Print

విశ్వంలో అత్యంత శక్తిమంతమైన వాగ్దానం!

లేఖనం ఎన్నటికీ ఇవ్వబడిన అత్యంత శక్తివంతమైన వాగ్దానాన్ని కలిగి ఉంది.
విచారకరంగా, అది పైపైనే (సాదా కంటికి) దాగి ఉన్నప్పటికీ దాని గురించి ఎవరికీ తెలియదు.

అత్యంత శక్తివంతమైన వాగ్దానం

నేను ఒక రహస్యాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఇది నిజంగా రహస్యం కాదు. తెలుసుకొనుటకు ప్రయత్నించేవారికి దీనిని గూర్చిన సమాచారం అందుబాటులోనే ఉంది. కానీ జ్ఞానం ఉద్దేశపూర్వకంగా దాగి ఉన్నది, మరియు కోల్పోబడినది. ఆ రహస్యం: దైవిక నామం విశ్వంలోకెల్లా అత్యంత శక్తివంతమైన వాగ్దానాన్ని కలిగియున్నది. 

సాతాను ఈ వాగ్దానాన్ని ప్రభువు, దేవుడు అనే సాధారణ శీర్షికల క్రింద దాచిపెట్టాడు— ఇవి అన్య దేవతలకు కూడా వర్తించే శీర్షికలై ఉన్నాయి. 

ఆయన నామములో గల వాగ్దానాన్ని కనుగొని దానిని ఉపయోగించాలని యహువః కోరుచుండెను. అందుచేత లేఖనము పదే పదే విశ్వాసులకు “యహువః నామమున పిలవవలెనని” చెప్పుచున్నది (1 దినవృత్తాంతములు 16: 8 కె.జె.వి) మరియు అలా చేయు ప్రతి ఒక్కరికీ ఒక జవాబు వాగ్దానం చేయబడినది (కీర్తన 50:15). ఎందుకంటే అక్కడ శక్తి ఉంది! ఒక వాగ్దానం! ఉత్పన్నమయ్యే అవకాశమున్న ఏ ఒక్క అవసరానికి లేక ప్రతి అవసరానికి సరిపోయే ఒక వాగ్దానం రూపకల్పన చేయబడెను.

ఒక అసాధారణ నామం

సృష్టికర్త సమస్త జీవరాశులకు మూలమై యున్నాడు. ఆయన నామం, అసాధారణంగా ఉంటూ, అది ఆయన స్థితిని, అనగా సర్వశక్తిమంతుడు స్వీయ-ఉనికిలో ఉన్నట్లు సంపూర్ణంగా వివరిస్తుంది. ఆయన నామము అనేది ఒక ఉంటూ-ఉన్న-క్రియ. ఉంటూ ఉన్న క్రియలేవనగా: ఉన్నాను, ఉన్నది, ఉన్నాడు, ఉన్నారు, ఉండెను, ఉండేవి, ఉండుట, ఉంటూ, మరియు ఉండెను. ఇవన్నీ మునుపు ఉన్నవాడు మరియు నేడును, ఎల్లప్పుడును ఉండువాడుగా ఆయనకు సంపూర్ణంగా వర్తిస్తాయి. 

మండుచున్న పొదయొద్ద మోషే, నన్ను ఎవరు పంపెనని చెప్పవలెను అని అడిగినప్పుడు, దానికి సమాధానంగా ఆంగ్ల బైబిలులో తర్జుమా చేయబడిన ప్రకారం: "నేను ఉన్నవాడను అనువాడను" అని జవాబిచ్చాడు. “ఉన్నవాడు” నన్ను మీ యొద్దకు పంపెను” అని నీవు ఇశ్రాయేలీయులతో చెప్పవలెను. (నిర్గమకాండము 3:14, KJV) 

అయితే, అక్కడ గల అసలైన పదం, కేవలం: “ఉండు”. "ఉండు! ఉండు! ఉండు (వాడు) నన్ను పంపెనని చెప్పుము."

ఉండు; హెబ్రీలో, హాయః. 

పేరులో శక్తి! 

హాయః 

దైవిక నామములో శక్తి ఉంది. కొరియాలో ఒక పురాతన యుద్ధ కేక, "హాయః!" నేటికి కూడా, యుద్ధ కళలను (మార్షల్ ఆర్ట్స్) అభ్యసించువారు "హియాహ్" అని అరుచుటవలన, వారి గుద్దులు లేదా తన్నులలో గల శారీరక శక్తి పెరుగుతుందని బోధించబడుదురు.

అలాగే, యహువః యొక్క ప్రవక్తలు దైవిక నామము యొక్క శక్తిని అర్ధం చేసుకున్నారు. ఆదికాండము 12: 2 లో అబ్రాముతో యహువః ఇలా అన్నారు: “నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుందువు.”

