Print

ఎక్లేసియాలో స్త్రీ పాత్ర

ఇది WLC యేతర వ్యాసం. బయటి రచయితల వనరులను ఉపయోగించినప్పుడు, బైబిలుకు మరియు డబ్ల్యుఎల్‌సి ప్రస్తుత నమ్మకాలకు 100% అనుగుణంగా ఉండెనని భావించిన వాటిని మాత్రమే మేము ప్రచురిస్తాము. కాబట్టి అలాంటి వ్యాసాలను డబ్ల్యుఎల్‌సి నుండి నేరుగా వచ్చినట్లుగా పరిగణించవచ్చు. యహువః యొక్క అనేక మంది సేవకుల పరిచర్య ద్వారా మేము ఎంతగానో ఆశీర్వదించబడ్డాము. అయితే ఈ రచయితల యొక్క ఇతర రచనలను అన్వేషించమని మేము మా సభ్యులకు సలహా ఇవ్వము. అటువంటి రచనలు, లోపాలను కలిగి ఉన్నందున మేము వాటిని ప్రచురణల నుండి మినహాయించాము. విచారకరంగా, లోపం లేని మంత్రిత్వ శాఖను మనం ఇంకనూ కనుగొనలేదు. డబ్ల్యుఎల్‌సి వి కాని కొన్ని ప్రచురించబడిన వ్యాసాలు / ఎపిసోడ్లు చూసి మీరు దిగ్బ్రాంతి చెందినచో, సామెతలు 4:18 జ్ఞాపకం చేసుకోండి. మన మార్గంలో మరింత కాంతి వెలువడు కొద్దీ ఆయన సత్యాన్ని గూర్చిన మన అవగాహన అభివృద్ధి చెందుతూ ఉంటుంది. మేము సత్యాన్ని ప్రాణం కంటే ఎక్కువగా ఆదరిస్తాము మరియు అది దొరికిన చోటు ఏదైనా అక్కడ వెతుకుతాము.

ఎక్లేసియాలో మహిళల పాత్ర

ఇది గృహము మరియు ఎక్లేసియాలో పురుషులు మరియు మహిళలు ఇద్దరికీ సంబంధించిన మరియు విడదీయరాని పాత్రలను పరిశీలిస్తుంది. అద్భుతమైన ఆశీర్వాదాలతో తన ఉద్దేశ్యాన్ని నెరవేర్చడానికి యహువః మనల్ని సృష్టించాడు, కానీ మన సాంస్కృతిక మనస్తత్వం గ్రంథంపై మన అవగాహనను తారుమారు చేసింది. చాలా సందర్భాలలో, స్త్రీ పురుషుల పాత్రలు తారుమారు చేయబడ్డాయి. మనం యహువః ఉద్దేశించిన ఉద్దేశాలను నెరవేర్చేవరకు మనం శాంతిగా ఉండలేము.

ఇక్కడ, మనం గ్రంథం ప్రకారం కుటుంబం మరియు ఎక్లేసియాలో స్త్రీ స్థానాన్ని పరిశీలిద్దాము. అప్పుడు పురుషుని పాత్ర చాలా స్పష్టంగా కనిపిస్తుంది మరియు నేటి ‘ఉమెన్ లిబ్/స్త్రీ విముక్తి' ఉద్యమం మొదలుకొని అపహాసకుల అనివార్యమైన అవహేళనలు వరకు యహూషువఃలో అందించబడిన స్వేచ్ఛ ఎదుట వాడిపోతాయి.

ఆదియందు

మొదటి నుండి ఆదాము/మనిషి పాత్ర.

ఆదికాండము 1:26.

ఎలోహిమ్ ఆదామును తన స్వరూపమందు సమస్త సృష్టిని ఏలునట్లుగా చేసాడు, కానీ అతనికి 'సాటియైన సహాయం' లేదు.

ఆదికాండము 2:18.

ఆదాము జీవరాశులపై తన అధికారాన్ని రుజువు చేస్తూ వాటికి పేర్లు పెట్టాడు.

