ఇది WLC యేతర వ్యాసం. బయటి రచయితల వనరులను ఉపయోగించినప్పుడు, బైబిలుకు మరియు డబ్ల్యుఎల్సి ప్రస్తుత నమ్మకాలకు 100% అనుగుణంగా ఉండెనని భావించిన వాటిని మాత్రమే మేము ప్రచురిస్తాము. కాబట్టి అలాంటి వ్యాసాలను డబ్ల్యుఎల్సి నుండి నేరుగా వచ్చినట్లుగా పరిగణించవచ్చు. యహువః యొక్క అనేక మంది సేవకుల పరిచర్య ద్వారా మేము ఎంతగానో ఆశీర్వదించబడ్డాము. అయితే ఈ రచయితల యొక్క ఇతర రచనలను అన్వేషించమని మేము మా సభ్యులకు సలహా ఇవ్వము. అటువంటి రచనలు, లోపాలను కలిగి ఉన్నందున మేము వాటిని ప్రచురణల నుండి మినహాయించాము. విచారకరంగా, లోపం లేని మంత్రిత్వ శాఖను మనం ఇంకనూ కనుగొనలేదు. డబ్ల్యుఎల్సి వి కాని కొన్ని ప్రచురించబడిన కంటెంట్ [వ్యాసాలు / ఎపిసోడ్లు] చూసి మీరు దిగ్బ్రాంతి చెందినచో, సామెతలు 4:18 జ్ఞాపకం చేసుకోండి. మన మార్గంలో మరింత కాంతి వెలువడు కొద్దీ ఆయన సత్యాన్ని గూర్చిన మన అవగాహన అభివృద్ధి చెందుతూ ఉంటుంది. మేము సత్యాన్ని ప్రాణం కంటే ఎక్కువగా ఆదరిస్తాము మరియు అది దొరికిన చోటు ఏదైనా అక్కడ వెతుకుతాము. |
నాశనకరమైన హేయవస్తువును పరిశుద్ధ స్థలంలో నిలుపుటతో గొప్ప శ్రమలు ప్రారంభమవునని క్రీస్తు మనకు చెప్పెను. మరియు దాని గురించి దానియేలు కూడా అదే విధంగా మాట్లాడెను, మరియు వారందరూ ఆ సంఘటన ఒకే సమయంలో సంభవిస్తున్నట్లు మాట్లాడుతారు . . . క్రీస్తు విరోధి పాలనలో.
శ్రమల కాలంలో సంఘటనలు చాలా దుర్భరంగా ఉంటాయి, ఎలా అంటే, క్రీస్తు రావడానికి సమయం ఆసన్నమైందని అనేకులు తలంచుదురు, ముఖ్యంగా ఆయన గొప్ప శ్రమలకు ముందు వచ్చునని బోధించు సంఘ జనులు అలా తలంచుదురు. వారు వేచి ఉందురు మరియు ఏ రోజునైనా ఆయన వచ్చునని ఎదురు చూతురు!
కానీ క్రీస్తు తాను ముందుగా చెప్పిన సమయం కంటే ముందుగా వచ్చునని ఎదురు చూడవద్దని హెచ్చరించాడు, కాని జనులను మోసగించడానికి ప్రయత్నించే ప్రజలు, తప్పుడు క్రీస్తులు మరియు తప్పుడు ప్రవక్తలు చాలా మంది ఉంటారు, వారే క్రీస్తు అని లేదా క్రీస్తు సమీపంలో ఉండెనని, అక్కడ లేక ఇక్కడ ఉండెనని ఆలోచించునట్లు మిమ్మల్ని మోసం చేయడానికి ప్రయత్నిస్తారు. అయితే ఆయన, "ఎవడైనను ఇదిగో క్రీస్తు ఇక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడు అని చెప్పినయెడల నమ్మకుడి. మెరుపు తూర్పున పుట్టి పడమటివరకు ఏలాగు కనబడునో ఆలాగే మనుష్యకుమారుని రాకడయు నుండును. క్రీస్తు రాకడను గూర్చిన వాస్తవం విషయంలో మీరు పొరపాటు పడకుండునట్లు ఆకాశంలో అలాంటి సంకేతం కనబడుతుంది!
