Print

యోహాను సువార్త యొక్క మొదటి వచనం

ఇది WLC యేతర వ్యాసం. బయటి రచయితల వనరులను ఉపయోగించినప్పుడు, బైబిలుకు మరియు డబ్ల్యుఎల్‌సి ప్రస్తుత నమ్మకాలకు 100% అనుగుణంగా ఉండెనని భావించిన వాటిని మాత్రమే మేము ప్రచురిస్తాము. కాబట్టి అలాంటి వ్యాసాలను డబ్ల్యుఎల్‌సి నుండి నేరుగా వచ్చినట్లుగా పరిగణించవచ్చు. యహువః యొక్క అనేక మంది సేవకుల పరిచర్య ద్వారా మేము ఎంతగానో ఆశీర్వదించబడ్డాము. అయితే ఈ రచయితల యొక్క ఇతర రచనలను అన్వేషించమని మేము మా సభ్యులకు సలహా ఇవ్వము. అటువంటి రచనలు, లోపాలను కలిగి ఉన్నందున మేము వాటిని ప్రచురణల నుండి మినహాయించాము. విచారకరంగా, లోపం లేని మంత్రిత్వ శాఖను మనం ఇంకనూ కనుగొనలేదు. డబ్ల్యుఎల్‌సి వి కాని కొన్ని ప్రచురించబడిన వ్యాసాలు / ఎపిసోడ్లు చూసి మీరు దిగ్బ్రాంతి చెందినచో, సామెతలు 4:18 జ్ఞాపకం చేసుకోండి. మన మార్గంలో మరింత కాంతి వెలువడు కొద్దీ ఆయన సత్యాన్ని గూర్చిన మన అవగాహన అభివృద్ధి చెందుతూ ఉంటుంది. మేము సత్యాన్ని ప్రాణం కంటే ఎక్కువగా ఆదరిస్తాము మరియు అది దొరికిన చోటు ఏదైనా అక్కడ వెతుకుతాము.

సముద్ర తీరం

"ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై యుండెను."

యోహాను చెబుతున్న‌ ఈ మొదటి మూడు పదాల మధ్యగల సంబంధాన్ని యోహాను యొక్క హెబ్రీ శ్రోతలు కోల్పోరు - ఆ పదాలు ఆదికాండం యొక్క ప్రారంభ పదాలకు సమానంగా ఉన్నాయి.

మీరు క్రొత్త నిబంధనలో “దేవుడు” అనే పదాన్ని చూసినప్పుడు, అది తండ్రియైన యహువఃను సూచిస్తుంది. ఈ పదం క్రొత్త నిబంధనలో వెయ్యికంటే ఎక్కువ సార్లు ఉంది. రెండు సందర్భాల్లో మాత్రమే “దేవుడు” అనే పదం యహూషువఃను సూచించింది. (హెబ్రీ. 1: 8; యోహాను 20:28).

దేవుడు = తండ్రి

దేవుడు తండ్రి అనే ఈ వాస్తవాన్ని వర్తింపజేస్తే, ఈ వాక్యం ఇలా ఉంటుంది: “ఆదియందు వాక్యముండెను, వాక్యము తండ్రి యొద్ద ఉండెను, వాక్యము తండ్రియై యుండెను.”

వాక్యం ఎవరు లేక ఏమిటి? వాక్యం = యహూషువః అందువలన, అప్పుడు అది ఇలా ఉంటుంది: “ఆదియందు యహూషువః ఉండెను, యహూషువః తండ్రి యొద్ద ఉండెను, యహూషువః తండ్రియై యుండెను." యహూషువః తండ్రియై యుండెనా?!

వాక్యం = కుమారుడు అయితే, అప్పుడు అది ఇలా ఉంటుంది: “ఆదియందు కుమారుడు ఉండెను, కుమారుడు తండ్రి యొద్ద ఉండెను, కుమారుడు తండ్రియై ఉండెను.” కుమారుడు తండ్రియై ఉండెనా?!