ఇలాంటి ఉదాహరణలు:- యాకోబుకు ఇశ్రాయేలు అని పేరు మార్చబడింది, అబ్రాము అబ్రాహాము అయ్యాడు, యహువః అతని కుమారునికి "యహూషువః" అని పేరు పెట్టారు, తల్లిదండ్రులు తమ పిల్లలకు పేర్లు పెడతారు, యహూషువః సీమోనుకు కేఫా/పేతురు అని పేరు మార్చారు. తనకంటే గొప్పవాడు లేడు కాబట్టి యహువః తన పేరు తానే పెట్టుకున్నాడు. అయితే, మనిషి ఆయన పేరు మార్చటం ద్వారా (అడోనై, ప్రభువు, దేవుడు మొదలైనవి) ఆయనకంటే గొప్పవానిగా ఔన్నత్యాన్ని కోరుకుంటాడు.

ఆదాముకి 'సాటియైన సహాయం’ లేనందున చూపబడిన పరిష్కారం - హవ్వ.

ఆదికాండము 2:21-24 పురుషునికి స్త్రీ యహువః యొక్క అత్యంత శ్రేష్ఠమైన బహుమానం మరియు ఇప్పటికీ యహువఃకు కృతజ్ఞత తెలుపుటలో భాగంగా స్త్రీని ప్రేమించాలి మరియు గౌరవించాలి.

ఆదాము ఆమెకు "స్త్రీ" (హీబ్రూ: ఇషా), హవ్వ ("చావా", ఆది. 3:20లో) అని పేరు పెట్టాడు. ఆమె పురుషుని యొక్క "సహాయం" మరియు అతనిపై ఎప్పుడూ అధికారం కలిగి ఉండకూడదు. ఆమె తాను ఉద్దేశించబడినదాన్ని అర్థం చేసుకోవడంలో ఆమెకు ఎలాంటి సమస్య లేదని మనము నిశ్చయించుకోవచ్చు. ఆమె తన భాగాన్ని నెరవేర్చినట్లయితే, ఆమెకు సమానమైన బహుమతి లభిస్తుంది (సంఖ్యాకాండము 31:26-27, 1సమూ 30:24).

ప్రేమగల జంట

వారు అవిధేయలైరి మరియు పడిపోయిరి.

యహువః యెడల అవిధేయత ఇప్పటివరకు ఎన్నడూ లేని అత్యంత విస్తారమైన వినాశనాన్ని తెచ్చిపెట్టింది. అది మన పాపాల కోసం యహువః మొదటి కుమారుడైన యహూషువః మరణాన్ని బలవంతం చేసింది.

ఆదికాండం 3:1-15.

మత్తయి 4:1-10 లో యహూషువః చేసినట్లే, హవ్వ యహువః మాటలను ఉదహరిస్తూ చక్కగా ప్రారంభించింది. అయితే, తాను సృష్టించబడిన స్థాయి కంటే పైకి (యహువఃలా, “అత్యున్నతమైనవానిలా”) ఎదగగలదనే శోధనకు ఆమె లొంగిపోయి, (యెషయా 14:14) ప్రపంచ వినాశనానికి కారణంగా మారింది. ఆమె “తనతో పాటు తన భర్తకు కూడా ఇచ్చింది, మరియు అతడు కూడా తిన్నాడు” ఆదాము ఇదంతా సాక్ష్యమిచ్చాడు. అతడు ఈ పరిస్థితిలో ఆమె చర్యలపై పెత్తనం తీసుకొనుటలో, అధిగమించడం మరియు రద్దుచేయడంలో విఫలమయ్యాడు. 1 తిమోతి 2:14.

పిల్లలను కనడంలో పురుషుడి పాత్ర ఉంది, అయితే సాతానుపై విజయం సాధించే వాగ్దానం స్త్రీకి ఇవ్వబడింది. యహూషువః స్త్రీకి కన్యా-జన్మమున జన్మించినందున యహువఃను తనకు తండ్రిగా కలిగి ఉన్నాడు. సర్పముపై తన ఆధిపత్యాన్ని ప్రదర్శించడంలో ఆదాము విఫలమయ్యాడు, కానీ యహూషువః లొంగలేదు మరియు గాయపడినప్పటికీ, ఆయన అన్ని ప్రలోభాలను అధిగమించాడు. అందువల్ల ఆయన సమస్త శక్తిని మరియు అధికారాన్ని పొందుటకు అర్హుడు (మత్తయి 28:18). సాతాను ఈ ప్రపంచానికి అధిపతి కావచ్చు, కానీ మెస్సీయనందు తిరిగి మనకు అతనిపై మళ్లీ అధికారం ఉంది - లూకా 10:19, కొలస్సీ 2:12, 2 తిమోతి 2:11. విచారకరంగా, కొందరు సాతాను పిల్లలుగా ఉండుటను ఎంచుకుంటారు - 1 యోహాను 3:8-10.

