Print

లైంగిక పాపాలకు వ్యతిరేకమైన యుద్ధంలో 8 ఆవశ్యకమైన ఆయుధాలు

లైంగిక పాపములతో సమూలంగా వ్యవహరించుటకు ఇది చాలా గొప్ప/మించిన సమయమై ఉన్నది. పరిశీలనా/ కృపా కాలము ముగియుటకు సిద్ధంగా ఉంది. లైంగిక అనైతికతకు వ్యతిరేకమైన వారి యుద్ధంలో అందుబాటులో ఉన్న ప్రతి ఆయుధమును ఉపయోగించకపోవుట నేటి క్రైస్తవుల అత్యంత మూర్ఖత్వమే అవుతుంది.

పరిశీలనా కాలము యొక్క ఈ ఆఖరి క్షణాలలో లైంగిక అనైతికతతో వ్యవహరించు విషయంలో మనము చాలా తీవ్రముగా ఉండాలి. అశ్లీల మరియు లైంగిక అనైతికతకు బానిసలుగా ఉండునట్లు యహువః యొక్క ప్రజలకు వ్యతిరేకంగా సాతాను ఒక అత్యంత భీకరమైన యుద్ధాన్ని చేయుచున్నాడు. లైంగిక పాపములు చేయుచుండువారు హేయులుగా ఎంచబడుదురని ఆయన వాక్యం ద్వారా మనము హెచ్చరిక చేయబడ్డాము. (1 కొరింథీయులకు 6: 9-10; గలతీయులకు 5: 19-21). WLC వద్ద మేము, ప్రపంచవ్యాప్తంగా, యహువః ప్రజలకు వ్యతిరేకంగా సాతాను ఈ విషయంలో చేయుచున్న అతి క్రూరమైన యుద్ధమును గురించి పూర్తిగా ఎరిగియున్నాము. అయితే, ఎవరూ శక్తి లేనివారిగా లేదా ఈ యుద్ధంలో సహాయంను కోల్పోయిన వారిగా భావించనవసరం లేదు. ఈ సత్యం నిమిత్తం ఆయన నామముకు స్తోత్రము చెల్లించుడి.

యుద్ధంలో మనుష్యులు

మనము మన యుద్ధాల్లో చాలా తీవ్రముగా మరియు లైంగిక అనైతికతను అధిగమించడానికి పరలోకము మనకు అందిస్తున్న ప్రతి ఆయుధమును ఉపయోగించడానికి సిద్ధంగా ఉండాలి.

మనకు మన యుద్ధాల్లో సుదూరంగా వెళ్ళవలసిన అవసరం ఉండెను మరియు లైంగిక అనైతికతను అధిగమించుటకు పరలోకం అందజేయుచున్న ప్రతి ఆయుధంను ఉపయోగించడానికి సిద్ధంగా ఉండాలి. యహూషువః ఇలా హెచ్చరించారు: "కాగా నీ చెయ్యి యైనను నీ పాదమైనను నిన్ను అభ్యంతర పరచిన యెడల, దానిని నరికి నీయొద్దనుండి పారవేయుము; రెండు చేతులును రెండు పాదములును కలిగి నిత్యాగ్నిలో పడవేయబడుటకంటె కుంటివాడవుగానో అంగహీనుడవుగానో జీవములో ప్రవేశించుట నీకు మేలు." (మత్తయి 18: 8). మన జ్యేష్ఠ సహోదరుడు యహూషువః, పాపముతో వ్యవహరించు విషయంలో అత్యంత విప్లవాత్మకంగా ఉండమని మనకు ఆజ్ఞాపించెను, అనగా ఈ కనికరంలేని యుద్ధంలో విజయం పొందుటకు చేయవలసిన సమస్తమును చేయుటకు సిద్ధంగా ఉండాలని మనకు ఆజ్ఞాపించెను.

అంత్యకాలంలో, మేము, లైంగిక అనైతిక యొక్క ఏదో ఒక రూపానికి బానిసగా ఉన్న ప్రతి క్రైస్తవుడు వినియోగించుకొనుటకు అవసరమైన 8 ఆయుధాల జాబితాను తెలియజేయాలని కోరుచున్నాము. మేము ఈ జాబితాను ఏ ప్రత్యేకమైన వరుసలోను పెట్టుటలేదు. ఆయన కృప ద్వారా, శాశ్వత మరియు చిరకాల విజయమును నిర్ధారించుకొనుటకు వీటన్నిటినీ ఏకకాలంలో తీవ్రంగా ఉపయోగించాలి:

ఆయుధం # 1: మీరు వ్యసనపు వృత్తాంతంను పంచుకొనుట ద్వారా ప్రారంభించండి.

