Print

రహస్య ఎత్తుబాటు: సాతానుని రహస్య ఆయుధం

భూమిపై యహువః రాజ్యాన్ని స్థాపించుటకు యహూషువః తిరిగి వస్తానని చేసిన ప్రతిజ్ఞ దాదాపు 2,000 సంవత్సరాలుగా ఎంతో ప్రతిష్టాత్మకమైన వాగ్దానమైయున్నది. ఇది హతసాక్షులను బలపరిచింది మరియు ఒంటరి మరియు నలిగినహృదయయాలను ఓదార్చింది. త్వరలో వస్తున్న ఆయన రాకడకై తన ప్రజలు సిద్ధంగా ఉండాలని యహూషువః కోరుకుంటాడు. ప్రతి ఒక్కరూ కనిపెట్టుకొని మరియు సిద్ధంగా ఉండాలని ఆయన హెచ్చరించాడు మరియు తన రాకడకు కొన్ని సంకేతాలు ఇచ్చాడు. ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేయాలని సాతాను కోరుకుంటాడు. అతడు ప్రజలు సిద్ధపడకుండా ఉండేలా చేయుటకు ప్రయత్నిస్తాడు, తద్వారా యహూషువః రాకడ వారిని దిగ్భ్రాంతికి గురి చేస్తుంది మరియు వారు విడువబడతారు.

రహస్య ఎత్తుబాటు సాతాను యొక్క అత్యంత విజయవంతమైన అబద్ధాలలో ఒకటి “రహస్య ఎత్తుబాటు”. ఈ సిద్ధాంతాన్ని సమర్థించే వారు, యహూషువః తన ప్రజలను భూమి నుండి తీసుకొని వెళ్లుటకు రహస్యంగా వచ్చునని బోధిస్తారు. నీతిమంతులు ఎత్తబడిన" తరువాత, భూమి మొత్తం ఏడు సంవత్సరాల పాటు గొప్ప శ్రమలకు లోనవునని, ఈ సమయంలో క్రీస్తు విరోధి పాలనలో భూమిపై గొప్ప శక్తి ప్రయోగించబడునని నమ్ముదురు. ఇది చాలా ప్రమాదకరమైన నమ్మకం. ఇది గ్రంథంలో లేకపోవడమే కాక, రక్షణను అంగీకరించడానికి అనుకున్న దానికంటే ఎక్కువ సమయం ఉందని ప్రజలు భావించేలా వారిని నడిపిస్తుంది. ఈ కారణంగా రహస్య ఎత్తుబాటును విశ్వసించే ప్రజలు వారి హృదయాలను శ్రద్ధగా పరిశోధించుకొని కనుగొనిన ప్రతి పాపానికి పశ్చాత్తాపం పొందకపోవటమే గాక, వారు “రహస్య ఎత్తుబాటు” చేయబడకపోతే “గొప్ప శ్రమల” కాలం తరువాత పశ్చాత్తాపపడవచ్చుననే తప్పుడు భద్రతా భావాన్ని కలిగి ఉంటారు.

"అందరూ పాపం చేసి, యహువః అనుగ్రహహించచు మహిమను పొందలేకపోవుచున్నారు" అని గ్రంథం నిస్సందేహంగా పేర్కొనెను. (రోమా ​​3:23 చూడండి.) యహూషువఃను గూర్చి మరియు తన రాబోయే రాజ్యాన్ని గూర్చి సువార్త విన్న ప్రతి ఒక్కరికీ, అతడు లేదా ఆమె ఎవరికి సేవ చేయునో ఎన్నుకునే అవకాశాన్ని పరలోకం దయతో అనుగ్రహించెను మరియు ఆ అవకాశం మరణంతో ముగుస్తుంది. కొద్ది కాలం తరువాత, రక్షకుడు ఇలా ప్రకటిస్తాడు:

అన్యాయము చేయువాడు ఇంకను అన్యాయమే చేయనిమ్ము, అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడుగానే యుండనిమ్ము, నీతి మంతుడు ఇంకను నీతిమంతుడుగానే యుండనిమ్ము. పరిశుద్ధుడు ఇంకను పరిశుద్దుడుగానే యుండనిమ్ము. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. వానివాని క్రియచొప్పున ప్రతివాని కిచ్చుటకు నేను సిద్ధపరచిన జీతము నాయొద్ద ఉన్నది. (ప్రకటన గ్రంథము 22:11, 12).

