ఇది WLC యేతర వ్యాసం. బయటి రచయితల వనరులను ఉపయోగించినప్పుడు, బైబిలుకు మరియు డబ్ల్యుఎల్సి ప్రస్తుత నమ్మకాలకు 100% అనుగుణంగా ఉండెనని భావించిన వాటిని మాత్రమే మేము ప్రచురిస్తాము. కాబట్టి అలాంటి వ్యాసాలను డబ్ల్యుఎల్సి నుండి నేరుగా వచ్చినట్లుగా పరిగణించవచ్చు. యహువః యొక్క అనేక మంది సేవకుల పరిచర్య ద్వారా మేము ఎంతగానో ఆశీర్వదించబడ్డాము. అయితే ఈ రచయితల యొక్క ఇతర రచనలను అన్వేషించమని మేము మా సభ్యులకు సలహా ఇవ్వము. అటువంటి రచనలు, లోపాలను కలిగి ఉన్నందున మేము వాటిని ప్రచురణల నుండి మినహాయించాము. విచారకరంగా, లోపం లేని మంత్రిత్వ శాఖను మనం ఇంకనూ కనుగొనలేదు. డబ్ల్యుఎల్సి వి కాని కొన్ని ప్రచురించబడిన వ్యాసాలు / ఎపిసోడ్లు చూసి మీరు దిగ్బ్రాంతి చెందినచో, సామెతలు 4:18 జ్ఞాపకం చేసుకోండి. మన మార్గంలో మరింత కాంతి వెలువడు కొద్దీ ఆయన సత్యాన్ని గూర్చిన మన అవగాహన అభివృద్ధి చెందుతూ ఉంటుంది. మేము సత్యాన్ని ప్రాణం కంటే ఎక్కువగా ఆదరిస్తాము మరియు అది దొరికిన చోటు ఏదైనా అక్కడ వెతుకుతాము.
|
- మత్తయి 20:23 – తండ్రి మరియు కుమారుడు – ఇద్దరు వ్యక్తులు.
- యోహాను 3:16 – యహువః లోకాన్ని ఎంతగానో ప్రేమించాడు, తనను తాను కాదు, తన కుమారుని అనుగ్రహించాడు.
- యోహాను 3:17 – యహువః తన కుమారుని లోకంలోనికి పంపాడు. యహువః తనను తాను పంపుకున్నాడా?
- యోహాను 5:37 – మీరు తండ్రి స్వరము వినలేదు లేదా ఆయనను చూడలేదు (కానీ కుమారుడిని చూసారు మరియు విన్నారు) ఇద్దరూ వేర్వేరు వ్యక్తులు.
- యోహాను 5:37 – ఇద్దరు సాక్షులు ఉన్నారు – (1) తండ్రి మరియు (2) కుమారుడు (ఇద్దరు వ్యక్తులు).
- యోహాను 5:43 – యహూషువః తన తండ్రి నామములో వచ్చాడు, కానీ జనులు ఆయనను స్వీకరించలేదు.
- యోహాను 8:18 – ఇద్దరు సాక్షులు ఉన్నారు; తండ్రి మరియు కుమారుడు (ఇద్దరు వ్యక్తులు).
- యోహాను 8:19 – మీరు నన్నుగానీ, నా తండ్రిని గానీ (ఇద్దరు వ్యక్తులు) ఎరుగరు.
- యోహాను 10:29 – తండ్రి అందరికంటే గొప్పవాడు (ఇతరులు).
- యోహాను 12:28 – “తండ్రీ, నీ నామమును మహిమపరచుము” అని యహూషువః చెప్పాడు. పరలోకం నుండి ఒక స్వరం సమాధానం ఇచ్చింది. యహూషువః స్వయంగా సమాధానమిచ్చాడా?
- యోహాను 14:1 – మీరు యహువః యందు విశ్వాసముంచండి, నన్ను కూడా నమ్మండి (ఇద్దరు వ్యక్తులు).
- యోహాను 14:25 – నా మాటలు నావి కావు, నన్ను పంపినవాడివే (ఇద్దరు వ్యక్తులు: పంపినవారు/పంపబడినవారు).
