Print

బైబుల్ కేలండరు విధానం: క్రొత్త సంవత్సరంను లెక్కించుట

బైబిలు యొక్క క్రొత్త సంవత్సరం, నిర్గమకాండం 34:22 ఆధారంగా, వసంత విషవత్తునకు సమీపంలో ఉన్న న్యూ మూన్ ద్వారా లెక్కించబడతుందని, Wlc నమ్ముతుంది.
 

(1) క్రొత్త సంవత్సరంను గురించి బైబిలు ఏమి చెబుతుంది లేక తెలియజేస్తుంది?

నిర్గమకాండము 12 లో, యహువః మోషేకు ఇలా నిర్దేశించెను:

"నెలలలో ఈ నెల మీకు మొదటిది, యిది మీ సంవత్సరమునకు మొదటి నెల." (నిర్గమకాండము 12: 2, KJV)

సందర్భాన్ని బట్టి, ఇది వసంతకాలంలో లేదా దానికి చాలా సమీపంలో ఉందని మనకు తెలుసును, అయితే భవిష్యత్తు సంవత్సరాలలో "మొదటి నెల" ను మోషే ఎలా నిర్దేశించాడు? వసంత ఋతువు ప్రారంభమవుటను అతడు ఎలా తెలుసుకొన్నాడు? అతడు నూతన సంవత్సరాన్ని పంటలపై (అంటే బార్లీ) ఆధారపరిచాడా లేదా అతడు ఆకాశం వైపు చూసాడా? సమాధానం ఆదికాండంలో ఉంది:

"ఎలోహీం పగటిని రాత్రిని వేరుపరచునట్లు ఆకాశవిశాలమందు జ్యోతులు కలుగును గాకనియు, అవి సూచనలను నియామక కాలములను, దిన సంవత్సరములను సూచించుటకై యుండు గాకనియు, భూమిమీద వెలుగిచ్చుటకు అవి ఆకాశ విశాలమందు జ్యోతులై యుండు గాకనియు పలికెను; ఆ ప్రకారమాయెను." (ఆదికాండము 1:14-15, ISR)

"ఎలోహ పగటిని రాత్రిని వేరుపరచునట్లు ఆకాశవిశాల మందు జ్యోతులు కలుగును గాకనియు, అవి సూచనలను నియామక కాలములను, దిన సంవత్సరములను...(ఆదికాండము 1:14-15, ISR)

ఆకాశంలోని జ్యోతులు "సూచనలను, నియామక కాలములను, దినములను, సంవత్సరములను సూచించు నిమిత్తము" ఉండునని ఆదికాండము 1:14 చెబుతోంది. ఈ ప్రకరణంలో పంటలను గురించి ప్రస్తావించలేదు. బార్లీని పరిశీలించడం ద్వారా సంవత్సర ప్రారంభంను నిర్ణయించుట లేఖనాలలో ఎక్కడా చెప్పబడలేదు. ఆకాశంలోని జ్యోతుల ద్వారా క్రొత్త సంవత్సరంను గుర్తించమని లేఖనాలు తిరిగిలేకుండా ప్రకటిస్తున్నప్పుడు, బార్లీ పంట పక్వతతో క్రొత్త సంవత్సరంను సంధానం చేయుట అనేది యహువః యొక్క వాక్యానికి లేనిదానిని కలుపుటయే అవుతుంది.

మీ ఎలోహ అయిన యహువః ఇచ్చిన ఆజ్ఞలను మీ కాజ్ఞాపించుచున్నాను. వాటిని గైకొనుటయందు నేను మీ కాజ్ఞాపించిన మాటతో దేనిని కలుపకూడదు, దానిలో నుండి దేనిని తీసివేయ కూడదు. (ద్వితీయోపదేశకాండము 4:2)

నేను మీ కాజ్ఞాపించుచున్న ప్రతి మాటను అనుసరించి చేయవలెను. దానిలో నీవు ఏమియు కలుపకూడదు దానిలోనుండి ఏమియు తీసివేయకూడదు. (ద్వితీయోపదేశకాండము 12:32)

ఎలోహ మాటలన్నియు పుటము పెట్టబడినవే ఆయనను ఆశ్రయించువారికి ఆయన కేడెము. ఆయన మాటలతో ఏమియు చేర్చకుము ఆయన నిన్ను గద్దించునేమో అప్పుడు నీవు అబద్ధికుడవగుదువు. (సామెతలు 30:5,6)

