Print

జాన్ కాల్విన్‌కు వ్యతిరేకంగా సర్వెటస్ బూడిద కేకలు వేస్తుంది

ఇది WLC యేతర వ్యాసం. బయటి రచయితల వనరులను ఉపయోగించినప్పుడు, బైబిలుకు మరియు డబ్ల్యుఎల్‌సి ప్రస్తుత నమ్మకాలకు 100% అనుగుణంగా ఉండెనని భావించిన వాటిని మాత్రమే మేము ప్రచురిస్తాము. కాబట్టి అలాంటి వ్యాసాలను డబ్ల్యుఎల్‌సి నుండి నేరుగా వచ్చినట్లుగా పరిగణించవచ్చు. యహువః యొక్క అనేక మంది సేవకుల పరిచర్య ద్వారా మేము ఎంతగానో ఆశీర్వదించబడ్డాము. అయితే ఈ రచయితల యొక్క ఇతర రచనలను అన్వేషించమని మేము మా సభ్యులకు సలహా ఇవ్వము. అటువంటి రచనలు, లోపాలను కలిగి ఉన్నందున మేము వాటిని ప్రచురణల నుండి మినహాయించాము. విచారకరంగా, లోపం లేని మంత్రిత్వ శాఖను మనం ఇంకనూ కనుగొనలేదు. డబ్ల్యుఎల్‌సి వి కాని కొన్ని ప్రచురించబడిన వ్యాసాలు / ఎపిసోడ్లు చూసి మీరు దిగ్బ్రాంతి చెందినచో, సామెతలు 4:18 జ్ఞాపకం చేసుకోండి. మన మార్గంలో మరింత కాంతి వెలువడు కొద్దీ ఆయన సత్యాన్ని గూర్చిన మన అవగాహన అభివృద్ధి చెందుతూ ఉంటుంది. మేము సత్యాన్ని ప్రాణం కంటే ఎక్కువగా ఆదరిస్తాము మరియు అది దొరికిన చోటు ఏదైనా అక్కడ వెతుకుతాము.

జాన్ కాల్విన్కు వ్యతిరేకంగా సర్వెటస్ బూడిద కేకలు వేస్తుంది

ఈ వ్యాసం సంస్కరణ కాలం నుండి సంఘ చరిత్రలో కొద్దిగా-తెలిసిన, కానీ చాలా ముఖ్యమైన భాగానికి సంబంధించినది. ఈ సమాచారం మన కాలంలో ప్రజల నుండి దాచబడింది, ఈ భయంకరమైన వాస్తవాల గురించి చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. ఈలలు వేయాలి. ఒక దిగ్భ్రాంతికరమైన విషయం కోసం మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోండి.

అక్టోబర్ 27, 1553 న కాల్వినిజం స్థాపకుడు జాన్ కాల్విన్, స్పానిష్ వైద్యుడు మైఖేల్ సెర్వెటస్‌ను జెనీవా వెలుపల సిద్ధాంతపరమైన మతవిశ్వాసాల విషయంలో సజీవదహనం చేశాడు.1‌ "ఒకసారి రక్షించబడితే, ఎల్లప్పుడూ రక్షించబడినట్లే" (దీనినే కొన్ని వర్గాలలో "పరిశుద్ధుల కాపుదల" గా పిలుస్తారు) అనే ప్రసిద్ధ సిద్ధాంతానికి మూలకర్త అయిన జాన్ కాల్విన్ లేఖనాలను పరిగణనలోకి తీసుకోకుండా సిద్ధాంతపరమైన "మత వ్యతిరేకిని" నరహత్య చేయడం ద్వారా సంస్కరణ యొక్క స్వరాన్ని — "సోలా స్క్రిప్టురా" ను ఉల్లంఘించాడు. సెర్వెటస్‌ని చంపడం అనేది కాల్విన్ సెర్వెటస్‌ని పట్టుకోవటానికి చాలా కాలం ముందే యోచన చేసిన విషయం. కాల్విన్ తన స్నేహితుడు ఫారెల్‌కు ఫిబ్రవరి 13, 1546 న (సెర్వెటస్ ను బంధించుటకు ఏడు సంవత్సరాల ముందు) ఈ విధంగా రాసాడు: "అతడు [సెర్వెటస్] జెనీవాకు వస్తే, నా అధికారం సరిపోతే నేను అతడిని సజీవంగా బయటకు వెళ్లనివ్వను." 2 స్పష్టంగా, ఆ రోజు స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో కాల్విన్ అధికారం అంతిమంగా "శక్తిని" కలిగి ఉంది. అందుకే కొందరు జెనీవాను "రోమ్ ఆఫ్ ప్రొటెస్టాంటిజం"3 అని మరియు కాల్విన్‌ను ప్రొటెస్టంట్ "పోప్ ఆఫ్ జెనీవా" అని పేర్కొన్నారు. 4

