Print

దీనిని సుళువుగా ఉంచండి

ఇది WLC యేతర వ్యాసం. బయటి రచయితల వనరులను ఉపయోగించినప్పుడు, బైబిలుకు మరియు డబ్ల్యుఎల్‌సి ప్రస్తుత నమ్మకాలకు 100% అనుగుణంగా ఉండెనని భావించిన వాటిని మాత్రమే మేము ప్రచురిస్తాము. కాబట్టి అలాంటి వ్యాసాలను డబ్ల్యుఎల్‌సి నుండి నేరుగా వచ్చినట్లుగా పరిగణించవచ్చు. యహువః యొక్క అనేక మంది సేవకుల పరిచర్య ద్వారా మేము ఎంతగానో ఆశీర్వదించబడ్డాము. అయితే ఈ రచయితల యొక్క ఇతర రచనలను అన్వేషించమని మేము మా సభ్యులకు సలహా ఇవ్వము. అటువంటి రచనలు, లోపాలను కలిగి ఉన్నందున మేము వాటిని ప్రచురణల నుండి మినహాయించాము. విచారకరంగా, లోపం లేని మంత్రిత్వ శాఖను మనం ఇంకనూ కనుగొనలేదు. డబ్ల్యుఎల్‌సి వి కాని కొన్ని ప్రచురించబడిన వ్యాసాలు / ఎపిసోడ్లు చూసి మీరు దిగ్బ్రాంతి చెందినచో, సామెతలు 4:18 జ్ఞాపకం చేసుకోండి. మన మార్గంలో మరింత కాంతి వెలువడు కొద్దీ ఆయన సత్యాన్ని గూర్చిన మన అవగాహన అభివృద్ధి చెందుతూ ఉంటుంది. మేము సత్యాన్ని ప్రాణం కంటే ఎక్కువగా ఆదరిస్తాము మరియు అది దొరికిన చోటు ఏదైనా అక్కడ వెతుకుతాము.

దీనిని సుళువుగా ఉంచండి

నెంబరు 1: “క్రైస్తవులైన మనకు ఒకే దేవుడు, తండ్రి ఉన్నాడు” (1 కొరిం. 8: 6).

మీరు దీన్ని నమ్మడానికి సిద్ధంగా ఉన్నారా? ఇది ఖచ్చితంగా: “మనకందరికి తండ్రి యొక్కడే కాడా? ఒక్క దేవుడే మనలను సృష్టింపలేదా?” (మలాకీ. 2:10).

సంఘాలలో ఎక్కువ భాగం ఈ ఏకదైవ సిద్ధాంతాన్ని తిరస్కరించాయి మరియు "మేము ఒకే దేవుణ్ణి నమ్ముతున్నాము: తండ్రి, కుమారుడు మరియు పరిశుద్ధాత్మ" అని చెప్పాయి. 1 యోహాను 5: 7 (ఇది ఆధునిక అనువాదాల నుండి తొలగించబడింది) లోని ఒక స్పష్టమైన, కఠోర అవినీతి తప్ప, మరే ఇతర బైబిల్ వచనం కూడా ఒక్క దేవుడిని తండ్రి, కుమారుడు (“వాక్యం”) మరియు పరిశుద్ధాత్మ అని చెప్పలేదు.

యోహాను 17: 3 లో యేసు, “తండ్రి మాత్రమే ఓకే ఒక్క నిజమైన దేవుడు” అని చెప్పాడు. ఒక గొప్ప క్రైస్తవ వేదాంతవేత్తగా కొనియాడబడిన (తప్పుగా, మనం అనుకుంటున్న) అగస్టీన్ కి ఆ వచనాన్ని మార్పు చేయవలసి వచ్చింది, అలా తాను ఆ పదాల క్రమాన్ని మార్చడం, అర్థాన్ని మార్చడం, అలా తండ్రి మరియు కుమారుడు మాత్రమే నిజమైన దేవుడు అని చెప్పటం జరిగెను.

