Print

అందరూ భాషలలో మాట్లాడాలా? 1 కొరింథీయులు 12 యొక్క అధ్యయనం

ఇది WLC యేతర వ్యాసం. బయటి రచయితల వనరులను ఉపయోగించినప్పుడు, బైబిలుకు మరియు డబ్ల్యుఎల్‌సి ప్రస్తుత నమ్మకాలకు 100% అనుగుణంగా ఉండెనని భావించిన వాటిని మాత్రమే మేము ప్రచురిస్తాము. కాబట్టి అలాంటి వ్యాసాలను డబ్ల్యుఎల్‌సి నుండి నేరుగా వచ్చినట్లుగా పరిగణించవచ్చు. యహువః యొక్క అనేక మంది సేవకుల పరిచర్య ద్వారా మేము ఎంతగానో ఆశీర్వదించబడ్డాము. అయితే ఈ రచయితల యొక్క ఇతర రచనలను అన్వేషించమని మేము మా సభ్యులకు సలహా ఇవ్వము. అటువంటి రచనలు, లోపాలను కలిగి ఉన్నందున మేము వాటిని ప్రచురణల నుండి మినహాయించాము. విచారకరంగా, లోపం లేని మంత్రిత్వ శాఖను మనం ఇంకనూ కనుగొనలేదు. డబ్ల్యుఎల్‌సి వి కాని కొన్ని ప్రచురించబడిన వ్యాసాలు / ఎపిసోడ్లు చూసి మీరు దిగ్బ్రాంతి చెందినచో, సామెతలు 4:18 జ్ఞాపకం చేసుకోండి. మన మార్గంలో మరింత కాంతి వెలువడు కొద్దీ ఆయన సత్యాన్ని గూర్చిన మన అవగాహన అభివృద్ధి చెందుతూ ఉంటుంది. మేము సత్యాన్ని ప్రాణం కంటే ఎక్కువగా ఆదరిస్తాము మరియు అది దొరికిన చోటు ఏదైనా అక్కడ వెతుకుతాము.

అందరూ-భాషలలో-మాట్లాడాలా

1 కొరింథీయులకు 12లోని పౌలు మాటలు "అన్యభాషలలో మాట్లాడుట" విషయంలో తప్పుగా అర్థం చేసుకోబడ్డాయి మరియు తప్పుగా అన్వయించబడ్డాయి. అందరూ భాషలలో మాట్లాడలేదని చివరి ఐదు వచనాలు స్పష్టంగా చెబుతున్నాయి. అందరికీ ఆ బహుమానము లేదు. కానీ నేను చాలా సంవత్సరాలుగా ఉంటున్న సంస్థతో, పౌలు రెండు “వివరణలు” ద్వారా విభేదించాడు. మొదటిది, ఆ సందర్భం సంఘ కూడిక గురించి మాట్లాడుతున్నదని చెప్పబడింది, కాబట్టి కూడికలో అందరూ భాషలలో మాట్లాడి ఉండరు. "వారు అలా చేస్తే, మీరు ఎప్పటికీ ఇంటికి చేరుకోలేరు" అని మా బోధకుడు చెప్పాడు. దీనితో సమస్య ఏమిటంటే, ఈ అధ్యాయం యొక్క సందర్భం మొత్తంగా క్రీస్తు శరీరంలోని సభ్యుల గురించి మరియు వారి వివిధ విధుల గురించి స్పష్టంగా మాట్లాడుతుంది, సంఘ కూడిక కోసం కాదు. అంతేకాకుండా, ఈ విభాగంలో ప్రస్తావించబడినది భాషలు మాత్రమే కాదు. అదే వివరణ అపొస్తలులకు లేదా అద్భుతాలు చేసేవారికి వర్తించదు. “దయచేసి ఎవరైనా నిలబడి అద్భుతం చేయండి,” లేదా “చనిపోయిన వారిని లేపండి” అని మా సమావేశాలలో ఎవరూ చెప్పలేదు.

