Print

మీరు ఎప్పటికీ కలిగి ఉండు ఉత్తమ స్నేహితుడు యహువః. ఎందుకో ఇక్కడ ఉంది . . .

యహువః యొక్క లక్షణాలను వివరిస్తున్న లేఖనాల నివేదికల యొక్క నిజమైన అర్థాన్ని తెలుసుకున్నప్పుడు అవి సజీవంగా కనిపిస్తాయి. ఈ వాక్యాలను ఎలా నిర్వచించాలో తెలుసుకోండి, అలా మీరు మునుపెన్నడూ చూడని వాగ్దానాలను కనుగొంటారు!

మీ ఉత్తమ స్నేహితుని గురించి ఆలోచించుటకు ఒక్క క్షణం సమయం తీసుకోండి. మీరు ఉత్తమ స్నేహితులను కలిగియుండుటకు దోహదపడినది ఏమిటి? మీ ఇరువురి సాధారణ ఆసక్తులు ఒకేలా ఉండుట? ఆమె దయగలిగి ఉందా? అతడు నమ్మకమైనవాడా? మీరు కలిసి ఆనందిస్తున్నారా?

మీరు ఎప్పటికీ కలిగి ఉండు ఉత్తమ స్నేహితుడు యహువః అని కొన్నిసార్లు చెప్పటం జరిగింది, అయితే ఏ వ్యక్తిగతమైన లక్షణాలు పరలోకపు తండ్రిని మంచి స్నేహితునిగా చేయుచున్నవని ఖచ్చితంగా విశ్లేషించుకొనుటకు ఎవరూ సమయం తీసుకొనుటలేదు.

గ్రంథం అనేక సౌదర్యవంతమైన వ్యక్తిత్వ లక్షణాల జాబితాను అందిస్తుంది. ఈ లక్షణాలలోని ప్రతి నిర్వచనాన్ని జాగ్రత్తగా అర్థం చేసికొనినయెడల అది దైవ హృదయ స్వభావమును గూర్చిన ఆశ్చర్యకరమైన సంగ్రహావలోకనాన్ని అందిస్తుంది.

మోషే దానిని చూడాలని కోరుకున్నప్పుడు ఇలా పలికెను, “అతడు దయచేసి నీ మహిమను నాకు చూపుమనగా” (నిర్గమకాండము 33:18)

అతని యెదుట యహువః అతని దాటి వెళ్లుచు “యహువః కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపాసత్యములుగల ఎలోహీం అయిన యహువః. ఆయన వేయి వేలమందికి కృపను చూపుచు, దోషమును అపరాధమును పాపమును క్షమించును …. ప్రకటించెను.” (నిర్గమకాండము 34:6-7)

యహువః కృపగలవాడు

"యహువః కృప యుగయుగములు నిలుచును."
(కీర్తనలు 103:17, KJV)

కృప అనగా "అపరాధియైన వ్యక్తికి అర్హత కలుగచేయు, లేక బాధపరచు వారిని చూచి చూడనట్లు విడిచిపెట్టు హృదయం యొక్క ధర్మగుణం, సాత్వికము లేదా సున్నితత్వం; న్యాయాన్యాయాలను పక్కనపెట్టి, గాయపడిన వ్యక్తి తనను గాయపరచిన వారిని క్షమించునట్లు మరియు శాంతిని కలిగియుండునట్లు ప్రేరేపించే గుణం, లేదా చట్టం ద్వారా జరగవలసిన శిక్ష కన్నా తక్కువ శిక్షను కలుగజేయు గుణం. 1

ఇది తండ్రి ఇతరులతో వ్యవహరించు తీరుగా ఉన్నది. ఆయన తేలికపాటి స్వభావమును కలిగి ఉన్నాడు. అన్యాయం చేసినపుడు లేదా అవమానించినప్పుడు, తన మొదటి ప్రతిచర్య చూచి చూడనట్లు ఉండి నేరంచేసిన వారిని శిక్షింపబడకుండా కాపాడుట.

యహువః దయాళుడు

దయాళత్వముతో ఉండుట అనగా దయతో, స్నేహపూర్వకంగా ఉండుట. యహువః స్నేహపూర్వకంగా ఉండును! ఆయన హృదయపూర్వకంగా, ఇతరులపై (వారిని తేలికగా పొందుకొనుటకు) ఆసక్తి కలిగి ఉన్నాడు. దయాగుణమును ధర్మగుణంగా కూడా నిర్వచించవచ్చు” ధర్మగుణంగల వ్యక్తి ఇతరులకు మంచి చేయాలనే నిజమైన కోరికను కలిగి ఉంటాడు. ధర్మగుణం అనేది యహువః యొక్క దయగల వ్యక్తిత్వం యొక్క అంతర్భాగమై ఉన్నది. “యహువః దయాళుడని..” (1 పేతురు 2:1)

