Print

అత్యుత్తమ వార్త!

కప్పబడిన నీతి ఇవ్వబడిన నీతిలాంటిది కాదు. మోక్ష శాస్త్రాన్ని గూర్చి అద్భుతమైన సత్యాన్ని తెలుసుకోవడానికి ఇది చదవండి.

సంతోషకరమైన మహిళమీతో పంచుకోవడానికి మాకు అత్యుత్తమ వార్త అందినది!

నిత్య జీవమును కలిగి ఉండాలంటే, యహూషువః ఉండినట్లుగా నీవును పరిపూర్ణంగా ఉండాలి. అనగా ఆయన పాటించినట్లు మీరును యహువః ధర్మాన్ని పాటించాలి: సంపూర్ణంగా. ఎటువంటి తొట్రిల్లిపాటు లేకుండా. తప్పులు లేకుండా. పరిపూర్ణంగా.

ఏమిటి? అవును. అది అంత తేలిక కాదు. ఎందుకంటే, స్పష్టముగా, మీరు దీన్ని చేయలేరు.

మనము చేయలేము. ఎవ్వరివల్ల కాదు.

అయితే ఇక్కడ ఒక శుభవార్త ఉన్నది: మీరు చేయలేరని యహువః కు తెలుసు, అందువలన ఆయన మీనుండి దానిని కోరలేదు! అది ఆయన నియంత్రణలో ఉన్నది.

విమోచించబడుట యొక్క విరుద్ధ స్వభావము.

రక్షణ యొక్క శుభవార్త ఏమిటంటే, మీరు రక్షణకు కావలసిన అవసరతలను తీర్చలేకపోయినప్పటికీ మీరు రక్షించబడుదురు. నీ అంతట నీవు, యహువః ధర్మశాస్త్రం కోరుచున్న నీతిని సృష్టించుకోలేవు. అందువలనే ఆయన యహూషువఃను ప్రసాదించాడు. ఆయన అక్షరాలా, “ లోకపాపమును మోసికొనిపోవు ఎలోహీం గొఱ్ఱెపిల్ల. (యోహాను సువార్త 1:29.)

ఎలోహీం లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయకుమారునిగా (లేక, జనిలైక కుమరుడుగా) పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకేగాని లోకమునకు తీర్పు తీర్చుటకు ఎలోహీం ఆయనను లోకములోనికి పంపలేదు”. (యోహాను సువార్త 3:16,17)

ధర్మశాస్త్రం పాపము వలన కలుగు పరిణామాలను తెలియజేయుచుండెను: “ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే ఎలోహీం కృపావరము మన అదోనాయ్ అయిన యహూషువఃనందు నిత్య జీవము.” “అందరును పాపముచేసి ఎలోహీం అనుగ్రహించు మహిమను పొందలేక పోవుచుండుట” వలన (రోమా 3:23), ఒక రక్షకుడు అవసరమాయెను. అలా యహూషువః పుట్టెను: ఒక పరిపూర్ణ మానవుడు, ఆదాము వలె కాక, దైవిక ధర్మాన్ని పరిపూర్ణంగా గైకొనుటను ఎన్నుకున్నాడు.

రక్షణ యొక్క విజ్ఞాన శాస్త్రం.

దైవిక ధర్మాన్ని సంపూర్ణంగా పాటించిన ఒకే ఒక్క మానవుడు యహూషువః. ఆయన సిలువపై మరణించినప్పుడు, జయించినవానిగా మరణించాడు. ఆయన ఎన్నడూ పాపం చేయలేదు కాబట్టి, యహువః ఆయనను మృతులలో నుండి లేపి పరిపూర్ణంగా విమోచించెను.

ప్రార్థనఒక పాపి పశ్చాత్తాపముతో అతడి తరపున యహూషువః మరణించెనని విశ్వాసం ద్వారా అంగీకరించినప్పుడు, యహువః, ధర్మశాస్త్ర విషయంలోని యహూషువః యొక్క పరిపూర్ణ విధేయతను తీసుకొని, దానిని పశ్చాత్తాపపడే విశ్వాసికి జమచేయును.