పాలస్తీనా బార్లీ యొక్క పరిపక్వత క్రొత్త సంవత్సర ప్రారంభానికి సంకేతమని ప్రసిద్ధి గాంచిన సంప్రదాయం బోధిస్తున్నప్పటికీ, ఈ అభిప్రాయానికి లేఖనంలో ఒక్క చోట కూడా మద్దతు ఇవ్వబడలేదు. ("బార్లీ చట్టం" క్రొత్త సంవత్సరంను సరిగ్గా ఎందుకు తెలియజేయలేదు అనే విషయంపై మరింత తెలుసుకొనుటకు, ఈ క్రింది "అభ్యంతరాలకు సమాధానం" అనే శీర్షిక క్రింద ఉన్న విభాగాన్ని చూడండి.”)

ఇప్పుడు మనము, ఆకాశంలోని జ్యోతులు సంవత్సరాలను తెలియజేయాలని నిశ్చయంగా స్థిరపరచాము. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, "చలికాలం గడిచిపోయినది మరియు నూతన సంవత్సరంను ప్రారంభించవచ్చునని మనకు తెలియజేయడానికి పరలోకంలో ఏమి జరుగుతుంది?" దీనికి నిర్గమకాండం 34 లో చాలా ముఖ్యమైన ఆధారం దొరుకుతుంది.

“మరియు నీవు గోధుమలకోతలో ప్రథమ ఫలముల పండుగను, అనగా వారముల పండుగను, సంవత్సరాంతమందు (i.e సంవత్సర ‘అంతం’ నందు) [H8622]” పంటకూర్చు పండుగను ఆచరింపవలెను. (నిర్గమకాండము 34:22).

ఇప్పుడు, ఇక్కడ "అంతం" అని అనువదించబడిన హెబ్రీ పదాన్ని పరిశీలిద్దాం.

H8622 (tekufah/టేకుఫా) - "తిరుగుట, సమయం లేదా స్థలం యొక్క వలయం, ఒక మలుపు, వృత్తం" (బ్రౌన్-డ్రైవర్-బ్రిగ్స్ హిబ్రూ నిఘంటువు)

KJV మరియు తెలుగు బైబిల్లు నుండి వెంటనే తెలియబడకపోయినా, ఇక్కడ "అంతం" [స్ట్రాంగ్స్ డిక్షనరీ యొక్క H8622] అని అనువదించిన పదం సంవత్సరానికి మధ్యభాగంలో ఉండు ఆకురాల్చు ఋతువు యొక్క విషవత్తును (దీనినే శరత్కాల విషువత్తు అని కూడా అనవచ్చు) సూచిస్తుంది. “పర్ణశాలల పండుగ” మరియు “గుడారాల పండుగ”గా పిలువబడే “పంటకూర్చే పండుగ” ఏడవ నెలలో (అనగా సంవత్సరం మధ్యలో- లేవీయకాండము 23:34) జరుగును గానీ సంవత్సరం చివరిలో కాదు అనే వాస్తవం దీనిని దృఢపరుస్తుంది.

ఎన్సైక్లోపెడియా జుడాయికా ఈ వివరణతో అంగీకరిస్తుంది.

"చెప్పబడిన విధంగా, యూదు సంవత్సరంలోని నాలుగు కాలాలను టేకూఫాట్ [టేకూఫా యొక్క బహువచనం; H8622] అని పిలుస్తారు .. మరింత ఖచ్చితంగా, ఇది నాలుగు కాలాల్లో ప్రతి కాలానికి ఆరంభం - సాధారణ వీక్షణ ప్రకారం, ప్రారంభం అని అర్థం - అది టేకూఫా అని పిలువబడింది (వాచ్యంగా, “వలయం,” קוף నుండి נקף కు చెందిన, “తిరుగుట”), నీసాన్ నెల యొక్క టేకూఫా వసంత విషవత్ స్థానం వద్ద గల సూర్యుడిని సూచిస్తుంది, తమ్మూజ్ నెల యొక్క టేకూఫా వేసవికాలపు ఉత్తరాయణ స్థానంను, టిష్రి నెల యొక్క టేకూఫా శరదృతు విషవత్ స్థానంను, మరియు టెవెట్ నెల యొక్క టేకూఫా దక్షిణాయణ స్థానంను (శీతాకాలపు) సూచిస్తుంది. "(ఎన్సైక్లోపెడియా జుడాయికా , వ్యాసం "క్యాలెండర్", p.356)

దిగువ పేర్కొన్న అనువాదములు నిర్గమకాండము 34: 22 యొక్క మరింత ఖచ్చితమైన అనువాదాన్ని ఇస్తాయి.

