Print

కొత్త నిబంధన: పరివర్తన యొక్క వాగ్దానం

విసుగు చెందిన మనిషి

అనేకమంది క్రైస్తవులు శోధనను జయించుటకు ఎంత ప్రయత్నించినప్పటికీ, వారు పాపంలో పడిపోతున్నారనే వాస్తవం గురించి బాధపడుతూ మరియు నిరుత్సాహపడుతుంటారు. కొందరికి, "ధర్మశాస్త్రం సిలువకు వ్రేలాడదీయబడింది మరియు మనం ఇప్పుడు కృప క్రింద ఉన్నాము" కాబట్టి దైవిక ధర్మశాస్త్రాన్ని పాటించుటను గూర్చి చింతించాల్సిన అవసరం లేదని సాతాను అబద్ధాన్ని సిద్ధం చేశాడు. ఇతర క్రైస్తవులు, తాము చట్టబద్ధత యొక్క ఉచ్చులో పడతారు. పాతకాలపు యూదుల వలె, వీరు తమ పాపంచేసే అవకాశాలను పరిమితం చేసుకొను నిమిత్తం మానవ నిర్మిత నియమాలను ఏర్పరచుకుంటారు, వారు తగినంత కఠినమైన జీవితాలను గడిపితే, వారు యహువఃకు ఆమోదయోగ్యంగా ఉంటారని భావిస్తారు.

వాస్తవానికి, విశ్వాసులు ఎందుకు పాపం చేస్తుంటారు అంటే, మనము కూడా ఇశ్రాయేలీయుల కుమారులు అంగీకరించిన పాత నిబంధన ఒప్పందం ప్రకారం పోరాడుతూ ఉన్నాము: "యహువః చెప్పినదంతయు చేసెదమని యేకముగా ఉత్తరమిచ్చిరి." (నిర్గమకాండము 19:8)

సమస్య ఏమిటంటే, మనం ఎంత ప్రయత్నించినా మన స్వంత శక్తితో ధర్మశాస్త్రాన్ని పాటించలేము. పౌలు సరిగ్గా వ్యక్తం చేశాడు. “ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనదని యెరుగుదుము; అయితే నేను పాపమునకు అమ్మబడి శరీరసంబంధినైయున్నాను. ఏలయనగా నేను చేయునది నేనెరుగను; నేను చేయ నిచ్ఛయించునది చేయక ద్వేషించునదియే చేయుచున్నాను. (రోమా ​​7:14-15)

ఏడుస్తున్న స్త్రీ

యః యొక్క రూపాన్ని ప్రతిబింబించాలని మనం ఎంతగా కోరుకున్నా, మనం ఇంకా తక్కువగానే ఉంటాము. “కాబట్టి మేలు చేయగోరు నాకు కీడు చేయుట కలుగుచున్నదను ఒక నియమము నాకు కనబడుచున్నది. అంతరంగపురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రమునందు నేను ఆనందించుచున్నాను గాని, వేరొక నియమము నా అవయవములలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. అది నా మనస్సునందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయవములలో నున్న పాపనియమమునకు నన్ను చెరపట్టి లోబరచుకొనుచున్నది. అయ్యో, నేనెంత దౌర్భాగ్యుడను? ఇట్టి మరణమునకు లోనగు శరీరమునుండి నన్నెవడు విడిపించును?” (రోమా ​​7:21-24)

