చివరి తరం ప్రత్యేకతగలదై ఉంటుంది. ఇది అన్నింటికంటే చెడ్డదిగా ఉంది. ఎవరైనా మారుమనస్సు పొందినయెడల ముందు గతించిన వారికి [ఎవ్వరికైనా] ఇవ్వబడిన బహుమానం కంటే ఎక్కువ ఒక బహుమానం ఇవ్వబడుతుంది. ఈ బహుమానంను స్వీకరించాలంటే, లవొదికీయులు పశ్చాత్తాపపడి సహోదర ప్రేమ సంఘములోనికి చేరుట ఆవశ్యకమైయున్నది. |
నా తల్లి భయపడెను. ఇతరులతో మాట్లాడే తీరులో ఆమె తన పిల్లలను పెంచిన విధానం ఇది కాదు!
నాది 15 సంవత్సరాల వయసు మరియు వసతి గృహ పాఠశాల నుండి సెలవుపై ఇంటికి వచ్చాను. నా రూమ్మేట్ నాతో వచ్చెను, నా తల్లి తన బిడ్డ ఒక కొత్త మాట-నైపుణ్యంను వృద్ధి చేసుకొనెనని గమనించెను, అది: వ్యంగ్యం.
ఇప్పుడు, కొన్ని సంస్కృతులలో- గ్రేట్ బ్రిటన్ లాంటి దేశాల్లో, వ్యంగ్యం అనేది హాస్యం రూపంలో చూడబడుతుంది. ఇది మరొకరిని వినియోగించి మీ చమత్కారానికి మానసికంగా పదునుపెట్టు ఒక మార్గం. హా! హా! హా! గొప్ప తమాషా, ఒక పాత వ్యక్తి. మరియు అంతా హాస్యం.
అయితే, యునైటెడ్ స్టేట్స్ లో, స్పష్టమైన అర్థం లేనిచో వ్యంగ్యంను కేవలం పూర్తి మోటుగా భావిస్తారు. అన్నీ చూచిన తరువాత, వ్యంగ్యం, ఇది గాయపరచుటకు లేక బాధపరచుటకు ఉపయోగించు ఒక పదునైన మరియు తరచుగా ఎగతాళియైన లేదా విరుద్ధమైన ఉచ్చారణయై" ఉంది.1 ఖచ్చితంగా ఇది ఒక అమెరికన్ తల్లి తాను బాగా పెంచిన పిల్లల పెదవులు నుండి వినడానికి ఇష్టపడనిది.
నన్ను ప్రత్యేకంగా ఖండించుటకు వీలైన ఒక చోటు వైపుగా తీసుకువెళ్లి, నా తల్లి నా తప్పులను సాధ్యమైనంత సున్నితంగా సరిచేస్తూ ఇలా చెప్పెను: కొన్నిసార్లు మనకు ఎవరో ఎత్తి చూపేవరకు మనకు తెలియకుండానే ప్రవర్తనలో కొన్ని అలవాట్లలో పడతాము. " నీవు ఉద్దేశపూర్వకంగా/కావాలని మొరటుగా ఉండుటను ఇష్టపడుటలేదని నాకు ఖచ్చితంగా తెలుసు, కానీ నీవు నీ రూమ్మేట్ తో చాలా వ్యంగ్యంగా మాట్లాడు ఒక అలవాటులో పడిపోయావు. నీవు దీనిని కొనసాగించాలని గాని లేక అది మీ భావాలను దెబ్బతినేలా చేసి మీ ఇద్దరిని వేరుచేయాలని గాని నేను కోరుకొనుటలేదు"
ఇప్పుడు భయపడుట నా వంతు అయినది. నా తల్లి ఎత్తి చూపే వరకు, నా "హాస్యం" (నా రూమ్మేట్ ను వుపయోగించి) ఇతరులకు నొప్పి కలిగించుటకు ఎలా కారణమవుతుందోననే విషయంను నేను తెలుసుకోలేకపోయాను. నేను వెంటనే అలా మాట్లాడుటను మానుకున్నాను. ఎందుకంటే నేను ఉండాలనుకున్నది అలాంటి వ్యక్తిగా కాదు.
ఏ వ్యక్తీ విమర్శించబడుట ద్వారా ఆనందించడు. విమర్శలపాలవడాన్ని "మంచిగా భావించలేరు", చివరకు ఆ విమర్శ "నిర్మాణాత్మకంగా" లేక పూర్తిగా సరిగ్గా ఉన్ననూ సరే. అయితే, కొన్నిసార్లు ఒకరి భావాలు దెబ్బతింటాయేమో అను ఒక భయం వలన సందేశాన్ని నిలువరించుట చాలా ముఖ్యమై ఉంటుంది. కొన్నిసార్లు మాట్లాడవలసిన అవసరం ఉంటుంది ఎందుకంటే ఒకరు దానిని మాట్లాడక పోతే, ఫలితం చాలా ఘోరంగా ఉంటుంది.
ప్రకటనగ్రంధం 2-3 లలో యహూషువః ఏడు సంఘాలకు సందేశం ఇచ్చు పరిస్థితి ఇలాగే ఉంది.
క్రమశిక్షణలో పెట్టితిని. ... ఎందుకంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను
![]() |
ఏడు సంఘములకు ఇవ్వబడిన సందేశాలు అంత్య కాలంలో క్రైస్తవులకు ప్రోత్సాహంను, సూచనలను మరియు హెచ్చరికలను అందజేయును.
http://www.bible-history.com/maps/Map-7-Churches-of-Revelation-Asia.jpg |
ప్రకటన గ్రంధం ఆసియా మైనర్ లో ఉన్న ఏడు సంఘాలకు సందేశాలను ఇచ్చుటతో తెరుచుకుంటుంది. ఈ సందేశాలు ప్రారంభ క్రైస్తవులను ప్రోత్సహించటకు, ఆశీర్వదించుటకు మరియు హెచ్చరించుటకు ఉద్దేశించినవై
ఉన్నాయి. అదనంగా, బైబిలు పండితులు ఈ సందేశాలను క్రైస్తవ కాలంలో వివిధ యుగాలకు అనుసంధానం చేసారు. ఈ సందేశాలలో అధిక భాగం విశ్వాస విషయంలో ఆజ్ఞాపణను మరియు మరింత జాగ్రత్తగా ఉండాల్సిన ప్రాంతాల/సమయాల నిమిత్తం హెచ్చరికలను మరియు సూచనలను కలిగి ఉండెను.