కొత్త నిబంధన లో 1300 సార్లు “దేవుడు” అనే పదానికి తండ్రి అని అర్థం. బైబిల్లోని “దేవుడు” అనే పదానికి ఎప్పుడూ తండ్రి, కుమారుడు మరియు ఆత్మ అని అర్ధం కాదు. ఏకైక దేవుడు దైవిక వ్యక్తిగా, వేలాది సార్లు, ఏకవచన వ్యక్తిగత సర్వనామాల ద్వారా నిర్వచించబడ్డాడు: నేను, నాకు, నా, నేనే, నాది, నీ, నీవు, నీది, నీ యొక్క, నువ్వే, అతడు, ఆయనది, ఆయన యొక్క, ఆయనే.

యేసు దైవత్వం యొక్క మరియు తండ్రి దైవత్వం యొక్క సిద్ధాంతాన్ని ఏకదైవవాదంతో సమన్వయం చేయడానికి ప్రయత్నించిన వెంటనే సంఘం ఒక గందరగోళంలో పడింది. కొత్త నిబంధన సాక్షుల ప్రకారం, పాత నిబంధన మరియు యూదామతం యొక్క ఏకదైవవాదానికి సంబంధించి యేసు బోధనలో, ఎటువంటి మార్పులు జరిగినట్లు కనబడలేదు.

ప్రముఖ త్రిత్వవాదులు తమ సిద్ధాంతం యొక్క తీవ్ర కుతర్కమును ఒప్పుకున్నారు. కార్డినల్ జె.హెచ్. న్యూమాన్ త్రిత్వమును ఉచ్చరించుటకు మనం చేయవలసినది, “ఒక విషయాన్ని రెండు విషయాలు అని చెప్పడం” అని అన్నాడు. (కాంట్రవర్సీ విత్ ది అరియన్స్‌ లో ట్రీటిసెస్ ఆఫ్ అథనాసియస్ ను ఎంచుకోండి, 1895, పేజి 515).

త్రిత్వంపై కేంబ్రిడ్జ్‌లో ఉపన్యాసం ఇస్తూ డాక్టర్ హే ఇలా అన్నారు: “మన స్వంత సిద్ధాంతాన్ని [త్రిత్వం] నివేదించుటలో మనము అన్ని సందర్భాల్లోనూ శ్రమపడుతూ పూర్తిగా అర్థం కానట్లుగా” ఉంటే ఇది నియంత్రణను మరియు చివరికి, అంగీకారాన్ని ప్రోత్సహించే అవకాశం ఉంది. (లెక్చర్స్ ఇన్ డివినిటీ, వాల్యూమ్ 2, పేజి 253).

స్విట్జర్లాండ్‌లోని బెర్న్‌కు చెందిన డాక్టర్ మార్టిన్ వెర్నెర్ త్రిత్వము విరుద్ధమైనదని సరిగ్గా చెప్పాడు: “యేసు దైవత్వం యొక్క మరియు తండ్రి దైవత్వం యొక్క సిద్ధాంతాన్ని ఏకదైవవాదంతో సమన్వయం చేయడానికి ప్రయత్నించిన వెంటనే సంఘం ఒక గందరగోళంలో పడింది. కొత్త నిబంధన సాక్షుల ప్రకారం, పాత నిబంధన మరియు యూదామతం యొక్క ఏకధర్మవాదానికి సంబంధించి యేసు బోధనలో, ఎటువంటి మార్పులు జరిగినట్లు కనబడలేదు. మార్కు 12: 29. ఇశ్రాయేలు మత విశ్వాసం యొక్క గొప్ప ఏకదైవవాద ఒప్పుకోలును దాని పూర్తి రూపంలో యేసు స్వయంగా ధృవీకరించాడు… తండ్రి మరియు కుమారుడు ఇద్దరి దైవత్వం యొక్క సిద్ధాంతం యొక్క ఒప్పందాన్ని ఏకదైవవాదంతో ప్రదర్శించుటలో సంఘం యొక్క ప్రయత్నం తీవ్ర అనిశ్చితంగా మరియు విరుద్ధంగా ఉంది ”(ఫార్మేషన్ ఆఫ్ క్రిస్టియన్ డాగ్మా, 1957, పేజి 241).