“మరియు నీవు గోధుమలకోత ప్రారంభంలో వారముల పండుగను, సంవత్సరం మధ్యలో పంటకూర్చు పండుగను ఆచరింపవలెను.” (నిర్గమకాండము 34: 22, బ్రెంటన్స్ ఇంగ్లీషు సెప్టాజింట్)

“మరియు వారముల పండుగను; గోధుమల కోతలో ప్రధమ ఫలముల పండుగను, మరియు సంవత్సరపు మలుపు వద్ద పంట కూర్చు పండుగను ఆచరింప వలెను. నిర్గమకాండము.” 34: 22, YLT)

“మరియు వారముల పండుగను; గోధుమల కోతలో ప్రధమ ఫలముల పండుగను, మరియు సంవత్సరపు మలుపు వద్ద పంట కూర్చు పండుగను ఆచరింప వలెను. (నిర్గమకాండము.” 34: 22, డార్బీ బైబిలు)

ఇంతవరకు, మనము ఈ క్రింది వాటిని స్థాపించాము:
1. పంట కూర్చు పండుగ ఏడవ నెలలో పంట కోత సమయంలో ఉండును. (లేవీయకాండము 23:34).
2. పంట కూర్చు పండుగ సంవత్సరం మధ్య భాగంలో శరదృతు విషువత్తుకు సంబంధించి ఉండును.

పై వివరణ ఆధారంగా సంవత్సర ప్రారంభం వసంత విషవత్తుకు అనుసంధానించబడి ఉంటుందని అర్థమవుతుంది, ఇది శరత్కాల విషవత్తుకు ఆరు నెలల ముందు మరియు ఆరు నెలల తరువాత గాని జరుగుతుంది. శరత్కాల పండుగలు సంవత్సరం మధ్యలో శరదృతు విషవత్తునకు అనుసంధానించబడితే, అప్పుడు వసంత కాల పండుగలు సంవత్సరం ప్రారంభంలో వసంత విషవత్తుకు అనుసంధానించబడి ఉండాలి.

శరత్కాల పండుగలు నేరుగా శరదృతు విషువత్తుకు కలుపబడి ఉన్నాయని అని ఇక్కడ గమనించుట చాలా ముఖ్యం; అందువల్ల, బైబిలు ఆజ్ఞను నెరవేర్చే క్రమంలో, పంటకూర్చు పండుగ శరదృతు విషువత్తు వద్ద లేదా దానికి చాలా సమీపంలో ఉండాలి.

(1 ఎ) వసంత విషవత్తు తరువాతి మొదటి న్యూ మూన్ ద్వారా క్రొత్త సంవత్సరంను లెక్కించు విధానంతో ఇది అంగీకరిస్తుందా?

లేదు, ఎల్లప్పుడూ కాదు. ఈ విధమైన లెక్కింపును పద్ధతిని ఉపయోగించినప్పుడు, కొన్నిసార్లు, పంటకూర్చు పండుగలు శరదృతు విషువత్తు వద్ద లేదా దానికి చాలా సమీపంలో పడతాయి. అయితే, కొన్నిసార్లు, పంటకూర్చు పండుగలు శరదృతు విషువత్తుకు 5 వారాల తర్వాత పడును! (ఈ పద్దతిని ఉపయోగించినప్పుడు, వాస్తవంగా 2015 లో ఈవిధంగా జరిగింది.)

(1 బి) వసంత విషవత్తుకు అతి సమీపంగా ఉన్న న్యూ మూన్ ద్వారా క్రొత్త సంవత్సరంను లెక్కింపు విధానంతో ఇది అంగీకరిస్తుందా?

