బూరలు ప్రపంచంపై ధ్వనించుటకు సిద్ధంగా వున్నాయి! సాధారణ ప్రజలు వారి మీదికి ఏమివస్తుందోనని ఎలాంటి ఆధారము లేక ఆందోళన చెందు సమయంలో, ఆయన యొక్క నమ్మకమైన అనుచరులు మాత్రం భయమును గూర్చి కంగారుపడకుండా ఉందురు. WLC ఒక హెచ్చరిక చేయుటకు ప్రేరేపించబడుచున్నది!!!
బూర, దీనిని పురాతన కాలంలో, ముఖ్యమైన ప్రకటనలు చేసేందుకు ఒక సాధనంగా ఉపయోగించేవారు. యహువః యొక్క పవిత్ర దినాలను బూరధ్వని [బాకానాదం] తో ప్రకటించేవారు. యుద్ధాలు బాకా నాదాలతో మొదలయ్యేవి. బాకా యొక్క నాదమును ఎల్లప్పుడూ జరుగుతున్న ముఖ్యమైన సంఘటనలను దేశప్రజల దృష్టికి తీసుకువెళ్లుటకు ఉపయోగించేవారు.
నేడు ఆయనను అంగీకరించిన జనులందరూ ప్రకటన గ్రంథంలో గల బూరలను అలక్ష్యము చేయక వాటి స్వభావాలను మరియు సమయాలను పూర్తిగా అర్థంచేసుకోవలసి యున్నది.
ఆసన్నమవుతున్న బూరల ధ్వనులను గూర్చి హెచ్చరిక చేయుటలో WLC ఎందుకు 'నిమగ్నమై' ఉంది?
ఆసన్నమవుతున్న బూరల ధ్వనులను గురించి హెచ్చరిక చేయుటకంటే మావద్ద మరే ఇతర మార్గము లేదు. బాకాలు మ్రోగబోవు సమయాలను మరియు వాటి ఉద్దేశాల యొక్క అర్థాలను తెలుసుకొనునట్లు మా మార్గంలో తన కాంతిని ప్రచురించడం ద్వారా తండ్రి మాకు సహాయం చేసెను. ఆయన ప్రజల నుండి ఆయన కాంతి కిరణాలను మనము దాచగలమా? మా స్థితితో ఆమోసు ప్రవక్త ఏకీభవించాడు. తాను ఇలా ప్రకటించాడు:
సింహము గర్జించెను, భయపడనివాడెవడు? ఎలోహీం అయిన యహువః ఆజ్ఞ ఇచ్చియున్నాడు, ప్రవచింపకుండువాడెవడు? ( ఆమోసు 3:8 చూడండి.)
మా స్థితి ప్రవక్త యిర్మీయా వేదనను కూడా ప్రతిబింబిస్తుంది, ఆయన ఇలా ప్రకటించారు:
నా కడుపు, నా కడుపు, నా అంతరంగములో నాకెంతో వేదనగానున్నది; నా గుండె నరములు, నా గుండె కొట్టుకొనుచున్నది, తాళలేను; నా ప్రాణమా, బాకానాదము వినబడుచున్నది గదా, యుద్ధ ఘోష నీకు వినబడుచున్నది గదా? కీడు వెంట కీడు వచ్చుచున్నది, దేశమంతయు దోచుకొనబడుచున్నది, నా గుడారములు హఠాత్తుగాను నిమిషములో నా డేరా తెరలును దోచుకొనబడి యున్నవి. 4: 19-20 (NKJV)
యిర్మీయా వలె మేమును, మనము నివసిస్తున్న ఈ ప్రపంచంలో 7 బూరలు ధ్వనించుటను గూర్చిన అర్ధమును గ్రహించి యున్నాము. 7 బూరలు మ్రోగుటలో గల యహువః యొక్క ఉద్దేశ్యంను మరియు అర్ధమును వినుటకు ఇష్టపడు వారందరినీ సిద్ధంచేయుటను WLC తన కర్తవ్యంగా భావిస్తుంది.