సెర్వెటస్ విచారణ సమయంలో, కాల్విన్ ఇలా వ్రాశాడు: "తీర్పు మరణశిక్షకు పిలుపునిస్తుందని నేను ఆశిస్తున్నాను."5 ఇవన్నీ జాన్ కాల్విన్ యొక్క మనకు తెలియని కోణాన్ని బహిర్గతం చేస్తున్నాయి! సహజంగానే అతడు తన హృదయంలో సుదీర్ఘమైన, హత్యా ద్వేషాన్ని కలిగి ఉన్నాడు మరియు అత్యంత క్రూరమైన రీతిలో మరొకరిని చంపు విషయంలో లేఖనాలను ఉల్లంఘించడానికి సిద్ధపడ్డాడు. శిరచ్ఛేదనం చేయాలన్న సెర్వెటస్ అభ్యర్థనను కాల్విన్ అంగీకరించినప్పటికీ [సజీవ దహనం చేయడం కంటే మెరుగైనదిగా భావిస్తారు], అతడు అమలు చేసిన పద్ధతిలో అలా చేయలేదు. అయితే కాల్విన్‌కు సెర్వెటస్‌ను చంపారనే‌ కోరిక ఎందుకు పుట్టింది? "సెర్వెటస్‌ను తన మతవిశ్వాసాల విషయంలో ఎదుర్కొనుటకు, కాల్విన్ తన "ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ ది క్రిస్టియన్ రిలిజియన్" యొక్క తాజా ఎడిషన్‌తో సమాధానమిచ్చాడు, సెర్వెటస్ వెంటనే అవమానకరమైన చిన్నపాటి వ్యాఖ్యలతో తిరిగి వచ్చాడు. సెర్వెటస్ వేడుకున్నప్పటికీ, వారి ఉత్తర ప్రత్యుత్తరాల సమయంలో సర్వెటస్‌పై తీవ్ర అసహనాన్ని పెంచుకున్న కాల్విన్, దోషారోపణలను తిరిగి తీసుకొనుటకు నిరాకరించాడు.6

"రోమన్ కాథలిక్ అధికారులచే నేరారోపణ చేయబడిన సెర్వెటస్ జైలులో నుండి తప్పించుకొని మరణశిక్ష నుండి తప్పించుకున్నాడు. ఇటలీకి వెళుతున్నప్పుడు, సెర్వెటస్ జెనీవాలో అకస్మాత్తుగా ఆగిపోయాడు, అక్కడ అతడు కాల్విన్ మరియు సంస్కర్తలచే పట్టుబడ్డాడు. అతడు వచ్చిన మరుసటి రోజు అతడిని స్వాధీనం చేసుకున్నారు, అతడు తన తప్పును ఒప్పుకొనుటకు నిరాకరించినప్పుడు మతవిరోధిగా నేరం మోపబడ్డాడు మరియు కాల్విన్ యొక్క మౌన ఆమోదంతో 1553 లో దహనం చేయబడ్డాడు. 7

"వియన్నా నుండి తన ప్రయాణ సమయంలో, సెర్వెటస్ జెనీవాలో ఆగాడు, అయితే అతడు చేసిన తప్పు కాల్విన్ ప్రసంగానికి హాజరు కావడం. ప్రసంగం తర్వాత అతన్ని గుర్తించి అరెస్టు చేశారు."8 "కాల్విన్ అతడి [సెర్వెటస్] ని మతవిరోధిగా అరెస్టు చేసి, దోషిగా నిర్ధారించి కాల్చి చంపారు."9

ఆగష్టు 14 న కాల్విన్ అతన్ని బంధించినప్పటి నుండి అతని మరణం వరకు, సెర్వెటస్ తన దినాలను "వెలుతురు లేదా వేడి లేనటువంటి, తక్కువ ఆహారంతో మరియు కాలకృత్య సౌకర్యాలు లేని దారుణమైన చెరసాలలో గడిపాడు."10

జెనీవాలో సెర్వెటస్‌ను తగలబెట్టిన వ్యక్తులు అతడి పాదాల చుట్టూ సగం ఎండి పచ్చిగా ఉన్న కలపను మరియు అతని తలపై సల్ఫర్‌తో పూసిన దండను ఉంచారని గమనించాలి. అటువంటి అగ్నిలో అతడు మరణించుటకు సుమారు ముప్పై నిమిషాలకు పైగా పట్టింది, అయితే జెనీవా ప్రజలు చుట్టూ నిలబడి అతడు వేదనతో నెమ్మదిగా మరణించడాన్ని చూసారు! ఇది జరగడానికి ముందు, జాబితా ఇలా చూపిస్తుంది:

"నిందిత వ్యక్తి పక్కన ఫారెల్ నడిచాడు, మరియు సెర్వెటస్ అనుభూతి చెందగలిగినట్లు, ఏమాత్రం సున్నితత్వం లేకుండా, నిరంతర మాటల వర్షాన్ని కురిపించాడు. అతని మనస్సులో ఉన్నది ఖైదీ తన వేదాంత దోషాన్ని — ఆత్మలు ఆత్మలను నయం చేయడంలో దిగ్భ్రాంతికరమైన ఉదాహరణను అంగీకరించడమే. కొన్ని నిమిషాల తర్వాత, సెర్వెటస్ ఏవిధమైన ప్రత్యుత్తరం ఇచ్చుటను మానివేసి, నిశ్శబ్దంగా తనకు తానుగా ప్రార్థించాడు. వారు ఉరితీసే ప్రదేశానికి చేరుకున్నప్పుడు, చూస్తున్న ప్రేక్షకులకు ఫారెల్ ఇలా ప్రకటించాడు: 'తన అధికారంలో ఒక వ్యక్తి ఉన్నప్పుడు సాతాను ఎటువంటి శక్తిని కలిగి ఉంటాడో ఇక్కడ చూడండి. ఈ వ్యక్తి విశిష్ట విద్వాంసుడు, మరియు తాను సరిగ్గా ప్రవర్తిస్తున్నాడని బహుశా ఇతడు నమ్ముతున్నాడు. కానీ ఇప్పుడు అపవాది ఇతడిని పూర్తిగా స్వాధీనం చేసుకున్నాడు, మీరు ఇతని వలలో చిక్కుకుంటే ఇతడు మిమ్మల్ని వశం చేసుకోగలడు.’ [యహూషువః ఇలా అన్నాడు, "మిమ్ము చంపువారు తాము యహువఃకు సేవ చేస్తున్నట్లు భావించుదురు"!]

