Print

యుగాల యొక్క బేరం & చివరి పరీక్ష

పార్ట్ 1: ఈ బేరం యొక్క దౌర్భాగ్యపు తీవ్రత స్థాయిని గ్రహించుట

చాలా సరసమైన ధరలో ఎప్పటికీ అత్యంత విలువైన ఆస్తిని సంపాదించుకొనుటకు మనము నిజమైన జీవితకాలపు అవకాశాన్ని కలిగి ఉన్నాము. ఈ ఆస్తి యొక్క విలువ సమస్త ఇతర ఆస్తుల తరగతులను మరుగుపరుస్తుంది. ఈ ఆస్తి [ఈ టాబ్లాయిడ్ యొక్క దృష్టి] చాలా విలువైనది మరియు బిట్ కాయిన్, బంగారం, వెండి లేదా అత్యంత ఖరీదైన 24-క్యారెట్ గ్రాఫ్ పింక్ వజ్రం కన్నా అనంతమైన విలువ గలది. ఈ ఆస్తితో పోల్చదగినది ఏదియు లేదు.

పింక్ వజ్రంప్రశ్న- మీరు చెప్పేది నిజమేనా? నేను చాలా బీదవాడ నైనప్పటికీ ఈ అమూల్యమైన ఆస్తిని నేను పొందగలనా?

జవాబు - సమాధానం స్పష్టం: అవును, ఎవరైనా ఈ ఆస్తిని పొందుకోవచ్చు. ఈ ఆస్తికి చెల్లించాల్సిన ధర నేటి పేద జీవనశైలికి అందుబాటులో ఉంది.

ప్రశ్న- అలా అయితే దాని గురించి నేను మునుపెన్నడూ ఎందుకు వినలేదు?

జవాబు - ఈ ఆస్తిని మీరు వెంటాడుటను ఇష్టపడని శక్తుల కారణంగా. ఎప్పుడైతే ఎక్కువమంది ఈ ఆస్తిని కనుగొందురో, అప్పుడు వారు తమ నియమాలను మరియు చట్టాలను విచక్షణారహితంగా వెంబడించే వ్యక్తులతో పోరాడాలి. ఈ ఆస్తిని పొందిన వారు తమకు ఈ ఆస్తిని అందించినవారికి తమ మొట్టమొదటి మరియు అత్యంత విశ్వసనీయతను ఇవ్వాలి. ఈ ఆస్తి గురించి ప్రజలకు అవగాహన కల్పించుట వారి యొక్క చివరి ప్రాధాన్యత. జన సమూహాలు తమకు లోబడి ఉండాలని ఈ ప్రపంచం యొక్క పాలకులు కోరుకొందురు.

ప్రశ్న: దయచేసి మీరు మాట్లాడుతున్న ఈ ఆస్తిని గురించి చెప్పండి. దాని గురించి మరింత తెలుసుకోవాలని ఆశపడుతున్నాను.

జవాబు - మేము ఈ ఆస్తిని గురించి మాకు తెలుసినదంతయు (అది ఎలా సంపాదించాలో) మీకు తెలియజేయడానికి చాలా సంతోషంగా ఉన్నాము. మరియు మన మధ్య గొప్ప గొప్ప ధనవంతుల కంటే బాగా పేదవారు మరింత సులభంగా ఈ ఆస్తిని పొందుకొనగలరని మీకు మీరుగా తెలుసుకుంటారు. మీరు ఈ ఆస్తి గురించి తెలుసుకున్నప్పుడు, మీరు ధనమును కలిగి ఉన్నంత మాత్రాన సమస్య పరిష్కారమవదని (వీలు పడదని) వెంటనే మీరు చూస్తారు.

ప్రశ్న- మీరు నా ఉత్సుకతను మరింత ఎక్కువ చేశారు. మీరు అదేమిటో చెప్పకుండా ఇప్పటివరకు మాట్లాడుతున్న ఆ ఆస్తిని గురించి దయచేసి ఇప్పుడే నాకు చెప్పండి.

జవాబు - మీరు పొందుకోగల అత్యంత విలువైన ఈ ఆస్తిని గూర్చి సమాధానం చెప్పుటకు ముందు మేము మిమ్మల్ని ఈ క్రింది ప్రశ్నలు అడగాలనుకుంటున్నాము: మీరు ఒక అల్లకల్లోల సముద్రంలో మునిగిపోతున్నట్లయితే, మీ దేహాన్ని తేలియాడజేయు పరికరం ఏదియూ మీ దగ్గర లేనట్లయితే, అలాంటి సమయంలో మీరు కలిగి యుండవలసిన అత్యంత విలువైన ఆస్తి ఏమిటని మీరనుకుంటున్నారు: కుప్పలకొలది వెండి నాణేలా లేదా ఒక వ్యక్తిగత తేలియాడే పరికరమా?