నేడు ఫిలదెల్ఫియ (ఆరవ సంఘము) మరియు లవొదికయ (ఏడవ సంఘము) సందేశాలు క్రైస్తవులకు అత్యంత ప్రాముఖ్యమైనవి ఎందుకంటే అవి చివరి తరం కోసం ఉద్దేశించిన సందేశాలు. ఫిలదెల్ఫియా సంఘము (అసాధారణంగా) ఏవిధమైన దిద్దుబాట్లను లేదా బుద్ధిచెప్పుటను అందుకోలేదు. వారి ప్రకాశిస్తున్న విశ్వాస్యత ప్రశంసలను మాత్రమే అందుకుంది. దీనికి విరుద్ధంగా, లవొదికయ అస్సలు ప్రశంసలను అందుకోలేదు. వారి ఆధ్యాత్మిక స్థితి చాలా దుర్భరంగా ఉండెను. వారి ఎండిపోయిన పరిస్థితి నిమిత్తం మరియు వారు పశ్చాత్తాపాన్ని పొందని పక్షంలో వారికి పొంచియున్న ప్రమాదం నిమిత్తం వారిని మేలుకొల్పుటకు ఒక మక్కుసూటి నింద మాత్రమే ఇవ్వబడినది.
ఎవరూ విమర్శలు ఇష్టపడరు. ఒక చాలా సున్నితమైన, మృదువుగా మాట్లాడు తండ్రి కూడా వారి పిల్లలు ప్రమాదంలో ఉన్నప్పుడు ఒక హెచ్చరికను చేయును. లవొదికయ సంఘ సందేశం ఇదే. ఇది మేల్కొల్పుటకు రక్షకుడి నుండి ఒక గొప్ప, గొంతుపగిలేటట్లున్న కేకగా ఉడెను! ప్రమాదం దగ్గరగా వుంది!
ఏడు సంఘముల యొక్క అన్ని సందేశాలను అధ్యయనం చేయుటద్వారా విలువైన పాఠాలను మరియు ప్రోత్సాహకాలను నేర్చుకోవచ్చు. అయితే, ఈ వ్యాసం ఫిలడెల్ఫియా మరియు లవొదికయ యొక్క సందేశాలపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. అవి నేటి విశ్వాసులకు పరలోకం యొక్క హెచ్చరికలు -మరియు ఆహ్వానములై ఉండెను.
సహోదర ప్రేమ సంఘము
ఫిలదెల్ఫియలో ఉన్న సంఘపు దూతకు ఈలాగు వ్రాయుము దావీదు తాళపుచెవి కలిగి, యెవడును వేయ లేకుండ తీయువాడును, ఎవడును తీయలేకుండ వేయువాడునైన సత్యస్వరూపియగు పరిశుద్ధుడు చెప్పుసంగతు లేవనగా":
నీ క్రియలను నేనెరుగుదును; నీకున్న శక్తి కొంచెమై యుండినను నీవు నా వాక్యమును గైకొని నా నామము ఎరుగననలేదు. ఇదిగో తలుపు నీయెదుట తీసియుంచి యున్నాను; దానిని ఎవడును వేయనేరడు.
యూదులు కాకయే తాము యూదులమని అబద్ధమాడు సాతాను సమాజపు వారిని రప్పించెదను; వారు వచ్చి నీ పాదముల యెదుట పడి నమస్కారముచేసి, ఇదిగో, నేను నిన్ను ప్రేమించితినని తెలిసికొనునట్లు చేసెదను.
నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూ నివా సులను శోధించుటకు లోకమంతటిమీదికి రాబోవు శోధన కాలములో(మూలభాషలో-శోధనగడియలో) నేనును నిన్ను కాపాడెదను.
నేను త్వరగా వచ్చుచున్నాను; ఎవడును నీ కిరీటము నపహరింపకుండునట్లు నీకు కలిగినదానిని గట్టిగా పట్టుకొనుము.
జయించు వానిని నా దేవుని/ ధియోస్ 2 ఆలయములో ఒక స్తంభముగా చేసెదను; అందులోనుండి వాడు ఇకమీదట ఎన్నటికిని వెలుపలికిపోడు. మరియు నా దేవుని పేరును, పరలోకములో నా దేవుని యొద్దనుండి దిగి వచ్చుచున్న నూతనమైన యెరూషలేమను నా ఎలోహ పట్టణపు పేరును, నా క్రొత్త పేరును వాని మీద వ్రాసెదను.
సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినునుగాక. (ప్రకటన 3: 7-13, NKJV)
ఆ నగరం యొక్క కొన్ని నిజాలు మరియు దాని చరిత్ర తెలిసినపుడు ఫిలడెల్ఫియా సంఘం యొక్క సందేశం సజీవంగా కనిపిస్తుంది. ఫిలదెల్ఫియా ఒక ముఖ్యమైన కూడలి వద్ద నిలిచియుంది. నగరం గుండా రోమ్ సామ్రాజ్యానికి రహదారి నడుస్తుంది. అలా, తనకు ముందు ఇజ్రాయెల్ దేశం వలెనే, దక్షిణాన ఆఫ్రికా వరకు మరియు ఉత్తరాన ఐరోపా వరకు ప్రయాణించు యాత్రికులు దీని గుండా వెళ్ళుటవలన ఈ నగరం సువార్త వ్యాప్తి కోసం ఒక అనువైన ప్రదేశంగా ఉడెను.
ఆసియా మైనర్ లోని ఈ ప్రదేశం భూకంపాలకు చాలా అవకాశం ఉన్న ప్రదేశం మరియు, నిజానికి, క్రీ.శ. 17 లో ఒక భూకంపం ఫిలదెల్ఫియాను విధ్వంశం చేసెను. ఈ కారణంగా, అపూర్వమైన మరియు చాలా అధునాతన భవన నిర్మాణ పద్ధతులను అనుసరించి అత్యంత తీవ్రమైన భూకంపాలను సహా ఖచ్చితంగా తట్టుకుని నిలిచే విధంగా దేవాలయాలు నిర్మించబడ్డాయి.
యహువః మందిరంలో ఒక స్తంభము
[ఆలయం] పునాదులు ఉన్ని బొచ్చుతో కప్పబడిన చార్కోల్ పడకలపై ఉంచబడెను, నిర్మాణము మట్టిపై ఒక తెప్ప వలే తేలియాడుటకు ఇది సహకరించును. ప్రతి బ్లాకు, మరొక బ్లాకునకు లోహపు బందుల ద్వారా కలపబడి ఉంటాయి, అలా ప్లాట్ ఫారము కలిసియుంటుంది.