అది మాత్రమే కాదు, క్రీస్తు వస్తుండెను లేక వచ్చెను అనుటకు గొప్ప సంకేతం ఆ సమయంలో మీరు తేలుతూ ఉంటారు, గాలిలో లేచుట ప్రారంభిస్తారు! అకస్మాత్తుగా మీ పాదాలు భూమిని తాకలేకుండా ఉంటాయి, మీరు పైకి తేలుతూ ఉంటారు. మరియు ఆయన మిమ్ము తన శరీరం వద్దకు సమీకరిస్తాడు, మరియు మనము ఆయనను గాలిలో కలుస్తాము! ఇది యహువః వాక్యంలో చాలాసార్లు చెప్పబడినది. ఇది అపొస్తలుల మొదటి అధ్యాయంలో చెప్పబడింది మరియు 1 వ థెస్సలొనీకయులు 4 వ అధ్యాయంలో కూడా మాట్లాడబడినది.
అతను ఎప్పుడు రాబోతున్నాడు? స్కోఫీల్డ్ మరియు బ్రెథ్రెన్లు మరియు ఇప్పుడు స్కోఫీల్డ్ బైబిల్ను అనుసరిస్తూ ఉన్న చాలా ఫండమెంటలిస్ట్ ఎవాంజెలికల్ సంఘాలు క్రీస్తు శ్రమలకు ముందు రాబోతున్నాడని మరియు ఈ ఇబ్బందులన్నీ మొదలయ్యే ముందు, క్రీస్తు విరోధి కనబడుటకు ముందు భూమి నుండి ఎత్తుబాటు చేయబోతున్నాడని తప్పుగా బోధిస్తున్నారు. కానీ అది నిజం కాదు! ఈ ఒక్క అధ్యాయాన్ని జాగ్రత్తగా చదవడం ద్వారా కూడా అది అలా కాదని మీరు చూడవచ్చు.
"ప్రవక్తయైన దానియేలుద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయవస్తువు పరిశుద్ధస్థలమందు నిలుచుట మీరు చూడగానే శ్రమలు ప్రారంభమౌనని ఆయన చెప్పినందున," అది అక్కడ నిలబడి ఉండడాన్ని మీరు చూసినప్పుడు శ్రమల కాలం ప్రారంభమాయెనని మీకు తెలుస్తుంది. అయితే, వెంటనే మిమ్మల్ని ఇక్కడి నుండి బయటకు తీసుకు వెళ్లుటను గూర్చి ఆయన ఒక్క మాట కూడా చెప్పలేదు! ఆయన చెప్పినదంతా కొండల వైపు వెళ్ళమని ప్రతి ఒక్కరినీ హెచ్చరించెను! మీరు బాగా పరిగెత్తండి, మీ ఆశ్రయం లేదా దాగుకొను ప్రదేశం, మిమ్మల్ని బ్రతికించు ప్రాంతాల వైపు! నగరాల నుండి మరియు జనాభా ఉన్న ప్రాంతాల నుండి బయటపడండి, అక్కడ చాలా ఇబ్బంది ఉంటుంది.
మీరు మీ ఆహారాన్ని ఎక్కడ పొందగలరో, దాచుకున్నారో, ఎక్కడ మీ దాగుకొను చోటు ఉన్నదో అక్కడికి వెళ్ళండి! అంత్యక్రీస్తు ప్రపంచ రాజ్య చట్టం యొక్క అధికారుల నుండి దూరంగా పారిపోవుడి, ఎందుకంటే వారు మృగం మరియు అతని ప్రతిమను, [అంత్యక్రీస్తు మరియు అతని విగ్రహాన్ని] ఆరాధించకపోతే మిమ్మల్ని చంపడానికి ప్రయత్నిస్తారు. మరియు మీరు దేనినీ కొనలేరు లేదా అమ్మలేరు. కిరాణా సామాగ్రిని కొనడానికి లేదా వాటిని కొనడానికి ధనము సంపాదించడానికి దేనినీ అమ్మలేరు.