బూరలు మ్రోగుట ద్వారా ప్రపంచానికి రాబోయే వినాశనము మరియు ప్రాణనష్టము యొక్క మేర వర్ణించలేనిదిగా వుంటుంది. 7 బూరల కాలంలో నివశించుట అత్యంత భయంకరమైన అనుభవం మరియు ఆయన మనకు ఆశ్రయంగాను మరియు కోటగాను లేకపోతే పూర్తి నిరాశ మరియు నాశనం మిగులుతుంది. అటువంటి సమయమును గూర్చి ప్రవక్త జెఫన్యా వర్ణించిన స్పష్టమైన వర్ణన ఇక్కడ ఉంది:
“యహువః మహాదినము సమీపమాయెను, యహువః దినము సమీపమై అతి శీఘ్రముగా వచ్చుచున్నది. ఆలకించుడి, యహువః దినము వచ్చుచున్నది, పరాక్రమశాలురు మహారోదనము చేయుదురు. ఆ దినము ఉగ్రతదినము, శ్రమయు ఉపద్రవమును మహానాశనమును కమ్ముదినము, అంధకారమును గాఢాంధకారమును కమ్ముదినము, మేఘములును గాఢాంధకారమును కమ్ముదినము. ఆ దినమున ప్రాకారములుగల పట్టణముల దగ్గరను, ఎత్తయిన గోపురముల దగ్గరను యుద్ధ ఘోషణయు బాకానాదమును వినబడును. జనులు యహువః దృష్టికి పాపము చేసిరి గనుక నేను వారి మీదికి ఉపద్రవము రప్పింపబోవుచున్నాను; వారు గ్రుడ్డి వారివలె నడిచెదరు, వారి రక్తము దుమ్మువలె కారును, వారి మాంసము పెంటవలె పారవేయబడును." జెఫన్యా 1: 14-16 (NKJV)
అందువలన భూనివాసులందరికీ హెచ్చరిక చేయుటకు మేము బలవంతం చేయబడుచున్నాము, యోవేలు ప్రవక్త ద్వారా ఆజ్ఞాపించినట్లు:
"సీయోను కొండమీద బాకా ఊదుడి నా పరిశుద్ధ పర్వతముమీద హెచ్చరిక నాదము చేయుడి యహువః దినము వచ్చుచున్నదనియు అది సమీపమాయెననియు దేశనివాసులందరు వణకుదురుగాక." (యోవేలు 2: 1, KJV)
వినగలిగిన వారందరికీ మేము ఈ బూరలను గూర్చి హెచ్చరిక చేయనియెడల, అప్పుడు నశించిన వారియొక్క రక్తము మా తలల మీద ఉంటుంది.
అతడు దేశముమీదికి ఖడ్గము వచ్చుట చూచి, బాకా ఊది జనులను హెచ్చరిక చేసిన సమయమున, ఎవడైనను బాకానాదము వినియును జాగ్రత్తపడనందున ఖడ్గము వచ్చి వాని ప్రాణము తీసినయెడల వాడు తన ప్రాణమునకు తానే ఉత్తరవాది, బాకానాదము వినియును వాడు జాగ్రత్తపడకపోయెను గనుక తన ప్రాణమునకు తానే ఉత్తరవాది; ఏలయనగా వాడు జాగ్రత్తపడిన యెడల తన ప్రాణమును రక్షించుకొనును. (యెహెజ్కేలు 33: 3-5, NKJV)
బూరలు అనేవి గతించిపోయిన సంఘటనలు అని విస్తృతంగా అభిప్రాయపడుతున్న దాని మాటేమిటి?
బూరలు ఇప్పటికే గతించియున్నవనే నమ్మకంలోనికి నేడు చాలా మంది క్రైస్తవులు నడిపింపబడుతున్నారు, అలా వారు వాటిని అధ్యయనం చేయాల్సిన అవసరంలేదని పక్కకు నెట్టివేస్తున్నారు. WLC వద్ద మేము , ఈ విధమైన నమ్మకం చాలా ప్రమాదకరమని చెప్పుచున్నాము. మేము క్రింది కారణాల వలన బూరలు ఇప్పటికే పూర్తియైనవనే అభిప్రాయమును తీవ్రంగా వ్యతిరేకించుచున్నాము.