ఇది గందరగోళం. వాక్యం యహూషువః, లేదా కుమారుడు అని పిలువబడిన ఒక వ్యక్తి అని మీరు ఊహించినప్పుడు, ఫలితంగా ఏర్పడు కుమారుడే తండ్రి అనే వైరుధ్యం అటువంటి ఊహ అబద్ధమని నిరూపిస్తుంది. యోహాను వ్రాసిన "వాక్యం" కేవలం దానికోసమే: తండ్రి అయిన యహువః మాట్లాడే వాక్యం [హెబ్రీ లేఖనాల్లో సృష్టికర్త YHWH అని పిలువబడును.] యోహాను ప్రస్తావనలోని "వాక్యం" ఒక వ్యక్తి కాదు, అది సృష్టికర్త మాట్లాడే వాక్యం, దీని ద్వారా సమస్తం సృష్టించబడ్డాయి.

ఒక ఆదివారం నా తల్లి యొక్క సమాజానికి క్రీస్తు విషయంలో క్యాంపస్ క్రూసేడ్ ముద్రించిన చక్కగా-వర్ణించబడిన నిగనిగలాడే పత్రికను అందజేశారు. దీనిని "ది డా విన్సీ కోడ్: ఎ కంపానియన్ గైడ్" అని పిలుస్తారు. దానిలో ఒక విభాగం క్రీస్తు దైవత్వం తరుపున వాదిస్తుంది, యహూషువఃను "కేవలం మనిషి" గా చేయుటను కోడ్ ఖండించింది. ఈ సమస్యపై బ్రోచర్ యొక్క మొదటి పేరా అద్భుతంగా ఉంటుంది. నేను దానిని పూర్తిగా ఉదహరిస్తాను:

“యేసు నిజానికి దేవుడు అని చెప్పుకున్నాడా? యేసు చెప్పిన మరియు చేసిన ప్రతిదీ ఈ దిశలో సూచించినట్లుగా ఉండుటవరన ఇది నిర్వివాదమైనదిగా అనిపిస్తుంది. ఉదాహరణకు, యేసు నీటి మీద నడిచిన అద్భుతాన్ని పరిశీలించండి. ఆయన ఎందుకు ఎగరలేదు లేదా తాను టెరోడాక్టిల్‌ [ఒక రకమైన ఎగిరే బల్లి జాతి] గా ఎందుకు మారలేదు? కారణం ఇక్కడ ఉంది: "ఆయన ఒక్కడే ఆకాశమండలమును విశాలపరచు వాడు సముద్ర తరంగముల మీద ఆయన నడుచుచున్నాడు." (యోబు 9: 8). పాత నిబంధనలోని ఈ వాక్యం యేసు ప్రేక్షకులకు సాధారణంగా తెలిసే ఉంటుంది - దేవుడు మాత్రమే సముద్రం మీద నడుస్తాడు. కాబట్టి యేసు నీటి మీద నడుచుటకు ఎంచుకున్నప్పుడు అది కేవలం శక్తికి నిదర్శనం కాదు, అది దైవత్వం, ఇది వస్తు పాఠం. కార్నివాల్ ప్రదర్శన కాదు. దీనికి విరుద్ధంగా, మీరు ‘దేవుడు’ అనే పేరు ఇవ్వకుండా ఉండటానికి ప్రయత్నిస్తుంటే, ఇది మీరు చేస్తున్న చివరి ప్రయత్నం.”

నేను అర్ధంలేని దీనిని చదివినప్పుడు నా కళ్ళు వాటి స్ధానం నుండి బయటకు వచ్చాయి! నేను ఖచ్చితంగా నవ్వుకున్నాను, ఖచ్చితంగా. ఈ వాదనను ఆధారం చేసుకుని, ఏలియా దైవమై ఉండాలని నేను కూడా నిర్ధారించుకోవచ్చు, ఎందుకంటే పాత నిబంధనలో యహువః ఆకాశంలో తన రథంపై ప్రయాణించెను, అలాగే ఏలియా కూడా ఆకాశంలోకి ఎత్తబడెను?!

