Print

ద్రాక్షారసము వెక్కిరింతల పాలుచేయును | క్రైస్తవులు మద్యం సేవించవచ్చా?

స్వీయ ఆసక్తి, స్వీయ-అన్వేషణ, స్వీయ కేంద్రీకృతమానవ జాతిని సృష్టించుటలో గల యహువః యొక్క అద్భుతమైన ప్రణాళిక ప్రతి వ్యక్తి యొక్క మనస్సులో నివసించుట మరియు తన స్వరూపంలో రూపింపబడిన ప్రతి వ్యక్తితో ఐక్యమై ఉండుటయై యున్నది. పాపము సృష్టికర్త యొక్క ప్రణాళికను నాశనం చేసెను మరియు ఆదాము యొక్క ఆత్మ నుండి మరియు అతని వారసులందరిలో నుండి దైవిక రూపంను వేరుచేసెను. మానవులు ప్రేమ, దయ, ఇతరుల ఆనందంపై ఆసక్తి, ఇతరులపై-దృష్టి కేంద్రీకరించు వారివలె ఉండుటకు బదులు, ఒక జాతిగా స్వీయ-ఆసక్తి, స్వీయ-అన్వేషణ మరియు స్వీయ- కేంద్రీకృతులయ్యారు. సాతాను యొక్క మనస్సు కొరకు యహువః యొక్క మనస్సు విడిచిపెట్టబడింది.

పడిపోయిన మానవజాతిలో దైవిక రూపమును పునరుద్ధరించుటకు యహువః అలాంటి ఒక ప్రమాదకరమైన పని నిమిత్తం తన అద్వితీయ కుమారుని పంపెను. యహూషువః మరణించుటకు కొంచెం ముందు, తన మరణం ద్వారా రక్షింపబడుతున్నవారికి తండ్రి యొక్క అంతిమ ప్రణాళికను వెల్లడించాడు:

వారును మనయందు ఏకమైయుండవలెనని వారికొరకు మాత్రము నేను ప్రార్థించుటలేదు; వారి వాక్యమువలన నాయందు విశ్వాసముంచువారందరును ఏకమైయుండ వలెనని వారికొరకును ప్రార్థించుచున్నాను. మనము ఏకమైయున్నలాగున, వారును ఏకమైయుండవలెనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చితిని.

వారియందు నేనును నా యందు నీవును ఉండుటవలన వారు సంపూర్ణులుగా చేయబడి యేకముగా ఉన్నందున నీవు నన్ను పంపితివనియు, నీవు నన్ను ప్రేమించినట్టే వారినికూడ ప్రేమించితివనియు... (యోహాను సువార్త 17:21-23)

మీ కొరకు తండ్రి మరియు కుమారుడు చూపుతున్న ప్రేమ ప్రతీ భూసంబంధమైన ప్రేమను అధిగమిస్తుంది. వారు మిమ్మల్ని దగ్గరికి తీసుకొని, తమతో సన్నిహిత సంబంధంలోకి తీసుకురావాలని కోరుతున్నారు; ఒక సన్నిహిత సంబంధం అనేదాన్ని వారితో ఐక్యమగుట అనే విధంగా మాత్రమే వర్ణించగలము.

అపొస్తలుడైన పౌలు వ్రాసినప్పుడు సాధ్యమైనంత సాన్నిహిత్యాన్ని వెల్లడిచేశాడు:

మీ దేహము ఎలోహీం వలన మీకు అనుగ్రహింపబడి, మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై యున్నదని మీరెరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువపెట్టి కొనబడినవారు గనుక మీ దేహముతో ఎలోహను మహిమపరచుడి. (మొదటి కొరింథీయులకు 6:19,20)

నీతో పరస్పరం కలిసియుండి సహవాసం చేయుటకు యహువః కలిగియున్న ఆశను నీవు చేయు ప్రతి పాపం నాశనం చేస్తుంది. పాపానికి అంటిపెట్టుకొని సాతానును సేవించుచున్న సమయంలో పాపం లేని యహువఃతో ఐక్యమై యుండుట అసాధ్యం. “ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా నుండనేరడు; అతడు ఒకని ద్వేషించి యొకని ప్రేమించును; లేదా యొకని పక్షముగానుండి యొకని తృణీకరించును. మీరు ఎలోహీంకిని సిరికిని దాసులుగా నుండనేరరు.” (మత్తయి సువార్త 6: 24)

