Print

రక్షింపబడుటకు నేను ఏమి చేయాలి?

ఇది WLC యేతర వ్యాసం. బయటి రచయితల వనరులను ఉపయోగించినప్పుడు, బైబిలుకు మరియు డబ్ల్యుఎల్‌సి ప్రస్తుత నమ్మకాలకు 100% అనుగుణంగా ఉండెనని భావించిన వాటిని మాత్రమే మేము ప్రచురిస్తాము. కాబట్టి అలాంటి వ్యాసాలను డబ్ల్యుఎల్‌సి నుండి నేరుగా వచ్చినట్లుగా పరిగణించవచ్చు. యహువః యొక్క అనేక మంది సేవకుల పరిచర్య ద్వారా మేము ఎంతగానో ఆశీర్వదించబడ్డాము. అయితే ఈ రచయితల యొక్క ఇతర రచనలను అన్వేషించమని మేము మా సభ్యులకు సలహా ఇవ్వము. అటువంటి రచనలు, లోపాలను కలిగి ఉన్నందున మేము వాటిని ప్రచురణల నుండి మినహాయించాము. విచారకరంగా, లోపం లేని మంత్రిత్వ శాఖను మనం ఇంకనూ కనుగొనలేదు. డబ్ల్యుఎల్‌సి వి కాని కొన్ని ప్రచురించబడిన విషయాలను [వ్యాసాలు/ఎపిసోడ్లు] చూసి మీరు దిగ్బ్రాంతి చెందినచో, సామెతలు 4:18 జ్ఞాపకం చేసుకోండి. మన మార్గంలో మరింత కాంతి వెలువడు కొద్దీ ఆయన సత్యాన్ని గూర్చిన మన అవగాహన అభివృద్ధి చెందుతూ ఉంటుంది. మేము సత్యాన్ని ప్రాణం కంటే ఎక్కువగా ఆదరిస్తాము మరియు అది దొరికిన చోటు ఏదైనా అక్కడ వెతుకుతాము.

రక్షింపబడుటకు నేను ఏమి చేయాలి?

అతడు దీపము తెమ్మని చెప్పి లోపలికి వచ్చి, వణకుచు పౌలుకును సీలకును సాగిలపడి, వారిని వెలుపలికి తీసికొనివచ్చి అయ్యలారా, రక్షణపొందుటకు నేనేమి చేయవలెననెను. అందుకు వారు ప్రభువైన యహూషువః నందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ యింటివారును రక్షణ పొందుదురని చెప్పెను” (అపొస్తలుల కార్యములు 16:29-31).

అపోస్తలుల చరిత్ర యొక్క ఈ ఉత్కంఠభరితమైన భాగం మానవ పెదవులచే రూపొందగల అతి ముఖ్యమైన ప్రశ్నను కలిగి ఉంది. ఈ ప్రశ్న ఆరోగ్యాన్ని, సంపదను, కీర్తిని లేక మానవ శక్తి మరియు గొప్పతనం యొక్క ఉన్నత స్థానాన్ని పొందుటకు నేను ఏమి చేయాలి అనేదానికోసం కాదు; కానీ వీటన్నిటి కంటే అనంతమైనది: “రక్షింపబడుటకు నేను ఏమి చేయాలి?” మరియు ప్రశ్న యొక్క ప్రాముఖ్యతకు జవాబు యొక్క స్పష్టత తగినట్టుగా ఉంది: “ప్రభువైన యహూషువః నందు విశ్వాసముంచుము.” నమ్మకం మరియు విశ్వాసం ఒకటే ...

తండ్రి యిట్లనెను; మరియు ఈయన నేర్పరచుకొనిన నా కుమారుడు, ఈయన మాట వినుడి. (లూకా 9:35). మోషే యిట్లనెను; ఆయన మీతో ఏమి చెప్పినను అన్ని విషయములలో మీరాయన మాట వినవలెను. ఆ ప్రవక్త మాట విననివాడు ప్రజలలో ఉండకుండ సర్వనాశనమగుననెను.” (అపొస్తలుల కార్యములు 3:22-23).

