World's Last Chance

At the heart of WLC is the true God and His Son, the true Christ — for we believe eternal life is not just our goal, but our everything.

At the heart of WLC is the true God and His Son, the true Christ — for we believe eternal life is not just our goal, but our everything.

telugu-test

ఎం. ఎల్. ఆండ్ర్యేసేన్ అని పిలువబడే మిల్యాన్ లౌరిత్జ్ ఆండ్ర్యేసేన్, 1930 మరియు 1940 ల మధ్య కాలంలో సెవెంత్-డే అడ్వెంటిస్టు చర్చి యొక్క గొప్ప పండితులలో ఒకనిగా ఉన్నాడు. సంఘం యొక్క ఒక ప్రముఖ వేదాంతిగా, అతడు సంఘంలో వివిధ స్థానాలలో పనిచేసి, చివరిగా (1941 – 1950) మధ్య చర్చి జనరల్ కాన్ఫరెన్స్ లో కార్యదర్శిగా పనిచేసారు.

1955-1956 లో, జనరల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఆర్. ఆర్. ఫిగఃర్ మరియు ఇద్దరు సువార్త నాయకులు, వాల్టర్ మార్టిన్ [ఆసమయంలో 27 సంవత్సరాల వయసు], డోనాల్డ్ గ్రే బార్నహౌజ్ ల ఉత్తర్వులతో సెవెంత్ డే అడ్వెంటిస్ట్ నాయకుల మధ్య రహస్యంగా సమావేశాలు జరిగినవి. ఈ సమావేశాల యొక్క ఉద్దేశం సెవెంత్-డే అడ్వెంటిస్టు చర్చిని ఇవాంజలికల్సు ఒక ఆచారం వలె కాకుండా ప్రధాన క్రైస్తవ మతంలో భాగంగా అంగీకరించేలా చేయడానికైయుంది (యస్. డి. ఏ చర్చిని వర్గీకరించుట వాడుకగా ఉండుటవలన). ఈ సమావేశాలు ఫలితంగా, సెవెంత్-డే సంఘము క్రీస్తు యొక్క విధానమును, ప్రాయశ్చిత్తము మరియు ఎలెన్ వైట్ యొక్క పరిచర్యపై ఆధారపడియున్న దాని యొక్క ప్రత్యేకమైన సిద్ధాంతాలలోను అనేక మార్పులు చేసెను. అడ్వెంటిస్ట్ చర్చి యొక్క ఈ సిద్ధాంతాల మార్పు విషయంలో జరిగిన ఒప్పందాల కారణంగా సెవెంత్-డే అడ్వెంటిస్టు చర్చిని ఒక క్రైస్తవ మతశాఖవలె వర్గీకరించడానికి దాని నాయకులను అనుమతించినది. ఈ సమావేశాల ఫలితంగా సంఘం "క్వచ్చన్స్ ఆన్ డాక్ట్రిన్" (QOD) అనే పుస్తకంను ప్రచురిచుటకు దారితీసెను, ఆ పుస్తకంలో సెవెంత్-డే అడ్వెంటిస్టు నాయకులు ప్రపంచవ్యాప్తంగా గల అడ్వెంటిస్ట్ సభ్యులకు మొదటిసారి సిద్ధాంతంలో చోటుచేసుకున్న మార్పులను నేర్పుగా (కపటంగా) పరిచయం చేసిరి.