మైఖేల్ సర్వెటస్ను సజీవ దహనం చేశారు"ఉరిశిక్షకుడు తన పనిని ప్రారంభించినప్పుడు, సెర్వెటస్ వణుకుతున్న గొంతుతో ఇలా గుసగుసలాడాడు: 'ఓ యహువః, 'ఓ యహువః!' అడ్డుపడిన ఫారెల్ అతనిపై విరుచుకుపడ్డాడు: ‘నీకు చెప్పడానికి ఇంకేమీ లేదా? ఈసారి సెర్వెటస్ అతనికి ఇలా సమాధానమిచ్చాడు: ‘నేను యహువః గురించి మాట్లాడటం తప్ప మరేమి చేయగలను! ఆ తర్వాత అతడిని చితిపైకి ఎత్తి స్తంభానికి బంధించారు. సల్ఫర్‌తో పూసిన దండ అతని తలపై ఉంచబడింది. కట్టెపుల్లలు మండినప్పుడు, అతని నుండి భీకరమైన భయానక కేకలు వినిపించాయి. ‘కరుణ, దయ!’ అని అరిచాడు. అరగంటకు పైగా భయంకరమైన వేదన కొనసాగింది, ఎందుకంటే అగ్ని సగం ఆకుపచ్చ (సగం ఎండిన) చెక్కతో తయారు చేయబడింది, అది చాలా నెమ్మదిగా కాలింది. 'యహూషువాహ్, జీవముగల యాహువః కుమారుడా, నన్ను కరుణించు' అని మండుచున్న వ్యక్తి మంటల మధ్య నుండి అరిచాడు.11

సిలువపై మారుమనస్సు పొంది‌న/పశ్చాత్తాపపడిన ఖైదీ నుండి మనము ఇదే విధమైన కేకలు విన్నాము. (లూకా. 23: 42-43. లూకా. 18:13). లేఖనం ఇలా చెబుతోంది, “ప్రభువు నామమునుబట్టి ప్రార్థన చేయువారందరును రక్షణ పొందుదురు.” (అపొస్తలుల కార్యములు 2:21; రోమా. 10:13). ఫారెల్ అప్పటికీ సేర్వెటస్‌ను తన జీవిత చివరలో కూడా రక్షించబడని వ్యక్తిగా పరిగణించాడు: “తన విశేషణ స్థానాన్ని మార్చడం ద్వారా మరియు క్రీస్తును శాశ్వతమైన-యహువః యొక్క కుమారుడు అని కాకుండా శాశ్వతమైన-కుమారుడుగా ఒప్పుకొని ఉంటే సెర్వెటస్ రక్షించబడి ఉండేవాడని ఫారెల్ గుర్తించాడు."12

"కాల్విన్ ఆవిధంగా తన శత్రువును హత్య చేశాడు, మరియు అతడు తన నేరం విషయంలో పశ్చాత్తాపపడినట్లు చూపించిన సందర్భం ఎక్కడా లేదు. మరుసటి సంవత్సరం అతడు ఒక ఖండనను ప్రచురించాడు, దీనిలో తన మాజీ ప్రత్యర్థిపై అత్యంత ప్రతీకార మరియు తీవ్ర పదజాలంతో మరింత దూషిస్తూ ముందుకు వెళ్ళాడు.”13

1415 నాటి రోమన్ కాథలిక్కులు జాన్ హస్14 ను సిద్ధాంతం విషయంలో గుంజకు కట్టి కాల్చివేనప్పుడు, జాన్ కాల్విన్, మైఖేల్ సెర్వెటస్‌ ను కాల్చినట్లుగా గుంజకు కట్టి కాల్చివేసాడు. అయితే,‌ ఇక్కడ సిద్ధాంతం మాత్రమే సమస్యగా ఉందా? మరొక కారణం ఉండవచ్చు, రాజకీయ కారణం?

“'మొండి మత విరోధిగా అతడు ఎక్కువ ఆలస్యం లేకుండా అతని ఆస్తి మొత్తాన్ని జప్తు చేశాడు. అతడు జైలులో దారుణంగా వ్యవహరించబడ్డాడు. అందువల్ల, సెర్వెటస్ కాల్విన్‌తో జరిగిన ఘర్షణలో అసభ్యంగా మరియు అవమానకరంగా ప్రవర్తించాడని అర్థం చేసుకోవచ్చు. దురదృష్టవశాత్తు, ఈ సమయంలో కాల్విన్ జెనీవాలో తన బలహీనపడుతున్న శక్తిని కాపాడుకోవడానికి పోరాడుతున్నాడు. కాల్విన్ ప్రత్యర్థులు జెనీవా సంస్కరణ సంబంధమైన దైవపరిపాలనా ప్రభుత్వంపై దాడి చేయడానికి ఒక సాకుగా సెర్వెటస్‌ను ఉపయోగించారు. ఇది ప్రతిష్టాత్మకమైన అంశంగా మారింది — ఈ విషయంలో కాల్విన్ తన అధికారాన్ని నొక్కి చెప్పడం ఏ నియంతృత్వ పాలనకు అయినా ఎల్లప్పుడూ బాధ కలిగించే అంశం. అతడు తన ఆజ్ఞ ప్రకారం సర్వెటస్‌ని అన్ని విధాలుగా ఖండించవలసి వచ్చింది." 15