ఇది ఎప్పుడూ చాలా కష్టమైనది, లైంగిక వ్యసనం అవమానకరమైనది కావున, బాధితులు ఈ అవమానకర విషయంను ఇతరులతో పంచుకొనుటకు ఇష్టపడరు. అయితే, ఇతరులతో మీ వృత్తాంతంను పంచుకొనుట ద్వారా వ్యసనమును వదిలించుకొనుటలో చాలా దూరం వెళ్ళగలరు. మద్యపానంను మాన్పించుటకు తోడ్పాటును అందిస్తున్న సంస్థలు చాలా కాలంగా వ్యసనము యొక్క కథను పంచుకొనుటలో గల ప్రాముఖ్యతను ఎరిగి యున్నాయి, మరియు తమ వ్యసనం నుండి స్వేచ్ఛను కోరుకునే ప్రతి ఒక్కరూ తమ వృత్తాంతంను ఇతరులతో పంచుకోవాలని వారు ప్రోత్సహిస్తున్నారు.

ఈ సమర్థవంతమైన ఆయుధమును గూర్చిన బైబిలు సూత్రం యాకోబు 5:16 లో కనబడుతుంది: "మీ పాపములను ఒకనితో నొకడు ఒప్పుకొనుడి; మీరు స్వస్థతపొందునట్లు ఒకనికొరకు ఒకడు ప్రార్థనచేయుడి. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలము గలదై యుండును."

అనేకమంది పై వచనంను పరస్పర నేరాలను ఒప్పుకొను విషయానికి వర్తింపజేస్తూ ఉండగా, కాల్విన్ తన ఈ కింది వివరణలో ఈ వచనం యొక్క వేరొక అర్థమును వివరించెను:

"చాలా (కొంత) మంది, యాకోబు ఇక్కడ సహోదరుల మధ్య సయోధ్యను కలుగజేయు నిమిత్తం పాపమును పరస్పరము ఒప్పుకొనుటను సూచించుచున్నాడని అనుకొనుచున్నారు. కానీ ఇక్కడ చెప్పిన విధంగా, తన [యాకోబు] ఆలోచన భిన్నమైనది; పరస్పర ఒప్పుకోలు పరస్పర ప్రార్థనలకు అవకాశం కలిగిస్తుంది; తాను ఈ విధమైన ఒప్పుకోలును సూచిస్తూ, మనము మన సహోదరుల ప్రార్థనల ద్వారా [యహువః] సహాయంను పొందెదమని చెప్పుచుండెను; ఎందుకంటే వారు మన అవసరతలు తెలిసిన వారు, మనకు సహాయంను కలిగించు ప్రార్థన చేయుటకు ప్రేరణ పొందెదరు, అయితే వారికి మన బలహీనతలు తెలియవుగనుక మనకు సహాయం చేయుటకు వీలుకలిగి ఉండరు. "(https://www.studylight.org/commentary/james/5-16.html)

WLC సూచన: మీ అవమానము అధిగమించి మరియు మీ వృత్తాంతంను మీరు విశ్వసించే ఒకరు లేదా అంతకన్నా ఎక్కువ మందితో పంచుకోండి, అలా వారు మిమ్మల్ని వారి యొక్క సఫలమైన ప్రార్థనలలో చేర్చుదురు. మీరు లైంగిక వ్యసనమునకు వ్యతిరేకమైన మీ యుద్ధంలో సాధ్యమైన ప్రతి సహాయంను కలిగి ఉండాలి, మరియు ఈ ఆయుధం ఇతర విశ్వసనీయ వ్యక్తులు తమ తీక్ష్ణమైన ప్రార్థనలలో మిమ్మల్ని చేర్చేలా చేస్తుంది.

ఆయుధం # 2: మిమ్మల్ని ప్రలోభ పెట్టుటకు దారితీసే పరిస్థితులను మార్చుకొనండి.