ఈ పుస్తకం విడుదల సంప్రదాయవాద సెవెంత్-డే అడ్వెంటిస్టుల మధ్య గొప్ప గొడవలు రేపెను, మరియు ఆండ్ర్యేసేన్ [అప్పటికి రిటైర్డ్] ఈ పుస్తకానికి వ్యతిరేకంగా నిరసన తెలుపుతూ దాని సిద్ధాంత మినహాయింపులను గూర్చి "అత్యంత సూక్ష్మ మరియు ప్రమాదకరమైన లోపం"1, మరియు "ఒక అత్యంత ప్రమాదకరమైన మతబ్రష్టము"2 వంటి అనేకమైన లేఖలను దాని అధికారులనుద్దేశించి ప్రచురించెను. అధ్యక్షుడు ఫిగఃర్ QOD ప్రచురణను తన పరిపాలన యొక్క అత్యంత అర్థవంతమైన సాఫల్యం" 3 గా చెప్పుకొనెను, ఇది 12 సంవత్సరాలు కొనసాగినది. ఆండ్ర్యేసేన్ సువార్తానాయకులకై చేసిన మినహాయింపుల విషయంలో కఠినంగా నిరసనను కొనసాగించుటవలన, ఫిగఃర్ ఈ క్రింది తన ఘాటైన మాటలను చెబుతూ QOD పై తన వ్యతిరేకతను నిలిపివేయాలని, లేనిచో అంతిమంగా తన జీవనభృతి రద్దుచేయబడునని తెలియజేసెను.

"గందరగోళం మరియు అస్తిరత్వం కలుగుటకు కారణంగా వుంటూ మీకు మీరే గొప్ప హాని తలపెట్టుకొనుచున్నారు. మీరు ఇప్పుటివరకూ, సంవత్సరాల తరబడి, దేనిని నిర్మించటానికి సహాయపడిరో, దానిని ఇప్పుడు ముక్కలుగా చేయరాదు. పదవీ విరమణ పొందిన పనివారు జీవనం నిమిత్తం, తన చర్చి యొక్క జీవనభృతిని పొందువారు చర్చిని వ్యతిరేకిస్తూ మరియు దాని నాయకత్వంలో విశ్వాసంను చెదరగొట్టునట్లు వుండినచో, అతడు చాలా విచార అనుభవంను పొందవలసి వచ్చును. 4

అతను QOD పై తన వ్యతిరేకతను ముగిస్తేనే తప్ప, లేనిచో ఆండ్ర్యేసేన్ యొక్క జీవనభృతి రద్దు చేయబడుననే ఫిగఃర్ బెదిరింపునకు, ఆండ్ర్యేసేన్ నుండి క్రింది పదునైన ప్రతిస్పందన వచ్చింది:

"నేను శాంతి మనిషిగా ఉన్నాను, నేను న్యాయము మాట్లాడవచ్చు (నేను తర్కిస్తాను). కానీ ఏ నరుడును నన్ను బెదిరించలేడు మరియు చేయుదానిని విడువమని ఆదేశించలేడు. మీరు మీ బెదిరింపును నిలుపుకొందురని నేను అనుకొంటున్నాను, కానీ నేను కొనసాగిస్తాను… మీరు నన్ను బెదిరించారు …. నీవు ఒకదానిని వినకుండానే తీర్పు నిర్ణయించడంతో నిన్ను నీవు అనర్హుడిగా చేసుకున్నావు, తదుపరి అధికారులు ప్రజలే. మీరు ప్రవచన ఆత్మ యొక్క విశ్వాసాన్ని నాశనం చేసే, సాక్ష్యాలను నీరుగార్చే, పూర్తి అసత్యాలను చెప్పే… మొదలైనవాటికి కారణమైన పరిచర్యను సమర్దిస్తున్నారు. దీనిపై ఎలాంటి రాజీ ఉండదు. మీరు విషయం పరిష్కరించబడినదని అంటున్నారు, మీరు తలుపులు మూసివేసారు. విషయం పరిష్కరించబడలేదు మరియు భయపెట్టుట ద్వారా ఎప్పుడూ పరిష్కారం ఉండదు. ఎవరైనా నిరసన తెలిపినట్లయితే, నన్ను ఉదాహరణగా చూపిస్తూ ఏం జరుగుతుందో తెలుకోవాలని మొత్తం శాఖకు చెందిన శ్రామిక శక్తిని వాషింగ్టన్ బెదిరించడం జరుగుతుంది. కాబట్టి ప్రజలకు ఒక నా హెచ్చరిక ఏమిటంటే మీరు నిరసనలో చేరాలనుకుంటే మీరు ఎక్కడ నిలుచున్నారో నిర్ధారించుకోండి. దీనికి మీరు చాలా మూల్యంను చెల్లించుకొన రావచ్చు. మన నాయకులు- వారిలో కొందరు- మన యజమానులుగా మారారు, మరియు అడ్డంకిగా ఏది వచ్చినా భరించడానికి సిద్ధంగా ఉన్నారు. 5

