Print

వివాహం పరలోకంలో జరుగును

యహువః తన ప్రేమా గుణమును ఒక ప్రత్యేక విధానంలో బహిర్గతం చేయుటకు మానవుని సృష్టించెను. లేఖనం చెబుతుంది: “ఎలోహీం తన స్వరూపమందు నరుని సృజించెను; ఎలోహీం స్వరూపమందు వాని సృజించెను; స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను . . . కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును; వారు ఏక శరీరమైయుందురు. (ఆదికాండము 1:27 & 2:24.)

యహువః యెడల తమ భక్తిలో ఐక్యమై ఉన్న ఒక జంట ప్రపంచంలో మంచి కోసం అద్భుతమైన ప్రభావాన్ని చూపుతుంది. అటువంటి ఐక్యత గల ఒక ఇల్లు పరమ కానాను కోసం సిద్ధమై, భూమిపై ఒక చిన్న స్వర్గంగా ఉంటుంది. విజయవంతమైన వివాహం మరియు ప్రతి సంబంధాల విషయంలో యహువః యొక్క ప్రణాళికను నెరవేర్చుటకు, సరైన జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకొనుట ప్రాముఖ్యమై ఉంది.

సరైన వ్యక్తిని వివాహం చేసుకొనుటలో గల ప్రాముఖ్యతను సాతాను ఎరిగియున్నాడు మరియు వివాహం కాకుండా పరస్పరం కలిసియుండు విధానం ద్వారా తండ్రి యొక్క జ్ఞాన ప్రణాళికకు భంగం కలిగించుటకు ప్రయత్నిస్తున్నాడు. చాలామంది యవ్వనస్తులకు జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకొనటలో సరైన అవగాహన లేదు. పుస్తకాలు, ప్రముఖ సంగీతం మరియు సినిమాలు అన్నియు ప్రేమ మరియు వివాహం యొక్క తప్పుడు ఆలోచనలను ప్రచారం చేయుచున్నవి. జీవితంలో నిజమైన ఆనందం మరియు భావోద్వేగాల నెరవేర్పు కోసం "ప్రేమలో" ఉండుట అవసరమన్నట్లు ప్రచారం చేయబడెను.

అయితే, లోకం ద్వారా చూపబడు "ప్రేమ" గందరగోళంగా మరియు విరుద్ధంగా ఉంటుంది. "ప్రేమ" యొక్క ప్రాపంచిక విధానంలో విఘాతానికి గురైనప్పుడు యువకులు తరచుగా ఇలా అడుగుదురు: “నేను నిజంగా ప్రేమలో ఉన్నట్లయితే నాకు ఎలా తెలుస్తుంది?” దీని ప్రామాణిక ప్రతిస్పందన నిస్సహాయంగా ఉంటుంది, నీవు అలా అడిగితే, నీవు ప్రేమలో లేవు!

నాశనకరమైన ఐక్యతలోనికి ప్రజలను నడిపించటానికి సాతాను చాలా కష్టపడుచున్నాడు. ఒక భాగస్వామిని ఎన్నుకొనుటను గూర్చి ప్రజలకు విరుద్ధమైన అవగాహన కల్పించుట ద్వారా అతడు ఎక్కువ విజయం సాధిస్తున్నాడు. డేటింగ్ విధానం ద్వారా భాగస్వామిని ఎంచుకొనుటలో ప్రపంచ విజయం రేటు విచారకరమైన విడాకుల గణాంకాలలో కనిపిస్తుంది. ఒక్క అమెరికా సంయుక్త రాష్ట్రాలలోనే 50% వివాహాలు విడాకులతో ముగుస్తాయి. మిగిలిన 50% వివాహాలలో, చాలా వివాహాలు సంతోషంగా లేవు.

వివాహం చేసుకొనుటలోని ప్రాపంచిక ప్రమాణం మరొక వ్యక్తితో "ప్రేమలో పడుట". ఏ ఇతర అవసరతా లేదు. ఒకరు ఇతర వ్యక్తిని ప్రేమించినట్లయితే, మరియు ఆ ఇతర వ్యక్తి వారిని ప్రేమిస్తున్నట్లయితే మంచి వివాహానికి అవసరమైనది అదేనని అనేకమంది భావిస్తున్నారు. జీవితం యొక్క వాస్తవాలు మరియు వ్యక్తుల జీవితాలలో మరియు జీవిత లక్ష్యాలలో అననుకూల వాస్తవికతలన్నియు “ప్రేమ అన్నిటినీ జయించును!” మరియు “ప్రేమ మార్గము చూపును!” అనే వివరణతో మరుగు చేయబడ్డాయి. ఒక భాగస్వామిని ఎన్నుకొనుటలో ఈ పద్ధతి విఫలమవుతుంది ఎందుకంటే ఇది 1) మహిళల యొక్క భావోద్వేగాలు; మరియు, 2) పురుషుల కామ విహారంపై ఆధారపడి ఉంటుంది.

