విద్యుత్తు బల్బును కనిపెట్టే క్రమంలో అనేకసార్లు విఫలమైనప్పుడు తనకు ఎలా అనిపించిందని థామస్ ఆల్వా ఎడిసన్ను అడిగినప్పుడు, ఎడిసన్ ఇలా సమాధానమిచ్చాడు, “నేను విఫలం కాలేదు. నేను పనిచేయని 10,000 మార్గాలను కనుగొన్నాను.”
![]() |
థామస్ ఎ. ఎడిసన్ |
అతని స్పందన నాకు ఎప్పుడూ నచ్చుతుంది. ఇది ప్రతి ఒక్కరూ ప్రతికూలంగా పరిగణించే వాటిని తీసుకొని వాటిని సానుకూలంగా మారుస్తుంది. ఇదే సూత్రాన్ని క్రైస్తవ నడకకు అన్వయించవచ్చు. దైవిక ధర్మశాస్త్రంలోని అందాన్ని చూడటం, మనం యహువఃను ప్రేమిస్తున్నందున ఆయనకు లోబడాలని కోరుకోవటం, మళ్లీ మళ్లీ పాపం చేయటం మనల్ని నిరుత్సాహపరుస్తుంది.
మనం పాపం చేయకూడదని మనకు తెలిసినప్పటికీ, పాపం చేయుటలో కొనసాగిన అపరాధాన్ని ఎదుర్కొనుటకు, చాలామంది క్రైస్తవులు "ధర్మశాస్త్రం సిలువకు వ్రేలాడదీయబడింది" అని నమ్ముతారు. ఇరుకు మార్గమున నడుచు క్రైస్తవులు తప్పిపోవునంత కాలం వారు ఏ దిశగా తప్పిపోయినా సాతానుకు పర్వాలేదు. దైవిక ధర్మశాస్త్రాన్ని పాటించుటకు కృషి చేసే మరియు శ్రమించే ఒక క్రైస్తవుడు తాను అనివార్యంగా మళ్ళీ పాపంలోనికి పడినప్పుడు అపరాధభావంతో నిండిపోతాడు, అతడు యః నుండి వెనక్కి తగ్గుతాడు, అతడు కూడా ధర్మశాస్త్రం సిలువకు వ్రేలాడదీయబడినందున ధర్మాన్ని పాటించాల్సిన అవసరం లేదని భావించే క్రైస్తవుని అంత ఎక్కువగా సాతాను ఇష్టాలను నెరవేరుస్తాడు. పాపం—మరియు దాని జత అయిన అపరాధం—మనల్ని యః నుండి వేరు చేస్తాయి, కాబట్టి విధేయత అవసరం లేదని భావించే వ్యక్తిలో పని చేసినట్లుగా అపవాది అధిక అపరాధంతో మనలో సులభంగా పని చేయగలడు.
యహూషువః తిరిగి వచ్చినప్పుడు యహువః తన విశ్వాసులతో నూతనమైన, భిన్నమైన నిబంధన చేసినప్పుడు మాత్రమే పాపరహిత జీవనం వాస్తవం అవుతుంది.
ఇదిగో నేను ఇశ్రాయేలువారితోను యూదావారి తోను క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి; ఇదే యహువః వాక్కు.
అది ఐగుప్తులోనుండి వారిని రప్పించుటకై నేను వారిని చెయ్యి పట్టుకొనిన దినమున, వారి పితరులతో నేను చేసిన నిబంధనవంటిది కాదు; నేను వారి పెనిమిటినైనను వారు ఆ నిబంధనను భంగము చేసికొనిరి; యిదే యహువః వాక్కు.