నేను దీనిని చాలా సరళమైన సమాధానం అని చెబుతాను, ఎందుకంటే, మన ముందు ఉన్న బైబిలుతో, ప్రభువైన యహుషువః క్రీస్తును విశ్వసించుట అనగా అర్థం ఏమిటో తెలుసుకోవడం సులభం. "విషయం" మన ముందు స్పష్టమైన వెలుగులో ఉంచబడింది. ఉదాహరణకు, ఒక సందేశాన్ని దూత తీసుకువచ్చునప్పుడు ఆ దూతను నిజంగా విశ్వసించడం అంటే అతడు తీసుకువచ్చే సందేశాన్ని నమ్మడం అని మనకు తెలుసు. ఇప్పుడు, క్రీస్తు యొక్క ఇతర లక్షణాలలో, ఆయనకు స్పష్టంగా ఆపాదించబడిన ఒక దూత యొక్క లక్షణాలను మనం కనుగొన్నాము మరియు ఆయన యహువః యొద్ద నుండి మనిషికి సందేశాన్ని తీసుకువచ్చే వానిగా పంపబడ్డాడు. అందువలన ఆయన “నిబంధన దూత” (మలాకి 3: 1) మరియు; "మనము ఒప్పుకొనిన దానికి అపొస్తలుడును ప్రధానయాజకుడు అని పిలువబడెను." (హెబ్రీ 3: 1). ఇక్కడ ప్రభువైన యహూషువఃకు వర్తింపజేయబడిన “అపొస్తలుడు” అనే పదం అదే ఆలోచనను తెలియజేస్తుంది, ఎందుకంటే దీని అర్థం “దూత, రాయబారి”. మరియు ద్రాక్షతోట యొక్క ఉపమానంలో రక్షకుడు తన గురించి తాను అదే విధంగా మాట్లాడుతాడు: "అందరికంటే చివరిగా ఆయన తన కుమారుడిని పంపించాడు." మళ్ళీ ఆయన, “నేను యహువః రాజ్యాన్ని ప్రకటించుటకు పంపబడితిని” అని అంటాడు ... తండ్రి ఇలా అంటాడు, “ఈయన నే నేర్పరచుకొనిన నా కుమారుడు, ఈయన మాట వినుడి.” (లూకా 9:35). మరియు మోషే, “ఆయన మీతో ఏమి చెప్పినను అన్ని విషయములలో మీరాయన మాట వినవలెను, ఆ ప్రవక్త మాట విననివాడు ప్రజలలో ఉండకుండ సర్వనాశనమగుననెను.” (అపొస్తలుల కార్యములు 3:22-23).

ఈ విషయాన్ని ఇంకా స్పష్టంగా చెప్పాలంటే, సాక్ష్యమిచ్చే సాక్షిగా ప్రభువైన యహూషువః మన ముందు ఉంచబడెను. అందువలన ఆయన “నమ్మకమైన సత్య సాక్షి” అని పిలువబడెను (ప్రకటన 3:14). మరియు ఆయన తనను తాను ఇలా ప్రకటించుకున్నాడు, “సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను . . . యీ లోకమునకు వచ్చితిని” (యోహాను 18:37). ఇప్పుడు ఆయన బోధించిన సందేశం లేదా సిద్ధాంతం “ఆయన సాక్ష్యం”, మరియు “ఆయన సాక్ష్యమును అంగీకరించినవాడు యహువః సత్యమంతుడను మాటకు ముద్రవేసియున్నాడు. కుమారుని యందు విశ్వాసముంచువాడే నిత్యజీవముగలవాడు, కుమారునికి విధేయుడు కాని వాడు జీవము చూడడు గాని దేవుని ఉగ్రత వానిమీద నిలిచి యుండును” అని లేఖనం స్పష్టం చేయుచున్నది. (యోహాను 3:33, 36).

నిజమైన మరియు లేఖనాత్మక కోణంలో “ప్రభువైన యహూషువః క్రీస్తును నమ్ముట” అనగా, ఆయన మనుష్యులకు ప్రకటించిన ఆ సందేశాన్ని లేదా సాక్ష్యాన్ని నమ్మడం మరియు పాటించడం.

