Print

మెస్సీయాను కలిగిన యూదామతం | ఒక పెరుగుతున్న మోసం

ఆధునిక పరిసయ్యవాదంతో సత్యాన్ని భర్తీ చేయుట

 

యథార్థ క్రైస్తవులు అనేకమంది సమస్త విషయాలు హీబ్రూలో అయితే
దానికి యోగ్యమైన విలువ ఉంటుందని నమ్ముదురు. భూ చరిత్ర యొక్క
ఈ ముగింపు దినాలలో ముఖ్యమైన సమస్త విషయాలనుండి వారి దృష్టిని
మళ్ళించుటకు ఇది సాతాను ఉద్దేశపూర్వకంగా చేయుచున్న వంచనయై ఉంది.

 

ఆన్లైన్లో కొనుగోలు మీరు ఎప్పుడైనా మీరును మరియు ప్రపంచంలో ప్రతి ఒక్కరునూ కలిగి ఉన్న ఒక ప్రత్యేకమైన బాధించే సమస్యను పరిష్కరించుటకు హామీ ఇస్తూ ఆనందంను కలిగించే ఒక కొత్త పరికరమును గురించి వ్యాపార ప్రకటనను చూశారా? మీరు దానికి ఆకర్షించబడి మరియు ఆ అద్భుతమైన కొత్త వస్తువు మీ జీవితంను ఎలా మెరుగు పరుచబోవుచున్నది అనుదాని గురించి సంతోషించారు అనుకుందాం! మీరు ఆ విక్రేత(అమ్మకదారుడు) యొక్క స్నేహపూర్వకమైన మరియు ఆకర్షణీయమైన మాటలను నమ్మిరి. మీరు కంగారుగా ఆ నెంబరుకు ఫోన్ చేశారు లేదా లింకును క్లిక్ చేశారు. నిమిషాల వ్యవధిలో మీ క్రెడిట్ కార్డు నుండి డబ్బు వసూలు చేయబడి మరియు ఆ అద్భుతమైన వస్తువు మిమ్మును చేరుటకు ప్రారంభమయ్యింది! మీరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు! చివరగా, బాక్స్ వచ్చినపుడు సంతోషంతో అరుస్తున్నారు! అది ఇదిగో! అది ఇదిగో, అని! అయితే, తెరిచిన తరువాత, ఈ అద్భుత ఉత్పత్తి అంచనా వేసినంత గొప్పగా లేదు మరియు ఇంకా తక్కువ పనితనమును కలిగి ఉంది. మీరు మోసపోయినట్లు గ్రహించిరి, మరియు వినియోగదారుల సేవాకేంద్రానికి ఫోన్ చేసిరి (అందుబాటులో లేదు), మరియు ఇప్పుడు మీరు మళ్ళీ ఇకపై ఎప్పుడూ ఇలాంటి మార్కెటింగ్ మోసానికి బాధితుడు కాకూడదని నిర్ణయించుకున్నారు. ఇలాంటి విషాదకరమైన నాటకం ఆధ్యాత్మిక విషయాల్లో సంభవిస్తే అది ఎంత హృదయం బద్దలైపోయే విషయం? సత్యం కోసం చూస్తున్న సమయంలో లెక్కలేనంత మంది క్రైస్తవులు ఇలాంటి ఉచ్చులోనే పడుతున్నారు. కొంతమంది తమ ఆధ్యాత్మిక గురువు అనుమతిలేని దేనినైనా పరిశీలించుటను తిరస్కరిస్తూ, వారి పాష్టరు లేదా యాజకుని మాటను మాత్రమే సత్యంగా అంగీకరించెదరు. మరికొంత మంది కొరకు సాతాను మరింత సూక్ష్మమైన మోసాన్ని తయారు చేసి ఉంది, అది: వృద్ధియగుచున్న కాంతిని యూదులు నుండి మాత్రమే నేర్చుకోగలమనే భావన.

