యహువః యొక్క ముద్ర = దైవిక రక్షణ
యహువః యొక్క ముద్ర గతంలో అర్థం చేసుకున్న దాని కంటే చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది దైవిక ధర్మశాస్త్రం ప్రకారం జీవించేవారికి ఆధ్యాత్మిక రక్షణను అందిస్తుంది. ఇది విశ్రాంతి దినములను, నెలారంభ దినాలను, వార్షిక పండుగల ఆరాధనలను దీనిలోనికి చేరుస్తుంది. |
మీరు సమస్తమును కలిగియున్న వ్యక్తికి ఏమి ఇచ్చెదరు?
నిజముగా. ఏమీ అవసరం లేని వ్యక్తికి మీరు ఏమి ఇస్తారు?
మీరు ఉత్తమంగా గీసిన చిత్రపటమును లేదా శిల్పకళలను మైఖెలాంజెలోకు ఇవ్వలేరు. మీరు జూలియా చిన్నారికి ఒక చాక్లెట్ చిప్ కుకీల పళ్లెమును ఇవ్వలేరు లేదా క్రిస్టియన్ డియోర్ కు ఒక చొక్కాను కుట్టలేరు.
మాటలలో చెప్పలేనప్పుడు, ప్రేమతో నిండిన హృదయం కొన్ని చర్యల ద్వారా ప్రేమను ప్రదర్శిస్తుంది. మీరు సమస్తమును కలిగియున్న వ్యక్తికి ఏమి ఇచ్చెదరు?
మీరు పరలోక తండ్రికి ఒక బహుమానమును ఇవ్వాలని కోరుకుంటే ఈ సమస్య ఇంకా ఎక్కువగా ఉంటుంది. మీరు సృష్టికర్తకు ఆయన ఇప్పటికే కలిగిలేని, లేదా ఇప్పటికే ఆలోచించని, లేదా కేవలం మాట ద్వారా తనకు తాను తయారు చేసుకోలేని దానిని బహుశా ఏమి ఇవ్వగలరు?
పదాలు తగినంతగా లేనప్పుడు, బహుమానం తగినంతగా లేనప్పుడు, ప్రేమతో పొంగిపొర్లే హృదయం ఆ ప్రేమను ప్రదర్శించుటకు ఏదో ఒక మార్గం కోసం ఆకాంక్షను కలిగియున్నప్పుడు, అక్కడ ఒక విషయం మాత్రమే మిగిలి ఉంటుంది. విధేయత చూపుట.
మానవుడు కల్పించిన సమస్త సంప్రదాయాలు ప్రక్కన పెట్టబడినప్పుడు, వాస్తవానికి సృష్టికర్త మన నుండి కోరుకొనేవి అనేక విషయాలు లేవు. మనుష్యుడా, యేది ఉత్తమమో అది నీకు తెలియజేయబడియున్నది; న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీనమనస్సు కలిగి నీ దేవుని యెదుట ప్రవర్తించుటయు, ఇంతేగదా యెహోవా నిన్నడుగుచున్నాడు. (మీకా 6: 8) అనంత ప్రేమామయుని యొక్క గొప్ప హృదయము కోరుకొనేదంతా ప్రేమతో నిండిన హృదయపూర్వకమైన విధేయత.
అంతే. ప్రేమతో నిండిన హృదయం నుండి చూపు విధేయత.
విధేయత యొక్క బహుమతి
విచారకరంగా, చాలామంది ప్రజలు ఏదో ఒకటి, లేక ఏదైనా ఇచ్చుటకు చూతురు. వారు మానవ నిర్మిత సంప్రదాయాలకు మరియు ఆవశ్యకతలకు వ్రేలాడుతూ ఉందురు. నెరవేర్చుటకు కష్టతరంగా ఉండే పరిసయ్యుల యొక్క నియమాల బాధ్యతలు తరచుగా మానవుల గర్వమును పోషిస్తాయి మరియు తమకు తాము గొప్పవారని భావించేలా చేస్తాయి. తాను కుష్ఠురోగం నుండి శుద్ధియగుటకు తాను చేయవలసినదల్లా యోర్దాను నదిలో స్నానము చేయుట మాత్రమేనని ప్రవక్త ఎలీషా చెప్పినప్పుడు కోపంతో ఉన్న నయమాను వలె వారు ఉన్నారు.