ఆయన తన సొంత వారిపట్ల జాగ్రత్త తీసుకుంటాడు, బాధపడకండి, అయితే మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకొనుటకు ప్రయత్నించునట్లు ఏదో ఒకటి చేయాలని ఆయన చెప్పెను. యహువః మీ కోసం మీ ముఖం కడుగలేడు. ఆయన మీకు బట్టలు ధరింపజేయడు మరియు విప్పడు. మీరు ఇంకా చిన్న బిడ్డ కాదు. మీ కోసం మీరు ఏదైనా చేయాలని యహువః ఆశిస్తాడు.
శ్రమల నుండి మిమ్మల్ని తప్పించుటకు క్రీస్తు పనిచేయుట లేదు. ఆయన నిన్ను దానిలో రక్షిస్తాడు, దానిలో నిన్ను కాపాడతాడు, ఎందుకంటే ఆయనకు సాక్ష్యం అవసరం, మరియు ఏమి జరుగుతుందో ప్రపంచానికి చెప్పడానికి అక్కడ చాలా మంది సాక్షులు ఉన్నారు.
ఆయన ఖచ్చితంగా వెయ్యేళ్ళ పాలనకు ముందు రాబోతున్నాడు! మేము ఖచ్చితంగా ఆయన రాకడ వెయ్యేళ్ళ పాలనకు ముందు అని చెప్పువారము! తరువాత అని చెప్పువారము కాదు. నేటి సంఘ యుగమే వెయ్యేళ్ళ పాలన అని మేము నమ్మము! క్రీస్తు మొదటి రాకడ నుండి తరువాతి రాకడ వరకు గల ఈ కాలం వెయ్యేళ్ళ పాలన అని మేము అనుకోము. ఎందుకంటే అనేక ఇతర వాక్యాలలో మరియు ముఖ్యంగా యెషయా వివరణను చదివితే, ఇదే వెయ్యేళ్ళ పాలన అయితే, మీకు మరియు నాకు ఈ పాలనలో ఏదీ లోటు ఉండకూడదు!
వెయ్యేళ్ల పాలనలో, క్రీస్తు మనల్ని తన పాత్రలుగా ఉపయోగించుకుంటూ ప్రత్యక్షంగా పాలన చేయబోతున్నాడు! ప్రపంచవ్యాప్త శాంతి మరియు ప్రపంచవ్యాప్త సమృద్ధి ఉంటుంది మరియు యుద్ధం ఉండదు! కాబట్టి, ఇప్పుడు మనమున్నది వెయ్యేళ్ల పాలన అయితే, ప్రవక్తలు ఖచ్చితంగా తప్పు అవుతారు!
సాతాను యొక్క దుర్మార్గ అసత్య ప్రచారాలలోకెల్లా దుర్మార్గ ప్రచారం శ్రమలకు ముందు క్రైస్తవులను ఈ ప్రపంచం నుండి క్రీస్తు రక్షించబోతున్నాడని ఆలోచింపజేస్తూ మోసగించడం! అలా వారు దాని కోసం పూర్తిగా సిద్ధపడరు మరియు దానితో దిగ్భ్రాంతికి గులవుతారు మరియు అది వారి విశ్వాసాన్ని కొంత కంపింపజేస్తుంది! ఆయన రెండవ రాకడలో ఆయన ద్వారా శ్రమలకు ముందు పైకి ఎత్తబడుదురని ఆశిస్తున్న చాలా మంది క్రైస్తవులు వారి జీవితాలలో దిగ్భ్రాంతి చెందబోతున్నారు, ఎందుకంటే ఆయన అలా చేయడు! అది ఆయనే చెప్పాడు! ఆయన ఈ చోటనే మత్తయి 24:29 లో, ఇలా తేటగా చెప్పాడు:
"ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు కాంతిని ఇయ్యడు, ఆకాశమునుండి నక్షత్రములు రాలును, ఆకాశమందలి శక్తులు కదలింపబడును. అప్పుడు మనుష్యకుమారుని సూచన ఆకాశమందు కనబడును. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోను మహా మహిమతోను ఆకాశమేఘారూఢుడై వచ్చుట చూచి, భూమిమీదనున్న సకల గోత్రములవారు రొమ్ము కొట్టుకొందురు." ... "మరియు ఆయన గొప్ప బూరతో తన దూతలను పంపును. వారు ఆకాశము యొక్క ఈ చివరనుండి ఆ చివరవరకు నలుదిక్కులనుండి ఆయన ఏర్పరచుకొనినవారిని పోగుచేతురు."