ఆ నగరంలో మందిరం అత్యంత సురక్షితమైన నిర్మాణమై ఉండాలి, అందుకే [యహువః] ఆలయములో ఒక స్తంభముగా ఉండుట అనే వాగ్దానం భద్రత మరియు సరక్షితమై ఉంటుంది. శాశనాలు చెక్కబడిన స్తంభాలు ఏజియన్ టర్కీ అంతటా కనిపిస్తాయి. దీనికి యూరోమాస్ వద్ద జియోస్ ఆలయంలో పదకొండు నిలబడి యున్న స్తంభాలలో పదింటికి ఉన్న అంకిత శాసనాలు ఒక వర్ణించబడిన ఉదాహరణ. జయించిన వారు అనే మానవ "స్తంభాలు" పై దైవీక నామములు అలాగే తన కొత్త పేరును వ్రాయుటకు [యహూషువః] వాగ్దానం చేసెను .3
పురాతన ఫిలడెల్ఫియాలో ఇప్పటికీ నిలబడియున్న స్థంభాలు
చిత్రం క్రెడిట్: https://www.etbu.edu/php/theintersection/livingintheshadow/
భూమి బ్రద్దలౌతున్నట్లుండు సంఘటనలలో విశ్వాసులుగా ఉండుటకు చివరి తరం పిలువబడింది. ఇంతకు ముందు కాలంలో ఏ ప్రజా సమూహమూ పిలువబడని విధంగా వారి విధేయతను పరీక్షించుటకు మరియు వారి విశ్వాస స్థానంను కొలుచుటకు పిలువబడిరి. ధృడముగా ఉండువారు యహువః మందిరంలో "స్తంభాలు" గా ఉండుట ద్వారా సత్కరించబడుదురు. శాశ్వతత్వం అంతటనూ, ఆధారముల యొక్క బరువు, యహువః మంచి వాడు కావున వారి సాక్యం మీద విశ్రాంతి తీసుకొనును.
ఒక కొత్త పేరు
ఫిలడెల్ఫియా నిజానికి మొదటి శతాబ్దంలో రెండు వేర్వేరు సమయాల్లో ఒక కొత్త పేర్లను పొందెను. అది మొదటిసారిగా క్రీ.శ 17లో ఒక విధ్వంసకర భూకంపం తరువాత నియోసీజరియ గా అనగా "కొత్త కైసరు పట్టణంగా" మార్చబడెను. టిబేరియస్ సీజరు ఆ భూకంపం యొక్క పునరుద్ధరణ ప్రయత్నాలకు స్వచ్ఛందంగా నిధుల సహాయాన్ని చేసెను మరియు తన సహాయంనికి కృతజ్ఞతగా పేరు మార్చుట జరిగింది. రెండవ సారి పేరు మార్పు మరొక విపత్తు తరువాత వెస్పాసియన్ చక్రవర్తి ఆర్థిక సాయం పంపినప్పుడు జరిగినది.
సహాయం చేసిన వారికి ఒక కృతజ్ఞతగా మరియు గౌరవార్థంగా ప్రతి సారి పేరు మార్పు చేయుట జరిగింది. ఫిలడెల్ఫియా సంఘానికి ఇచ్చిన బహుమతి ఒక కొత్త పేరు వ్రాబడుటయై ఉంది. భూమి చరిత్ర యొక్క అంతిమ దృశ్యాలలో విశ్వాసపాత్రంగా నిలువబడిన వారు సమస్త శాశ్వతత్వంలోనూ దైవ ప్రభుత్వం యొక్క మంచితనానికి మరియు న్యాయానికి సజీవ సాక్షులుగా ఉందురు. వారు వారిమీద యహువః నామము మరియు పవిత్ర యెరూషలేము పేరును వ్రాయబడినవారై గౌరవించబడుదురు.
ఫిలదెల్ఫియా సంఘము తగిన విధంగా పేరుపెట్టబడెను. అన్ని సంఘాలకంటే, వారు యహువఃను అత్యంతగా గౌరవించిరి ఎందుకంటే, వారి సొంత జీవితాలలో, ఫిలడెల్ఫియా సంఘము రక్షకుని యొక్క జీవితానికి నిదర్శనంగా ఉంది. ఒక ధర్మశాస్త్రోపదేశకుడు యహూషువఃను "బోధకుడా ధర్మ శాస్త్రములో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని" (మత్తయి 22:36, KJV) అడిగినప్పుడు, యహూషువః వెంటనే ఇలా సమాధానమిచ్చెను: "అందుకాయననీ పూర్ణహృదయముతోను నీ పూర్ణాత్మతోను నీ పూర్ణమనస్సుతోనుయహువః, నీ ఎలోహాను ప్రేమింపవలెననునదియే. ఇది ముఖ్య మైనదియు మొదటిదియునైన ఆజ్ఞ. నిన్నువలె నీ పొరుగువాని ప్రేమింపవలెనను రెండవ ఆజ్ఞయు దానివంటిదే. ఈ రెండు ఆజ్ఞలు ధర్మశాస్త్రమంతటికిని ప్రవక్తలకును ఆధారమై యున్నవని అతనితో చెప్పెను. "(మత్తయి 22: 37-40, KJV)
ప్రేమ. ప్రేమ యహువః పాలనకు పునాది. ప్రేమ ఆయన గుణం అలాగే ఆయన చట్టం కూడా. యోహాను ఇలా వ్రాశాడు: "ప్రియులారా, మనము ఒకనినొకడు ప్రేమింతము; ఏలయనగా ప్రేమ యహువః మూలముగా కలుగుచున్నది; ప్రేమించు ప్రతివాడును యహువః మూలముగా పుట్టినవాడై యహువఃను ఎరుగును. యహువః ప్రేమాస్వరూపి (యహువః ప్రేమయైయున్నాడు), ప్రేమలేని వాడు యహువఃను ఎరుగడు. "(1 యోహాను 4: 7-8, KJV). దీనిలో, ఈ ఫిలదెల్ఫియన్లు ఒక పరలోకపు కాంతితో, మరి ఏ ఇతర సంఘానికీ అసమానమైన రీతిలో ప్రకాశిస్తుండెను. నిజానికి, ఈ పదం "ఫిలదెల్ఫియా" అనగా "సహోదర ప్రేమ" అని అర్థం. వారు సహోదర ప్రేమగల సంఘమై యున్నారు. వారు బహుగా ప్రేమించుట వలన బహుగా క్షమింపబడిరి. ఇది వారు ఏ ఇతర సంఘము ప్రతిబింబించలేనంత స్థాయిలో యహూషువః చిత్రంను ప్రతిబింబించుటకు కారణమాయెను.