"హాస్యాస్పదంగా, సెర్వెటస్ మరణము నిజంగా జెనీవా సంస్కరణ యొక్క బలాన్ని పెంచలేదు. దీనికి విరుద్ధంగా, ఫ్రిట్జ్ బార్త్ సూచించినట్లుగా, ఇది 'కాల్వినిజాన్ని తీవ్రంగా రాజీ పడేలా చేసింది మరియు ఎవరికైతే కాల్విన్ తన క్రైస్తవ సనాతనత్వాన్ని (ఇది తమ దృష్టిలో మతోన్మాదం తప్ప మరొకటి కానటువంటి హ్యూగెనోట్ల హింసకు ఉత్తమ ఆయుధం) ప్రదర్శించాలనుకున్నాడో ఆ కాథలిక్కుల చేతిలో దానిని పెట్టింది. 'సెర్వెటస్‌కి వ్యతిరేకమైన ఈ ప్రక్రియ ప్రొటెస్టెంట్ మతవిశ్వాస పరీక్షకు ఒక నమూనాగా పనిచేసింది ... మధ్యయుగ విచారణ పద్ధతులకు ఇది ఏమాత్రం భిన్నంగా లేదు ... విజయవంతమైన సంస్కరణ కూడా అధికార ప్రలోభాలను అడ్డుకోలేకపోయింది." 16

జాన్ కాల్విన్ వంటి వ్యక్తి "గొప్ప వేదాంతవేత్త" గా ఉంటూ మరియు అదే సమయంలో దురాచారంగా వ్యవహరించడం మరియు తరువాత పశ్చాత్తాప పడకపోవడం సమంజసమా? ప్రియమైన పాఠకులారా, జాన్ కాల్విన్ లాగా, మరొకరిని గుంజపై అగ్నిలో పడేసే హృదయం మీకు ఉందా? ఈ క్రూరమైన హత్యను మీరు ఆమోదిస్తారా?

గోల్డెన్ రిట్రీవర్ కుక్కపిల్లదీనిని మరొక విధంగా వివరిద్దాం. ఉదాహరణకు, మీ సంఘంలో ఆధ్యాత్మిక నాయకుడిగా ఖ్యాతిగాంచిన ఒక వ్యక్తి, మీ పొరుగువారి కుక్కను పట్టుకొని, దానిని స్తంభానికి బంధించి, ఆపై ఆకుపచ్చ కలపతో చిన్న మొత్తంలో మంటలను ఉపయోగించి నెమ్మదిగా కుక్కను కాల్చి చంపాడు అనుకుందాం. అలాంటి వ్యక్తి గురించి మీరు ఏమనుకుంటారు, ప్రత్యేకించి అతడు పశ్చాత్తాపం చూపకపోతే? అతడు మీ కోసం బైబిల్‌ను వివరించాలని మీరు కోరుకుంటారా? జాన్ కాల్విన్ ఈ విషయంలో మరింత బాధాకరంగా, ఒక వ్యక్తిగా, కుక్కలా కాకుండా, యహువః రూపంలో సృష్టించబడిన వ్యక్తి, చంపబడ్డాడు! అలానో లేక కాదో, కాని, సెర్వెటస్‌పై తన హత్యా ద్వేషం ఫలితంగా జాన్ కాల్విన్ హృదయం మసకబారిందని మరియు వెలిగింపబడలేదని కేవలం ఈ సాక్ష్యం నుండి మనం నిర్ధారించవచ్చు. అత్యుత్తమంగా, కాల్విన్ ఈ ద్వేషం కారణంగా ఆత్మీయంగా అంధుడయ్యాడు మరియు అందువలన, ఆధ్యాత్మికంగా సత్య వాక్యాన్ని సరిగ్గా వివరించుటకు అనర్హుడయ్యాడు.17 అత్యంత దారుణంగా, స్పష్టంగా, లేఖనాల ప్రకారం, జాన్ కాల్విన్ రక్షించబడలేదు:

"పిరికివారును, అవిశ్వాసులును, అసహ్యులును, నరహంతకులును, వ్యభిచారులును, మాంత్రి కులును, విగ్రహారాధకులును, అబద్ధికులందరును అగ్ని గంధకములతో మండు గుండములో పాలుపొందుదురు; ఇది రెండవ మరణము. (ప్రకటన. 21:8).

“మరియు మనమాయన ఆజ్ఞలను గైకొనిన యెడల, దీనివలననే ఆయనను ఎరిగియున్నామని తెలిసికొందుము. ఆయనను ఎరిగియున్నానని చెప్పుకొనుచు, ఆయన ఆజ్ఞలను గైకొననివాడు అబద్ధికుడు; వానిలో సత్యములేదు.” (మొదటి యోహాను. 2:3-4).

“ఏ నరహంతకునియందును నిత్యజీవముండదని (కొనసాగదని) మీరెరుగుదురు.” (మొదటి యోహాను. 3:15, యన్.కె.జె.వి).

1 యోహాను 3:15 గ్రీకులో ఒక ముఖ్యమైన పదాన్ని జతచేస్తుంది, అది కొన్నిసార్లు ఆంగ్ల అనువాదాలలో వదిలివేయబడింది. ఆ పదం "కొనసాగడం" లేదా "నిలిచి ఉండటం" (యన్.కె.జె.వి) మరియు అది నరహంతకులైన వ్యక్తులలో నిత్యజీవం కొనసాగడం లేదని పేర్కొంటుంది.