ఎలోహిమ్ పిల్లలను కనడం అనేది వివాహం విషయంలోని యహువః సంకల్పం, దీనిలో పురుషులు మరియు మహిళలు సహకరించుకోవాలి తప్ప అడ్డంకులు కాకూడదు. (మలాకీ 2:13-16).

నేటి విడాకుల రేటు మనం తప్పుగా అర్థం చేసుకున్న “యహువః చిత్తానికి” స్పష్టమైన సాక్ష్యం - ఒక పురుషుడు యహూషువఃలా (ఎఫెసీయులు 5:25) మరియు అతని వధువు అయిన స్త్రీ ఎక్లేసియాలా ఉండాలి. (ఎఫెసీయులకు 5:22). ఇది యహువః రాజ్యాన్ని నిర్మించడం మరియు అపవాది క్రియలను నాశనం చేయడం.

ఆదికాండము 3:16 స్త్రీ తన భర్త అధికారం క్రింద ఉండాలని స్పష్టం చేస్తుంది. ఆదాము యొక్క పేలవమైన నిర్ణయం శిక్షకు కారణమయింది ఎందుకంటే అతను "తన భార్య యొక్క మాటను విన్నాడు. (ఆది. 3:17-19). అయితే, తన భార్య లేదా కుమార్తె యొక్క నిర్ణయాలను మార్చుటకు/నిరాకరించుటకు పురుషునికి అధికారం ఉంది. (సంఖ్యాకాండము 30:3-13).

గ్రంథంలో భర్తను "బహల్" (హీబ్రూ పదం #1166) లేదా భార్యపై యజమాని/అధికారిగా చూస్తాము.

సామెతలు 12:4- (కెజెవి) సద్గుణం గల <2428> స్త్రీ <802> [ఆమె] తన భర్తకు <5850> <1167> కిరీటం <1167>: అయితే సిగ్గుతెచ్చునది <954> <8688> అతని ఎముకలకు <6106> [ఆమె] కుళ్ళు <7538>.

"భర్త" అని అనువదించబడిన ఈ పదం స్ట్రాంగ్స్ లెక్సికాన్‌లోని హీబ్రూ పదం #1167 "బహల్" అంటే "మాస్టర్, అందుకే భర్త లేదా (అలం.) యజమాని." ఇది KJVలో 14 సార్లు "యజమాని"గా అనువదించబడింది.

ఒక పురుషుడు తన భార్యకు "యజమాని/అధికారి", మరియు నీతిమంతుడైన భర్త ఆమెను గౌరవంగా/మర్యాదగా/ఆదరణగా చూస్తాడు. యహూషువః "పెండ్లికుమారుడు", పురుషులు, స్త్రీలు, పిల్లలు- ఎక్లేసియా, "వధువు", ఆయన దాన్ని తన ప్రాణమిచ్చి కొన్నాడు: 1 కొరింథీయులు 6:19-20. స్త్రీపై పురుషుని అధికారం ఈ స్థిరమైన వాస్తవం ఫలితంగా కలిగినది.

నవ్వుతున్న వధువు

“కొత్త నిబంధన?”

"క్రొత్త నిబంధన"లో, స్త్రీ "విముక్తి పొందెను" అని, ఆమె ఎక్లేసియాలో నాయకత్వ పాత్రను పోషించవచ్చని మరియు వివాహం బంధంలో పురుషునితో సమానమైన అధికారాన్ని కలిగి ఉంటుందని కొందరు వాదిస్తారు. కానీ "పాత నిబంధన" కు విరుద్ధంగా "కొత్త నిబంధన" లేఖనాలు లేవు. బదులుగా, "పాత నిబంధన"కు మద్దతు ఉంది:

1 పేతురు 3:5-6 / ఆదికాండము 18:12 శారా అబ్రహామును "అడోనై" అని పిలుస్తుంది, అంటే "నా యజమానుడని". అలాగే, “శారా అబ్రాహాముకు విధేయత చూపింది.” పైన 1 పేతురు 3:6లోని “లోబడుట” అనే పదం స్ట్రాంగ్స్ పదం #5219. "లోబడుట" అనే పదం "విధేయత"తో సమానం. పురుషుడు ఇంకా అధికారంలో ఉన్నాడు.