నీటిలో నాణేలుజవాబు - మీరు ఒక సాధారణ మేధస్సు గల ఒక సాధారణ వ్యక్తి అయితే, మీరు తక్షణమే ఒక వ్యక్తిగత తేలియాడే పరికరాన్ని ఎంపిక చేసుకుంటారు. మీరు మునిగిపోతున్నప్పుడు ఎవరో ఒక వ్యక్తి కొన్ని వెండి లేదా బంగారు నాణేలను విసిరిన యెడల వాటి విలువ ఎంత? ఈ నాణేలు మునిగిపోతున్న మీ శరీరం కంటే వేగంగా కల్లోల సముద్రం యొక్క లోతులో మునిగిపోతాయి. మీకు ఇతరత్రా దేని కంటెను అత్యంత విలువైనది ఏమిటంటే, మీరు దానిపై ఆనుకొనగా మీ శరీరాన్ని మునిగిపోకుండా చేయు పరికరాన్ని మీరు కలిగి యుండుట.

ప్రశ్న- తేలియాడే పరికరానికి మరియు మీరు మాట్లాడుతున్న అమూల్యమైన ఆస్తికి మధ్య గల సంబంధం ఏమిటి?

జవాబు - ఇది ఒక ఉదాహరణ. మీరు చూడండి, మనము ఒక కల్లోలభరిత సముద్రంలో భౌతికంగా మునిగిపోవుట లేదు, కానీ మనము పాపం అనే సముద్రంలో మునిగిపోతున్నాం. త్వరలో లేదా తరువాత, మనము మన పాపాల వలన మరణిస్తాము. ఈ వాస్తవం నుండి తప్పించుకోలేము. "పాపము యొక్క జీతము మరణము" అని బైబిలు చెబుతుంది (రోమీయులు 6:23). మనం కల్లోల సముద్రంలో మునిగిపోతున్న వ్యక్తి వలె నాశనమౌతాము. ఎవరైనా మనకు "వ్యక్తిగత తేలియాడే పరికరాన్ని" విసరకుండా ఉంటే, మనము సముద్రపు అడుగునకు మునిగిపోతాము.

ప్రశ్న- మళ్ళీ, తేలియాడే పరికరానికి మరియు మీరు మాట్లాడుతున్న అమూల్యమైన ఆస్తికి మధ్యగల సంబంధం ఏమిటి?

జవాబు - రోమీయులు 6: 23 లోని రెండవ భాగం ఇలా చెబుతోంది: "అయితే ఎలోహీం కృపావరము మన రక్షకుడైన యహూషువః మెస్సీయ నందు నిత్య జీవము". అవును, మనం మరణించవలసిన వారమై యున్నాము, అయితే యహువః తన కుమారుడైన యహూషువః మెస్సీయ ద్వారా మనకు (వ్యక్తిగత) తేలియాడే పరికరాన్ని అందజేసెను.

ప్రశ్న- మన వ్యక్తిగత తేలియాడే పరికరంగా యహూషువః ఎలా పనిచేయగలడు? నాకు ఈ సంబంధం అర్థం కాలేదు.

జవాబు - ఇది ఒక మంచి మరియు సహేతుకమైన ప్రశ్న. మీరు చూడండి, ఈ బల్లపరుపు భూమిపై నివసించినవారు అందరూ పాపం చేసియున్నారు. అనగా అందరూ అని అర్థం. చివరికి ప్రవక్తలలోను మరియు అపొస్తలలలోను ఉత్తమమైన వారి జీవితాల్లో కూడా వారి జీవితంలో ఏవో కొన్ని స్థానాలలో పాపం చేసి యున్నారు. కావున వారు మన వ్యక్తిగత తేలియాడే పరికరంగా ఉండలేరు. అయితే, మన వలె మానవ స్వభావాన్ని కలిగి మరియు ఒక పాపము లేని జీవితాన్ని గడిపిన వ్యక్తి: యహువః కుమారుడైన యహూషువః, ఆయన మరియు ఆయన మాత్రమే మన వ్యక్తిగత తేలియాడే పరికరంగా పనిచేయగలడు.

తేలియాడే పరికరం

ప్రశ్న- ఇది ఎలా సాధ్యం?