ప్రియమైన పాఠకులారా, నరహంతకులు రక్షింపబడలేరు మరియు జాన్ కాల్విన్ నరహంతకుడు కాబట్టి, కాల్విన్ రక్షింపబడలేదు! ఇంకా, రక్షింపబడని వారి ఆత్మీయ అవగాహన అంధకారంలో ఉంటుంది (ఎఫె. 4:18) మరియు కాల్విన్ లేఖనం ఆధారంగా రక్షింపబడలేదు కాబట్టి, కాల్విన్ యొక్క ఆధ్యాత్మిక అవగాహన అంధకారంలో లేదా? వారి ఫలాలను బట్టి మనం మనుష్యులను "తెలుసుకోగలము" అని యహూషువః చెప్పారు (మత్త. 12:33) — అది జాన్ కాల్విన్ లేదా మరెవరైనా కావచ్చు! అదేవిధంగా, అపొస్తలుడైన యోహాను ఇలా వ్రాశాడు:

“దీనినిబట్టి యహువః పిల్లలెవరో అపవాది పిల్లలెవరో తేటపడును. నీతిని జరిగించని ప్రతివాడును, తన సహోదరుని ప్రేమింపని ప్రతివాడును యహువః సంబంధులు కారు.” (మొదటి యోహాను. 3:10).

కాల్విన్ సెర్వెటస్‌ విషయంలో "సరైనది" చేశాడని మీరు చెప్పగలరా? ఒకవేళ కాకపోతే, ఈ వాక్యం ప్రకారం మరియు ఇతరులు ఇప్పటికే ఉదహరించిన ప్రకారం ఇది అతన్ని "అపవాది బిడ్డ" గా మార్చలేదా? ఈ తీర్మానంపై కొందరు గర్జించి, ఆగ్రహించినప్పటికీ, మనం లేఖనపరంగా మరేదైనా చెప్పవచ్చా?

కాల్విన్ ఆధ్యాత్మిక స్థితిని నిష్పాక్షికంగా అంచనా వేయడానికి ఇతర ఆధారాలు అవసరం లేదు. అయితే, మరో ఇద్దరు వ్యక్తులను కూడా క్లుప్తంగా పేర్కొనాలి:

"జాక్ గ్రూట్ మరియు జెరోమ్ బోల్‌సెక్‌లకు సంబంధించిన మరో రెండు ప్రసిద్ధ భాగాలు. కాల్విన్ చేత దుర్నీతిపరుడుగా భావించబడిన గ్రూట్, పరిషత్తును విమర్శిస్తూ లేఖలు రాశాడు మరియు మరింత తీవ్రంగా, జెనీవా యొక్క రాజకీయ మరియు మతపరమైన వ్యవహారాలలో జోక్యం చేసుకోవాలని ఫ్రాన్స్‌లోని కాథలిక్ రాజుకు అర్జి చేశాడు. కాల్విన్ అంగీకారంతో అతడు రాజద్రోహం విషయంలో తల నరికివేయబడ్డాడు. కాల్విన్ యొక్క "దైవవిధి సంకల్ప/ముందుగా నిర్ణయించబడుట" సిద్ధాంతంపై బోల్‌సెక్ బహిరంగంగా సవాలు చేశాడు, బోల్‌సెక్ సిద్ధాంతం, అనేక ఇతర సిద్ధాంతాల వలె, నైతికంగా అసహ్యంగా కనుగొనబడింది. 1551 లో నగరం నుండి బహిష్కరించబడ్డాడు, అతడు 1577 లో తనపై అత్యాశ, ఆర్థిక దుష్ప్రవర్తన మరియు లైంగిక ఉల్లంఘన వంటి అభియోగాలు మోపిన కాల్విన్ జీవిత చరిత్రను ప్రచురించడం ద్వారా ప్రతీకారం తీర్చుకున్నాడు.18

బైబిల్ మార్గదర్శకాలకు కట్టుబడి ఉండటానికి ఎవరైనా సిద్ధంగా ఉంటే, వారు, ఎవరైనా మత విరోధి లేదా ఎవరైనా తప్పుడు బోధకుడితో ఎలా వ్యవహరించాలి? పౌలు తీతుకు వ్రాస్తూ ఈ సమస్యను ప్రస్తావించాడు, ఇది మొదటి సంఘంలో సంఘ పెద్దలు కలిగి ఉండాల్సిన అర్హతగా ప్రారంభమయింది:

"తాను హితబోధవిషయమై జనులను హెచ్చరించుటకును, ఎదురాడువారి మాట ఖండించుటకును శక్తిగలవాడగునట్లు, ఉపదేశమును అనుసరించి నమ్మదగిన బోధను గట్టిగా చేపట్టుకొనువాడునై యుండవలెను. అనేకులు, విశేషముగా సున్నతి సంబంధులును, అవిధేయులును వదరుబోతులును మోసపుచ్చువారునైయున్నారు. వారి నోళ్లు మూయింపవలెను. అట్టివారు ఉపదేశింపకూడని వాటిని దుర్లాభము కొరకు ఉపదేశించుచు, కుటుంబములకు కుటుంబములనే పాడుచేయుచున్నారు." (తీతుకు 1:9-11).

స్పష్టంగా, ఒక తప్పుడు బోధకుని నోరు మూయింపవలెను, అయితే, కాల్వినిజం వ్యవస్థాపకుడు చేసినట్లుగా, అతడిని చంపడం ద్వారా కాదు, కానీ అతన్ని లేఖనాలతో తిరస్కరించడం ద్వారా. ఇది నిజమైన క్రైస్తవ పద్ధతి. [కాల్విన్ మత విరోధి అని అలాగే యహువః గురించి సత్యాన్ని కలిగియున్న వ్యక్తిని గుంజపై దహించిన వ్యక్తి అని పాఠకులు గుర్తుంచుకోవాలి!]