అవును, ఎల్లప్పుడూ. ఈ పద్ధతిని ఉపయోగించినప్పుడు, పంటకూర్చు పండుగలు ఎల్లప్పుడూ శరదృతు విషువత్తు వద్ద లేదా చాలా సమీపంలో వస్తాయి. బాగా ముందైతే, పండుగలు విషువత్తుకు ముందు 7-10 రోజుల ముందు వస్తాయి, తరువాత అయితే పండుగలు విషువత్తుకు సుమారు 3 వారాల తర్వాత ఉంటాయి. (ఇది వాస్తవానికి ఒక ఉదారమైన ​​అంచనా. ఈ పద్ధతిని ఉపయోగించినప్పుడు, పండుగలు విషవత్తునకు మూడు వారాల తర్వాత వచ్చినట్లు కనీసం ఒక్క సంఘటనను మేము గుర్తించలేదు.) అనగా, పండుగలు విషవత్తుకు నెల లోపులోనే ఉంటాయి.

ముగింపు:

నూతన సంవత్సర లెక్కింపు యొక్క సరియైన పద్దతిని గుర్తించుటకు లేఖనాలలో ఇవ్వబడిన ఏకైక ఖచ్చితమైన ఆధార స్థానం శరదృతు విషువత్తు. నిర్గమకాండం 34:22 చెబుతున్న పంటకూర్చు పండుగలు (ఏడవ చంద్ర నెలలో) టేకూఫా వద్ద జరుగుతాయి, ఇది సందర్భానుసారం శరదృతు విషువత్తు అవుతుంది. వసంత విషవత్తు తర్వాతి మొదటి న్యూ మూన్ ద్వారా ఎల్లప్పుడూ క్రొత్త సంవత్సరంను లెక్కించడం ద్వారా ఈ ఆదేశాన్ని స్థిరంగా ఉంచడం సాధ్యం కాదు. క్రొత్త సంవత్సరాన్ని వసంత విషవత్తుకు అతి సమీపంలో ఉన్న న్యూ మూన్ ద్వారా లెక్కించు విధానంను పరిగణనలోకి తీసుకుంటే, బైబిలు ఆదేశం నిలకడగా నిలుస్తుంది. కానీ మనము ఇక్కడితో ఆపలేము …

(2) క్రొత్త సంవత్సర లెక్కింపు విషయంలో 1 వ శతాబ్దానికి చెందిన చరిత్రకారులు ఏమి చెప్పారు?

మన రక్షకుని భూసంబంధమైన పరిచర్యకు ముందు, పరిచర్య సమయంలో, మరియు తరువాత నివసించిన ఒక హెలెనిస్టిక్ యూదు తత్వవేత్త అయిన ఫిలో, 1 వ శతాబ్దంలో బైబిలు కేలండరుకు సంబంధించిన అనేక వివరాలను నమోదు చేసియున్నాడు. క్రింది ఉల్లేఖనాల్లో, పులియని రొట్టెల పండుగలు వసంత విషవత్తుతో ముడిపడి ఉన్నాయని మరియు పంటకూర్చు పండుగలు శరదృతు విషువత్తుకు ముడిపడి ఉన్నాయని నిర్ధారించెను.

"మొదటి కాలంకు ఆయన వసంతకాలం మరియు దాని విషువత్తు అని పేరు ఇచ్చెను, ఆ సమయంలో పులియని రొట్టెల పండుగలని పిలువబడు వసంతకాల పండుగలను ఏడు దినములు ఆచరించవలెను, ఆయన ప్రకటించిన వాటన్నిటి కొరకు కేటాయించబడిన ఆచరణ క్రియలు సమానంగా గౌరవించబడాలి. ఆయన యొక్క న్యూ మూన్ నందు చేయునట్లు ప్రతిదినమున పది బలులను అర్పించవలెను, పాప పరిహారారార్ధ బలులు కాక మొత్తం డెబ్బై పూర్ణమైన దహన-బల్యర్పణలను అర్పించవలెను. అలాగే, ఏడవ నెలలో వచ్చు ఏడు రోజుల పండుగ దినాలు ఏడవ నెల యొక్క విషవత్తుతో అదే రకమైన సంబంధాన్ని కలిగి ఉండాలని ఆయన భావించెను. " (ఫిలో, స్పెషల్ లాస్ I (181-182) [కోల్ సన్స్ ట్రాన్స్లేషన్]) [గమనిక: ఫిలో, ఇక్కడ, లేఖనాలలో సూచించినట్లుగా శరదృతు విషువత్తు ఏడవ నెలలో సంభవిస్తుందని చప్పెను- నిర్గమకాండం.34: 22.]