- యోహాను 14:28 – నా తండ్రి నాకంటే గొప్పవాడు (ఇద్దరు వ్యక్తులు; తండ్రి & కొడుకు).
- యోహాను 15:1 – నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు; ఇద్దరూ వేర్వేరు వ్యక్తులు.
- యోహాను 15:9 – తండ్రి నన్ను ఏలాగు ప్రేమించెనో నేనును మిమ్మును ఆలాగు ప్రేమించితిని. (మూడు పార్టీలు; తండ్రి, కుమారుడు & శిష్యులు).
- యోహాను 15:10 – నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమయందు నిలిచియున్న ప్రకారము మీరును నా ఆజ్ఞలు గైకొనినయెడల నా ప్రేమయందు నిలిచియుందురు.
- యోహాను 15:24 – వారు నన్నును మరియు నా తండ్రిని (ఇద్దరు వ్యక్తులు) ద్వేషించుచున్నారు.
- యోహాను 16:3 – మీరు నా తండ్రిని లేదా నన్ను (రెండు పార్టీలు; తండ్రి & కుమారుడు) తెలిసికొనలేదు.
- యోహాను 16:28 – నేను తండ్రి యొద్దనుండి దిగి వచ్చి తిరిగి తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను. యహూషువః తన వద్దకు తాను వెళ్లాడా?
- యోహాను 16:32 – నేను ఒంటరిగా లేను, తండ్రి నాతో ఉన్నాడు (ఇద్దరు వ్యక్తులు).
- యోహాను 17:1 – యహూషువః తండ్రికి ప్రార్థించాడు. అతడు తనకు తాను ప్రార్థించాడా?
- యోహాను 17:3 – అద్వితీయ సత్య ఏల్ అయిన నిన్నును, నీవు పంపిన యహూషువః మెస్సీయను ఎరుగుటయే నిత్య జీవము. మనకు నిత్యజీవం కావాలా? అలా అయితే, తండ్రి మరియు కుమారుని (ఇద్దరు వ్యక్తులను) నమ్మండి.
- యోహాను 17:4 – చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమ పరచితిని. (యజమాని & పనివాడు).
- యోహాను 17:5 – ఇప్పుడు తండ్రీ, నన్ను మహిమపరచుము. ఇద్దరు వ్యక్తులు; ఒకరు ఉన్నతమైనవారు, మరొకరు తక్కువ).
- యోహాను 17:11 – తండ్రీ, మనము ఏకమైయున్నలాగున వారును ఏకమై/ఒక్కరై యుండునట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామమందు వారిని కాపాడుము. వ్యాఖ్య: 12 మంది అపొస్తలులు "ఒకరు" అయినట్లే యహూషువః మరియు అతని తండ్రి కూడా "ఒకరు"; అంటే, “ఒక ఉద్దేశ్యం మరియు సిద్ధాంతం.
- యోహాను 17:18 – నీవు నన్ను పంపినట్లు నేను వారిని లోకంలోనికి పంపుతాను. మూడు పార్టీలు: మీరు, నేను మరియు వారు.
- యోహాను 17:21 – వారును మనయందు ఏకమైయుండవలెనని వారికొరకు మాత్రము నేను ప్రార్థించుటలేదు; వారి వాక్యమువలన నాయందు విశ్వాసముంచువారందరును ఏకమైయుండ వలెనని వారికొరకును ప్రార్థించుచున్నాను.
- యోహాను 17:22 – "మనము ఏకమైయున్నలాగున, వారును ఏకమైయుండవలెనని." అపొస్తలులు 12 మంది వేర్వేరు వ్యక్తులు కాక ఒక్క వ్యక్తినా? కాదు. అయితే వారు ఒక్క లక్ష్యంతో ఉన్నట్లే, పరలోకపు తండ్రి మరియు అతని కుమారుడు ఒకే లక్ష్యంతో ఉన్న ఇద్దరు వేర్వేరు వ్యక్తులు.