లేఖనాలు ఒక గంభీరమైన హెచ్చరికను కలిగి ఉన్నవి: "నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి; మీ విరోధియైన అపవాది(సాతాను) గర్జించు సింహమువలె ఎవరిని మింగుదునా అని వెదకుచు తిరుగుచున్నాడు. "(1 పేతురు 5: 8) సాతాను యొక్క కోపం పెరిగుచుండుటకు గల కారణం ప్రకటన 12:12లో ఇవ్వబడింది: "అపవాది(అనగా, సాతాను) తనకు సమయము కొంచెమే అని తెలిసికొని బహు క్రోధము గలవాడై మీయొద్దకు దిగివచ్చియున్నాడని చెప్పెను. "

రక్షకుడు తిరిగి వచ్చుటకొరకు ఆశతో ఎదురు చూస్తున్న వారు అప్రమత్తంగా ఉన్నారు. బుద్ధి గల కన్యకల వలె, వారు పెండ్లి కుమారుడు వస్తున్నాడనే పిలుపును లక్ష్యము చేశారు. ఆయనపై తమ ప్రేమలో భాగంగా, వారు తమ జీవితాలను ఆయనకు నిశ్చయం చేయుటను కోరుకొనుచూ, తమ దివిటీలను సవరించుకొనిరి. ఇది ఉండాల్సిన విధంగా ఉంది. బాధాకరమైన విషయం ఏమిటంటే, అనేకమైన నిజాయితీ గల మరియు సంప్రదాయ క్రైస్తవులు ఈ నిజమైన విషయాలనుండి దారి మళ్ళించబడి, సమస్తం హీబ్రూ సంబంధులుగా ఉండుటలో- అనగా, సాధ్యమైనంత రీతిలో యూదులుగా ఉండుటలోనూ, మరియు ఇశ్రాయేలీయులు దేవుడు ఏర్పాటు చేసుకున్న ప్రజలు అని బలపరుచుటలోనూ రక్షణ ఔన్నత్యం ఉందని బోధించబడుతూ త్రోవ తప్పించబడిరి.

మెస్సీయను కలిగిన యూదామతంను ప్రచారం చేస్తున్న జాన్ హాగీ ఇది సమావేశాలలో బోధించబడును మరియు మిలియన్ల డాలర్ల ధనము ఇజ్రాయేలునకు సహాయంగా వెళ్ళును. జాన్ హాగీ, సుమారు 18,000 మంది సభ్యులు ఉన్న సమాజం యొక్క సీనియర్ పాస్టర్, ఈ నమ్మకానికి ఒక ప్రసిద్ధ ప్రచారకుడు.

ఫిబ్రవరి, 2006 లో, నేషనల్ ఛైర్మన్ ఆఫ్ క్రిస్టియన్స్ యునైటెడ్ ఫర్ ఇశ్రాయేల్ సంస్థ వ్యవస్థాపకుడు, పాస్టర్ జాన్ హాగీ, ఇజ్రాయేలుకు మద్దతు ఇచ్చుటలో దృష్టి సారించు జాతీయ కిందిస్థాయి ఉద్యమాలను రూపొందించడానికి సమయం ఆసన్నమైనదని నిర్ణయించుకొనెను. ఈ కొత్త కార్యక్రమంను ప్రారంభించుటలో తనతో చేరుటకు అమెరికా దేశాల్లోని క్రైస్తవ నాయకులకు తాను పిలుపునిచ్చారు. 400 పైగా క్రైస్తవ నాయకులు ప్రతి ఒక్కరూ ఒక తెగకు లేదా పెద్ద పెద్ద చర్చిలకు, ప్రచార శాఖకు, ప్రచురణ సంస్థకు, లేదా క్రైస్తవ విశ్వవిద్యాలయాలకు ప్రాతినిధ్యం వహించే (400 పైగా క్రైస్తవ నాయకులు) సహకారాన్ని ఇచ్చిరి మరియు క్రిస్టియన్స్ యునైటెడ్ ఫర్ ఇజ్రాయేల్ సంస్థ పుట్టెను.1

కొంతమంది వీలైనంత పవిత్రంగా ఉండాలనే ఒక నిజమైన కోరికతో, దుస్తులు మరియు ఇతర విషయాలలో రబ్బీ సంబంధమైన పలు ఆచారములను స్వీకరించుచున్నారు. కొన్నిసార్లు ఇతరులు వారిని అర్థం చేసుకోవటం కష్టంగా ఉండునట్లు మలుచుకోవడానికి - వారు హిబ్రూ పదాలను మరియు పదబంధాలను వారి పదజాలంలో ఉపయోగించెదరు. వారు యెరూషలేములో ఆలయ పునర్నిర్మాణానికి లేదా ఇజ్రాయెల్ లో బాంబు ఆశ్రయాల నిర్మాణానికి ధన సహాయంను హెచ్చించెదరు. ఇది క్రియల ద్వారా రక్షణ అనే విధానం కొరకు ఒక పెద్ద త్రోవ తప్పించు విషయమై ఉంది.