డబ్బు కట్టవలసిన ప్రతి TV చానెల్ ను రద్దుచేయండి, వీడియో స్టోర్ కార్డులను బయటకు విసిరివేయండి, మీ కంప్యూటర్ నుండి అశ్లీలమైన వాటిని రద్దుచేయండి, ప్రశ్నార్థకర వెబ్సైట్లు లేదా పత్రికలలో చేరుటను రద్దు చేయండి, పగలు లేదా రాత్రి సమయాలలో ఒంటరిగా ఉండటం మానుకొనండి. ఇవి మీరు తీసుకొనవలసిన కొన్ని దశలు. అశ్లీల సాహిత్యంనకు బానిసైన ప్రతివారు, బలహీన పరచు మరియు ప్రలోభపెట్టే ప్రతి ప్రాంతంను వారి దినచర్యను నుండి తొలగించ వలసిన అవసరం ఉంది. మీరు మీ లైంగిక వ్యసనంనకు దోహదపడే [మరియు దాని ద్వారా సాతాను మీపై దాడి చేయు] అన్ని పరిస్థితులను కత్తిరించుటలో చురుకుగా ఉండాలి. మన మాదిరి అయిన, మన బోధకుడు యహూషువః ద్వారా చేయబడిన క్రింది ఉపదేశమును జాగ్రత్తగా చదవండి:

వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారుగదా; నేను మీతో చెప్పునదేమనగాఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసినవాడగును. నీ కుడికన్ను నిన్ను అభ్యంతర పరచినయెడల దాని పెరికి నీయొద్దనుండి పారవేయుము; నీ దేహమంతయు నరకములో పడవేయబడకుండ నీ అవయవములలో నొకటి నశించుట నీకు ప్రయోజనకరము గదా. నీ కుడిచెయ్యి నిన్నభ్యంతర పరచిన యెడల దాని నరికి నీయొద్ద నుండి పారవేయుము; నీ దేహమంతయు నరకములో పడకుండ నీ అవయవములలో ఒకటి నశించుట నీకు ప్రయోజనకరము గదా. (మత్తయి 5: 27-30)

మిమ్ము చుట్టుకొనియున్న లైంగిక వ్యసనమనే పాపంతో వ్యవహరించుటలో కనికరంలేకుండా ఉండండి. మీరు మీ జీవము కొరకు పోరాడుచున్నారు మరియు మీ శాశ్వతమైన గమ్యం ప్రమాదంలో ఉంది. త్వజించు వారికి ఒక నరకం మరియు గెలుచు వారికి ఒక పరలోకం ఉంది.

నాయందు విశ్వాసముంచు ఈ చిన్న వారిలో ఒకనిని అభ్యంతరపరచువాడెవడో, వాడు మెడకు పెద్ద తిరుగటిరాయి కట్టబడినవాడై మిక్కిలి లోతైన సముద్ర ములో ముంచి వేయబడుట వానికి మేలు. అభ్యంతర ములవలన లోకమునకు శ్రమ; అభ్యంతరములు రాక తప్పవు గాని, యెవనివలన అభ్యంతరము వచ్చునో ఆ మనుష్యునికి శ్రమ. కాగా నీ చెయ్యియైనను నీ పాద మైనను నిన్ను అభ్యంతర పరచిన యెడల, దానిని నరికి నీయొద్దనుండి పారవేయుము; రెండు చేతులును రెండు పాదములును కలిగి నిత్యాగ్నిలో పడవేయబడుట కంటె కుంటివాడవుగనో అంగహీనుడవుగనో జీవములో ప్రవేశించుట నీకు మేలు. నీ కన్ను నిన్ను అభ్యంతర పరచినయెడల దాని పెరికి నీయొద్దనుండి పారవేయుము; రెండు కన్నులు గలిగి అగ్నిగల నరకములో పడవేయబడుటకంటె ఒక కన్ను గలిగి జీవములో ప్రవేశించుట నీకు మేలు.  (మత్తయి 18: 6-9)

WLC సూచన: మిమ్ము చుట్టుకొనియున్న లైంగిక వ్యసనమనే పాపంతో వ్యవహరించుటలో కనికరంలేకుండా ఉండండి. మీరు మీ జీవము కొరకు పోరాడుచున్నారు మరియు మీ శాశ్వతమైన గమ్యం ప్రమాదంలో ఉంది. [పోరాటంను] త్వజించు వారికి ఒక నరకం మరియు గెలుచు వారికి ఒక పరలోకం ఉంది. సాతాను మరియు తన పడిపోయిన దుష్ట దూతలకు వ్యతిరేకమైన యుద్ధాలన్నింటికీ మాతృ యుద్ధంలో మీరు ఓడిపోయే స్థితిలో ఉన్నప్పుడు [యహూషువః ఇప్పటికీ అతి పరిశుద్ధ స్థలములో పరిచర్య చేయుచు ఉండగా] మీరు ప్రతి ఆయుధంను ఉపయోగించరా? మీ దినచర్యను తిరిగి-నిర్మించుకొనుము మరియు మీరు ఆకర్షతులయ్యే పరిసరాలనుండి దూరంగా ఉండండి, మరియు ఎట్టి పరిస్థితిలోనూ ఒంటరిగా ఉండటాన్ని విడిచిపెట్టుము.