- అపొస్తలుల కార్యములు 2:24* – ఇక్కడ మనకు ఇద్దరు వ్యక్తులు ఉన్నారు: ఒకరు జీవించి ఉన్నారు, ఒకరు మరణించారు. యహూషువః మరణించాడు, తనను తాను లేపుకోలేకపోయాడు. ఎవరు లేపారు? సమాధి నుండి – మరణం నుండి యహువః అతనిని లేపాడు (అపొస్తలుల కార్యములు 3:14,15).
- అపొస్తలుల కార్యములు 2:27 – యహూషువః ఆత్మ నరకంలో వదలబడలేదు; అది కూడా నరకం నుండి, సమాధి నుండి, మృతుల నుండి లేపబడింది (32 వ వచనం). ఎవరి ద్వారా లేపబడింది? యహువః శక్తి ద్వారా (ఇక్కడ ఇద్దరు వ్యక్తులు ప్రస్తావించబడ్డారు).
- రోమా 1:3 – మృతులలో నుండి పునరుత్థానం చేయబడడం ద్వారా … యహువః కుమారుడిగా ప్రకటించబడ్డాడు. (ఇద్దరు వ్యక్తులు)
- గలతీ 1:1 – యహువః (తండ్రి) మృతులలోనుండి యహూషువఃను (కుమారుని) లేపాడు. యహూషువః మరణానికి లోనయ్యాడు, కానీ అతని తండ్రి మరణానికి లోబడి లేడు.
- ఎఫెసీ 6:23 – తండ్రియైన యహువః నుండి మరియు యహూషువః నుండి అందరికీ సమాధానము. ఇద్దరు వేర్వేరు మరియు విభిన్న వ్యక్తులు.
- ఫిలి.1:2 – మన తండ్రియైన యహువః నుండి మరియు యహూషువః మెస్సీయ నుండి కృప. ఇద్దరు వ్యక్తులు.
- కొల.1:1 – పౌలు యహువః చిత్తం ద్వారా యహూషువః మెస్సీయ యొక్క అపొస్తలుడు (ముగ్గురు వ్యక్తులు: పౌలు, యహువః, & యహూషువః).
- 1 వ థెస్సలొనీ 1:1 – తండ్రి అయిన యహువః మరియు రక్షకుడైన యహూషువః (ఇద్దరు వ్యక్తులు; తండ్రి మరియు కుమారుడు) నుండి సమాధానము.
- 2 వ థెస్సలొనీ 1:2 – తండ్రి అయిన యహువః నుండి మరియు మెస్సీయ నుండి (ఇద్దరు వ్యక్తులు) కృపయు మరియు సమాధానమును.
- 1 తిమో.1:1 – పౌలు, యహువః మరియు యహూషువః మెస్సీయ (ఇద్దరు వ్యక్తులు) ఆజ్ఞ ప్రకారం యహూషువః యొక్క అపొస్తలుడు.
- 1 తిమో.1:2 – తండ్రి అయిన యహువః నుండి మరియు మెస్సీయ అయిన యహూషువః నుండి కృప మరియు సమాధానము.
- 2 తిమో.1:2 – తండ్రియైన యహువః నుండి మరియు మన రక్షకుడైన యహూషువః నుండి కృప మరియు సమాధానము.
- తీతు 1:1 – పౌలు, యహువః సేవకుడు మరియు యహూషువః యొక్క అపొస్తలుడు.
- ఫిలే 3 – మీకు కృపయు మరియు సమాధానము (1) మన తండ్రి అయిన యహువః నుండి మరియు (2) యహూషువః మెస్సీయ నుండి.
- హెబ్రీ.1:1 – యహువః పూర్వకాలంలో ప్రవక్తల ద్వారా మాట్లాడాడు, అయితే ఈ చివరి రోజుల్లో తన కుమారుని ద్వారా మనతో మాట్లాడాడు.
- యాకో.1:1 – యాకోబు, (1) యహువః యొక్కయు మరియు (2) యహూషువః యొక్కయు దాసుడు.