క్రీస్తు అప్పుడు వస్తాడు: శ్రమల తరువాత! ఇది ఆ 29 వ వచనంలో చాలా తేటగా చెప్పబడింది. ఆ దినముల శ్రమ ముగిసిన తరువాత. శ్రమల తరువాత ఆకాశంలో మనుష్యకుమారుని సూచన కనబడుతుంది. శ్రమల తరువాత, భూమి యొక్క సకల గోత్రములవారు రోధించెదరు. శ్రమల తరువాత మనుష్యకుమారుడు శక్తితో మరియు గొప్ప మహిమతో ఆకాశ మేఘాలలో వచ్చుటను వారు చూస్తారు. శ్రమల తరువాత ఆయన తన దేవదూతలను గొప్ప బూర ధ్వనితో పంపును మరియు వారు ఎన్నుకోబడిన వారిని ఒకచోట చేర్చుతారు. తాను ఎన్నుకున్నవారి కోసం, తన పరిశుద్ధులను ఎత్తుబాటు చేయుటకు, వారిని ఒకచోట తిరిగి తీసుకువచ్చుటకు క్రీస్తు రాబోవునది అప్పుడు!
క్రీస్తు మీ కోసం మరియు నా కోసం రాబోతున్నది, శ్రమల తరువాత! నిజానికి, శ్రమల చివర్లో, యహువఃకు స్తోత్రములు! ముందు కాదు. ఒక రోజు కూడా ముందు కాదు! మేము ఇప్పటికే అధ్యయనం చేసిన అనేక లేఖనాలలో దినాల లెక్క కూడా ఇవ్వబడెను. క్రీస్తు విరోధి యొక్క ప్రతిమను పరిశుద్ధ స్థలంలో ఏర్పాటు చేసిన దినం మొదలుకొని శ్రమల కాలం 1260 రోజులు ఉండబోతున్నట్లు యహువః మాట చెబుతుంది!
క్రీస్తు ఎప్పుడు వస్తాడు? - శ్రమల తరువాత! ఆయన సూచన ఆకాశంలో ఎప్పుడు కనబడుతుంది? - శ్రమల తరువాత! భూమిమీదనున్న సకల గోత్రములవారు ఆయనను చూసి ఎప్పుడు రొమ్ము కొట్టుకొందురు? మీకు తెలుసా, ఇది రహస్య ఎత్తుబాటు అవుతుందని వారు అంటున్నారు, రక్షింపబడినవారు తప్ప ఎవరూ ఆయనను చూడలేరు, ఆయన వచ్చెనని ఎవ్వరూ తెలుసుకోలేరు. అకస్మాత్తుగా మనలో కొంతమంది అదృశ్యమవుతారు మరియు మనకు ఏమి జరిగిందో కూడా వారికి తెలియదు! రహస్య ఎత్తుబాటును బోధించువారు చెప్పేది ఇదే!
సంఘం ఇలాంటి విషయం గురించి [200 సంవత్సరాల క్రితం ఇంగ్లాండ్లో ఈ తప్పుడు సిద్ధాంతం మొదటిసారి కనిపించినప్పటి వరకు] ఎప్పుడూ ఆలోచన కూడా చేయలేదు. కానీ అకస్మాత్తుగా అది జనులకు చాలా మంచిదిగా కనిపించింది, "ఓ బాబూ, ఇక మనము శ్రమల ద్వారా వెళ్ళవలసిన అవసరం లేదు!" "చింతించకండి, క్రీస్తు వచ్చి శ్రమలకు ముందు మిమ్మల్ని బయటకు తీసుకువెళ్ళుచున్నాడు." కావున, అది సహజంగానే చాలా ప్రాచుర్యం పొందిన సిద్ధాంతంగా మారింది, ఎందుకంటే, ప్రతి ఒక్కరూ వినడానికి ఎదురుచూస్తున్నది అదే! సంఘమంతా ఉపశమనం కోసం ఎదురుచూస్తున్నది, ఎందుకంటే అప్పటివరకు వారు పరీక్షించబడాలని, ప్రయత్నించాలని, శుద్ధి చేయబడి, ప్రక్షాళన చేయబడి, శ్రమల కాలంలో తెల్లగా మారవలసి ఉంటుందని వారు బోధించబడిరి.