ఒక్క దేవుడిని తండ్రిగా నిర్వచించే పైన గల వచనాన్ని నమ్మడంలో త్రిత్వవాదులు విఫలమయ్యారు (1 కొరిం. 8: 6). వారి గందరగోళానికి మద్దతునిచ్చేందుకు అప్పుడు వారు యేసు “ఒకే ప్రభువు” అని, అందువల్ల ఆయన కూడా దేవుడు అయి ఉండాలి అని ఎత్తి చెప్పారు! అయితే, యేసు ఒక ప్రభువైన క్రీస్తు/మెస్సీయ తప్ప ఆయన ఒక ప్రభువైన దేవుడు కాడు అనే సాధారణ వాస్తవం ద్వారా ఈ తర్కం వీగిపోతుంది. (కీర్త. 110: 1; లూకా 2:11).

క్రీస్తు యొక్క నిఘంటువు మరియు సువార్తలు సరళమైన వాస్తవాన్ని ఇలా పేర్కొన్నాయి: “కొత్త నిబంధన జనులకు దేవుడు పాత నిబంధన యొక్క దేవుడు, జీవించే దేవుడు, ఒక వ్యక్తి, ప్రేమగలవాడు, శక్తినిచ్చేవాడు, దయ యొక్క నిత్య ప్రయోజనం యొక్క సంపూర్ణత, తన స్వంత ప్రేమ స్వభావ పరిపూర్ణుడు... పాత నిబంధన యొక్క ఏకదైవవాదం ఎన్నడూ నైరూప్యంగా లేదు, ఎందుకంటే పాత నిబంధన యొక్క దేవుడు ఎప్పుడూ ఒక భావన గాని, లేదా ఒక పదార్ధం [సారాంశం] గాని కాదు, కానీ ఎల్లప్పుడూ ఒక వ్యక్తి ”(వాల్యూమ్ 1, పేజి 807).

ముర్రే హారిస్ అనే త్రిత్వవాది ఇలా అంటాడు: “ఇలాంటి ప్రశ్న అడగడం చట్టవిరుద్ధం అనిపించదు: హెబ్రీయుల పత్రిక రచయిత ఇలా చెప్పునప్పుడు ఎవరిని ప్రస్తావిస్తుండెను? (హెబ్రీ 1: 1), దేవుడు పూర్వకాలమందు నానాసమయములలోను నానా విధములుగాను ప్రవక్తలద్వారా మన పితరులతో మాటలాడెను. ఏ అంతిమ కోణంలోనైనా అది పరిశుద్ధాత్మ కాదని స్పష్టంగా తెలుస్తుంది, పాత నిబంధనలో లేదా కొత్త నిబంధనలో స్పష్టంగా ‘దేవుడు’ అని పిలువబడే ఆత్మ లేదు. మరియు, YHVH - కురియోస్/ ప్రభువు కు సమానమైన LXX [సెప్టువాగింట్] - కొత్త నిబంధనలో క్రమం తప్పకుండా యేసుకు వర్తింపజేయబడింది, తద్వారా ఇది సరైన పేరు కంటే తక్కువ శీర్షికగా మారుతుంది, అయినప్పటికీ హెబ్రీ 1: 1 లోని ఓ థియోస్ [దేవుడు] యేసుక్రీస్తును సూచిస్తుంది అనుట సాధ్యం కాదు, ఎందుకంటే అదే వాక్యంలో (మాట్లాడిన దేవుడు…) ఈ చివరి దినాలలో మనతో తన కుమారుని ద్వారా మాట్లాడెను అని ఉన్నది. రచయిత దైవ ప్రసంగంలోని రెండు దశల కొనసాగింపును ('దేవుడు అప్పుడు మాట్లాడాడు … మరియు తరువాత కూడా మాట్లాడాడు'), అని నొక్కి చెబుతున్నందున, ఈ సూచన- ఓ థియోస్ [దేవుడు] 'తండ్రి దేవుడు' అని చూచిస్తుంది. ['కుమారుడైన దేవుడు' అని ఎవ్వరూ ఎన్నడూ అనలేదు!]