సెవెంత్-డే అడ్వెంటిస్టు సంఘం లోపల కలుగు అసమ్మతిని అరికట్టడానికి వారు బలాన్ని ప్రయోగించు విషయంలో ఏమాత్రం ఆశ్చర్యం లేదు, సెవెంత్-డే అడ్వెంటిస్టు చర్చి రోమన్ కాథలిక్ చర్చి విధానమును అనుసరించి దాని సంస్థలో ప్రధాన మతగురువును ఏర్పాటు చేసుకొనెను, సంఘంలోని జనానికి ఏదైనాగానీ మాట్లాడే అవకాశంలేదు. అందువలన, ఆండ్ర్యేసేన్ ఫిగఃర్ ను ఎదుర్కొనుటకు ప్రదర్శించిన ధైర్యం ధైర్యంయొక్క ఒక గొప్పతనంను వెల్లడించినది. దురదృష్టవశాత్తూ, ఒక అవినీతి GC/జనరల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడుని బహిర్గతం చేస్తూ ఎదుర్కొనుటకు చేసిన ఈ ప్రారంభ ధైర్యం, చివర వరకూ చూపలేకపోయాడు. సెవెంత్-డే అడ్వెంటిస్టు సంఘం లోపల క్రీస్తు యొక్క విధానము, ప్రాయశ్చిత్తము మరియు ఎలెన్ వైట్ యొక్క పరిచర్యపై ఆధారపడియున్న దానిలో ఇవాంజికల్సును సంతోషపరచుటకు చేసిన మినహాయింపుల విషయంలో ఆండ్ర్యేసేన్ తన వ్యతిరేకతను మానక తన బహిరంగ లేఖలు ప్రచురిస్తూ ఉండుటవలన, ఫిగఃర్ మరియు సెవెంత్-డే అడ్వెంటిస్టు చర్చిలోని ఇతర నాయకులు 1961 స్ప్రింగ్ కౌన్సిల్ లో "తాను ఐక్యత, సామరస్యాలతో మంచి మనసును కనబరచే వరకు M. L. ఆండ్ర్యేసేనును చర్చిలోని అధికారిక పత్రాలనుండి తొలగించుటకు ఓటు వేసిరి", సంఘపు సంవత్సర పుస్తకంలోని పదవీ విరమణ పొందిన పనివారి జాబితా నుండి కూడా తన పేరును తొలగించెను 6. ఫిగఃర్ తీసుకున్న చర్యలు ఆండ్ర్యేసేనును నలిపివేసెను మరియు ఆయన ఎక్కువగా చర్చి మరియు దాని నాయకులు ద్వారా మనసు విరిగినట్లుగా భావించ బడుటవలన అతని ఆరోగ్యం వేగవంతంగా క్షీణించింది, మరియు ఇప్పుడు అతడు ఫిగఃర్ కు పూర్తిగా లొంగిపోయి అతనితో శాంతి ఒప్పందం చేసుకొనుటకు సిద్ధపడెను. ఆసుపత్రి వద్ద అతని మరణ మంచం నుండి, తాను ఫిగఃర్ యొక్క దర్శనమును కోరుకొనెను. ఈ కలయికలో ఆండ్ర్యేసేన్ తన నిరసనలు సంఘంలో "సందేహమును మరియు గందరగోళమును" సృష్టించెనని ఒప్పుకొనుచు విచారం వ్యక్తం చేసెను మరియు అతడు వ్రాసిన లేఖలను ఇకపై నకిలీ చేయవద్దని/ ఎక్కువ ప్రతులను ముద్రించవద్దని కోరాడు. అతడు "ఇకపై చర్చికి హాని కలిగించే ఏ చర్యను చేయబోనని" హామీ ఇచ్చెను. ఈ సంఘటనాత్మక సమావేశంలో ఆండ్ర్యేసేన్ తన మరణం తర్వాత తన భార్య కోసం ఆర్ధిక సదుపాయాన్ని గురించి ఫిగఃర్ తో చర్చించెను. 7

