Print

క్రీస్తు ముందటి అవతారం: బైబులు సత్యమా? లేక పురాతన అన్యమత విశ్వాసమా?

ఒక త్రిత్వ భగవంతుని యొక్క సిద్ధాంతం ప్రాచీన అన్యమతం నుండి వచ్చినది, లేఖనం నుండి కాదు. ఈ సిద్ధాంతమును అంగీకరించుట ఒక సహజ ఆలోచన సృష్టించినది, తద్వారా రక్షకుడు తన జన్మమునకు పూర్వమే-ఉండెను అను నమ్మకం ఒక "సహజ ముగింపు" గా మారినది.

త్రిత్వంప్రారంభ క్రైస్తవులు, వారికి ముందుగల యూదులవలె లేఖనం యొక్క స్వచ్ఛమైన అవగాహనలో ఏకేశ్వరవాదులై ఉన్నారు. వారు ఒకే ఒక్క, నిత్య స్వీయ-ఉనికిగల సృష్టికర్త-దేవుని నమ్మేవారు. ఈ సర్వశక్తివంతమైన దైవము యొక్క స్వభావం ద్వితీయోపదేశకాండములో మోషే ద్వారా ఇలా వివరించబడింది: “ఇశ్రాయేలూ వినుము. మన ఎలోహీం అయిన యహువః అద్వితీయుడగు యహువః. (ద్వితీయోపదేశకాండం 6: 4)

కొత్త నిబంధన రచయితలలో గానీ, అపొస్తలులలో గానీ లేక ప్రారంభ క్రైస్తవుల్లో గానీ, ఎవరూ ఒక త్రిత్వ దైవత్వమును [అనగా ఒక “తండ్రి దేవుడు”, మరియు ఆయనకు సమానంగా ఉన్న “కుమారుడు దేవుడు”, మరియు దైవత్వము యొక్క అదృశ్య రూపమైన మూడవ వ్యక్తి, “పవిత్ర ఆత్మ దేవుడు”] విశ్వసించలేదు.

ఇది కేవలం, క్రైస్తవ మతము అన్యమతముతో కలిసిపోయి పాడైపోయిన తరువాత, ముగ్గురు నిత్యమైన సహ-ఉనికిలో గల దేవుళ్ళు ఐక్యంగా “ఏక భగవంతుని” గా పనిచేయుచుండెననే ఆలోచన విస్తృతంగా ఆమోదించబడినది. ఇది ఒక నమూనా ఆలోచనలోని మార్పు, కానీ నేడు, త్రిత్వము యొక్క సిద్ధాంతం క్రైస్తవ మతం యొక్క మూల నమ్మకాలలో ఒకటిగా పరిగణించబడుతూ ఉన్నది. ఈ అన్యమత విశ్వాసమును అంగీకరించుట ద్వారా పూర్తిగా కొత్త వేదాంత వాతావరణం సృష్టించబడెను -- అది ఊహించలేని అలల ప్రభావాలను కలిగి ఉండెను.

తప్పుడు ఊహాగానాలు

క్రైస్తవులు నేడు మెస్సీయను “మానవ శరీరంలో అవతరించిన దేవునిగా” చూస్తారు. వాస్తవానికి, అత్యంత ప్రజాదరణ పొందిన క్రిస్మస్ గీతం, "హర్క్క్! ది హెరాల్డ్ ఏంజిల్స్ సింగ్!” లో రెండవ వాక్యంలో ఈ కింది పదాలు ఉన్నాయి:

క్రీస్తు పరలోకంలో అత్యంత పూజ్యనీయుడు
క్రీస్తు నిత్య ప్రభువు! ...
భగవంతుడు శరీరం ధరించెను చూడుము
అవతరించిన దేవుని స్తోత్రించుము.

అదే క్రైస్తవులు గ్రహించని విషయం ఏమిటంటే, క్రీస్తు యొక్క ఒక ముందస్తు-ఉనికిని గూర్చి లేఖనములో ఎక్కడా కనుగొనబడలేదు. ఖచ్చితంగా, ఈ సిద్ధాంతానికి మద్దతుగా ఉదహరించబడిన బైబిల్ వాక్యాలు ఉన్నాయి, కానీ ఈ వాక్యాలు తప్పుగా వర్ణించబడుచున్నవని లేఖనాల యొక్క జాగ్రత్తయైన అధ్యయనం ద్వారా అర్థమవుతుండెను.

