చాలామంది క్రైస్తవులు క్రీస్తు రెండవ రాకడ తమ జీవితకాలంలో జరగదు అని అనుకుంటుంటారు. బదులుగా, ఇప్పుడు ఉన్నట్లుగానే జీవితం స్థిరంగా కొనసాగుతుందని వారు తలచుదురు. ఏదేమైనా, ఊహించని వరుస సంఘటనలు భూమిపై జీవితాన్ని మార్చివేయును . . . ఎప్పటికీ.
|
నాకు అది గుర్తులేదు. నాకు రెండేళ్ల వయసు మాత్రమే, అప్పుడు మా నాన్నపై మా అమ్మకి కోపం వచ్చింది. ఎందుకంటే, నేను చాలా చిన్నవాడినని ఆమె అనుకుంటున్నప్పటికీ ఆయన నన్ను రోలర్ కోస్టర్ రైడ్ ఎక్కించాడు. రైడ్ పూర్తైన తరువాత ఆయన ఏడుస్తున్న శిశువును ఆమె వద్దకు తీసుకువెళ్ళాడు, అయితే, అప్పటికే అతని ప్రక్కనుండి వెళ్ళిన ఇతర పెద్దవారి తీర్పు చూపులను నిశ్శబ్దంగా గమనించుట ద్వారా, ఆమె భయం నిజమే అనిపించింది అతనికి. రోలర్‌కోస్టర్ రైడ్‌లో శిశువును ఎక్కించుటకు రెండు సంవత్సరాల వయస్సు చాలా చిన్నది.
అప్పుడు తాను ఇలా వివరించాడు: నేను రైడ్‌ను చాలా ఇష్టపడ్డాను కాబట్టి నేను ఏడుస్తున్నానని, నేను దిగడానికి ఇష్టపడలేదు అని!
కొంతమంది భయపడటానికి ఇష్టపడతారు; ఇతరులు ఇష్టపడరు, మరియు భయానికి చూపు భిన్నమైన ప్రతిచర్యలకు కారణమయ్యే ప్రతిదీ మనస్తత్వశాస్త్రానికి ఖచ్చితంగా తెలియనప్పుడు, కొంతమంది పరిశోధకులు ప్రజలు ఒత్తిడిని ఎలా అనుభవిస్తారనే దానితో సంబంధం కలిగి ఉంటుందని సూచించారు. ఉదాహరణకు, భయానక చలనచిత్రాలను ఇష్టపడే వ్యక్తి, ఆడ్రినలిన్ ఉప్పెన ద్వారా శక్తిని పొందుతాడు, మరియు భయానక వినోదాన్ని ఇష్టపడని మరొకరు అదే ఆడ్రినలిన్ ఉప్పెనను తీవ్ర భయాందోళనగా అర్థం చేసుకుంటారు.
ఇక ప్రవచన విషయానికి వస్తే, క్రైస్తవులు కూడా రెండు విధాలుగా విభజించబడ్డారు. ఒక చాలా చాలా చిన్న సమూహం శ్రమల కాలంలో యహువః వారిని రక్షించునని చాలా నమ్మకంగా ఉంటారు, అలాంటి అద్భుతాలను చూసే ఆలోచనలో వారు నిజంగా సంతోషిస్తారు. అయితే, చాలా మంది క్రైస్తవులు యః ఉగ్రత కుమ్మరించబడు సమయంలో భూమిపై నివసించాలనే ఆలోచన విషయంలో భయభ్రాంతులకు గురవుతారు. ఏడు చివరి తెగుళ్ళకు ముందు ఒక ప్రత్యేక శేషాన్ని పరలోకానికి తీసుకుని వెళ్లే రహస్య ఎత్తుబాటు అనే నమ్మకం, ఇలా భయపడు విశ్వాసులకు, వారు శ్రమల కాలంను గూర్చి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అని భరోసా ఇచ్చే మార్గంగా అభివృద్ధి చేయబడింది.
ఆ ఫాంటసీ (ఊహా చిత్రం) చాలా బాగుంది, అయితే అదంతా అంతే: ఒక ఊహా చిత్రం. చివరి ఏడు తెగుళ్ళ కాలంలో యహువః కు విశ్వాసపాత్రంగా ఉండు ఒక శేషాన్ని ఆయన కలిగియుండునని, ఆయన వారిని రక్షించును అని గ్రంథంలో స్పష్టంగా ఉంది. రాబోయే దినాలలో, తండ్రి యొక్క అన్ని వ్యవహారాల మాదిరిగానే, అలసట లేని, అపరిమితమైన అద్భుతంలో యహువః యొక్క ప్రేమ చూపబడుతుంది.