అందుకు నయమాను కోపము తెచ్చుకొని తిరిగి పోయి యిట్లనెను-అతడు నా యొద్దకు వచ్చి నిలిచి, తన దేవుడైన యెహోవా నామమును బట్టి తన చెయ్యి రోగముగా ఉన్న స్థలము మీద ఆడించి కుష్ఠరోగమును మాన్పునని నేననుకొంటిని.
దమస్కు నదులైన అబానాయును ఫర్పరును ఇశ్రాయేలు దేశములోని నదులన్నిటికంటె శ్రేష్ఠమైనవి కావా? వాటిలో స్నానముచేసి శుద్ధి నొందలేనా అని అనుకొని రౌద్రుడై తిరిగి వెళ్లిపోయెను. (రెండవ రాజులు 5:11,12)
ఆరాధన కోసం సృష్టికర్త యొక్క సాధారణ నియమాలు చాలామందికి చూపబడినప్పుడు, సత్వరమే వారు చాలా తరచుగా, వాటివలన కలుగు గొప్ప అసౌకర్యమును గూర్చి ఫిర్యాదు చేయుదురు. ఒక్కసారి ఆలోచన చేయమంటూ వేడుకొనిన నయమాను దాసుని యొక్క మాటలు నేటి ప్రజలకు సరిగ్గా వర్తిస్తూ ఉన్నవి: “అయితే అతని దాసులలో ఒకడు వచ్చి-నాయనా, ఆ ప్రవక్త యేదైన నొక గొప్ప కార్యము చేయుమని నియమించినయెడల నీవు చేయకుందువా? అయితే స్నానముచేసి శుద్ధుడవు కమ్మను మాట దానికంటె మేలుకాదా అని చెప్పినప్పుడు” (రెండవ రాజులు 5:13)
సృష్టికర్త యొక్క ఆరాధన అనేకమైన ప్రజలు తెలుసుకున్న దానికంటే ఇంకా ఎక్కువ ప్రాధాన్యతను కలిగి ఉన్నది. లేఖనాలు సమీప భవిష్యత్తులో జరిగే ఒక రహస్య సంఘటన నమోదుచేసెను:
అటుతరువాత భూమియొక్క నాలుగు దిక్కులలో నలుగురు దేవదూతలు నిలిచియుండి, భూమిమీదనైనను సముద్రముమీదనైనను ఏ చెట్టుమీదనైనను గాలి వీచ కుండునట్లు భూమియొక్కనాలుగు దిక్కుల వాయువులను పట్టుకొనియుండగా చూచితిని.
మరియు సజీవుడగు ఎలోహీం ముద్రగల వేరొక దూత సూర్యోదయ దిశనుండి పైకి వచ్చుట చూచితిని. భూమికిని సముద్రమునకును హాని కలుగజేయుటకై అధికారముపొందిన ఆ నలుగురు దూతలతో
ఈ దూతమేము మా దేవుని దాసులను వారి నొసళ్లయందు ముద్రించువరకు భూమికైనను సముద్రమునకైనను చెట్లకైనను హాని చేయవద్దని బిగ్గరగా చెప్పెను.
మరియు ముద్రింపబడినవారి లెక్క చెప్పగా వింటిని. ఇశ్రాయేలీయుల గోత్రములన్నిటిలో ముద్రింప బడినవారు లక్ష నలువది నాలుగు వేలమంది.” (ప్రకటన గ్రంథం 7:1-4, KJV)
యహువః యొక్క ముద్ర భూమిపై జీవిస్తున్న ప్రతి వానికి అత్యంత విలువైన ఆధ్యాత్మిక బహుమతి. ఏమియు (కృపతో) కలపబడకుండా ఎలోహీం యొక్క ఉగ్రత పాత్ర పశ్చాత్తాపం లేని ప్రపంచంపై కుమ్మరించబడు దినాలను ఎదుర్కొనుటకు అవసరమైన శాశ్వత జీవితాన్ని మరియు ఆధ్యాత్మిక రక్షణను యహువః యొక్క ముద్ర మాత్రమే అందిస్తుంది.