యోవేలు ప్రవక్త తాను ప్రకటించినప్పుడు చివరి తరాన్ని గూర్చి స్పష్టంగా వర్ణించాడు: "తీర్పు తీర్చు లోయలో రావలసిన యెహోవాదినము వచ్చే యున్నది; తీర్పుకై జనులు గుంపులు గుంపులుగా కూడియున్నారు". (యోవేలు 3:14). తాము ఏమి నమ్మాలి అనేదాన్ని చెప్పుటకొరకు ఒక ఆధ్యాత్మిక "గురువును" కోరుకొనుట అనేది మానవ స్వభావం; అది ఒక షమాన్ కావచ్చు, పూజారి, పాస్టర్, లేదా రబ్బీ కావచ్చు". కానీ యహువః ఏ మానవుడిని ఈ పాత్రకొరకు కేటాయించలేదు. ప్రతి ఒక్కరూ నేరుగా రక్షకుని యొద్దకు వచ్చి జీవ జలములను అందుకోవలెను. లేఖనాలు చెప్పుచుండెను: "సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చునదేమనగా .   .   .  మిమ్మును ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టినవాడు"(జెకర్యా 2: 8).

ఈ వాక్యం మీద, మరియు ఇలాంటి ఇతర వాక్యాల ఆధారంగా, అనేకులు సాధ్యమైనంత ఎక్కువగా వారి వస్త్రధారణ, జీవిత విధానం, మరియు ఆచారాలలో యూదులుగా మారితే, వారు యహువః ప్రసన్నతను పొందెదరని నమ్ముదురు. దురదృష్టవశాత్తూ, వారు అనుసరించే చాలా విధానాలు పరిసయ్యుల యొక్క మానవ నిర్మిత సంప్రదాయాలు అయివున్నాయి.

"(క్రీ.శ 70)లో ఆలయం నాశనం చేయబడిన తరువాత యూదుల వ్యవహారాలన్నిటి నియంత్రణను పరిసయ్యుల చేతికి వదిలి, సద్దూకయ్యులు కొంతకాలంలో పూర్తిగా అదృశ్యమైరి. ఇకనుంచి యూదుల జీవితం పరిసయ్యుల కోణంలో క్రమబద్దీకరించబడెను;  .  .  . పాత సన్హేద్రిన్ కి ఒక సరికొత్త విధానం ఇవ్వబడెను. పాత యాజక సంప్రదాయ పద్దతి కొత్త మతపరమైన సంప్రదాయాలతో భర్తీ చేయబడెను . . . యూదామత భవిష్యత్తు అంతటి యొక్క విధానము,  యూదుని జీవితం మరియు ఆలోచనా  విధానాలను పరిసయవాదం రూపించెను." 2

తమ ఆధ్యాత్మిక జీవితాలను అభివృద్ధి చేసుకొనుటకు యూదుల సాంప్రదాయాలవైపు తిరుగు వారు, నిజానికి, పరిసయ్యవాదం వైపు తిరుగుచున్నారు. పరిసయ్యవాదమే ఆధునిక యూదామతంగా మారినది అనే నిజాన్ని యూదుల పండితులు ఒప్పుకునిరి:

పరిసయ్యులు తాల్మూడిజంగా మారెను...[కాని] పురాతన పరిసయ్య ఆత్మ మార్పు లేకుండా నిలిచి యుండెను. ఎప్పుడైతే ఒక యూదుడు ... తాల్మూడ్ ను చదువూతాడో అప్పుడు, నిజానికి అతడు పురాతన పాలస్తీయన్ అకాడమీలు వుపయోగించిన వాదనలనే మర్లా తిరగవేయుచున్నాడు.  [పరిసయ్యుల] సిద్ధాంతం యొక్క ఆత్మ శీఘ్రముగా మరియు

 ఆయువుపట్టుగా మిగిలెను .  .  .  పాలస్తీనా నుండి బబులోనుకు; బబులోనుకు నుండి ఉత్తర ఆఫ్రికాకు, అక్కడనుండి ఇటలీ, స్పెయిన్, ఫ్రాన్స్ మరియు జర్మనీలకు, వీటినుండి పోలాండ్, రష్యా, తూర్పు ఐరోపా ఇలా సాధారణంగా, పురాతన ఫరిసయిజం ప్రయాణించినది.3

రక్షకుడు చీవాట్లలో అతి ఎక్కువ భాగం పరిసయ్యులవైపునకే చూపబడినవి. ఆయన వారిని "గ్రుడ్డి మార్గదర్శకులనియు," "బుద్ధిహీనులని మరియు అంధులనియు," "సర్పములు" మరియు ఒక "సర్ప సంతానమనియు" పిలిచెను. యహూషువః వారిని "వేషధారులుగా" పిలిచెను, ఆయన వారిని "సున్నముకొట్టిన సమాధులతో పోలస్తూ అవి వెలుపల శృంగారముగా అగపడును గాని లోపల చచ్చినవారి యెముకలతోను సమస్త కల్మషముతోను నిండియున్నవని చెప్పెను. (మత్తయి 23:27)".