తరువాత సంఘం, బైబిల్ కాలాల తరువాత, ఎవరైతే దేవుని యొక్క త్రిత్వ నిర్వచనాన్ని అంగీకరించరో వారు రక్షణను కోల్పోవుదురు అనే బెదిరింపుల ద్వారా అంతిమంగా తన మనస్సును కోల్పోయెను.

“అదేవిధంగా, పాత మరియు కొత్త నిబంధనల రెండింటిలోనూ మాట్లాడిన వ్యక్తిగా ఓ థియోస్ [దేవుడు] కీ, మరియు ఆయన మాటల యొక్క అంతిమ అర్థం అయిన కుమారునికి మధ్య గల తేడా రచయిత యొక్క మనస్సును సూచిస్తుంది, అనగా ప్రవక్తల ద్వారా పూర్వీకులతో మాట్లాడిన దేవుడు క్రైస్తవ వేదాంతశాస్త్రం యొక్క త్రిత్వ దేవుడు కాడని సూచిస్తుంది. అంటే, హెబ్రీయుల రచయితకు (అనగా, కొత్త నిబంధన రచయితలందరికీ) 'మన పితరుల దేవుడైన యావే,' మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడు మరియు తండ్రియే తప్ప మరెవరో కాదు. (అపొస్తలుల కార్యములు 2 : 30 మరియు 2:33; 3:13 మరియు 3:18; 3:25 మరియు 3:26 లను పోల్చండి; 5:30 కూడా చూడండి).

"ఇటువంటి ముగింపు ఓ థియోస్ [దేవుడు] యొక్క సాధారణ కొత్త నిబంధన వాడకానికి పూర్తిగా అనుగుణంగా ఉంటుంది. కొత్త నిబంధన థియోస్‌ [దేవుడు] క్రమం తప్పకుండా తండ్రిని మాత్రమే సూచిస్తూ మరియు స్పష్టంగా త్రిత్వాన్ని ఎన్నడూ సూచించనప్పుడు, పాత నిబంధన లోని యఃవః ఎలోహిమ్ త్రిత్వాన్ని సూచించుననుట ఎప్పటికీ సరికాదు.” 1

ఇది మంచి అంగీకారం! లేఖనంలో “దేవుడు” అనగా త్రిత్వ దేవుడు అని ఎప్పుడూ అర్ధం కాదు!

తరువాత సంఘం, బైబిల్ కాలాల తరువాత, అంతిమంగా దేవుని యొక్క త్రిత్వ నిర్వచనాన్ని అంగీకరించని ఎవరైనా రక్షణను కోల్పోవుదురని బెదిరించబడుట ద్వారా తన మనస్సును కోల్పోయెను. ఆక్స్ఫర్డ్ లో త్రిత్వంపై ఉపన్యాసం‌ ఇస్తూ, ప్రొఫెసర్ డాక్టర్ లియోనార్డ్ హోడ్గ్సన్ ఒక విషాదకరమైన పరిస్థితికి కొంత హాస్యాన్ని జోడించారు. అతడు ఇలా వ్రాశాడు: “అథనాసియన్ మత సిద్ధాంతం చాలా బోధనాత్మకమైన పత్రం, ఎందుకంటే, ఆ సమయంలో మెటాఫిజిక్ [తత్వశాస్త్రం] పరంగా క్రైస్తవ విశ్వాసాన్ని చెప్పే ప్రయత్నం జరిగినప్పుడు, చేయగలిగేది ఏమిటంటే, విరుద్ధ‌ నమ్మకాల శ్రేణిని నిర్దేశించడం మరియు మీరు వాటిని నమ్మకపోతే నశించెదరని చెప్పడం [!] ... త్రిత్వము యొక్క ఈ క్రైస్తవ సిద్ధాంతాన్ని వినడం ద్వారా మనస్సులో ఏర్పడిన మొదటి అభిప్రాయం ఏమిటంటే ఇది అత్యంత నమ్మశక్యం కానిది అని.” 2