తన ప్రజలను అణచివేయాలని మరియు నాశనం చేయాలని కోరుకునే వారిమీదికి యహువః యొక్క తీర్పులు వస్తాయి. దుర్మార్గులపై ఆయన దీర్ఘకాల క్షమాపణ కలిగి యుండుట అతిక్రమణలో ఉన్నవారిని ధైర్యపరుస్తోంది, అయితే వారి శిక్ష ఎన్నటికీ తక్కువగా ఉండదు, ఎందుకంటే అది ఇప్పటికే చాలా ఆలస్యం చేసినది .… మన దయగల యహువఃకు శిక్షా చర్య ఒక అసాధారణమైన చర్య. యహువః దీర్ఘశాంతుడు, మహాబలముగలవాడు, ఆయన దోషులను నిర్దోషులుగా ఎంచడు. (నహూము 1:3). నీతిలో భయంకరమైన విషయాల ద్వారా ఆయన అణచివేసిన ధర్మశాస్త్రం యొక్క అధికారాన్ని నిరూపిస్తాడు. అవిధేయులు ఎదుర్కోబోయే శిక్ష యొక్క తీవ్రత నిర్ణయించబడునప్పుడు యహువః యొక్క అయిష్టత చేత తీర్పు చేయబడుదురు. ఆయన దీర్ఘకాలం సంహించిన దేశం, మరియు [యహువః యొక్క దృష్టిలో] దాని యొక్క అతిక్రమముల లెక్క పూర్తి అయ్యే వరకు శిక్షించబడని దేశం, చివరకు కరుణతో కలుపబడని ఉగ్రతా పాత్రలోనిది త్రాగును. 1
మృగం యొక్క గుర్తు అనేక తరాల నుండి ఆలోచన చేయబడుతూ, బోధించబడుతూ మరియు వాదించబడుతూ ఉన్నది. అయితే మృగం యొక్క ముద్ర నుండి మిమ్మును రక్షించు ఒక విషయం మరుగు చేయబడినది మరియు కొద్దిమంది చేత అర్థం చేసుకోబడినది. WLC యొక్క ఇతర వ్యాసాలలో, పశ్చాత్తాపపం పొందిన విశ్వాసి సూర్య చంద్ర క్యాలెండరు ద్వారా లెక్కించబడు పవిత్రమైన ఏడవ దినపు సబ్బాతునందు సృష్టికర్తను ఆరాధించినప్పుడు, యహువః యొక్క ముద్రను పొందునని వివరించబడింది. అయినప్పటికీ, యహువః యొక్క ముద్ర కేవలం వారపు సబ్బాతు (లూనార్ సబ్బాతు) మాత్రమే కాదని శ్రద్ధతో కూడిన లేఖనం యొక్క అధ్యయనం WLC బృందం యొక్క మనసులకు తెలియజేసెను. ఇది యహువః యొక్క పవిత్ర దినాలనన్నిటిని దీనిలోనికి చేర్చుచున్నది ఎందుకంటే ఇది ప్రేమగల హృదయానికి మాత్రమే ఇవ్వబడుతుంది.
తమ సృష్టికర్తను ఆరాధించుటకు అందరూ కూడవలసిన మూడు వర్గాల పవిత్ర దినాలు ఉన్నాయి:
- వారపు విశ్రాంతి దినాలు
- నెలవారీ న్యూ మూన్ దినాలు
- వార్షిక పండుగలు
వారపు విశ్రాంతి దినాలు
లేఖనం ప్రతి వారంలో ఏడవ రోజున ఆరాధనను ఆదేశిస్తుంది:
విశ్రాంతిదినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకముంచుకొనుము. ఆరు దినములు నీవు కష్ట పడి నీ పని అంతయు చేయవలెను. ఏడవ దినము నీ ఎలోహీం అయిన యహువః కు విశ్రాంతిదినము. దానిలో నీవైనను నీ కుమారుడైనను నీ కుమార్తెయైనను నీ దాసుడైనను నీ దాసియైనను నీ పశువైనను నీ యిండ్లలో నున్న పరదేశి యైనను ఏపనియు చేయ కూడదు. (నిర్గమకాండము 20:8-10)
ప్రతి చాంద్రమానంలో (సూర్య-చంద్ర క్యాలెండరులోని నెల) నాలుగు వారాపు విశ్రాంతి దినాలు ఉంటాయి.