ఆయన వచ్చినప్పుడు, తన ప్రతిఫలాన్ని తనతో తెస్తాడు. "రహస్య ఎత్తుబాటు" ఆలోచన బైబిలులోని ఈ క్రింది సందర్భంలో నుండి తీసిన కొన్ని వచనాలపై ఆధారపడి‌ ఉన్నది:

"ఆ కాలమున ఇద్దరు పొలములో ఉందురు, ఒకడు తీసికొనిపోబడును ఒకడు విడిచి పెట్టబడును. ఇద్దరు స్త్రీలు తిరుగలి విసరుచుందురు, ఒకతె తీసికొని పోబడును, ఒకతె విడిచిపెట్టబడును. కావున ఏ దినమున మీ (బోధకుడు) వచ్చునో మీకు తెలియదు గనుక మెలకువగా నుండుడి." (మత్తయి సువార్త 24:40-42).

ఈ వచనాలు శ్రమలకు ముందు రహస్య ఎత్తుబాటు అనే ఆలోచనకు మద్దతు ఇవ్వడానికి ఉపయోగపడవు ఎందుకంటే అది యహూషువః ఉపయోగించిన దృష్టాంతం యొక్క సంక్షిప్త ప్రకటన మాత్రమే! చివరి కాలంలో రెండు తరగతుల ప్రజలు ఉంటారని యహూషువః వివరించారు: రక్షింపబడినవారు మరియు విడువబడినవారు. ప్రతి ఒక్కరూ, వారి స్వంత నిర్ణయం ద్వారా, వారు రక్షింపబడతారో లేదో నిర్ణయించుకున్నప్పుడు, ఆయన దానిని జల ప్రళయానికి ముందు కాలంతో పోల్చాడు.

మునిగిపోతుండెను ... నీటి క్రింద చేయి

ఓడకు వెలుపల మిగిలిపోయిన వారికి రెండవ అవకాశం ఇవ్వబడలేదు. వారి పరిశోధనా కాలం ముగిసినది మరియు వారు వరదలో నాశనమయ్యారు.

"నోవహు దినములు ఏలాగుండెనో మనుష్యకుమారుని రాకడయును ఆలాగే ఉండును. జలప్రళయమునకు ముందటి దినములలో నోవహు ఓడలోనికి వెళ్లిన దినమువరకు, వారు తినుచు త్రాగుచు పెండ్లిచేసికొనుచు పెండ్లికిచ్చుచునుండి, జలప్రళయమువచ్చి అందరిని కొట్టుకొనిపోవు వరకు ఎరుగక పోయిరి; ఆలాగుననే మనుష్యకుమారుని రాకడ ఉండును."

"ఆ కాలమున ఇద్దరు పొలములో ఉందురు, ఒకడు తీసికొనిపోబడును ఒకడు విడిచి పెట్టబడును. ఇద్దరు స్త్రీలు తిరుగలి విసరుచుందురు, ఒకతె తీసికొని పోబడును, ఒకతె విడిచిపెట్టబడును. కావున ఏ దినమున మీ (బోధకుడు) వచ్చునో మీకు తెలియదు గనుక మెలకువగా నుండుడి." (మత్తయి సువార్త 24:37-42).

యహూషువః నోవహు దినాలకు మరియు ఆయన రాకడ దినాలకు మధ్య పోలికను చూపించాడు. నోవహు కాలంలో, లోబడుటకు ఎన్నుకున్న వారు ఓడలో రక్షింపబడ్డారు. లోబడుటకు నిరాకరించిన వారు బయట విడిచిపెట్టబడిరి. వారందరినీ నోవహు హెచ్చరించాడు మరియు వారు తమ తమ నిర్ణయాలను తీసికొనిరి, కాబట్టి వారి పరిశీలనా కాలం మూసివేయబడెను మరియు వారు వరదలో నాశనమయ్యారు. ఒక నీతికథలో, "గోధుమలు" మరియు "గురుగులు" (విష కలుపు మొక్కలు) రెండూ ఇలా ఉండునని ఆయన వివరించారు:

“కోతకాలము వరకు రెంటిని కలిసి యెదుగనియ్యుడి; కోతకాలమందు గురుగులను ముందుగా కూర్చి వాటిని కాల్చివేయుటకు కట్టలు కట్టి, గోధుమలను నా కొట్టులో చేర్చిపెట్టుడని కోతగాండ్రతో చెప్పుదు ననెను.” (మత్తయి 13:30)