జవాబు - మీరు చూడండి, యహూషువః ఒక్కరు మాత్రమే ఒక పాపము లేని జీవితం జీవించిన కారణంగా, మరియు అలాగే ఆయన 100% మానవ మరియు 100% దైవ స్వభావాన్ని కలిగి యుండుటవలన, మరియు మనము ఆయన మూలంగా సృష్టించబడినందున (కొలస్సీయులకు 1:16 చూడండి), ఆయన తన పాపములేని జీవితమును మనకు బహుమతిగా మంజూరు చేయగలడు. తన జీవితం సృష్టించబడిన జీవులందరితో సమానం కారణంగా మరియు ఇంకా. అందువలన, ఆయన తన నీతిని మనకు ఇచ్చుటకు ఆశ కలిగి యుండెను, ఇది ఒక వెలకట్టలేని బహుమానం [దీనితో ఎంత మొత్తం ధనమైనా సరితూగదు]. దీనిని బహూకరించుటకు ఆయన ఆశ కలిగి ఉండెను. యహూషువః "మన పాపముల నిమిత్తం అప్పగించబడి, మరియు మన విమోచన నిమిత్తం తిరిగి లేపబడ్డాడు." అని రోమీయులకు ​​4:25 చెప్పుచుండెను. మరణం నుండి యహువః తన కుమారుడైన యహూషువః ను లేపిన వాస్తవం యహూషువః ఒక పాపపు జీవితాన్ని గడిపెననుటకు ఒక నిర్ధారణగా ఉన్నది. యహూషువః కనీసం ఒక్కసారి పాపము చేసినను, తండ్రి మరణం నుండి ఆయనను లేపడు, ఎందుకంటే "యహువః మనుష్యులను లక్ష్యపెట్టువాడు/ పక్షపాతి కాడు." (అపోస్తలుల కార్యములు 10:34). యహువః మనుష్యులను లక్ష్యపెట్టువాడయితే, ఆయన ఆదాము పాపాన్ని గురించి పట్టించుకోకుండా విడిచిపెట్టి, మానవ శరీరాన్ని స్వీకరించి మరియు శిలువ ద్వారా మరణం యొక్క అవమానాన్ని భరించుట నుండి తన కుమారుని తప్పించి యుండేవాడు. కానీ ఆదాము పాపం క్షమింపబడకుండా మోక్ష ప్రణాళికను నెరవేర్చుటకు తండ్రికి ఏ ఇతర మార్గమూ లేదు. మరియు మోక్ష ప్రణాళిక యొక్క చారిత్రక విజయం తన నీతిని మనకు అందించుటలో యహూషువః యొక్క ఆశగా ఉన్నది.

ప్రశ్న- యహూషువః తన నీతిని మనకు మంజూరు చేయుటకు ఆశ కలిగి యుండెను అంటే ఏమిటి? దయచేసి దానిని వివరించండి.

జవాబు - మనము మునుపు ఎన్నడూ పాపం చేయని వారివలె తండ్రి తీర్పు సింహాసనానికి ముందు నిలబడుదుము, తన కుమారుని నీతి వస్త్రము మనలను కప్పి యుంచుటవలన అలా నిలబడగలము. ఇటువంటి ప్రత్యేక హక్కు యొక్క అమూల్యతను మానవులు అర్థం చేసుకొనుట అసాధ్యం.

ప్రశ్న- ఇది నిజంగా ఆచరణాత్మక విధానంలో ఎలా పని చేస్తుంది? నేను తండ్రి ముందు నీతిమంతునిగా నిలబడునట్లు యహూషువః యొక్క నీతి వస్త్రం నన్ను కప్పి యుంచాలంటే నేను ఏమి చేయాలి?

జవాబు - ఆయన నీతి వస్త్రం మిమ్మును కప్పియుంచునట్లు చేయుటకు మీరు ఏమియు చేయలేరు. యహూషువః ముందు నిలబడి, తన నీతి వస్త్రాన్ని ధరింపజేయమని ఆయనను అడుగుట మినహాయించి మరే ఇతర కార్యము నీవు చేయనవసరం లేదు. మీ నుండి ఏ ఇతర క్రియయు అవసరం లేదు. క్రియలు ఈ నీతి వస్త్రాన్ని సంపాదించలేవు. ఇది 100% ఉచితం. యహువః దృష్టిలో మన నీతి క్రియలు "మురికి గుడ్డలు" వలె ఉన్నాయి. (యెషయా 64: 6 చూడండి.) మనల్ని తండ్రి ముందు ఇష్టంగా నిలబెట్టునట్లు మనం చేయగలుగునది ఏదియు లేదు.

ప్రశ్న- నేను యహూషువః యొక్క నీతిని పొందుకొనుటకు నేను ఏమియు చేయవలసిన అవసరం లేదని నమ్ముట నాకు చాలా కష్టంగా ఉంది. మీ వాదనకు బైబిలు మద్దతును చూపగలరా?