“సత్యం ఏమిటంటే ఈ మత విశ్వాసాలు షెమాను ఉల్లంఘిస్తాయి. యేసుకి, షెమా ప్రధాన సూత్రం… యేసు విశ్వాసంలోనికి ఒకరు సభ్యత్వం తీసుకుంటే, స్థాపించబడిన సంఘం అతనిని మతవిరోధిగా ఎలా పరిగణిస్తుంది? అన్నిటికంటే గొప్ప ఆజ్ఞను మనం నిర్లక్ష్యం చేసి/అతిక్రమించి/రద్దు చేయుదుమా? 'మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా.’ (ద్వితీ 6: 4; మార్కు 12:29).

పైన పేర్కొన్న నంబర్ 1 పై నమ్మకం ఉంటే హత్య, అల్లకల్లోలం మరియు బహిష్కరణతో సహా, ఈ గందరగోళం ఏదీ అవసరం లేదు! “మనకు ఒక్కడే దేవుడున్నాడు. ఆయన తండ్రి” (1 కొరిం. 8: 6).

“ప్రొఫెసర్ లెస్ హార్డిన్ ఇలా అన్నారు:‘ క్రైస్తవ విశ్వాసంలో ఉన్నవారు సాంప్రదాయకంగా దీనిని త్రిత్వ ప్రకటనగా చదివారు; దేవుడు మూడు రూపాలలో — తండ్రి, కుమారుడు మరియు ఆత్మగా — ఉండెనని నమ్ముతున్నాము అయితే, ఈ వచనం ముగ్గురు దేవుళ్ళు ఉన్నారని మనం నమ్మకుండా ఉంచుతుంది… ఈ సందర్భంలో, అది అర్ధవంతమైనది కాదు, మరియు ఇది వేదాంత వివాదం దీనిపై పీపాలు పీపాల ప్రింటర్ సిరా చిందినది.' వృధా అయిన సిరా చాలా మంది రక్తంతో పోల్చి చూస్తే (వారి జీవితాలు తీయబడ్డాయి, ఎందుకంటే వారు దేవుడు ఒకటే, తండ్రి అని నిలబడ్డారు) అది పాలిపోయి ఉన్నది.

"దేవుడు మూడు భాగాలుగా ఉండెనని చెప్పడంలో ఏమి అర్ధముందని ప్రశ్నించడంలో హార్దిన్ సరిగ్గా ఉన్నాడు. శతాబ్దాలుగా ధైర్యవంతులైన ఆత్మలు ఈ తర్కాన్ని ప్రశ్నించే ధైర్యాన్ని కలిగి ఉన్నాయి. కొంతమంది దాని గురించి వ్రాయడానికి జీవించారు… మాస్టర్ లాజిషియన్, సమస్త జ్ఞానానికి మూలమైనవాడు, వాస్తవానికి తాను ఎవరో అర్థం చేసుకోలేని సిద్ధాంతాన్ని ధృవీకరిస్తున్నాడని మనము చెప్తున్నామా? నిజంగా?” 3

పైన పేర్కొన్న నంబర్ 1 పై నమ్మకం ఉంటే హత్య, అల్లకల్లోలం మరియు బహిష్కరణతో సహా ఈ గందరగోళం ఏదీ అవసరం లేదు! “మనకు ఒక్కడే దేవుడున్నాడు. ఆయన తండ్రి” (1 కొరిం. 8: 6).