ఈ దినములైన తరువాత నేను ఇశ్రాయేలువారితోను యూదావారితోను చేయబోవు నిబంధన యిదే, వారి మనస్సులలో నా ధర్మవిధి ఉంచెదను, వారి హృదయముమీద దాని వ్రాసెదను; యహువః వాక్కు ఇదే. నేను వారికి దేవుడనై యుందును వారు నాకు జనులగుదురు. (యిర్మీయా 31:31-34)
ఇది ఇప్పటికి ఇంకా నెరవేరని వాగ్దానము! మనకు పాపభరితమైన, పతనమైన స్వభావాలు ఉన్నంత వరకు మనం ధర్మశాస్త్రాన్ని సంపూర్ణంగా పాటించలేము. యహూషువః తిరిగి వచ్చినప్పుడు యః స్థాపించబోవుచున్న "కొత్త నిబంధన" ఆ సమస్యను పరిష్కరిస్తుంది. యహువః తన ధర్మశాస్త్రం వ్రాయబడిన నూతన హృదయాలను విశ్వాసులకు బహుమానంగా ఇవ్వబోవుచున్నాడు.
ఎడిసన్ తన ప్రతి "వైఫల్యం" లోను అవకాశాలను చూసినట్లుగా, విశ్వాసులు పాపానికి వ్యతిరేకమైన తమ నిరంతర పోరాటంలో పాత నిబంధన క్రింద తమ పడిపోయిన స్వభావాలలో ఇప్పటికే జరిగిన మార్పుకు సంబంధించిన చక్కని వాస్తవాన్ని చూడలేకపోవుచున్నారు. మన సంకల్పాలను దైవిక సంకల్పంతో అమరికలోకి తీసుకురావడానికి మనల్ని ప్రేరేపించే కోరిక, యః తన విశ్వాసులకు బహుమానంగా ఇచ్చిన పరిశుద్ధాత్మలో కొంత భాగం కారణంగా కలిగినది, ఇది ఆయన మన హృదయాలపై తన ధర్మశాస్త్రాన్ని వ్రాసినప్పుడు సంభవించే పరిపూర్ణ-ప్రవాహానికి సంచకరువు. పాపం అసహ్యంగా మారుతుంది మరియు ఇప్పుడు మనం అసహ్యించుకునే ధర్మాన్ని మనం ప్రేమిస్తాము మరియు పాటించాలనుకుంటాము. ఇది హృదయంపై పని చేసే దయ!
“ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి” (లూకా 13:24). కానీ మీరు పడిపోయిన స్వభావాన్ని కలిగి ఉన్నందున మీరు అనివార్యంగా పొరపాట్లు చేసి పడిపోయినప్పుడు యః వద్దకు తిరిగి వచ్చుటకు వెనుకాడకండి. పాపరహిత జీవితం అనే వాగ్దానం ఇప్పటికి కూడా భవిష్యత్తుకు సంబంధించినదే. ఈ వాగ్దానం ఎప్పుడు నెరవేరుననో ఈ వాగ్దానానికి సంబంధించిన అంశాలు స్పష్టంగా తెలియజేస్తాయి. యిర్మీయా 31లోని తదుపరి వచనం స్పష్టంగా ఇంకా నెరవేరని ప్రవచనంలోని ఒక ముఖ్యమైన భాగాన్ని వెల్లడిస్తుంది: “వారు మరి ఎన్నడును యహువఃను గూర్చి బోధనొందుదము అని తమ పొరుగువారికిగాని తమ సహోదరులకుగాని ఉపదేశము చేయరు; నేను వారి దోషములను క్షమించి వారి పాప ములను ఇక నెన్నడును జ్ఞాపకము చేసికొనను గనుక అల్పు లేమి ఘనులేమి అందరును నన్నెరుగుదురు; ఇదే యహువః వాక్కు." (యిర్మీయా 31:34)
స్పష్టంగా, ప్రజలు ఇప్పటికీ యహువః గురించి ఇతరులకు బోధిస్తున్నారు, కాబట్టి ఈ వాగ్దానం ఇంకా నెరవేరలేదు. తర్వాత ఆయన 38వ వచనంలో ఇలా కొనసాగిస్తున్నాడు: “యహువః ఈలాగు సెలవిచ్చుచున్నాడు; రాబోవు దినములలో హనన్యేలు గోపురము మొదలుకొని మూలగుమ్మము వరకు పట్టణము యహువః పేరట కట్టబడును.” బబులోను చెర నుండి తిరిగి వెళ్ళుటకు కోరేషు ఇశ్రాయేలీయులను అనుమతించినప్పుడు ఇది పాక్షికంగా నెరవేరినప్పటికీ, అంతిమ నెరవేర్పు నూతన యెరూషలేము భూమిపైకి తీసుకురావడాన్ని సూచిస్తుంది.
