Print

దిగ్భ్రాంతికరమైన కొత్త ఆధారము క్రీస్తు నిజమైన స్వభావాన్ని వెల్లడిస్తుంది! (మరియు అది మీరు అనుకుంటున్నది కాదు!)

ప్రశ్నఈ క్రింది ప్రకటనలలో ఏది తప్పు?

1. రహస్య ఎత్తుబాటు గొప్ప శ్రమలకు ముందు జరుగుతుంది …

2. బాప్తిస్మము పొందని శిశువులు నరకమునకు వెళ్తారు …

3. కుమారుడు ఎల్లప్పుడూ తండ్రితో పాటు శాశ్వతంగా ఉన్నాడు …

ఇవి అన్నియు తప్పై ఉన్నాయి అని నేను అంటే మీరు ఏమి అనుకుంటారు? మీ మతపరమైన నేపథ్యాన్ని బట్టి, మీరు శ్రమలకు-ముందటి ఎత్తుబాటు లేదా నరకము అనే ఆలోచనలలో నమ్మిక కలిగి ఉండకపోవచ్చు. కానీ "దేవుని కుమారుడు" తండ్రితో పాటు ఎల్లప్పుడూ సహ-ఉనికిని కలిగి లేడు అనే ఆలోచన మాత్రం మీకు ఒక మతబ్రష్టత్యముగా అనిపిస్తుంది.

మనము దీని ఆధారాలను చూద్దాం …

త్రిత్వ దైవము? లేక ఒకే ఒక్క దేవుడు?

ఒక త్రిత్వ దైవము యొక్క సిద్ధాంతం శతాబ్దాలుగా క్రైస్తవ మతానికి పునాదిగా పరిగణించబడుతుంది. కెవిన్ నీయంగ్ అనే రచయిత, ది డాక్ట్రిన్ ఆఫ్ ట్రినిటీ: నో క్రిస్టియానిటీ వితౌట్ ఇట్, అనే ఒక వ్యాసంలో, విస్తృతంగా వ్యాప్తిలో ఉన్న ఒక విశ్వాసమును గూర్చి తెలిపెను:

ఏదైనా సిద్ధాంతం క్రైస్తవ మతాన్ని క్రైస్తవ మతంగా చేస్తుంది అంటే, అప్పుడు అది ఖచ్చితంగా త్రిత్వము యొక్క సిద్ధాంతమే. మూడు గొప్ప క్రైస్తవ మత విశ్వాసాలు:- అపోస్తలుల విశ్వాసము, నైసీన్ విశ్వాసము మరియు అథానిసియన్ విశ్వాసము - ఇవి అన్నియు ఒకే ఒక్క దేవుడికి మూడు రూపాల చుట్టూ నిర్మించబడ్డాయి, త్రిత్వ సిద్ధాంతానికి ముఖ్యమైన ప్రాముఖ్యతనిచ్చాయి.

వాస్తవం, ఏమిటంటే, ఒక త్రిత్వ భగవంతుని సిద్ధాంతం పురాతన అన్యమతం నుండి నేరుగా వచ్చినది. అన్ని శాఖలకు సంబంధించిన బైబిలు పండితులకు ఈ విషయం తెలుసు మరియు ఈ సిద్ధాంతం “ప్రాచీన క్రైస్తవ రచనల్లో స్పష్టంగా గుర్తించబడదు అని వారు చెప్పారు. ఈ సిద్ధాంతాన్ని గూర్చి ప్రకటిస్తున్న కొత్త నిబంధన యొక్క ఏకైక లేఖనం (1 యోహాను 5: 7-8) వాస్తవానికి అసలైనది లేఖనం కాదు, కానీ తరువాతి కాలంలో సిద్దాంతపరంగా దుర్మార్గపు లేఖనాలతో ఇది జోడించబడినది. (11 వ శతాబ్దం వరకు ఏ గ్రీకు లేఖనాలలోను ఇది కనుగొనబడలేదు.).