నెలవారీ న్యూ మూన్ దినాలు
న్యూ మూన్ దినాలు ప్రతి కొత్త నెలను ప్రారంభించే మరియు కొత్త నెలలోని వారాల చక్రమును పునః ప్రారంభించే పవిత్ర దినాలై ఉన్నాయి. యహువః నియమించిన సమయపాలన పద్ధతి యొక్క ఖచ్చితత్వం చంద్రునిలో ఉన్నది, అందువలనే ఇది నమ్మకమైన సాక్షి అని చెప్పబడినది. “చంద్రుడున్నంతకాలము అది నిలుచుననియు మింటనుండు సాక్షి నమ్మకముగా ఉన్నట్లు అది స్థిర పరచబడుననియు” (కీర్తనలు 89:36). ప్రతి సంవత్సరానికి 12 లేదా 13 చాంద్రమానాలు ఉంటాయి, వీటిలో ప్రతి ఒక్కటి న్యూ మూన్ ఆరాధనా దినముతో ప్రారంభమవుతుంది.
వార్షిక పండుగలు
యహువః యొక్క వార్షిక పండుగలన్నీ లేవీయకాండము 23 లో ఇవ్వబడ్డాయి, వాటిని నిత్య నిబంధనగా పాటించవలెనని ఇక్కడ మళ్ళీ మళ్ళీ ఆజ్ఞాపించెను. ఈ పండుగలు:
- పస్కా
- పులియని రొట్టెల పండుగలు
- ప్రధమ పనల దినము
- పెంతెకోస్తు
- శృంగధ్వని పండుగ
- ప్రాయశ్చిత్తార్థ దినము
- పర్ణశాలల పండుగలు
ప్రజలు ఈ సాధారణ ఆవశ్యకతలను పాటించుటకు ఇష్టపడుట లేదు. యూదుల పండుగలను ఆచరిస్తున్న స్నేహితులతో మరియు సహోద్యోగులతో కలిసియుండుటకు వారు అసౌకర్యంగా, ఇబ్బందికరంగా ఉంటున్నారు! ప్రత్యేకంగా ఉండుటకు ఎవరూ ఇష్టపడుటలేదు మరియు ప్రత్యేకమైన క్యాలెండర్ ద్వారా సృష్టికర్తను ఆరాధించువారు ప్రత్యేకంగా ఉందురు. చాలా ప్రత్యేకంగా.
ప్రపంచం దాని విధ్వంసం విషయంలో పక్వమైయున్నది. [యహువః] పాపులతో సహించవచ్చు, కానీ ఇంకా కొంచెం కాలం మాత్రమే. కరుణతో కలపబడని ఎలోహీం ఉగ్రతపాత్రలో పోయబడిన కోపమను మద్యమును వారు త్రాగుదురు. అమూల్యమైన వారసత్వాన్ని పొందుటకు యహువఃకు వారసులుగా, యహూషువః మెస్సీయకు ఉమ్మడి వారసులుగా ఉండువారు, ప్రత్యేకంగా ఉందురు. అవును, చాలా ప్రత్యేకంగా ఉందురు, [యహువః] వారిపై తన వారిగా ఒక ముద్రను ముద్రించును, పూర్తిగా ఆయన వారిగా. కేవలం నామమును బట్టి భిన్నంగా ఉన్న ప్రపంచముతో మిశ్రమంగా ఉన్న ప్రజలను యహువః స్వీకరించి, గౌరవించి మరియు వారిని గుర్తించునని మీరు భావిస్తున్నారా? [యహువః] పక్షాన ఉండి, [యహూషువః] విషయంలో సిగ్గుపడనివారెవరో త్వరలోనే తెలియును. అవిశ్వాసుల ఎదుట మనస్సాక్షి కలిగిన వారిగా ఉండుటకు నైతిక ధైర్యం లేని వారు, మరియు ప్రపంచ వైఖరిని వదిలి, మరియు [రక్షకుని] యొక్క స్వీయ-తిరస్కరణ జీవితాన్ని అనుకరించనివారు, ఆయన విషయంలో సిగ్గుపడుదురు మరియు ఆయన మాదిరిని ఇష్టపడరు. 2