యహువః తన పిల్లలకు ఇచ్చే ప్రేమ బహుమానాలలో యెషయా 24 ఒకటి. ఎలోహీం తీర్పు యొక్క రెండు విభిన్న దశలలో ఏమి జరుగుతుందో ఇది వెల్లడిస్తుంది. తీర్పులోని మొదటి దశ ఏడు బూరల రూపంలో ప్రకటన 8 మరియు 9 లో వివరించబడింది. రెండవ దశ ప్రకటన 16 లో వివరించబడిన చివరి ఏడు తెగుళ్ళు. రెండింటి మధ్య ఉన్న అతి పెద్ద వ్యత్యాసం ఏమిటంటే, బూరల సమయంలో సంభవించు సంఘటనలు ప్రజలను పశ్చాత్తాపపడుడని పిలుచుటకు జరుగును. కాబట్టి, ఈ తీర్పులు దయతో మిళితమై ఉంటాయి. దీనికి విరుద్ధంగా, "చివరి" ఏడు తెగుళ్ళు దయతో మిళితమై ఉండవు, ఎందుకంటే "వాటిలో యహువః కోపము నిండి ఉంటుంది." (ప్రకటన 15: 1, ఎన్కెజెవి 1)
ఈ సంఘటనల క్రమమును ముందుగానే వివరించుట ద్వారా అంతిమ ఫలితం ఏమిటో యెషయా మనముందు ఉంచుతున్నాడు: నిర్జనమైన భూమి.
ఆలకించుడి యహువః దేశమును వట్టిదిగా చేయుచున్నాడు,
ఆయన దాని పాడుగాచేసి కల్లోలపరచుచున్నాడు
దాని నివాసులను చెదరగొట్టుచున్నాడు.
ప్రజలకు కలిగినట్టు, యాజకులకు కలుగును;
దాసులకు కలిగినట్లు, యజమానులకు కలుగును;
దాసీలకు కలిగినట్లు, వారి యజమానురాండ్రకు కలుగును;
కొనువారికి కలిగినట్లు, అమ్మువారికి కలుగును;
అప్పిచ్చువారికి కలిగినట్లు, అప్పు పుచ్చుకొను వారికి కలుగును;
వడ్డికిచ్చువారికి కలిగినట్లు, వడ్డికి తీసుకొనువారికి కలు గును.
దేశము కేవలము వట్టిదిగా చేయబడును
అది కేవలము కొల్లసొమ్మగును.
యహువః ఈలాగు సెలవిచ్చియున్నాడు. (యెషయా 24:1-3)
త్వరలో జరిగే సంఘటనల వల్ల భూమిపై ఉన్న ప్రతి ఒక్కరూ ప్రభావితమవుతారు.
దేశము వ్యాకులముచేత వాడిపోవుచున్నది,
లోకము దుఃఖముచేత క్షీణించిపోవుచున్నది,
భూజనులలో గొప్పవారు క్షీణించిపోవుచున్నారు.
అంతిమ సంఘర్షణ ఆరాధన విషయంలోనే ఉంటుందని యెషయా వెల్లడించుచుండెను.
లోకనివాసులు ధర్మశాసనములను అతిక్రమించి యున్నారు,
కట్టడను మార్చి
నిత్యనిబంధనను మీరియున్నారు.
దాని నివాసులచేత లోకము అపవిత్రమాయెను.