ఆయుధం # 3: మీ కంటి ద్వారమును/ చూపులను శ్రద్ధగా కాచుకొనండి.

మీ నేత్రములను ఎలా కాచుకోవాలనే దానిని  న్యాయవంతుడైన యోబు నుండి నేర్చుకోండి.

నేను నా కన్నులతో నిబంధన చేసికొంటిని కన్యకను నేనేలాగు చూచుదును?  యోబు 31: 1

యహువః యొక్క ప్రతి అనుచరుడు వారి కంటితో ఒక నిబంధన చేయవలసి యుండెను, కామంనకు సంబంధించిన దేని/ ఎవరి వెంటనూ ఎప్పటికీ తిరుగబోనని యహువః ముందు వారు ప్రతిజ్ఞ చేయవలసిన అవసరం ఉంది. కంటికి సరియైన క్రమశిక్షణ వచ్చు వరకు, రోజులో ప్రతి గంటకు ఆ నిబంధనను నూతన పరచుకోవలెను. కన్ను అనేది ఈ విషయంలో అత్యంత తిరుగుబాటు చేసేదిగా మరియు వ్యతిరేక లింగము వైపు తిరుగుటకు [లైంగిక వాంఛతో] ఎప్పుడూ సిద్ధంగా ఉంటూ ఉండుట వలన, కంటిని సరియైన శిక్షణలో పెట్టుట అనేది ఒక నిజమైన యుద్ధమై యుంది. న్యాయవంతుడైన యోబుకు, తన కళ్ళతో ఒక నిబంధన చేసుకొనుట అవసరమైతే, నేడు యహువః యొక్క ప్రతి అనుచరుడు అదే నిబంధనను చేయవలసిన అవసరం లేదా?

WLC సూచన: ఎవరినీ లైగిక వాంఛతో చూడకుండునట్లు మీ కంటిని క్రమశిక్షణలో పెట్టే ప్రయత్నాలలో కనికరం చూపవద్దు. ఈ శిక్షణకు పట్టే సమయం ఎంత దూరం వెళ్ళినా, కంటి క్రమశిక్షణ ద్వారా, ఆధునిక యోబుగా మారుట అనే మీ లక్ష్యాన్ని సాధించేవరకు పూర్తి సంకల్పంతో దైవ సహాయంను పట్టు విడువకుండా వెదకుము.

ఆయుధం # 4: పాపము చేయుటకు సాతాను యొక్క ఆహ్వానంను [ప్రలోభమును] "వద్దు!" అని గట్టిగా అరుస్తూ తిరస్కరించు.

సాతాను మిమ్మల్ని పాపం చేయుటకు ఆకర్షించినపుడు, బిగ్గరగా "వద్దు" అని తన ముఖం పైనే అరుస్తూ అటువంటి ఆహ్వానంను తిరస్కరించవలెను. మీరు "వద్దు" అని అరవటం విన్నప్పుడు మీ చుట్టూ ఉన్న ఇతరులు ఏమి అనుకొనెదరో అని చింతించకండి." మీరు మీ వంతుగా యాదృచ్ఛికంగా చేసిన శబ్ద వ్యక్తీకరణ పరలోకంను ప్రసన్నం చేసుకొనును, మరియు ఒక దూత తక్షణమే మీకు సహాయం చేయుటకు పంపబడును. మనము ప్రలోభ పరచబడే ప్రతిసారీ "వద్దు" అని అరవవలసిన మన విధిని గురించి ఇక్కడ పౌలు గారు మనకు ఏమి గుర్తుచేస్తున్నారంటే:

ఏలయనగా సమస్త మనుష్యులకు రక్షణకరమైన ఎలోహ కృప ప్రత్యక్షమై, మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి, శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము, ఈ లోకములో స్వస్థబుద్ధితోను నీతితోను, భక్తితోను బ్రదుకుచుండవలెనని మనకు బోధించుచున్నది. (తీతుకు 2 : 11-13 చూడండి)

WLC సూచన: సాతాను ద్వారా ప్రలోభ పరచబడునప్పుడు మీకు సహాయం చేయు నిమిత్తం పరలోకం నుండి ఒక దేవదూత పంపబడుటను మీరు ఎందుకు కోరుకొనుట లేదు? సాతాను ప్రలోభ పరిచే సమయంలో మీరు బిగ్గరగా "వద్దు" అని అరిచినప్పుడు, మీరు ఈ విలువైన వాగ్దానం నెరవేర్పును తక్షణమే కనుగొందురు: "యహువః యందు భయభక్తులు గలవారి చుట్టు ఆయనదూత కావలియుండి వారిని రక్షించును " ( 34: 7)

ఆయుధం # 5: ఇతరులకు లెక్క అప్పజెప్పు వారిగా మీకు మీరే మారండి.