పురాతన ఫిలదెల్ఫియాలోని ప్రదర్శనశాల
చిత్రం క్రెడిట్: కెన్ మరియు న్యేటా ద్వారా [CC BY 2.0 (http://creativecommons.org/licenses/by/2.0)], వికీమీడియా కామన్స్ ద్వారా
లవొదికయ సంఘము
లవొదికయలో ఉన్న సంఘపు దూతకు ఈలాగు వ్రాయుము. ఆమీన్ అనువాడును, నమ్మకమైన సత్యసాక్షియు యహువః సృష్టికి ఆదియునైనవాడు చెప్పు సంగతులేవనగా:
నీ క్రియలను నేనెరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు; నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు.
నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక, నులివెచ్చనగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోటనుండి ఉమ్మివేయ నుద్దేశించుచున్నాను.
నీవు దౌర్భాగ్యుడవును దిక్కుమాలిన వాడవును దరిద్రుడవును గ్రుడ్డివాడవును దిగంబరుడవునై యున్నావని యెరుగక నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసియున్నాను, నాకేమియు కొదువలేదని చెప్పుకొనుచున్నావు.
నీవు ధనవృద్ధి చేసి కొనునట్లు అగ్నిలో పుటమువేయబడిన బంగారమును, నీ దిసమొల సిగ్గు కనబడకుండునట్లు ధరించుకొనుటకు తెల్లని వస్త్రములను, నీకు దృష్టికలుగునట్లు నీ కన్నులకు కాటుకను నాయొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను.
నేను ప్రేమించువారినందరిని గద్దించి శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనస్సు పొందుము.
ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపుతీసిన యెడల, నేను అతనియొద్దకు వచ్చి అతనితో నేనును, నాతోకూడ అతడును భోజనము చేయుదుము.
నేను జయించి నా తండ్రితోకూడ ఆయన సింహాసనమునందు కూర్చుండియున్న ప్రకారము జయించువానిని నాతోకూడ నా సింహాసనమునందు కూర్చుండనిచ్చెదను.' (ప్రకటన 3: 14-21, NKJV)
ఫిలదెల్ఫియ సంఘానికి విరుద్ధంగా లవొదికయ సంఘం ఉంది. ఫిలడెల్ఫియా సంఘము మాత్రమే ప్రశంసలు అందుకొనెను, లవొదికయ సంఘం ఏమాత్రం మెచ్చుకోబడలేదు. లవొదకీయుల ఆత్మీయ పరిస్థితి విమర్శలను అందుకొనుచు ఉంటూ నిజంగా దయనీయంగా ఉన్నది!
లైకస్ నందు లవొదికయ, టర్కీలోని ఫ్రిగియా.
చిత్రం క్రెడిట్: కరోల్ రాడాటో; ఫ్రాంక్ఫర్ట్, జర్మనీ. [CC BY-SA 2.0 (http://creativecommons.org/licenses/by-sa/2.0)], వికీమీడియా కామన్స్ ద్వారా
మెస్సీయ యొక్క పనిని ప్రవచించుచూ, యెషయా ఇలా ప్రకటించారు: "నలిగిన రెల్లును అతడు విరువడు మకమకలాడుచున్న జనుపనార వత్తిని ఆర్పడు అతడు సత్యము ననుసరించి న్యాయము కనుపరచును" (యెషయా 42: 3, KJV). యహూషువః ఇతరులను ప్రోత్సాహ పరచుటలో ఆనందించెను. అతని మాటలు ఆరియున్న మరియు మురికి భూమిలో ఒక చల్లని పానీయం వలె ఉన్నాయి. ఆయన ఎల్లప్పుడూ తన మార్గంలో ఇతరులను ప్రోత్సహించుటకు మరియు తన మాటలతో ఇతరులను నిర్మించుటకు బయలు వెళ్ళెను. లవొదికయకు ఆయన ఇచ్చిన సందేశంలో విమర్శలు తప్ప మరేమీ లేవనే వాస్తవం వారికి గల ప్రమాదంను బహిర్గతం చేస్తుంది. ఒక మృదువుగా మాట్లాడు తల్లి, ఒక ట్రక్కు ముందుకు పరుగెత్తుతున్న ఆమె బిడ్డను నిరోధించడానికి "ఆగు!" అని అరుచుట వలె, లవొదికయ విషయంలో యహూషువః చేయు కఠిన నిందారోపణ ఒక ఆఖరి ప్రయత్నంగా వారిని మేల్కొలపడానికి మరియు ఆసన్నమౌతున్న విపత్తు నుండి వారిని రక్షించటానికి రూపొందించబడింది.
లవొదదికయ సంఘము ఒక నులివెచ్చని సంఘమని పిలువబడుతుంది. చారిత్రక ఫిలదెల్ఫియా మాదిరిగా, చారిత్రక లవొదికయ నగరం ఈ చివరి తరపు సంఘం గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెల్లడిచేయును: |
పెరిగిన వెలుగు = పెరిగిన నిర్లక్ష్యం
లవొదికయలో ఉన్న సంఘము చివరి తరపు క్రైస్తవులందరినీ సూచిస్తుంది. పదహారవ శతాబ్దంలో ప్రొటెస్టంట్ సంస్కరణల నుండి మొదలుకొని బైబిలు అధ్యయనం చేయు వారికి పెరుగుతూవున్న కాంతి ఇవ్వబడుతుంది. ప్రొటెస్టంటు లోపల ప్రతి సంఘము చీకటి యుగాల్లో క్రైస్తవులు కలిగియున్న దానికంటే ఎక్కువ సత్యాలతో ఆశీర్వాదించడినవి. రోమన్ కేథలిక్ చర్చి, దాని సమస్త సంప్రదాయాలకు వ్రేలాడుతూ ఉన్నప్పటికీ, అది మార్టిన్ లూథరుకు ముందు కన్నా ఇప్పుడు మరింత కాంతిని కలిగి ఉండెను.4
అయితే, పెరిగిన కాంతితో పాటుగా, భక్తి మరియు విశ్వాసము పెరగలేదు. దీనికి బదులుగా, పెరిగిన కాంతి నిర్లక్ష్యాన్ని తీసుకు వచ్చింది. ఆధ్యాత్మిక అహంకారం. ఆధ్యాత్మిక ఆధిపత్యం అనే ఒక సొగసైన సంతృప్తి. నిజమైన సాక్ష్యపు వెలుగులో ఈ విధమైన ఆధ్యాత్మిక పరిస్థితి వికారంను కలిగిస్తుంది.
ఓహ్, లవొదకీయులు బాగా "మాట్లాడుట మట్టుకు మాట్లాడెదరు" కానీ వారు "నడుచుట మట్టుకు నడువరు". వీరి మాటలు "వేడి" గా ఉన్నాయి, అయితే వీరి క్రియలు (హృదయం నుండి ప్రవహించే) "చల్లని"వై ఉన్నాయి. నిజంగా యహూషువః యొక్క గుణమును కనపరుచుట మరియు ఆయన చిత్రంను ప్రతిబింబించుట విషయానికి వచ్చినప్పుడు వారు విఫలమైరి.