మద్యం సేవించుట అనేది కొంతమంది ప్రజలకు తికమక కలిగిస్తున్న అంశం. యహువఃను ప్రేమించి మరియు సేవించిన వివిధ నీతిమంతులైన భక్తులు మద్యం సేవించినట్లు బైబిలు సూచిస్తున్నందున, యహువః యొక్క ప్రజలు మద్యపానం చేయుచు పాపం లేకుండా ఉండగలరా అనే ప్రశ్న సాధారణంగా కలుగుతుంది? మద్యపానాన్ని యహువః ఆమోదించెననుటకు రుజువుగా ద్వితియోపదేశకాండం 14 వ అధ్యాయాన్ని ఉపయోగిస్తూ ఉంటారు. ఈ అధ్యాయం ప్రకారం, యహువః యొక్క ప్రత్యక్షపు గుడారానికి దూర ప్రాంతంలో నివసించుచువారు, తమ దశమ భాగములను వార్షిక పండుగలకు తమతో సులభంగా తీసుకువెళ్ళగలుగుటకు వాటిని ధన రూపములోనికి మార్చుకొని, అక్కడి వెళ్ళిన తరువాత తమ పండుగకు అవసరమైన వాటిని కొనుగోలు చేసుకోవచ్చునని వారికి సూచించబడెను:

ప్రతి సంవత్సరమున నీ విత్తనముల పంటలో దశమ భాగమును అవశ్యముగా వేరుపరచవలెను.

మార్గము దీర్ఘముగానున్నందున, అనగా యహువః తన నామమునకు నివాసస్థానముగా ఏర్పరచుకొను స్థలము మిక్కిలి దూరముగా నున్నందున,

నీవు వాటిని మోయ లేనియెడల నీ ఎలోహీం అయిన యహువః నిన్ను ఆశీర్వదించునప్పుడు, వాటిని వెండికి మార్చి ఆ వెండిని చేత పట్టుకొని,

నీ ఎలోహీం అయిన యహువః యేర్పరచుకొను స్థలమునకు వెళ్లి నీవు కోరు దేనికైనను, ఎద్దులకేమి గొఱ్ఱెలకేమి ద్రాక్షారసమునకేమి మద్యమునకేమి నీవు కోరు దానికి ఆ వెండి నిచ్చి, అక్కడ నీ ఎలోహీం అయిన యహువః సన్నిధిని భోజనముచేసి, నీవును నీ యింటివారును నీ యింటనుండు లేవీయులును సంతోషింపవలెను.(ద్వితీయోపదేశకాండము 14:22-26)

క్రైస్తవులు మద్యం సేవించవచ్చా?క్రైస్తవులు మద్యం సేవించవచ్చా? యహువః మనుష్యులతో వారు ఎక్కడ ఉన్నారు అనే దాని ఆధారంగా పనిచేయును. వారు నడవగలిగినంత దానికంటె వేగంగా ఆయన వారిని నడిపించడు. సున్నితత్వం మరియు కనికరంతో, ఆయన వ్యక్తిగత మనస్సులను అవి గ్రహించగలిగినంత సత్యానికి నడిపించును. “ఆ అజ్ఞానకాలములను ఎలోహీం చూచి చూడనట్టుగా ఉండెను; ఇప్పుడైతే అంతటను అందరును మారుమనస్సు పొందవలెనని మనుష్యులకు ఆజ్ఞాపించుచున్నాడు” (అపొస్తలుల కార్యములు 17:30). యహువః అజ్ఞానంలో ఉన్నవారిని జ్ఞానంలోనికి పిలుచు క్రమంలో, ఆయన మనుష్యులందరిని నీతి యొక్క అత్యున్నత ప్రమాణాల యొద్దకు పిలిచాడు. ఇశ్రాయేలీయులు ద్రాక్షారసాన్ని లేదా మద్యాన్ని త్రాగుటకు కలిగియున్న కోరికను యహువః ధృవీకరించినప్పటికీ, అది నిర్దిష్ట సమయాలలో మాత్రమే మరియు అది మత్తునకు దారితీయునంత మొత్తంలో కాదు.