“మన దేవుడైన ప్రభువు అద్వితీయ ప్రభువు” (మార్కు 12:29) అని ప్రకటించిన యహూషువః మాటను విశ్వాసులు విన్నట్లయితే ఇవేవీ అవసరం లేదు (మార్క్ 12:29). ఒక ప్రభువు అంటే ఒకే వ్యక్తి. పైన పేర్కొన్న నెం .1 ప్రకారం దేవుడు ఒక వ్యక్తి. ఒకే దేవుడు ఎవరు అనే ప్రశ్నలన్నింటినీ పరిష్కరించడానికి ఇది సరిపోతుంది: “మనకు ఒక్కడే దేవుడున్నాడు. ఆయన తండ్రి”.

“మీరు అనుసరించుచున్నారని చెప్పుకొనుచున్న యేసు ఆజ్ఞలన్నిటిలో ప్రధానమైన ఆజ్ఞగా నిర్వచించినదానిపై మీరు ఎందుకు శ్రద్ధ చూపరు? యేసు తన బోధనా పరిచర్య ముగింపులో ఇలా అన్నాడు: “మన దేవుడైన ప్రభువు అద్వితీయ ప్రభువు” (మార్కు 12:29).

“ఒక ప్రభువు” అంటే ఒక వ్యక్తి, అంతకంటే ఎక్కువ కాదు! (మీ రెండేళ్ల పిల్లవాడిని అడగండి!) దేవుడు నిజంగా “ముగ్గురు వ్యక్తులు” అని చెప్పడం లేఖనాన్ని ఉల్లంఘిస్తుంది.

ఇది ఖచ్చితంగా పాత నిబంధన యొక్క గ్రీకు అనువాదంలోనూ (LXX) మరియు క్రొత్త నిబంధనలోనూ పేర్కొన్న విధంగా ఉంది. “ఒక ప్రభువు” అంటే ఒక వ్యక్తి, అంతకంటే ఎక్కువ కాదు! (మీ రెండేళ్ల పిల్లవాడిని అడగండి!) దేవుడు నిజంగా “ముగ్గురు వ్యక్తులు” అని చెప్పడం గ్రంథాన్ని ఉల్లంఘిస్తుంది. స్నేహపూర్వక యూదా శాస్త్రి యేసు చెప్పిన మాటలను అర్థం చేసుకున్నాడు మరియు ఆమోదించాడు: “బోధకుడా, బాగుగా చెప్పితివి; ఆయన అద్వితీయుడనియు, ఆయన తప్ప వేరొకడు లేడనియు నీవు చెప్పిన మాట సత్యమే” (= ఒక వ్యక్తి, మార్కు 12:32). ఆ యూదా శాస్త్రి తన స్వంత నిర్వచనాన్ని ద్వితీయోపదేశకాండము 4:35, 39‌ తో జోడిస్తూ “ఆయన తప్ప వేరొకడు లేడని" యేసుతో పూర్తిగా అంగీకరించాడు.

విషయం ఇది: మీరు యేసుతో ఏకీభవిస్తున్నారా, లేదా యేసు పట్ల మీ విధేయత మరియు దేవుని గూర్చిన మీ నిర్వచనం దేవునికి మరియు మనిషికి స్పష్టంగా తెలియదా? క్రైస్తవులు యేసు లాగా ఉండాలి మరియు ఆయనలాగే మనస్సు కలిగి ఉండాలి (1 కొరిం 2:16). మనమందరం “ప్రభువు ప్రార్థన” తో అంగీకరిస్తున్నాము. అయితే మనం ప్రభువు విశ్వాసానికి, దేవుని గూర్చిన ఆయన నిర్వచనానికి సమానంగా, మరియు దేవుని యెడల మరియు ఆయన మెస్సీయ యెడల “విధేయతా ప్రతిజ్ఞ” తో సువార్తను ప్రకటిస్తున్నామా?