సువార్త యొక్క శుభవార్త ఏమిటంటే, యహువః సమస్యను అర్థం చేసుకున్నాడు మరియు తప్పించుకొనుటకు ఒక మార్గాన్ని అందించాడు. "మన ప్రభువైన యహూషువః క్రీస్తుద్వారా యహువఃకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను!" (రోమా ​​​​7:25). సమస్య ఏమిటంటే, మనమందరం ఇప్పటికీ ఆదాము నుండి వారసత్వంగా పొందిన పడిపోయిన స్వభావాలను కలిగి ఉన్నాము. ఈ పడిపోయిన స్వభావం మన శరీరంలో పని చేసే వేరొక "నియమం", అది మనం ద్వేషించునప్పుడు కూడా పాపం చేస్తూనే ఉంటుంది. ఈ పారంపర్య ధర్మాన్ని వ్యతిరేకించుటకు, యహువః తన విశ్వాసులకు పరిశుద్ధాత్మ యొక్క సంచకరువును ఇస్తాడు. యహువఃను గౌరవించాలని ఆశించే వారందరి విషయంలో, దైవిక ధర్మాన్ని ద్వేషించే వారిని దాన్ని ప్రేమించేవారిగా మార్చుటకు ఆయన ఆత్మ యొక్క ఈ అనుగ్రహం సరిపోతుంది.

పడిపోయిన స్వభావాన్ని దైవిక స్వభావంతో భర్తీ చేయడానికి పవిత్రాత్మ యొక్క ఈ గురుతు సరిపోదు, కాబట్టి విశ్వాసులు పాపానికి వ్యతిరేకంగా తీవ్రంగా పోరాడుతూనే ఉంటారు మరియు ఉన్నత స్వభావాన్ని బహుమానంగా పొందే వరకు అలానే కొనసాగుతారు. పాపంలో పడిపోవడం అంటే వారు నిజంగా మారలేదని కాదు. వారు ఇప్పటికీ పడిపోయిన స్వభావాన్ని కలిగి ఉన్నారని దీని అర్థం. అయినప్పటికీ, ఆత్మ యొక్క బహుమానంతో, విశ్వాసులు ఇప్పుడు వారు ద్వేషించే దైవిక ధర్మాన్ని ప్రేమిస్తారు మరియు వారు ప్రేమించే పాపాన్ని అసహ్యించుకుంటారు. ఈ బహుమానము ద్వారా తాము మార్పు చెందాలని ఆశించే వారందరినీ దైవిక ధర్మాన్ని ప్రేమించేవారిగా మార్చడానికి యహువః ఒక ప్రత్యేక వాగ్దానాన్ని కలిగి ఉన్నాడు: కొత్త మరియు భిన్నమైన నిబంధన స్థాపన.

ఇదిగో నేను ఇశ్రాయేలు వారితోను యూదా వారితోను క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి; ఇదే యహువః వాక్కు. అది ఐగుప్తులోనుండి వారిని రప్పించుటకై నేను వారిని చెయ్యి పట్టుకొనిన దినమున, వారి పితరులతో నేను చేసిన నిబంధనవంటిది కాదు; నేను వారి పెనిమిటినైనను వారు ఆ నిబంధనను భంగము చేసికొనిరి; యిదే యహువః వాక్కు. (యిర్మీయా 31:31-32)

బైబిలు మరియు పుష్పాలతో ఉన్న అమ్మాయిమన కోసం మనం ఎన్నడూ చేయలేనిది మన కోసం తాను చేస్తానని యహువః ఇక్కడ వాగ్దానం చేస్తున్నాడు.

మీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధజలము చల్లుదును, మీ విగ్రహములవలన మీకు కలిగిన అపవిత్రత అంతయు తీసివేసెదను. నూతన హృదయము మీ కిచ్చెదను, నూతన స్వభావము మీకు కలుగజేసెదను, రాతిగుండె మీలోనుండి తీసివేసి మాంసపు గుండెను మీకిచ్చెదను. నా ఆత్మను మీయందుంచి, నా కట్టడల ననుసరించు వారినిగాను నా విధులను గైకొను వారినిగాను మిమ్మును చేసెదను. నేను మీ పితరుల కిచ్చిన దేశములో మీరు నివసించెదరు, మీరు నా జనులై యుందురు నేను మీ దేవుడనై యుందును. (యెహెజ్కేలు 36:25-28)