నిజమైన మరియు లేఖనాత్మక కోణంలో “ప్రభువైన యహూషువః క్రీస్తును నమ్ముట” అనగా, ఆయన మనుష్యులకు ప్రకటించిన ఆ సందేశాన్ని లేదా సాక్ష్యాన్ని నమ్ముట మరియు పాటించు అని

వివిధ దృష్టాంతాలు మరియు అధిక రుజువు ద్వారా ఇప్పుడు మనకు చూపించబడెను.

అప్పుడు రక్షణకు అత్యంత అవసరమైన ఆ సందేశం లేదా సాక్ష్యం ఏమిటి? మన శాశ్వతమైన గమ్యం ఈ ప్రశ్నకు నిజమైన సమాధానం మీద ఆధారపడి ఉంటుంది; మరియు అంత గొప్ప ప్రాముఖ్యత ఉన్న అంశంపై మనం చీకటిలో మిగిలిపోలేనందుకై ప్రభువును స్తుతించాలి. ఆ సందేశం ఏమిటో మనం కనుగొనగలిగే మార్గాన్ని పేతురు ఎంతో ఖచ్చితత్వంతో ఎత్తి చూపాడు. "ఆయన ద్వారా యహువః సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇశ్రాయేలీయులకు పంపిన వర్తమానము మీరెరుగుదురు. యోహాను బాప్తిస్మము ప్రకటించిన తరువాత గలిలయ మొదలుకొని యూదయ యందంతట ప్రసిద్ధమైన సంగతి మీకు తెలియును." (అపొస్తలుల కార్యములు 10: 36-37). ఇలాంటి “గొప్ప స్పష్టమైన ప్రసంగం” తో, మనం వెదుకుతున్న ఆ వాక్యాన్ని లేదా సందేశాన్ని మనం ఎలా కోల్పోతాము? మనకు ఇలా చెప్పబడెను:

1, దానిని ఎవరు పంపారు - “యహువః పంపిన వాక్యం”;

2, అది ఎవరికి పంపబడింది - “ఇశ్రాయేలీయులకు”;

3, అది ఎవరి ద్వారా పంపబడింది - “యహూషువః క్రీస్తు చేత”;

4, అది ఏ ప్రాంతంలో వ్యాపించింది - “యూదయ అంతటను”;

5, అది ఎక్కడ నుండి ప్రారంభమైంది - “గలిలయ నుండి”;

6, అది ఏ సమయంలో ప్రారంభమైంది - “యోహాను బాప్తిస్మము ప్రకటించిన తరువాత.”

ఇటువంటి సరళమైన ఆదేశాలు మనలను నేరుగా మార్కు 1:14 వద్దకు తీసుకువెళతాయి, “యోహాను చెరపట్టబడిన తరువాత యహూషువః . . . యహువః సువార్త ప్రకటించుచు, గలిలయకు వచ్చెను. .”

“ఆయన నేనితర పట్టణములలోను యహువః రాజ్యసువార్తను ప్రకటింపవలెను; ఇందునిమిత్తమే నేను పంపబడితిని.” (లూకా 4:43).

ఇది పేతురు ప్రకటనకు ఎంత ఖచ్చితంగా సరిపోతుంది! యోహాను యొక్క స్వరం వినిపించిన తరువాత, ఆశీర్వదించబడిన రక్షకుడు “గలిలయ నుండి” “యహువః రాజ్య సువార్త” ను ప్రకటించుట ప్రారంభించాడు. ఆయన “వారి సమాజమందిరములలో బోధించుచు, (యహువః) రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటించుచు . . . గలిలయయందంతట సంచరించెను” అని గ్రంథంలోని మరొక భాగం మనకు తెలియజేస్తుంది. (మత్త. 4:23). ఆయన తన పరిచర్యను ఆ ప్రాంతానికి మాత్రమే పరిమితం చేయలేదు, కానీ లూకా 8: 1 నుండి మనం నేర్చుకున్నట్లుగా “యూదయ అంతటా” అదే గొప్ప సందేశాన్ని ప్రకటించాడు: “ఆయన ప్రతి నగరం మరియు గ్రామాలకు వెళ్లి, యహువః రాజ్యాన్ని ప్రకటించి, బోధించాడు.” కపెర్నహూములోని ప్రజలు తమతో ఎక్కువకాలం ఉండమని కోరినప్పుడు ఆయన నిరాకరించాడు “నేనితర పట్టణములలోను యహువః రాజ్యసువార్తను ప్రకటింపవలెను; ఇందునిమిత్తమే నేను పంపబడితిని.” (లూకా 4:43). తన పునరుత్థానం మరియు ఆరోహణకు మధ్య గల విరామంలో కూడా ఆయన పని “యహువః రాజ్యానికి సంబంధించిన విషయాలే” (అపొస్తలుల కార్యములు 1: 3).