ఈ లావాదేవి ఎలా జరుగుతుందో పౌలు వివరిస్తున్నాడు: “నేను క్రీస్తుతో కూడ సిలువ వేయబడియున్నాను; ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి, నా కొరకు తన్నుతాను అప్పగించుకొనిన ఎలోహీం కుమారునియందలి విశ్వాసము వలన జీవించుచున్నాను.”(గలతీయులకు 2:20)

మీ రక్షకునిగా యహూషువఃను మీరు అంగీకరించినప్పుడు, ఆయన మీ ప్రత్యామ్నాయంగా మారతాడు. మీరు చేసిన పాపాలకు ఆయన మరణము పూర్తి విమోచన క్రయధనమును చెల్లించును. అప్పుడు, దైవిక కృప యొక్క ఒక చక్కని లావాదేవీలో, ఆయన నీతి న్యాయపరమైన ప్రక్రియ ద్వారా (న్యాయ సంబంధిత చర్య ద్వారా) మీ ఖాతాకు జమ చేయబడుతుంది. ఇది ఆపాదించబడిన నీతి. మన పాపములు యహూషువః కు ఆపాదించబడెను, తద్వారా ఆయన నీతి మనకు ఆపాదించబడెను.

ఎందుకనగా మనమాయనయందు ఎలోహీం నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మనకోసము పాపముగాచేసెను.” (రెండవ కొరింథీయులకు 5:21, చూడండి.)

విశ్వాసము ద్వారా విమోచించబడుట ఖచ్చితముగా విశ్వాసము ద్వారా నీతిమంతులుగా తీర్చబడుట లాంటిదే. వాస్తవానికి, గ్రీకు భాషలో, విమోచించబడుట కోసం వాడిన పదము మరియు నీతిక కోసం వాడిన పదము ఒక్కటే.

మీరు యహువఃలో ఉంటూ, యహూషువః యొక్క యోగ్యతలో విశ్వాసముంచినంతకాలం, ఆయన నీతిచేత కప్పబడి ఉంటారు. మీరు ఎన్నడూ పాపం చేయని వారిలా యః ముందు నిలబడతారు. ఇది ఒక కొనసాగుతున్న, ఎన్నటికీ ముగియని విరాళం.

ఇది రక్షణ యొక్క శుభవార్త! “దేవుడే [ఎలోహిమ్] దహనబలికి గొఱ్ఱెపిల్లను చూచుకొనును” అని అబ్రహాము ఇస్సాకుకు భరోసా ఇచ్చినట్లు (ఆదికాండము 22: 8) అతడు కలిగియుండెను, మరియు ఆ గొర్రె యహూషువః, తన సొంత కుమారుడు.

కృప యొక్క పరివర్తన

యహూషువః యొక్క ఆపాదించబడిన నీతి బహుమానమును అంగీకరించినవారందరూ, యహువః దైవిక సంకల్పానికి అనుగుణంగా తమ జీవితాలను జీవించాలని కోరుకుంటున్నారు. దురదృష్టవశాత్తు, చాలామంది వ్యక్తులు ఇక్కడే ఒక తప్పు చేయుచున్నారు. యహూషువః యొక్క ఆపాదించబడిన నీతి ఏదో ఆశ్చర్యకరంగా వారిని పవిత్రంగా మరియు నిందలేనివారిగా మార్చగలదని వారు భావిస్తారు.

ఇది తప్పు. అపొస్తలుడు, యాకోబు, ఇలా హెచ్చరించారు: “అనేక విషయములలో మన మందరము తప్పిపోవుచున్నాము” (యాకోబు 3:2). యహువః ఆత్మను తనలో నివశించుటకు అంగీకరించి విమోచించబడిన విశ్వాసి సహజంగా పాపం చేయటను నిలిపివేయును. కానీ, యాకోబు తెలియజేస్తున్నట్లు, అజ్ఞానం లేదా బలహీనత కారణంగా ఇప్పటికీ విఫలమవడం జరుగుతుంది. అజ్ఞానం లేదా బలహీనత కారణమైన పాపాలు మరియు ముందుగా అనుకొని చేయు పాపాలు ఒకటి కాదు. నిజంగా పశ్చాత్తాపం పొందిన వ్యక్తి తెలిసి చేయు పాపాన్ని కొనసాగించుటను నిరాకరిస్తాడు.