లైంగిక అనైతికతకు వ్యతిరేకమైన ఈ జీవన్మరణ యుద్ధంలో ఇది అత్యంత శక్తివంతమైన ఆయుధం మరియు ఇది ఆయుధం # 1తో అనుసంధానించబడి ఉంది. ఇక్కడ మీ యుద్ధంలో మీకు భాగస్వాములుగా ఉండుటకు మరియు మీరు లెక్క అప్పగించుటకు ఎవరైతే యోగ్యులో వారిని [మరొక వ్యక్తిని లేదా కొంత మంది మనుష్యులను] కనుగొనుట ముఖ్యం. ఈ విశ్వసనీయ మనుష్యులతో లెక్క అప్పజెప్పుట అనగా మొదటి వారికి మీ బలహీనతలను తెలియజేసి, మీ ప్రత్యేక అవసరాల నిమిత్తం ప్రార్థన చేయమని వారిని అడగండి అని అర్థం. దీనర్థం మీరు విఫలమైనప్పుడు వారికి సమాధానం చెప్పుకొనవలసి ఉన్నది, మరియు మీరు విఫలమైన ప్రతిసారీ మీ వైఫల్యానికి కారణంను వారికి వివరించవలెనని. మీరు వారికి చేసిన వాగ్దానంను నిలుపుకోలేనప్పుడు, లేదా వారి మండలి యందు నిలువలేనప్పుడు మీరు వారి యొద్ద ఒప్పుకోవలసి ఉంటుంది.  బైబిలులో మనము ఈ శక్తివంతమైన ఆయుధం యొక్క వాగ్దానమును ప్రసంగి 4: 9-12 లో కనుగొందుము:

ఇద్దరి కష్టముచేత ఉభయులకు మంచిఫలము కలుగును గనుక ఒంటిగాడై యుండుట కంటె ఇద్దరు కూడి యుండుట మేలు. వారు పడిపోయినను ఒకడు తనతోడి వానిని లేవనెత్తును; అయితే ఒంటరిగాడు పడిపోయిన యెడల వానికి శ్రమయే కలుగును, వాని లేవనెత్తువాడు లేక పోవును. ఇద్దరు కలిసి పండుకొనిన యెడల వారికి వెట్ట కలుగును; ఒంటరిగానికి వెట్ట ఏలాగు పుట్టును? ఒంటరి యగు నొకనిమీద మరియొకడు పడినయెడల ఇద్దరు కూడి వాని నెదిరింప గలరు, మూడు పేటల త్రాడు త్వరగా తెగిపోదు గదా.

మళ్ళీ, ఇదే విషయము యాకోబు 5: 14-15 లో పునరావృతమవుతుంది:

లైంగిక అనైతికత అనేది ఒక భయంకర భౌతిక రోగము కంటే అనంత తీవ్రమైన మరియు ప్రాణాంతకమైన వ్యాధి. వ్యాధి శరీరం పాడగుటకు మరియు చివరికి శరీరం యొక్క మరణానికి దారితీయవచ్చు. కానీ లైంగిక అనైతికత నయము కాకుండా ఉన్నట్లయితే, అది శరీరము మరియు ఆత్మ యొక్క వినాశనానికి దారి తీస్తుంది.

మీలో ఎవడైనను రోగియైయున్నాడా? అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలెను; వారు ప్రభువు నామమున అతనికి నూనె రాచి అతని కొరకు ప్రార్థన చేయవలెను. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును, ప్రభువు అతని లేపును; అతడు పాపములు చేసినవాడైతే పాపక్షమాపణనొందును.

జారత్వము అనేది ఒక భయంకర భౌతిక రోగము కంటే అనంతమైన మరింత తీవ్రమైన మరియు ప్రాణాంతకమైన వ్యాధి. వ్యాధి శరీరం యొక్క వినాశనానికి మరియు చివరికి శరీరం యొక్క మరణానికి దారితీయవచ్చు. కానీ లైంగిక అనైతిక నయము కాకుండా ఉన్నట్లయితే, అది శరీరము మరియు ఆత్మ యొక్క వినాశనానికి దారి తీస్తుంది. అందువలన, మనము తీవ్రంగా జబ్బుపడి మరియు స్వస్థత పొందవలసిన ఆవసరత కలిగి ఉన్నప్పుడు, మనము సంఘ పెద్దల ద్వారా ప్రార్థన సహాయంను పొందవలెనని యాకోబు మనకు సలహా ఇచ్చారు. అలాంటప్పుడు, ఒక లైంగిక బానిసగా లైంగిక పాపాలతో పోరాడుతూ ఉన్నప్పుడు యహువః యొక్క ఇతర విశ్వసనీయ అనుచరుల ప్రార్థన సహాయంను కోరుట ఇంకా ఎంత ఎక్కువ అవసరమై ఉంటుంది?