కాల్విన్ ఉదాహరణ ప్రామాణికమైనదైతే, తదుపరి యెహోవాసాక్షులు లేదా మార్మోన్ సేవకులు మన గడప వద్దకు వచ్చినప్పుడు, మనం వారిని శారీరకంగా పట్టుకోవాలి, వారిని గుంజకు బంధించాలి మరియు వారి నుండి మానవ కొవ్వొత్తులను తయారు చేయాలి. ఒక క్రైస్తవ మతస్థుడు, ముఖ్యంగా ఒక పేరున్న వేదాంతవేత్త ఇలా చేస్తాడని మీరు ఊహించగలరా? చేసినట్లయితే, అలాంటి వ్యక్తి నిజంగా రక్షించబడ్డాడని మరియు అతని ప్రత్యేక సిద్ధాంత విలక్షణతలకు మీరు కట్టుబడి ఉండారని మిమ్మును మీరు బలవంతం చేయగలరా?

అదేవిధంగా, ఇద్దరు వ్యక్తులు పౌలుకు తెలిసిన కొందరు క్రైస్తవుల విశ్వాసాన్ని నాశనం చేస్తున్నప్పుడు అతడు వారికి హుమెనైయు మరియు ఫిలేతు అని బహిరంగంగా పేరు పెట్టినట్లు తప్పుడు బోధకులు బహిరంగంగా పేరు పెట్టబడాలి: “కొరుకుపుండు ప్రాకినట్టు వారిమాటలు ప్రాకును, వారిలో హుమెనైయును ఫిలేతును ఉన్నారు; వారుపునరుత్థానము గతించెనని చెప్పుచు సత్యము విషయము తప్పిపోయి, కొందరి విశ్వాసమును చెరుపుచున్నారు." (2 తిమోతి. 2: 17-18).a

జాన్ కాల్విన్కాల్విన్ ఈ గ్రంథ మార్గదర్శకాలను ఎందుకు తీవ్రంగా ఉల్లంఘించాడు? మత విరోధులతో ఎలా వ్యవహరించాలో పౌలు యొక్క పరిశుద్ధాత్మ-ప్రేరేపిత వాక్యాలు (మరియు ఉదాహరణలు) కాల్విన్ ద్వారా పూర్తిగా వ్యతిరేకించబడినందున, కాల్విన్ పౌలు కంటే భిన్నమైన ఆత్మ ద్వారా నడిపించబడ్డాడని భావించడం సురక్షితం కాదా? ఇంకా, జాన్ కాల్విన్ జీవితం గురించి ఈ వాస్తవాలు మన కాలంలో ఎందుకు అరుదుగా ప్రస్తావించబడుతున్నాయి? ఈ చివరి ప్రశ్నకు సమాధానం స్పష్టంగా ఉంది. అయితే రెండు ప్రశ్నలూ తమ పేరును గర్వంగా చెప్పుకునే కాల్వినిస్టులకు ఇబ్బందికరంగా మరియు ఖండనగా ఉన్నాయి! మతాన్ని బట్టి వారు అనేకులు మరియు మన భూమి మరియు ప్రపంచమంతటా వ్యాప్తి చెందుతున్న విషయాలపై వారి శక్తి మరియు ప్రభావమే గొప్ప ప్రభావాన్ని కలిగి ఉన్నందున, వాటి స్థాపకుడి గురించి ఈ సమాచారం అరుదుగా, ఎప్పుడైనా వినబడుతుంది. కాల్వినిజం వ్యవస్థాపకుడి గురించి చాలా మంది ప్రజలు ఇప్పుడు మొదటిసారిగా చదివినప్పుడు ఆశ్చర్యకరమైన వాస్తవాలను నేర్చుకుంటున్నారు!

"1553 లో స్పానిష్ వైద్యుడు మరియు ఔత్సాహిక వేదాంతవేత్త అయిన మైఖేల్ సెర్వెటస్‌ను పట్టుకోవడంలో మరియు మరణ శిక్ష అమలు చేయడంలో అతడు పోషించిన పాత్ర కంటే గొప్పగా కాల్విన్ చరిత్రలోని మరి ఏ తీర్పు చరిత్రను ప్రభావితం చేయలేదు. ఈ సంఘటన కాల్విన్ సాధించిన అన్నిటినీ కప్పివేసింది మరియు అతని ఆధునిక అనుచరులను ఇబ్బందిపెడుతూనే ఉంది."19

మూడు ముఖ్యమైన ప్రశ్నలు మిగిలి ఉన్నాయి: (1) జాన్ కాల్విన్ మైఖేల్ సెర్వెటస్‌ను నరహత్య చేయుటను లేఖనాత్మకంగా సమర్థించవచ్చా? (2) లేఖనం ప్రకారం, ఒక నరహంతకుడు, ఆధ్యాత్మికంగా లేఖనాలను సరిగ్గా వివరించుటకు అధికారం కలిగి ఉంటాడా? (3) ప్రకటన 21: 8 ప్రకారం ఒక నరహంతకుడు రక్షింపబడతాడా?