ప్రకటన గ్రంథం మొత్తం యహూషువః రెండవ రాకడకు ముందు జరగబోయే సంఘటనలను ముందుగా తెలియజేయుటకు, ముఖ్యంగా 'కడవరి కాలం' ప్రారంభమైన తరువాత జరుగు సంఘటనలను తెలుపుటకు ఇవ్వబడినది; అనగా 1798 తరువాత. ఇది 1260 ప్రవచన సంవత్సరాల కాలం పూర్తియైన సంవత్సరం. ఈ కీలకమైన 1798 వ సంవత్సరం వరకు జరుగు సంగతులను గూర్చి దానియేలు గ్రంథం ఎక్కువ సమాచారాన్ని కలిగియుండగా, ప్రకటన గ్రంధము 1798 తరువాత జరగబోయే సంఘటనలను గూర్చి అనేక వివరాలను కలిగియున్నది. కావున బూరలను గూర్చిన సమాచారం ప్రకటన గ్రంధంలో ఉండెను, దానియేలు గ్రంధంలో కాదు. ఈ కారణంగా బూరలు 1798 తర్వాత జరుగే సంఘటనలని తెలుస్తుంది. బూరలు అనేవి చివరి కాలంలో ఉన్న ఆయన ప్రజలకు సంబంధించినవి, ఉద్దేశింపబడినవి.
బూరలు అనేవి కృప ముగిసిన తరువాత జరగబోవు సంఘటనలు, ముందు కాదు అనే అభిప్రాయం మాట ఏమిటి?
బూరలు జరిగిపోయిన సంఘటనలు కాదు, భవిష్యత్ సంఘటనలని నమ్మేవారు, 7 బూరలు కూడా 7 తెగుళ్ల వలెనే కృపాకాలం ముగిసిన తరువాత జరగబోయే సంగతులని చెప్పెదరు. వీరు బూరలు మరియు తెగుళ్లను గూర్చిన విషయాలను వ్రాయుటకు ఉపయోగించిన భాషలోగల కొన్ని సారూప్యతల మీద ఆధారపడి ఈ అభిప్రాయానికి వచ్చారు. తదనుగుణంగా, ఒక్కొక్క బూర దానికి సంబంధించిన తెగులును ప్రకటించునని; 7 బూరలు 7 తెగుళ్లని చెప్పెదరు. WLC వద్ద, మేము ఈ క్రింది 2 కారణాలవలన ఈ తప్పుడు వివరణను వ్యతిరేకిస్తున్నాము.
1. చివరికాలపు సంఘటనలలో చాలా వరకు బూరలు ధ్వనించే సమయాలతో కాలక్రమానుసారంగా పొందుపరచబడి ఉన్నాయి. ఈ సంఘటనలను గూర్చి చదివిన తరువాత ఇవి ప్రతిమనిషి యొక్క ఆత్మకు 'పరీక్షా' సంఘటనలై ఉన్నాయని స్పష్టమవుచున్నది; ఇవి పరీక్షా సంఘటనలైతే అప్పుడు పరిశీలనా కాలం ఇంకా ముగియలేదు అని తెలియుచున్నది. పరిశీలనా కాలం (కృపా కాలం) ముగిసిన తరువాత (ప్రతి ఆత్మ యొక్క గమ్యము శాశ్వతంగా నిర్ణయించబడిన తరువాత) యహువః మనుష్యులను పరీక్షించునని భావించుట అర్ధవంతమైనది కాదు.
2. ప్రకటన గ్రంధంలో ఉన్న బూరల కధనమును వర్ణించిన భాగము లేదా అధ్యాయాల భాగము, అవి పరిశీలనా కాలం ముగియుటకు ముందు జరుగునని నిర్ధారించుకొనుటకు మనలను ప్రేరేపించుచుండెను. ప్రకటనలో 22 అధ్యాయాలు ఉన్నాయి. మొదటి 18 అధ్యాయాలు యహూషువః యొక్క రెండవ రాకడను గూర్చి వర్ణించును. 7 బూరలు 8వ అధ్యాయం నుండి 11వ అధ్యాయం వరకు అనగా 4 అధ్యాయాల పరిధిలోనికి వచ్చుచున్నవి. కాబట్టి తండ్రి యహువః, యహూషువః యొక్క రెండవ రాకడ తరువాత జరుగు మహిమకరమైన విషయాలను తెలియజేయుట కొరకు కేవలం 4 అధ్యాయాలను (19-22 అధ్యాయాలు) ఏర్పాటు చేసినప్పుడు, పరిశీలనా కాలానికి తరువాత సంఘటనలను గురించి కూడా 4 అధ్యాయాలను నియమించెననుకొనుట ఆమోదయోగ్యంగా ఉండదు. పరిశీలనా/ కృపా కాలం ముగిసినది మొదలుకొని యహూషువః రెండవ రాకడ వరకు గల మధ్య జరుగు సంఘటనలను వివరించుటకును; మరియు యహూషువః రెండవ రాకడ జరిగినది మొదలుకొని వెయ్యేండ్ల పాలన తరువాత దుష్టుల అంతిమ వినాశనం వరకు జరుగు చిరస్మరణీయ సంఘటనలను వివరించుటకును ఈ రెండిటికీ తండ్రి సమాన ప్రాముఖ్యతను కేటాయించెననుకొనుట ఆలోచింపదగినదిగా లేదు.