యూదు స్మశానం

నేడు అనేక యథార్థ క్రైస్తవులు యూదులు ఇప్పటికీ యహువః యొక్క ప్రత్యేకమైన ప్రజలు అని నమ్మెదరు ఎందుకంటే యూదులు అలా చెప్పుకొనుచుండుట వలన.  అయితే, దాని పురాతన పరిసయ్య వాద మత ప్రతిరూపం వలె ఆధునిక యూదామతం కూడా ఏమాత్రం రక్షణ మార్గమును కలిగి లేదు. కాంతిని నిర్ధారణ చేసుకొనుట కోసం యూదుల వైపునకు చూచు వారు, మానవ నిర్మిత సంప్రదాయాలను తీసుకొని మరియు వాటిని దైవోపదేశాల స్థాయికి హెచ్చిస్తున్నారు. సత్యం కోసం ఈ మార్గమును ఆశ్రయించారందరికీ కలగబోవు తుది ఫలితంను యహూషువః స్పష్టంగా హెచ్చరించెను:

అయ్యో, వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు మనుష్యులయెదుట పరలోకరాజ్యమును మూయుదురు; మీరందులో ప్రవేశింపరు, ప్రవేశించు వారిని ప్రవేశింపనియ్యరు.

 

 

అయ్యో, వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, ఒకని మీ మతములో కలుపుకొనుటకు మీరు సముద్రమును భూమిని చుట్టివచ్చెదరు; అతడు కలిసినప్పుడు అతని మీకంటె రెండంతలు నరక పాత్రునిగా(మూలభాషలో-నరకకుమారునిగా) చేయుదురు.(మత్తయి 23:13 మరియు 15)

పరిసయ్యవాదం, అనగా ఆధునిక యూదామతం, మానవ నిర్మిత చట్టాలను మరియు సంప్రదాయాలను కలిగియున్నది. యూదులు వేల కొలది చట్టాలను కలిగి యుండెను, కానీ యహువః, తాను ఈ సంప్రదాయాలను "ద్వేషించుచున్నాను" అని చెప్పెను:

మీ పండుగ దినములను నేను అసహ్యించుకొనుచున్నాను; వాటిని నీచముగా ఎంచుచున్నాను; మీ వ్రత దినములలో కలుగు వాసనను నేను ఆఘ్రాణింపనొల్లను.

 

 

నాకు దహనబలులను నైవేద్యములను మీరర్పించినను నేను వాటిని అంగీకరింపను; సమాధాన బలులుగా మీరర్పించు క్రొవ్విన పశువులను నేను చూడను.

 

 

మీ పాటల ధ్వని నాయొద్దనుండి తొలగనియ్యుడి, మీ స్వరమండలముల నాదము వినుట నాకు మనస్సులేదు. (ఆమోసు 5: 21-23)

యహువః తాను స్వయంగా స్థాపించిన "పరిశుద్ధ సమాజ కూటపు కాలములు" ఉన్నాయి! అయితే, వాటిని ఆచరించ వలసిన విధానములు మానవ కల్పిత నియమాలు మరియు చట్టాల ద్వారా దిగజారి పోయెను, అనగా ధర్మశాస్త్ర కర్త వాటిని ఏ విధంగా ఉండాలని ఉద్దేశించెనో దాని యొక్క ఆధ్యాత్మిక సారాంశంను వారు నాశనం చేసిరి! దైవ చట్టంను "సంపూర్ణం" గా ఆచరించుటకు చేసే ప్రయత్నంలో, పరిసయ్యులు పూర్తి కొత్తగా  అదనపు నియమాలను మరియు అవసరాలను జోడించారు. ఈ అదనపు నియమాలు ఒకనికి పాపం నుండి విముక్తి కలిగించును అని వారు బోధించారు. ఉదాహరణకు, సూర్యాస్తమయం నుండి సూర్యాస్తమయం వరకు సబ్బాతు పాటించుట అనేది బైబిలు సంబంధమైనది కాదు. ఆ విధానము ప్రాయశ్చిత్తార్ధ దినం కోసం ప్రత్యేకంగా ఇవ్వటం జరిగినది. "సబ్బాతు దినపు అంచులను(ఆరంభ & ముగింపులను) జాగ్రత్తగా కాచుకోవాలనే" ఒక మితిమీరిన ఉత్సాహపూరిత ప్రయత్నంలో ప్రాయశ్చిత్తార్ధ దినమున ఆచరించవలసిన విధానము వారపు విశ్రాంతి దినమునకు కూడా విస్తరించినది.