జవాబు - అవును, మేము చూపగలము. ఈ విషయాన్ని మా అంతట మేము తయారు చేయలేదు. మా బోధనలన్నిటినీ ఆయన పరిశుద్ధ వాక్యంపై ఆధారపరుస్తాము. జెకర్యా 3 వ అధ్యాయంలో, మనం యహూషువః యొక్క నీతి వస్త్రాన్ని ఎలా పొందాలి మరియు దానిని పొందిన తర్వాత ఏమి చేయాలి అని తెలియజేసే మార్గం చూపబడినది. ఈ అధ్యాయంలో "ప్రధాన యాజకుడైన యెహోషువ" ప్రతి పాపికి చిహ్నంగా ఉన్నాడు. అతడు "మురికి వస్త్రాలను ధరించుకొని" యహూషువః ముందు నిలబడి ఉన్నాడు (వచనం 3). అతడి కుడి వైపున సాతాను నిలబడి, యెహోషువ తన మురికి వస్త్రాలతో యహూషువః ముందు ఎందుకు నిలబడెను అని నిరసన తెలుపుచుండెను! వేరొక మాటలో చెప్పాలంటే, తన మురికి వస్త్రాల వల్ల యహోషువ తనకు చెందినవాడని, మరియు యహూషువః ముందు నిలబడటానికి వీలు లేదనియు సాతాను నిరసన తెలిపుచుండెను. అతడు యహూషువః యొద్ద నుండి దూరంగా వెళ్ళి, తనను/ సాతానును సేవించుటను కొనసాగించాలని వాదించెను.

బైబిల్ పఠనం మరియు ప్రార్ధన

ప్రశ్న- జెకర్యా 3వ అధ్యాయంలో సాతాను యొక్క నిరసనకు యహూషువః ఏమి చేశాడు?

జవాబు - ఈ భూమిపై ఉన్నప్పుడు "నా యొద్దకు వచ్చినవానిని నేనెంత మాత్రమును బయటకి త్రోసివేయను" (యోహాను 6:37) అనే వాగ్దానంతో మనలను బలపరిచిన యహూషువః సాతాను వైపు తిరిగి తన తండ్రి నామమున రెండు సార్లు గద్దించెను (2 వ వచనం). "యెహోషువ" అగ్ని నుండి బయటకు లాగబడెననియు, మరియు ఇప్పుడు అతడు తన సొత్తు అనియు, మరియు సాతానుకి తనపై ఎటువంటి అధికారం లేదని యహూషువః సాతానుతో చెప్పెను, అయినప్పటికీ, యెహోషువ ఆపాయం నుండి తప్పింపబడి వచ్చినందున అతడు తన మురికి వస్త్రాలతో వచ్చెను. అప్పుడు యహూషువః ఊహించలేని గొప్ప కార్యమును చేసెను: 5 వ వచనంలో ఆయన “యహోషువ యొక్క మైలబట్టలు తీసివేసి అతడిని ప్రశస్తమైన వస్త్రములతో (యహూషువః యొక్క నీతితో) అలంకరింపజేయుడని” తన దూతలకు ఆదేశించెను. చివరికి మురికి వస్త్రాలను తొలగించే పని కూడా "యెహోషువ" కాదు కానీ దేవదూతలు చేసెను. వేరొక మాటలో చెప్పాలంటే, మన మురికి అలవాట్లను మరియు పాపాలను వదిలించుకొనుటలో దైవిక శక్తితో దేవదూతలు మనకు సహాయపడతారు. ఆయన పరిశుద్ధ నామమునకు స్తోత్రం చెల్లించుడి. మచ్చలేని నూతన వస్త్రాలను ‘సంపాదించుకొ'నుటకు’ ప్రత్యేకంగా ఏదైనా చేయుమని యెహోషువతో చెప్పలేదు . యెహోషువ చేయవలసిన ఏకైక విషయం అతడి మైల వస్త్రాలను తొలగించి నూతన వస్త్రాలను ధరింపజేయుచున్న దూతల పనిని ఆటంకపరచకుండా ఉండుటయే. నీవు యహూషువః యొక్క నీతితో కప్పబడునట్లు, నీ మురికి వస్త్రాలను ఆయన దూతలకు అప్పగించుటకు సిద్ధంగా ఉన్నావా?

ప్రశ్న- తన పూర్వపు మురికి వస్త్రాల స్థానంలో కళంకములేని నూతన వస్త్రాలు ధరింపజేయబడిన తర్వాత, ప్రతి పాపికి ప్రతినిధిగా నిలబడియున్న (జెకర్యా 3) యెహోషువకు ఏమి జరిగింది?

