Print

# 1 ఉత్తమ సహజ వైద్యం! ఉత్తేజిత కర్ర బొగ్గు (యాక్టివేటెడ్ చార్కోల్)!

“నా ప్రాణమా, యహువః ను సన్నుతించుము ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము ఆయన నీ దోషములన్నిటిని క్షమించువాడు నీ సంకటములన్నిటిని కుదుర్చువాడు.” (కీర్తనల గ్రంథము 103:2-3, KJV)

వైద్య శాస్త్రం మరింత పురోగతి చెందుతున్న సమయంలో, వ్యాధులకు సంబంధించి వివిధ నూతన జాతులు మరింత నిరోధకతను సంతరించుకొంటున్నందున చార్కోల్ జ్వాల అసాధారణమైనదిగా మరియు అంతిమ చిహ్నంగా ఉన్నది. భవిష్యత్తులో మృగం యొక్క ముద్రను తిరస్కరించిన వారికి క్రయవిక్రయాలు నిషేధించబడినప్పుడు ఆరోగ్య సంరక్షణ చాలా కష్టతరమవుతుంది.

సరళమైన, సమర్థవంతమైన సహజ నివారణల విషయంలో జ్ఞానాన్ని పెంపొందించుకొనుటకు ఇప్పుడే సమయం తీసుకొనుట చాలా ముఖ్యమైయున్నది. ప్రతి వ్యాధికి యహువః ప్రకృతిలో ఒక వైద్యాన్ని అందించారు. ప్రపంచవ్యాప్తంగా అత్యుత్తమ, అత్యంత ప్రభావవంతమైన సహజ వైద్యం ఒకటి అందుబాటులో ఉన్నది. అదే, ఉత్తేజిత కర్ర బొగ్గు (యాక్టివేటెడ్ చార్కోల్).

ఒక ఔషధముగా కర్ర బొగ్గు (చార్కోల్) ను ఉపయోగించుటను గూర్చి 1500 BC నాటికి ఈజిప్టులో నమోదు చేయబడినది. మీరు "సహజ నివారణలు" అనే పదాలు విన్నప్పుడు తక్షణమే "పాము చమురు విక్రయించే మోసాన్ని" గూర్చి ఆలోచన వస్తే, 21 వ శతాబ్దంలో వైద్యులు ఇప్పటికీ అనేక రకాల పరిస్థితుల కోసం చార్కోల్ ను ఉపయోగిస్తున్నారని మీరు తెలుసుకోవాలి!

అమెరికాలోని విష నియంత్రణ కేంద్రము ఈ ఉత్తేజిత బొగ్గు పొడిని సిఫారసు చేసినది. యునైటెడ్ స్టేట్స్ ఆహార మరియు ఔషధ పాలక శాఖ ఉత్తేజిత కర్ర బొగ్గును 1వ వర్గంలో లేక “సురక్షిత & ప్రభావవంతమైన” వర్గంలో చేర్చెను.

అయితే దీనిలో చెప్పుకోదగ్గ విషయం ఏమిటంటే? మీరు దానిని కొనుక్కోవచ్చు లేదా మీ అంతట మీరు తయారు చేసుకోవచ్చు!

చార్కోల్ యొక్క అనేక ఉపయోగాలు

అందుబాటులో ఉన్న సమస్త ప్రకృతి ఔషధాలలో, యాక్టివేటెడ్ చార్కోల్ అత్యంత విశాలమైన పరిధిని కలిగియున్నది మరియు వ్యాధులను సహజ పద్ధతులలో నయం చేయాలనే ఆసక్తిగల ప్రతి ఒక్కరూ దీనిని గూర్చి తెలుసుకోవాలి. చార్కోల్ టాక్సిన్లను వేరుచేస్తుంది. దీనిని సాధారణ విరేచనాలు మొదలుకొని టూరిస్టా (తరచుగా ఇ. కోలి బ్యాక్టీరియా వలన కలిగుతుంది), డీసెంటరీ మరియు కలరా వరకు ప్రతి వ్యాధిలోనూ ఉపయోగిస్తారు. అదే సమయంలో, యాక్టివేటెడ్ చార్కోల్ చాలా సున్నితమైనది, ఇది శిశువులలో కలుగు అతిసార వ్యాధిలో కూడా సురక్షితంగా వాడబడుతుంది. నిజానికి, ఇది బాగా పనిచేయును, కావున చార్కోల్ వలన మలబద్ధకం కలగవచ్చు. కాబట్టి, ఇతర ప్రయోజనాల కోసం ఉపయోగించినట్లయితే, అది తీసుకొనునప్పుడు తప్పకుండా నీటిని పుష్కలంగా త్రాగాలి!