“మనకు [క్రైస్తవులకు] ఒక్కడే దేవుడున్నాడు. ఆయన తండ్రి” (1 కొరిం. 8: 6) అని పౌలు చేసిన ప్రకటన యేసు మరియు గ్రంథం వేలాది సార్లు చెప్పినదానిని పునరావృతం చేస్తుంది, దేవుడు ఒక్కడైయున్నాడు “ఆయన, ఒకే, దయగల తండ్రి." యేసు “ఒక ప్రభువైన మెస్సీయ/క్రీస్తు”. ఇలా వందల సార్లు ఉంది; లూకా 2:11 తో ప్రారంభించండి. యేసు 1 తిమోతి 2: 5 లోని “మానవ మెస్సీయ”, ఇది పౌలు యొక్క విశ్వాస ప్రకటనలలో మరొకటి.

క్రొత్త నిబంధనలో ఎక్కువగా ఉదహరింపబడిన పాత నిబంధన నుండి వాక్యం కీర్తన 110: 1. రబ్బీ మరియు గురువైన యేసు (యోహాను 13:13), వెంటనే కీర్తన 110: 1 లోని ఇద్దరు ప్రభువుల గురించి తన ప్రసిద్ధ చివరి ప్రశ్న అడగడానికి వెళ్ళడంలో ఆశ్చర్యం లేదు. ఇక్కడ ఈ కీర్తనలో, దేవుడైన యఃవః/ ఏకైక ప్రభువైన దేవుడు, రెండవ ప్రభువు అయిన మెస్సీయతో మాట్లాడుచున్నాడు. ఇక్కడ ఈ రెండవ ప్రభువు స్పష్టంగా దేవుడు కాదు. “నా [మానవ] ప్రభువు”, “నా ప్రభువు" కాదు. (కీర్తన 110: 1 యొక్క రెండవ ప్రభువులోని పెద్ద అక్షరం తప్పుదారి పుట్టిస్తుంది; దిద్దుబాటు కోసం RSV, NET, NIV చూడండి).


1 ముర్రే హారిస్, యేసు దేవుడిగా, పే. 47, ఫుట్‌నోట్ 112.

2 క్రిస్టియన్ ఫెయిత్ అండ్ ప్రాక్టీస్, పే. 78, 80.

3 బార్బరా బజార్డ్, “ప్రేయింగ్ లైక్ జీజస్: ది షెమా,” ఫోకస్ ఆన్ ది కింగ్డమ్, ఆగస్టు 2020.


ఇది సర్ ఆంథోనీ బజార్డ్ రాసిన వ్యాసం నుండి సంగ్రహించబడింది. డబ్ల్యుఎల్సి వ్యాసం కాదు.

సాధారణంగా డబ్ల్యుఎల్‌సి తొలగించడానికి ప్రయత్నించే నామములు మరియు శీర్షికలు (ఉదా. దేవుడు, యేసు, మొదలైనవి) దీని అసలు వ్యాసంలో రచయిత వ్రాసిన విధంగా, అలాగే ఉంచబడినవి, ఎందుకంటే అవి త్రిత్వ సిద్ధాంతంలోని తప్పును వివరించుటలో ఉదాహరణ యొక్క విస్తృత సందర్భంలో ఎక్కువగా ఉపయోగించబడినవి. తండ్రి కోసం “యహువః” మరియు కుమారుని కోసం “యహూషువః” నామములను వాడాలని డబ్ల్యుఎల్‌సి ఎందుకు సమర్థిస్తుందో వివరణకు, దయచేసి ఈ క్రింది వాటిని చూడండి: యహువః & యహూషువః మాత్రమే ఎందుకు