సువార్తీకులను బుజ్జగించడానికి అడ్వెంటిస్ట్ వేదాంతంలో అనేక ముఖ్యమైన మూలస్తంభాలను తొలగించుట వెనుకగల చర్చినాయకుడు ఫిగఃర్ తో శాంతి ఒప్పందం చేసుకోకముందే ఆండ్ర్యేసేన్ మరణించలేదు! ఆండ్ర్యేసేన్ భార్య తన భర్త మరణం తరువాత కొద్దికాలానికి, ఫిగఃర్ కు వ్రాసిన ఒక లేఖలో, ఆసుపత్రిలో వున్న తన భర్తను సందర్శించి ఆయనకై చెల్లించిన దానికోసం ఆమె ధన్యవాదములు తెలిపెను. ఆమె "తన భర్త తన హృదయంలో వెక్కి వెక్కి ఏడుస్తూ అనేక రాత్రులు ఎలా గడిపాడో" గుర్తుకుతెస్తూ, ఫిగఃర్ దర్శించిన అనంతరం అతడు తన సంఘానికి దూరమవలేదని తలస్తూ అతను ఒక 'సంతోషమైన' మనిషిగా మరణించారని తెలిపెను. 8

పడిపోయిన సువార్తీకుల కొరకు సెవెంత్-డే చర్చి యొక్క పూర్తి సిద్దాంత లొంగుబాటునకు వ్యతిరేకంగా ఆండ్ర్యేసేన్ ద్వారా ఏదైతే సాహసోపేతమైన నిరసన తెలపబడెనో అది ఆండ్ర్యేసేన్ ఫిగఃర్ కు లొంగిపోవుట ద్వారా ముగిసినది. అయితే WLC వద్ద మేము ఎం. ఎల్. ఆండ్ర్యేసేన్ ను ఇంత గొప్పగా లక్ష్యంచేయుటకు గల ప్రధాన కారణం ఇది కాదు. ఫిగఃర్ కు తన ఈ విచారకరమైన లొంగుబాటు కంటే, ఆండ్ర్యేసేన్ చేపట్టిన ఒక అతి తీవ్రమైన అవహేళనా కార్యం మొత్తం సెసెవెంత్-డే అడ్వెంటిస్టు సంఘానికి అత్యంత విపత్కరమైన ఫలితాలను కలిగించింది.

Image

1938 లో, జనరల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు జేమ్స్ లామార్ మెక్ ఏలానే, అక్టోబర్ 22 1844 తేదీనకు మిల్లరైట్లు ఎలా చేరగలిగారు అనే మూలంపై అధ్యయనం చేయుటకు ఒక పరిశోధన కమిటీని నియమించారు. ఆండ్ర్యేసేన్ ఈ కమిటీకి ఒక అధిక శ్రేణి సభ్యుడిగా ఉన్నాడు. మిల్లరైట్ పద్దతిని మరియు బైబిలు కేలండరును సరిగా అధ్యయనం చేసిన తరువాత, వారు ఒక పూర్తిగా ఊహించని మరియు స్వాగతించలేని ఆవిష్కరణను చూశారు: అది, సబ్బాతును బైబిలు కేలండరుపై లెక్కించినప్పుడు, అది శనివారం నాడు రాదు! వారు మరొక దిగ్భ్రాంతికర ప్రత్యక్షతను చూశారు: యహూషువః పస్కాదినాన, వారంలో ఆరవ రోజున సిలువ వేయబడ్డారని లేఖనాలు స్పష్టం చేయుచున్నవి, అయితే, క్రీ.శ. 31లో పస్కా శుక్రవారంనాడు రాలేదు!