చార్కోల్ ను కడుపు ఉబ్బరం మరియు గ్యాస్ ట్రబుల్ చికిత్సకు కూడా ఉపయోగిస్తారు. ఇది విషపదార్ధాలకు అంటుకొని ఉండగల సామర్ధ్యాన్ని కలిగియున్న కారణంగా, ఎవరైనా విషాన్ని తీసుకున్నప్పుడు చికిత్స కోసం తరచుగా దీనిని ఎంపిక చేయుట జరుగుతుంది. ప్రతిరోజు, ఆసుపత్రులలో వ్యసనాత్మకమైన మందులు, ఆస్పిరిన్, బార్బిట్యురేట్లు, లేదా మోర్ఫిన్ల యొక్క అధిక మోతాదులను తీసుకొన్న రోగులను నిర్విషీకరణ చేయుటకు యాక్టివేటెడ్ చార్కోల్ వాడబడుతుంది.

ఇది శరీరంలోకి శోషించబడనందున చార్కోల్ అధిక మోతాదుల చికిత్సలకు మరియు విష చికిత్సలకు అనువైనది. అనగా, ఇది జీర్ణవ్యవస్థలో ఉంటూ, ఎటువంటి రసాయనానికైనా అంటుకొనుచూ, దీనికి అంటుకొని ఉన్న విష పదార్థాలతో పాటు శరీరంలో నుండి విసర్జించబడుతుంది.

 

black widow spider  rattlesnakeవాస్తవానికి, దీనికి పీల్చుకొనే సామర్ధ్యం చాలా ప్రభావవంతంగా ఉండుటవలన, డాక్టర్లు వ్రాయు ఔషధాలను తీసుకునుటకు రెండు గంటలలోపు చార్కోల్ ను తీసుకోకూడదు. 1831 లో, ప్రొఫెసర్ టౌరీ, ఫ్రెంచ్ అకాడమీ ఆఫ్ మెడిసిన్ లో, యాక్టివేటెడ్ చార్కోల్ ఎంత సమర్థవంతమైనదో ప్రదర్శించాడు. అతడు స్టైరిచ్నిన్ ను ప్రాణాంతకమైన మోతాదులో త్రాగి ... మరియు బ్రతికి బయటపడ్డాడు! ఏం మాయ జరిగింది? అతడు విషమును యాక్టివేటెడ్ చార్కోల్ తో కలిపి త్రాగాడు!

బాహ్యంగా ఉపయోగించినప్పుడు కూడా ఉత్తేజిత బొగ్గు చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఇది అంటువ్యాధులను తగ్గిస్తుంది, కీటకాల కాట్లను మాన్పుతుంది, పాము విషాన్ని పీల్చుకొంటుంది, తేలు విషాలను తటస్థీకరిస్తుంది మరియు ప్రపంచంలోని అత్యంత ప్రాణాంతకమైన సాలీడు యొక్క విషపూరితమైన కాటుకు కూడా ఉపయోగించుకోవచ్చు! ఇది నిజంగా సమర్థవంతమైన చికిత్స మరియు మీరు చేయవలసినదల్లా ఎలా ఉపయోగించాలో నేర్చుకొనుట ప్రారంభించుటయే.