ఇప్పటికీ తరచుగా ఉపయోగించే మరొక వివరణ ఏమిటంటే, తిరిగి జన్మించిన ప్రతి ఒక్కరికీ "మొత్తం తొమ్మిది బహుమానాలను అన్ని సమయాలలోను నిర్వహించగల సామర్థ్యం" ఉంటుంది, అయితే ప్రతి ఒక్కరూ వారి సుముఖత లేదా వారి విశ్వాసాన్ని బట్టి అలా చేయరు. ఈ వివరణ ప్రకారం, వేర్వేరు వ్యక్తులు వేర్వేరు నైపుణ్యాలను కలిగి ఉంటారు, ఒకటి లేదా అంతకంటే ఎక్కువ వ్యక్తీకరణలలో వేర్వేరు "స్థాయిల సామర్థ్యాలను" కలిగి ఉంటారు. కానీ వారు నిజంగా తొమ్మిది బహుమానాలను నిర్వహించాలి లేదా చేయగలగాలి. దీనంతటికీ గల ఆధారం అధ్యాయం యొక్క మొదటి భాగాన్ని, ముఖ్యంగా 4-11 వచనాలను తప్పుగా అర్థం చేసుకోవడం. 4 నుండి 6 వచనాలు బహుమానాలు, పరిచర్య శాఖలు మరియు నానావిధములైన కార్యములు (KJVలో బహుమానాలు, పరిచర్యలు మరియు కార్యకలాపాలు) గురించి మాట్లాడుతున్నాయి. తర్వాత 7వ వచనం “అయినను”తో ప్రారంభమవుతుంది. అనగా ఇంతకు ముందు వచ్చిన దానికి భిన్నంగా ఇది ఉన్నట్లు చెప్పబడింది. కాబట్టి వ్యక్తీకరణలు బహుమానాలకు భిన్నంగా ఉంటాయి. మనకు బోధించబడిన బహుమానం పరిశుద్ధాత్మ, మరియు ఈ క్రింది వచనాలలో జాబితా చేయబడిన తొమ్మిది విషయాలు ఆ బహుమానం యొక్క వ్యక్తీకరణలు.

అయితే 7వ వచనంలో గల “అయినను” అనే పదం బలమైన వ్యత్యాసాన్ని సూచించే అల్లా/alla అనే పదం కాదు. ఇక్కడ ఇవ్వబడిన పదం డే/de, ఇది పదబంధాల మధ్య పరివర్తనను గుర్తించడానికి లేదా బలమైంది కాని వ్యత్యాసాన్ని గుర్తించడానికి ఉపయోగించబడుతుంది. దీనిని “మరియు,” “అలా,” “ఇప్పుడు,” లేదా “అంతేకాక” అని అనువదించవచ్చు. తరువాతి వచనాలు ఆత్మ వ్యక్తమయ్యే మార్గాలను జాబితా చేస్తాయి, కానీ అవి బహుమానాలు కాదని సూచించడానికి ఏమీ లేదు. అవన్నీ నిర్దిష్ట క్రమంలో జాబితా చేయబడని బహుమానాలు మరియు వీటిని ఇతర బహుమానాల జాబితాలతో పోల్చి చూసినప్పుడు (రోమా. 12:4-8; 1 కొరి. 12:27-31; ఎఫె. 4:7-13; 1 పేతురు. 4:10 -11), ఈ తొమ్మిదీ బహుమానాలు అని చూడవచ్చు, అయితే సమగ్ర జాబితా కాదు.

అదనంగా, 7వ వచనం “ఆత్మ యొక్క ప్రత్యక్షత” గురించి మాట్లాడుతుంది, “వ్యక్తీకరణలు” కాదు. దీనికి అర్థం సాక్ష్యం, లేదా చూపడం. బహుమానాలు, పరిచర్య శాఖలు మరియు ప్రభావాలు అనేక రకాలు ఉన్నాయి, కానీ అదే ఆత్మ వాటిని శక్తివంతం చేస్తుంది; అందువలన ఆత్మ యొక్క సాక్ష్యం సాధారణ మంచి కోసం ప్రతి ఒక్కరికి ఇవ్వబడుతుంది.