గత క్రైస్తవులు అర్థం చేసుకున్న దానికంటే నేటి క్రైస్తవులకు వారు ఎంత ఎక్కువ అర్థం చేసుకొనిరో వారికి తెలుసు, మరియు ఇది వారి గొప్పతనంను వారికి తెలియజేస్తుంది. వారు లవొదికీయులుగా ఉన్నారని చెప్పుకొనుచున్నారు కూడా. సమావేశాలలో అప్పుడప్పుడూ లవొదికియ పరిస్థితిని గురించి మరియు నేటి క్రైస్తవులు నులివెచ్చగా ఎలా ఉన్నారు అనేదాని గురించి బోధించబడుతుంది. ప్రజలు తమ సీట్లలో కూర్చుని, వారి తలలు ఊపుతూ, వారు నులివెచ్చగా ఉన్నారని అంగీకరించెదరు మరియు ఈ విధంగా తెలాయజేయుట ద్వారా, లవొదికీయులుగా చెప్పుకొనని ఇతరులు కంటే వారు గొప్పవారని తలంచెదరు.
ఇది దాదాపు నిస్సహాయ పరిస్థితి. లవొదకీయులు "దౌర్భాగ్య, మరియు బాధాకర, పేద, మరియు గ్రుడ్డి, మరియు నగ్న" స్థితిలో మాత్రమే కాదు కానీ, లవొదకీయులుగా ఉన్నామని పెదవులతో చెప్పిన క్రియ ద్వారా, వారి సొంత మనస్సుల్లో వారు "ధనికులమనియు, సామాగ్రిని వృద్ధిచేసుకున్న వారిమనియు మరియు ఏ అవసరత[లో] లేదని " ధ్రువీకరించుకొనిరి.
సత్యమేమిటంటే లవొదకియ సంఘము నేటి సమస్త క్రైస్తవ చర్చిలను సూచిస్తూ ఉంది. ఏ ఒక్క సంఘము లేదా సిద్ధాంతము దీనికి మినహాయింపు కాదు. ప్రతి సంఘము, మరియు ప్రతి వ్యక్తి లవొదకియయై ఉండెను ఎందుకంటే, నేడు ప్రతి సిద్ధాంతపు సంఘము మినహాయింపు లేకుండా వారు కలిగియున్న సత్యాలకు వారు అంటిపెట్టుకుని ఉంటూ మరియు బయటకు అడుగు వేసి బయలుపడుతున్న మరిన్ని సత్యాలను హత్తుకొనుటకు ఇష్టపడలేదు.
-
రోమన్ కాథలిక్కులు విశ్వాసం ద్వారా నీతిమంతులగుదురను ఒకే సిద్ధాంతంనకు 4 హత్తుకొనిరి. కానీ వారు భయంకరమైన త్రిత్వ సిద్ధాంతమును పట్టుకొని వ్రేలాడుదురు మరియు ఒక మానవ యాజకత్వంనకు ప్రాధాన్యతనిస్తూ, సమస్త విశ్వాసుల యొక్క యాజకత్వంను తిరస్కరిస్తారు.
-
యెహోవాసాక్షులు అన్య పండుగ దినములను మరియు యహువః యొక్క నామమునకు అన్య శీర్షికను సరిగా తిరస్కరించుటలో గర్వించెదరు, కాని యహువః యొక్క నిజమైన పండుగలను చేయుటను మరియు ఆయన అసలు నామమును స్వీకరించుటను తిరస్కరించెదరు.
-
మార్మోన్స్ ఒక ఆరోగ్య స్పృహతో, ఆహార పానీయాలలో మితమైన జీవన శైలిని నివసిస్తారు, కాని ఆదివారం ఆరాధన సహా అనేక ఇతర లోపాలకు అంటుకుని వ్రేలాడతారు.
-
సెవెంత్ డే అడ్వెంటిస్టులు, సెవెంత్ డే బాప్టిస్టులు, మరియు శనివార సబ్బాతులను ఆచరించు వందల కొలది ఇతర తెగలవారు సృష్టికర్త ఇప్పటికీ ఏడవ-దినపు విశ్రాంతి దినంనందు ఆరాధించాలని కోరుచైన్నాడు అనే జ్ఞానంతో ఆశీర్వాదించబడిరి, కానీ వారు కేవలం దేని ద్వారా మాత్రమే నిజమైన ఏడవ-రోజు విశ్రాంతి దినమును లెక్కించగలమో ఆ కేలండరును తిరస్కరించారు!
సమస్త క్రైస్తవ వర్గాలు నేడు లవొదకియులై ఉండెను ఎందుకంటే వారిలో ప్రతి ఒక్కరు, ఒక ప్రాంతంలో లేదా మరొక ప్రాంతంలో, సత్యాన్ని తిరస్కరించిరి మరియు పరలోకం నేటి ప్రపంచంపై ప్రకాశింపజేస్తున్న కాంతితో కలిసి ముందుకు సాగుటకు నిరాకరించిరి. అలా, సత్య సాక్షి యొక్క ఆహ్వానం నేడు ప్రతీ క్రైస్తవునికీ చేరుతుంది.
దివ్య ఔషదము
లవొదకియలు సంఘాలలోకెల్లా చెత్తయై యుండెను, కానీ రక్షకుడు వారిని ఒకేరీతిలో ప్రేమింఛుచుండెను మరియు దయచూపుచుండెను. తన గొప్ప గుండె వారిని పొందుకొనుచుండెను మరియు ప్రతి ఒక్కరూ మారుమనస్సు పొంది రక్షింపబడాలని కోరుకొనుచుండెను. ఆయన ఆదరణ కలిగించు సందేశాన్ని ఇచ్చెను: "నేను ప్రేమించువారినందరిని గద్దించి శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనస్సు పొందుము." (ప్రకటన 3:19, KJV)
ఒక లవొదకీయుడు పశ్చాత్తాపపడి మరియు రూపాంతరం చెందుటకు అవసరమైన ప్రతిదానిని ఇచ్చుటకు రక్షకుడు సిద్ధంగా ఉండెను.
-
బంగారం అగ్నిలో ప్రయత్నించబడును (ఇది రక్షకుని యొక్క సొంత విశ్వాసం)
-
తెల్లని వస్త్రములు (ఇది రక్షకుని యొక్క సొంత నీతి)
-
కంటి మందు (ఇది చివరి దినాలలో ప్రలోభాలను మరియు సాతాను సంబంధ మాయలను అధిగమించడానికి తప్పనిసరిగా అవసరమై ఆధ్యాత్మిక వివేచన)
నీకు ఏదైనా అవసరమున్న యెడల, ఆయన సమకూర్చును! మరియు ఆ బహుమతులతో పాటు మనము ప్రతి సమయంలో ఎంత మిక్కిలి అవసరతలలో ఉందుమో గ్రహించెదము.