త్రిత్వ చిహ్నం

త్రిత్వ విశ్వాసం మీద స్థాపించబడిన ఒక క్రైస్తవ మతం అన్యమతవాదంతో సమ్మేళనం చేయబడినక్రైస్తవ మతం. ఈ పాడైన క్రైస్తవత్వము వ్యాప్తి చెందుటతో, ఈ మతభ్రష్టత్వము కూడా వ్యాపించినది. నేడు, ఎక్కువమంది క్రైస్తవులు ఈ దెయ్యపు సిద్ధాంతాన్ని బైబిలు సిద్ధాంతమని విశ్వసిస్తున్నారు, అయితే దీనిని ఒక మత సిద్ధాంతంగా కొట్టివేస్తూ, చాలా కొద్ది సమూహాలు మాత్రం త్రిత్వ సిద్ధాంతమును విశ్వసించకుండా స్థిరంగా నిలిచాయి.

దీనికి విరుద్ధంగా, లేఖనం ఒకే ఒక్క దేవుడు మాత్రమే ఉన్నాడని ప్రకటిస్తుంది: యహువః ఎలోహీం. ద్వితీయోపదేశకాండము 6 వ అధ్యాయం ఈ హితబోధతో మొదలౌతుంది: “నీవు దీర్ఘాయుష్మంతుడవగునట్లు మీరు స్వాధీనపరచుకొనుటకు ఏరు దాటి వెళ్లుచున్న దేశమందు మీరు జరుపుకొనుటకు మీకు బోధింపవలెనని మీ ఎలోహీం అయిన యహువః ఆజ్ఞాపించిన ధర్మమంతయు అనగా కట్టడలు విధులు ఇవే.” వారు గుర్తుంచుకోవాల్సిన మొట్టమొదటి విషయం నిజమైన దేవుడు ఒక్కడు మాత్రమేనను వాస్తవం. ఆ దేవుడు యహువః. “ఇశ్రాయేలూ వినుము. మన ఎలోహీం అయిన యహువః అద్వితీయుడగు యహువః. నీ పూర్ణహృదయముతోను నీ పూర్ణాత్మతోను నీ పూర్ణశక్తితోను నీ ఎలోహీం అయిన యహువఃను ప్రేమింపవలెను. (ద్వితీయోపదేశకాండం 6: 4,5).

అన్యమతం యొక్క అవశేషాలు

ఇక త్రిత్వ సిద్ధాంతమును విశ్వసించని విశ్వాసులు కూడా ఇప్పటికీ ఈ మతవిశ్వాసంతో ప్రభావితమవుతున్నారు. క్రీస్తు యొక్క “పూర్వపు-ఉనికి” యందుగల నమ్మకం “తండ్రి దేవుడు, కుమారుడు దేవుడు, మరియు పరిశుద్ధాత్మ దేవుడు” నిత్యము సహ-ఉనికిని కలిగియున్నారనే నమ్మకం నుండి ముందుకు తీసుకురాబడినది.

త్రిత్వం యొక్క అన్యమత మూలాలు

కేవలం తండ్రి, యహువః మాత్రమే, నిత్యము స్వీయ-ఉనికిని కలిగి ఉండెనని లేఖనం బయలుపరచుచుండెను. ఈ వాస్తవాన్ని పౌలు అర్థం చేసుకొనెను. తిమోతికి వ్రాసిన ఒక పత్రికలో, ఆయన యహువఃను ఒక్కనిగా వివరించారు: “సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వముగలవాడైయున్నాడు. మనుష్యులలో ఎవడును ఆయనను చూడలేదు, ఎవడును చూడనేరడు; ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగియుండును గాక. (మొదటి తిమోతికి 6:16.)

గాబ్రియేలు దూత మరియకు వివరించినట్లుగా యహూషువః ఖచ్చితంగా ఉనికిలోకి వచ్చెను: “దూత - పరిశుద్ధాత్మ నీమీదికి వచ్చును; సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును. (లూకా సువార్త 1:35).