అందువల్ల ఎటువంటి గందరగోళం ఉండదు, యాహూషువః ఇలా వివరించాడు:

"పొలము లోకము; మంచి విత్తనములు రాజ్యసంబంధులు (మూలభాషలో-కుమారులు); గురుగులు దుష్టుని సంబంధులు (మూలభాషలో-కుమారులు); వాటిని విత్తిన శత్రువు అపవాది (అనగా, సాతాను); కోత యుగసమాప్తి; కోతకోయువారు దేవదూతలు."

"గురుగులు ఏలాగు కూర్చబడి అగ్నిలో కాల్చివేయబడునో ఆలాగే యుగ సమాప్తియందు జరుగును. మనుష్య కుమారుడు తన దూతలను పంపును; వారాయన రాజ్యములోనుండి ఆటంకములగు సకలమైనవాటిని దుర్నీతిపరులను సమకూర్చి అగ్నిగుండములో పడవేయుదురు. అక్కడ ఏడ్పును పండ్లుకొరుకుటయును ఉండును."

"అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యునివలె తేజరిల్లుదురు. చెవులుగలవాడు వినునుగాక." (మత్తయి సువార్త 13:38-43).

లెఫ్ట్ బిహైండ్ కవర్ పేజీ

ప్రపంచం అంతమగుటకు ముందు నీతిమంతులు బయటకు తీయబడుదురని బోధించు రహస్య ఎత్తుబాటు సిద్ధాంతం లేఖనానికి విరుద్ధంగా ఉంది.

యాహూషువః స్వయంగా ఇచ్చిన సంఘటనల క్రమం ప్రకారం, నీతిమంతులు మరియు దుర్మార్గులు ప్రపంచ అంతం వరకు కలిసి ఉంటారు. అప్పుడు, ఆ సమయంలో, మొదట దుర్మార్గులను నాశనం చేయుటకు కట్టలుగా సేకరిస్తారు. అప్పుడు, మరియు అప్పుడు మాత్రమే, దుష్టులు నాశనం చేయబడుటకు కట్టలు కట్టబడుదురు, అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యంలో సూర్యునివలె తేజరిల్లుదురు." - (మత్తయి 13:43). ప్రపంచం అంతమవటానికి ముందు నీతిమంతులు బయటకు తీయబడుదురని బోధించు రహస్య ఎత్తుబాటు సిద్ధాంతం లేఖనానికి విరుద్ధంగా ఉంది. తన నమ్మకమైన అనుచరులు చివరి వరకు ప్రపంచంలో ఉంటారని యహూషువఃకు తెలుసు. గొప్ప శ్రమల సమయానికి ముందు వారిని బయటకు తీసే రహస్య ఎత్తుబాటు ఉండదు. ఈ కారణంగానే, పరలోకానికి ఆరోహణమయ్యే ముందు ఆయన చివరిగా “ఇదిగో నేను యుగసమాప్తి వరకు సదాకాలము మీతో కూడ ఉన్నానని వారితో చెప్పి” ప్రేమపూర్వక హామీ ఇచ్చెను. (మత్తయి 28:20). "రహస్య ఎత్తుబాటు" సిద్ధాంతం నీతిమంతులు భూమి నుండి ఎత్తబడిన తరువాత మాత్రమే క్రీస్తు విరోధి కనిపించునని బోధిస్తుంది. ఇది బైబిలుకు పూర్తిగా విరుద్ధం. క్రీస్తు విరోధి వెల్లడయ్యే వరకు యహూషువః తన వేచి ఉన్న ప్రజల కోసం తిరిగి రాడు అని గ్రంథం బోధిస్తుంది. అప్పుడు మరియు కేవలం అప్పుడు మాత్రమే నీతిమంతులు ఆయనను గాలిలో కలుసుకకొనుటకు ఎత్తబడుదురు మరియు భూమిపై యహువః రాజ్యంలో 1,000 సంవత్సరాలు ఆయనతో రాజ్యం చేయటానికి ఆయనను తిరిగి భూమికి తీసుకువెళతారు.

మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పాత్రుడగు(నాశనపుత్రుడు) పాపపురుషుడు (ధర్మవిరుద్ధపురుషుడు) బయలుపడితేనేగాని ఆ దినము రాదు. ఏది ఎలోహీం అనబడునో, ఏది పూజింపబడునో, దానినంతటిని ఎదిరించుచు, దానికంతటికిపైగా వాడు తన్నుతానే హెచ్చించుకొనుచు, తాను ఎలోహీంనని తన్ను కనుపరచుకొనుచు, ఎలోహీం ఆలయములో కూర్చుండును గనుక ఏవిధముగానైనను ఎవడును మిమ్మును మోసపరచ నియ్యకుడి. ధర్మవిరోధ సంబంధమైన మర్మము ఇప్పటికే క్రియచేయుచున్నది గాని, యిదివరకు అడ్డగించుచున్నవాడు మధ్యనుండి తీసి వేయబడు వరకే అడ్డగించును. అప్పుడా ధర్మవిరోధి బయలుపరచబడును. బోధకుడైన యహూషువః తన నోటియూపిరిచేత వానిని సంహరించి తన ఆగమన ప్రకాశముచేత నాశనము చేయును. (2 థెస్సలొనీకయులకు 2:3, 4, 7 & 8.)

ఆయన తిరిగి వచ్చేవరకు భూమిపై నిలిచియుండే నమ్మకమైన మరియు నీతిమంతుల కోసం ప్రకటన గ్రంథంలో ఒక విలువైన వాగ్దానం ఉంది.

“నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూ నివాసులను శోధించుటకు లోకమంతటిమీదికి రాబోవు శోధన కాలములో (మూలభాషలో-శోధనగడియలో) నేనును నిన్ను కాపాడెదను. నేను త్వరగా వచ్చుచున్నాను; ఎవడును నీ కిరీటము నపహరింపకుండునట్లు నీకు కలిగినదానిని గట్టిగా పట్టుకొనుము.” (ప్రకటన 3:10, 11)

ఈ వచనం రహస్య ఎత్తుబాటు ఆలోచనకు మద్దతు ఇవ్వడానికి ఉపయోగించబడుతుంది, కాని వాస్తవానికి చివరి వరకు ఆయన తన ప్రజలతో నిరంతర ఉనికిని కలిగియుండుననుటకు ఇది శక్తివంతమైన ధృవీకరణ. యహూషువః సిలువ వేయబడటానికి ముందటి సాయంత్రం, తనను అంతము వరకు విశ్వసించచు వారందరి కొరకు ప్రార్థించాడు:

"ఇప్పుడు నేను నీయొద్దకు వచ్చుచున్నాను; నా సంతోషము వారి యందు పరిపూర్ణమగునట్లు లోకమందు ఈ మాట చెప్పుచున్నాను. వారికి నీ వాక్యమిచ్చియున్నాను. నేను లోకసంబంధిని కానట్టు వారును లోకసంబంధులు కారు గనుక లోకము వారిని ద్వేషించును. నీవు లోకములో నుండి వారిని తీసికొని పొమ్మని నేను ప్రార్థించుటలేదు గాని దుష్టునినుండి (లేక, కీడునుండి) వారిని కాపాడుమని ప్రార్థించుచున్నాను." (యోహాను 17:13-15).

శ్రమలకు ముందు నీతిమంతులు భూమి నుండి తీసుకోబడనందున అలాంటి శక్తివంతమైన వాగ్దానాలు ఇవ్వబడ్డాయి. కొంత భవిష్యత్ వరకు, మరింత అనుకూలమైన తేదీ తెలిసే వరకు, దైవిక చట్టాన్ని పాటించుటను ఆలస్యం చేయుదుమని ఎవరూ అనుకోకూడదు. ఆ సమయం ఎప్పటికీ రాదు. నేడే రక్షణ దినం! యహూషువః రాకడ భూమిపై మనకు తెలిసినట్లుగా జీవితాన్ని మారుస్తుంది. అనగా, రక్షకుడిని తిరస్కరించిన వారందరికీ శాశ్వత మరణం మరియు ఆయనను అంగీకరించిన వారందరికీ శాశ్వతమైన జీవిత ప్రారంభం అని అర్ధం.

"ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదిగో ఇదే రక్షణ దినము.!” (2 కొరింథీయులు 6:3)

"మీరు ఎవరిని సేవించెదరో నేడే నిర్ణయించుకోండి."