బూరలు మ్రోగుటకు కొంచెం ముందు అతిపరిశుద్ధ స్థలంలో యహూషువః యొక్క యాజక పరిచర్య విరమణను సూచించే, అనగా, బూరలు మ్రోగుటకు కొంచెం ముందు మానవుని కృపాకాలం ముగింపును సూచించే, ప్రకటన గ్రంథం 8:5 లో ఒక దూత ద్వారా ధూపార్తి భూమిపై పడవేయబడుటను గూర్చిఏమిటి?
ధూప పాత్రను భూమిపైన పడవేసే సన్నివేశాన్ని సరిగా అర్థం చేసుకొనుటకు మనము ప్రకటన 8: 2-5 వరకు చదవాలి:
2. అంతట నేను యహువః యెదుట నిలుచు ఏడుగురు దూతలను చూచితిని; వారికి ఏడు బూరలియ్యబడెను.
3. మరియు సువర్ణధూపార్తి చేత పట్టుకొనియున్న వేరొక దూతవచ్చి బలిపీఠము ఎదుట నిలువగా సింహాసనము ఎదుట ఉన్న సువర్ణబలిపీఠముపైన పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలుపుటకై (మూలభాషలో-ఇచ్చుటకై) అతనికి బహు ధూపద్రవ్యములు ఇయ్యబడెను.
4. అప్పుడా ధూపద్రవ్యముల పొగ పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసి దూత చేతిలోనుండి పైకి లేచి యహువః సన్నిధిని చేరెను.
5. ఆ దూత ధూపార్తిని తీసికొని, బలి పీఠముపైనున్న నిప్పులతో దానిని నింపి, భూమిమీద పడ వేయగా ఉరుముల ధ్వనులు మెరుపులు భూకంపమును కలిగెను. ప్రకటన 8: 2-5 (KJV)
ఇక్కడున్న ఈ దూత అక్కడ ఏడు బూరలు ఇవ్వబడిన ఏడు దేవదూతలలో ఒకటి కాదని మనము 2 వ వచనంను బట్టి సులభంగా తెలుసుకోవచ్చు. అయితే, అప్పుడు ధూపపీఠము దగ్గరకు వచ్చి నిలుచున్న ఆ 'ఇతర దేవదూత' ఎవరు? అనేకులు ఈ 'ఇతర దేవదూత' యహూషువః తప్ప మరొకరు కాదు అని నిర్ధారించారు. మేము క్రింది 3 కారణాల వల్ల, ఈ నిర్ధారణను తిరస్కరిస్తాము:
1. ఈ 'ఇతర దేవదూత' ప్రకటన 5:8 లో 24 మంది పెద్దలు చేయుచున్నట్లు వివరించబడిన అదే పనిని చేయుచుండెను. వారు పరిశుద్ధుల ప్రార్థనలు అనే ధూపద్రవ్యముతో నిండిన సువర్ణ పాత్రలను కలిగి గొర్రెపిల్ల ముందు నిలబడియుండిరి. వారు పరిశుద్ధుల ప్రార్థనలు అనే పరిమళమును తీసుకుని ధూపద్రవ్యపీఠము మీద వాటిని అర్పించుచుండిరి. ఈ 24 మంది పెద్దలు ఆరాధించబడుటకు అర్హులుగా చెప్పబడలేదు కాని నిజానికి తాము తండ్రిని మరియు గొర్రె పిల్లను పూజించుచుండిరి (ప్రకటన 5:14). అందువలన, 24 మంది పెద్దలు చేయుచున్న పనినే యహూషువః కూడా చేయుచున్నాడని మనము ఆరోపించుట ఆయనను మహిమపరుచుట కాదు.