ఒక పురుషుడు ఇతర స్త్రీలందరికంటే ఆమెను ఎక్కువగా ఇష్టపడుతున్నట్లు ఒక స్త్రీని ఒప్పించగలిగితే, ఆమె అతడిని వివాహం చేసుకుంటుంది మరియు తన నుండి అతడు కోరుదానిని అతడికి ఇస్తుంది: కామం. కాబట్టి, సాతాను యొక్క మోసంలో, పురుషుడు గాని స్త్రీ గాని యహువః ద్వారా ఇవ్వబడిన కారణాన్ని విస్మరించుచున్నారు. దీనిని గ్రహించకుండా, వారి తక్కువ మెదడును ఉపయోగిస్తూ, జీవితాలను నాశనంచేయు నిర్ణయాలను తీసుకొంటున్నారు.

ఇది జీవిత భాగస్వామిని ఎంచుకొనుటలోని యహువః పద్ధతి కాదు. ప్రాపంచిక నమూనా ప్రకారం ఏర్పడిన వివాహ బంధం చివరికి విజయవంతం కావాలంటే, ఆ జంట ఒక దృఢమైన పునాదిని ఏర్పరచుకొనుటకు ముందుకు వెళ్లాలి, దీనిలో వ్యక్తిగతంగా యహువఃను సేవించుట మరియు ఒకరికొకరు నిస్వార్థంగా సేవచేసుకొను పరస్పర లక్ష్యాన్ని కలిగి ఉండుట ఉంటుంది. నేటి ఆధునిక డేటింగ్ విధానం, అసలైన దైవిక సంబంధానికి సాతాను యొక్క నకిలీగా ఉన్నది. తమ జీవితాలు మరియు వివాహాలలో యహువఃను గౌరవించాలని కోరువారు, లోకసంబధమైన డేటింగ్ యొక్క తప్పుడు ప్రమాణాలను ప్రక్కన పెట్టి, యహువఃను గౌరవించు విధానంలో ఒక భాగస్వామిని ఎన్నుకుంటారు.

పరలోకం యొక్క ఆశీర్వాదాన్ని కలిగియుండునట్లు భాగస్వామిని కనుగొను విధానంలో ఒక వ్యక్తి తీసుకోవలసిన అనేక దశలు ఉన్నాయి:

  1. మీ బుర్రను, మీ ఉత్తమ విశ్లేషణను ఉపయోగించండి.
  2. దైవికమైన వంశం కోసం చూడండి.
  3. డేటింగు వద్దు.
  4. ఇంటర్వ్యూ చేయండి!
  5. దైవిక నిర్ణయాన్ని వెతకండి.

మీ బుర్రను ఉపయోగించండి

ఇది చాలా సరళంగా కనిపిస్తుంది, కానీ కాదు. జీవిత భాగస్వామిని హేతుబద్ధంగా, తార్కికంగా మరియు పరలోకం యొక్క ప్రమాణాల ద్వారా ఎంపిక చేసుకొనుట చాలా ప్రాముఖ్యమైనది. ఈ సమయంలో, ఇతర వ్యక్తికి లైంగికంగా ఆకర్షించబడుట మంచిదికాదు. ఇతర వ్యక్తి ఒక అనుకూల భాగస్వామిగా ఉండగలుగునా అని విశ్లేషించి, నిర్ణయించవలసిన సమయం ఇదే.

దీనికి విరుద్ధంగా, ఒక స్త్రీ ప్రపంచం తనను లైంగికంగా కోరుకునే విధంగా తనకు తాను శారీరకంగా ఆకర్షణీయంగా చేసుకొంటుంది. లైంగిక ఆకర్షణ లేనట్లయితే, శాశ్వత సంబంధం ఉండదని నేడు నమ్మబడుతుంది. ఇది సమస్త ఆదిమ జాతులు కలిగియున్న బలహీనమైన జంతువుల కోరికల కంటే ఎక్కువ గణనీయంగా ప్రభావితం చేయు “మనస్సు యొక్క ఉన్నత శక్తుల నుండి ఉద్భవించు ప్రక్రియను” తొలగిస్తుంది. ఇది శాశ్వత మరియు సంతృప్తికరమైన వివాహానికి ఆధారము కాదు.