లవొదికయ సంఘము ఏ విమోచనా గుణములను లేదా లక్షణాలను కలిగి లేదు. పశ్చాత్తాపాన్ని పొందువారు, వారు సత్య సాక్షి యొక్క ఆలోచనను అనుసరించినపుడు ఒక అద్భుతమైన పరివర్తనము చేయబడుదురు. వారి స్వీయ తృప్తి, ఆధ్యాత్మిక అహంకారంనుండి పశ్చాత్తాపపడు లవొదకీయులు, లవొదికయ సంఘమును వీడి మరియు అత్యంత ఖచ్చితంగా యహూషువఃను ప్రతిబింబించు ఫిలడెల్ఫియా సంఘ సభ్యులుగా మారెదరు.
లవొదికయను వదిలి మరియు ఫిలడెల్ఫియా చేరు ఈ క్రియ చివరి తరంను ప్రత్యేకపరచును. వారి ఆధ్యాత్మిక వారసత్వంనుండియు మరియు ఇంతగా స్నేహితులకు మరియు కుటుంబానికి బంధించి యున్న ఈ సంబంధాలను విడిచి బయటకు రమ్మని ఎప్పుడూ మరే ఇతర ప్రజా సమూహమూ పిలువబడలేదు. ప్రకటన 18 ఆజ్ఞాపిస్తుంది: "నా ప్రజలారా దానిని విడిచి బయటకు రండి!" (ప్రకటన 18: 4, 1599 జెనీవా బైబిల్) ప్రతి పశ్చాత్తాపపడే లాయోడికీయుడు కట్టుబడి ఉండును.
విశ్వాస్యత యొక్క ప్రతిఫలాలు:
ప్రతి మతపరమైన సంస్థ నేడు లవొదికీయయై ఉండెను. వారిలో ప్రతి వ్యక్తి ఏదో ఒక్క విషయంలో లేదా మరొక విషయంలో ముందుకు ప్రచురిస్తున్న కాంతిని తిరస్కరించెను. సత్య సాక్షి యొక్క ఆలోచనను గైకొనవలెనంటే, ఏ ఇతర సమూహము ముందు ఎన్నడూ చేయలేనిది చేయవలసిన అవసరం ఉంటుంది: గొర్రెపిల్ల ఎక్కడెక్కడికి వెళ్ళునో అక్కడకు వెంబడించవలెను, చివరకి మీ జీవితం మొత్తంలో మీరు చెందియున్న సంఘాలను మరియు సిద్ధాంతిక సంస్థలనుండి బయటకు రావలసి వచ్చినా సరే.
చాలా చాలా మంది ఇలా చేయరు. చాలా మంది తమ-లాంటి ఆలోచనగల విశ్వాసులున్న ఒక వర్గానికి చెందిన వారుగా నిశ్చయించుకోవాలని అనుకుంటున్నారు. వారు సత్యం కోసం ఒంటరిగా నిలబడుటకు సిద్ధపడలేదు. కేవలం ఒక చిన్న శేషం మాత్రం సత్యం నిమిత్తం అక్షారాలా ప్రతిదానినీ త్యాగం చేయటానికి సిద్ధంగా ఉన్నారు.
కానీ గ్రహింపశఖ్యము కాని బహుమానాలు వేచి ఉన్నాయి!
అపోస్తలుడైన పౌలు ఇలా వ్రాశాడు: "ఇందును గూర్చి యహువః తన్ను ప్రేమించువారి కొరకు ఏవి సిద్ధపరచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరముకాలేదు అని వ్రాయబడియున్నది." (1 కొరింథీయులకు 2: 9, KJV) ఈ వాగ్దానం విమోచించబడువారందరి విషయంలో నెరవేరుబడుచున్నప్పటికీ, అది ముఖ్యంగా లవొదికయను విడిచి యహూషువః రూపంలోనికి రూపాంతరం చెంది, సహోదర ప్రేమ యొక్క సంఘంలోనికి చేరిన శేషించిన వారి విషయంలో నెరవేరుతుంది.
లవొదికయలోని సంఘము ఏడవ సంఘము మరియు సత్య సాక్షికి విధేయులై పశ్చాత్తాపం పొందు వారికి ఏడు బహుమానాలు ఎదురుచూచుచుండెను.
ప్రతి సంఘంలోనూ జయించిన వారికి ప్రత్యేక బహుమానాలు ఇవ్వబడియున్నవి, కానీ పశ్చాత్తాపపడిన లవొదకియులకు ఇవ్వబడు బహుమానాలు వాటన్నిటినీ మించియున్నవి. ఒక పశ్చాత్తాపపడు లవొదకియుడు ఫిలదెల్ఫియా (ఆరవ సంఘము) లో చేరినచో, ఫిలదెల్ఫియాలో జయించు వారికి వేచియున్న ఆరు బహుమానాలు తనకు ఉంటాయి. ఇవి:
- సాతాను యొక్క సమాజపువారు వచ్చి జయించు వారి పాదముల యెదుట పడి ఆరాధన చేయుదురు, ఇది యహువః వీరిని ప్రేమించుచుండెనని తెలియజేస్తుంది. (ప్రకటన 3: 9 చూడండి)
- లోకమంతటిమీదికి రాబోవు శోధన కాలములో(మూలభాషలో-శోధనఘడియలో) ఆయన ద్వారా కాపాడబడును. (ప్రకటన 3:10 చూడండి.)
- యహువః ఆలయములో ఒక స్తంభముగా చేయబడి; అందులోనుండి ఇకమీదట ఎన్నటికిని వెలుపలికిపోడు.(ప్రకటన 3:12 చూడండి.)
- తన మీద యహువః యొక్క పేరు వ్రాయబడును. (ప్రకటన 3:12 చూడండి.)
- తన మీద నూతన యెరూషలేము పేరు వ్రాయబడును. (ప్రకటన 3:12 చూడండి.)
- తన మీద యహూషువః యొక్క సొంత కొత్త పేరు వ్రాయబడును, ఇది తాను యహూషువః కుటుంబంనకు చెందిన వాడని తెలియజేస్తుంది. (ప్రకటన 3:12 చూడండి.)
ఎవరైతే తమంతట తాము విధేయులవుదురో మరియు లవొదకియ యొక్క నింద వారి పరిస్థితిని పరిపూర్ణంగా వివరిస్తుందని విశ్వాసపూర్వకంగా అంగీకరించుదురో, వారు తామంతట వారు చూడలేకపోయినా కూడా అక్కడ ఇంకా మరొక బహుమతి వేచి ఉంది.
