Print

యాహూషువఃయే ప్రధాన దేవదూత మిఖాయేలునా?

ఇది WLC యేతర వ్యాసం. బయటి రచయితల వనరులను ఉపయోగించినప్పుడు, బైబిలుకు మరియు డబ్ల్యుఎల్‌సి ప్రస్తుత నమ్మకాలకు 100% అనుగుణంగా ఉండెనని భావించిన వాటిని మాత్రమే మేము ప్రచురిస్తాము. కాబట్టి అలాంటి వ్యాసాలను డబ్ల్యుఎల్‌సి నుండి నేరుగా వచ్చినట్లుగా పరిగణించవచ్చు. యహువః యొక్క అనేక మంది సేవకుల పరిచర్య ద్వారా మేము ఎంతగానో ఆశీర్వదించబడ్డాము. అయితే ఈ రచయితల యొక్క ఇతర రచనలను అన్వేషించమని మేము మా సభ్యులకు సలహా ఇవ్వము. అటువంటి రచనలు, లోపాలను కలిగి ఉన్నందున మేము వాటిని ప్రచురణల నుండి మినహాయించాము. విచారకరంగా, లోపం లేని మంత్రిత్వ శాఖను మనం ఇంకనూ కనుగొనలేదు. డబ్ల్యుఎల్‌సి వి కాని కొన్ని ప్రచురించబడిన వ్యాసాలు / ఎపిసోడ్లు చూసి మీరు దిగ్బ్రాంతి చెందినచో, సామెతలు 4:18 జ్ఞాపకం చేసుకోండి. మన మార్గంలో మరింత కాంతి వెలువడు కొద్దీ ఆయన సత్యాన్ని గూర్చిన మన అవగాహన అభివృద్ధి చెందుతూ ఉంటుంది. మేము సత్యాన్ని ప్రాణం కంటే ఎక్కువగా ఆదరిస్తాము మరియు అది దొరికిన చోటు ఏదైనా అక్కడ వెతుకుతాము.

యెహోవాసాక్షులు యాహూషువఃను ప్రధాన దేవదూత యైన మిఖాయేలు అని నమ్ముతారు. నేను ఈ సిద్ధాంతాన్ని కలిగి ఉన్న వారి పట్ల శ్రద్ధ మరియు గౌరవంతో ఈ అంశం యెద్దకు చేరుకుంటాను; అయితే, ఈ సిద్ధాంతాన్ని సమర్థించుకునే ప్రయత్నంలో వారు ఎదుర్కొనే సమస్యల వైపు తమ దృష్టిని ఆకర్షించడం ఈ అధ్యయనం యొక్క లక్ష్యం.

క్రీస్తు ముందటి అవతారం: బైబులు సత్యమా? లేక పురాతన అన్యమత విశ్వాసమా?

ఈ సిద్ధాంతానికి మద్దతుగా బైబిల్‌లో రెండు ప్రధాన భాగాలు ఉపయోగించబడతున్నాయి.

1 మొదటి థెస్సలొనీ 4:16: "ఆజ్ఞాపణ పిలుపుతోను, ప్రధానదూత శబ్దముతోను మరియు యహువః బూరతోను పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును; క్రీస్తునందుండి మృతులైనవారు మొదట లేతురు. (న్యూ వరల్డ్ ట్రాన్స్లేషన్, 2013 పునర్విమర్శ).

చాలా వరకు ఆంగ్ల అనువాదాలు N.W.T. వలె చెప్పుచున్నవి:

"ఏలయనగా ప్రభువు తానే గంభీరమైన ఆజ్ఞతో, ప్రధానదూత స్వరముతో మరియు యహువః బూర పిలుపుతో పరలోకము నుండి దిగివచ్చును, మరియు క్రీస్తులో మృతులైనవారు మొదట లేస్తారు" (1 థెస్స. 4:16, యన్.ఐ.వి).

“ఏలయనగా, ప్రధానదూత స్వరముతోను, యహువః బూరతోను పరలోకము నుండి ప్రభువు దిగి వచ్చును; మరియు క్రీస్తులో మృతులైనవారు మొదట లేస్తారు” (1 థెస్సలోనీ. 4:16, యన్.ఏ.యస్).

ఇక్కడ ప్రభువు (యహూషువః) ప్రధాన దూత స్వరంతో దిగి వస్తున్నందున మరియు ప్రధాన దూత అనే పదం ఏకవచన రూపంలో కనిపిస్తూ మరియు మిఖాయేలుకు ఆపాదించబడినందున (యూదా 1:9), యహూషువః మరియు మిఖాయేలు ఒకే వ్యక్తి అని మనం భావించాలని వారు వాదించెదరు. సమస్య ఏమిటంటే, అన్ని అనువాదాలు ఈ భాగాన్ని ఒకే విధంగా అందించవు, ఉదాహరణకు:

“ప్రధాన దూత స్వరము మరియు యహువః బూర ఇచ్చిన సంకేతంతో, పరలోకం నుండి ప్రభువు దిగి వచ్చును; క్రీస్తునందుండి మరణించినవారు మొదట లేచుదురు” (1థెస్సలోనీ. 4:16, యన్.జె.బి).