నీటిపై నడుచుట

యహూషువఃను గూర్చిన నిజం ఏమిటంటే, ఆయన మానవులందరి వలె, తన తల్లి గర్భంలో ఆవిర్భవించాడు. పుట్టకముందే సజీవంగా ఉన్న ఇతర యహూషువఃలు ఎవ్వరూ నిజంగా మానవులు కారు. మనము ఆయన ఉనికిని పూర్వ-చరిత్రకు మార్చిన యొడల మానవ యహూషువః దాడికి గురౌతాడు. ఒక వ్యక్తి యొక్క నిజమైన అహం తన పుట్టుకకు ముందే సృష్టించబడితే, తల్లి గర్భంలో గర్భం దాల్చినది నిజంగా మానవుడు కాదు. అతడు లేదా ఆమె మరొక ప్రపంచం నుండి వచ్చే సందర్శకులు. మానవులు అలా ప్రారంభంకారు. దావీదు నుండి మరియ ద్వారా వచ్చుటకు మరియు పుట్టడానికి (= ఉనికిలోకి తీసుకురాబడుటకు) ఒకరు గర్భంతో ప్రారంభం కావాలి లేదా గర్భంలో పుట్టాలి.

మెస్సీయ మానవ జాతి సభ్యుడు కాడని యూదులు ఎన్నడూ ఊహించలేదు. యహూషువః ఒక ద్వంద్వ ఆరంభం కలిగియుండెని [ఒకసారి నిత్యత్వంలో లేదా ఆదికాండానికి ముందు, మరొకసారి కైసరు ఔగుస్తు దినాలలో] చెప్పుట క్రొత్త నిబంధనకు ఒక భారీ కుదుపు. ద్వంద్వ ఆరంభం కలిగి ఉండెను అనేది ఆ తరువాత విశ్వాసుల మధ్య శతాబ్దాల తరబడి వివాదానికి దారితీసింది మరియు చివరకు వివిధ సంఘ సిద్ధాంతాలకు దారితీసింది. దేవుని కుమారుడు దైవ సమానుడు కాడని అనుకున్న వారిని మాత్రం ఇది మినహాయించింది.

దేవుడు ఒకడు కంటే ఎక్కువ వ్యక్తులు అనే ఈ అద్భుతమైన భావనకు మద్దతు ఇవ్వడానికి యోహాను సువార్త ఉపయోగించబడుతుంది. పరలోకంలో మనిషిగా మారని దేవుడు మరియు మనిషిగా మారే మరొక దేవుడు ఉంటే, ఇది స్పష్టంగా ఏకదైవవాదం కాదు! యుపిసి (యునైటెడ్ పెంటెకోస్టల్ చర్చ్) తండ్రి మరియు కుమారుడు ఒకే వ్యక్తి అని చెప్పడం ద్వారా ఇద్దరు దేవుళ్ళ “వేదన” ను నివారించడానికి ప్రయత్నిస్తుంది. ఇది క్రొత్త నిబంధన వాస్తవాల యొక్క అసాధ్యమైన పఠనం, క్రొత్త నిబంధన తండ్రిని మరియు కుమారుని విభిన్న వ్యక్తులుగా పదే పదే మాట్లాడుతుంది.

త్రిత్వ సిద్దాంతీకులు కూడా యోహాను నుండి ఇలాగే వాదిస్తారు. ఇక్కడ ఏదో తప్పు ఉన్నదని దానికదే సూచిస్తుంది. దేవుడు మరియు యహూషువః యొక్క నిర్వచనం క్రొత్త నిబంధనలో, పాత నిబంధనలో మరియు ప్రవచనంలో ప్రతిచోటా కనుగొనబడుతుంది. త్రిత్వ సిద్ధాంతానికి పాత నిబంధన మద్దతు ఇవ్వదు. యూదులు ఎల్లప్పుడూ మరియు ఇప్పటికీ ఏకదైవవాదులు. మత్తయి, మార్కు, లూకా, అపొస్తలులు, పేతురు త్రిత్వ దైవానికి మద్దతు ఇవ్వరు. యోహాను దీనిని చెప్పెనని త్రిత్వ సిద్దాంతీకులు ఆశిస్తారు, అయితే యోహాను రాసిన వాటిని సవరించడం ద్వారా మాత్రమే.

యోహాను "ఆదియందు దేవుని కుమారుడు దేవునితో ఉండెను మరియు అతడే దేవుడు" అని చెప్పలేదు. యోహాను అలా వ్రాసి ఉంటే, అతడు దేవుడు ఒక్కడే అని చెప్పిన యహూషువః బోధనకు విరుద్ధంగా ఉండేవాడు: “అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును, నీవు పంపిన యహూషువఃను ఎరుగుటయే నిత్యజీవం” (యోహాను 17: 3). దేవుడు పంపిన యహూషువః “ఏకైక నిజమైన దేవుడు” కాదని అర్థం.