యహూషువః తాను పుట్టుటకు ముందు లేడు మరియు ఆయన దైవం కాదు. ఆయన 100% పూర్తి మానవుడు. అన్యమత త్రిత్వ సిద్ధాంతం యొక్క కళ్ళద్దాలను తొలగించినప్పుడు, కొత్త నిబంధన అంతటా ఈ వాస్తవం స్పష్టంగా కనిపిస్తుంది. నిజానికి, రక్షకుడు తనను తాను సూచించుకొనే ఇష్టమైన మార్గం "మనుష్య కుమారుడు" గా ఉంది. సువార్తలయందంతటా, యహూషువఃను గూర్చి “కుమారుడు” అనే పదం 67 సార్లు ఉపయోగించడం జరిగింది. ఆ సందర్భాలలో, వాటిలో 44 సార్లు "మనుష్య కుమారుడు" అనే పదములో భాగంగా ఉపయోగించబడెను.

మనుష్య కుమారుడు అనేది "మానవుడు అని అర్ధం ఇచ్చే ఒక సాధారణమైన అరామిక్ వ్యక్తీకరణ. మళ్ళీ, ఇది తనను తాను సూచించుకొనుటలో యహూషువఃకు ఇష్టమైన మార్గం.

ఇది ఆయన సృష్టించబడ్డాడు అని అర్థం కాదు. అయితే, ఆయన పుట్టెను. "బిగ్టోటెన్" అనే పదం కొత్త నిబంధనలో పదమూడు సార్లు ఉపయోగించబడగా, వాటిలోఎనిమిది సార్లు యహువః యొక్క అద్వితీయ కుమారుడు యహూషువఃకు ప్రత్యక్ష సూచనగా ఉన్నాయి.

తొట్టి

మనుష్య కుమారుడు

యహువః యొక్క ఏకైక కుమారునిగా, యహూషువః దుష్టత్వానికి లొంగని ధోరణులను వారసత్వంగా కలిగి పరిపూర్ణ మానవునిగా జన్మించాడు. ఆయన పాపములో "జన్మించలేదు. ఆయన పుట్టుక యొక్క ఉద్దేశ్యం అది కాదు. మొదటి ఆదాము విఫలమైన చోట జయించుటకు రెండవ ఆదాముగా జన్మించాడు: ఒక మానవునిగా.

ఇట్లుండగా ఒక మనుష్యుని ద్వారా పాపమును పాపము ద్వారా మరణమును లోకములో ఏలాగు ప్రవేశించెనో, ఆలాగుననే మనుష్యులందరు పాపము చేసినందున మరణము అందరికిని సంప్రాప్తమాయెను. ఏలయనగా ధర్మశాస్త్రము వచ్చెను గనుక పాపము లోకములో ఉండెను గాని ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము ఆరోపింపబడదు. అయినను ఆదాముచేసిన అతిక్రమమును బోలి పాపము చేయని వారి మీదకూడ, ఆదాము మొదలుకొని మోషే వరకు మరణమేలెను; ఆదాము రాబోవువానికి గురుతైయుండెను, అయితే అపరాధము కలిగినట్టు కృపా వరము కలుగలేదు. ఎట్లనగా ఒకని అపరాధమువలన అనేకులు చనిపోయినయెడల మరి యెక్కువగా ఎలోహీం కృపయు, యహూషువః అను ఒక మనుష్యుని కృపచేతనైన దానమును, అనేకులకు విస్తరించెను. మరియు పాపము చేసిన యొకనివలన శిక్షావిధి కలిగినట్టు ఆ దానము కలుగలేదు. ఏలయనగా తీర్పు ఒక్క అపరాధముల మూలముగా వచ్చినదై శిక్షావిధికి కారణమాయెను; కృపావరమైతే అనేకమైన అపరాధముల మూలముగా వచ్చినదై మనుష్యులు నీతిమంతులుగా తీర్చబడుటకు కారణమాయెను. మరణము ఒకని అపరాధమూలమున వచ్చినదై ఆ యొకని ద్వారానే యేలిన యెడల కృపాబాహుళ్యమును నీతిదానమును పొందువారు జీవము గలవారై, మరి నిశ్చయముగా యహూషువః ఒకని ద్వారానే యేలుదురు.