జవాబు - యహూషువః యెహోషువకు ఒక గౌరవప్రదమైన హెచ్చరికను జారీ చేసెను, మరియు ఆయన తన తండ్రి నామములో ఈ హెచ్చరికను జారీ చేసెను. వేరొక మాటలో చెప్పాలంటే, అది అంతకంటే ఎక్కువ కష్టమైనది కాదు. ఆయన యెహోషువను ఇలా హెచ్చరిస్తున్నాడు: “సైన్యములకు అధిపతియగు యహువః సెలవిచ్చునదేమనగా నా మార్గములలో నడుచుచు నేను నీ కప్పగించిన దానిని భద్రముగా గైకొనిన యెడల, నీవు నా మందిరము మీద అధికారివై నా ఆవరణములను కాపాడు వాడవగుదువు; మరియు ఇక్కడ నిలువబడు వారికి కలిగినట్లు నా సన్నిధిని నిలుచు భాగ్యము నీ కిత్తును (7 వ వచనం). యహూషువః హెచ్చరిక యొక్క అర్థం: ఇప్పుడు అతడు యహూషువః యొక్క నీతితో అలంకరించబడెను గనుక అతడు ఆయన మార్గాలలో నడవాలని హెచ్చరించబడెను. వేరే మాటలో చెప్పాలంటే, యహూషువః మాట్లాడుతూ, “నేను నీ పూర్వపు పాపాలను తొలగించితిని, మరియు నేను నిన్ను నా సొంత నీతితో అలంకరించితిని (ఇది నాకు నా రక్తం యొక్క విలువతో సమానం), అయితే ఇప్పుడు మీరు ఎల్లప్పుడూ నా మార్గాల్లో నడచునట్లు నా తండ్రి యెదుట తీర్మానించుకోవాలి”. ఆయన నీతిని ధరించుకొని యుండుటకు ఈ షరతును నెరవేర్చవలసి ఉంటుంది. లేని యెడల, యెహోషువ యొక్క మైల వస్త్రాలను తొలగించి, వాటిని సాతాను వైపునకు విసిరి వేసిన అదే దేవదూతలు, గతంలో మైల వస్త్రాలను తొలగించినప్పుడు గల అదే వేగంతో అతడి యొక్క నూతన మరియు కళంకము లేని వస్త్రాలను తొలగించుటకు సిద్ధంగా ఉంటారు. యహూషువః యొక్క మచ్చలేని నీతి ఒక్క పాపంతోను కళంక పడలేదు. ఒకవేళ యెహోషువ యహువః మార్గంలో క్రమంగా నడవలేని కారణంగా తన నీతి వస్త్రాలను కోల్పోయినట్లయితే, సాతాను ఉత్సాహంగా తిరిగి యెహోషువకు మైల వస్త్రాలను ధరింపజేయుటకు సిద్ధంగా ఉన్నాడు.

ప్రశ్న- ఒకవేళ నేను యహూషువః యొక్క నీతి వస్త్రముతో అలంకరించబడిన తరువాత యహువః మార్గమున నడుచుటలో తప్పిపోయినట్లయితే, తిరిగి మళ్ళీ నేను కొత్తగా యహూషువః యొక్క ప్రశస్తమైన వస్త్రములచే ధరింపబడగలనా?

జవాబు - అవును, మీరు పొందవచ్చు, కానీ దానికి ఒక పెద్ద ప్రత్యేక నిబంధన ఉంది. యహూషువః యొక్క మచ్చలేని వస్త్రాలను కోల్పోయిన తరువాత వాటిని తిరిగి పొందే ప్రక్రియకు చాలా కాలం సమయం పడుతుంది, అయితే మన తండ్రి మనపట్ల కరుణను మరియు ఓపికను కలిగి ఉంటాడు. మానవ స్వభావం యొక్క అంతర్గత బలహీనతలు ఆయనకు తెలుసు. మనం మనల్ని కప్పియుంచే నీతి వస్త్రాన్ని మళ్ళీ మళ్ళీ కోల్పోవుచున్న క్రమంలో, మన నీతిని కాపాడుకొనుట మరింత కష్టతరంగా మారుతుంది, ఎందుకనగా పాపానికి వ్యతిరేకంగా మన ప్రతిఘటనను అభివృద్ధి చేయలేకపోవుట వలన. మరియు యహూషువః యొక్క నీతిని మనము కోల్పోయిన ప్రతిసారీ సాతాను మన బలహీనతలను నిలువునా దోపిడీ చేయటానికి ప్రయత్నించుటలో మనమీద మరొక్క అవకాశాన్ని పొందుతాడు. అంతేకాకుండా, మనకు తెలియకుండా, పరలోక న్యాయస్థానంలో మన విధిని నిర్ణయించే ఒక సమయం వస్తుంది. మన జీవితం తీర్పులోనికి తేబడు సమయం మనకు తెలియదు. ఆ తేదీ మనకు తెలియదు. మనం తీర్పు లోనికి వచ్చినప్పుడు పరలోక న్యాయస్థానంలో గల ధర్మాసనం మనం యహూషువః యొక్క నీతి వస్త్రాన్ని ధరించియున్నట్లు చూసిన యెడల, నిర్దోషులుగా తీర్పు జారీ చేయబడుతుంది మరియు తండ్రి శాశ్వతంగా ఈ తీర్పును ముద్రిస్తాడు. మన విధి నిర్ణయించబడు సమయం మనకు తెలియదు గనుక "అల్పకాలం పాప భోగములను అనుభవించుటకు" పాపంతో ఆటాడుట మరియు యహూషువః నీతిని పోగొట్టుకొనుట చాలా మూర్ఖత్వంగా ఉంటుంది. (హెబ్రీయులకు 11:25 చదవండి.) బదులుగా, హెబ్రీయులకు వ్రాసిన పత్రిక 12: 4 లో పౌలు ఉపదేశిస్తున్నట్లు మీరు “పాపముతో పోరాడునప్పుడు రక్తము కారునంతగా దానిని ఎదురించాలి”.