శాపము దేశమును నాశనము చేయుచున్నది,
దాని నివాసులు శిక్షకు పాత్రులైరి,
దేశనివాసులు కాలిపోయిరి,
శేషించిన మనుష్యులు కొద్దిగానే యున్నారు. (యెషయా 24:4-6)
యహువఃకు విధేయులైనవారందరూ సృష్టిలో ఆయన స్థాపించిన సూర్య-చంద్ర క్యాలెండర్ ద్వారా లెక్కించబడు తన పరిశుద్ధ విశ్రాంతిదినమున ఆయనను ఆరాధించడం ద్వారా ఆయనను గౌరవిస్తారు. ఇది ప్రకటన 14 లో స్థాపించబడింది, ఇక్కడ యహూషువః యొక్క రెండవ రాకడ కొరకు ప్రపంచాన్ని సిద్ధం చేయు సందేశాలతో పరలోకం నుండి పంపబడిన ముగ్గురు దూతలను యోహాను చూస్తాడు. నాల్గవ ఆజ్ఞను గుర్తుచేసే భాషలో, మొదటి దూత ఇలా ప్రకటించాడు: “ఎలోహీంకి భయపడి ఆయనను మహిమపరచుడి; ఆయన తీర్పుతీర్చు గడియ వచ్చెను గనుక ఆకాశమును భూమిని సముద్రమును జలధారలను కలుగజేసిన వానికే నమస్కారము చేయుడి అని గొప్ప స్వరముతో చెప్పెను..” (ప్రకటన 14: 7)
అయితే అందరూ ఈ ప్రేమపూర్వక హెచ్చరికను అంగీకరించరు, అందువలన: గందరగోళ పట్టణము నిర్మూలము చేయబడెను . . . ప్రతి యిల్లు మూయబడి యున్నది. పట్టణములో పాడు మాత్రము శేషించెను గుమ్మములు విరుగగొట్టబడెను. (యెషయా గ్రంథము 24:10,12) లేఖనంలో, “నగరాలు” సంఘాలకు చిహ్నాలు. బబులోను సమస్త తప్పుడు మతాలను సూచిస్తుంది, అందుకే ఈ ఆదేశం ఇవ్వబడింది: నా ప్రజలారా, మీరు దాని పాపములలో పాలివారు కాకుండునట్లును, దాని తెగుళ్లలో ఏదియు మీకు ప్రాప్తింపకుండునట్లును దానిని విడిచి 'వెళ్ళండి'. దాని పాపములు ఆకాశమునంటుచున్నవి, దాని నేరములను ఎలోహీం జ్ఞాపకము చేసికొనియున్నాడు. (ప్రకటన 18: 4-5, 1599 జెనీవా బైబిల్ చూడండి.)
యహువఃకు పూర్తిగా లోబడి, ఆయన నీతి బహుమానమును అంగీకరించే వారందరూ ముందుకు రాబోవు సంక్షోభం విషయంలో ఆయనపై విశ్వాసం ఉంచగలరు.
శేషించినవారు బిగ్గరగా ఉత్సాహధ్వని చేయుదురు
యహువః మహాత్మ్యమునుబట్టి
సముద్రతీరమున నున్నవారు కేకలు వేయుదురు.
అందునుబట్టి తూర్పుదిశనున్నవారలారా, యహువఃను ఘనపరచుడి,
సముద్ర ద్వీపవాసులారా, ఇశ్రాయేలు ఎలోహీం అయిన యహువః నామమును ఘనపరచుడి.
"నీతిమంతునికి స్తోత్రమని"
భూదిగంతమునుండి సంగీతములు మనకు వినబడెను. (యెషయా గ్రంథము 24:14-16)
దైవిక తీర్పు యొక్క రెండు దశలలో అనేక భూకంపాలు సంభవిస్తాయి. ఆఖరిది, ఏడవ తెగులు, భూమిని సృష్టికి ముందు ఉన్న స్థితికి తిరిగి తెస్తుంది. భూమి పునాదులు కంపించుచున్నవి.
భూమి బొత్తిగా బద్దలై పోవుచున్నది,
భూమి కేవలము తునకలై పోవుచున్నది,
భూమి బహుగా దద్దరిల్లుచున్నది.
భూమి మత్తునివలె కేవలము తూలుచున్నది,
…. అది పడి యికను లేవదు.
ఆ దినమున యహువః ఉన్నత స్థలమందున్న
ఉన్నత స్థల సమూహమును
భూమిమీదనున్న భూరాజులను దండించును. (యెషయా గ్రంథము 24:18-21)
తరువాత, యహూషువః తిరిగి వస్తాడు మరియు యహువః తన రాజ్యాన్ని భూమిపై కొత్తగా ఏర్పాటు చేస్తాడు.
చంద్రుడు వెలవెలబోవును
సూర్యుని ముఖము మారును;
సైన్యములకధిపతియగు యహువః సీయోను కొండ మీదను
యెరూషలేములోను రాజగును.
పెద్దలయెదుట ఆయన ప్రభావము కనబడును. (యెషయా గ్రంథము 24:23)
ఆయన మోక్ష బహుమానమును అంగీకరించువారందరి కోసం క్రొత్త భూమిపై సృష్టికర్తతో కలిసి జీవించే శాశ్వత ఆనందం ఎదురుచూస్తుంది.
ఈ ముఖ్యమైన కాల వ్యవధిపై మరింత సమాచారం కోసం, కింది WLC రేడియో కార్యక్రమాలను చూడండి:
|
1 అన్ని వచనాలు బైబిల్ యొక్క న్యూ కింగ్ జేమ్స్ వెర్షన్ నుండి తీసుకోబడినవి.