మరియు ఈ ప్రవచనంతో ఏ వాగ్దానాలు ముడిపడి ఉన్నాయి! యిర్మీయా 32 మరియు 33 అధ్యాయాలు కూడా విశ్వాసులకు భవిష్యత్ బహుమానాలను వాగ్దానం చేసే ఇదే విషయంలోని భాగాలే.
ఇదిగో నాకు కలిగిన కోపోద్రేకము చేతను మహా రౌద్రము చేతను నేను వారిని వెళ్లగొట్టిన దేశములన్నిటిలోనుండి వారిని సమకూర్చి యీ స్థలమునకు తిరిగి రప్పించి వారిని నిర్భయముగా నివసింపజేసెదను. వారు నాకు ప్రజలైయుందురు నేను వారికి దేవుడనై యుందును. మరియు వారికిని వారి కుమారులకును మేలు కలుగుటకై వారు నిత్యము నాకు భయపడునట్లు నేను వారికి ఏకహృదయమును ఏక మార్గమును దయచేయుదును. నేను వారికి మేలు చేయుట మానకుండునట్లు నిత్యమైన నిబంధనను వారితో చేయుచున్నాను; వారు నన్ను విడువకుండునట్లు వారి హృదయములలో నా యెడల భయభక్తులు పుట్టించెదను. వారికి మేలు చేయుటకు వారియందు ఆనందించుచున్నాను, నా పూర్ణహృదయముతోను నా పూర్ణాత్మతోను ఈ దేశములో నిశ్చయముగా వారిని నాటెదను. (యిర్మీయా 32:37-41)
ఆత్మీయ బబులోను అనగా, వాస్తవానికి, యః పై తిరుగుబాటులో సాతానుతో కలిసిన వారందరూ. మనం నిజంగానే లోపంతో నిండిన విశ్వాస వ్యవస్థల మధ్య "చెదిరిపోయి" ఉన్నాము. కానీ వాగ్దానం ప్రకారం యహువః తన సొంతవారిని సమకూర్చుకుంటాడు మరియు వారితో కొత్త నిబంధనను ఏర్పాటు చేస్తాడు. ఆయన మన దేవుడై ఉండును మరియు మనం ఆయన ప్రజలమై ఉంటాము. భూమి నూతనముగా చేయబడినప్పుడు, విశ్వాసుల హృదయాలపై యః యొక్క ధర్మశాస్త్రం వ్రాయబడినప్పుడు, మానవజాతిని సృష్టించుటలో గల ఆయన యొక్క అసలైన ఉద్దేశ్యం నెరవేరుతుంది. ఆయన మనతో ఈ కొత్త నిబంధనను స్థాపించుననుటకు రుజువు ఆయన ఎన్నటికీ మాట తప్పడు. "నేెెను ఈ ప్రజలమీదికి ఇంత గొప్ప కీడు రప్పించిన రీతినే నేను వారినిగూర్చి చెప్పిన మేలంతటిని వారిమీదికి రప్పింపబోవుచున్నాను." (యిర్మీయా 32:42)
మీరు విఫలమైనప్పుడు కూడా పోరాడుటను కొనసాగించండి. అయితే యహువః ఎన్నటికీ మాట తప్పడు అనే వాస్తవాన్ని చూసి ఓదార్పు పొందండి మరియు ఏదో ఒకరోజు, యహువః తానే “వారి కన్నుల ప్రతి బాష్పబిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనయైనను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించి పోయెను.” (ప్రకటన 21:4)