మనము మన మైల బట్టలను యహూషువః యొక్క నీతి వస్త్రాలతో మార్పిడి చేసుకోగల అవకాశాన్ని కలిగియున్నప్పుడు, నిజానికి మనకు యుగాల యొక్క బేరం అందించబడుతుంది. ఈ మార్పిడి ఎలా సాధ్యమవుననేదాన్ని మన బలహీనమైన మనస్సులు అర్థం చేసుకోలేవు, అయితే చాలా తక్కువకు అంటే ఈ బేరంలో మనం దానిని ఉచితంగా పొందగలము. మనం చెల్లించ వలసిన ఏకైక ధర మన మురికి వస్త్రాలను అప్పగించుటకు మన అంగీకారం మాత్రమే. తన వర్ణించలేని ప్రేమను బట్టి ఆయన పరిశుద్ధ నామమును స్తోత్రించుడి.

ఆయన నీతితో ధరించబడెను


2. వ భాగం: ఆయన మార్గంలో నడుచుట

యహూషువః ఆజ్ఞాపించినట్లు ఆయన మార్గాలలో నడవటానికి మనము నిర్ణయించుకోవాలి. ఆయన నీతితో అలంకరించబడిన తరువాత, మనం నడవ వలసిన ఆయన మార్గాలు ఏమిటో మనం అర్థం చేసుకోవాలి, అలా మనం నిత్యజీవము పొందగలము. తన మార్గాలలో నడవాలని యహూషువః ఇచ్చిన ఆజ్ఞను పాటించిన యొడల “ఇక్కడ నిలువబడు వారికి కలిగినట్లు నా సన్నిధిని నిలుచు భాగ్యము నీ కిత్తును” అని ఆయన మనకు వాగ్దానం చేసాడు. 7 వ వచనములో, మనకు ఎల్లప్పుడు దేవదూతలతో నివసించు అవకాశాన్ని ఇస్తానని వాగ్దానం చేసాడు. మనము ఆయన యొక్క మచ్చలేని నీతి వస్త్రమును కాపాడుకోగలిగితే, ఇది ఎంత ఆనందభరితమైన వాగ్దానం?

బైబిలును అధ్యయనం చేస్తున్న వ్యక్తి ప్రశ్న- ఆయన మార్గములు ఏమిటి? నేను వాటి నుండి దూరంగా పోకుండునట్లు ఆయన మార్గాలను తెలుసుకోవాలనుకుంటున్నాను.

జవాబు - మీరు ఆయన మార్గాలను వెదకుతున్నప్పుడు గుర్తుంచుకోవలసిన మొదటి విషయం, మీరు ఆయనకు మరియు ఆయన మాటకు ఏకైక అధికారాన్ని ఇవ్వవలసి ఉండుట. ఆయనకును నీకును మధ్య ఉండుటకు ఏ మానవునికి స్థలము లేదు. మానవులను అనుసరించకుండా, ఆయనను మాత్రమే అనుసరించినంతకాలం ఆయన మాత్రమే మీకు తన మార్గాలను బయలుపెడతాడు.

ప్రశ్న- నేను ఒక స్థిరమైన మరియు స్పష్టమైన మార్గంలో ఆయనను ఎలా అనుసరించగలను? ఆయన వాక్యానికి నా విశ్వాసంను, యుగాల యొక్క బేరం కోసం నా శాశ్వతమైన కృతజ్ఞతను చూపాలని కోరుకుంటున్నాను. నేను ఆయనను ప్రేమిస్తానని మరియు ఆయన మార్గములో నడుచుకొందునని చూపాలని కోరుకుంటున్నాను మరియు దాని వలన నాకు ఎలాంటి పరిస్థితి సంభవించినను. అన్నిటి తరువాత, ఆయన నా మురికి వస్త్రాలను తీసివేసి మరియు తన నీతి వస్త్రాలను నాకు ధరింపజేసెను. నేను నా ప్రాణం కంటే ఎక్కువగా ఆయనను ప్రేమిస్తున్నానని ఆయనకు ప్రత్యక్షంగా చూపించాలని కోరుకుంటున్నాను.