"నేను జయించి నా తండ్రితోకూడ ఆయన సింహాసనమునందు కూర్చుండియున్న ప్రకారము జయించువానిని నాతోకూడ నా సింహాసనమునందు కూర్చుండనిచ్చెదను. " (ప్రకటన 3:21, KJV)
కడపటివారు మొదటి వారగుదురు, మొదటివారు కడపటివారగుదురు. పిలువబడిన వారు అనేకులు, కాని ఏర్పాటు చేయబడినవారు కొద్దిమందే.మత్తయి సువార్ 20:16 |
ఎంత గొప్ప బహుమతి! రక్షకునితో సింహాసనాన్ని పంచుకునే స్థితి! ఇది బహుశా ఎలా ఉంటుంది?
ముందుగా వచ్చిన పనివారికంటే 11వ గంటలో వచ్చిన పనివారికి ఎక్కువ జీతము ఇచ్చిన వ్యవసాయకుని ఉపమానములో, యహూషువః ఇలా వివరించెను: "కడపటివారు మొదటి వారగుదురు, మొదటివారు కడపటివారగుదురు. పిలువబడిన వారు అనేకులు, కాని ఏర్పాటు చేయబడినవారు కొద్దిమందే. (మత్తయి సువార్త 20:16) ఒక కోణంలో, ముందుగా గతించిన తరములన్నిటికంటే చివరి తరం యహువఃను ఎక్కువగా గౌరవించెను. దీని కారణం చెప్పుట సులభం: వారు చివరి తరం వారు గనుక. వారు ఆదాము నుండి బహుదూరముగా ఉన్నవారు. వారు ఆరు వేల సంవత్సరాల చెడు పేరుకుపోయిన ధోరణులను వారసత్వంగా పొందియుండియు, రక్షకునియందు విశ్వాసం మరియు పూర్తి విధేయతతో వారు జయించిన వారై ఉన్నారు. దైవీకమైన, విముక్తి కలిగించే ప్రేమ యొక్క పరివర్తనపు శక్తి, మునుపటి ఏ తరంనలోను చూపబడినదానికంటే ఎక్కువగా వారి జీవితాలలో మరియు వారి రక్షణ విషయంలో చూపబడినది.
చివరి తరంగా ఉంటూ, లవొదకీయులు గత 6,000 సంవత్సరాలుగా సమీకరించబడిన సత్యంను కలిగియుండిరి, కానీ అది వారు మునుపు ఏ తరంలోను లేనంతగా ఆధ్యాత్మిక అహంకారంతో మునిగిపోవుటకు దారితీసింది. వారి పరిస్థితులు దాదాపు నిరాశా స్థితిలో ఉన్నాయి ... కానీ యహూషువఃతో, ఎల్లప్పుడూ ఒక ఆశ ఉంటుంది. ఆయన శక్తి, ఆయన అధికారం మరియు ఆయన ప్రేమ ద్వారా, పశ్చాత్తప్తుడు వారికి వారు (యెరుగక) అంటుకునియున్న వారి లోపాలను చూపుటకు ఇప్పటికీ మరింత కాంతిని దయచేస్తుండెను. లవొదికయలో నుండి జయించువారు తమ్ము తాము తగ్గించుకొని, పశ్చాత్తాపపడి మరియు ఆ విధంగా చేయడం ద్వారా, సాతాను యహువః ధర్మానికి విరోధంగా చేసిన ఆరోపణలను మునుపటి ఏ తరమూ ఎప్పుడూ చేయనటువంటి విధంగా నిశ్శబ్దపరచును.
ఏడవ సంఘము నుండి పశ్చాత్తాపపడువారు ఒక చిన్న శేషంగా చివరి తరపు శేషంనుండి తీయబడుదురు. ఇంకా, వారు గతించిన ఏ ఇతర తరంలోను జయించిన వారికి ఇవ్వబడిన బహుమానం కంటే వేరైన బహుమానంను అందుకుంటారు. ఫిలదెల్పీయులకు ఇచ్చిన ఆరు బహుమానాలతో పాటు, వారికి యహూషువఃతో పాటు సింహాసన భాగస్వామ్య స్థితి కూడా ఇవ్వబడినది. మరియు చెడ్డలోకెల్లా చెడ్డ వారిగాఉన్న, చివరి తరం వారిగా ఉన్నప్పటికీ వారు యహువఃను గౌరవించిరి, వారు బలహీనత, అంధత్వం, మరియు దుర్మార్గంను వారసత్వంగా పొందినప్పటికీ, వారి వారు రక్షకునివైపు తిరిగి, ఆయనయందు విశ్వాసం ద్వారా, ఆయన ధర్మశాస్త్రము ననుసరించి, విమోచించబడి మరియు పరిశుద్ధ పరచబడిరి.
లవొదకీయులు, మరియ వలె, బహుగా ప్రేమించెదరు ఎందుకంటే వారు బహుగా క్షమింపబడిరి. (లూకా 7: 36-50 చూడండి.) విముక్తిని కలిగించు ప్రేమ వారిని ఎంత లోతులనుండి తీసుకొనెనో అనుదానిని పూర్వపు ఏ తరము అర్ధం చేసుకోలేని విధంగా గ్రహించెదరు, వారి పెదవుల నుండి వచ్చు పాట శాశ్వతంగా, తండ్రిని మహిమపరచును మరియు కుమారునికి కృతజ్ఞతలు చెల్లించును.
ఇది చివరి తరం వారిగా పాపంలో మునిగిపోయిన వారిని లేవనెత్తుటకును, రక్షకుడు తన విశ్వ సింహాసనం మీద కూర్చోనిచ్చుటకును వారియెడల చూపబడుతున్న దివ్య ప్రేమ మరియు శక్తి యొక్క ఒక అపూర్వమైన ప్రదర్శన.
ఇది ఇప్పుడు మీకు ఇవ్వ జూపిన/బోవుచున్న భవిష్యత్తు. నీవు నీ నిజమైన పరిస్థితిని చూడలేవు ఎందుకంటే నీవు ఒక లవొదకీయునిగా, ఒక గుడ్డివానిగా ఉన్నావు. కానీ అబద్ధమాడజాలని ఆయన మాటను అంగీకరించాలి. నమ్మకంతో అంగీకరించుము. అప్పుడు, విశ్వాసం ద్వారా, ఆయన ఇచ్చుదానిని గ్రహించుటకు నీ చేతిని చాపుము.