దైవికమైన వంశం కోసం చూడండి.

ఒక మేలుజాతి గుఱ్ఱాన్ని తక్కువ జాతిదానితో సంగమం జరిగించిన యెడల పుట్టే గుఱ్ఱపుపిల్ల మేలుజాతిదై ఉండదని గుఱ్ఱపు పెంపకందారులకు తెలుసు. ఇంకా, మానవులు వారి జీవిత భాగస్వాములను ఎన్నుకొనుటలో చాలా తక్కువ శ్రద్ధగలిగి ఉంటారు! శారీరక మరియు ఆధ్యాత్మిక ధోరణులు వంశ పారంపర్యంగా జారీ చేయబడతాయనేది శాస్త్రీయ వాస్తవం. కఠినమైన మద్యపానం, కఠినమైన జీవన విధానం గల వంశంనుండి వచ్చిన ఒక వ్యక్తి కోరికలను మరియు వారసత్వ ధోరణులను కలిగి ఉంటాడు. మితమైన జీవనవిధానం గల వారసత్వం నుండి వచ్చినవారు దీనిని కలిగి ఉండరు. అలాగే, తల్లిదండ్రులు, తాతలు మరియు ముత్తాతలు ఒక సత్యాన్ని అది జీవితమును ఎక్కడికి నడిపించినప్పటికీ దానిని అనుసరించుటను జీవన సిద్ధాంతంగా కలిగియున్నచో, వారినుండి వచ్చు ఒక వ్యక్తి ఉన్నతమైన ఆధ్యాత్మిక వారసత్వాన్ని కలిగియుంటాడు, అది సమస్త జీవిన పోరాటాలలో వారికి శక్తిని ఇస్తుంది.

మీ జీవిత భాగస్వామిగా ఎవరిని ఎంపిక చేసుకోవచ్చోనని ఆలోచిస్తున్నప్పుడు, దైవిక వంశం నుండి ఒక వ్యక్తి కోసం చూడండి. బాల్యంలో మొదట్లో ఏర్పడిన ప్రవర్తన యొక్క అలవాట్లు యవ్వన వ్యక్తిలో దాగి ఉంటాయి కానీ మధ్య వయస్సులో బయటికి వస్తాయి. ఒకరు యహువఃను వెంబడించుటను కోరు సమయంలో మరొకరు చిన్ననాటి అలవాట్లను పునరావృతం చేస్తూ మరియు వారసత్వంగా పొందిన బలహీనతలకు అనుగుణంగా ఉండుటను కోరినట్లయితే అది చాలా అసంతృప్తికి మరియు దుఃఖానికి దారి తీస్తుంది.

డేటింగుకు బదలు నిశ్చయము చేసుకోండి

డేటింగ్ అనేది, కావలసిన దానిని కనుగొనే ఆశతో, ఒక సంబంధం నుండి మరొక దానికి మరియు తరువాత మరొక దానికి మారుటగా నిర్వచించబడుతుంది, ఇది పరలోకం ద్వారా-దీవించబడిన వివాహ నిశ్చయ విధానానికి నకిలీదిగా ఉంది. ఈ పద్ధతిలో వివాహాన్వేషణ విధానంలో వలె అనుకూల సహచరునిని పొందలేరు. ఒక నిజమైన వివాహాన్వేషణలో, ఒక వ్యక్తి తన పరిచయస్తులైన యువతులపై దృష్టిసారిస్తాడు. అప్పుడు వారిలో ఎవరు అత్యంత ఆధ్యాత్మికమో, యహువఃను అత్యంతగా సేవిస్తున్నారోనని విశ్లేషించుకొనును. ఆమె మత నమ్మకాలు అతడి నమ్మకాలకు అనుకూలంగా ఉన్నాయో లేదోనని అతడు నిర్ణయించుకొనును. ఇది చాలా ప్రాముఖ్యమైనది ఎందుకంటే వారికి పుట్టబోయే పిల్లలకు ఇచ్చే శిక్షణ విధులలో ఎక్కువ భాగం భార్య చేతులమీదుగానే జరుగుతుంది.