పరిశోధనా కమిటీ స్పష్టమైన గందరగోళాన్ని ఎదుర్కొంది: క్రీ.శ. 31ని శిలువ వేసిన సంవత్సరంగా తిరస్కరిస్తే, అప్పుడు 2300 రోజుల ప్రవచనం క్రీ.పూ. 457 లో ప్రారంభం కాదు మరియు అందువలన 1844 లో ముగియదు. మరియు బైబిలు కేలండరు యొక్క వారాల చక్రం ఆధునిక కేలండరు వారాల చక్రంతో సంబంధం కలిగి యుండుటకు అక్కడ ఏ విధంగాను అవకాశం లేదు, ఎందుకంటే యహూషువః బైబిలు వారంలోని ఆరవ దినాన సిలువ వేయబడినప్పటికీ, క్రీ.శ 31 లో ఆయన శుక్రవారం సిలువ వేయబడెననుటకు ఏవిధమైన ఆధారము లేదు.

కమిటీ వారికి బయలుపడ్డ ఈ రెండు ఆశ్చర్యకరమైన విషయాల గురించి ఏమి చేయాలనేది వారికి పాలుపోలేదు. వారు సంఘానికి బైబిలు క్యాలెండరును అందించుట వలన కలుగు పరిస్థితులను అధ్యయనం చేసిరి. విషాదకరంగా, కమిటీ శనివారం బైబిలు సబ్బాతు కాదు అనే వార్తను సంఘానికి తీసుకుని వెళ్ళుటకు బదులుగా వ్యతిరేక చర్యను తీసుకుంది. వారు వారి ఆవిష్కరణలను సంఘ సభ్యులకు తెలియకుండా దాచి ఉంచడానికి కావలసిన కారణాల కోసం అన్వేషణను ప్రారంభించారు. ఈ నిజాన్ని సంఘ సభ్యులకు తెలియకుండా కమిటీ ఈ విషయంలో ఎందుకు నిశ్శబ్దంగా ఉండాలి అనే కారణాలను ఆండ్ర్యేసేన్ అందించాడు. ఇక్కడ అతడు ఇచ్చిన కారణాలు ఉన్నాయి:

TEXT IN BOX

కమిటీకి ఆండ్ర్యేసేన్ అందించిన హేయమైన కారణాలు వారు కనుగొన్న దానిని సంఘానికి అందకుండా చేసాయి, దాని విషాద ఫలితంగా సెవెంత్-డే సంఘం శనివారంను సబ్బాతుగా కొనసాగించుచుండెను. యహువః ఈ కమిటీ వారికి సబ్బాతును మరియు ఆయన పండుగలను నిర్ణయించే ఒక దైవీకమైన క్యాలెండరును బయలుపరచుటకు ప్రయత్నించారు, ఎందుకంటే సబ్బాతు దినమును కనుగొనుటకు ఆయన ప్రజలు రోమీయుల కేలండరును ఉపయోగించుట ఆయనకు ఆమోదయోగ్యం కాదు. అయితే కమిటీ ద్వారా ఈ దివ్య కాంతి నిశ్శబ్దంగా అణచివేయుట జరిగినది; ఆండ్ర్యేసేన్ సెవెంత్-డే చర్చి సభ్యులు నుండి ఈ విలువైన కాంతిని దాచివేయుట న్యాయమేనని సమర్థనను అందించెను, అలా ప్రపంచం మొత్తం నుండి ఈ కాంతిని దాచి వేయుటకు కారణమాయెను.

ఎవరైనా యహువః యొక్క సత్యానికి (అతడు/ఆమె) వెన్ను చూపినయెడల అది విషాదకరమైన విషయం, అయితే యహువః యొక్క విశ్వాసుల నుండి పరలోక కాంతిని అడ్డుకొనుటకు వారి ఆలోచనలను ప్రభావితం చేయుటలో ఎవరైనా (అతడు లేదా ఆమె) ఉన్నతంగా నిలబడునప్పుడు అది మరింత అనంతమైన విషాదకరమైన విషయమై ఉన్నది. మేము ఆండ్ర్యేసేన్ గతిని గూర్చి వణుకుచున్నాము, అలాగే సెవెంత్-డే సంఘం లోపల అనేక ఇతర నాయకుల [ఎవరైతే యహువఃకును తన ప్రజలకును మధ్య ఒక అవరోధంగా కొనసాగిరో] గతిని గూర్చి కూడా.