పరిసయ్యుల ద్వారా చేర్చబడిన ఈ ఆచారాలను బహిరంగంగా నిందించిన యహూషువః యొక్క మాటలు ఇలా వివరిస్తూ నేటికినీ ప్రతిధ్వనిస్తుండెను: "మోయ శక్యముకాని భారమైన బరువులు కట్టి మనుష్యుల భుజములమీద వారు పెట్టుదురేగాని తమ వ్రేలితోనైన వాటిని కదలింపనొల్లరు." (మత్తయి 23: 4)

ఈ యథార్థ ప్రజలు వీరు స్వీకరిస్తున్న ఈ పద్ధతులు, మానవ నిర్మిత నియమాలు మరియు సంప్రదాయాలపై స్థాపించబడినవని ఎరుగరు. వారు, మేము చెడును తిరస్కరిస్తూ మరియు హిబ్రూ మూలాలవైపునకు తిరిగి వెళ్ళుచున్నాము అనుకుంటున్నారు, కానీ ఆ మూలాలు బాబిలోనును దాటి విస్తరించుట లేదు!

మెస్సీయను కలిగిన యూదామతంలోనికి మార్పుచెందుట

వ్యక్తిత్వ వికాసం అనేది మీరు ధరించు బట్టలు లేదా మీరు మీ పదజాలంలో జోడించి ఉపయోగించు హిబ్రూ పదాలు లేదా మీకు మీరు పిలుచుకునే హీబ్రూ పేర్ల ద్వారా మెరుగుపడదు. అది ఎవరి విశ్వాసమైతే విలువైన వాగ్దానాలపై ఆధారపడునో వారికి ఇవ్వబడిన బహుమానం.

క్రైస్తవ్యం యొక్క ప్రారంభ రోజుల్లో కూడా ఒక సంప్రదాయవాద వర్గానికి (పరిసయ్యులకు) చెందిన నమ్మకాలకు, ఆచరణలకు మరియు సాంప్రదాయాలకు అధిక విలువను ఇచ్చు ఒక ధోరణి యూదు విశ్వాసుల మధ్య ఉండేది. ఇట్టి మానవ సంప్రదాయాలను అనుసరించు వారికి, పౌలు ఇలా వ్రాశాడు:

పరిసయ్య వాదం

అనేకులు, విశేషముగా సున్నతి సంబంధులును, అవిధేయులును వదరుబోతులును మోసపుచ్చువారునైయున్నారు. వారి నోళ్లు మూయింపవలెను. అట్టివారు ఉపదేశింపకూడని వాటిని దుర్లాభము కొరకు ఉపదేశించుచు, కుటుంబములకు కుటుంబములనే పాడుచేయుచున్నారు.

ఈ సాక్ష్యము నిజమే. ఈ హేతువు చేత వారు యూదుల కల్పనా కథలను, సత్యము నుండి తొలగిపోవునట్టి మనుష్యుల కట్టడలను లక్ష్యపెట్టక, విశ్వాస విషయమున స్వస్థులగు నిమిత్తము వారిని కఠినముగా గద్దింపుము.

ఎలోహను ఎరుగుదుమని వారు చెప్పుకొందురు గాని, అసహ్యులును అవిధేయులును ప్రతి సత్కార్యము విషయము భ్రష్టులునైయుండి, తమ క్రియలవలన ఆయనను ఎరుగమన్నట్టున్నారు(ఆయన నెరుగమనువారు). (తీతుకు 1: 10-11, 13-14, 16)