యహువః దీర్ఘశాంతుడు

ఇది పాపుల కొరకు ఖచ్చితంగా ఒక శుభవార్త! దీర్ఘకాలం సహించుట అనగా "దీర్ఘకాలం గాయములను లేదా అవమానములను సహించుట ... సులభంగా రెచ్చగొట్టబడకుండుట." ఇది సహనంగా ఉంది! మనమందరము తప్పులు చేస్తాము. అయితే, నిజమైన మిత్రులు త్వరగా క్షమిస్తారు, మరియు యహువః అత్యంత నిజమైన స్నేహితుడు. “కొందరు ఆలస్యమని యెంచుకొనునట్లు యహువః తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు గాని యెవడును నశింపవలెనని యిచ్ఛయింపక, అందరు మారుమనస్సు పొందవలెనని కోరుచు, మీ యెడల ధీర్ఘశాంతముగలవాడై యున్నాడు.” (2 రెండవ పేతురు 3:9)

యహువః మంచివాడు

యహువః ధనవంతుడైన యువకుణ్ణి ఇలా అడిగాడు: “నీవు నన్ను మంచి వాడనని ఎందుకు పిలుచుచున్నావు? మంచి వాడొక్కడే. ఆయన యహువః. (మత్తయి సువార్త 19:17 KJV). యహువః "మంచి" వాడని లేఖనాలయందంతటా ఉన్నది, అయితే "మంచి" యొక్క వాస్తవ నిర్వచనం చాలామంది గ్రహించినదానికన్నా చాలా లోతుగా మరియు గొప్పగా ఉంటుంది.

మంచితనం ఇలా నిర్వచించబడును: "బాధను తగ్గించుటకు లేదా తీసివేయుటకు దోహదపడునది, లేదా, సంతోషాన్ని లేదా శ్రేయస్సును పెంచునది ... [ఇది] చెడు లేదా లోభత్వానికి వ్యతిరేకమైనది.” నొప్పిని తగ్గించుటకు లేదా తీసివేయుటకు యహువః చాలా కష్టపడతాడు. ఆయన అందరి యొక్క ఆనందాన్ని మరియు శ్రేయస్సును పెంచడానికి చురుకుగా ప్రయత్నించును. ఇది ఒక స్నేహితుడు కలిగి ఉండవలసిన ఒక సుందరమైన లక్షణం!

యహువః జాలి చూపును

కీర్తన 103: 13 ఇలా చెబుతోంది: “తండ్రి తన కుమారులయెడల జాలిపడునట్లు యహువః తనయందు భయభక్తులు గలవారి యెడల జాలిపడును.”

జాలి యొక్క లక్షణము ఒక చెడు నిందను భరించును. శోధనల ద్వారా పోరాడుతున్న ప్రజలు కొన్నిసార్లు కోపంగా చెప్పుదురు, "నాపై జాలిపడవద్దు!" కానీ జాలి సానుభూతితో కలిసి నడుస్తుంది. జాలి ఇలా నిర్వచించబడుతుంది: “వేరొకరి ఆపద లేక దుఃఖం వలన కలిగే సానుభూతి మరియు విచారము.” 2

హెబ్రీయులకు వ్రాసిన పత్రికలో 4:15 లో ఇలా తెలియజేయబడినది: “మన ప్రధానయాజకుడు మన బలహీనతలయందు మనతో సహానుభవము లేనివాడు కాడు.” వేరొక మాటలో చెప్పాలంటే, మనం అనుభూతి చెందుదానిని యహువః అనుభూతి చెందును. అక్షరానుసారంగా. కాని జాలి అనగా ఏమిటి! జాలి అనేది "ఇతరుల దుఃఖంతో ప్రేరేపింపబడిన, ఒక వ్యక్తి యొక్క అనుభూతి లేక బాధ." కాబట్టి, మీరు తండ్రి యొక్క జాలి గురించి మాట్లాడే ఒక పాఠాన్ని చదివే ప్రతిసారి, మీరు ఏమి అనుభూతి చెందుదురో దానిని ఆయన కూడా అనుభూతి చెందుతున్నట్లు అర్థం చేసుకోండి, మీరు బాధపడుతున్నప్పుడు ఆయన కూడా బాధపడును.

యహువః కారుణ్యం గలవాడు

కీర్తన 145: 8 మనకు ఇలా చెబుతోంది: "యహువః దయా దాక్షిణ్యములు గలవాడు ఆయన దీర్ఘశాంతుడు కృపాతిశయము గల వాడు." దయా దాక్షిణ్యము అనే పదానికి అర్ధం నేడు తరచుగా ఉపయోగిస్తున్న అర్థం కాదు; కాబట్టి ఈ గుణం యొక్క అసలైన అర్థం కోల్పోబడినది. చాలా మందికి దీని ఖచ్చితమైన అర్థం ఏమిటో తెలియదు.