1 ఎం ఎల్ ఆండ్ర్యేసేన్, "ఎ రివ్యూ అండ్ ప్రొటెస్ట్," 15 అక్టోబర్ 1957, TMs, సి 152, బాక్స్ 28, fld 8, రాయ్ అల్లన్ ఆండర్సన్ కలెక్షన్, అండ్రూస్ యూనివర్సిటీ లైబ్రరీ.
2 ఎం ఎల్ ఆండ్ర్యేసేన్, " ఎ మోస్ట్ డేంజరస్ హేరెసి" సెప్టెంబర్ 1960, TMs, సి 152, బాక్స్ 28, fld 8, రాయ్ అల్లన్ ఆండర్సన్ కలెక్షన్, అండ్రూస్ యూనివర్సిటీ లైబ్రరీ.
3 వాల్టర్ మార్టిన్ ఇంటర్వ్యూ, అడ్వెంటిస్ట్ కరెంట్స్ నుండి. వాల్యూమ్. 1, నెంబరు 1, జూలై, 1983
4 ఆర్ ఆర్ ఫిగఃర్ నుండి ఎం ఎల్ ఆండ్ర్యేసేన్, 19 డిసెంబర్ 1957, TL, ADF 3773.06d, లోమా లిండా విశ్వవిద్యాలయ లైబ్రరీ.
5 ఎం ఎల్ ఆండ్ర్యేసేన్ నుండి జనరల్ కాన్ఫరెన్స్ అధికారులకు మరియు ఇతర బాధ్యతాయుత స్ధానాల్లో ఉన్నవారికి. 29 డిసెంబర్ 1957, TL, సి 152, బాక్స్ 28, fld 8, రాయ్ అల్లన్ ఆండర్సన్ కలెక్షన్, అండ్రూస్ యూనివర్సిటీ లైబ్రరీ.
6 ఆర్ ఆర్ ఫిగఃర్ నుండి జార్జ్ జె అప్పెల్ కు, 10 ఏప్రిల్ 1961, TL, RG 11, బాక్స్ 3208, జనరల్ కాన్ఫెరెన్స్ ఆర్కైవ్స్. ఆండ్ర్యేసేన్ యొక్క సస్పెండ్ ఆధారాలను స్పష్టంగా పూర్తి టెక్స్ట్ ను మినిట్స్ ఆఫ్ ది జనరల్ కాన్ఫెరెన్స్ కమిటీ 6 ఏప్రిల్ 1961, జనరల్ కాన్ఫెరెన్స్ ఆర్కైవ్స్ లో చూడవచ్చు.
7 మినిట్స్ ఆఫ్ ది జనరల్ కాన్ఫెరెన్స్ ఆఫీసర్స్ మీటింగ్ 26 ఫిబ్రవరి 1962, ది జనరల్ కాన్ఫెరెన్స్ ఆర్కైవ్స్.
8 గ్లేడిస్ ఆండ్ర్యేసేన్ నుండి ఆర్ ఆర్ ఫిగఃర్ కు, 27 ఫిబ్రవరి 1962, హెచ్ఎల్, ADF 3773, లోమా లిండా విశ్వవిద్యాలయం లైబ్రరీ.
9 ఎం ఎల్ ఆండ్ర్యేసేన్ యొక్క గ్రేస్ ఆమేడాన్, గ్రేస్ ఆమేడాన్ కలెక్షన్ కు తారీకు లేని లేఖ, బాక్స్ 2, ఫోల్డర్ 4.

Comments

Leave a Reply

Your avatar is powered by Gravatar