ఇవి కూడా చూడండి - కొలొస్సీ 3:18, తీతు 2:3, ఎఫెసీయులు 5:22.

పురుషులు “ఉదాహరణతో/మాదిరిగా నాయకత్వం వహించాలి - యహూషువఃలా ఉండాలి, ఆయన సేవ చేయడానికే గానీ సేవ చేయించుకోవడానికి రాలేదు!

ఎఫెసీయులు 5:23, 24, 1 కొరింథీయులు 11:3.

స్త్రీ పాత్ర చాలా ముఖ్యమైనది/ప్రాముఖ్యమైనది. వివాహం మరియు ఎక్లేసియాలో పురుషుడు & స్త్రీ యొక్క విధులు విడదీయరానివి. వీటిలో ఏది వేరుగా ఉన్నా చివరికి ఏదేనులో కనిపించే అదే విపత్తుకు దారి తీస్తుంది. దాని వల్ల భూమి అంతా మూలుగుతూ ఉంటుంది.

సంఘములో మౌనంగా ఉండుట

1 కొరింథీయులు 14:34 వివాదాస్పద లేఖనాలలో ఒకటి, ఎందుకంటే ఇది "స్వేచ్ఛ పొందిన" స్త్రీలు మరియు బలహీనమైన పురుషుల సంస్కృతికి విరుద్ధంగా ఉంది. స్త్రీలు సంఘంలో మౌనంగా ఉండడానికి కారణం వారు పురుషునికి "లోబడటమే". సంఘాన్ని పురుషులు నడిపించునట్లు కాకుండా తన ప్రశ్నతో సంఘాన్ని నడిపించే బాధ్యతను ఆమె తీసుకోవాలి. పురుషులు సంఘం/కుటుంబం/ప్రపంచాన్ని యహువః చిత్తానికి అనుగుణంగా నడిపించాలి.

స్త్రీలు పాడవచ్చు, గ్రంథం చదవవచ్చు మరియు ప్రవచించవచ్చు.

ఒక స్త్రీ పాడవచ్చు, లేఖనాలను బిగ్గరగా చదవవచ్చు, ప్రవక్తలా మాట్లాడవచ్చు “యహువః ఇలా సెలవిచ్చెను” - కానీ సంఘానికి అంతరాయం కలిగించరాదు. (1 కొరింథీయులు 14:31-32).

1 కొరింథీయులు 14:20 పురుషులు ముఖ్యంగా అన్ని విషయాలలో యహువః చిత్తానికి అనుగుణంగా ఉండాలి.

1 తిమోతి 2: 8-14 పాటించవలసిన సూత్రాలను తెలియజేస్తుంది. స్త్రీ యొక్క వినయపూర్వకమైన హృదయం దుస్తులు ధరించే విధానంలో వ్యక్తమవుతుంది - యహువః ఆజ్ఞలను నెరవేర్చే సాత్వికమైన ఆత్మతో.

అల్పాహారం వద్ద కుటుంబం

1 తిమోతి 2:15 యహువః స్త్రీకి పిల్లలను కనడం మరియు పోషించడం వంటి వాటిని అనుగ్రహించాడు.

యహువః ఆశీర్వదించిన దాసురాళ్లు

లూకా 1:38, 46 - 48 మిరియం/మరియ యహువః యొక్క దాసురాలు. అంటే గ్రీకులో "ఆడ దాసీ". ఆమె ఉదాహరణను అనుసరించండి మరియు యహువః తన ఆత్మను మీపై కుమ్మరిస్తాడు-అపొస్తలుల కార్యములు 2:17-18.

గర్వంగా ఉన్న మహిళలు, 'ఆత్మతో నింపడిన' అని చెప్పుకుంటూ, సంఘాల్లో పురుషులను నడిపించడానికి ఎంచుకుంటారు. మరియ ఎప్పుడూ బోధక పాత్రను పోషించలేదు. ఆమె వినయం మరియు సమర్పణ ఆశీర్వాదాన్ని తెచ్చింది.