""ఏడుకు ఆయన అనేక రోజులు పొడిగించబడిన ముఖ్య పండుగలు ఇచ్చాడు, రెండు పండుగలు, అవి రెండు విషవత్తుల కొరకు, ప్రతీదీ ఏడు రోజులు కొనసాగును, మొదటిది వసంతకాలంలో పంటల యొక్క పరిపక్వత ఉత్సవము, రెండవది శరత్కాలంలో చెట్ల యొక్క సమస్త ఫలములను కూర్చుకొను పండుగను ... "(ఫిలో, ది డెకాలాగ్ (161) [కోల్ సన్స్ ట్రాన్స్లేషన్]

"... ఇది శరత్కాల విషువత్తు సమయంలో యూదుల సాధారణ ఉత్సవంగా ఉంది, ఆ సమయంలో యూదులకు గుడారాలలో నివసించే సంప్రదాయం ఉంది." (ఫిలో, ఫ్లేకస్ XIV (116) [యాంగ్స్ అనువాదం]) [గమనిక: ఈ ఉల్లేఖనం, "పంట కూర్చుకునే పండుగ" ను సూచిస్తుంది, ఇది "పర్ణశాలల పండుగ" లేదా "గుడారాల పండుగ" అని కూడా పిలువబడుతుంది, దీనిలో ఇశ్రాయేలీయులు" ఏడు రోజులు పందిళ్ళ గుడారాలలో/ పర్ణశాలలలో నివశిస్తారు. " చూడండి, లేవీ.23: 39-42.]

1 వ శతాబ్దానికి చెందిన రోమీయ-యూదు పండితుడైన ఫ్లేవియస్ జోసెఫస్, మరో కోణంలో మన అవగాహనను నిర్ధారిస్తూ ఈ అంశంపై మరింత వెలుగును ప్రచురించాడు. పస్కా సమయంలో నక్షత్రాలకు సూర్యునికి సంబంధించిన స్థానం మీద జోసెఫస్ వ్యాఖ్యానించాడు.

" మనము నీసాన్ అని పిలిచే, జాంతికస్/ Xanthicus నెలలో, మరియు ఇది మన సంవత్సర ప్రారంభం, చంద్ర నెల యొక్క పదునాలుగవ దినాన, సూర్యుడు మేష / Aries రాశిలో ఉన్నప్పుడు (ఈ నెలలోనే మనము ఐగుప్తు దేశపు బానిసత్వం నుండి విడుదల పొందినందున) ప్రతి సంవత్సరం, నేను ముందుగా చెప్పినట్లు, మనము ఐగుప్తు నుండి బయటికి వచ్చినప్పుడు వధించినట్లు, పస్కా అని పిలువబడిన బలి పశువును వధింపవలెనని ధర్మశాస్త్రం ఆజ్ఞాపించెను.... "(ఫ్లేవియస్ జోసఫస్, జ్యూయిష్ ఆంటిక్విటీస్, పుస్తకం III, అధ్యాయం 10, పేరా 5, http://www.ccel.org/ccel/josephus/complete.ii.iv.x.html)

జోసెఫస్ యొక్క ఈ ఉత్తేజకరమైన కోట్ మీద వ్యాఖ్యానించడానికి ముందు, మనము ఈ క్రింది వాటిని అర్థం చేసుకోవడం అత్యవసరం: నక్షత్రాలకు సంబంధించిన ఖగోళ భూమధ్యరేఖ జోసెఫస్ యొక్క రోజుల్లో ఉన్నట్లు ఇప్పుడు అదే విధంగా లేదు. 1 వ శతాబ్దంలో, సూర్యుడు మేష రాశి లోనికి ప్రవేశం చేస్తున్నప్పుడు వసంత విషవత్తుని జరగి ఉండవచ్చు. అయితే, నేడు, విషువత్తు మీన రాశిలో సంభవిస్తుంది.


పైన: ఈక్వినాక్స్/ విషవత్తు, 31 క్రీ.శ - విషవత్తు తర్వాత సూర్యుని యొక్క తక్షణ మార్గంలో మేషం ఉందని గమనించండి.