దైవ జ్ఞానంను కలిగి యున్న వారు అని యూదులవైపు చూచు వారికి ఇది ఒక హెచ్చరికయై ఉంది. ఆధ్యాత్మిక విషయాలపై యూదులను తుది అధికారులుగా చేయడం ద్వారా, యూదులు ఏవైతే సత్యాలను తిరస్కరించునో అవే సత్యాలను తిరస్కరించుటకు వీరును నడిపింపబడుతున్నారు. ఒక ప్రధాన ఉదాహరణ: నిజమైన సబ్బాతు. నైసియా సభ తర్వాత రోమీయులు పెట్టిన భయంకరమైన శ్రమల వలన యూదులు [హిలెల్ II క్యాలెండరును "దిద్దుబాటు" చేసినపుడు] బైబిల్ సబ్బాతును ప్రక్కన పెట్టరి. యూదులు, నేడు, గ్రెగోరియన్ క్యాలెండర్ యొక్క శనివారం నందు ఆరాధిస్తారు. ఫలితంగా, అది యూదులు అదే రోజును పాఠించుచున్నారనియు, మరియు నిజానికి యూదులు శనివారం తప్ప వేరొక దినమును ఎప్పుడూ ఆరాధించలేదనే ఒకే ఒక భావన కారణంగా యథార్థ క్రైస్తవులు లక్షల మంది శనివారంను నిజమైన బైబిలు సబ్బాతు అని అనుకొనుచున్నారు. ఆవిధంగా, చివరి పరీక్ష ఎదురయ్యింది మరియు ఆ పరీక్ష కేవలం ఒక ఊహ కారణంగా, అనగా యూదులు తప్పకుండా సత్యంను కలిగి ఉండాలి, ఎందుకంటే వారు యూదులు కాబట్టి అనే ఊహ కారణంగా నిరాకరించబడింది.

అయితే, లేఖనాలు, దీనికి చాలా విరుద్ధమైన విధానమును సూచిస్తుండెను. ప్రాచీనకాలపు యూదులు గానీ, మెస్సీయ కాలం నాటి యూదులు లేదా నేటి యూదులు గానీ, యహువః ఉద్దేశించిన పద్ధతిలో దైవ ధర్మశాస్త్రంను పాఠించలేదు:

అయినను-మీ దుర్మార్గములను విడిచిపెట్టి, నేను మీ పితరులకు ఆజ్ఞాపించినట్టియు, నా సేవకులగు ప్రవక్తలద్వారా మీకప్పగించినట్టియు ధర్మశాస్త్రమును బట్టి నా ఆజ్ఞలను కట్టడలను ఆచరించుడని సెలవిచ్చి, ప్రవక్తలందరిద్వారాను దీర్ఘదర్శులద్వారాను యహువః ఇశ్రాయేలువారికిని యూదావారికిని సాక్ష్యము పలికించినను, వారు విననివారై తమ ఎలోహ అయిన యహువః దృష్టికి విశ్వాసఘాతుకులైన తమ పితరులు ముష్కరులైనట్లు తామును ముష్కరులైరి. వారు ఆయన కట్టడలను, తమ పితరులతో ఆయన చేసిన నిబంధనను, ఆయన తమకు నిర్ణయించిన ధర్మశాస్త్రమును విసర్జించి వ్యర్థమైనదాని అనుసరించుచు, వ్యర్థులైవారి వాడుకలచొప్పున మీరు చేయ కూడదని .  .  .  . ​వారు తమ ఎలోహ అయిన యహువః ఆజ్ఞలన్నిటిని యనుసరింపక .  . . . (2 రాజులు 17: 13-16)

మానవ నిర్మిత సంప్రదాయాలు ఆత్మను పరిశుద్ధపరచ లేవు. అవి కేవలం వాటిని పాఠించలేనివారి కంటే ఆ పద్ధతులను పాఠించువారు గొప్పవారని అనిపించుకొనుటకు మాత్రమే ఉపయోగపడతాయి.

"యహువః నియమించిన ధర్మశాస్త్రము యథార్థ మైనది అది ఆత్మను మార్పుచెందించును, యహువః శాసనము నమ్మదగినది అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును. "(7 కీర్తన 19). మానవ నిర్మిత సంప్రదాయాలు, మానవ వివరణ ఆధారంగా కలుపబడిన నియమాలు, దైవ ధర్మశాస్త్రంను క్లిష్టతరం చేయును. యహువః యొక్క ధర్మశాస్త్రము సాధారణమైనదిగా మరియు సూటిగా ఉంటుంది. యహూషువః పరిసయ్యుల యొక్క సమస్త సంప్రదాయాలను పక్కకు త్రోసివేసెను మరియు సుందరమైన, సమగ్రమైన, ఇంకా సాధారణ దైవ ధర్మశాస్త్రం యొక్క స్వభావంను గురించి వివరించారు:

వారిలో ఒక ధర్మశాస్త్రో పదేశకుడు ఆయనను శోధించుచు, బోధకుడా, ధర్మశాస్త్రములో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగెను.