కావున. మీరు అక్షరాలా, ప్రతిదానినీ కలిగియున్నవానికి, ఏమి ఇచ్చెదరు? ప్రేమతో నిండిన హృదయం నుండి విధేయతను. జ్ఞానయుక్తమైన తల్లిదండ్రులు తమ పిల్లలకు కృతజ్ఞతా భావాన్ని నేర్పుదురు, ఎందుకంటే బహుమానం విషయంలో చెల్లించే కృతజ్ఞత, ప్రేమను మరియు నమ్మకాన్ని పెంచుతుంది. తన ప్రజలు ఆయనకు, తమ ప్రేమను ప్రదర్శించుటకు ఒక మార్గం అవసరమని యహువఃకు తెలుసు. అటువంటి మార్గాన్ని ఆయన ప్రేమపూర్వకంగా అందిచి యుండెను: తన పవిత్ర దినాలను ఆరాధన కోసం ప్రత్యేకించుట.

ఆరాధనా దినాలను పరలోక ప్రవేశానికి హామీ ఇచ్చే ముద్రగా చూచుటలో సాతాను అనేక మందిని మోసగిస్తుండెను. సత్యానికి దూరంగా ఏమీ ఉండదు! ఎలోహీం ఆత్మగనుక ఆయనను ఆరాధించు వారు ఆత్మతోను సత్యముతోను ఆరాధింపవలెననెను.(యోహాను సువార్త 4:24). చట్టపరమైన బాధ్యతగా చూడబడు ఆరాధన సత్యారాధన కాదు.
ఆరాధన యొక్క ఉన్నతమైన రూపం |
నిఘంటువు ఆరాధనను ఒక క్రియగా నిర్వచిస్తుంది: "ఆరాధించుట; దైవ గౌరవాలను చెల్లించుట; మహోన్నత గౌరవంతో పూజించుట ... అమితమైన ప్రేమ మరియు గొప్ప అణుకువతో గౌరవించుట .... " 3
నిజమైన ఆరాధన ప్రేమ గల హృదయం నుండి మాత్రమే పుడుతుంది. అప్పుడు, విధేయతను కలిగియుండుట, ఆరాధన యొక్క ఉన్నతమైన రూపం. ఇది అభిమానమును సంపాదించుకొనుటకు రూపొందించిన ఒక చట్టం కాదు, కాలేదు. అలా ఉంటే, అది ఆరాధన కాదు.
విమోచింపబడ్డవారు యహువః యొక్క ముద్రను స్వీకరింతురు.
రక్షకుడు కొండపై తన ప్రసంగంలో, విడనాడుబడు వారికి మరియు, చివరిలో, రక్షింపబడు వారికి మధ్య వ్యత్యాసాన్ని వివరించాడు:
ప్రభువా, ప్రభువా, అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోకరాజ్యములో ప్రవేశింపడుగాని పరలోకమందున్న నా తండ్రి చిత్తప్రకారము చేయువాడే ప్రవేశించును.
ఆ దినమందు అనేకులు నన్ను చూచి ప్రభువా, ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా? అని చెప్పుదురు.