దెబోరా ప్రవక్తి

"ఉమెన్స్ లిబ్/స్త్రీ విముక్తి" ఉద్యమాలు దెబోరా కథను ఉదహరిస్తూ సంఘంలో తమ నాయకత్వాన్ని సమర్థించుకోవడానికి ప్రయత్నిస్తాయి, అయితే ఆమె "యహువః సెలవిచ్చునదేమనగా" అని ప్రకటించడానికి హక్కు కల్పించబడిన ఒక ప్రవక్తి.

న్యాయాధిపతులు 4:4-9 బారాకును ‘పిరికివాడు’గానూ, దెబోరాను ‘అనుకూలమైన’ న్యాయమూర్తిగానూ వర్ణించాయి.

న్యాయాధిపతులు 5:2-9 దెబోరా మానవ నాయకత్వ పాత్రను గుర్తిస్తుంది. ఆమె ప్రవక్తగా యహువః మాటను మాత్రమే మాట్లాడింది. యాబీనును పడగొట్టడానికి యహువః బారాకును తీసుకువచ్చాడు, నాయకులు తమ పాత్రను స్వీకరించినప్పుడు దెబోరా సంతోషించింది.

మహిళలు నాయకత్వ పాత్రలో ఉండటం ఎంతమాత్రం అనర్హమైనది అని యహువః ప్రకటించాడు:

యెషయా 3:12లో- బాలురు బాధపెట్టువారిగాను మరియు స్త్రీలు పాలకులుగా వర్ణించబడ్డారు. స్త్రీలు పాలకులుగాను, బాలురు అణచివేయువారిగాను కావాలని ఆయన ఎప్పుడూ అనుకోలేదు.

అకులా, ప్రిస్కిల్లా

అపోస్తలుల కార్యములు 18:24-26 అకుల మరియు ప్రిస్కిల్లా భార్యాభర్తల బృందం. ప్రిస్కిల్లా తన భర్తకు సహాయంగా మరియు మద్దతుగా ఉండే తన పాత్రను విడిచిపెట్టినట్లు ఏమీ సూచించలేదు.

స్త్రీ అపొస్తలులు ఉన్నారా?

రోమా 16:7 సంఘంలో మహిళల లిబ్/విముక్తి ఉద్యమాన్ని సమర్థించదు. ఈ వాక్యం అంద్రొనీకు మరియు యూనీయ "అపొస్తలులు" అని మరియు "యూనీయ" ఒక స్త్రీ అని రుజువు చేస్తుందని కొందరు అంటున్నారు. అక్కడ వారు అపొస్తలులని చెప్పబడలేదు. వారు ‘అపొస్తలులలో ప్రముఖులు’ అని అది చెబుతోంది. అలాగే, వారు అపొస్తలుల దృష్టిలో గుర్తించదగినవారు. గ్రీకు వ్యాకరణం ఈ అవగాహనకు మద్దతు ఇస్తుంది. అలాగే, "యూనీయ" (గ్రీకు. జూనియాస్) అనేది పురుషని పేరో లేదా స్త్రీపేరో అనేది స్పష్టంగా లేదు.

యహూషువః నందు, అందరూ ఏకముగా.

నవ్వుతున్న మహిళలు

గలతీయులకు 3:27 కొందరు ఈ వచనాన్ని ఉపయోగించి సంఘంలో స్త్రీలు పురుషులతో సమానం అని ముగించారు.

"యహూషువః నందు అందరూ ఏకముగా ఉన్నారు" అంటే ఏమిటి?

యోహాను 17:20-21 లో, మనమందరం "ఏకమైయుండవలెను" అని యహూషువః ప్రార్థించాడు. యహూషువః మరియు యహువఃతో మన ఏకత్వం అనగా మనము వారితో సమానం అని కాదు.

1 కొరింథీయులకు 11:3 లో, స్త్రీలు పురుషుల కంటే తక్కువ కాదు. యహువః దృష్టిలో అందరూ ఆధ్యాత్మికంగా సమానులే. వారు కేవలం వివిధ పాత్రలు/కర్తవ్యాలను కలిగి ఉంటారు.

లూకా 10:2లో, రెండు లింగముల‌ పనివారు తమ పాత్రలను అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నారు. అతని పరిచారకురాళ్లు సౌమ్యులు, శాంతమూర్తులు, పవిత్రులు, గృహనిర్వాహకులు, తమ భర్తలకు లోబడి ఉంటారు - మరియు మొదటి పునరుత్థానంలో గొప్ప ప్రతిఫలం పొందుతారు.

