పదిహేనేళ్ల చార్లీ యహువఃను ప్రేమించాడు కానీ అతని పాపాల గురించి అపరాధభావంతో విలవిలలాడాడు. తరువాత, వెనక్కి తిరిగి చూసినప్పుడు, అతడు అనుకునేవాడు, "నేను పుట్టకుండా ఉంటే బాగుండేది."
అతడు మహాపాపి అయినప్పటికీ, అతడికి అంతకన్నా గొప్ప రక్షకుడు ఉన్నాడని గ్రహించినప్పుడు తన జీవితం మలుపు తిరిగింది. చార్లీ తన జీవితాన్ని యహువః ప్రేమ మరియు క్షమాపణ సందేశాన్ని ప్రకటించుటకు అంకితం చేసాడు. ఆయన మాట వినేందుకు వేలాది మంది తరలివచ్చారు. అతడు ఎల్లప్పుడూ 10,000 మరియు అంతకంటే ఎక్కువ మంది జనసమూహానికి బోధించేవాడు. చార్లీ సందేశాన్ని వినడానికి ప్రజలు ఆకలితో ఉండేవారు.
"ఒక వ్యక్తి క్రీస్తును విశ్వసించినప్పుడు, అతడు ఆ క్షణంలో, [యః] దృష్టిలో ఉన్నాడు, అతడు తన జీవితంలో ఎన్నడూ పాపం చేయనివాని వలె ఉండును" అని చార్లీ వారితో చెప్పాడు.
నేటికీ, చార్లెస్ స్పర్జన్ మరణించిన 130 సంవత్సరాల తరువాత కూడా, ప్రజలు ఇప్పటికీ అతని ఉపన్యాసాలను వింటూ ఉన్నారు. నిజమేమిటంటే: ప్రతి క్రైస్తవుడు అపరాధభావంతో పోరాడుతాడు. మనం యహూషువః వలె ఉండాలనుకుంటున్నాము, కానీ మనం పాపం చేస్తూనే ఉంటాము. అపరాధం అధికంగా ఉంది మరియు శోధనను X-సార్లు ప్రతిఘటించడం ద్వారా మన పశ్చాత్తాపాన్ని నిరూపించుకునే వరకు మనం క్షమాపణ అడగలేమని సహజంగా భావిస్తుంటాము.
పాపం చేయడం మరియు పశ్చాత్తాపం చెందడం—మళ్లీ పాపం చేయడం అనే ఈ మొత్తం చక్రం చాలా సరళమైన వివరణను కలిగి ఉంది: మనం ఇప్పటికీ పాత నిబంధన క్రింద ఉన్నాము. అవును, మనము కృప యొక్క పరిపాలన క్రింద ఉన్నాము మరియు యహువః మనలను క్షమించాడు. కానీ కాదనలేని నిజం ఏమిటంటే మనం ఇంకా పాపం చేస్తున్నాం! తత్ఫలితంగా, మనకు పాపాన్ని బహిర్గతం చేయుటకు ధర్మశాస్త్రం ఇంకా అవసరం.
పాత నిబంధన ఒక బహుమానము! పౌలు ఇలా వివరించాడు, “ధర్మశాస్త్రమువలననే గాని పాపమనగాఎట్టిదో నాకు తెలియకపోవును. ఆశింపవద్దని ధర్మశాస్త్రము చెప్పనియెడల దురాశ ఎట్టిదో నాకు తెలియకపోవును.” (రోమా 7:7). యహువః ధర్మశాస్త్రం ఒక అద్దం లాంటిది, మనం దైవిక రూపాన్ని ప్రతిబింబించడంలో ఎక్కడ విఫలం అవుతామో తెలియజేస్తుంది. అది దాని ఉద్దేశ్యం! మరియు మనకు అది అవసరం. ధర్మశాస్త్రాన్ని పాటించాలని మనం కోరుకుంటున్నాము; మనం యహువః వలె ఉండాలనుకుంటున్నాము, కాని మనం మళ్ళీ పాపం చేస్తున్నాము. మనం పాత నిబంధన క్రింద ఉన్నప్పుడు అదే జరుగుతుంది.