 

 

అందుకాయననీ పూర్ణహృదయముతోను నీ పూర్ణాత్మతోను నీ పూర్ణమనస్సుతోను నీ ఎలోహ అయిన యహువః ను ప్రేమింపవలెననునదియే. ఇది ముఖ్య మైనదియు మొదటిదియునైన ఆజ్ఞ. నిన్నువలె నీ పొరుగువాని ప్రేమింపవలెనను రెండవ ఆజ్ఞయు దానివంటిదే. ఈ రెండు ఆజ్ఞలు ధర్మశాస్త్రమంతటికిని ప్రవక్తలకును ఆధారమై యున్నవని అతనితో చెప్పెను.  (మత్తయి 22: 35-40)

"మనుష్యుడా, యేది ఉత్తమమో అది నీకు తెలియజేయబడియున్నది; న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీనమనస్సు కలిగి నీ ఎలోహ యెదుట ప్రవర్తించుటయు, ఇంతేగదా యహువః నిన్నడుగుచున్నాడు."(మీకా 6: 8). పౌలు నూతన విశ్వాసులు సత్యం యొక్క సరళతను ప్రక్కన పెట్టి, సంప్రదాయాలవైపునకు తిరుగుచున్నారని ఆందోళన వ్యక్తం చేశారు: "సర్పము తన కుయుక్తిచేత హవ్వను మోసపరచినట్లు మీ మనస్సులును చెరుపబడి, యహూషువః ఎడలనున్న సరళత నుండియు పవిత్రత నుండియు ఎట్లయినను తొలగిపోవునేమో అని భయపడుచున్నాను." (2 కొరింథీయులకు 11: 3).

యెరూషలేము

ఎవరైతే సమస్త వాగ్దానాలు ఇజ్రాయేలు కొరకే చేయబడినవని చెప్పుచూ యూదామతంలో కనిపించే సంప్రదాయాలను ఆశ్రయించుదురో, వారు ఆ వాగ్దానాలన్నియు ఎల్లప్పుడూ విధేయత అనే షరతుపై ఇవ్వబడినవనే విషయంను విస్మరిస్తున్నారు. ఇశ్రాయేలీయులు ఒక రాజును ఈ క్రింది విధంగా అడిగినప్పుడు వారు యహువః ను తిరస్కరించెను: "అందుకు యహువః సమూయేలునకు సెలవిచ్చినదేమనగా - జనులు నీతో చెప్పిన మాటలన్నిటి ప్రకారము జరిగింపుము; వారు నిన్ను విసర్జింపలేదుగాని తమ్మును ఏలకుండ నన్నే విసర్జించియున్నారు." (1 సమూయేలు 8: 7). నిజానికి, వారు ఆయనను తిరస్కరించినను యహువః వారిని సుదీర్ఘంగా సహించెను, అది ఆయన ద్వారా పలుమార్లు వాడబడిన - 'నా సేవకుడైన దావీదు నిమిత్తమును' అనే పదబంధం తెలియజేస్తుంది. కానీ దైవ ప్రేమ అవసరం లేని వారి దగ్గర నిలిచియుండదు. అది విడిచిపోకుండా చాలా కాలం ఆలస్యము ఆలస్యం చేసినప్పటికీ, దైవ ప్రేమ చివరకు, బాధాకరంగా, మూర్ఖమైన హృదయాల యొక్క తలంపుల యొద్ద తల వంచును. యహూషువః మరణించడానికి కొద్ది రోజుల ముందు, బద్దలయ్యే హృదయంతో ఇలా దుఃఖించెను:

యెరూషలేమా, యెరూషలేమా, ప్రవక్తలను చంపుచును నీయొద్దకు పంపబడినవారిని రాళ్లతో కొట్టుచును ఉండుదానా, కోడి తన పిల్లలను రెక్కలక్రింది కేలాగు చేర్చుకొనునో ఆలాగే నేనును నీ పిల్లలను ఎన్నోమారులు చేర్చుకొనవలెనని యుంటిని గాని మీరు ఒల్లకపోతిరి. ఇదిగో మీ యిల్లు మీకు విడువబడియున్నది. ఇదిమొదలుకొని యహువః పేరట వచ్చువాడు స్తుతింపబడుగాకని మీరు చెప్పువరకు నన్ను చూడరని మీతోచెప్పుచున్నాను. (మత్తయి 23: 37-39)