"ఏలాగనగా, ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధి వాక్యమును, మరియొకనికి ఆ ఆత్మననుసరించిన జ్ఞానవాక్యమును, మరియొకనికి ఆ ఆత్మవలననే విశ్వాసమును, మరియొకనికి ఆ ఒక్క ఆత్మవలననే స్వస్థపరచు వరములను, మరియొకనికి అద్భుత కార్యములను చేయు శక్తియు, మరియొకనికి ప్రవచన వరమును, మరియొకనికి ఆత్మల వివేచనయు, మరియొకనికి నానావిధ భాషలును, మరియొకనికి భాషల అర్థము చెప్పు శక్తియు అనుగ్రహింపబడియున్నవి. అయినను వీటినన్నిటిని ఆ ఆత్మ యొకడే తన చిత్తము చొప్పున ప్రతివానికి ప్రత్యేకముగా పంచియిచ్చుచు కార్యసిద్ధి కలుగజేయుచున్నాడు." (1 కొరింథీయులకు 12:8-11).

8వ వచనంలో "కి" అనే పదం "కొరకు" అని మరియు "ఒకటి" అంటే "ఒక లాభం" అని మరియు ఈ వచనాలను ఇలా చదవాలి అని నాకు ఒకసారి బోధించబడ్డాయి: "ఒక లాభం కోసం జ్ఞానం యొక్క పదం ఇవ్వబడెను మరియు మరొక లాభం కోసం జ్ఞానం యొక్క పదం...”. అయినప్పటికీ, గ్రీకు అటువంటి గొప్ప తప్పుడు అనువాదానికి చిన్న ఆధారాన్ని/సూచనను కూడా ఇవ్వలేదు మరియు చాలా మంది అనుచరులు లేదా మాజీ అనుచరులు సరిగ్గా ఈ వివరణను వదులుకున్నారు. అయినప్పటికీ, తిరిగి జన్మించిన ప్రతిఒక్కరూ ఈ తొమ్మిది బహుమానాను నిర్వహించగల సామర్థ్యాన్ని కలిగి ఉంటారని ఇప్పటికీ చెప్పబడుతుంది. 11వ వచనం ప్రతి వ్యక్తికి "అతని" ఇష్టం చొప్పున పంపిణీ చేయబడుతుందని చెబుతుంది. "తన" అనే పదం బహుమానాన్ని స్వీకరించే వ్యక్తిని సూచిస్తుందని నాకు బోధించబడింది, తద్వారా ఒక వ్యక్తి తన స్వంత ఇష్టానుసారం నిర్వహించే వ్యక్తీకరణలను అది సూచిస్తుందని. కానీ 11వ వచనంలోని “తన” అనే పదాన్ని మీరు ఎలా అర్థం చేసుకున్నప్పటికీ, 18 మరియు 28వ వచనాలు ఇప్పటికీ యహువః తన శరీరంలోని అవయవాలను తనకు కావలసిన చోట ఉంచినట్లు స్పష్టంగా తెలియజేస్తున్నాయి. 11వ వచనంలోని “తన” అనే పదం క్రైస్తవ విశ్వాసిని సూచిస్తుందని ఏ వ్యాఖ్యానమూ ఊహించలేదు.

12వ మరియు తరువాతి వచనాలు సంఘాన్ని మానవ శరీరంతో పోల్చాయి. పాదం తాను చేయి కానందున తాను శరీరంలోని భాగం కాదని చెప్పదు. చెవి తాను కన్ను కానందున అది శరీరంలోని భాగం కాదని చెప్పదు. ప్రతి సభ్యునికి ఒక నిర్దిష్ట విధి ఉంటుంది మరియు దానిని నిర్వహించడానికి శరీరంలో ఉంచబడుతుంది. అయితే ఈ వాక్యం ఏమి చెప్పుటలేదో గమనించండి. శరీరంలోని ప్రతి భాగం మరే ఇతర భాగం వలెనైనా ఉండే సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని చెప్పలేదు. కన్ను చెవి కాదు, కానీ కావాలంటే కావొచ్చు, కావాలంటే పాదం చేయి కావొచ్చు అని చెప్పలేదు. అలాగే శరీరంలోని ప్రతి భాగానికీ అన్ని విధులు చేయాలనే కోరిక ఉండాలని కూడా చెప్పలేదు. ప్రతి సభ్యునికి తన సొంత విధి ఉంటుంది, ఇది యహువః చే నిర్ణయించబడుతుంది.