మీ పరిచయస్తులైన స్త్రీలను జాగ్రత్తగా పరిశీలించండి. త్వరగా ఎంచుకోకండి మరియు మీ మనస్సులో హఠాత్తుగా నిర్ణయం తీసుకోకండి, ఎందుకంటే, మీ స్వంత సంతృప్తి మరియు ఆనందం మరియు మీ పిల్లల సంక్షేమం అన్నియు సరైన ఎంపికపై ఆధారపడి ఉంటాయి. (“వైఫ్,” ది బుక్ ఆఫ్ మోరల్స్ & ప్రిసెప్ట్స్, బుక్ III, అధ్యాయం 16.)

ఒక తెలివైన వ్యక్తి స్త్రీ యొక్క భావోద్వేగాల నియంత్రణను కూడా పరిగణనలోకి తీసుకొంటాడు. ఆమె మానసికంగా బలంగా ఉందా? జీవితంలో వచ్చు పరీక్షలను మరియు విజయాలను ఎదుర్కొనుటకు తన పక్షాన నిలబడి, తనకు సహకారిగా ఉంటుందా? ఇంటిలో ఉన్న విధానానికి మరియు ఆమె సంరక్షణకు అప్పగించిన పిల్లల ఆత్మలకు అనుగుణంగా ఉండగల ప్రశాంతమైన, శాంతియుతమైన ఆత్మ ఉందా? నమ్మదగిన భాగస్వామిగా ఉండగల జ్ఞానం ఆమెకు ఉందా?

తెలివైన వ్యక్తికి మంచి భార్యను ఎంపిక చేసుకొనే అవకాశం ఉంది: అతడికి తెలిసిన ఉత్తమ మహిళ. మీ భార్యను శ్రద్ధగా ఎంపిక చేసికున్నట్లయితే, మీ బాధలను సరిదిద్ది, మీ ఆనందాన్ని రెట్టింపు చేస్తుంది. బుద్ధిహీనంగా ఎంపిక చేసికున్నట్లయితే ఆమె మీ దుఃఖాలను అధికం చేసి మరియు మీ ఆనందాలను చేదుతో విలీనం చేస్తుంది. (“వైఫ్,” ది బుక్ ఆఫ్ మోరల్స్ & ప్రిసెప్ట్స్, బుక్ III, అధ్యాయం 16.)

ఇవన్నీ అతడు ఎప్పుడైనా ఒక యువతి దగ్గరికి వెళ్ళుటకు ముందు జరుగుతాయి. ఒక నమ్మకమైన భార్య ఒక వ్యక్తికి గొప్ప ఆశీర్వాదం. అతడు తన మరొక కుమార్తె కన్నా కొద్దిగా ఎక్కువగా తన భార్య ఉండాలని అనగా ప్రతి చిన్న విషయానికి తన అనుమతిని మరియు మార్గనిర్దేశాన్ని అడుగునట్లు ఉండాలని చూడడు. తన సమయాన్ని మరియు శక్తిని ఆదాయాన్ని సంపాదించుటకు వినియోగించుట వలన, ఒక తెలివైన వ్యక్తి తన భార్య కుటుంబ విషయాలలో నిజమైన సహచరిణిగా మరియు సహోద్యోగిగా ఉండాలని కోరుకుంటాడు.

గుణవతియైన భార్య దొరుకుట అరుదు అట్టిది ముత్యముకంటె అమూల్యమైనది. ఆమె పెనిమిటి ఆమెయందు నమ్మికయుంచును అతని లాభప్రాప్తికి వెలితి కలుగదు. ఆమె తాను బ్రదుకు దినములన్నియు అతనికి మేలు చేయును గాని కీడేమియు చేయదు.

బలమును ఘనతయు ఆమెకు వస్త్రములు ఆమె రాబోవు కాలము విషయమై నిర్భయముగా ఉండును. జ్ఞానము కలిగి తన నోరు తెరచును కృపగల ఉపదేశము ఆమె బోధించును. ఆమె తన యింటివారి నడతలను బాగుగా కని పెట్టును పనిచేయకుండ ఆమె భోజనము చేయదు.

ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలందరు; ఆమె పెనిమిటి ఆమెను పొగడును.

అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. యహువః యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును (సామెతలు 31: 10-12, 25-28, 30 చూడండి.)