ఈ సమాధానాలన్నీ కాల్విన్ యొక్క ప్రసిద్ధిచెందిన "పరిశుద్ధుల కాపుదల" సిద్ధాంతం యొక్క విశ్వసనీయతపై ప్రభావాన్ని కలిగి ఉంటాయి. విచారకరంగా, కాల్విన్ యొక్క క్రైస్తవ మత విధానం మన దేశంలో ప్రబలంగా ఉంది, కానీ అతని అభిప్రాయం లేఖనాధారమా? నిశ్చయంగా సమాధానం చెప్పడం అంటే కాల్విన్ యొక్క ద్వంద్వ "దైవవిధి సంకల్పం/ముందుగా నిర్ణయించబడుట" సిద్ధాంతం నిజమని చెప్పటమే, అంటే కొందరు పరలోకం కోసం ముందే నిర్ణయించబడతారు [బైబిల్‌లో పరలోకం ఎక్కడా రక్షించబడినవారి గమ్యం కాదు.] మరికొందరు తమ వైపునుండి స్వేచ్ఛా ఎంపిక లేకుండా నరకానికి ముందే నిర్ణయించబడతారు!20 ఇది చాలా లేఖనాలను ఉల్లంఘిస్తుంది, ముఖ్యంగా 2 పేతురు 3: 9: “కొందరు ఆలస్యమని యెంచుకొనునట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు గాని యెవడును నశింపవలెనని యిచ్ఛయింపక, అందరు మారుమనస్సు పొందవలెనని కోరుచు, మీ యెడల ధీర్ఘశాంతముగలవాడై యున్నాడు.”

సర్వెటస్ఇంకా, కాల్విన్ బోధనలు సిలువపై యహూషువః చేసిన పని అనంతమైనది కాదని ప్రకటించాయి, ఎందుకంటే ఆ బోధన ప్రకారం, యహూషువః ప్రతి మానవుడి కోసం తన రక్తాన్ని చిందించలేదు, కానీ ఎన్నుకోబడిన వారి కోసం — రక్షింపబడుటకు ముందే నిర్ణయింపబడినవారి కోసం మాత్రమే చిందించాడు. ఇది 1 యోహాను 2: 2 ద్వారా స్పష్టంగా ఖండించబడింది: "ఆయనే మన పాపములకు ప్రాయశ్చిత్తమైయున్నాడు; మన పాపములకు మాత్రమేకాదు. సర్వలోకమునకును శాంతికరమై యున్నాడు."

అలాగే, అతడి "పరిశుద్ధుల కాపుదల" సిద్ధాంతం ప్రకారం, ఒకరు తిరిగి జన్మించిన తర్వాత ఘోరమైన పాపాలు చేసినప్పటికీ మరియు/లేదా ఏదైనా సిద్ధాంతపరమైన మత విధ్వంస విశ్వాసాలను స్వీకరించినప్పటికీ, అలా చేయకూడదని రుజువు చేసే అనేక లేఖన ఉదాహరణలు మరియు హెచ్చరికలను ఉల్లంఘించినప్పటికీ, యహువః యొక్క శక్తి నిజంగా రక్షించబడిన వ్యక్తిని సురక్షితంగా ఉంచుతుందని నొక్కి చెప్పబడుతుంది.

స్థాపకుడి నుండి ఈ రోజు మన వరకు, "పరిశుద్ధుల కాపుదల" సిద్ధాంతం (సాధారణంగా "ఒకసారి రక్షించబడితే అన్నివేళలా రక్షించబడినట్లే" గా ప్రాచూర్యంలో ఉన్న సిద్ధాంత) తరచుగా కృప‌ అనే పతాకం కింద బోధించే "అనైతికతకు ఉత్తరవు" గా ఉంటుంది యూదా 3, 4 చూడండి). కాల్విన్ సొంత వేదాంతశాస్త్రం సెర్వెటస్‌కి వ్యతిరేకంగా తన క్రియలను అనుమతించినట్లే, మన కాలంలో కూడా చాలా మంది లైంగిక అనైతికులుగా, అబద్దీకులుగా, తాగుబోతులు, అత్యాశతో నిండినవారిగా ఉంటూనే మోక్షాన్ని ప్రకటిస్తున్నారు. ఇది కాల్విన్ యొక్క దిక్కుమాలిన కృపా సందేశం — మరొకరిని బహిరంగంగా కాల్చివేసి మరియు తరువాత తన 10 సంవత్సరాలు ఏడు నెలలు జీవిత కాలంలో, తన నేరం గురించి బహిరంగంగా పశ్చాత్తాపపడని ఒక వ్యక్తి నుండి "కుళ్ళు పుండు లాగా వ్యాపించిన ఒక బోధన".

"ఈ ఇద్దరు వ్యక్తుల పేర్లు ప్రపంచంలో తెలిసియున్నంత వరకు సెర్వెటస్ బూడిద అతనిపై [కాల్విన్] కేకలు వేస్తుంది." 21


1 "కేవలం రెండు అంశాలలో, ముఖ్యంగా, సెర్వెటస్ ఖండించబడ్డాడు- అవి త్రిత్వ-వ్యతిరేకత మరియు శిశు-బాప్తీస్మ వ్యతిరేకత" (రోలాండ్ హెచ్. బైంటన్, హంటెడ్ హెరెటిక్, ది బీకాన్ ప్రెస్, 1953, పేజి 207). వ్యాఖ్య: శిశు బాప్తీస్మాన్ని తాను తిరస్కరించుటకు సంబంధించి సెర్వెటస్ ఇలా అన్నాడు, "ఇది అపవాది యొక్క ఆవిష్కరణ, మొత్తం క్రైస్తవ మతం యొక్క నాశనం కోసం ఒక నరక సంబంధమైన అసత్యం" (ఐబిడి., పేజి 186.). శిశు బాప్తీస్మానికి సంబంధించి ఇలాంటి ప్రకటనకు మన కాలంలోని చాలా మంది క్రైస్తవులు హృదయపూర్వకంగా "ఆమెన్" అని చెప్పగలరు. అయితే, నిజానికి, ఇలా చెప్పినందునే సెర్వెటస్‌ను కాల్వినిస్టులు మరణశిక్షకు గురి చేశారు!