పౌలు "జుడాయైజర్స్"/యూదులుగా మార్చువారిని) ను హెచ్చరించెను, ఈ హెచ్చరికకు ఈ యథార్థ క్రైస్తవులు సంపూర్ణంగా సరిపోవుదురు! యూదులుగా మారుట వలన ఒక యోగ్యత ఉండుననే నమ్మకంలోనికి పడుట ద్వారా, ఇజ్రాయేలుకు క్రమంగా ధనమును పంపుట ద్వారా, యూదులందరూ మారుమనస్సు పొందే వరకు యహూషువః యొక్క రెండవ రాకడ రాదు అనే ఒక అంత్య కాల సిద్ధాంతంను నిర్మించుట ద్వారా, ఈ యథార్థ క్రైస్తవులు రెండవ రాకడలో ఆశ్చర్యకరంగా తీసుకొనపోబడెదరనే నమ్మకంను కలిగి యున్నారు. యహూషువః ఇలా హెచ్చరించారు: "ఇదిగో నేను దొంగవలె వచ్చుచున్నాను". (ప్రకటన 16:15). ఆయన తిరిగి వచ్చినపుడు, అనేక క్రైస్తవులు ఆశ్చర్యపడెదరు, ఎందుకంటే వారు అప్పటికి ఇంకా యూదుల సామూహిక మార్పిడిలను చూడలేదు. ఖచ్చితంగా, వారు దుష్టుడైన యొక దాసుడు వలే "యజమానుడు ఆలస్యము చేయుచున్నాడని తన మనస్సులో అనుకొనిన విధంగా" రెండవ రాకడ ఆలస్యంగా వచ్చునని తలంచుచున్నారు.

పురాతన ఇజ్రాయేలుకు ఇవ్వబడిన వాగ్దానాలు నేడు ఆత్మీయ ఇజ్రాయేలుకు అందుబాటులో ఉన్నాయి.

యహూషువః నందు మీరందరు విశ్వాసము వలన ఎలోహ కుమారులై యున్నారు. మెస్సీయలోనికి బాప్తిస్మము పొందిన మీరందరు మెస్సీయను ధరించుకొని యున్నారు. ఇందులో యూదుడని గ్రీసుదేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు; యేసుక్రీస్తునందు మీరందరును ఏకముగా ఉన్నారు. మీరు మెస్సీయ సంబంధులైతే (మూలభాషలో-క్రీస్తువారైతే) ఆ పక్షమందు అబ్రాహాము యొక్క సంతానమైయుండి వాగ్దాన ప్రకారము వారసులైయున్నారు.(గలతీయులకు 3: 26-29)

యూదుడు కాదు లేక గ్రీకుదేశస్తుడు కాదు

వ్యక్తిగతంగా యూదునికి రక్షణ ఇప్పుటికీ అందుబాటులో ఉంది, కానీ ఆత్మీయ దీవెనలు వాటిని ఎవరు అంగీకరించెదరో వారందరికీ ఉంటాయి మరియు ఇది భూమి యొక్క చరిత్ర ముగిసే వరకు "అన్యుల కాలములు పరిపూర్ణమగు వరకు, సత్యమై ఉండును. (లూకా 21:24)

రక్షణ దైవ కృప యొక్క బహుమానం. వారి విమోచకుని ప్రేమించువారు మానవనిర్మిత నియమాలు మరియు సంప్రదాయాల ద్వారా ఆటంకపరచబడకుండా, సుందరమైన పవిత్రతతో ఆయనను గౌరవించుటకు ఆశపడెదరు. అధికమైన శరీర భారము వలన ప్రయాస పడువారందరినీ ఆయన వైపు తిరగమని ఆయన పిలుచుచుండెను, మరియు అయిన వారికి విశ్రాంతి కలుగజేయును.

"ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి; నేను మీకు విశ్రాంతి కలుగజేతును." (మత్తయి 11:28)


సంబంధిత సమాచారం:


1 http://www.cufi.org/site/PageServer?pagename=about_pastor_john_hagee

2 "పరిసయ్యులు," యూదు ఎన్సైక్లోపీడియా, వాల్యూం. IX (1901-1906 సం.), పి 666.

3 లూయిస్ ఫిన్కెల్స్టెయిన్, పరిసయ్యులు: ది సోషల్ బ్యాగ్రౌండ్ ఆఫ్ దెయిర్ ఫెయిత్, వాల్యూమ్ 1 మొదటి ఎడిషన్, పేజీ Foreward .. XXI, ఉద్ఘాటన సరఫరా.