తండ్రి మరియు కుమారుడు

యోహాను లేఖనాలు త్రిత్వానికి మద్దతుగా అనువాదకులచే అన్యాయంగా తిరిగి వ్రాయబడెను. యోహాను 17: 3 మరియు 5:44 నుండి మనం చూస్తున్నట్లుగా యోహాను త్రిత్వవాది కాదు. అతడు ఒక్కడైయున్న ఏకదేవుని విషయంలో క్రొత్త నిబంధన యొక్క ఇతర భాగాలతో అంగీకరించాడు. యోహాను ఇలా వ్రాశాడు “ఆదియందు వాక్యముండెను.” మీ అనువాదంలోని పెద్ద అక్షరం/క్యాపిటల్ లెటర్ (Word) చాలా తప్పుదారి పట్టించేదిగా ఉంటుంది, అక్కడ ఇద్దరు వ్యక్తులు ఉన్నారని మీరు అనుకుంటారు! ఈ "వాక్యం" యహువః మాట, యహువః కుమారుడు కాదు. 14 వ వచనంలో మాత్రమే, ఆ మాట లేదా వాగ్దానం మానవ వ్యక్తిగా మారింది, అద్భుతం ద్వారా మరియలో యహువః తన ప్రత్యేక కుమారుని జన్మింపజేసాడు. కుమారుడైన యహూషువః అనగా ఈ వాక్యం అలా అయ్యింది అని, అంతేకాని, వాక్యం ఒకరి-తో-ఒకరు సమానం అని కాదు. నిత్యమైన కుమారుడని చెప్పుట, మీ మనసులో సృష్టింపబడని ఇద్దరు దేవుళ్ళను ఉంచుట. మార్కు 12: 28-34 (ద్వితీయోప. 6: 4) ను సూచించుట ద్వారా యహూషువః విశ్వాసం దీనిని నిషేధించింది, కానీ దురదృష్టవశాత్తు యహూషువః విశ్వాసం క్రిందికి రాని సంఘాల విశ్వాసాల ద్వారా ఇది ప్రోత్సహించబడింది. కానీ ఎందుకు కాదు?

మనము పాత నిబంధనతో మరియు యహువః కుమారుని చారిత్రక మూలం యొక్క స్పష్టమైన వృత్తాంతాలతో ఉంటే, మనం మానవ మెస్సీయపై విశ్వాసం నిలుపుకుంటాము. ఇది ఇశ్రాయేలు మరియు యహూషువః విశ్వాసానికి విరుద్ధంగా ఉండకుండా మనలను నిరోధించడమే కాకుండా, యహువః కుమారుడు మనకోసం మరణించెననే ఆలోచనను అర్ధం చేసుకొనుటలో అపారమైన అవగాహనను చేకూరుస్తుంది.

యహువః మరణించడు. ఆయన అమరుడు (1 తిమో. 6:16, మొదలైనవి). కాబట్టి “యహువః కుమారుడు మరణించెను” మరియు “యహువః కుమారుడు దేవుడు” అనే ప్రతిపాదనలు సంఘం యొక్క మతం ద్వారా బలవంతం చేయబడిన వారు గందరగోళంగా ప్రవేశపెట్టిన విరుద్ధమైన ఆలోచనలే తప్ప మరేమీ కాదు. కానీ మన పండితులను సిలువ వేయమని బైబిలు కోరదు. మనకు తెలియని యహువః గురించి చాలా ఉన్నాయి కాని తేలికైన భాషలో మనకు తెలియజేయబడిన దానిని మనం నమ్మాలి. “యహూషువఃయే యహువః” మరియు “యహూషువః మరణించెను” అని చెప్పుట అర్ధంలేని మాటలు మాట్లాడునట్లు మనల్ని బలవంతం చేస్తుంది, ఎందుకంటే అమరత్వం మరణించదు కాబట్టి. వెస్లీ యొక్క “ఇది అంతా మర్మము: అమరత్వం మరణిస్తుంది” అనే పాట బైబిల్ అనంతర సిద్ధాంతానికి బానిసగా ఉన్న ఒక మనస్సు యొక్క విషాద ఫలితాలను మరియు భాష యొక్క అనుమతించలేని వాడుకను చూపిస్తుంది.