జవాబు - ఇది ఒక అద్భుతమైన ప్రశ్న మరియు ఆయన మార్గంలో నడుచు ప్రక్రియను ప్రారంభించుటకు సరైన విధానం. మన పరలోకపు తండ్రి ఒక రోషము గల ఎలోహ, మరియు ఆయన మీ హృదయాన్ని మరియు విశ్వసనీయతను 100% కలిగి ఉండాలని కోరుకుంటున్నాడు, ఎందుకంటే ఆయన యుగాల యొక్క బేరంను పొందుకొనుటకు అవసరమైనదంతయు ఇచ్చాడు. అందువలన మీరు తన యొక్క ప్రధాన శత్రువు, సాతానుతో కలిగియున్న సమస్త బంధాలను తెంచివేసికొనుటను ఆయన మీ నుండి ఆశించుచుండెను, అలా మీరు శాశ్వతంగా తన కుటుంబంలోనికి దత్తత చేయబడుదురు, మరియు ఆయన తన పరలోక రాజ్యంలోనికి మిమ్మును శారీరకంగా ప్రవేశపెట్టు వరకు మీ నడకలన్నిటిలోను మీకు మార్గనిర్దేశం చేయును. ఆయన వాక్యం ద్వారా మీరు చేయుటకు ఆదేశింపబడినది ఏమిటంటే: “మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. నీతికి దుర్ణీతితో ఏమి సాంగత్యము? వెలుగునకు చీకటితో ఏమిపొత్తు? మెస్సీయకు బెలియాలుతో ఏమి సంబంధము? అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది? ఎలోహీం ఆలయమునకు విగ్రహములతో ఏమిపొందిక? మనము జీవముగల ఎలోహీం ఆలయమైయున్నాము; అందుకు ఎలోహీం ఇలా సెలవిచ్చుచున్నాడు.నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి ఎలోహీం నైయుందును వారు నా ప్రజలైయుందురు. కావున మీరు వారి మధ్యనుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి; అపవిత్రమైన దానిని ముట్టకుడని అదోనాయ్ చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మును చేర్చుకొందును, మీకు తండ్రినై యుందును, మీరు నాకు కుమారులును కుమార్తెలు నైయుందురని సర్వశక్తిగల అదోనాయ్ చెప్పుచున్నాడు (రెండవ కొరింథీయులకు 6:14-18). మనము సమస్త సంఘములను మరియు వ్యవస్థీకృత మతాలను వెనుకకు వదిలి వెళ్ళుటకు ఆదేశించబడ్డాము, ఎందుకంటే అవి చీకటి దేవాలయాలుగా మరియు బెలియాలు ఆరాధనగా మారాయి. ఈ ఆజ్ఞ యొక్క సౌందర్యం ఏమిటంటే, మనము ఆయనకు కట్టుబడి ఉన్నప్పుడు, వెంటనే ఆయన మనలను స్వీకరించును మరియు మనలను తన కుమారులు మరియు కుమార్తెలుగా చేయును. తండ్రి యహువః యొక్క కుమారుడు లేదా కుమార్తెగా ఉండుట మరియు యహూషువః నీతితో అలంకరించబడుట కంటె లోతైన హక్కు మరియు గౌరవము వేరొకటి లేదని మీకు తెలుసా?

ప్రశ్న- పై యహువః యొక్క ఆదేశం మా సంస్థాగత సంఘానికి (మా చర్చ్ కి) వర్తిస్తుందని నాకు ఎలా తెలుసు?

నా ప్రజలారా, దానిని విడిచి రండిజవాబు - ఈ ప్రశ్నకు సమాధానమివ్వడం చాలా సులభం. “దానిని విడిచి బయటకు రండి” అని ఇచ్చిన యహువః యొక్క ఈ ఆదేశం, ఏ ఒక్క మినహాయింపు లేకుండా సమస్త సంఘాలకు వర్తిస్తుంది. ఎందుకంటే, సమస్త సంఘాలు యహువః యొక్క సూర్య-చంద్ర క్యాలండరును తిరస్కరించి రోమన్ కాథలిక్ సంఘం యొక్క అధికారిక క్యాలెండర్ అయిన గ్రెగోరియన్ క్యాలెండరును అనుసరించుటలో ఐక్యమవుట వలన. అందువలన, అలాంటి ఒక క్యాలెండర్లో మీరు 7 వ దినపు సబ్బాతును కనుగొని, ఆరాధించలేరు. సరైన సబ్బాతును ఆచరించుట అనేది మన ప్రేమను ఆయనకు చూపగల ప్రధాన మార్గాలలో ఒకటి. రోమ్ యొక్క క్యాలెండర్లో కనుగొనలేని తన పవిత్ర సబ్బాతు దినానికి మనం వెన్ను చూపినట్లయితే, మనం ఆయన మార్గాలలో నడవగలమని ఎలా అనుకొందుము?

ప్రశ్న- నేను మా చర్చి అనుసరిస్తున్న గ్రెగోరియన్ క్యాలెండరుపై ఎందుకు పరిశుద్ధ విశ్రాంతి దినమును కనుగొనలేను?

జవాబు - తండ్రి మరియు కుమారుడు భూమిని సృష్టించినప్పుడు, ఆయన పరిశుద్ధ దినాలను గుర్తించుటకు సూర్యుని మరియు చంద్రుని ఏర్పాటు చేసెనని ఆదికాండము 1:14 చెబుతుంది: “ఎలోహీం పగటిని రాత్రిని వేరుపరచునట్లు ఆకాశవిశాలమందు జ్యోతులు కలుగును గాకనియు, అవి సూచనలను కాలములను దిన సంవత్సరములను సూచించుటకై యుండు గాకనియు... పలికెను”.

