Print

8 రోజుల వారము? జూలియన్ కేలండరు చరిత్ర

ఊహలు (భావనలు) ప్రమాదకరమయినవి. అది ముఖ్యంగా మత విశ్వాసాల విషయంలో. ఒక తప్పు భావన మీద ఒక వేదాంత నమ్మకం ఆధార పడినట్లయితే, ఆ మతాచరణలో లోపం వుంటుంది. క్రైస్తవ్యంలో అత్యంత సాధారణమైన ఊహలు ఏమిటంటే, లేఖనాల యొక్క విశ్రాంతిదినము శనివారము అనియు, మరియు ఆదివారమున యహూషువః పునరుర్థానమయ్యారు అనేవి. ఈ నమ్మకాలు మరియొక ఇతర ఊహ మీద నిర్మితమైనవి: అది, ఈ ఆధునిక వారము సృష్ట్యారంభమునుండీ అంతరాయం లేకుండా కొనసాగుతూ వుండెను అనేది. అయితే, జూలియన్ కేలండరులోని వాస్తవాలు, ఈ ఊహలు తప్పని నిరూపణ చేస్తున్నవి.

జూలియన్ కేలండరు క్రీ.పూ. 45 లో స్థాపించబడినది. దీనికి ముందు గల రోమన్ రిపబ్లిక్ కేలండరు వలెనే, జూలియన్ కేలండరు ప్రారంభంలో ఎనిమిది రోజుల వారాన్ని కలగి ఉడేది! రిపబ్లికన్ మరియు ప్రారంభ జూలియన్ కేలండర్లలో వారముల యొక్క రోజులు అక్షరాలచే గుర్తించబడేవి: అవి A నుండి H వరకు. క్రీ.పూ. 63 నుండి క్రీ.శ. 37 వరకు గల ఆ కాలంలోని జూలియన్ కేలండర్లన్నియు (fasti) నేటికినీ అందుబాటులో ఉన్నాయి.

ప్రారంభ జూలియన్ కేలండరు

ఎనిమిది రోజుల వారంను ఈ రాతి శకలాల మీద స్పష్టంగా చూడవచ్చు.

 మొదటి శతాబ్దపు 8 రోజుల వారం గల జూలియన్ కేలండరు.

ఫాస్థి అంటియేట్స్ యొక్క పునర్నిర్మాణం, ఇప్పటికీ ఉనికిలో వున్న రోమన్ రిపబ్లిక్ కేలండరు.1


రోమా సామ్రాజ్యం విస్తరించిన కొలది అది రోములో అత్యంత వేగంగా ఒక మతంగా ఎదిగిన మిత్రాయిజంతో కలయికలోనికి వచ్చెను. మిత్రాయిజం గ్రహ దేవతల పేర్లను ఉపయోగించి ఒక ఏడు-రోజుల వారమును తీసుకుని వచ్చెను.

“ఆదివారము ఒక పవిత్ర దినముగా గల వారమును అన్యులు స్వీకరించుటలో, ఇరానియన్ [పర్షియన్] రహస్యాల యొక్క ప్రచార వ్యాప్తి ఎంతగానో పాత్ర వహించెను అనుటలో సందేహం లేదు. ఇతర ఆరు దినాలకు మనము ఉపయోగించు పేర్లు మిత్రాయిజం దక్షిణ రాజ్యాలలో అనుచరులను సంపాదించిన సమయంలో వాడుకలోనికి వచ్చెను. దీని విజయము, తద్వారా కలిగిన యాదృచ్చిక దృగ్విషయముల సంబంధమును నిరూపించుటలో......లేదు.” (Franz Cumont, Textes et Monumnets Figures Relatifs aux Mysteres de Mithra, Vol. I, p. 112.) 

"డైస్ సోలిస్ [సూర్యుని యొక్క దినం] కి ఔన్నత్యాన్ని/ఉన్నతస్థాయిని కేటాయించుట కూడా ఖచ్చితంగా ఆదివారం ఒక సెలవుదినంగా గుర్తింపు పొందుటకు సాధారణంగా దోహదపడింది. ఇది ఒక "మరింత ముఖ్యమైన వాస్తవం"తో సంబంధం కలిగియున్నది, అది, ఐరోపా దేశాలన్నీ ఈ వారంను స్వీకరించుట. (Franz Cumont, Astrology and Religion Among the Greeks and Romans, p. 163, emphasis supplied.)

ఆదివారము రక్షకుడు మరణము నుండి తిరిగి లేచిన దినము కాలేదు. ఎందుకంటే ఆయన దినాలలో ఉన్న ఎనిమిది రోజుల జూలియన్ వారములో ఆదివారము లేదు. ఇంకా, శనివారము లేఖనముల విశ్రాంతిదినము కాదు, ఎందుకంటే ఏడురోజుల గ్రహవారము మొదట్లో శనివారంతో మొదలయ్యేది.