అదేవిధంగా, ఒక యువతి, తనను వివాహం చేసుకోవాలనుకుంటున్న ప్రతి వ్యక్తిని అన్ని విధాలుగాను విశ్లేషించాలి. ఆమె తన జీవితాన్ని "పూర్తిచేయు క్రమంలో" వివాహ ప్రతిపాదన కోసం వేచి ఉంటూ నిశ్శబ్దంగా కూర్చోకూడదు. పౌలు ఇలా హెచ్చరించాడు: “మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. నీతికి దుర్ణీతితో ఏమి సాంగత్యము? వెలుగునకు చీకటితో ఏమిపొత్తు?” (రెండవ కొరింథీయులకు 6:14). భార్య మరియు భర్త యహువః సేవకు సమానంగా కట్టుబడి ఉండుటలో అన్ని విధాలుగా విశ్వసనీయంగా ఉండని ఒక కుటుంబం ఎన్నటికి పైకెత్తబడదు.

నిజమైన వ్యక్తిని, దైవికతను వెంబడించే వ్యక్తిని, పరిశీలించాలి. అతడియందు [యహువః] విజయం పొందును. అతడు [యహువః] ఏర్పరచుకొన్నవాడు…..

“నిజమైన వ్యక్తికి తప్ప, నేను ఎవ్వరిదానిని కాదు” అని చెప్పే స్త్రీ, నిజమైన పురుషుల తయారీదారిగా ఉంటూ [యహువః] యొక్క ఉద్దేశ్యంను సేవించును . . . .

ఇక్కడ రెండు విధాలైన మహిళలు, నిజమైన మహిళలు మరియు సాధారణ మహిళలు ఉన్నారు. సాధారణ మహిళ బలహీనమైన వ్యక్తికి సహచరిణి మరియు నిజమైన మహిళ నిజమైన వ్యక్తికి ఒక సరిపోయే సహచరిణి. కానీ లోక పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, సాధారణ మహిళలు నిజమైన పురుషులను భర్తలుగా పొందుచుండగా, బలహీన పురుషులు నిజమైన మహిళలను మోసం చేయుచున్నారు. అందువలన, నిజమైన పురుషుడు ఒక సాధారణ మహిళ మరియు నిజమైన మహిళ మధ్య వ్యత్యాసాన్ని తెలుసుకొనునట్లు, మరియు నిజమైన మహిళ నిజమైన పురుషుడు మరియు బలహీనమైన పురుషుని మధ్య తేడాను తెలుసుకొనునట్లు ఉండాలి. (ది సన్స్ అఫ్ ఫైర్ అనే గొప్ప పుస్తకం నుండి సంగ్రహించబడింది.)

ఒక యౌవనురాలు ఆమె పిల్లలకు ఇచ్చే ఆధ్యాత్మిక శిక్షణను నాశనం చేయునట్లు ప్రభావితం చేయు వ్యక్తిని తన జీవితంలో చేర్చుకొనకుండా నిర్ధారించుకొనుటలో యహువః యెడల బాధ్యత కలిగియుంటుంది. తనను వివాహం చేసుకోవాలని కోరుకొను వ్యక్తి తాను ఎలాంటి వ్యక్తిని భాగస్వామిగా పొందాలనుకొనెనో అలా ఉన్నాడా లేదా అని విశ్లేషించాలి.

తరచుగా, నేటి ఆర్థిక వ్యవస్థలో, కుటుంబానికి ఆధారాన్ని ఇచ్చునట్లు మహిళలు ఇంటికి వెలుపల పని చేయడానికి ఒత్తిడి చేయబడుతున్నారు. అయితే, ఇది సాధారణంగా మహిళల పనిని రెట్టింపు చేస్తుంది ఎందుకంటే పిల్లల విషయంలో ఆమెయే ప్రధానంగా బాధ్యత వహిస్తుంది. చాలా తరచుగా, భర్తలు తమ భార్యలు ఆదాయాన్ని సంపాదించు అదనపు పనిలో ఉన్నప్పటికీ వంట, శుభ్రపరచుట, షాపింగ్ మరియు పిల్లల పెంపకం బాధ్యతలు కూడా వారిపై వదిలివేయుదురు. ఒకవేళ అతడు ఇంటి పనులలో భాగం పంచుకుంటున్నాడు అంటే, అది భార్య యొక్క అభ్యర్థన వలన తప్ప నిజంగా ఇంటి పనులలో భాగం పంచుకొనుటకాదు. ఆమెను పెళ్లి చేసుకోవాలని కోరుకొనే వ్యక్తి ఆమెకు సహాయం చేయుటలో నమ్మకంగా ఉండునో లేదోనని, సంరక్షణ మరియు బరువు బాధ్యతలలో ఆమె అతడికి సహాయకురాలిగా ఉండునట్లు అతడు కూడా తన అధిక శక్తితో ఆమెకు సహాయకారిగా ఉండునో లేదోనని పరీక్షించుకోవాలి. ఆమె తనను ఇంటికి, పిల్లలకు అంకితం చేసుకొనుటకు వీలగునో లేదో మరియు తనను మరియు భవిష్యత్తులో పిల్లలను అతడు పోషించగలడో లేదో చూడాలి?