ఇశ్రాయేలీయులకు యహువః యొక్క నిబంధన ఇవ్వబడినప్పుడు వారు, నేటి క్రైస్తవుల వలె, పాటించాలని కోరుకున్నారు. “మోషే వచ్చి ప్రజల పెద్దలను పిలిపించి యహువః తన కాజ్ఞాపించిన ఆ మాటలన్నియు వారియెదుట తెలియపరచెను. అందుకు ప్రజలందరు యహువః చెప్పినదంతయు చేసెదమని యేకముగా ఉత్తరమిచ్చిరి” (నిర్గమకాండము 19: 7 & 8). వారు నిజాయితీగా ఉన్నారు, కానీ కొద్ది వారాల్లోనే వారు బంగారు దూడను ఆరాధించారు. పడిపోయిన స్వభావం కలిగి ఉన్నప్పుడు కోరిక మరియు సంకల్పశక్తి మాత్రమే సరిపోదని ఆధునిక విశ్వాసుల వలె వారు కూడా అర్థం చేసుకోలేకపోయారు.
అయితే, యహువః వాగ్దానం ఏమిటంటే, మనతో కొత్త నిబంధనను స్థాపించుట ద్వారా ఈ సమస్యను పరిష్కరించుట. పాత మరియు కొత్త నిబంధనలకు మధ్య ఉన్న తేడా ఇదే. మన కోసం మనం చేయలేని దానిని యహువః మన కోసం చేస్తాడు. అతని ధర్మాన్ని మార్చడం ద్వారా కాదు, కానీ అతని ప్రజలను మార్చడం ద్వారా.
ఇదిగో నేను ఇశ్రాయేలు వారితోను యూదా వారితోను క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి; ఇదే యహువః వాక్కు. అది ఐగుప్తులోనుండి వారిని రప్పించుటకై నేను వారిని చెయ్యి పట్టుకొనిన దినమున, వారి పితరులతో నేను చేసిన నిబంధనవంటిది కాదు; నేను వారి పెనిమిటినైనను వారు ఆ నిబంధనను భంగము చేసికొనిరి; యిదే యహువః వాక్కు.
ఈ దినములైన తరువాత నేను ఇశ్రాయేలు వారితోను యూదా వారితోను చేయబోవు నిబంధన యిదే, వారి మనస్సులలో నా ధర్మవిధి ఉంచెదను, వారి హృదయముమీద దాని వ్రాసెదను; యహువః వాక్కు ఇదే. నేను వారికి దేవుడనై యుందును వారు నాకు జనులగుదురు; వారు మరి ఎన్నడును యహువఃనుగూర్చి బోధనొందుదము అని తమ పొరుగువారికిగాని తమ సహోదరులకుగాని ఉపదేశము చేయరు; నేను వారి దోషములను క్షమించి వారి పాపములను ఇక నెన్నడును జ్ఞాపకము చేసికొనను. (యిర్మీయా 31:31-34)
విశ్వాసి ఈ వాగ్దానాన్ని అడిగినప్పుడు, పరిశుద్ధాత్మ యొక్క ఆదరణ ఇవ్వబడుతుంది. దీనిని పరిశుద్ధాత్మ యొక్క సంచకరువు [డౌన్ పేమెంట్] గా అనుకోండి. ఈ ముందస్తు చెల్లింపు అనేది యహువః రాజ్యాన్ని భూమిపై స్థాపించడానికి యహూషువః తిరిగి వచ్చినప్పుడు స్థాపించబోవు కొత్త ఒడంబడికను చూపే వాగ్దానం. ఆ సమయంలో, యహువః మన పడిపోయిన స్వభావాలను తీసివేసి, మన హృదయాలపై తన ధర్మశాస్త్రాన్ని వ్రాస్తాడు! ఇంకెన్నడూ మనం పాపం చేయునట్లు బలవంతం చేయబడము.
విశ్వాసం ద్వారా పొందుతున్న అంతర్గత ఆత్మ యొక్క "సంచకరువు" ఒక ముఖ్యమైన పనిని చేస్తుంది. ఇది విశ్వాసులను ధర్మశాస్త్రాన్ని ద్వేషించే స్థితినుండి ధర్మశాస్త్రాన్ని ప్రేమించేవారిగాను, పాపాన్ని ప్రేమించే స్థితినుండి, పాపాన్ని ద్వేషించేవారిగాను మారుస్తుంది. ఇది ఒక ముఖ్యమైన ముందస్తు అవసరం. మానవ సంకల్పాన్ని యహువః బలవంతం చేయడు. దైవిక ధర్మాన్ని ద్వేషించే వారిపై అతడు తన ధర్మాన్ని ఎన్నడూ వ్రాయడు, అది దైవిక లక్షణం యొక్క ప్రతిరూపం.