వారు కలిగి ఉన్నటువంటి మురికితోనే వారు వెంటనే రాజ్యంలోనికి ప్రవేశించాలి! - దుర్వాసనతో కూడిన రోత, మురికి, పాపం చేసే క్రైస్తవులు వారు! అవిధేయత, తిరుగుబాటు, స్వార్థం, త్యాగం చేయలేని, ప్రభువును సేవించే క్రమంలో అన్నింటినీ విడిచిపెట్టలేని, సాక్ష్యమివ్వని, ఆత్మలను గెలవలేని, మార్గాలను దాటలేని మొదలగు జీవితాలను కలిగియున్నవారు. వారు తమ కోసం స్వార్థపూరితంగా జీవిస్తున్నారు!
మంచిది, ఇది నిజం, అలాంటి ప్రజలు నిజంగా ప్రవేశించుటకు సిద్ధంగా లేరు మరియు వారు ఖచ్చితంగా శ్రమలలో బాగా నిలబడలేరు, కాబట్టి క్రీస్తు ముందుగా వచ్చి వారిని రక్షించాలని వారు కోరుకుంటారు. కాబట్టి ఇది చాలా ప్రాచుర్యం పొందిన సిద్ధాంతంగా మారింది, శ్రమల-ముందు ఎత్తుబాటు, మరియు ఇది ప్రపంచమంతా దావానలంలా వ్యాపించింది.
వారు ఈ సిద్ధాంతాన్ని బోధిస్తూ యునైటెడ్ స్టేట్స్లోని అన్ని బైబిల్ ఇన్స్టిట్యూట్లు మరియు బైబిల్ కాలేజీలలోనికి చొరబాట్లు చేయుట ప్రారంభించారు. ఆపై స్కోఫీల్డ్ తన నైపుణ్యం గల మోసాన్ని చేశాడు మరియు తన స్కోఫీల్డ్ బైబిల్ను బయటకు తీశాడు, మరియు అది నిజంగానే దానిని పూర్తిచేసెను! ఇది యునైటెడ్ స్టేట్స్ లోని దాదాపు ప్రతి క్రైస్తవుడిని శ్రమలకు ముందు క్రీస్తు వచ్చునని భావించునట్లు తప్పుదారి పట్టించెను.
మంచిది, మనము ఇక్కడ చదివిన దాని ద్వారా మీరు చూడగలిగినట్లుగా, శ్రమల తరువాత తాను రాబోతున్నాడని క్రీస్తు చెప్పాడు! శ్రమల తరువాత మీరు ఆయనను ఆకాశంలో చూస్తారు! శ్రమల తరువాత ఆయన తాను ఎన్నుకున్న వారిని సమీకరించబోతున్నాడు. శ్రమల తరువాత! అది ముగియడానికి ఒక్క నిమిషం అంటే ఒక్క నిమిషం కూడా ముందు కాదు.
ఇది డేవిడ్ బ్రాండ్ బెర్గ్ రాసిన కథనం నుండి సంగ్రహించబడింది. WLC కథనం కాదు. (https://deeptruths.com/letters/matthew24.html)
మేము అసలు వ్యాసం నుండి సమస్త అన్య నామములను మరియు తండ్రి & కుమారుడు అనే శీర్షికలను తొలగించి, వాటి స్థానాన్ని అసలు నామములతో భర్తీ చేసాము. ఇంకా, ఇక్కడ ఇవ్వబడిన లేఖనాలలో తండ్రి మరియు కుమారుని నామములను బైబిల్ యొక్క మొదటి ప్రేరేపిత రచయితలచే వ్రాయబడిన విధంగా మేము పునరుద్ధరించాము. -డబ్ల్యుఎల్సి బృందం.