మనస్సు మత్తులో ఉన్నప్పుడు, అది స్పష్టంగా ఆలోచించలేదు. అందువలన, పవిత్రాత్మ యొక్క నిశ్శబ్ద స్పర్శను గ్రహించుట సాధ్యం కాదు. విశ్వం యొక్క అధిపతి తన పిల్లలతో బిగ్గరగా మాట్లాడడు. ఏలియా హోరేబు పర్వతమునకు పారిపోయినప్పుడు యహువః గాలిలో గాని, లేక భూకంపంలో గాని, లేక అగ్నిలో గాని లేడని, మరియు ఒక స్థిరమైన చిన్న చిన్న స్వరంలో ఆయన ఉన్నాడని నేర్చుకున్నాడు. ఇంద్రియాలను మొద్దుబార్చు ఏదైనా, యహువః యొక్క స్థిరమైన చిన్న స్వరాన్ని నిశ్శబ్దపరచును. ఒక వ్యక్తి కొంచెము మత్తులో ఉన్నప్పుడు కూడా, అతని ఇంద్రియాలు ప్రభావితమౌతాయి. అతడు హేతుబద్ధంగా ఆలోచనచేయు తన సామర్థ్యాన్ని కోల్పోతాడు. ఒక వ్యక్తి మద్యం ప్రభావంతో ఇతరులకు చేసిన చర్యలకు మరియు తప్పులకు అతడే బాధ్యత కలిగి యుంటాడు.

మద్యపానానికి పూర్తి వ్యతిరేకంగా లేఖనం హెచ్చరికలను కలిగియుండెను: “ద్రాక్షారసము వెక్కిరింతల పాలుచేయును మద్యము అల్లరి పుట్టించును దాని వశమైనవారందరు జ్ఞానములేనివారు” (సామెతలు 20:1). మద్యపానం ఒక వ్యసనమై యున్నందున, చాలా మంది ప్రజలు మొదట్లో "సాంఘిక త్రాగుడు" గానే ప్రారంభించినప్పటికీ అంతిమంగా, వారికి తెలియకుండానే, మద్యపానానికి వ్యసనపరులగుదురు.

సమ్సోను పుట్టుక కోసం వారిని సిద్ధం చేయుటకు మనోహ మరియు అతని భార్య యొద్దకు ఒక దేవదూత పంపబడినప్పుడు, పరలోకం నుండి ఉపదేశము స్పష్టంగా ఉన్నది: “కాబట్టి నీవు జాగ్రత్తగా ఉండి, ద్రాక్షారసమునేగాని మద్యమునేగాని త్రాగకుండుము, అపవిత్ర మైన దేనినైనను తినకుండుము. నీవు గర్భవతివై కుమారుని కందువు. అతని తలమీద మంగలకత్తి వేయకూడదు; ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని ఎలోహీంకి నాజీరు చేయబడినవాడై..” (న్యాయాధిపతులు 13: 4, 5, KJV)

మద్యం కారణంగా ఇంట్లో సమస్యలుమద్యపానం కారణంగా కుటుంబంలో ఇబ్బందులు తలెత్తుతాయి. మెస్సీయకు ముందు రావలసిన దూత ఎలీసబెతుకు జన్మించునని ఆమె భర్తయైన జెకర్యాకు గబ్రియేలు దూత తెలియజేసినప్పుడు పై ఆదేశం పునరావృతమయ్యింది: “నీ భార్యయైన ఎలీసబెతు నీకు కుమారుని కనును, అతనికి యోహాను అను పేరు పెట్టుదువు. అతడు అదోనాయ్ దృష్టికి గొప్పవాడై, ద్రాక్షారసమైనను మద్యమైనను త్రాగక, తన తల్లిగర్భ మున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనినవాడై..” (లూకా 1:13-15)

మద్యపానం యొక్క వినియోగం ఎప్పటికీ యహువఃకు పూర్తిగా సమర్పించుకొనుటకు అనుమతి నివ్వదు. నజారైట్ ప్రమాణాలను తీసుకున్న వ్యక్తులు ఆ ప్రమాణం పూర్తియగు వరకు మద్యం సేవించరు ఒకవేళ అలా చేస్తే వారి ప్రమాణం విచ్ఛిన్నమవును. పరిశుద్ధతతో సన్నిహిత సామరస్యాన్ని కోరువారి ద్వారా మద్యం ఎల్లప్పుడూ త్యజించబడుతుంది. బైబిలులో ఒక వ్యక్తి తన తరువాతి తరాలవారు ఎప్పటికీ మద్యపానం నుండి దూరంగా ఉండాలని ముందుగానే తన సంతానానికి ఆజ్ఞాపించెను! రెండు వందల సంవత్సరాల తరువాత, అతని వారసులు, తమకు ద్రాక్షారసము అందించినప్పుడు ఇలా చెప్పారు:

మేము ద్రాక్షారసము త్రాగము: మా పితరుడగు రేకాబు కుమారుడైన యెహోనాదాబు మీరైనను మీ సంతతి వారైనను ఎప్పుడును ద్రాక్షా రసము త్రాగకూడదని మాకాజ్ఞాపించెను గనుక మేము ద్రాక్షారసము త్రాగము. మరియు మీరు ఇల్లు కట్టుకొనవద్దు ..., కావున మా పితరుడైన రేకాబు కుమారుడగు యెహోనాదాబు మాకాజ్ఞాపించిన సమస్త విషయములలో అతని మాటనుబట్టి మేముగాని మా భార్యలుగాని మా కుమారులుగాని మా కుమార్తెలుగాని ద్రాక్షారసము త్రాగుటలేదు…. ద్రాక్షా వనములుగాని పొలములుగాని సంపాదించుటలేదు, విత్తనమైనను చల్లుటలేదు .. (యిర్మీయా 35: 6-9, KJV)

మద్యం త్రాగుటను కోరుకొనువారు ఎవరును యహువఃతో ఏకత్వాన్ని వెదకరు. యహువఃతో ఏకమైనవారు ఆయన ఆత్మతో నిండిపోవుదురు. వారు పరిశుద్ధాత్మ యొక్క చిన్న స్వరాన్ని ఆటంకపరుచు, లేక కలుషితం చేయు, లేక నిలువరించే ప్రతిదానిని ప్రక్కకు నెట్టివేయుదురు. “మీరు ఎలోహీం ఆలయమైయున్నారనియు, ఎలోహీం ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరెరుగరా? ఎవడైనను ఎలోహీం ఆలయమును పాడుచేసినయెడల ఎలోహీం వానిని పాడుచేయును. ఎలోహీం ఆలయము పరిశుద్ధమైయున్నది; మీరు ఆ ఆలయమైయున్నారు.” (మొదటి కొరింథీయులకు 3:16, 17 చూడండి.)

మద్యం గూర్చి ఆలోచిస్తున్న మనిషిలేఖనాలలో యహూషువః యొక్క చివరి మాటలు ఇలా హెచ్చరిక చేయుచండెను: “ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. వానివాని క్రియచొప్పున ప్రతివాని కిచ్చుటకు నేను సిద్ధపరచిన జీతము నాయొద్ద ఉన్నది.” (ప్రకటన గ్రంథము 22:12). ప్రతి వ్యక్తి జీవితంలో ఒక పరీక్ష చేయబడుతుంది. రహస్య ఆలోచనలు, దాచిన ఉద్దేశ్యాలు విశ్వ వీక్షకుని ముందు బహిరంగ పరచబడతాయి. ప్రతి వ్యక్తికి ప్రతిఫలము నిర్ణయించబడుతుంది. విమోచకునితో తమ జీవితాలను ఏకత్వం లోనికి తీసుకువచ్చినవారి పేర్లు జీవగ్రంథంలో వ్రాయబడతాయి. అలాగే, ఓడిపోయిన వారికి, తమ శిక్ష గ్రంథాలలో చేర్చబడుతుంది: శాశ్వత మరణం. “మరియు సమాధులలో నిద్రించు అనేకులు మేలుకొనెదరు; కొందరు నిత్యజీవము అనుభవించుటకును, కొందరు నిందపాలగుటకును నిత్యముగా హేయులగుటకును మేలుకొందురు.” (దానియేలు 12:2).

నిత్యజీవం జీవించేవారందరూ గంభీరమైన తీర్పును నిజంగా ఎదుర్కోవలసి వస్తుంది. క్షమింపబడుటకు, వారు మొదట పశ్చాత్తాపపడి, పాపాన్ని విడిచిపెట్టాలి. ఇది ప్రాయశ్చిత్తార్థ దినం కోసం హృదయాలను సిద్ధం చేయుటకు ఖచ్చితంగా చేయవలసిన పని.