ఈ విధంగా నేను “రాజ్య సువార్త” అనగా క్రీస్తు మనుష్యులకు తీసుకువచ్చిన గొప్ప సందేశం లేదా సాక్ష్యం అని స్పష్టంగా మరియు సమృద్ధిగా నిరూపించాను. అందువల్ల, “ప్రభువైన యహూషువః క్రీస్తును నమ్మండి” అని నిజంగా చెప్పిన “రాజ్య సువార్త” ను మనం నమ్మాలి. ఆ సువార్తను నమ్మమని ఆయన మనకు ఆజ్ఞాపించాడు. “మారుమనస్సు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు యహువః సువార్తను ప్రకటించుచు, గలిలయకు వచ్చెను.’ (మార్కు 1: 14-15). తాను బోధించుదానికి వేరైన “మరొక సువార్తను” నమ్మమని ఆయన వారికి ఆజ్ఞాపించలేదు. అందువల్ల, తాను బోధించే సారూప్య సువార్తను - “యహువః రాజ్య సువార్త” ను నమ్మమని ఆయన వారికి ఆజ్ఞాపించినట్లు భాష రుజువు చేస్తుంది. ఆయన ఆజ్ఞలను పాటించడం తప్పనిసరి కాదని ఎవరైనా ఊహించారా? “నేను చెప్పు మాటలప్రకారము మీరు చేయక ప్రభువా ప్రభువా, అని నన్ను పిలుచుట ఎందుకు?” (లూకా 6: 46). “నేను మీకాజ్ఞాపించువాటిని చేసిన యెడల, మీరు నా స్నేహితులై యుందురు.” (యోహాను 15:14). “ఆయన మీతో చెప్పునది చేయుడనెను.” (యోహాను 2: 5). "మీరు నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞలను గైకొందురు." (యోహాను 14:15). ఆయన ఆజ్ఞలను పాటించుట అనేది మనమాయనను ప్రేమిస్తున్నదానికి ఒక పరీక్ష, మరియు ఖచ్చితంగా ఆయనను ప్రేమించని వారు రక్షింపబడరు, ఎందుకంటే భయంకరమైన శిక్ష ఇలా ప్రకటించబడెను: “ఎవడైనను ప్రభువును ప్రేమింపకుంటే వాడు శపింపబడునుగాక; ప్రభువు వచ్చుచున్నాడు (ఆదిమ భాషలో- 'మరనాత ' అనగా ప్రభువు వచ్చుచున్నాడు). (1 కొరింథీయులకు 16:22).

యహువః కుమారుడు మనకు ఉదాహరణగా ఉండి, యహువః రాజ్యాన్ని తన ఉపన్యాసం యొక్క గొప్ప మరియు స్థిరమైన ఇతివృత్తంగా మార్చినందువలన, ఇది మనుషుల మనస్సులను మరియు నాలుకలను ఆక్రమించగల తెలివైన, గొప్ప మరియు ఉత్తమమైన ఇతివృత్తంగా ఉండాలని మనకు తెలుసు.