గ్నోస్టిక్ సువార్తలుక్రీస్తు ముందుగానే ఉండెననే విశ్వాసమును ప్రేరేపించుటకు కారణమైన పునాదిని వేయుటలో ఒక ప్రాచీన మత విరోధ సిద్ధాంతమైన గ్నోస్టిసిజం బాధ్యత వహిస్తుంది. మరో మాటలో చెప్పాలంటే, సంఘములోని నాయకులు అపోస్తలిక్ క్రైస్తవ మతం నుండి మరింత మరింత దూరంగా జరుగుట వలన, లోపాలు వేగంగా పెరుగుట ప్రారంభమాయెను మరియు ఈ ఆకస్మిక లోపం నుండి ముందస్తు-ఉనికిని కలిగిన "కుమారుడైన దేవుని" యందు విశ్వాసం ఉద్భవించినది.

సృష్టిని సృష్టించు పని నుండి యహువః పూర్తిగా వేరుగా ఉండెనని గ్నోస్టిసిజం విశ్వసిస్తుంది. వాస్తవానికి, ఆయనను, సృష్టికర్త అని వారు నమ్మలేదు. గ్నోస్టిక్కులు పదార్ధమును కూడా అలాగే చూసారు. పర్యవసానంగా, వారి దృష్టిలో విశ్వం మరియు ప్రకృతి కూడా చెడుగా ఉండెను. స్పష్టంగా, యహువః పరిశుద్ధుడు మరియు ఆయన ఒక చెడు విశ్వాన్ని సృష్టించలేడు. అందువల్ల విశ్వం “డెమియుర్జ్” అని పిలువబడు ఒక చిన్న దైవం ద్వారా సృష్టించబడెనని వారు విశ్వసించారు. వారు విశ్వసించిన ఈ “డెమియుర్జ్”, దుష్టుడు.

గ్నోస్టిక్ సిద్ధాంతం యొక్క సున్నితమైన ప్రభావము సంఘములోనికి చొరబడుట వలన, క్రీస్తు విమోచకుడుగా ఉండాలంటే, ఆయన సృష్టికి మించి (transcend) ఉండాలని, అనగా, సృష్టించబడని వానిగా, నిత్య దైవత్వములో భాగమై ఉండాలనే ఆలోచనను ప్రారంభ సంఘ నాయకులు మరియు బోధకులు అంగీకరించడం ప్రారంభించారు. సృష్టి ఒక సృష్టించబడిన జీవి ద్వారా విమోచించబడుట సాధ్యం కాదు, అది కేవలం దేవుని ద్వారా మాత్రమే సాధ్యము అనేది వారి తర్కము.1

మించి యుండుట (To transcend), యొక్క అర్థం: “కంటే ఎక్కువగా ఉండు … (భౌతిక అనుభవానికి లేదా విశ్వానికి) పైగా మరియు స్వతంత్రంగా ఉండు.” 2

తప్పుడు తీర్మానాలు

ఒకవేళ "తండ్రి దేవుడు" గొప్పవానిగా, ప్రత్యేకంగా, భౌతిక ప్రపంచాన్ని మించి ఉన్నట్లయితే, "కుమారుడు దేవుడు" కూడా అలాగే ఉండాలి. వాస్తవానికి యహూషువః మెస్సీయగా ఉండాలంటే, ఆయన సృష్టిని "అధిగమించి" ఉండాల్సి ఉంది, ఎందుకంటే సృష్టి ఒక సృష్టించబడిన జీవి ద్వారా విమోచించబడుట అసాధ్యం, అది కేవలం దేవుని ద్వారా మాత్రమే సాధ్యము అనే స్థిర నమ్మకానికి తప్పుడు సిద్ధాంతాలపై ఆధారపడిన ఈ తీర్మానం దారితీసింది. ఈ గ్నోస్టిక్ సిద్ధాంతాలు లేఖనాలచే మద్దతు ఇవ్వబడవు. ఏమైనప్పటికీ అవి, యహూషువః "మానవ శరీరములో వచ్చిన దేవుని అవతారము" అనే తప్పుడు తీర్మానానికి పునాదిగా ఉన్నాయి.

ఈ మతవిశ్వాసము మర్మ సందేశాన్ని సువార్త సందేశంలోనికి తీసుకువచ్చినది. నికోదేముతో యహూషువః చెప్పిన ఈ క్రింది మాటలలో సువార్త యొక్క సౌందర్యమును మరియు శక్తిని చూడవచ్చు: “ఎలోహీం లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన అద్వితీయకుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. (యోహాను 3:16).