కుమారుడు పూర్వ-చారిత్రక జీవితం నుండి వచ్చాడని ఇప్పుడు ఇక్కడ యోహాను సువార్త చెబుతోంది. బాప్తీస్మమిచ్చు యోహానుకు ఆయన ఆది నుండి (1:15, 30) ఉన్నతమైనవాడు (ప్రోటోస్ మౌ = “నాకు ఉన్నతమైనవాడు”). అతడు 600 సంవత్సరాల క్రితం దానియేలు చూసిన దర్శనంలోని మనుష్య కుమారుడు (6:62). శ్రేష్టమైన ప్రతియీవియు యహువః నుండి వచ్చునట్లు ఆయన పరలోకం నుండి వచ్చాడు (యాకోబు 1:17; 3:15). నిజానికి అతని శరీరం పరలోకం నుండి వచ్చింది (యోహాను 6:51). కుమారుడు ప్రపంచానికి యహువః ఇచ్చిన బహుమానం. యోహాను 13:3, 16:28 మరియు 20:17 యొక్క యన్ఐవి మరియు గ్రీకు యొక్క తప్పు అనువాదం జాన్ 13: 3 లో ఉంది. తాను తిరిగి స్వర్గానికి వెళుతున్నానని యహూషువః ఎప్పుడూ చెప్పలేదు, ఈ ఆలోచన నిజమైన మానవునిగా తన స్థితిని నాశనం చేస్తుంది మరియు అతన్ని బాహ్య అంతరిక్షం నుండి వచ్చిన సందర్శకుడిని చేస్తుంది. ఆయన తన పనికి ప్రతిఫలంగా యహువః యొద్ద ఉన్న (17: 5) తన “మహిమను” అడిగాడు. అదే విధంగా 21 వ శతాబ్దంలో నివసిస్తున్న మీకును ఇదే కీర్తి (17:22, 24) ఇప్పటికే ఇవ్వబడింది - అది, క్రీ.శ 30 లో యహువః ద్వారా (యహూషువః ప్రార్థించినట్లు) ఇవ్వబడింది. యోహాను 17: 5 లో ఉన్నట్లే ఇది‌ ఆశ మరియు వాగ్ధానంలోని మహిమ.

అబ్రాహాము పుట్టకమునుపే నేను ఉన్నానని అతడు చెప్పినప్పుడు (యోహాను 8:58), తాను అబ్రాహాము ఎదురుచూస్తున్న తన మెస్సీయత్వం గురించి ప్రస్తావించాడు. యోహానులో గల “నేనే ఆయనను” అనే మాట యోహాను 4:26 లోని ప్రకటన యొక్క ఆ మొదటి సంఘటనపై ఆధారపడి ఉంది, ఇక్కడ “నేనే ఆయనను” అంటే “నేనే మెస్సీయ అని” యహూషువః ఖచ్చితంగా "నేను యహువః" అని చెప్పుట లేదు, ఎందుకంటే తరువాత "తండ్రి మాత్రమే నిజమైన దేవుడు" అని చెప్పాడు. యేసు "అబ్రాహాముకు ముందు నేను సిలువ వేయబడ్డాను" (ప్రక. 13: 8) అని కూడా చెప్పగలడు మరియు యూదుల మాట్లాడే విధానాన్ని ఎవరూ తప్పుగా అర్థం చేసుకొని ఉండరు.

యోహాను 20:28 విషయానికొస్తే, 14: 9 లో తోమా గ్రహించలేకపోయిన విషయాన్ని, యహువః యహూషువఃలో ఉన్నాడని మరియు యహూషువఃను అర్థం చేసుకోవడం అంటే యహువఃను అర్థం చేసుకోవడం అనే విషయాన్ని క్రమంగా గ్రహించాడు. చివరికి కాంతి అభివృద్ధి చెందింది మరియు తోమా యహూషువఃను "నా ప్రభువు" మెస్సీయగా గుర్తించాడు మరియు అయనలో యహువఃను చూశాడు. తోమా ఇశ్రాయేలు విశ్వాసాన్ని నాశనం చేయలేదు మరియు మనకు ఇద్దరి దేవుళ్ళను ఇవ్వలేదు! తాను వ్రాసిన ప్రతి మాట యేసు యహువః కుమారుడైన మెస్సీయ (20:31) అని నిరూపించడానికే అని యోహాను త్వరగా గుర్తు చేశాడు.