2. ఈ 'ఇతర దేవదూత' యహూషువః కాదు అనుటకు గల రెండవ కారణం ఏమిటంటే, ఈ దేవదూత ధూపాన్ని అందించుట లేదు; కానీ వాస్తవానికి అది అతనికి ఇవ్వబడింది. అయితే యహూషువః ఇచ్చేవాడు (తప్ప ఇవ్వబడేవాడు కాడు) అనేది స్పష్టము ఎందుకంటే ఆయన యొక్క యోగ్యమైన విధేయత మరియు మరణము ధూపమైయుండగా, అది పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసినప్పుడు అవి తండ్రి యహువఃకు చాలా ఇష్టమైన ప్రార్థనలవుతాయి.
3. ఈ 'ఇతర దేవదూత' యహూషువః కాదు అనుటకు గల మూడవ కారణం ఏమిటంటే, ప్రకటన గ్రంధంలో యహూషువఃకు ఇవ్వబడిన 35 పేర్లలో మరియు శీర్షికలలో ఒక్కసారీ 'దూత' గా ఇవ్వడలేదు. ఇక్కడ, ఆయన కోసం వాడబడిన అన్ని పేర్ల మరియు శీర్షికల జాబితా ఉంది:
1. యహూషువః మెస్సీయ .... ప్రకటన 1: 1
2. నమ్మకమైన సాక్షి ... .. ప్రకటన 1: 5
3. మృతులలోనుండి మొదట లేచినవాడు ... .. ప్రకటన 1: 5
4. భూపతులకు రాజు ... .. ప్రకటన 1: 5
5. అల్ఫా మరియు ఓమెగ ... .. ప్రకటన 1:8-13
6. మొదటివాడు మరియు కడపటివాడు ... .. ప్రకటన 1: 8, 11, 13
7. మనుష్య కుమారుడు ... .. ప్రకటన 1:13
8. మృతుడై తిరిగి లేచినవాడు... .. ప్రకటన 1:13, 18
9.ఏడు నక్షత్రాలు చేతపట్టినవాడు ... .. ప్రకటన 2: 1
10. దీపస్తంభాల మధ్య సంచరిచువాడు ... .. ప్రకటన 2: 1
11.రెండంచులు గల పదునైన ఖడ్గం గలవాడు ... .. ప్రకటన 2:12
12.యహువః కుమారుడు ... .. ప్రకటన 2:18
13. అంతరింద్రియాలను మరియు హృదయాలను పరీక్షించువాడు ... .. ప్రకటన 2:23
14. యహువః యేడు ఆత్మలు కలిగియున్నవాడు ... .. ప్రకటన 3: 1
15. ఏడు నక్షత్రాలు చేతబట్టినవాడు ... .. ప్రకటన 3: 1
16. పరిశుద్ధుడు సత్యస్వరూపి ... .. ప్రకటన 3:7
17. దావీదు తాళపుచెవి కలిగినవాడు ... .. ప్రకటన 3:7
18. అయన తీయగా ఎవడును వేయలేడు ... .. ప్రకటన 3: 7
19. ఆయన మూయగా ఎవడును తీయలేడు ... .. ప్రకటన 3: 7
20. ఆమెన్ అనువాడు ... .. ప్రకటన 3:14
21. నమ్మకమైన సత్యసాక్షి ... .. ప్రకటన 3:14
22. యహువః దృష్టికి ఆదియైనవాడు ... .. ప్రకటన 3:14
23. ప్రభువు ... .. ప్రకటన 4:11
24. యూదా గోత్రపు సింహం ... .. ప్రకటన 5: 5,9
25 దావీదు వేరు ... .. ప్రకటన 5: 5,9
26. వధించబడిన గొర్రె ... .. 5: 6,7
27. గొర్రెపిల్ల ... .. ప్రకటన 5: 8,9
28. ప్రభువులకు ప్రభువు ... .. ప్రకటన 17:14
29 రాజులకు రాజు ...... ప్రకటన 17:14
30 నమ్మకమైనవాడు మరియు సత్యవంతుడు ... .. 19:11
31. తెల్లని గుర్రంపై కూర్చున్నవాడు ... .. 19:11
32. యహువః యొక్క వాక్యం ... .. ప్రకటన 19: 13-16
33. మెస్సీయ ... .. ప్రకటన 20: 4
34. ఆదియు అంతము... .. ప్రకటన 22:13
35. ప్రకాశమానమైన వేకువచుక్క... .. ప్రకటన 22: 16
ఇప్పుడు; ఈ 'ఇతర దేవదూత' యహూషువః కాకపోవుట వలన ఇక్కడ దూత ద్వారా సువర్ణ ధూపార్తి భూమిపైన పడవేయబడుట అంటే అతిపరిశుద్ధ స్థలములో యహూషువః యొక్క పరిచర్యను విరమించుట కాదు మరియు అందువలన అది పరిశీలనా/ కృపాకాలం పూర్తియగుటకు సూచన కాదు.