- 1 పేతు.1:3 – మన ప్రభువగు యహూషువః మెస్సీయ యొక్క తండ్రియైన యహువః స్తుతింపబడునుగాక.
- 2 పేతు.1:3 – యహువఃను గూర్చినట్టియు మన ప్రభువైన యహూషువఃను (ఇద్దరు వ్యక్తులు) గూర్చినట్టియునైన అనుభవజ్ఞానమువలన మీకు కృప.
- 1 యోహాను 1:3 – మన సహవాసం తండ్రితో మరియు ఆయన కుమారుడైన యహూషువః మెస్సీయతో ఉంది.
- 1 యోహాను 2:1 – ఎవడైనను పాపము చేసినయెడల నీతిమంతుడైన యహూషువః మెస్సీయ అను ఉత్తరవాది (ఆదరణకర్త) తండ్రియొద్ద మనకున్నాడు. (తండ్రి యహువః & ఉత్తరవాది యహూషువః (ఇద్దరు వ్యక్తులు).
- 2 యోహాను 1: 9 – మెస్సీయ బోధయందు నిలిచియుండువాడు తండ్రిని కుమారుని అంగీకరించువాడు (కలిగియున్నవాడు).
- యూదా 1:1 – యహువః తండ్రి, మరియు యహూషువః మెస్సీయ (ఇద్దరు వ్యక్తులు).
- యూదా 1: 4 – కొందరు ఏకైక యహువఃను, మరియు మన రక్షకుడైన యాహూషువః మెస్సీయను (ఇద్దరు వ్యక్తులు) విసర్జించారు.
- ప్రకటన 1:1* – యహువః తనకు తానుగా ఇచ్చిన ప్రత్యక్షత. కాదు. యహువః తనకు తానుగా ప్రత్యక్షతను ఇవ్వలేదు, కానీ తన కుమారుడైన యాహూషువః మెస్సీయకు ఇచ్చాడు.
- ప్రకటన 1:4* – ఇద్దరు వ్యక్తుల నుండి కృపా సమాధానములు: (1) వర్తమాన భూతభవిష్య త్కాలములలో ఉన్నవానినుండియు (శాశ్వతమైన యహువః);
- • మరియు నమ్మకమైన సాక్షియు, మృతులలోనుండి ఆది సంభూతుడుగా లేచిన యహూషువః మెస్సీయ నుండియు (వచనం 5).
- ప్రకటన.1:9* – యహువః యొక్క వాక్యము మరియు యహూషువఃను గూర్చి సాక్ష్యం: ఇద్దరు వ్యక్తులు.
- ప్రకటన.2:8* – మృతుడై మరల బ్రదికిన వాని మాటలు (యహూషువః). తండ్రి చనిపోవడం అసాధ్యం, కాబట్టి యహూషువః మరియు తండ్రి ఒకే వ్యక్తి కాదు.
- ప్రకటన.2:26 – నేను నా తండ్రివలన అధికారము పొందినట్టు జయించుచు, అంతమువరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి జనులమీద అధికారము ఇచ్చెదను. ఇద్దరు వ్యక్తులు: తక్కువ వ్యక్తి మరొక వ్యక్తి నుండి అధికారమును పొందుతాడు.
- ప్రకటన.3:5 – ఇద్దరు వ్యక్తులు: వారిలో ఒకరు మన పేర్లను మరొకరి ముందు ఒప్పుకుంటారు. ఈ ఇద్దరు ఎవరు? తండ్రి యహువః మరియు కుమారుడు యహూషువః.
- ప్రకటన 3:12* – జయించు వానిని నా ఎలోహీమ్ ఆలయములో ఒక స్తంభముగా చేసెదను; మరియు నా ఎలోహా పేరును.., మొదలైనవి వాని మీద వ్రాసెదను. యహూషువః యొక్క ఎల్ తాను కాకుండా మరొకరు.
- ప్రకటన 3:14 – ఆమేన్ అనువాడును నమ్మకమైన సత్యసాక్షియు ఎలోహ సృష్టికి ఆదియునైనవాని మాటలు. ఇద్దరు వ్యక్తుల గురించి చెప్పబడుతుంది: (1) ఎల్ సృష్టికర్త, మరియు (2) సృష్టించబడిన వ్యక్తి – సత్యసాక్షి (యహూషువః).