అబ్రాము అప్పటికే ఆశీర్వదించబడ్డాడు, అందుచేత [యహువః యొక్క] ఈ మాటలు అతడికి భవిష్యత్తులో కలుగు ఆశీర్వాదాన్ని ప్రకటించెను. ఇటువంటి వాక్యాలలో హాయః యొక్క వినియోగం వాస్తవమైన శక్తి విడుదలను ప్రకటిస్తుంది, కాబట్టి నెరవేర్పు హామీ ఇవ్వబడినది —అబ్రాము ఆశీర్వదించబడతాడు, ఎందుకంటే [యహువః] దానిని ఆజ్ఞాపించాడు.

భవిష్యత్ లో [యః యొక్క] జోక్యాన్ని తెలుసుకొనుటకు ప్రవక్తలు హయాను ఉపయోగించారు. ఈ క్రియను ఉపయోగించి, వారు నొక్కిచెప్పారు … వారిని ప్రభావితం చేసే అంతర్లీన దైవిక శక్తి … ఇద్దరు భాగస్వాముల మధ్య ఒప్పందాలు జరిగినప్పుడు, నియమాలు సాధారణంగా హాయః ను కూడా చేర్చును. 

హాయః వినియోగంను గూర్చి అత్యంత తర్కింపులు జరిగిన సంఘటన నిర్గమకాండం 3: 14 లో ఉన్నది, అక్కడ [యహువః] మోషేకు తన నామమును చెబతూ, ఇలా అన్నారు: నేను ఉన్నవాడను (హాయః) అయి ఉన్నాను (హాయః).

<దైవిక నామం ... [యహువః] చాలా కాలం ముందు నుండి తెలిసియుండెను … మరియు ఈ ప్రకటన ఒడంబడికను చేసిన ఆ దేవుడే [ఎలోహ్] ఆ ఒడంబడికను కాపాడిన దేవుడు అని నొక్కిచెబుతున్నట్లు ఉండెను. కాబట్టి, నిర్గమకాండము 3: 14 లో ఈ గుర్తింపు ప్రకటన సులభంగా ఉంటుంది: “నేను ఉన్నవాడను అయి ఉన్నాను- I AM THAT I AM;” ఇది అన్ని విషయాలపై దైవిక నియంత్రణను ప్రకటన చేస్తుంది. 1

ఇది దైవిక నామములోని దాగివున్న శక్తి యొక్క రహస్యమైయున్నది, మరియు ఇది ఈ నామమును విశ్వంలోని అత్యంత శక్తిమంతమైన వాగ్దానంగా మారుస్తుంది.

నామంలోని వాగ్దానం

విశ్వాసం

యహువః యొక్క వాక్యం చెబుతున్నదానిని నెరవేర్చగల శక్తిని ఆ వాక్యమే కలిగియుండునను ఆశ్చర్యకరమైన వాస్తవాన్ని యెషయా 55:11 వెల్లడిస్తోంది: నా వాక్యం “నిష్ఫలముగా నాయొద్దకు మరలక అది నాకు అనుకూలమైనదాని నెరవేర్చును నేను పంపిన కార్యమును సఫలముచేయును.”

ఈ జ్ఞానం, దైవిక నామములోని స్వాభావిక శక్తితో కలిసి, పరలోకంలోని సమస్త సంపదలకు ద్వారం తెరుచును, మరియు దేవదూతతో యాకోబు పోట్లాడినట్లు విశ్వాసం ద్వారా దైవిక వాగ్దానంపై ఆధారపడి, దానిని తిరిగి పోనీయకుండా చేయు వినయపూర్వకమైన అనుచరుని తరపున దైవత్వం యొక్క సమస్త శక్తిని విడుదలచేయును. 

>శారీరక, మానసిక లేదా భావోద్వేగ స్వస్థత కోసం; రక్షణ కోసం, క్షమాపణ కోసం, శుద్ధీకరణ కోసం, మరియు పునరుద్ధరణ కోసం; పాపాన్ని జయించుట కోసం … అక్షరాలా నీకు అవసరమైన ప్రతి దాని కోసం, ఈ దైవిక నామము మీరు హక్కు కలిగియున్న వాగ్దానమై యున్నది. మరియు ఆ వాగ్దానాన్ని నెరవేర్చు అధికారం ఆ పదంలోనే ఉంటుంది! 

ఈ విధంగానే ఈ విశ్వం ఉనికిలోకి వచ్చినది. యః యొక్క శక్తిమంతమైన నామము పదే పదే ఉపయోగించబడినది. 

ప్రపంచం ఎలా సృష్టించబడినదో దావీదు వివరించాడు: “లోకులందరు యహువః యందు భయభక్తులు నిలుపవలెను. భూలోక నివాసులందరు ఆయనకు వెరవవలెను. ఆయన మాట సెలవియ్యగా దాని ప్రకారమాయెను ఆయన ఆజ్ఞాపింపగానే కార్యము స్థిరపరచబడెను.” (కీర్తన 33: 8-9, KJV). మరియు ఆయన మళ్ళీ, మరియు మళ్ళీ, మళ్ళీ పలికినది, ఆయన నామం.