 యాక్టివేటెడ్ చార్కోల్ ను ఎలా ఉపయోగించాలి

యాక్టివేటెడ్ చార్కోల్ ను వినియోగించుట చాలా సలభం! ఇది తరచూ టాబ్లెట్లు లేదా క్యాప్సూల్స్ రూపంలో విక్రయించబడుతుంది, కానీ ఎక్కువ మోతాదులో తీసుకోవలసినప్పుడు చాలా ప్రభావవంతమైన మార్గం నీటిలో లేదా పండ్ల రసాలలో కలిపి త్రాగుట మాత్రమే. చార్కోల్ కు ఎటువంటి రుచి ఉండదు. నీటిలో కలిసినప్పుడు అది కొద్దిగా గరుకుగా (ఇసుకగా) ఉండవచ్చు, కానీ ఎటువంటి రుచి ఉండదు.

బాహ్య వినియోగానికి, కేవలం ఒక చిన్న టీస్పూన్ చార్కోల్ పొడిని తీసుకొని, తగినంత నీటిని జోడించి పలుచని ముద్దగా చేయండి. కావాలనుకుంటే, మరింత అంటుకొనే గుణాన్ని పొందుటకు అవిసె విత్తనాల పొడిని కూడా కలుపుకోవచ్చు. ఒకవేళ బాగా పలుచగా జారుతున్నట్లు ఉంటే, కాస్త ఎక్కువ చార్కోల్ పొడిని కలుపుకోవాలి. దానిని ప్రభావిత ప్రాంతం మీద పూయాలి. తరువాత, చార్కోల్ మీద తడి కాగితపు టవల్ లేదా గాజుగుడ్డ ప్యాడ్ ను వేయండి. చివరిగా, దానంతటిని ప్లాస్టిక్ చుట్టుతో మూయవలెను. మీరు చార్కోల్ ను తడిగా ఉంచుకోవాలి. పిండికట్టులో తడి ఆరిపోయిన తర్వాత అది ఇక పీల్చుకోదు. అందువలన అది కారిపోకుండా ఉండుటకు ఖాలీలు లేకుండా వైద్య టేపుతో ప్లాస్టిక్ అంచులను మూయవలెను.

చార్కోల్ పేస్టును ఒక శుభ్రమైన గుడ్డ ముక్క మీద పూసి, దానిని తర్వాత తిరిగి ఉపయోగించేందుకు దాచుకొనవచ్చు కూడా.

మీరు సొంతగా యాక్టివేటెడ్ చార్కోల్ ను ఎలా తయారు చేయాలి

ఉత్తేజిత బొగ్గును మందుల దుకాణాలలో, ఆన్ లైన్లో కొనుగోలు చేయవచ్చు, లేదా మీరు స్వంతగా తయారు చేయవచ్చు. అయితే, బొగ్గు దిమ్మలను ఉపయోగించకండి. ఇవి ఆహార తరగతికి చెందవు మరియు అగ్ని-రాజేయు రసాయనాల నుండి తయారు చేయబడతాయి.

మీ స్వంత చార్కోల్ ను తయారు చేసేందుకు, ఈ దశలను అనుసరించండి:

  1. ఆరుబయట అగ్ని రాజేయండి. బాగా ఆరిపోయిన పొడి కలప యొక్క చిన్న ముక్కలను ఒక లోహపు కుండలో నింపండి. గట్టి కలప ఉత్తమంగా ఉంటుంది, అయితే కొబ్బరి చిప్పలు వంటి ఏదైనా దృఢమైన వృక్ష పదార్థం కూడా బాగా పని చేస్తుంది. రంధ్రం గల ఒక మూతతో కుండకు మూత పెట్టండి.
  2. కుండను మూడు నుండి అయిదు గంటల పాటు అగ్నిపై ఉడికించండి. రంధ్రం ద్వారా వాయువు మరియు పొగ బయటకు వస్తాయి. రంధ్రం నుండి పొగ లేదా వాయువు వచ్చుట ఆగిపోతే, మీ కలప తయారైనట్టే.
  3. కుండలోని బొగ్గు పూర్తిగా చల్లారినప్పుడు, బహుశా మరుసటి రోజు అవవచ్చు, దానిని పరిశుభ్రమైన పాత్రలోనికి బదిలీ చేయండి. మిగిలియున్న ఏదైనా చెత్తను లేదా బూడిదను తొలగించుటకు పరిశుభ్రమైన నీటితో శుభ్రం చేసుకోండి. మీకు బూడిద అవసరం లేదు.
  4. ఒక కల్వమును లేదా ఒక సున్నితమైన సుత్తిని ఉపయోగించి, మీ బొగ్గును మెత్తటి చూర్ణముగా మార్చండి.
  5. బొగ్గు చూర్ణము పూర్తిగా గాలికి ఆరేలా చేయండి. దీనికి 24 గంటలు పట్టవచ్చు. బొగ్గు పూర్తిగా ఆరిపోయి పొడిగా మారువరకు క్రియాశీలతను ప్రారంభించవద్దు.