2 షాఫ్-హెర్జోగ్ ఎన్‌సైక్లోపీడియా ఆఫ్ రిలిజియస్ నాలెడ్జ్, బేకర్ బుక్ హౌస్, 1950, పే. 371.

3 ది వైక్లిఫ్ బయోగ్రాఫికల్ డిక్షనరీ ఆఫ్ ది చర్చ్, మూడీ ప్రెస్, 1982, పే. 73.

4 స్టీఫెన్ హోల్ ఫ్రిచ్‌మన్, మెన్ ఆఫ్ లిబర్టీ, కెన్నికాట్ ప్రెస్, ఇంక్., 1968, పే. 8

5 వాల్టర్ నిగ్, ది హెరెటిక్స్, ఆల్ఫ్రెడ్ A. నాఫ్, 1962, పే. 328.

6 హూజ్ హూ ఇన్ చర్చ్ హిస్టరీ, ఫ్లెమింగ్ హెచ్. రెవెల్ కంపెనీ, 1969, పే. 252.

7 స్టీవెన్ ఓజ్మెంట్, ది ఏజ్ ఆఫ్ రిఫార్మేషన్ 1250-1550, యేల్ యూనివర్సిటీ ప్రెస్, 1980, పే. 370.

8 హెరెటిక్స్, పే. 326.

9 ది వైక్లిఫ్ బయోగ్రాఫికల్ డిక్షనరీ ఆఫ్ ది చర్చ్, పే. 366.

10 జాన్ F. ఫుల్టన్, మైఖేల్ సెర్వెటస్ హ్యూమనిస్ట్ మరియు అమరవీరుడు, హెర్బర్ట్ రీచ్నర్, 1953, పే. 35.

11 హెరెటిక్స్, p. 327.

12 హంటెడ్ హెరెటిక్, పే. 214. వ్యాఖ్య: బైబిల్‌లో ఎక్కడా మనం ఒకరి రక్షణకోసం ఈ విధమైన ప్రాధాన్యతని చూడలేదు. చనిపోతున్న ఖైదీ, ఫిలిప్పీయుల చెరసాల నాయకుడు మరియు కొర్నేలీ అందరూ యహువఃపై అత్యంత విశ్వసనీయమైన విశ్వాసంతో రక్షించబడ్డారు.

13 మైఖేల్ సెర్వెటస్ హ్యూమనిస్ట్ అండ్ మార్టిర్, పే. 36.

14 జాన్ హస్ వివిధ రోమన్ కాథలిక్ మతవిశ్వాసాలపై దాడి చేశారు, ట్రాన్స్‌బస్టాంటియేషన్ (పరివర్తన), పోప్‌కు విధేయత, పరిశుద్ధులపై నమ్మకం, పౌరోహిత్యం ద్వారా పాప విమోచన, భూసంబంధమైన పాలకులకు బేషరతు విధేయత మరియు సారూప్యత మొదలైనవి. మతం మరియు విశ్వాసం విషయాలలో హస్ పవిత్ర లేఖనాలను మాత్రమే నియమంగా మార్చాడు. వైక్లిఫ్ బయోగ్రాఫికల్ డిక్షనరీ ఆఫ్ ది చర్చి చూడండి, పే. 201.

15 హెరెటిక్స్, p. 326.

16 ఐబిడ్., పేజీలు. 328, 329.

17 ఉదాహరణకు, పొలంలో గురుగుల యొక్క ఉపమానానికి యహూషువః ఇచ్చిన అర్థానికి స్పష్టమైన విరుద్ధంగా (మత్తయి. 13: 24-43) ప్రభువు మనకు "పొలం అనగా ప్రపంచం" అని చెప్పాడు (వచనం. 38) జాన్ కాల్విన్ "పొలం అనగా సంఘం" అని బోధించాడు. చూడండి: కాల్విన్స్ వెర్స్ బై వెర్స్ కామెంటరీ ఆన్ మాథ్యూస్ గాస్పెల్".

18 ది ఏజ్ ఆఫ్ రిఫార్మేషన్ 1250-1550, పేజీలు 368,369. బోల్‌సెక్ పుస్తకంలో అతడు కాల్విన్‌పై ఆరోపణలు చేసినట్లుగా హిస్టోయిర్ డి లా వి, మోయూర్స్, యాక్టెస్, డాక్ట్రిన్, కాన్స్టాన్స్ ఎట్ మోర్ట్ డి జీన్ కాల్విన్, వంటివి పేర్కొనబడ్డాయి. పబ్. లియోన్ ఎన్ 1577, ఎడిషన్. M. లూయిస్-ఫ్రాంకోయిస్ చాస్టెల్ (లియోన్, 1875).

19 ఐబిడ్., పే. 369.

20 హిప్పోకు చెందిన అగస్టీన్, కాథలిక్ వేదాంతవేత్త, ఇతడి నుండే జాన్ కాల్విన్ తన "దైవవిధి సంకల్పం/ముందుగా నిర్ణయించబడుట" ఆలోచనలను తీసుకుని ప్రతిపాదించారు.


ఇది డాన్ కార్నర్ రాసిన WLC యేతర కథనం.

మేము అసలు వ్యాసం నుండి సమస్త అన్య నామములను మరియు తండ్రి - కుమారుడు అనే శీర్షికలను తొలగించి, వాటి స్థానాన్ని అసలు నామములతో భర్తీ చేసాము. ఇంకా, ఇక్కడ ఇవ్వబడిన లేఖనాలలో తండ్రి మరియు కుమారుని నామములను బైబిల్ యొక్క మొదటి ప్రేరేపిత రచయితలచే వ్రాయబడిన విధంగా మేము పునరుద్ధరించాము. -డబ్ల్యుఎల్‌సి బృందం.