అయితే ధూపార్తిని భూమిపై పడవేయుటలో గల సూచన ఏమిటి?
ధూపార్తిని భూమిపై పడవేయుట అనేది, కృపకాలం పూర్తగుటకు కొంచెం ముందు ఉండబోవు యహువః యొక్క చివరి హెచ్చరికా పిలుపు మండుచున్నట్లుగా, మరియు అత్యంత శక్తివంతంగా, 7 బూరలలో ఒక్కొక్క బూర ధ్వనించినప్పుడు తెరువబడు సంఘటనలలో చూపిన విధంగా ఉండునని సూచిస్తున్నది. మానవ జాతికి తన చివరి ఆహ్వానం బలంగా ఉండాలి. ఇది కృప ఎత్తివేయబడు (అందరికీ ఒకే సారి ఎత్తివేయబడును) కాలానికి కొంచెం ముందు, జాగ్రత్త వహించి పశ్చాత్తాప పడునిమిత్తం ప్రతి జీవాత్మ దృష్టిని ఆకర్షించును.
ఇది మన విధి; ప్రపంచం ప్రతీ మూలన జరుగబోయే ఆపదలను గురించి వినేందుకు ఇష్టపడు వారందరిని హెచ్చరించుట యహూషువః యొక్క ప్రతి అనుచరుని పవిత్ర విధి. మేము ఈ నిజాన్ని దాచలేము, లేదా హెచ్చరిక చేయవలసిన మా బాధ్యతను నిర్లక్ష్యంచేయలేము. ఎవరును తెలిబడయకుండా ఉండకూడదు, ఇది యహువః అభీష్టం. మానవులు చేయగలిగిన మరియు ఖచ్చితంగా చేయవలసిన దానిని పరలోకము నుండి దూతలు వచ్చి చేయవు.
మోషే అహరోనులు ప్రతి తెగులు యొక్క స్వభావంను మరియు అది సంభవించబోవు ఖచ్చితమైన సమయాలను ముందుగానే తెలియజేయబడ్డారు. వారు దీనిని ఫరోకి ప్రకటించాలి, అప్పుడు అతనికి లేదా ఐగుప్తీయులకు హెచ్చరిక లేకుండా చేశారు అనే ఫిర్యాదును చేయుటకు అవకాశం ఉండదు. నేడు, ఆసన్న మవుతున్న బూరల ధ్వనుల గురించి హెచ్చరిక చేయవలసిన బాధ్యతను ఆయన ప్రజలు ప్రతిఒక్కరూ కలిగి ఉన్నారు. ఐగుప్తు మీదికి తెగుళ్లు వచ్చుట ప్రారంభమైనపుడు, వారిమీద ఈ తీర్పు తీసుకుని వచ్చినందుకు ఐగుప్తీయులు మోషేను నిందించారు. అదే విధంగా, ఆయన ప్రజలు విధేయతతో హెచ్చరికను పెంచుతూ బూరల వలన కలిగే విధ్వంసంను మరియు సంహారములను గురించి ప్రపంచాన్ని హెచ్చరించ వలసిన వారై ఉన్నారు. వారు, ఆవిధంగా, ఆ బూరల వలన ధ్వంసం సంభవించి సమస్తము నాశనమవుతున్నపుడు అన్యాయపు నిందలుపొంది, చివరకు దీనంతటికీ కారణం వారే అన్నట్లుగా చూడబడుదురు!
అయినప్పటికీ, ఇది మా పవిత్రమైన బాధ్యత నుండి మమ్మల్ని బయటకు కదిలించలేదు. పశ్చాత్తాపపడి, ఆయన పాదాలయొద్దకు రండి ప్రియమైన వారలారా! సమయం సంకుచితమై వుంది. ఆయన త్వరగా వచ్చుచుండెను!
సింహము గర్జించెను, భయపడనివాడెవడు? ఎలోహీం యహువః ఆజ్ఞ ఇచ్చియున్నారు, ప్రవచింపకుండువాడెవడు? 3: 8 (KJV)