ఇంటర్వ్యూ చేయండి!

మీ సంభావ్య సహచరుని ఇంటర్వ్యూ చేయండి. జీవిత భాగస్వామిని ఎంచుకోవడం అనేది మీరు తీసుకొను అత్యంత ముఖ్యమైన నిర్ణయాలలో ఒకటి. మీ ఎంపిక మీ జీవితాంతం చాలా సుదూర పరిణామాలను కలిగి ఉంటుంది. అనుకూలతను నిర్ణయించుట ఈ దశలో చాలా ముఖ్యం. మీ మత నమ్మకాలు మరియు అభ్యాసాలకు అనుకూలతలను నిర్ణయించుటతో పాటు, ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వ లక్షణాలను మరియు ప్రశంసలు లేదా విమర్శలకు, వ్యతిరేక లింగానికి, తల్లిదండ్రులు, పిల్లలు, డబ్బు జీవితం, మొదలైన వాటికి ఆమె/ఆమె వైఖరిని తెలుసుకోవడం ముఖ్యం.

వివాహం తర్వాత ఉత్తమ రహస్యం రహస్యం ఉండకుండుటయే. యహువః యొక్క దీవెనతో, ఆ వ్యక్తిని పూర్తిగా తెలుసుకోండి, అలా చేయుటవలన ముందుముందుకు "నాకు ఈ అలవాటు ఉంది" అని చెప్పినప్పుడు "అసహ్యకరమైన ఆశ్చర్యాలు" ఉండవు. కాబోయే భాగస్వామి యొక్క సామర్థ్యాన్ని ఉత్తమంగా విశ్లేషించిన తరువాత, ఆ వ్యక్తితో ఇంటర్వ్యూ చేయుటకు వివాహ నిర్ణయానికి ముందు గల పరిచయ సమయం ఉత్తమమైనది. ఇది సందర్శించుట ద్వారా స్నేహపూర్వక విధానంలో చేయవచ్చు. కానీ సంభాషణను లెక్కించుకోండి; మీరు ఇతర వ్యక్తి గురించి తెలుసుకోగలిగినంత తెలుసుకోండి. ప్రశ్నలు అడగండి! అవును, కాదు, అనే మాటతో జవాబు ఇవ్వలేని ప్రశ్నలను అడగండి. తటస్థ స్వరముతో అడగండి. మీరు అవతలి వ్యక్తి యొక్క ప్రతిస్పందనను ప్రభావితం చేయకూడదు. ఈ సమయంలో మీ లక్ష్యం అవతలి వ్యక్తి గురించి తెలుసుకోవటం మాత్రమే. మీరు మీ గురించి మాట్లాడుటలో సమయమంతా గడిపినట్లయితే దాన్ని చేయలేరు.

ఇది మీ సొంత ఆశయాలను అర్థం చేసుకొనుట చాలా ముఖ్యం. ఆశలు, కలలు మరియు ప్రణాళికల కంటే ఆశయాలు ఎక్కువ. ఆశయాలు అనేవి విస్మరించబడలేని లేదా విజయవంతంగా రాజీపడలేని లక్ష్యాలు. మీ ఇరువురి ఆశయాలు వేర్వేరుగా ఉంటే, అతడు/ ఆమె మీకు సరియైన జోడి కాదు. జంటలో ఇరువురూ యహువఃను ప్రేమిస్తున్నప్పుడు కూడా, వారి ఆశయాలు వేర్వేరుగా ఉంటే, వివాహంలోనికి ప్రవేశించరాదు. దీనర్థం ఒక వ్యక్తి సరైనవారు మరొకరు కారు అని కాదు. యహువః మిమ్మల్ని వేరు వేరు పనులకోసం పిలిచి ఉండవచ్చు.