"ఏలయనగా ఆజ్ఞాపణ ఆర్భాటముతోను, దానికి తోడు ప్రధాన దూత యొక్క కేకతో, మరియు యహువః యొక్క బూర స్వరముతో పరలోకం నుండి ప్రభువు దిగివస్తాడు, మరియు మెస్సీయాలో మరణించినవారు మొదట మృతులలో నుండి లేస్తారు" (1 థెస్సలోనీ. 4:16, వన్ యహువః ది ఫాదర్ అనువాదం)

యోహాను సువార్తకు ఉపోద్ఘాతం

N.W.T మనకు ఉత్తమ వివరణను అందించినప్పటికీ, యహూషువఃయే దేవదూత అనే ఆలోచనను వ్యతిరేకించే హెబ్రీ పత్రికలోని భాగాలను వివరించుట వారికి ఇంకా చాలా కష్టంగా ఉంటుంది:

"ఆయన యహువః మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వము యొక్క మూర్తి మంతమునైయుండి, తన మహత్తుగల మాటచేత సమస్తమును నిర్వహించుచు, పాపముల విషయములో శుద్ధీకరణము తానే చేసి, ఉన్నత లోకమందు మహామహుడగు యహువః కుడిపార్శ్వమున కూర్చుండెను" (హెబ్రీ. 1:3).

"ఏలయనగా నీవు నా కుమారుడవు, నేను నేడు నిన్ను కనియున్నాను అనియు, ఇదియు గాక నేను ఆయనకు తండ్రినై యుందును, ఆయన నాకు కుమారుడై యుండును అనియు ఆ దూతలలో ఎవనితోనైన ఎప్పుడైనను చెప్పెనా? మరియు ఆయన భూలోకమునకు ప్రథమ కుమారుని మరల రప్పించినప్పుడు యహువః దూతలందరు ఆయనకు నమస్కారము చేయవలెనని చెప్పుచున్నాడు. (హెబ్రీ. 1:5-6, NAU)

“ఉదాహరణకు, దేవదూతలలో ఒకనితోనైనను యహువః ఎప్పుడైనను ఇలా అన్నాడా: ‘నువ్వు నా కుమారుడవు; నేడు నేను నీకు తండ్రిని అయ్యాను? మరియు మళ్ళీ: 'నేను అతని తండ్రి అవుతాను, అతను నా కొడుకు అవుతాడు'? కానీ ఆయన మళ్లీ తన మొదటి కుమారుని జనావాస భూమికి తీసుకువచ్చినప్పుడు, ఆయన ఇలా అంటాడు: 'మరియు యహువః దూతలందరూ అతనికి నమస్కరించాలి" (N.W.T., 2013 పునర్విమర్శ).

హెబ్రీయులు 1:5 నుండి మనం చూస్తాము, “నీవు నా కుమారుడవు, నేను నేడు నిన్ను కనియున్నాను” అని యహువః ఏ దేవదూతతోనూ చెప్పలేదు, అయితే యహువః దానిని యహూషువఃతో చెప్పాడు.

JW కూడా తమ ప్రచురణ అయిన రీజనింగ్ ఫ్రమ్ ది స్క్రిప్చర్స్‌లో, “యహూషువః క్రైస్ట్” అనే అంశంలో, యహూషువః భూమిపైకి రాకముందు మిఖాయేలు అనే పేరుతో పిలువబడెనని మరియు అతను పరలోకానికి తిరిగి వచ్చినప్పటి నుండి కూడా మిఖాయేలు అనే పేరుతో పిలువబడ్డాడని వ్యాఖ్యానించారు, కానీ వారు ఎప్పుడూ వారి వాదనకు మద్దతుగా ఒక్క వచనాన్ని కూడా ఉదహరించలేదు:

"కాబట్టి, యహువః కుమారుడు భూమిపైకి రాకముందు మిఖాయేలు అని పిలువబడ్డాడని మరియు అతడు పరలోకానికి (అక్కడ యహువః మహిమాన్వితమైన ఆత్మ కుమారుడిగా నివసిస్తున్నాడు) తిరిగి వచ్చినప్పటి నుండి ఆ పేరుతో పిలువబడ్డాడని ఆధారాలు సూచిస్తున్నాయి," (లేఖనాల నుండి తార్కికం, పేజి. 218-219).

ఉన్నతమైన నామముల పరంగా, మిఖాయేలు పేరు ఎప్పుడూ ప్రస్తావించబడలేదు; బదులుగా యహూషువః అనే పేరు స్పష్టంగా గొప్ప చేయబడెను:

"అందుచేతను పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్నవారిలో గాని, భూమి క్రింద ఉన్నవారిలో గాని, ప్రతివాని మోకాలును యహూషువః నామమున వంగునట్లును, ప్రతివాని నాలుకయు తండ్రియైన యహువః మహిమార్థమై యహూషువః క్రీస్తుని ప్రభువని ఒప్పుకొనునట్లును, యహువః ఆయనను అధికముగా హెచ్చించి, ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను. (ఫిలిప్పీ. 2:9-11).