ఈ తప్పుడు సిద్ధాంతం వృద్ధి చెందుట వెనుక సాతాను స్వయంగా ఉన్నాడు. "కుమారుడు దేవుడు" ముందుగానే ఉండెననే ఈ నమ్మకము, మానవ దృష్టిని రక్షకుని విజయవంతమైన పునరుత్థానం నుండి ఊహాజనితమైన తన పూర్వ-ఉనికికి మార్చడం ద్వారా సువార్త సందేశం యొక్క పూర్తి శక్తిని తగ్గిస్తుంది.

పునరుత్థానం: రక్షణకు ఋజువు

ఖాళీ సమాధి

యహూషువః పునరుత్థానం సువార్త యొక్క ప్రధాన విషయం. ఆయన నిజమైన మెస్సీయ అనుటకు ఇది గొప్ప నిర్ధారణ. యహూషువః యొక్క పునరుత్థానం ఒక చారిత్రక సత్యం, క్రైస్తవ సంఘం దీనిపైనే స్థాపించబడెను, ఎందుకంటే ఆయన పాపములేని జీవితాన్ని గడిపెననుటకు ఇదియే రుజువు! మరియు, మొదటి ఆదాము పడిపోయిన స్థానంలో జయించి, పాపములేని జీవితాన్ని గడిపిన యహూషువః తనయందు విశ్వాసముంచి, ఆయన మరణమును తమ తరపున చేయబడిన బలిగా అంగీకరించినవారందరికి తన నీతిని ధరింపజేయగలడు.

క్రీస్తు పునరుత్థానం మనకు హామీ, మరియు ఆయన బలిత్యాగం మన స్థానంలో అంగీకరించబడినది. ఎందుకంటే పాపరహితమైన జీవితం లేకుండా ఆయన పునరుత్థానము పొందలేడు.

మరియు ఆయన మరణము యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యముగలవారమైన యెడల, ఆయన పునరుత్థానము యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యముగలవారమై యుందుము. ఏమనగా మనమికను పాపమునకు దాసులము కాకుండుటకు పాపశరీరము నిరర్థకమగునట్లు, మన ప్రాచీన స్వభావము (మూలభాషలో-ప్రాచీన పురుషుడు) ఆయనతో కూడ సిలువవేయబడెనని యెరుగుదుము.

చనిపోయినవాడు పాపవిముక్తుడని తీర్పుపొందియున్నాడు. మనము క్రీస్తుతోకూడ చనిపోయిన యెడల, మృతులలోనుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడనియు, మరణమునకు ఇకను ఆయనమీద ప్రభుత్వము లేదనియు ఎరిగి, ఆయనతోకూడ జీవించుదుమని నమ్ముచున్నాము. ఏలయనగా ఆయన చనిపోవుట చూడగా, పాపము విషయమై, ఒక్కమారే చనిపోయెను గాని ఆయన జీవించుట చూడగా, దేవుని విషయమై జీవించుచున్నాడు. అటువలె మీరును పాపము విషయమై మృతులుగాను, ఎలోహీం విషయమై క్రీస్తు యహూషువః నందు సజీవులుగాను మిమ్మును మీరే యెంచుకొనుడి. (రోమీయులకు 6:5-11)

యహూషువః యహువః యొక్క అద్వితీయ కుమారుడు మరియు పూర్తిగా మానవునిగా జన్మించాడు. సృష్టికి మించి, సృష్ట్యారంభము నుండి ఉన్నవాడు కాక, రక్షకుడు ఎప్పటికీ మానవ జాతికి చెందినవాడు. ఆదాము పతనమును ఆయన విమోచించాడు, పాపరహితమైన జీవితాన్ని గడిపి మరణించిన తర్వాత తిరిగి జీవములోనికి పునరుత్థానం చేయబడ్డాడు. విశ్వాసం ద్వారా, ఆయన విజయాలు మనవి. క్రీస్తు-ముందటి అవతారం అనే గ్నోస్టిక్ సిద్ధాంతంతో సాతాను దాచివేయుటకు ప్రయత్నించిన సువార్త సందేశం యొక్క సౌందర్యం మరియు శక్తి ఇదియే.

పరలోకం ఇప్పుడు ఈ పురాతన సత్యాన్ని ప్రపంచానికి పునరుద్ధరిస్తోంది. చదవడం ప్రారంభించండి! పునరుద్ధరించబడిన ప్రతి సత్యం సాతాను యొక్క అంత్యకాలపు మోసాల నుండి ఆత్మను రక్షిస్తుంది.
బైబిలు అధ్యయనం
2 The American Heritage Dictionary of the English Language, 4th ed.