క్రియాశీలం చేయబడని బొగ్గును బాహ్యంగా, నీటిని శుద్ధీకరణ చేయుటకు లేదా ఇతర ఉపయోగాల కొరకు ఉపయోగించవచ్చు. అంతర్గత ఉపయోగానికి దీనిని సక్రియం చేయుటకు దీనికి కొన్ని అదనపు దశలు అవసరం.

  1. కాల్షియం క్లోరైడును నీటితో 1: 3 నిష్పత్తిలో మిళితం చేయండి. జాగ్రత్త. ద్రావణం చాలా వేడిగా ఉంటుంది. బొగ్గు పూర్తిగా మునుగునట్లు చేయుటకు మీకు తగినంత ద్రావణం అవసరం. (కాల్షియం క్లోరైడును చాలా హార్డువేర్ దుకాణాలలో కొనుగోలు చేయవచ్చు. మీరు దానిని పొందలేకపోతే, కాల్షియం క్లోరైడుకు బదులుగా 310 మి.లీ. నిమ్మ రసంను ప్రత్యామ్నాయంగా ఉపయోగించవచ్చు.)
  2. ఒక గ్లాసు లేదా స్టెయిన్లెస్ స్టీల్ గిన్నెను ఉపయోగించి, కాల్షియం క్లోరైడ్ ద్రావణాన్ని కొద్ది కొద్దిగా వేస్తూ చార్కోల్ పొడిని కరిగించవలెను.
  3. మిశ్రమం ఒక ముద్ద యొక్క అనుగుణ్యతకు చేరుకున్న తర్వాత, ఇక ద్రవ పదార్ధాన్ని చేర్చవద్దు.
  4. పాత్రకు మూతపెట్టి దానిని 24 గంటలపాటు కదల్చకుండా ఉంచవలెను. తర్వాత, గిన్నె నుండి వీలైనంత ఎక్కువ ద్రవ పదార్ధాన్ని పారబోయండి. చార్కోల్ తడిగా ఉండాలి, కానీ పూర్తిగా జారినట్లు ఉండకూడదు.
  5. తడి చార్కోల్ ను ఒక లోహపు కుండలో ఉంచండి. ఈ కుండను మీరు నీటిని కాచుటకు అవసరమైనంత మంటపై మూడు గంటల పాటు ఉడికించాలి. మూడు గంటల తరువాత, చార్కోల్ క్రియాశీలకంగా మరియు వినియోగం కోసం సిద్ధంగా ఉంటుంది.

అందుబాటులో ఉన్న అత్యంత ముఖ్యమైన మరియు ఉపయోగకరమైన ప్రకృతి వైద్యాలలో యాక్టివేటెడ్ చార్కోల్ ఒకటి. భూమిపై ఉన్న అతి పేద బిచ్చగాడు దీనిని సొంతగా తయారు చేసుకోగలడు, మరియు ఇది ధనవంతుడైన బిలియనీర్ యొక్క జీవితాన్ని కాపాడగలదు.

మీ సొంత పరిశోధనను చేయండి! ఈ అద్భుతమైన వనరును ఉపయోగించడానికి అనేక మార్గాలను నేర్చుకోవడం ప్రారంభించండి. భవిష్యత్తులో, మీ జీవితం లేదా ఒక ప్రియమైన వారి జీవితం దానిపై ఆధారపడి ఉండవచ్చు.