లైంగిక అనైతిక వ్యతిరేకమైన యుద్ధంలో, నమ్మదగిన స్నేహితుల ద్వారా తండ్రికి లెక్క అప్పజెప్పుకొనుట, ఈ క్రింది ప్రయోజనాలను సాధించుకొనుటకు తోడ్పడుతుంది:

WLC సూచన: మీరు మీ పోరాట విషయాలను పంచుకొనుటకు మరియు వారి ద్వారా తండ్రియైన యహువఃకు లెక్క అప్పగించుకొనుటకు అవసరమైన అధిక విశ్వసనీయమైన ఒకరు లేదా అంతకంటే ఎక్కువ  స్నేహితులను కనుగొనడంలో ఆలస్యం చేయవద్దు. ఒక లైంగిక బానిస ఇతరుల యొద్ద తన లోపమును చెప్పుకొనుటకు అయిష్టంగా ఉండుననేది నిజము. కానీ ఈ జీవన్మరణ యుద్ధంలో, ఒక లైంగిక బానిస అందుబాటులో ఉన్న సమస్త ఆయుధాలను ఉపయోగించుటకు సంకోచించరాదు. త్వరగానో లేక ఆలస్యంగానో, దాచబనడిన ప్రతి రహస్యం వెలుగుపరచబడును (లూకా 8: 17 చూడండి). నరకమునకు పోవు సమయంలో అది బహిర్గతమయ్యేవరకు దానిని దాచుకొనుట కంటే, ఈ శక్తివంతమైన ఆయుధంను ఉపయోగించి అవసరమైన సహాయంను పొందట తెలివైన పని కాదా? మన లైంగిక అనైతికను దాస్తూ మరియు అపాయంలో ఉన్న మన ఆత్మలకు సహాయంను తిరస్కరించుట మూర్ఖత్వమే అవుతుంది.

ఆయుధం # 6: ఆలోచనను వెదుకుము. ఆలోచనను వెదుకుము. ఆలోచనను వెదుకుము.

బైబిలు ఇతరుల నుండి ఆలోచనను కోరుట యొక్క ప్రాముఖ్యతను గురించిన సూచనలతో నిండి ఉంది. ఈ విషయముకు మద్దతునిచ్చు బైబిలు వచనాలు ఇక్కడ ఉన్నాయి:

కాంతిలో ఉంచిన ఖడ్గము మార్గదర్శకులు [నాయకులు] లేని జనులు చెడిపోవుదురు ఆలోచనకర్తలు అనేకులుండుట రక్షణకరము.  (సామెతలు 11:14)

 

 

ఆలోచన చెప్పువారు లేని చోట ఉద్దేశములు వ్యర్థ మగును ఆలోచన చెప్పువారు బహుమంది యున్నయెడల ఉద్దేశములు దృఢపడును. (సామెతలు 15:22)

 

 

ఉద్దేశములు ఆలోచనచేత స్థిరపరచబడును వివేకముగల నాయకుడవై యుద్ధము చేయుము.  (సామెతలు 20:18)

 

 

వివేకముగల నాయకుడవై యుద్ధముచేయుము. ఆలోచన చెప్పువారు అనేకులుండుట రక్షణకరము (సామెతలు 24: 6)

ఒక లైంగిక బానిస క్రైస్తవ నాయకుల, లేదా అనుభవజ్ఞులైన క్రైస్తవుల ఆలోచనను వినుటకు ప్రయత్నించుట అనేది బలమునకు చిహ్నం తప్ప బలహీనత యొక్క చిహ్నం కాదు.