పైన: ఈక్వినాక్స్/ విషవత్తు, క్రీ.శ 2013- నేడు, విషువత్తు తరువాత సూర్యుని యొక్క తక్షణ మార్గంలో మేషం లేదు గమనించండి.
 

మనము సంవత్సరం ప్రారంభంను నిర్ణయించుటకు 1 వ శతాబ్దంలో ఉపయోగించిన అదే నక్షత్ర మండలంను ఉపయోగించలేము, విషువత్తుకు సంబంధించి క్రొత్త సంవత్సరంను ఎలా లెక్కించాలో నిశ్చయంగా మనం గుర్తించగలము.

జోసెఫస్ ఉల్లేఖనంను మనం మళ్లీ చూద్దాం:

" మనము నీసాన్ అని పిలిచే, జాంతికస్/ Xanthicus నెలలో, మరియు ఇది మన సంవత్సర ప్రారంభం, చంద్ర నెల యొక్క పదునాలుగవ దినాన, సూర్యుడు మేష / Aries రాశిలో ఉన్నప్పుడు (ఈ నెలలోనే మనము ఐగుప్తు దేశపు బానిసత్వం నుండి విడుదల పొందినందున) ప్రతి సంవత్సరం, నేను ముందుగా చెప్పినట్లు, మనము ఐగుప్తు నుండి బయటికి వచ్చినప్పుడు వధించినట్లు, పస్కా అని పిలువబడిన బలి పశువును వధింపవలెనని ధర్మశాస్త్రం ఆజ్ఞాపించెను.... "(ఫ్లేవియస్ జోసఫస్, జ్యూయిష్ ఆంటిక్విటీస్, పుస్తకం III, అధ్యాయం 10, పేరా 5, http://www.ccel.org/ccel/josephus/complete.ii.iv.x.html)

సూర్యుడు మేషం రాశిలో ఉన్నప్పుడు పస్కా పండుగను ఆచరించినట్లు జోసెఫస్ ఇక్కడ స్పష్టంగా చెప్పాడు.

(2 ఎ) వసంత విషవత్తు తర్వాతి మొదటి న్యూ మూన్ తో ఎల్లప్పుడూ సంవత్సర ప్రారంభంను లెక్కించు విధానంతో జోసెఫస్ సాక్ష్యం స్థిరంగా సరిపోతుందా?

లేదు. ఒకవేళ 1 వ శతాబ్దంలో, వసంత విషువత్తు తర్వాత మొదటి నూతన చంద్రుడు (న్యూమూన్) ఎల్లప్పుడూ సంవత్సర ప్రారంభంను సూచించాలని వారు చెప్పినట్లయితే, కొన్నిసార్లు సూర్యుడు వృషభ రాశిలో ఉన్నప్పుడు పస్కాను ఆచరించవలసి వస్తుంది (మేష రాశి తరువాత చాలా దూరంలో). కొన్నిసార్లు, ఈ పధ్ధతి మేషం లో పస్కాను ఉంచుతుంది; కొన్నిసార్లు అలా జరగదు.

పైన: క్రీ.శ 31- వసంత విషువత్తు తర్వాత మొదటి న్యూ మూన్ తో క్రొత్త సంవత్సరమును ప్రారంభించినప్పుడు అది పస్కాను (అనగా చంద్ర నెల యొక్క 14 వ రోజును) మేష రాశిని బాగా దాటిపోయి వృషభ రాశిలో ఉంచెను. పస్కా సమయంలో సూర్యుడు మేష రాశిలో (1 వ శతాబ్దంలో) ఉండాలి అనే జోసెఫస్ సాక్ష్యంతో ఇది అంగీకరించడం లేదు. (గమనిక: సూర్యుని క్రింద వెంటనే ఉన్న అపారదర్శక గోళం చంద్రుడు కాదు, అది ఖగోళ సాఫ్ట్ వేర్ వలన ఏర్పడిన సూర్యుని యొక్క ప్రకాశం.)

(2 బి) వసంత విషవత్తుకు అతి సమీపంలో ఉన్న న్యూ మూన్ తో ఎల్లప్పుడూ సంవత్సర ప్రారంభంను లెక్కించు విధానంతో జోసెఫస్ సాక్ష్యం స్థిరంగా సరిపోతుందా?