ఇదే కొత్త నిబంధన! ఆయన మనలను శుద్ధిచేసి, మనలో కొత్త ఆత్మను ఉంచును. ఆయన మన రాతి హృదయాలను (పాత ఒడంబడిక క్రింద మనం ఎంత ప్రయత్నించినప్పటికీ పాపం చేస్తూ ఉండే పడిపోయిన స్వభావాలను) తొలగిస్తాడు మరియు ఆయన తన ఆత్మను మనలో ఉంచుతాడు. అప్పుడు ఆయన మనము తన శాసనములను అనుసరించి నడుచుకొనేలా చేస్తాడు. యహువః ఇక్కడ తన ప్రజలను పునఃసృష్టి చేస్తానని వాగ్దానం చేస్తున్నాడు, వారికి తన స్వభావాన్ని పోలిన కొత్త, ఉన్నత స్వభావాలను అందజేస్తున్నాడు. నిజంగా పాపం లేకుండా జీవించుటకు ఇది అవసరం. పాత నిబంధన ప్రకారం, ఈ బహుమానం యొక్క సంచకరువు ఇవ్వబడింది, అయితే యఃహువః రాజ్యాన్ని భూమిపై స్థాపించుటకు యహూషువః తిరిగి వచ్చినప్పుడు అది సంపూర్ణంగా అనుగ్రహించబడుతుంది.

ఆయనయందు సర్వసంపూర్ణత నివసింపవలెననియు, ఆయన సిలువ రక్తముచేత సంధిచేసి, ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోక మందున్నవైనను పరలోక మందున్నవైనను, వాటినన్నిటిని ఆయన ద్వారా తనతో సమాధానపరచు కొనవలెననియు తండ్రి అభీష్టమాయెను.

మరియు గతకాల మందు దేవునికి దూరస్థులును, మీ దుష్‌క్రియల వలన మీ మనస్సులో విరోధ భావముగల వారునైయుండిన మిమ్మును కూడ తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలువబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణమువలన ఇప్పుడు మిమ్మును సమాధానపరచెను. (కొలొస్సయులకు 1:19-22, NKJV)

మీరు ఇప్పటికీ పాపంలో పడిపోతున్నారని మీరు నిరుత్సాహపడుతున్నట్లయితే, ధైర్యంగా ఉండండి. మీరు పాపం చేయుట మానేయాలనుకుంటున్నారనే వాస్తవం మీ హృదయంలో ఆత్మ చేయుచున్న క్రియకు రుజువు, ఎందుకంటే సహజ హృదయం యహువః విషయాలను ప్రేమించదు.

శరీరానుసారులు శరీర విషయములమీద మనస్సు నుంతురు; ఆత్మానుసారులు ఆత్మ విషయములమీద మనస్సునుంతురు; శరీరానుసారమైన మనస్సు మరణము; ఏలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమైయున్నది; అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏమాత్రమును లోబడనేరదు. కాగా శరీరస్వభావము గలవారు దేవుని సంతోషపరచ నేరరు. దేవుని ఆత్మ మీలో నివసించియున్నయెడల మీరు ఆత్మస్వభావము గలవారే గాని శరీర స్వభావము గలవారు కారు. (రోమీయులకు 8:5, 7-9)

యహువఃకు లోబడుటను కొనసాగించండి. విశ్వాసం ద్వారా ఆయన వాగ్దానాలను అంటిపెట్టుకుని ఉండండి మరియు ఏదో ఒక రోజున యహూషువః తిరిగి వచ్చినప్పుడు, మీరు ఆయనలో ఇప్పటికే ఉన్నట్లుగా—ఒక కొత్త జీవిగా—ఆయన ఆత్మ యొక్క సంపూర్ణతతో నింపబడుదురు. కొత్త నిబంధన క్రింద ఉన్న జీవిత వాస్తవికత: అది యహువఃలో పరిపూర్ణత. అది ఆయన ఆత్మతో నింపబడి ఉంటుంది.

బైబిలు మరియు పుష్పాలు పట్టుకున్న అమ్మాయి