అప్పుడు నేను మిమ్మును ఎన్నడును ఎరుగను, అక్రమము చేయువారలారా, నాయొద్దనుండి పొండని వారితో చెప్పుదును. (మత్తయి సువార్త 7:21-23)
విడనాడబడువారు కేవలం బహిరంగంగా తిరుగుబాటు చేసినవారు మాత్రమే కాదు. క్రైస్తవులుగా చెప్పుకొన్న అనేకులు, వారి మతంలో గొప్పగా పనిచేసినవారు, చివరికి పరలోకంలో వారి ప్రవేశ ద్వారమునకు అనుమతి పొందినట్లు "ఆరాధించిన" వారు కూడా విడనాడబడుదురు. విమోచకునితోను మరియు ఆయన తండ్రితోను సన్నిహితమైన స్నేహములోనికి ప్రవేశించినవారు యహువః యొక్క ముద్రను పొందియున్నవారు. వారు ఆయనను ప్రేమిస్తున్నందున సృష్టికర్త యొక్క ఇష్టాన్ని నెరవేర్చుదురు. యహువఃను ఎరిగియుండుట అనగా ఆయనను ప్రేమించుట. మీరు ఆయనను ఎరిగియుంటే, ఆయనను ప్రేమిస్తారు మరియు మీరు ఆయనను ప్రేమించినట్లయితే, మీరు అన్ని విషయాల్లో ఆయనకు విధేయులవుతారు, ఎప్పుడు ఆరాధించాలనే దానితో సహా.
ప్రియమైన యోహాను దీనిని అర్థం చేసుకొనెను:
మరియు మనమాయన ఆజ్ఞలను గైకొనిన యెడల, దీనివలననే ఆయనను ఎరిగియున్నామని తెలిసికొందుము.
ఆయనను ఎరిగియున్నానని చెప్పుకొనుచు, ఆయన ఆజ్ఞలను గైకొననివాడు అబద్ధికుడు; వానిలో సత్యములేదు.
ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయెను;
ఆయనయందు నిలిచియున్నవాడనని చెప్పుకొనువాడు ఆయన ఏలాగు నడుచుకొనెనో ఆలాగే తానును నడుచుకొన బద్ధుడైయున్నాడు. (మొదటి యోహాను 2:3 -6)
ఆరాధనా దినాలు: కృతజ్ఞత తెలుపుటకు అవకాశాలు
కృతజ్ఞత మరియు ప్రేమ నిలిపివేయబడినప్పుడు లేదా ఇతర వ్యక్తిని సంతోషంగా ఉంచుటకు ప్రయత్నాలు చేయబడనప్పుడు, సన్నిహితమైన మరియు ప్రేమపూర్వక సంబంధం సాధ్యం కాదు. యహువః, సర్వ సృష్టికర్తగా, ఇది ఆయనకు తెలుసు. ఆయనకు మీ ఆరాధన అవసరం లేదు. ఆయనకు మీ కృతజ్ఞత కూడా అవసరం లేదు. కానీ మీరు ఇవ్వాల్సి ఉంటుంది.
ఈ అవసరతను మానవ హృదయంలో నెరవేర్చుట నిమిత్తం, ప్రపంచాన్ని సృష్టించినప్పుడు సృష్టికర్త స్పష్టంగా, ఏడవ దినమును మరియు న్యూ మూన్ దినాలను 4 ఏర్పాటు చేసాడు. “ఎలోహీం తాను చేసిన తనపని యేడవదినములోగా సంపూర్తిచేసి, తాను చేసిన తన పని యంతటినుండి యేడవ దినమున విశ్రమించెను. కాబట్టి ఎలోహీం ఆ యేడవ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరచెను; ఏలయనగా దానిలో ఎలోహీం తాను చేసినట్టియు, సృజించి నట్టియు తన పని అంతటినుండి విశ్రమించెను. (ఆదికాండము 2: 2 మరియు 3)
పాపపు ప్రవేశంతో, పడిపోయిన పాపులకు మరియు పరిశుద్ధ తండ్రికి మధ్య ఒక పెద్ద అగాధము ఏర్పడినది. ఈ అగాధానికి వంతెన వేయుటకు, పడిపోయినవారిని ఆయనతో సన్నిహిత సంబంధంలోనికి తెచ్చుటకు, తండ్రి వార్షిక పండుగలను ఏర్పాటు చేసారు. ఆయన ఉద్దేశ్యం, సంవత్సరం ద్వారా జనులు నియామక కాలాలలో కూడినప్పుడు వారు ఆయన దీవెనలను మరియు రక్షణను, కృతజ్ఞతతో మరియు ప్రేమతో జ్ఞాపకం చేసుకొందురు.