WLC సూచన: మనము ఒక తీవ్రమైన శరీర అనారోగ్యంను ఎదుర్కొన్నపుడు, మనము సహాయము మరియు ఆలోచన నిమిత్తం వైద్యులను సంప్రదిస్తాము. చేయబడిన వ్యాధి నిర్ధారణ సరైనదా కాదా అని నిర్ధారించేందుకు తరచుగా ఒక్కరి కంటే ఎక్కువ స్పెషలిస్టుల వద్ద తనిఖీ చేయించుకుంటాము. లైంగిక అనైతికత అనే ప్రాణాంతకమైన వ్యాధితో బాధపడుతున్న ఒక యహువః యొక్క అనుచరుడు, యహువః నందు భక్తిగల జనుల నుండి ఇంకా ఎక్కువ ఆలోచనను కోరు విషయంలో తక్కువ శ్రద్ధ చూపుట ఎంతవరకు మంచిది? అటువంటి సహాయంను కోరుకొనక పోవుట చాలా మూర్ఖత్వం అవుతుంది; పైపెచ్చు, ఆలోచనను నిర్లక్ష్యం చేయుట అనేది పై వచనములలో తెలిపిన విధంగా, తండ్రి యహువః యొక్క గద్దింపునకు విరుద్ధంగా నడుచుట అవుతుంది. మళ్లీ, మేము లైంగిక బానిసలను అర్థిస్తున్నాము, సహాయంను వెదుకుము మరియు త్వరగా వెదుకుము.

ఆయుధం # 7: ప్రలోభ పెట్టబడుచున్నప్పుడు యహూషువః నామములోని శక్తిని వినియోగించుకోండి.

మన బోధకుడు, యహూషువః నామంలో అనంతమైన శక్తి ఉంది. సాతాను ద్వారా శోదించబడినప్పుడు, బిగ్గరగా యహూషువః పేరును ఉచ్ఛరించుము.

ఆయన నామములో మనము దేనిని అడిగినా అది మనకు అందజేయబడునని యహూషువః నామం నందు తప్ప మరి ఏ ఇతర నామం నందును మనము వాగ్దానం చేయబడలేదు.

నేను తండ్రియొద్దకు వెళ్లుచున్నాను గనుక నేను చేయు క్రియలు నాయందు విశ్వాసముంచు వాడును చేయును, వాటికంటె మరి గొప్పవియు అతడు చేయునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మీరు నా నామమున దేని నడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచబడుటకై దానిని చేతును. నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును. (యోహాను 14: 12-14)

ఒక లైంగిక బానిస శోధించబడినప్పుడు, అతడు యహూషువః నామములో అధికారం ఉంది అని నమ్మి, యహూషువః, నాకు సహాయం చేయుము" అనే ఈ పదాలను పలికితే, ఆ శోధన యొక్క శక్తి తక్షణమే అదృశ్యమవుతుంది. అవును, ఆయన పేరును ఉచ్చారణ చేయుటలో వర్ణించలేని శక్తి ఉంది, అది చీకటిని తొలగించి సాతానును మరియు తన దుష్ట ఆత్మలను దూరంగా పారద్రోలును.

రోగులను స్వస్థపరచుటకును, నీ పరిశుద్ధ సేవకుడైన యహూషువః నామము ద్వారా సూచక క్రియలను మహత్కార్యములను చేయుటకును నీ చెయ్యి చాచి . . .  (అపొస్తలుల కార్యములు 4:30)

WLC సూచన: శోధించబడు సమయంలో ఆ శోధనను ఎదుర్కొనుటకును మరియు ఈ వాగ్దానంను ("నన్ను బలపరచు యహూషువః నందే నేను సమస్తమును చేయగలను పిలిప్పీయులకు 4:13") పొందుకొనుటకు యహూషువః, నాకు సహాయం చేయుము అనే మాటను బిగ్గరగా అరుచుటకు మీరు ఒక్క సెకండు కూడా ఆలస్యం చేయవద్దు. మీరు ఆయన పేరుపై నమ్మికయుంచి దానిని పిలిచినప్పుడు, అధిగమించుటకు సాధ్యం కాని ఏ శోధన లేదు. శోధించబడు ప్రతిసారీ ఆయన నామములో బిగ్గరగా పిలుచుటకు మీకు మీరే శిక్షణ పొందండి, మరియు అవసరమైన సహాయం మీవద్ద తక్షణమే ఉంటుంది.

వెపన్ # 8: మీరు శోధింపబడు ప్రతిసారీ ఉపయోగించుటకు లేఖనముల జాబితాను గుర్తుంచుకొనుడి.