కారుణ్యం ఇలా నిర్వచించబడుతుంది: “ఇతరులతో బాధపడుట; [a] బాధాకరమైన సానుభూతి; మరొకరి బాధ లేక దురదృష్టము ద్వారా ప్రేరేపించబడు విచారం యొక్క సంవేదన; జాలి; పరితాపము. కరుణ అనేది ప్రేమ మరియు దుఃఖము యొక్క మిశ్రమము; ప్రేమ యొక్క కనీసం కొంత భాగం సాధారణంగా నొప్పి లేదా విచారమును భరిస్తుంది మరియు దాని ద్వారా ప్రేరేపించబడుతుంది.” ఉత్తమ స్నేహితులు ఇదే చేయుదురు: వారు ఒకరికొరకు ఒకరు భరిస్తారు. యహువఃను గొప్ప స్నేహితునిగా చేయు విషయం ఇదే. ఆయన నిన్ను చాలా ప్రేమించును, అనగా నిన్ను బాధపరచు ప్రతీదీ ఆయనను బాధపరచును.

యహువః కరుణావాత్సల్యముగలవాడు

“మీ ఎలోహీం అయిన యహువః కరుణావాత్సల్యములుగల వాడును, శాంతమూర్తియు అత్యంత కృపగలవాడు…”
(యోవేలు 2:13).
కరుణావాత్సల్యము అనేది ఒకడు కలిగి ఉండు అత్యంత సుందరమైన లక్షణాల్లో ఒకటి.

“మీ ఎలోహీం అయిన యహువః కరుణావాత్సల్యములుగల వాడును, శాంతమూర్తియు అత్యంత కృపగలవాడు…” (యోవేలు 2:13). కరుణావాత్సల్యము అనేది ఒకడు కలిగి ఉండు అత్యంత సుందరమైన లక్షణాల్లో ఒకటి.

కరుణావాత్సల్యముగల వ్యక్తి ఎవరనగా, ఇతరులకు మేలు చేయుటకు, వారి అవసరతలను తీర్చుట ద్వారా లేదా ఇబ్బందిలో వారికి సహాయ చేయుట ద్వారా వారిని సంతోషపెట్టుటకు నిర్ణయించుకొనిన వ్యక్తి. అతడు సున్నితత్వమును, మంచి స్వభావమును; దయను; కరుణను కలిగియుంటాడు."

యహూషువః ఇలా ప్రార్థించెను: “అద్వితీయ సత్య ఎలోహీం అయిన నిన్నును, నీవు పంపిన యహూషువః మెస్సీయను ఎరుగుటయే నిత్య జీవము.”(యోహాను సువార్త 17:3) యహువఃను ఎరుగుట అనగా పాపం తన శక్తిని కోల్పోయేలా అతనితో ప్రేమలో పడుట.

సాతానుకి ఇది తెలుసు. అతడు విశ్వాసుల మరియు అవిశ్వాసుల మనస్సులలో యహువః యొక్క భయమును నింపుటలో తన దృష్టిని పెట్టాడు. యహువః కఠినమైనవాడు, క్షమాగుణం లేనివాడు అన్నట్లు అతడు యహువః యొక్క న్యాయం గురించి నొక్కి చెప్పాడు. కానీ న్యాయం సరళంగా ఉంది. “వ్యవహరించుటలో మరియు చర్యలలో గౌరవప్రదమైన మరియు సుందరమైన” వ్యక్తియే న్యాయం గల వ్యక్తి.3 నీ ఉత్తమ స్నేహితునిగా, ఆయన న్యాయమైనవాడు! నిజానికి, కనికరం గల సృష్టికర్తగా ఆయన, “ఒక అపరాధిని, అతడు పొందవలసిన శిక్షను తగ్గించునట్లు” ఎల్లప్పుడూ జాగ్రత్త తీసుకొనును.

యహువఃను మనము తెలిసికోవలసినంత గొప్పగా తెలుసుకున్నప్పుడు, పాపం మనపై తన శక్తిని కోల్పోతుంది. మీకు మీరు వ్యక్తిగతంగా తండ్రిని తెలుసుకోండి. సాతాను ఆరోపణల వెనుక దాగి ఉన్న హృదయం యొక్క ఒక సంగ్రహావలోకనమును గ్రహించండి, అప్పుడు మీరు ఎప్పటికీ కలిగిఉండే ఉత్తమ స్నేహితుని కనుగొంటారు.


1 పేర్కొనబడిన అన్ని నిర్వచనాలు నోవాహ్ వెబ్స్టర్స్ అమెరికన్ డిక్షనరీ ఆఫ్ ది ఇంగ్లీష్ లాంగ్వేజ్, 1828 ed. నుండి పేర్కొనబడినవి.. లేనియెడల చెప్పబడెను.

2 ది అమెరికన్ హెరిటేజ్ డిక్షనరీ, 4 వ ఎడిషన్.

3 ఐబిడ్.