"ఆ కాలమందు నీ జనుల పక్షమున నిలుచునట్టి మహా యువరాజు/అధిపతియగు మిఖాయేలు వచ్చును. అప్పుడు నీ జనులు రాజ్యముగా కూడిన కాలము మొదలుకొని ఆ కాలము వరకు ఎన్నటికిని కలుగనంత ఆపద కలుగును; అయితే నీ జనులలో గ్రంథమునందు దాఖలైనవారెవరో వారు తప్పించబడుదురు" (దానియేలు 12:1, NAS).

ఈ భాగంలో మిఖాయేలు "గొప్ప యువరాజు" అని పిలువబడెను. తక్కినచోట్ల అతడు "ప్రధాన అధిపతి(యువరాజు) లలో ఒకడు" అని పిలువబడుతూ (దాని. 10:13) అతనిలాంటి వారు ఇంకా ఉన్నారని సూచించబడెను. మిఖాయేలు విషయంలో J.W. సూచించే ఏకత్వాన్ని ఇది వెంటనే ఖండిస్తుంది.

ఇక్కడ ప్రస్తావించాల్సిన మరో ముఖ్యమైన అంశం ఉంది, అది యహూషువః యొక్క ఆవిర్భావం. మత్తయి (1:16) మరియు లూకా (3:23-38) సువార్తలలో, సువార్తీకులు మనకు యహూషువః యొక్క ప్రారంభాన్ని చూపించడానికి పూర్తి వంశావళిని ఇచ్చారు. ఇది యహూషువః స్వర్గంలో ముందుగా ఉన్న దేవదూత అనే ఆలోచనను వ్యతిరేకిస్తుంది.

"దూత ఆమెకు సమాధానమిస్తూ ఇలా చెప్పెను; 'పరిశుద్ధాత్మ నీమీదికి వచ్చును; సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై యహువః కుమారుడనబడును" (లూకా సువార్త 1:35).

చివరగా JW లు తమ N.W.Tలో యహూషువఃను మరియు మిఖాయేలులను ఏకం చేయుటలో చేసిన భారీ తప్పును మనం ఎత్తి చూపుతూ (2013 పునర్విమర్శ), వారి మొత్తం సిద్ధాంతాన్ని ఖండించాలి. వారు లూకా 10:18 ని ప్రకటన 12:7-9 కి జత చేస్తారు. యహూషువః లూకాలో సాతాను అప్పటికే పరలోకం నుండి మెరుపులా పడిపోయినట్లు చూస్తాడు:

"ఆయన వారితో, సాతాను మెరుపువలె ఆకాశమునుండి పడుట చూచితిని చెప్పెను" (లూకా 10:18, N.W.T. 2013 పునర్విమర్శ).

“పడుట” అనే పదం ప్రకటన 12:7-9కి క్రాస్ రిఫరెన్స్‌ని కలిగి ఉంది, ఇక్కడ మిఖాయేలు అపవాదితో పోరాడుతున్నాడు మరియు అతనిని భూమిపైకి పడవేస్తాడు:

"అంతట పరలోకమందు యుద్ధము జరిగెను. మిఖాయేలును అతని దూతలును ఆ ఘటసర్పముతో యుద్ధము చేయవలెనని యుండగా; ఆ ఘటసర్పమును దాని దూతలును యుద్ధము చేసిరి గాని గెలువలేకపోయిరి గనుక పరలోకమందు వారికిక స్థలము లేకపోయెను. కాగా సర్వలోకమును మోస పుచ్చుచు, అపవాదియనియు సాతాననియు పేరుగల ఆదిసర్పమైన ఆ మహా ఘటసర్పము పడద్రోయబడెను. అది భూమిమీద పడ ద్రోయబడెను; దాని దూతలు దానితో కూడ పడద్రోయబడిరి" (ప్రకటన. 12:7-9, N.W.T 2013 పునర్విమర్శ).

మిఖాయేలు అపవాదిని పరలోకం నుండి పడద్రోయడాన్ని యహూషువః భూమిపై ఉండి చూస్తున్నందున, వారు ఒకే సమయంలో రెండు వేర్వేరు ప్రదేశాలలో/సంఘటనలలో ఒకే వ్యక్తిగా ఉండలేరని వారి వివరణ నుండి మనము నొక్కి చెప్పవచ్చు.


ఇది T.R గెరీరో రాసిన వ్యాసం. WLC వ్యాసం కాదు.

మేము అసలు వ్యాసం నుండి సమస్త అన్య నామములను మరియు తండ్రి - కుమారుడు అనే శీర్షికలను తొలగించి, వాటి స్థానాన్ని అసలు నామములతో భర్తీ చేసాము. ఇంకా, ఇక్కడ ఇవ్వబడిన లేఖనాలలో తండ్రి మరియు కుమారుని నామములను బైబిల్ యొక్క మొదటి ప్రేరేపిత రచయితలచే వ్రాయబడిన విధంగా మేము పునరుద్ధరించాము. -డబ్ల్యుఎల్‌సి బృందం.