ఈ వచనంలోని "కాలములు" అనే పదం మో’ఎడ్ అనే బైబిల్ పదం నుండి వచ్చింది. ఇది యహువః ప్రజల యొక్క ఆరాధనా సమావేశాలకు వాడబడిన బైబిలు పదం. కాబట్టి సృష్టిని సృష్టించిన సమయంలో, తండ్రి మరియు కుమారుడు సంయుక్తంగా ఆరాధన సమయాలను సూర్యుడు మరియు చంద్రుడు నిర్ణయించునట్లు నియమించారు. ఒక దినము ఎప్పుడు మొదలవుతుంది మరియు ఎప్పుడు ముగుస్తుంది అనేదాన్ని సూర్యుడు తెలియజేయును, అయితే నెలలో ఆరాధనా దినము ఏ దినమున వచ్చును అనేదాన్ని చంద్రుడు నిర్దేశించును. ఈ సంగతి కీర్తనలు 104: 19 లో మళ్ళీ మనకు తెలియజేయబడుతుంది "ఋతువులను తెలుపుటకై ఆయన చంద్రుని నియమించెను". మళ్ళీ, ఋతువులు అని ఇక్కడ వాడబడిన ఈ పదం హెబ్రీ పదం మో'ఎడ్ అనే నుండి వచ్చినదే. ఆరాధనా దినాలను తెలియజేయుటకు తండ్రియైన యహువః చంద్రుని నియమించారు. అందువల్ల, గ్రెగోరియన్ క్యాలెండర్ వలె చంద్రునితో సంబంధం లేని ఏ క్యాలెండర్ అయినను, యహువః యొక్క పరిశుద్ధ సబ్బాతు మరియు వార్షిక పరిశుద్ధ పండుగలను గుర్తించుటకు ఉపయోగించబడదు. యహువః క్యాలెండర్ ను తిరస్కరించుటకు మరియు దానిని రోమన్ క్యాథలిక్ చర్చి యొక్క క్యాలెండరుతో భర్తీ చేయుటకు ఎంచుకొనుట ద్వారా మీ సంఘం సత్యానికి ఎలా వెన్ను చూపెనో మీరు చూస్తున్నారా?

బైబిలును అధ్యయనం చేస్తున్న వ్యక్తి మీరు "వాటి నుండి బయటికి వచ్చుటకు" మిమ్మల్ని ప్రేరేపించగల ఇతర మరణకరమైన సిద్ధాంతాలను మేము చూపగలము, కానీ అది ఈ చిన్న వ్యాసం యొక్క పరిధిలో లేదు. ఈ వ్యాసం యొక్క ఉద్దేశ్యం ఏమిటంటే: పతనమైన ఇతర క్రైస్తవ వర్గాల మాదిరిగానే, మీ సంఘం కూడా, గ్రెగోరియన్ క్యాలెండరును ఆమోదించుట ద్వారా యహువః శత్రువు యొక్క శిబిరంలో చేరెను.

చివరి విజ్ఞప్తి:

మీరు యహూషువః ముందు నిలబడుటను మరియు దేవదూతలు మీ మైల బట్టలను తీసివేసి, నీతిమంతుడైన యహూషువః యొక్క కళంకము లేని వస్త్రముతో వాటిని భర్తీ చేయుటను కోరుదురా? మీరు ఆయన మార్గాల్లో నడుచుట ద్వారా ముగింపు వరకు ఆయనను అనుసరించుటకు తీర్మానించుకొందురా? మీరు యహువః తండ్రి యొక్క దత్త కుమారుడిగా లేదా కుమార్తెగా మారడానికి “మీ పడిపోయిన సంఘాలనుండి నుండి బయటకు వచ్చుటను” ఎంచుకొందురా? మీరు ఆయన నిజమైన సబ్బాతు గురించి శ్రద్ధగా అధ్యయనం చేయుటకు ఈరోజు ఎంచుకున్నారా? ఆయనను అనుసరించుటకు మరియు యుగాల యొక్క బేరంను పొందుకొని ఆయన మార్గాల్లో మాత్రమే నడుచుటకు, మరియు తిరిగి ఎప్పటికీ మీ మురికి వస్త్రాలను ధరించుకొనకుండుట మీ నిర్ణయమైతే, అప్పుడు ఆయన సత్యం కోసం మీ పరిశోధనను పట్టుదలతో కొనసాగించమని మేము మిమ్మల్ని వేడుకొనుచున్నాము. ఈ క్రమంలో, మరిన్ని వివరాలకు ఈ క్రింది వెబ్సైటును సందర్శించుటకు మేము మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము:

www.worldslastchance.com

ఆయన ప్రేమలో,
WLC బృందం