ఆయన నిన్న చేర్చుకొనుటకు చేతులు చాచి వేచిచూస్తూ నిలబడి ఉండెను. ఆయన విశ్వాసం అనే బంగారం ద్వారా నిన్ను కడుగును; ఆయన తన సొంత నీతినిబట్టి నిన్ను కప్పును; మరియు ఆయన నీ కంటికి స్వస్థత కలిగించు కంటిమందును పూయును. నిన్ను నీవు ఎరుగుదానికంటే ఎక్కువగా యహూషువః నిన్ను ఎరుగునని నీవు నమ్మవా, పశ్చాత్తాపపడి లవొదికయ చిక్కులనుండి విడుదల పొందవా? నీరు నేడు ఫిలదెల్ఫియాను చేరవా?
వారి నిజమైన ఆధ్యాత్మిక స్థితి తెరియజేయబడినపుడు దీనమనస్సు కలిగి అంగీకరించి, మారుమనస్సు పొంది మరియు సహోదర ప్రేమ యొక్క ఫిలదెల్ఫియా సంఘములోనికి చేరేవారికొరకు శాశ్వతమైన సంతోషం, ఆనందం మరియు చెప్పలేని ఆనందం ఎదురుచూచుచుండెను.
సృష్టి యొక్క మహా రాజా, సృష్టికర్తా మరియు సమస్తమునకు పోషకుడా, లవొదకియ సంఘానికి ఇవ్వబడిన వివరణ మాకందరికీ వ్యక్తిగతంగా మేము ఇప్పుటికీ గ్రహింపలేకపోవు విధంగా వర్తిస్తుందని విశ్వాసం ద్వారా మేము అంగీకరించుచున్నాము. మా విశ్వాసంను అభివృద్ధి చేయమని మేము అడుగుచున్నాము. దయచేసి మాకు అగ్నిలో ప్రయత్నించిన/పరీక్షించిన బంగారంను, మా నగ్నత్వంను కప్పుకొనుటకు రక్షకుని సొంత నీతియనే తెల్లని వస్త్రమును; మరియు దైవ ధర్మశాస్త్రం నుండి ఆశ్చర్యకరమైన విషయాలను చూచుటకు మా కన్నులకు దైవీక కంటి ఔషధమును దయచేయుమని వేడుకొనుచున్నాము. మేము ఎప్పటికీ మీ మంచితనంకు, మీ దయకు, మీ శక్తికి, మరియు మనుష్యుల పిల్లల యెదుట మీ కృపకు సాక్షులుగా ఉండునట్లు మీ రూపం లోకి మమ్మును మార్చుము. మా రక్షకుడైన,యహూషువః పేరిట, మేము దీనిని అడుగుతూ, మీ కాపుదల లోకి మా ఆత్మలను అప్పగించుచున్నాము. ఆమీన్. |

గమనిక: "చర్చి" అనే పదం అసలు గ్రీకు పదమైన "ఎక్లెసియా" యొక్క కచ్చితమైన అర్థంను ఇవ్వదు. క్రొత్త నిబంధన అంతటనూ, ఎక్లెసియా అనే పదం బయటకు పిలువబడిన వారిని సూచిస్తుంది. యహూషువః నిజ అనుచరులు నిజానికి సంస్థాగతమైన తెగల నుండి మరియు పడిపోయిన బబులోను మతాలు నుండి బయటకు పిలవబడినవారు. బబులోను నుండి పారిపోండని స్వరమును విని ఉన్నప్పుడు, ఎవరూ మళ్ళీ బాబిలోనియన్ చర్చిలకు మరియు మత రూపాలకు తిరిగి వెళ్ళరు.
1 మెర్రియం-వెబ్స్టర్ డిక్షనరీ.
2 "దేవుడు" అనే పేరు, నిజానికి, యహువః అయి ఉంది. అయితే, ఇక్కడ "నా దేవుడు" అనే పదబంధం పునరావృతమవుట ఉద్దేశపూర్వకమై ఉంది. ఇది, ఒకే ఒక్కడు ఆరాధనకు యోగ్యుడై ఉన్నారని నొక్కి చెప్పుచున్నది. ఆయన సృష్టికర్త:
పౌలు అదేవిధంగా చెప్పెను: "దేవతలన బడినవారును ప్రభువులనబడినవారును అనేకులున్నారు. ఆకాశమందైనను భూమిమీదనైనను దేవతలనబడినవియున్నను, మనకు ఒక్కడే దేవుడున్నాడు. ఆయన తండ్రి; ఆయననుండి సమస్తమును కలిగెను; ఆయన నిమిత్తము మనమున్నాము. మరియు మనకు ప్రభువు ఒక్కడే; ఆయన యహూషువః మెస్సీయ; ఆయన ద్వారా సమస్తమును కలిగెను; మనము ఆయన ద్వారా కలిగిన వారము. "(1 కొరింథీయులకు 8: 5-6, KJV) పొందుతారు.
3 http://www.meandertravel.com/biblical_asia_minor/biblical_asia_minor.php?details=churchinphiladelphia&m=3&md=sc3
4 ఒక వ్యక్తి ఎలా రక్షించబడును అనే నమ్మికలో తేడా కారణంగా మార్టిన్ లూథర్ కాథలిక్కుల నుండి విడిపోయారు. మార్టిన్ లూథర్ ఇది ఒక్క విశ్వాసంను బట్టి కృపద్వారానేనని నమ్మెను. కాథలిక్ చర్చి సత్కార్యాల ఆధారంగా మోక్షమని బోధించెను. 1999 లో, రోమన్ కాథలిక్ చర్చి మరియు లూథరన్ వరల్డ్ ఫెడరేషన్ వారు ఒక 47 పేజీల పత్రంపై సంతకం చేశారు, దాని పేరు: "జాయింట్ డిక్లరేషన్ ఆన్ ది డాక్ట్రిన్ ఆఫ్ జష్టిఫికేషన్." ఇందులో, ఈ నిర్వచనంను కలపుట ద్వారా వారి భిన్నాభిప్రాయాల విషయంలో రాజీపడిరి: "మేము కలిసి అంగీకరిస్తున్నాము: రక్షణ కేవలం దయ ద్వారా, క్రీస్తు యొక్క రక్షణ క్రియపై విశ్వాసం ద్వారా, మా క్రియలలో దేనిచేతనైననూ కాకుండా, మేము మనలను మంచి క్రియలు చేయుటకు పిలిచు మరియు సమకూర్చు సమయంలో, మన హృదయాలను నూతనపరచే దేవుని ద్వారా అంగీకరించబడి మరియు పవిత్రాత్మను పొందుకున్నాము. "http://www.vatican.va/roman_curia/pontifical_councils/chrstuni/documents/rc_pc_chrstuni_doc_31101999_cath-luth-annex_en.html