- ప్రకటన 3:21 – నేను జయించి నా తండ్రితోకూడ ఆయన సింహాసనమునందు కూర్చుండియున్న ప్రకారము జయించువానిని నాతోకూడ నా సింహాసనమునందు కూర్చుండనిచ్చెదను. రెండు సింహాసనాలు మరియు ఇద్దరు వ్యక్తుల గురించి చెప్పబడింది: (1) తండ్రి మరియు అతని సింహాసనం, (2) కుమారుడు మరియు అతని సింహాసనం.
- ప్రకటన 4:2-11 – సింహాసనంపై ఆసీనుడైనవాడు (ప్రక. 4:2,3,9,10; 5:1,7; 19:4; 20:11; 21:5) సర్వశక్తిమంతుడైన ఏల్. యహూషువః, దావీదుకు చిగురు మరియు యూదా గోత్రపు సింహము ఏడు ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పెను. (ప్రకటన 5:2-10); అతడు యహువః కాదు. అతడు తండ్రియైన యహువః ఆసీనుడైయున్న సింహాసనం యెదుట నిలబడ్డాడు: ఇద్దరు వ్యక్తులు.
- ప్రకటన 5:11-13 – (1) సింహాసనాసీనుడైన వానికిని మరియు (2) వధింపబడిన గొర్రెపిల్లకును స్తుతులు ఇవ్వబడ్డాయి.
- ప్రకటన 6:16 – (1) సింహాసనాసీనుడైన వాని యెక్కయు మరియు (2) గొర్రెపిల్ల యొక్కయు ఉగ్రత నుండి దాగుకొని: ఇద్దరు వ్యక్తులు.
- ప్రకటన 7: 9,10 – సింహాసనాసీనుడైన మా ఏల్ కిని గొఱ్ఱెపిల్లకును మా రక్షణకై స్తోత్రము: ఇద్దరు వ్యక్తులు.
- ప్రకటన 7:17 – ఇకపై తన తండ్రి కుడి పార్శ్వమున సింహాసనంపై ఉన్న గొర్రెపిల్ల (హెబ్రీ. 1:3) వారి కాపరిగా ఉంటాడు; మరియు యహువః వారి కన్నులనుండి ప్రతి బాష్పబిందువును తుడిచి వేయును.: ఇద్దరు వ్యక్తులు.
- ప్రకటన 11:15 – లోక రాజ్యము మన యహువః రాజ్యమును ఆయన మెస్సీయ రాజ్యమును ఆయెను: ఇద్దరు వ్యక్తులు.
- ప్రకటన 12:17 – యహువః (మొదటి వ్యక్తి) యొక్క ఆజ్ఞలను గైకొనువారు మరియు యహూషువఃను (రెండవ వ్యక్తి) గూర్చి సాక్ష్యమిచ్చేవారు.
- ప్రకటన 14:1,4 – వీరు తమ నుదుటిపై తండ్రి పేరు వ్రాయబడి ఉన్నారు (గ్రీకు - తండ్రి మరియు కుమారుని పేరు), మరియు వారు యహువఃకు మరియు గొర్రెపిల్లకు ప్రథమ ఫలాలు.
- ప్రకటన 14:12 – యహువః యొక్క ఆజ్ఞలను గైకొనుచు యహూషువః నందు విశ్వాసాన్ని కలిగియున్నారు: ఇద్దరు వ్యక్తులు.
- ప్రకటన 15:3* – ఇక్కడ ముగ్గురు వేర్వేరు వ్యక్తుల పేర్లు చెప్పబడ్డాయి: యహువః, గొర్రెపిల్ల మరియు మోషే. మోషే మరియు యహువః ఒకే వ్యక్తి కానప్పుడు, గొర్రెపిల్ల మరియు యహువః ఒకే వ్యక్తి అని మనం ఎందుకు భావించాలి?