యహువః యొక్క ఆత్మ హృదయంలో పాలన చేయునప్పుడు, యహువః చూచునట్లుగానే విశ్వాసి కూడా పాపమును అదేవిధంగా చూచును. కాలం గడిచేకొద్దీ, పాపం యెడల ద్వేషం పెరుగుతుంది. పౌలు ఈ వృద్ధిని వివరిస్తూ, ఇలా పేర్కొన్నాడు: “మీరు కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైనవారు కారు గనుక పాపము మీ మీద ప్రభుత్వము చేయదు. (రోమీయులకు 6:14) (ఇక్కడ చెప్పబడిన ధర్మశాస్త్రము, రోమీయులకు 8 లో చెప్పబడిన “పాప మరణముల యొక్క ధర్మశాస్త్రము”)

ఇతర మాటలలో, మనకు అందరికి యహూషువః యొక్క నీతి సంబంధమైన తొడుగు అవసరం, ఎందుకంటే మనమందరము పాపులము. కానీ, మనము ప్రతిరోజూ యః యొక్క బహుమానమును విశ్వసించటను ఎంపిక చేసుకున్నట్లయితే, అద్భుతమైన మార్పులు సంభవిస్తాయి. మనము యహువః చిత్తమును తెలుసుకోవాలని మరియు చేయాలని కోరుకున్నప్పుడు, ఆయన తన ధర్మాన్ని మన హృదయాల మీద వ్రాస్తాడు. ఈ పరివర్తన సంభవించుటకు కారణం ఎవరో ఈ క్రింది లేఖనాలలో గమనించండి.

నూతన హృదయము మీ కిచ్చెదను, నూతన స్వభావము మీకు కలుగజేసెదను, రాతిగుండె మీలోనుండి తీసివేసి మాంసపు గుండెను మీకిచ్చెదను. నా ఆత్మను మీయందుంచి, నా కట్టడల ననుసరించు వారినిగాను నా విధులను గైకొను వారినిగాను మిమ్మును చేసెదను.” (యెహెజ్కేలు 36: 26-27). విమోచన నుండి పరిశుద్ధీకరణ ద్వారా, రక్షణ ఎల్లప్పుడూ యః యొక్క బహుమానము, మరియు ఆయన పని.

బాలిక చేతిలో హృదయం

ఈ పరివర్తన సంభవించేటప్పుడు, విశ్వాసి యొక్క ఇష్టం యహువః ఇష్టానికి చాలా దగ్గరగా మారుతుంది, అప్పుడు, తన సొంత హృదయంలోని పనులను చేసేటప్పుడు, అతడు యః యొక్క ఇష్టాన్ని చేస్తాడు.

ఆపాదించబడిన నీతియే పరిశుద్ధీకరణ

విమోచన వలె పరిశుద్ధీకరణ కూడా ఒక బహుమానము.

పరిశుద్ధీకరణ అనేది వ్యక్తిగత హృదయాలలో నీతిని ఉత్పత్తి చేసే జీవితకాల కార్యము. పాపి విమోచన పొందిన క్షణం ఇది ప్రారంభమవుతుంది. ఈ ప్రక్రియ మానవున్ని దైవిక రూపంలోనికి మారుస్తుంది మరియు యహూషువః తిరిగి వచ్చి పరిశుద్ధులను మహిమపరుచునప్పుడు విశ్వాసులు గొప్ప స్థితిని పొందేవరకు కొనసాగుతూనే ఉంటుంది.

విమోచన అనేది యహూషువః తన పాపపరిహార బలి ద్వారా మనకు ప్రసాదించినది. పరిశుద్ధీకరణ అనేది ఒక్కసారి విమోచించబడిన తరువాత యహూషువః మనలో చేయునది.

రక్షకుడు భూమి మీద ఉన్నప్పుడు, ఆయన మనవలె పరిస్థితులు మరియు సమయముతో బంధించబడి ఉన్నాడు. కానీ ఆయన పునరుత్థానమైనప్పుడు, తనను వెంబడించువారికి ఇచ్చునట్లు యహువః ఆత్మ యొక్క ప్రత్యేకమైన నిధితో బహూకరించబడెను. ఈ ఆత్మ హృదయ పరివర్తన యొక్క క్రియను చేయటకు ఇవ్వబడినది, అది పెంతెకోస్తు రోజున విశ్వాసుల మీద కుమ్మరించబడింది.

యహూషువః దీనిని తన శిష్యులకు ఇలా చెప్పాడు: “అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్లిపోవుటవలన మీకు ప్రయోజనకరము; నేను వెళ్లనియెడల ఆదరణకర్త (లేక, ఉత్తరవాది) మీయొద్దకు రాడు; నేను వెళ్ళినయెడల ఆయనను మీయొద్దకు పంపుదును..” (యోహాను 16:7)

యహువః ఆత్మ యొక్క ఈ ప్రత్యేకమైన బహుమానము ఈరోజున విశ్వాసులకు అందుబాటులో ఉన్నది! ఇది మానవ హృదయాన్ని మరియు మనస్సును పరివర్తన చేయుచు మరియు శుద్ధి చేయుచు, తద్వారా దైవిక హృదయం మరియు మనస్సుతో ఐక్యం చేయు నిర్దిష్ట ప్రయోజనం కోసం ఇవ్వబడినది.