ఉపచారక స్త్రీలు

ప్రార్థిస్తున్న మహిళలు

మత్తయి 27:55లో, ఈ వచనంలో “ఉపచారము” అనే పదం ఇతర వచనాలలో “పరిచారకులు” అని అనువదించబడిన అదే గ్రీకు పదం. ఎక్లేసియాలో "పరిచారకురాలు" గా ఉండటం అంటే ఆమె పురుషులపై నాయకత్వం వహిస్తుందని లేదా బోధిస్తుందని కాదు.

రోమా 16:1లో, పౌలు మరియు ఇతర సహోదరులకు సహోదరి ఫిబే గొప్ప ‘సహాయం’ చేసెను. ఆమె పౌలుకి నాయకురాలు/బోధకురాలు కాదు. ఫిబే సహోదరులకు ఆశ్రయం ఇవ్వడానికి మరియు సహాయం చేయడానికి వివిధ మార్గాల్లో పరిచర్య చేసింది.

"diakoneo/ఉపచారము" కూడా క్రింద ఉపయోగించబడింది -

లూకా 8:1, ఈ స్త్రీలు తమకు కలిగిన ఆస్తిని యహూషువఃకు ‘సహాయంగా’ ఉపచారము చేయడానికి ఉపయోగించారు.

లూకా 4:38-39 సీమోను అత్తగారు "వారికి సేవ చేసారు/ఉపచారము చేసారు". ఆమె తన అతిథులకు భోజనం వండింది/సిద్ధం చేసింది.

అపొస్తలుల కార్యములు 9:36–39 దొర్కా చేసిన మంచి పనులకు ఒక రుజువు. ఆమె తయారు చేసిన బట్టలు - సభకు ఆశీర్వాదం.

మెస్సీయలో మంచి పనులు

1 తిమోతి 5:9 స్త్రీలు చేసే కొన్ని మంచి పనులను ఎత్తి చూపుతోంది:

[a] పిల్లలను పెంచడం.

ఎక్లేసియాకు మాతృత్వం ఒక పరిచర్య శాఖ! సంఘం క్రమమైన గృహాలతో నిండియున్నప్పుడు, అది ప్రపంచానికి ఒక లక్ష్యం/అందమైన ఉదాహరణగా ఉంటుంది.

పిల్లలతో అమ్మ

సామెతలు 14:1 స్త్రీ తన ఇంటిని కూల్చివేయగలదు లేదా నిర్మించగలదు, అదేవిధంగా ఒక సంఘాన్ని కూడా. ఆమె మాదిరి ద్వారా పిల్లలు సాతానువలె తిరుగుబాటుదారులుగా ఉండడాన్ని లేదా యహువః బిడ్డలుగా ఉండడాన్ని నేర్చుకుంటారు.

[b] "ఆమె పరిశుద్ధుల పాదాలను కడిగినట్లయితే.. అది ఒక మాదిరి." జంతువులు ఉపయోగించే మురికి రోడ్లపై చెప్పులు ధరించినప్పుడు కాళ్లు/కడుగడం తప్పనిసరి. నేటి మన ప్రయాణ విధానాలు మరియు పూర్తిగా బూట్లు మొదలైన వాటి కారణంగా అది ఈరోజు ప్రశంసించబడలేదు. అయినప్పటికీ, మరొకరి పాదాలను కడుక్కోవడం ఇప్పటికీ వినయాన్ని చూపుతుంది. తన శిష్యుల పాదాలను కడగడంలో యహూషువః సేవ ఉదహరించబడింది.

[సి] "ఆమె సహోదరులకు ఆతిథ్యం ఇస్తే." ఇతరులకు సేవ చేయడం మరియు శుభ్రమైన ఇంటిలో వారి అవసరాలన్నింటినీ తీర్చడం స్వీయ-తిరస్కరణ.

హెబ్రీయులు 13:1-2, అపొస్తలుల కార్యములు 16:14-15, 1 పేతురు 4:9

1 కొరింథీయులకు 16:15-16లో, స్తెఫను ఇంటివారు పరిశుద్ధులకు సేవ చేయుటకు అప్పగించుకున్నారు.