ఇంకా, 7-11 వచనాలు ఒకరికి ఒక బహుమానము మరొకరికి మరొక బహుమానము ఇవ్వబడుతుందని స్పష్టంగా తెలియజేస్తున్నాయి. మీకు బహుమానము ఇవ్వకపోతే, అది మీకు లేదు! 11వ వచనం "వ్యక్తి ఇష్టానుసారం" అని అర్థం కాదనడానికి ఇది మరొక రుజువు.

"అటువలె, మీరు క్రీస్తుయొక్క శరీరమైయుండి వేరు వేరుగా అవయవములైయున్నారు. మరియు యహువః సంఘములో మొదట కొందరిని అపొస్తలులు గాను, పిమ్మట కొందరిని ప్రవక్తలుగాను, పిమ్మట కొందరిని బోధకులుగాను, అటుపిమ్మట కొందరిని అద్భుతములు చేయువారిని గాను, తరువాత కొందరిని స్వస్థపరచు కృపావరములు గలవారినిగాను, కొందరిని ఉపకారములు చేయువారినిగాను, కొందరిని ప్రభుత్వములు చేయువారిని గాను, కొందరిని నానా భాషలు మాటలాడువారినిగాను నియమించెను. అందరు అపొస్తలులా? అందరు ప్రవక్తలా? అందరు బోధకులా? అందరు అద్భుతములు చేయువారా? అందరు స్వస్థపరచు కృపావరములు గలవారా? అందరు భాషలతో మాటలాడుచున్నారా? అందరు ఆ భాషల అర్థము చెప్పుచున్నారా? కృపావరములలో శ్రేష్ఠమైన వాటిని ఆసక్తితో అపేక్షించుడి. ఇదియుగాక సర్వోత్తమమైన మార్గమును మీకు చూపుచున్నాను. (I కొరింథీ. 12:27-31).

విశ్వాసులందరికీ అన్ని బహుమానాలను నిర్వహించగల సామర్థ్యం ఉన్నదనే మొత్తం భావన ఇందులో మరియు ఇతర భాగాలలో చదవబడింది, కానీ దానికి ఎటువంటి లేఖనాధారం లేదు. ఇది లేఖనాలలో ఉన్నట్లు చదవడానికి గల కారణాలలో ఒకటి పరిశుద్ధాత్మ అంటే ఏమిటో అన్నదాన్ని అపార్థం చేసుకోవడం. బైబిల్లో, ఇది, వ్యక్తుల ద్వారా లేదా సంఘటనల ద్వారా పని చేసే యహువః యొక్క లేదా పునరుత్థానుడైన యహూషువః యొక్క ఉనికి మరియు శక్తి.

ప్రార్ధనా గుంపు


ఇది మార్క్ క్లార్క్ రాసిన వ్యాసం. WLC వ్యాసం కాదు.

మేము అసలు వ్యాసం నుండి సమస్త అన్య నామములను మరియు తండ్రి - కుమారుడు అనే శీర్షికలను తొలగించి, వాటి స్థానాన్ని అసలు నామములతో భర్తీ చేసాము. ఇంకా, ఇక్కడ ఇవ్వబడిన లేఖనాలలో తండ్రి మరియు కుమారుని నామములను బైబిల్ యొక్క మొదటి ప్రేరేపిత రచయితలచే వ్రాయబడిన విధంగా మేము పునరుద్ధరించాము. -డబ్ల్యుఎల్‌సి బృందం.