మీరు అతడు లేదా ఆమె అయిష్టతలను, అభ్యంతరాలను కూడా తెలుసుకోవాలి. మీరు ఒకే రకమైన అయిష్టతలను కలిగి ఉండవలసిన అవసరం లేదు, కానీ మీ ఇష్టాలు అవతలి వ్యక్తి ఆశయాలతో విభేదించకూడదు. మత విశ్వాసాలు, డబ్బు, జీవన విధానాలు మరియు పిల్లల పెంపకం విషయాలలో మీరు ఒకే విధమైన ఆశయాలను మరియు అయిష్టతలను కలిగి ఉండాలి.

దైవిక నిర్ణయాన్ని వెదకండి.

వివాహ నిశ్చయానికి రిబ్కాతో ఇస్సాకు యొక్క వివాహం మంచి ఉదాహరణ మరియు అది పరలోకం యొక్క ఆశీర్వాదం కలిగిన వివాహం. భార్యకోసం వెతుకుతున్నప్పుడు, ఇస్సాకు తన తండ్రి మరియు తన తండ్రి యొక్క విశ్వసనీయ సేవకుని సహాయంతో దైవీక నిర్ణయాన్ని కలిగి ఉన్నాడు. వారి మొట్టమొదటి అవసరం ఏమిటంటే ఆమె భక్తుగల వంశాన్ని కలిగి ఉండాలి. అబ్రహాము మరియు ఇస్సాకు నివసిస్తున్న ప్రదేశంలో అత్యంత సౌదర్యవంతమైన స్త్రీలు చాలామంది ఉన్నారు, కానీ శారీరక సౌందర్యం కంటే ఎక్కువైన దానికోసం వారు చూసారు. హృదయం దైవరూపంలోకి పరివర్తన చెందుట ద్వారా వచ్చిన గుణం యొక్క సౌందర్యమును వారు ఇస్సాకు కోసం కోరుకొన్నారు.

ఆ సేవకుడు కనాను నుండి మెసొపొటేమియాకు, అబ్రాహాము బంధువుల యొద్దకు ప్రయాణించినప్పుడు, ఇస్సాకుకు భార్యను ఎంపిక చేయటలో యహువః సహాయం కోసం అతడు ప్రార్థించాడు. యహువః ఆ అభ్యర్థనను విని గౌరవించాడు. రిబ్కాతో కలిసి కనానుకు తిరిగి వచ్చినప్పుడు, “ఆ దాసుడు తాను చేసిన కార్యములన్నియు ఇస్సాకుతో వివరించి చెప్పెను.

ఇస్సాకు తల్లియైన శారా గుడారములోనికి ఆమెను తీసికొని పోయెను. అట్లు అతడు రిబ్కాను పరిగ్రహింపగా ఆమె అతనికి భార్య ఆయెను; అతడు ఆమెను ప్రేమించెను. (ఆదికాండము 24:66, 67, KJV)

మీరు నమ్మదగిన దైవిక తల్లిదండ్రులను కలిగియున్నట్లు ఆశీర్వదించబడియుంటే, వారి సలహాను కోరుటకు వెనుకాడవద్దు. జీవిత అనుభవాల ద్వారా వారు పొందిన జ్ఞానం ఒక భాగస్వామిని వెదకుటలో మీకు ఎంతో సహాయకరంగాను మరియు ఆశీర్వాదకరంగాను ఉంటుంది. ప్రతి ఒక్కరు ఇలా విశ్వసించదగిన తల్లిదండ్రులను కరిగి ఉండరు. మీరు యహువః చిత్తానికి పూర్తి లోబడని తల్లిదండ్రులను కలిగి ఉన్నట్లయితే, వారు ఎంపిక చేసినవారిని మీరు వివాహం చేసుకోకూడదు. మీ మొట్టమొదటి బాధ్యత యహువఃను సేవించుటయై ఉన్నది. ఇతర సంబంధాలు ఏవైనా దీనికి తరువాతే ఉండాలి.

దైవిక సలహాను అందించగల తల్లిదండ్రులను మీరు కలిగి లేకపోతే, మీరు మీకంటె పెద్దవారైన స్నేహితుని నుండి సలహా పొందవచ్చు. యహువః యందు భయముగల ఒక గురువు జీవిత భాగస్వామిని వెదకుటలో విలువైన అంతర్దృష్టిని అందించగలడు.