యహువః కుమారుడు మనకు ఉదాహరణగా ఉండి మరియు యహువః రాజ్యాన్ని తన ఉపన్యాసం యొక్క గొప్ప, స్థిరమైన ఇతివృత్తంగా మార్చినందువలన, ఇది మనుషుల మనస్సులను లేదా నాలుకలను ఆక్రమించగల తెలివైన, గొప్ప మరియు ఉత్తమమైన ఇతివృత్తంగా ఉండాలని మనకు తెలుసు. కానీ అనేకమైన ఆధునిక బోధకులు, ఉన్నత మరియు తక్కువ స్థానాల్లో ఉన్నవారు, గ్రుడ్డి మరియు ప్రాణాంతక స్థితిలో, రాజ్యం యొక్క ఆ ఆశీర్వాద సువార్తను నమ్ముటను లేదా బోధించుటను నిరాకరిస్తున్నారని అందరికీ తెలుసు. నేను అలాంటి బోధకుల స్థానంలో ఉండను.

ఒకసారి ఒక ప్రముఖ తెగకు చెందిన ఒక ప్రముఖ సభ్యుడు తాను ఇరవై ఐదు సంవత్సరాలుగా చర్చికి వెళుతున్నాడని కాని అక్కడ - రాజ్య సువార్త - ప్రకటించబడినట్లుగా గాని, లేదా దానిపై బోధించిన ఉపన్యాసం ఎప్పుడైనా విన్నట్లుగా గాని గుర్తులేదని నాకు చెప్పాడు. అలాగే, మరొక జనాదరణ పొందిన పెద్ద శాఖ యొక్క బోధకుడు, "రాజ్య సువార్త" అనే వ్యక్తీకరణ తనకు గుర్తుందనియు మరియు అది "పత్రికలలో ఎక్కడో" ఉంటుందని చెప్పాడు. అలాగే, తాను గ్రీకు మరియు హెబ్రీ భాషలను అభ్యసించానని, వేదాంతశాస్త్రంలో పట్టభద్రుడయ్యానని, ఆరు సంవత్సరాలు బోధించానని చెప్పిన మరొక బోధకుడు; "రాజ్య సువార్త" అనే వ్యక్తీకరణ పాత నిబంధనలో ఉందా లేక క్రొత్త నిబంధనలో ఉందా అని నేను ప్రశ్నించినప్పుడు, అతడు ఇది పాత నిబంధనలో, "బహుశా కీర్తనలలో" ఉన్నదని తాను నమ్ముతున్నాడని మరియు తాను ఎప్పుడూ ఆ అంశంపై బోధించలేదని చెప్పాడు. కానీ, క్రుడెన్ యొక్క కాంకర్డెన్స్ ప్రకారం, ఆ వ్యక్తీకరణ పత్రికలు, కీర్తనలు లేదా పాత నిబంధనలలో ఎక్కడా కనుగొనబడదు. ఈ సంఘటనలను బట్టి ప్రపంచంలో గొప్ప మతభ్రష్టత్వం జరిగిందని మరియు జనులు “విశ్వాసం నుండి బయలువెళ్ళి” ప్రభువైన యహూషువః బోధించిన సువార్తనుగాక “మరొక సువార్తను” ప్రకటించే వినాశకరమైన అభ్యాసంలో పడిపోయిరని రుజువుకాలేదా?

ప్రభువైన యహూషువః యహువః రాజ్యాన్ని బోధించడం మాత్రమే కాక, తన వ్యక్తిగత పరిచర్య జరుగుతున్న సమయంలో, “ఆయన తన పన్నెండు మంది శిష్యులను పిలిచి, యహువః రాజ్యాన్ని బోధించుటకు పంపియున్నాడు. వారు బయలుదేరి అంతటను సువార్త ప్రకటించుచు . . . గ్రామములలో సంచారము చేసిరి.” (లూకా 9: 2, 6). లేఖనాల ప్రకారం, దేవుని రాజ్యాన్ని ప్రకటించుట అనగా సువార్తను ప్రకటించుట అని ఇక్కడ మనం కనుగొన్నాము. అందువల్ల, దేవుని రాజ్యాన్ని బోధించని వారు సువార్తను ప్రకటించుటలేదు. రాజ్యాన్ని బోధించుట చాలా ముఖ్యమైనది, ఒకడు నేను వెళ్లి మొదట నా తండ్రిని పాతిపెట్టి వచ్చుటకు సెలవిమ్మని కోరినప్పుడు, ప్రభువు ఇలా అన్నాడు, “మృతులు తమ మృతులను పాతిపెట్టుకొననిమ్ము; నీవు వెళ్లి దేవుని రాజ్యమును ప్రకటించుమని వానితో చెప్పెను.” (లూకా 9:60).