కాబట్టి తీర్పు ఒక్క అపరాధమూలమున వచ్చినదై, మనుష్యుల కందరికిని శిక్షావిధి కలుగుటకు ఏలాగు కారణమాయెనో, ఆలాగే ఒక్క పుణ్యకార్యమువలన కృపాదానము మనుష్యులకందరికిని జీవప్రదమైన నీతి విధింపబడుటకు కారణ మాయెను. ఏలయనగా ఒక మనుష్యుని అవిధేయతవలన అనేకులు పాపులుగా ఏలాగు చేయబడిరో, ఆలాగే ఒకని విధేయతవలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. (రోమీయులకు5:12 -19).

ఒక పవిత్రమైన, పాపరహితమైన జీవితాన్ని గడిపి మరణించిన తరువాత, యహువః యహూషువఃను మృతులలోనుండి లేపుట ద్వారా న్యాయం జరగించెను.

యహువః ను నిజంగా ప్రేమించే వారందరూ, తమ చిత్తమను ఆయనకు అప్పగింతురు, ఆయన బయలుపరిచిన చిత్తములో తమ జీవితాలు నడవాలని కోరుతూ, ఆయనకు లోబడుదురు. వారు అజ్ఞానంలో పాపం చేసినప్పటికీ, తెలిసిన పాపములో ఇకపై కొనసాగుటను ఎన్నుకోరు. యహువః యొక్క ఆత్మ విశ్వాసం ద్వారా హృదయంలో నివశిస్తూ, తెలిసిన పాపమును అధిగమించుటకు విశ్వాసికి శక్తినిస్తుంది. మరియు, యః యొక్క గొప్పతనములో విశ్వాసముంచు ప్రతివాని యెడల, రక్షకుని యొక్క నీతి అజ్ఞాన సంబంధ పాపాలను కప్పివేయుటకు ప్రమాణం చేస్తుంది.

ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే ఎలోహీం కృపావరము మన అదోనాయ్ యహూషువః మెస్సీయనందు నిత్య జీవము. (రోమా 6: 23 చూడుము). వేరేలా చెప్పాలంటే, మొదటి ఆదాము పడిపోయిన చోట యహూషువః జయించెను గనుక, యహువః ఇప్పుడు యహూషువః యొక్క బలి త్యాగంలో విశ్వాసముంచిన వారందరికీ ఆయన నీతిని ప్రకటించగలరు.

బెరయ వారివలె ఉండండి!

బైబిలుమీరు మొదటిసారి ఇటువంటి భావనను ఎదుర్కొంటున్నట్లయితే, దయచేసి చదువుతూ ఉండండి. ఒక బెరయ వానిగి ఉండండి! లూకా ఇలా చెబుతుండెను: “వీరు (బెరయవారు) థెస్సలొనీకలో ఉన్న వారికంటె ఘనులైయుండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి, పౌలును సీలయును చెప్పిన సంగతులు ఆలాగున్నవో లేవో అని ప్రతిదినమును లేఖనములు పరిశోధించుచు వచ్చిరి.” వారు ఏవిషయములోనూ అపోస్తలుల మాటను తీసుకోలేదు. అయితే, అపొస్తలులు చెప్పినవాటిని లేఖనాలతో పోల్చి చూసుకొనిరి. మనము కూడా చేయవలసినది ఇదే.

సమస్త కొత్త వెలుగు, మొదట "తప్పు" గా భావించబడవచ్చు. కానీ మన భావాలు ఎప్పుడూ మన నమ్మకాలను నిర్దేశించకూడదు. భవిష్యత్తు వ్యాసాలు మరింత లోతుగా ఈ అంశాన్ని చర్చిస్తాయి. మీరు మరింత సమాచారం కావాలనుకుంటే, దయచేసి www.worldslastchance.com ను సందర్శించండి. మరియు WLC రేడియో చిహ్నాన్ని సందర్శించండి. "Shocking new light about the incarnation" అను ఎపిసోడ్ కోసం చూడండి.

 

సంగతి వినకముందు ప్రత్యుత్తరమిచ్చువాడు తన మూఢతను బయలుపరచి సిగ్గునొందును.” (సామెతలు 18:13).