వెలుగు … “ఉండు(BE) గాక!

వెలుగు ఉండెను. (కలిగెను)

ఆరిన నేల … “ఉండు(BE) గాక!

ఆరిన నేల ఉండెను. (కలిగెను)

చెట్లు … “ఉండు(BE) గాక!

చెట్లు ఉండెను. (కలిగెను)

కలిగియున్నదంతయు దైవిక శక్తి ద్వారా పలకబడిన దైవిక నామము ద్వారా కలిగినది. 

వాగ్దానపు హక్కును పొందుట

ప్రార్థన

అందుచేత యహువః అబద్ధమాడనేరడు. ఇంతకు ముందు ఉనికిలో లేనిది, ఆయన మాట పలికిన వెను వెంటనే అది ఉనికిలోనికి వస్తుంది. 

ఇదికూడా యహువః నామముపై మనము ఎందుకు పిలవాలో తెలియజేస్తుంది. మనము పాపానికి వ్యతిరేకంగా యుద్ధంలో ఎలా జయించాలో తెలియజేస్తుంది. అక్షరాలా జీవితానికి, ఆరోగ్యానికి, సంతోషానికి, మరియు పాపాలను అధిగమించుటలో సహాయానికి మీకు అవసరమైనది దైవిక నామము యొక్క శక్తిలో ఉంటుంది. 

ఆయన పేరు, “ఉండు (BE)”, మీ అవసరతతో కలిసి, వాగ్దానంగా మారుతుంది మరియు అది మీరు విశ్వాసం ద్వారా అడిగినప్పుడు నెరవేరుతుంది. 

కాబట్టి, మీకు ఏమి అవసరమైయున్నది? మీకు ఆయన మాట ఏమిటంటే: 

యహువః నామమున పిలవడం అంటే ఇదే. ఎందుకంటే యహువః మాటలు విశ్వమును ఉనికిలోనికి పిలిచిన శక్తిని కలిగియున్నవి, మరియు తన సంకల్పానికి పూర్తిగా లోబడి జీవిస్తున్నప్పుడు విశ్వాసంతో మాట్లాడిన అవే మాటలు, ఒక స్వయం-నెరవేర్పు ప్రవచనంగా మారతాయి. 

కాబట్టి, మీరు యహువః నాముమున పిలిచినప్పుడు, నామంలో గల వాగ్దానాన్ని అందుకొనుటకు మీ విశ్వాసాన్ని అనుమతించినప్పుడు, ఆయన మాటే మీకు నెరవేర్పు. ఈ శక్తివంతమైన భావనను పౌలు అర్థం చేసుకున్నాడు. హెబ్రీయులకు 11 వ అధ్యాయంలో ఆయన ఇలా వివరించాడు: “విశ్వాసమనునది నిరీక్షింపబడువాటియొక్క నిజ స్వరూపమును, అదృశ్యమైనవి యున్నవనుటకు రుజువునైయున్నది.” 

యహూషువః ఇలా అన్నారు, “మీరు నా నామమున దేని నడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచబడుటకై దానిని చేతును.” (యోహాను సువార్త 14:13). ఇది ఒక దైవ పరుగుల యంత్రం కాదు: అది చెప్పి దాన్ని పొందండి. ఎప్పటిలాగే, యహ్ యొక్క వాగ్దానాలు ఆయన వెల్లడించిన చిత్తానికి విధేయత చూపుట అనే షరతుపై ఇవ్వబడ్డాయి. 

ఏమైనప్పటికీ, ఈ శక్తివంతమైన వాగ్దానం, మన విజయానికై యహువః ఉద్దేశించినదైయున్నది. వాగ్దానాన్ని నెరవేర్చు అధికారం యహువః నామంలో మాత్రమే ఉన్నదని మీ విశ్వాసం గ్రహించినప్పుడు, అది మీలో ఉన్న ఏదేని ఒక మంచితనం వల్ల కాదు కాని, అది కేవలం మిమ్మల్ని ప్రేమించే తండ్రియు మరియు సృష్టికర్తయు అయిన యహువః వలన అలా నెరవేరునని మీరు తెలుసుకొని దానిని ప్రకటింతురు. 

యహువః నామమున పిలవండి. అలా చేయుటకు ఆయన మిమ్మల్ని కోరుకుంటున్నారు! నేడు మీకు ఆయన మాట: “ఇదివరకు మీరేమియు నా పేరట అడుగలేదు; మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి, మీకు దొరకును.” (యోహాను సువార్త 16:24).

గడ్డంతో ఉన్న వ్యక్తి ప్రార్థించుచుండెను


1 హాయః, ద న్యూ స్ట్రాంగ్స్ ఎక్స్పాండెడ్ డిక్షనరీ ఆఫ్ బైబిల్ వర్డ్స్.