అపొస్తలులు వెళ్ళిన ప్రతిచోటా “రాజ్య సువార్త” బోధించబడెనని మనం గ్రహించాలి, “ఈ రాజ్య సువార్త లోకమందంతటను బోధించబడును” అనే ప్రభువు మాటలను బట్టి - చాలా స్పష్టంగా వారు దానిని బోధించాల్సిన అవసరం ఉండెను. అపొస్తలుల ద్వారా రాజ్య బోధన జరిగినట్లు తరచుగా ప్రస్తావన ఉంది. "అయితే ఫిలిప్పు యహువః రాజ్యమును గూర్చియు యహూషువః క్రీస్తు నామమును గూర్చియు సువార్త ప్రకటించుచుండగా..” (అపొస్తలుల కార్యములు 8:12). పౌలు కూడా ఎఫెసు మరియు ఇతర ప్రదేశాలలో “యహువః రాజ్యమును గూర్చిన విషయాలను” ప్రకటిస్తున్నాడు (అపొస్తలుల కార్యములు 19: 8; 20:25). రోమాలో అతడు రెండు సంవత్సరాలు నివశించాడు, అతడు “యహువః రాజ్యాన్ని ప్రకటిస్తూ, మరియు యహూషువః క్రీస్తును గూర్చి వివరంగా బోధించెను” (అపొస్తలుల కార్యములు 28:23, 31).

బైబిల్ ఒకే విశ్వాసం మరియు ఒకే నిరీక్షణను గూర్చి బోధిస్తూ ఒక్క సువార్తను మాత్రమే గుర్తించును, అందువలన “మరొక సువార్తను" ప్రకటించుటకు ధైర్యం చేసే మానవుడైనను లేక పరలోకం నుండి వచ్చిన యొక దూతయైనను రెండింతల శాపగ్రస్తులగుదురు. (ఎఫె. 4: 5; గల. 1: 8 -9).

బైబిల్ ఒకే విశ్వాసం మరియు ఒకే నిరీక్షణను గూర్చి బోధిస్తూ ఒక్క సువార్తను మాత్రమే గుర్తించును, అందువలన “మరొక సువార్తను" ప్రకటించుటకు ధైర్యం చేసే మానవుడైనను లేక పరలోకం నుండి వచ్చిన యొక దూతయైనను రెండింతల శాపగ్రస్తులగుదురు. (ఎఫె. 4: 5; గల. 1: 8 -9). ఇప్పుడు, మునుపటి సాక్ష్యాల తరువాత, ఆ ఒక్క సువార్త ఏమిటో మీకు అనుమానంగా ఉందా? ఖచ్చితంగా అది మరేదో కాదు, రక్షకుడు చెప్పిన, “ప్రపంచమంతా బోధింపబడవలసిన” “ఈ రాజ్య సువార్త”; మరియు అది ఒక ప్రాంతం నుండి "మరొక‌ ప్రాంతానికి" తీసుకువెళ్ళబడింది, ఎందుకంటే పౌలు కొలొస్సయులలో "ఈ సువార్త సర్వలోకములో ఫలించుచు, . . . వ్యాపించుచున్నది అని చెప్పెను. (కొలొ. 1: 6, 23). మరియు ఒక్క సువార్త మాత్రమే ఉన్నందున, అది “రాజ్య సువార్త” యై యున్నది మరియు బైబిలు దీని గురించి చెబుతూ, “నమ్మని వానికి శిక్ష విధింపబడును” అని చెప్పుచున్నది (మార్కు 16: 15-16). "రాజ్య సువార్తను" గాక "మరొక సువార్తను" ప్రకటించుట లేదా నమ్ముట భయంకరమైన శిక్షను తెచ్చుచున్నవి.