ప్రాయశ్చిత్తార్థ దినం పశ్చాత్తాపపడుతున్న పాపులను యహువః తో ఐక్యం చేయుటకు ఉద్దేశించబడినది. కానీ పరిశుద్ధ తండ్రితో ఐక్యమవుటకు దీనమైన హృదయము మరియు ఆత్మ-అన్వేషణ అవసరమై యున్నది.

ఇది ఇప్పటికీ క్రియ చేస్తుంది. ప్రాచీన ఇశ్రాయేలీయులు తమను తాము "దఃఖపెట్టుకొని" యున్నట్లు గానే, నేడు యహువఃతో ఐక్యమవ్వాలనుకొనే వారందరు అలా చేయవలసి యున్నారు. ప్రాచీన ఇశ్రాయేలీయులలో ఎవ్వరును ప్రాయశ్చిత్తార్థ దినమునకు నడిపించు ముందటి/ గౌరవప్రదమైన దినాలలో మద్యం సేవించరు. ప్రతివాడు తన హృదయాన్ని దఃఖపరచుకోవాలి, తన పాపాలు తొలగిపోయే క్రమంలో ఏ అడ్డంకులు లేవని నిర్ధారించుకోవాలి. ఈ పవిత్రమైన హృదయ-పరిశీలన కార్యములో పాలుపొందనివారు ఇశ్రాయేలు ప్రజలలో నుండి కొట్టివేయబడుదురు.

ప్రాచీన ఇశ్రాయేలీయులకు చేయబడిన గంభీరమైన హెచ్చరిక నేడు ఆధ్యాత్మిక ఇశ్రాయేలు కొరకు ప్రతిధ్వనిస్తుంది:

ఆ దినమున ఏడ్చుటకును అంగలార్చుటకును తలబోడి చేసికొనుటకును గోనెపట్ట కట్టుకొనుటకును సైన్యములకధిపతియు అదోనాయ్ అగు యహువః మిమ్మును పిలువగా, రేపు చచ్చిపోదుము గనుక తిందము త్రాగుదము అని చెప్పి, యెడ్లను వధించుచు గొఱ్ఱెలను కోయుచు మాంసము తినుచు ద్రాక్షారసము త్రాగుచు మీరు సంతోషించి ఉత్సహించుదురు

సైన్యముల కధిపతియునగు యహువః నాకు ప్రత్యక్షుడై నాకు వినబడునట్లు ఇట్లనుచున్నాడు; మీరు మరణము కాకుండ ఈ మీ దోషమునకు ప్రాయశ్చిత్తము కలుగదని అదోనాయ్ యును సైన్యములకధిపతియునగు యహువః ప్రమాణ పూర్వకముగా సెలవిచ్చుచున్నాడు. (యెషయా 22: 12-14 చూడండి.)

శాశ్వత జీవితాన్ని కోరుకుంటున్న వారందరూ మద్యపానాన్ని మరియు ప్రతి ఇతర మనస్సును-మొద్దుబార్చు, పాప-వ్యసనపు అభ్యాసాలను ప్రక్కన పెట్టుదురు. ఈ గొప్ప సాదృశ్య రూపకమైన ప్రాయశ్చిత్తార్థ దినములో యహువఃతో ఏకమవుట అనేది వారి ఏకైక లక్ష్యమై ఉంటుంది. “నేను రక్షించబడుటకు నేను చేయగలిగిన కనీస పని ఏమిటి?” అని అడుగుటకు బదులుగా, “యహువః యొక్క చిత్తమేమిటి? నేను ఆయనతో ఎలా ఏకమవ్వగలను?” అని అడగవలసిన సమయం ఆసన్నమైనది.

“మనముకూడ ప్రతిభారమును, సుళువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి …. మన యెదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరుగెత్తుదము. (హెబ్రీయులకు 12: 2)

నేడు మరియు ప్రతి రోజు, పవిత్రతను వెతకుము. మీకును మరియు మీ సృష్టికర్తకు మధ్య ఉన్న దేనినైనను మరియు ప్రతిదానిని ప్రక్కన పెట్టండి. యహువఃతో ఏకమవ్వండి.

మద్యాన్ని నిరాకరించుట