పిల్లలు తిరిగి వారికి ఇచ్చుటకు అనుగుణంగా మంచి తల్లిదండ్రులు వారి పిల్లలకు మంచి అవకాశాలను అందిస్తారు. తండ్రికి నిజంగా మరొక టై (మెడకు ధరించే వస్త్రం) అవసరం లేదు. అమ్మకు మరొక పిన్ కుషన్ లేదా లోప్-సైడ్ కేకు అవసరం లేదు. కానీ పిల్లలు ఇచ్చుటలో గల ఆనందాన్ని అనుభవించాల్సిన అవసరం ఉన్నందున, జ్ఞానం గల తల్లిదండ్రులు తమ పిల్లలకు అలా చేయుటకు అవకాశం కల్పిస్తారు. పిల్లలకు ఇచ్చిన ప్రతిదాని విషయమై "ధన్యవాదాలు" చెప్పు అవసరత ద్వారా, అది ఒక గ్లాసుడు నీళ్ళు లేక భోజనం లేక ఒక బహుమానం కావచ్చు, పిల్లలలో తల్లిదండ్రులపై (ప్రేమగల తల్లిదండ్రులుగా) వారి ప్రేమ మరియు గుర్తింపు అభివృద్ధి అవుతుంది. పిల్లలలో, తీసుకొనేవారిగా, అలా కృతజ్ఞతా అభివృద్ధి చెందుతుంది మరియు ఇది, క్రమంగా, ప్రేమగా అభివృద్ధి చెందుతుంది.
పరలోకపు తండ్రి మన హృదయాలలో కృతజ్ఞతలను ఉత్పన్నం చేయు ప్రక్రియగా నియామక దినాల ఆచరణను మన కోసం ఏర్పాటు చేసెను. ఇది ఒక వ్యవసాయ సమాజంలో చాలా స్పష్టమైనది. పంటలు పెరుగుతాయి ఎందుకంటే: “ఆయన చెడ్డవారిమీదను మంచివారిమీదను తన సూర్యుని ఉదయింపజేసి, నీతిమంతులమీదను, అనీతి మంతులమీదను వర్షము కురిపించుచున్నాడు. (మత్తయి 5:45). నేడు, చాలామంది ప్రజలు తమ ఆహారాన్ని కిరాణా దుకాణాలు లేదా సంతల నుండి కొనుగోలు చేయునప్పుడు, మన ఆశీర్వాదం ఎక్కడ నుండి వస్తుందో తెలిసికొనుటకు, మరియు ఇచ్చువాని యొక్క మంచితనమును మరియు ఔదార్యమును గుర్తించుటకు సమయాన్ని వెచ్చించుట కూడా మరింతముఖ్యమైనదిగా ఉంటుంది.
విశ్వాసి హృదయములో కృతజ్ఞతాభావము మేల్కొనినప్పుడు, ప్రేమ మేల్కొంటుంది మరియు విశ్వాసం తీవ్రమవుతుంది. అలా ఒక వ్యక్తి రక్షకునితో సన్నిహిత స్నేహంలోకి ప్రవేశిస్తాడు, తద్వారా చివరికి వారు ఆయనకు తెలియుదురు, ఆయన వారిని అంగీకరించును. లేఖనంలో "ఎరుగును" అనే పదం ప్రాముఖ్యత కలిగియున్నది. “ఆదాము తన భార్యయైన హవ్వను ఎరిగినప్పుడు ఆమె గర్భవతియై కయీనును కని… (ఆదికాండం 4: 1 Kjv) ప్రభువా! ప్రభువా! అని పిలుచువారికి ఆయనతో పైపై పరిచయము మాత్రమే ఉండును. కానీ ఆయనతో సన్నిహితంగా ఉన్నవారు మాత్రమే ఆయనకు నిజంగా తెలియుదురు, ఎందుకంటే వారికి ఆయన తెలుసు.