[d] "ఆమె బాధలో ఉన్నవారికి ఉపశమనం కలిగించినట్లయితే" మరియు "ఆమె ప్రతి మంచి పనిని శ్రద్ధగా అనుసరించినట్లయితే."

మత్తయి 25:31-46 లో, ఎక్లేసియాలోని అవసరాలు యహూషువఃకు చాలా వ్యక్తిగతమైనవి. ఈ వచనంలో ఆయన హెచ్చరికను గమనించండి.

సేవ నుండి ఎవరికీ మినహాయింపు లేదు.

మత్తయి 20:27, 28

యహూషువః ఇతరులకు సేవ చేయడంపై దృష్టి సారించాడు. దేహానికి కూడా అదే వర్తిస్తుంది. పీడిత/ఆకలి/బలహీనమైన వారికి ఉపశమనం కలిగించుట. తెరవెనుక పనికి యహువః బహిరంగంగా ప్రతిఫలమిస్తాడు. పురుషులకు బోధించుటకు లేదా వారిని నడిపించుటకు స్త్రీలు ఉద్దేశించబడలేదు. వారు పిల్లలకు మరియు యువతులకు మార్గనిర్దేశం చేయాలి మరియు బోధించాలి:

తీతు 2:1

స్త్రీలు తమ భర్తలను మరియు పిల్లలను ప్రేమించడంలో విఫలమైనప్పుడు, స్వీయ-నియంత్రణ లోపించినప్పుడు, ఇంటి వెలుపల పని చేస్తున్నప్పుడు, అది నిందను తెస్తుంది మరియు యహువః వాక్యాన్ని దూషిస్తుంది. పెద్దవారైన స్త్రీలు ఈ సూత్రాలను చిన్నవారికి బోధించడం చాలా కీలకం, తద్వారా యహువః వాక్యం ఘనపరచబడుతుంది మరియు ఎప్పుడూ దూషించబడదు!

మత్తయి 23:11- మీలో అందరికంటె గొప్పవాడు మీకు పరిచారకుడై యుండవలెను.

పరలోకపు తండ్రి గొప్ప సేవకుడు, ఆయన నిరంతరం మనకు సేవ చేస్తూనే ఉన్నాడు - మనకు జీవాన్ని, సమస్త సృష్టిని, మన రక్షణ కొరకు తన ఏకైక కుమారుడిని కూడా ఇచ్చాడు.

యోహాను 5:19 “కుమారుడు తండ్రి యేది చేయుట కుమారుడు చూచునో, అదే కాని తనంతట తాను ఏదియు చేయనేరడు;

యహూషువః-కేంద్రక సేవా జీవితానికి ధైర్యం అవసరం. పిరికివాళ్లు రాజ్యంలో ప్రవేశించలేరు!

ప్రకటన 21:8- “పిరికివారు అగ్ని గంధకములతో మండు గుండములో పాలుపొందుదురు;

ప్రతి సభ్యుడు తన సరైన పాత్రలో ఉన్నప్పుడు, ఎక్లేసియా గొప్ప శక్తి మరియు కాంతితో ఉద్భవిస్తుంది, ఇది యహువః ఉద్దేశించిన సృష్టిని వెల్లడిస్తుంది:

మత్తయి 5:14-16 పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారియెదుట మీ వెలుగు ప్రకాశింప నియ్యుడి.

అప్పుడు మనము ఇలా వింటాము:

మత్తయి 25:21- భళా, నమ్మకమైన మంచి దాసుడా!

ముగ్గురు మహిళలు


ఈ వ్యాసం తండ్రి యహువః సేవకుడైన బ్రదర్ టామ్ మార్టిన్‌సిక్ రాసిన సుదీర్ఘ వ్యాసం ఆధారంగా రూపొందించబడింది.

మేము అసలు వ్యాసం నుండి సమస్త అన్య నామములను మరియు తండ్రి - కుమారుడు అనే శీర్షికలను తొలగించి, వాటి స్థానాన్ని అసలు నామములతో భర్తీ చేసాము. ఇంకా, ఇక్కడ ఇవ్వబడిన లేఖనాలలో తండ్రి మరియు కుమారుని నామములను బైబిల్ యొక్క మొదటి ప్రేరేపిత రచయితలచే వ్రాయబడిన విధంగా మేము పునరుద్ధరించాము. -డబ్ల్యుఎల్‌సి బృందం.