ఈ లావాదేవీని పౌలు చక్కగా వివరించాడు: “మీతో కూడ క్రీస్తునందు నిలిచియుండునట్లుగా మమ్మును స్థిరపరచి అభిషేకించినవాడు దేవుడే. ఆయన మనకు ముద్రవేసి, మన హృదయములలో మనకు ఆత్మ అను సంచకరువును అనుగ్రహించియున్నాడు. (2 కొరింథీయులు 1:21-22). మన పడిపోయి ఉన్న స్వభావాల కారణంగా, మనం పొరపాట్లు చేస్తూ పాపంలో పడిపోతాము; దైవిక స్వభావాన్ని సంపూర్ణంగా ప్రతిబింబించుటలో మనం విఫలమైన చోట దాన్ని బహిర్గతం చేయుటకు మనకు ధర్మశాస్త్రం అవసరం. యాకోబు స్వయంగా ఒప్పుకున్నాడు: "అనేక విషయములలో మన మందరము తప్పిపోవుచున్నాము." (యాకోబు 3: 2)
ఏది ఏమైనప్పటికీ, పాత నిబంధన క్రింద పరిశుద్ధాత్మ యొక్క బహుమానం సహాయంతో మనం యః యొక్క స్వచ్ఛతను కోరుకుంటున్నప్పుడు పాపం అసహ్యంగా మారుతుంది. మనం ఏ పాపాలు చేసినా మన పతనమైన మానవ స్వభావాల కారణంగానే తప్ప యః యొక్క చట్టానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయాలనే ఉద్దేశంతో కాదు. నిజంగా మార్పునొందిన ఏ విశ్వాసి కూడా తెలిసియు పాపంలో కొనసాగడు.
కొత్త నిబంధన శాశ్వత పాప సమస్యకు పరిష్కారం. మన పడిపోయిన స్వభావాలు భర్తీ చేయబడతాయి మరియు యః యొక్క ధర్మం మన హృదయాలపై వ్రాయబడుతుంది. ఆ సమయంలో, విశ్వాసులు పూర్తిగా యహువః ఆత్మతో నింపబడతారు. అప్పుడు మరియు అప్పుడు మాత్రమే విశ్వాసులు దైవిక ధర్మాన్ని పాటిస్తారు, దైవిక రూపాన్ని సంపూర్ణంగా ప్రతిబింబిస్తారు.
నేను అన్యజనుల లోనుండి మిమ్మును తోడుకొని, ఆ యా దేశములలోనుండి సమకూర్చి, మీ స్వదేశములోనికి మిమ్మును రప్పించెదను. మీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధజలము చల్లుదును, మీ విగ్రహములవలన మీకు కలిగిన అపవిత్రత అంతయు తీసివేసెదను. నూతన హృదయము మీ కిచ్చెదను, నూతన స్వభావము మీకు కలుగజేసెదను, రాతిగుండె మీలోనుండి తీసివేసి మాంసపు గుండెను మీకిచ్చెదను. నా ఆత్మను మీయందుంచి, నా కట్టడల ననుసరించు వారినిగాను నా విధులను గైకొను వారినిగాను మిమ్మును చేసెదను. నేను మీ పితరులకిచ్చిన దేశములో మీరు నివసించెదరు, మీరు నా జనులై యుందురు నేను మీ దేవుడనై యుందును. (యెహెజ్కేలు 36:24-28)
పాత నిబంధన, విశ్వాసులలో పాపం పట్ల ద్వేషాన్ని మరియు దైవిక ధర్మశాస్త్రం పట్ల ప్రేమను సృష్టిస్తుంది, ప్రతి ఒక్కరూ పతనమైన స్వభావాలు కలిగి ఉన్నందున ఆ నిబంధన ఎవరినీ పాపం చేయకుండా నిరోధించుటకు సరిపోదు. కొత్త నిబంధన యొక్క వాగ్దానం ఏమిటంటే, ఎవరైతే విశ్వాసం ద్వారా ఇశ్రాయేలుతో తమను తాము ఐక్యపరుచుకొని, వారి మాతృ మూలమునకు అంటుకట్టుటకు పరిశుద్ధాత్మను అనుమతిస్తారో, వారు యహూషువః తిరిగి వచ్చి భూమిపై యః రాజ్యాన్ని స్థాపించినప్పుడు దైవిక స్వభావంలో భాగస్వాములు అవుతారు. యహువః తన ధర్మశాస్త్రాన్ని వారి హృదయాలపై వ్రాస్తాడు. ఇది కొత్త నిబంధన వాగ్దానం.