- ప్రకటన 19:4-7 – ఇక్కడ నాలుగు పార్టీల పేర్లు ఉన్నాయి: సర్వశక్తిమంతుడైన యహువః, గొర్రెపిల్ల (యహూషువః, పెండ్లికుమారుడు), మెస్సీయ యొక్క వధువు, ఒక గొప్ప సమూహం.
- ప్రకటన 20:6 – వారు (1) యహువఃకు మరియు (2) మెస్సీయకు యాజకులుగా ఉంటారు.
- ప్రకటన 21:9,10 – మూడు పార్టీలు: యహువః, గొర్రెపిల్ల మరియు వధువు.
- ప్రకటన 21:22 – రెండు పార్టీల పేర్లు ఉన్నాయి: యహువః మరియు గొర్రెపిల్ల. ఇవి నూతన యెరూషలేములోని దేవాలయం.
- ప్రకటన 22:1 – జీవనది యహువః మరియు గొర్రెపిల్ల (ఇద్దరు వ్యక్తులు) యొక్క సింహాసనం నుండి ప్రవహిస్తుంది.
- ప్రకటన 22:3 – ఇకమీదట శాపగ్రస్తమైనదేదియు దానిలో ఉండదు, యహువః యొక్కయు గొఱ్ఱెపిల్లయొక్కయు సింహాసనము దానిలో ఉండును: ఇద్దరు వ్యక్తులు.
ముగింపు:
సహోదరులారా,
- తండ్రియైన యహువఃను (సింహాసనంపై కూర్చున్నవాడు), మరియు
- కుమారుడైన యహూషువఃను (మెస్సీయ, గొఱ్ఱెపిల్ల)
ఈ ఇద్దరిని ఒక్కరి వ్యక్తిగా చేయాలనుకుంటే:
... పదాలను, శీర్షికలను, నామములను, తర్కాన్ని, వాస్తవాలను మరియు లేఖనాలను ఎక్కువగా వక్రీకరించడం అవసరం. "వాక్యమను పాలవలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము, ఆ పాలను అపేక్షించుడి” (1 పేతురు 2:2). మరియు మెస్సీయ యహూషువః నందు విశ్వాసం ద్వారా “ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి” (యాకోబు 1:21). దైవావేశము వలన కలిగిన ప్రతిలేఖనము (ప్రతిలేఖనము దైవాదేశము వలన కలిగి) ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పు దిద్దుటకును, నీతియందు శిక్షచేయుటకును ప్రయోజనకరమైయున్నది." (2 తిమో. 3:16,17)
మనం నిరంతరం ప్రచారం చేయవలసిన ఒక మంచి పని విశ్వాసం; కింది వాటిలో విశ్వాసం:
- శాశ్వతంగా జీవించు ఏకైక పరమాత్మపై విశ్వాసం. ఆయన పేరు యహువః, ఆకాశము, భూమి మరియు వాటిలోని సమస్తానికి సృష్టికర్త.
- యహువః కుమారునిపై విశ్వాసం; అతడు యహూషువః మెస్సీయ, పాపులను విమోచించుటకు మరణించి, మూడవ దినాన మళ్లీ లేచాడు. ఆయన మృతులలో నుండి పునరుత్థానం చేయబడడం ద్వారా "యహువః కుమారునిగా ప్రకటించబడ్డాడు" (రోమా 1:1-4).
ఇది https://everlastinggoodnewsofyahweh.info/ నుండి తీయబడిన కథనం. WLC కథనం కాదు.
మేము అసలు వ్యాసం నుండి సమస్త అన్య నామములను మరియు తండ్రి - కుమారుడు అనే శీర్షికలను తొలగించి, వాటి స్థానాన్ని అసలు నామములతో భర్తీ చేసాము. ఇంకా, ఇక్కడ ఇవ్వబడిన లేఖనాలలో తండ్రి మరియు కుమారుని నామములను బైబిల్ యొక్క మొదటి ప్రేరేపిత రచయితలచే వ్రాయబడిన విధంగా మేము పునరుద్ధరించాము. -డబ్ల్యుఎల్సి బృందం.