ఒక నిజమైన అర్థంలో, పవిత్రత అనేది యహువఃతో ఒప్పందం. మనము పవిత్రపరచబడితే, మన ఆలోచనలు, కోరికలు, మరియు ఉద్దేశ్యాలు తండ్రితో సమానంగా ఉంటాయి మరియు మనము ఆయనతో శాంతితో ఉంటాము. “కాబట్టి విశ్వాసమూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి, మన అదోనాయ్ యహూషువః ద్వారా ఎలోహీంతో సమాధానము కలిగియుందము. మరియు ఆయన ద్వారా మనము విశ్వాసమువలన ఈ కృపయందు ప్రవేశముగల వారమై, అందులో నిలిచియుండి, ఎలోహీం మహిమను గూర్చిన నిరీక్షణనుబట్టి అతిశయ పడుచున్నాము.” (రోమీయులకు 5:1-2.)

విమోచన పాపిని నీతిమంతునిగా ఉండునట్లు ప్రకటిస్తుంది. పరిశుద్ధీకరణ అతడిని దైవ రూపంలోనికి పరివర్తనం చేసే ప్రక్రియ.

వేరేలా చెప్పాలంటే, పరిశుద్ధీకరణ అనేది విమోచన యొక్క ఫలము. ఇది, ఇక్కడ, మన విమోచన కోసం యహువః ప్రణాళిక యొక్క ముఖ్య భాగం. ఒకసారి పాపి నీతిని అంగీకరించి, యహూషువః నీతి యొక్క గొప్పదనమును విశ్వసించినప్పుడు, అతడు రక్షకునిలో పరిపూర్ణంగా అంగీకరించబడతాడు. తండ్రి వినయముగల విశ్వాసిని చూసే ప్రతిసారీ, పరిశుద్ధీకరణ ప్రక్రియ ఇంకా నైతికంగా పరిపూర్ణం కాలేనప్పటికీ ఆయన ఆ విశ్వాసిలో నీతిని చూస్తాడు!

ఆనందంతో సంతోషించుట చెప్పలేనిది మరియు పూర్తి మహిమ కలిగినది

ఇది అత్యంత సౌందర్యవంతమైన, మాటలలో చెప్పలేని సువార్త యొక్క క్రియ! పశ్చాత్తాపం పొందిన విశ్వాసి మెస్సీయలో ఉన్నంత కాలం, ఒకవేళ అతడు అజ్ఞానంలో, నిర్బంధంలో లేదా బలహీనత యొక్క పాపాలలో బంధించబడి కొనసాగుతూ ఉన్నప్పటికీ, మెస్సీయ యొక్క ఖచ్చితమైన నీతితో కప్పబడతాడు.

రాత్రి ప్రకృతి దృశ్యం

మృతులలోనుండి ప్రధమ ఫలముగా, పునరుత్థానమైనప్పుడు యహూషువః పొందినట్లు, మన పాపపు శరీరం ఒక ఆత్మీయ శరీరంగా మార్పు చేయబడి, మహిమపరచబడు సమయాన పరిశుద్ధీకరణ ప్రక్రియ ముగుస్తుంది.

సహోదరులారా, నేను చెప్పునది ఏమనగా రక్తమాంసములు ఎలోహీం రాజ్యమును స్వతంత్రించు కొననేరవు; క్షయత అక్షయతను స్వతంత్రించుకొనదు. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను; మన మందరము నిద్రించము గాని నిమిషములో, ఒక రెప్పపాటున, కడబూర మ్రోగగానే మనమందరము మార్పుపొందుదుము. బూర మ్రోగును; అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పుపొందుదుము. క్షయమైన యీ శరీరము అక్షయతను ధరించు కొనవలసియున్నది; మర్త్యమైన యీ శరీరము అమర్త్యతను ధరించు కొనవలసియున్నది. (మొదటి కొరింథీయులకు 15: 50-53 చూడండి.)

నేడే రక్షణ బహుమానమును అంగీకరించండి! విశ్వాసం ద్వారా నీతి బహుమానమును అంగీకరించే ప్రతి ఒక్కరి కోసం ఆనందం మరియు విజయం ఎదురుచూచుచుండెను.