వాస్తవానికి, రాజ్య సువార్తను ప్రకటించుట అనగా ప్రజల వినికిడిలో ఆ పదబంధాన్ని మళ్లీ మళ్లీ చెప్పుట కాదు; అటువంటి విధానం ద్వారా వారు ఏ సమాచారం పొందగలరు? “సువార్త” అని అనువదించబడిన ఎవాంజెలియన్‌ అనే పదానికి “మంచి సందేశం, శుభవార్త, సంతోషకరమైన వార్త” అని అర్ధం. కాబట్టి రాజ్య సువార్తను ప్రకటించుట అనగా మంచి సందేశాన్ని లేదా “రాజ్య శుభవార్తను” కలిగియున్న విషయాలను బోధించుట. “యహువః రాజ్యమును గూర్చియు యహూషువః క్రీస్తు నామమును గూర్చియు సువార్త ప్రకటించుట ద్వారా సమరయలో రాజ్య సువార్తను ప్రకటించిన ఫిలిప్పు విషయంలో ఇది వివరించబడింది (అపొస్తలుల కార్యములు 8:12). సమరయలో ఫిలిప్పు యొక్క బోధన కొరింథులోని పౌలు బోధనతో, మరియు సమస్త ప్రదేశాలలో ఉన్న అపొస్తలులందరి బోధనతో సమన్వయం చేయబడియున్నట్లు మనకు తెలుసు. వారందరూ బోధించిన ఒకే సువార్త ఉంది. మోషే సంబంధమైన పరిచర్యలో మోషేకు రెండు లేదా అంతకంటే ఎక్కువ వ్యతిరేక నియమావళిలు ఇవ్వబడలేదు; కాబట్టి ప్రస్తుత క్రీస్తు సంబంధమైన పరిచర్యలోనూ రెండు లేదా అంతకంటే ఎక్కువ వ్యతిరేక సువార్తలు ఇవ్వబడలేదు. అయితే, పూర్వం వారి సంప్రదాయాలకు అనుగుణంగా మోషే ధర్మశాస్త్రాన్ని తప్పుదారి పట్టించినవారు ఉన్నట్లే, ఇప్పుడు కూడా సంప్రదాయం ప్రకారం రాజ్య సువార్తను తప్పుదారి పట్టించేవారు కొందరు ఉన్నారు.

అందువల్ల, “యహువః రాజ్యమును గూర్చిన విషయాలను మరియు యహూషువః క్రీస్తు నామమును” విశ్వసించుట సమరయులకు ఎంత అవసరమో, అవే విషయాలను నమ్ముట మనకు కూడా అంతే అవసరం; ఎందుకంటే “హితవాక్య ప్రమాణాన్ని గైకొనుట"; "పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ నిమిత్తము పోరాడుట"; "పురాతన మార్గములనుగూర్చి విచారించి అందులో నడుచుకొనుట" మన కర్తవ్యమై యున్నది. (2వ తిమోతి. 1:13; యూదా 3; మరియు యిర్మీయా. 6:16)

రాజ్య సువార్తను ప్రకటించుటకు లేదా నమ్ముటకు ఏకైక మార్గం ఆ సువార్త కలిగి ఉన్న గొప్ప సత్యాలను బోధించుట లేక నమ్ముట అని మేము ఇప్పుడు నిరూపించాము.


ఇది విలే జోన్స్ (1879 )రాసిన వ్యాసం. WLC వ్యాసం కాదు. (ది గోస్పెల్ ఆఫ్ ది కింగ్డమ్ ఇన్ ది టెన్ డిస్కోర్సెస్ నుండి తీసుకోబడెను.)

మేము అసలు వ్యాసం నుండి సమస్త అన్య నామములను మరియు తండ్రి - కుమారుడు అనే శీర్షికలను తొలగించి, వాటి స్థానాన్ని అసలు నామములతో భర్తీ చేసాము. ఇంకా, ఇక్కడ ఇవ్వబడిన లేఖనాలలో తండ్రి మరియు కుమారుని నామములను బైబిల్ యొక్క మొదటి ప్రేరేపిత రచయితలచే వ్రాయబడిన విధంగా మేము పునరుద్ధరించాము. -WLC బృందం.