తండ్రిమరియుకుమారుడు

బైబిల్ లో ఇద్దరు యహువఃలు ఉన్నారని‌ చెప్పుట నేను కొంతమంది దగ్గర వింటున్నాను, మరియు బహుశా ముగ్గురని కూడా. యూదులను, ముస్లింలను రెచ్చగొట్టడానికి ఇది సరిపోతుంది! ఒక్క యహువః ఉండెనని మరియు యహూషువః ఎప్పుడూ "యహువః" అని చెప్పుకోలేదని [ఇలా చెప్పుకొనెను అనుకొనే ఆయనను చట్టప్రకారం శిలువ వేసిరి] మానవ జాతి గ్రహించి స్థిరపడవలసిన సమయం ఇది.

పౌలు విశ్వాసం గురించి మాట్లాడినప్పుడు, అతడు ఏకదైవవాదిగా ఉన్నాడు: “మనకు ఒక్కడే దేవుడున్నాడు, ఆయన తండ్రి” (I కొరిం. 8: 6). కీర్తన 110: 1 లోని “నా ప్రభువు” అనగా ఒక ప్రభువైన మెస్సీయ, యహూషువః అని. దురదృష్టవశాత్తు మన సంస్కర్తలు (చాలా సందర్భాల్లో, కానీ RSV, NRSV మరియు NAB లలో కాదు) యేసు కూడా దేవుడు అని మీరు విశ్వసించేలా వాక్యాన్ని “మెరుగుపరచడంలో” తీరికలేకుండా ఉన్నారు. కీర్తన 110: 1 లోని “నా ప్రభువు” - అనేది - “ప్రభువు” కాదు. ఇక్కడ వాడబడిన "ప్రభువు" యొక్క హెబ్రీ పదం ఆదోని/ADONI. మరియు ఈ "ఆదోని/ప్రభువు" అనే పదానికి ఎప్పుడూ దేవుడు అని అర్ధం కాదు. ఈ పదం దేవున్ని సూచించుట కోసం కాదు, అప్పుడప్పుడు మానవులలో, మరియు దేవదూతలలో గొప్పవారిని ప్రభువు అని సంబోధించి పిలిచే రూపం (అదోని). అదోని అని వ్రాయబడిన 195 చోట్లలో ఎక్కడా అది దేవుని కోసం వాడబడలేదు. తండ్రియైన దేవుడు అదోనాయ్. అదోని మరియు అదోనాయ్ మధ్య చాలా వ్యత్యాసం ఉంది. దేవుడిని దేవుడై ఉండనివ్వండి, కుమారుని మనకు బోధించుటకు మరియు మన కొరకు మరణించుటకు నియమించబడిన అద్భుతమైన మానవ రక్షకుడిగా ఉండనివ్వండి. దేవుడు అతడిని ఆ పనికోసం నియమించాడు, మరియు అతడు విజయం సాధించాడు మరియు ప్రపంచం మొత్తం ఇశ్రాయేలీయుల దేవుణ్ణి మరియు ఆయన కుమారుడైన మెస్సీయను అంగీకరించే వరకు విజయం సాధిస్తూ ఉంటాడు. (జెకర్యా 14: 9).

యోహాను-సువార్త-యొక్క-మొదటి-వచనం


ఇది జోనాథన్ స్జోర్డాల్ రాసిన వ్యాసం. డబ్ల్యుఎల్సి వ్యాసం కాదు. (వాల్యూమ్ 8 నం 10, ఫోకస్ ఆన్ ది కింగ్డమ్, 2006)

మేము అసలు వ్యాసం నుండి సమస్త అన్య నామములను మరియు తండ్రి - కుమారుడు అనే శీర్షికలను తొలగించి, వాటి స్థానాన్ని అసలు నామములతో భర్తీ చేసాము. ఇంకా, ఇక్కడ ఇవ్వబడిన లేఖనాలలో తండ్రి మరియు కుమారుని నామములను బైబిల్ యొక్క మొదటి ప్రేరేపిత రచయితలచే వ్రాయబడిన విధంగా మేము పునరుద్ధరించాము. -డబ్ల్యుఎల్‌సి బృందం.