టైటస్ యొక్క స్నాన వాటికలు క్రీ.శ 79-81 లో నిర్మించబడినవి. అక్కడ శాటర్న్ అనే వ్యవసాయ-దేవున్ని, వారపు మొదటి దినం యొక్క దైవముగా తేటగా చూపుతున్న ఒక కొయ్య కేలండరు కనుగొనబడెను.
 

రోమీయుల గ్రహసంబంధ స్టిక్ కేలండరు.

రోమీయుల కొయ్య కేలండరు.

డైస్ సోలీస్, లేదా Sun’s డే/ ఆది’ వారం, వారంలో రెండవ దినంగా వున్నది. లూనా, చంద్ర-దేవత, నెలవంకను తలపాగాగా ధరించియున్నది. ఇది మూడవ దినము. వీనస్ [శుక్రుడు] దినముతో వారము ముగిసేది, డైస్ వెనెరిస్, ఆధునిక శుక్రవారము, అప్పటి వారపు యేడవ దినము.

ఈ అన్య గ్రహవారము, దానిని స్వీకరించిన జూలియన్ కేలండరు వలే, బాగుచేయలేనంత అన్యజాతమైనది. లేఖనాల విశ్రాంతిదినమునుగాని, లేఖనాల మొదటి దినమునుగాని ఆధునిక కేలండరు ద్వారా కనుగొనలేము అని చారిత్రక వాస్తవాలు తెలియజేయుచున్నవి. ఒక నిర్దిష్టమైన దినమందు ఆరాధన చేయుట ముఖ్యమైనదే అయితే, ఆ దినమును లెక్కించుటకు లేఖనముల యొక్క నిజమైన కేలండరును ఉపయోగించుట కూడా ముఖ్యమైనదే.

సూర్యుని మరియు చంద్రుని వుపయోగించు, సృష్టియొక్క సూర్య-చంద్ర కేలండరు మాత్రమే, నిజమైన యేడవ దిన-సబ్బాతును మరియు రక్షకుని యొక్క సరియైన పునరుర్థాన దినమును స్థాపించే ఏకైక మార్గముగా వుంది.

"ఋతువులను తెలుపుటకై ఆయన చంద్రుని నియమించెను." కీర్తనలు 104:19.

ఋతువులు 2 : మో'ఎడిమ్ . యహువః ప్రజల యొక్క ఆరాధనా సమావేశాలు.

రక్షకుడైన యహూషువః కాలంలో ఇశ్రాయేలీయులకు రెండు కేలండర్లు అందుబాటులో వుండేవి.

  1. ఎనిమిది రోజుల వారము గల సౌర జూలియన్ కేలండరు;
  2. బైబులు యొక్క, హెబ్రీ సూర్య-చంద్ర కేలండరు: వారాల చక్రము ప్రతి న్యూమూన్ దినానికీ పునఃప్రారంభమయ్యే, ఏడు రోజుల వారమును కలిగియున్న కేలండరు.
ఇశ్రాయేలీయులు (మరియు రక్షకుడైన యహూషువః) ఏ కేలండరును వుపయోగించిరని నీవు అనుకుంటున్నావు?

సృష్టికర్త యొక్క లూని సోలార్ కేలండరు. 

నీవు ఆరాధించే దినము నీవు ఉపయోగించే కేలండరు ద్వారా తెలియజేయ బడుతుంది, అది నీవు ఎవరిని  ఆరాధిస్తున్నదీ తెలుపును.


1 పాలాజ్జో మాస్సిమో అల్లే టర్మ్, ఎడ్. అడ్రియానో లా రెజీనా, 1998.

2 "యూదుల పర్వదినములు క్రమమైన వ్యవధులలో వుంటూ ఉండుట వలన, ఈపదము దాని సమీపముదేనని గుర్తించారు…..Mo'ed [మోఎద్] అనేపదము విస్త్రుతార్ధంలో అన్నిఆరాధనా సమావేశాలను సూచించును. ఇది ప్రత్యక్షగుడారమునకు సంబంధించి వుండెను…... [యహువ] ఇశ్రాయేలియులకు తన చిత్తమును తెలియజే యుటకు విశేషమైన సమయముల యందు ప్రత్యక్షమాయెను. “ఇదియహువ యొక్క ప్రజల ఆరాధనా సమావేశాలకు సామా న్యప దము.”(చూడుము #4150, "లెక్షికల్ అయిడ్స్ టు ది ఓల్డ్ టెస్టమెంట్, "హీబ్రు-గ్రీక్ వర్డ్ స్టడీ బైబిల్, KJV.)