యహువః పవిత్ర దినాలలో ఎప్పుడూ ఆరాధించకుండానే రక్షణ పొందుట సాధ్యమా? అవ వచ్చు. అజ్ఞాన కాలంలోని పాపాలను యహువః ఖండించడని లేఖనం మనకు హామీ ఇస్తుంది. “ఆ అజ్ఞానకాలములను ఎలోహీం చూచి చూడనట్టుగా ఉండెను; ఇప్పుడైతే అంతటను అందరును మారుమనస్సు పొందవలెనని మనుష్యులకు ఆజ్ఞాపించుచున్నాడు. (అపొస్తలుల కార్యములు 17:30). అజ్ఞాన కాలపు పాపాలు సరైనదానిని నిజాయితీగా చేయాలని కోరుకొనిన వారికి ఎదురుగా నిలబడవు. అయితే, యహువః యొక్క అవసరతలను తెలుసుకొనుటకు ప్రయత్నించని వారు, వాటిని అగౌరవపరుచుటను కొనసాగిస్తారు. ఇది బహిరంగ తిరుగుబాటుగా నిలబడుతుంది.
యహువః యొక్క సన్నిహిత స్నేహితులు, ఆయనను ప్రేమిస్తారు మరియు ఆయనను గౌరవించేవారు ఆయన నియామక కాలాలలో, ఆయన నియమించిన క్యాలెండర్ ద్వారా, నిత్య రాజ్యంలో సమావేశమవుతారు. “ప్రతి న్యూ మూన్ దినమునను ప్రతి విశ్రాంతి దినమునను నా సన్నిధిని మ్రొక్కుటకై సమస్త శరీరులు వచ్చె దరు అని యహువః సెలవిచ్చుచున్నాడు. (యెషయా 66: 23 Kjv). ఇప్పుడు మిమ్మల్ని ఎక్కువగా ప్రేమిస్తున్న వ్యక్తిని తెలుసుకునే అవకాశాన్ని కలిగియున్నారు. ఆయన యొక్క క్యాలెండర్ ద్వారా లెక్కించబడు పవిత్ర దినాలలో ఆయనను ఆరాధించుటకు నిర్ణయించుకొనుడి. మీ సృష్టికర్తతో స్నేహాన్ని కలిగియుండుట ద్వారా కలుగు బహుమానాలు నిత్యత్వమంత అనంతంగా ఉంటాయి.
1 ఎల్లెన్ జి. వైట్, ది గ్రేట్ కాంట్రవర్సీ, p. 627.
2 ఎల్లెన్ జి. వైట్, స్పిరిచ్యువల్ గిఫ్ట్స్, 47, p. 77.
3 నోవాహ్ వెబ్స్టర్, అమెరికన్ డిక్షనరీ ఆఫ్ ది ఇంగ్లీష్ లాంగ్వేజ్, 1828 ఎడిషన్.
4 న్యూ మూన్ దినాలు సృష్టి వద్ద స్థాపించబడిన వాస్తవం, ప్రపంచం సృష్టించబడిన సమయం నుండి యహువః యొక్క కాల కొలత-పద్ధతి సూర్య చంద్ర క్యాలెండరు మాత్రమే అనే వాస్తవం ద్వారా నిరూపించబడుతుంది. ఆదికాండం 1: 14- 15 ఇలా చెబుతోంది: “ఎలోహీం పగటిని రాత్రిని వేరుపరచునట్లు ఆకాశవిశాల మందు జ్యోతులు కలుగును గాకనియు, అవి సూచనలను కాలములను దిన సంవత్సరములను సూచించుటకై యుండు గాకనియు, భూమిమీద వెలుగిచ్చుటకు అవి ఆకాశ విశాలమందు జ్యోతులై యుండు గాకనియు పలికెను; ఆ ప్రకారమాయెను.” ఇక్కడ "సూచనలు" గా అనువదించిన పదం ఓత్ #226 నుండి వచ్చినది, దీనికి ఒక గుర్తు, లేదా చిహ్నం అని అర్థం. అలాగే "కాలములు" గా అనువదించిన పదం మో’ఎడ్ #4150 నుండి వచ్చినది, ఇది యహువః ప్రజల యొక్క ఆరాధనా సమావేశాలను సూచిస్తూ, లేవీయకాండము 23 అంతటా వాడబడుతూ ఆయప పండుగలను సూచిస్తుంది.