అత్యంత శక్తివంతమైన ఈ ఆయుధంనకు సంబంధించిన దావీదు యొక్క ఆలోచన ఈ క్రింద ఉన్నది:

యౌవనస్థులు దేనిచేత తమ నడత శుద్ధిపరచు కొందురు? నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే గదా? నా పూర్ణహృదయముతో నిన్ను వెదకియున్నాను నన్ను నీ ఆజ్ఞలను విడిచి తిరుగనియ్యకుము. నీ యెదుట నేను పాపము చేయకుండునట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని యున్నాను.  (కీర్తనలు 119: 9-11)

ఆలస్యం చేయుటకు సమయం లేదు. కృప ముగియుటకు సిద్ధంగా ఉంది, మరియు మీరు అన్ని రకాల లైంగిక అనైతికతలను అధిగమించడానికి సమస్త సహాయాలను కూడగట్టుకోవలెను. సహాయం చేయుటకు పరలోకం మరింత ఎక్కువ సిద్ధంగా ఉన్నది, అయితే మీరు యుద్ధంలో ఉపయోగించుటకు మీ సంసిద్ధతను మరియు సుముఖత చూపాలి. దైవిక సహాయము, ఆ సహాయాన్ని పొందాలనుకొనే వారి యొద్దకు వచ్చును.

WLC సూచన: మీరు ధ్యానించుటకును మరియు మీరు ప్రతి రోజూ, ముఖ్యంగా శోధన సమయాలలో పునరావృతం చేసుకొనుటకును మీ అభిమాన బైబిలు వచనాల సొంత జాబితాను తయారు చేసుకొనుట ఇప్పుడే ప్రారంభించండి. యహూషువః పేరును ఉచ్చరించుట ద్వారా శక్తిని పొందుకున్నట్లుగానే, లేఖనాలను ఉచ్చరించినప్పుడు కూడా శక్తిని పొందుకుంటాము. అన్నిటి తరువాత, యహూషువః సాతాను శోధనలను తనకు తానే ఎదుర్కొన్న విధానం ఇది కాదా?

మొత్తం సారాంశం:

లైంగిక వ్యసనం యొక్క ఏ రూపంతోనైనా పోరాటం చేయువారు ఎవరైననూ తక్షణమే ఈ 8 సూత్రాలు అవలంభించుటను ప్రారంభించమని మేము యహువః యొక్క ప్రజలందరినీ ప్రేరేపిస్తున్నాము. ఈ ఆయుధాలన్నిటినీ కలిపి ఉపయోగించినప్పుడు, అది నేడు ఆయన అనుచరులనేకులను వ్యాధిగ్రస్తులను చేయుచున్న సమస్త లైంగిక అనైతికలకు పైగా శాశ్వత విజయంనకు దారి తీస్తుంది. ఈ ఆయుధాల జాబితానుండి కొన్నిటిని మాత్రమే ఎంచుకొని పట్టుకొనకుడి. మీరు మీ జీవం కొరకు మరియు బాధించబడుచున్న మీ కుటుంబం యొక్క జీవం కొరకు పోరాటం చేయుచున్నప్పుడు, జాబితాలో ఇవ్వబడిన 8 ఆయుధాలలోని ప్రతి ఆయుధము మీ శోధనలను బలహీన పరచుటలోను మరియు శాశ్వత విజయం సాధించుటలోను ఒక పాత్ర పోషించునని గుర్తుంచుకోవలెను. ఆలస్యం చేయుటకు సమయం లేదు. కృప ముగియుటకు సిద్ధంగా ఉంది, మరియు మీరు అన్ని రకాల లైంగిక అనైతికతలను అధిగమించడానికి సమస్త సహాయాలను కూడగట్టుకోవలెను. సహాయం చేయుటకు పరలోకం మరి ఎక్కువ సిద్ధంగా ఉన్నది, అయితే మీరు యుద్ధంలో ఉపయోగించుటకు మీ సంసిద్ధతను మరియు సుముఖతను చూపాలి. దైవీక సహాయం పొందాలనుకొనే వారి యొద్దకు అది వచ్చును.

WLC వద్ద, మేము ఈ యుద్ధాలలో పాల్గొనుచున్న ప్రతి పురుషుడు మరియు స్త్రీ గురించి ప్రార్థనలు చేయుచున్నాము, మరియు అదేవిధంగా ప్రభావితమైన భార్యలకు, భర్తలకు, సోదరులు, సోదరీమణులు, తల్లిదండ్రులు, మరియు ఇతర కుటుంబ సభ్యులకు (వారు అవసరమైన మద్దతు మరియు అవగాహనను అందించుటకు) దైవీక జ్ఞానం ప్రదానం చేయబడునట్లు కూడా ప్రార్థన చేయుచున్నాము.

మేము యహూషువః వలె మార్చుటకు ప్రయత్నిస్తున్నప్పుడు తండ్రి అయిన యహువః తన పవిత్ర సముఖమును మాపై ప్రకాశింపజేయును గాక. ఆమీన్.