చివరికి మీరు ఒంటరిగా ఉండి సలహా పొందుటకు భూసంబంధమైన స్నేహితుని కలిగి లేనప్పటికీ, మీరు ఎల్లప్పుడూ యహువః యొక్క సలహాను అడగవచ్చు. ఆయన మీ తల్లి, మీ తండ్రి, మీ తెలివైన మార్గదర్శి మరియు మీ సన్నిహిత సహచరుడు. “నా తలిదండ్రులు నన్ను విడిచినను యెహోవా నన్ను చేరదీయును.” (కీర్తనల గ్రంథము 27:10) మీరు ఎల్లప్పుడూ మీ పరలోక తండ్రిని సలహా అడగవచ్చును. “మీలో ఎవనికైనను జ్ఞానము కొదువగా ఉన్నయెడల అతడు యహువఃను అడుగవలెను, అప్పుడది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవనిని గద్దింపక అందరికిని ధారాళముగ దయచేయువాడు.” (యాకోబు 1:5)

విశ్వాస సహితమైన ప్రార్థనకు సమాధానమిచ్చుటకు యహువః ఆనందించును. అలాంటి ఒక ముఖ్యమైన విషయంలో ఆయన నిన్ను ఒంటరిగా విడిచిపెట్టడు. మీరు సమస్తమును ఆయన చిత్తానికి అప్పగించుకొనుటకు నిర్ణయించుకొంటే, ఆయన మిమ్మల్ని సురక్షితమైన మార్గాలలో నడిపిస్తాడు. విశ్వాసంతో అడగుటకు మిమ్మల్ని ప్రోత్సహించుటకు యహూషువః ఇలా అన్నారు:

“అడుగుడి మీకియ్యబడును. వెదకుడి మీకు దొరకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతివాడును పొందును, వెదకువానికి దొరకును, తట్టువానికి తీయబడును. మీలో ఏ మనుష్యుడైనను తన కుమారుడు తన్ను రొట్టెను అడిగినయెడల వానికి రాతినిచ్చునా? చేపను అడిగినయెడల పామునిచ్చునా? మీరు చెడ్డవారై యుండియు మీ పిల్లలకు మంచి యీవుల నియ్యనెరిగి యుండగా, పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి అంతకంటె ఎంతో నిశ్చయముగా మంచియీవుల నిచ్చును.” (మత్తయి 7:7-11, NKJV)

మీరు వివాహం చేసుకోవాలనుకుంటే, యహువః మిమ్మల్ని ఏకపక్షంగా ఒంటరిగా ఉంచుతారని మీరు భయపడనవసరం లేదు. ఆయన ఇంతవరకు మీకొరకు ఒకరిని తీసుకొని రాకపోవుటకు గల ఒకే ఒక్క కారణం, మీతో కలయుట ద్వారా ఆశీర్వదించబడుటకు కావలసిన వ్యక్తి లేకుండుటయే.

యహువః ప్రతి వ్యక్తిలో జీవిత భాగస్వామితో సహవాసం కోసం కోరికను సృష్టించాడు. ఎవరైనా ఉన్నట్లయితే అలాంటి వ్యక్తితో మిమ్మల్ని కలుపునట్లు మీరు యహువఃపై విశ్వాసం ఉంచవచ్చు. ఒక జీవిత భాగస్వామి కోసం మీ కోరిక యహువః మీయెద్దకు తీసుకువచ్చే ఒక భాగస్వామి ద్వారా ఆశీర్వదించబడుతుంది. మీ జీవితానికి నిజమైన ఆనందాన్ని తెచ్చునది ఏదో ఆయనకు బాగా తెలుసు మరియు ఆయన దానిని మీకొరకు కోరుచున్నాడు. “​నేను మిమ్మునుగూర్చి ఉద్దేశించిన సంగతులను నేనెరుగుదును, రాబోవు కాలమందు మీకు నిరీక్షణకలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములేగాని హానికరమైనవి కావు; ఇదే యహువః వాక్కు. (యిర్మీయా 29:11)

ప్రతిదానిని యహువఃకు అప్పగించండి. ఆయన మిమ్మల్ని సురక్షితమైన మార్గాలలో నడుపును మరియు ఆయనకు కట్టుబడియున్న మీ జీవితం, మీ వివాహం, ఆయన నామమును మహిమపరుచును.

“యహువఃనుబట్టి సంతోషించుము ఆయన నీ హృదయవాంఛలను తీర్చును.
నీ మార్గమును యహువఃకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము ఆయన నీ కార్యము నెరవేర్చును.”
(కీర్తనలు 37:4, 5)