు జీవ పునరుత్థానమునకును కీడు చేసినవారు తీర్పు పునరుత్థానమునకును బయటికి వచ్చెదరు.”

యహూషువః తిరిగి వచ్చినప్పుడు, చనిపోయినవారు తిరిగి బ్రతుకుదురు, అప్పటి వరకు మరణించి ఉందురు. ఇది ఒక అద్భుతమైన సంఘటన అవుతుంది:

1 కొరింథీయులకు 15:22-23: “ఆదామునందు అందరు ఏలాగు మృతిపొందుచున్నారో, ఆలాగుననే క్రీస్తునందు అందరు బ్రదికింపబడుదురు. ప్రతివాడును తన తన వరుసలోనే బ్రదికింపబడును; ప్రథమ ఫలము క్రీస్తు; తరువాత క్రీస్తు వచ్చినపుడు ఆయనవారు బ్రదికింపబడుదురు.”

1 థెస్సలొనీకయులకు 4:16-17: “ఆర్భాటముతోను, ప్రధానదూత శబ్దముతోను, యహువః బూరతోను పరలోకమునుండి ప్రభువు దిగివచ్చును; క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితోకూడ ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశమండలమునకు మేఘములమీద కొనిపోబడుదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడ ఉందుము.”

అమర్త్య ఆత్మ లేదా మర్త్య ఆత్మ

యహూషువః మరియు అతని అపొస్తలులు మరణించిన చాలా కాలం తర్వాత మాత్రమే పునరుత్థానానికి సంబంధించిన బైబిలు బోధనలను మరణించినవారు వెంటనే శరీరాలు లేని ఆత్మలవంటి జీవులుగా స్వర్గానికి లేదా నరకానికి వెళతారనే తప్పుడు, అన్యమత భావనలు భర్తీ చేయుట ప్రారంభించినట్లు చారిత్రక కథనాల నుండి కనిపిస్తుంది. ప్రారంభ "సంఘ ఫాదర్స్"లో ఒకరైన జస్టిన్ మార్టిర్, ఇది ఇప్పటికే జరుగుతోందని క్రీ.శ. 150లో నిరసించాడు: "క్రైస్తవులు అని పిలువబడుతూ, పునరుత్థానం యొక్క సత్యాన్ని అంగీకరించకుండా, అబ్రాహాము, ఇస్సాకు మరియు యాకోబు దేవుణ్ణి దూషించే విధంగా; చనిపోయినవారికి పునరుత్థానం లేదని, వారు చనిపోయినప్పుడు వారి ఆత్మలు స్వర్గానికి తీసుకువెళ్లబడతాయని చెప్పేవారితో మీరు కలిసి ఉన్నట్లైతే: వారు క్రైస్తవులని ఊహించుకోవద్దు" (ట్రిఫోతో సంభాషణ, అధ్యాయం 80). హెచ్చరిక అలక్ష్యం చేయబడెను.

ప్రకటన గ్రంథము 20:4-5 లో ఇప్పుడు మరణంలో నిద్రిస్తున్న వారి ఉజ్వల భవిష్యత్తు మరియు మానవజాతి యొక్క గమ్యం ఇప్పటివరకు చూడని సంపూర్ణతతో ఎప్పుడు అనుగ్రహించబడుతుందో అనే శుభవార్త చక్కగా సంక్షిప్తీకరించబడింది. యహూషువః క్రీస్తు యొక్క విశ్వాసులైన పరిశుద్ధుల కోసం మాట్లాడుతూ ఇలా వ్రాయబడింది: “వారు బ్రతికినవారై, వెయ్యి సంవత్సరములు క్రీస్తుతోకూడ రాజ్యము చేసిరి. ఆ వెయ్యి సంవత్సరములు గడచువరకు కడమ మృతులు బ్రదుక లేదు.”

ఇప్పుడు మనకు తగినంత నేపథ్య సమాచారం ఉంది, తద్వారా మనం మిగిలిన కథనాన్ని కొనసాగించగలము: మానవజాతి కోసం తన గొప్ప ఉద్దేశ్యాన్ని నెరవేర్చుటకు యహువః ఇప్పటికే ఏమి చేసాడు మరియు ఆయన ఇంకా ఏమి చేస్తాడు. గొప్ప ఆజ్ఞాపణలోని మన వంతుగా — మీరు ఇతరులకు యహువః ప్రణాళికను బోధించగలరా?

సంతోషకరమైన ఆసియా మహిళ


1ది కింగ్‌డమ్ ఆఫ్ గాడ్, అబింగ్డన్, 1981, పేజి. 197.


ఇది రాబిన్ టాడ్ రాసిన వ్యాసం. WLC వ్యాసం కాదు.

మేము అసలు వ్యాసం నుండి సమస్త అన్య నామములను మరియు తండ్రి - కుమారుడు అనే శీర్షికలను తొలగించి, వాటి స్థానాన్ని అసలు నామములతో భర్తీ చేసాము. ఇంకా, ఇక్కడ ఇవ్వబడిన లేఖనాలలో తండ్రి మరియు కుమారుని నామములను బైబిల్ యొక్క మొదటి ప్రేరేపిత రచయితలచే వ్రాయబడిన విధంగా మేము పునరుద్ధరించాము. -డబ్ల్యుఎల్‌సి బృందం.