అవును. 1 వ శతాబ్దంలో, వసంత విషవత్తుకు సమీపంలోని న్యూ మూన్ ద్వారా సంవత్సర ప్రారంభంను లెక్కించినప్పుడు, పస్కా మేష రాశికి సమీపంలో స్థిరంగా పడినది. ఈ పద్ధతి జోసెఫస్ సాక్ష్యంతో మరింత స్థిరంగా సరిపోతుంది.

పైన: క్రీ.శ. 31- వసంత విషువత్తుకు చాలా సమీపంలో ఉన్న న్యూ మూన్ తో క్రొత్త సంవత్సరమును ప్రారంభించినప్పుడు అది పస్కాను (అనగా చంద్ర నెల యొక్క 14 వ రోజును) జోసెఫస్ యొక్క సాక్ష్యంకు అనుగుణంగా మేష రాశిలో ఉంచెను.

ఇప్పుడు మనము యూసిబియస్ యొక్క ‘ఎక్లెసియాస్టికల్ హిస్టరీ’ నుండి చెప్పుకోదగిన వాక్యాన్ని పరిశీలిద్దాం. యూసిబియస్ రోమన్ చరిత్రకారుడు, క్రీ.శ 260 నుండి క్రీ.శ 340 వరకు జీవించెను. ఈ క్రింది భాగంలో, అతడు పస్కా పండుగను గూర్చి “ది కేనన్స్ ఆఫ్ అనటోలియస్ ఆన్ ది పస్కాల్ (పాస్ ఓవర్) ఫెస్టివల్” లోనుండి ఉదహరించాడు.

(యుసేబియస్ ఎక్లెసియేస్టికల్ హిస్టరీ, గ్రంధం 7, అధ్యాయం 32, http://www.newadvent.org/fathers/250107.htmపస్కా పండుగ రోజున, నెలలో పద్నాలుగవ దినాన నియమింపబడినట్లు, సూర్యాస్తమయంతో మొదలై, చంద్రుడు సూర్యునికి ఎదురుగా ఉన్న స్థితిని పౌర్ణమిలలో కనబడునట్లుగా;కలిగి ఉండును, మరియు సూర్యుడు వసంత విషవత్తు యొక్క విభాగంలో ఉండును మరియు శరదృతు [విషవత్తులో] చంద్రుడు అవసరమై ఉండును. ఆరిస్టోబులస్ జతచేసెను. అక్కడ రెండు విషవత్ విభాగాలు, వసంత మరియు శరదృతు విషవత్ విభాగాలు, నేరుగా ఒకదానికొకటి ఎదురెదురుగా ఉన్నట్లే, సూర్యుడు మాత్రమే విషవత్తు విభాగం గుండా ప్రయాణించుట కాదు, కానీ చంద్రుడు కూడా తప్పనిసరిగా ప్రయాణించాలని సౌర మండలం యొక్క మొదటి భాగం ద్వారా సూర్యుడు ప్రయాణిస్తున్నప్పుడు ఇది సంభవిస్తుంది, వారిలో కొందరు, రాశిచక్ర వృత్తంగా చెప్పిరి. ఇది పస్కా పండుగకు ఆవశ్యకమై ఉంది, మొదటి నెల మధ్యభాగంలో గల వసంత విషువత్తు తర్వాత పస్కా బలులను అందరూ ఒకేలా వధించాలని చెప్పారు. ఇంకా పురాతనమైన వారైన, అగాథోబులి, 'మాస్టర్స్' ఇంటిపేరు గల ఇద్దరు నుండి మరియు ప్రసిద్ధ అరిస్టోబులస్ (ఇతడు పవిత్ర మరియు దైవ హీబ్రూ లేఖనాల యొక్క డెబ్భై మంది వ్యాఖ్యాతల నుండి టోలెమి ఫిలడెల్ఫస్ మరియు అతని తండ్రి ద్వారా ఎన్నుకోబడెను మరియు ఇతడు మోషే ధర్మశాస్త్రంపై తన సవివరమైన పుస్తకాలను కూడా అదే రాజులకు అంకితం చేశాడు) నుండి దీనిని నేర్చుకోవచ్చును. ఈ రచయితలందరూ, నిర్గమకాండానికి సంబంధించి ప్రశ్నలను వివరిస్తూ, "ఇది మన స్వంత అభిప్రాయం కాదు, అయితే అది ప్రాచీనకాల యూదులకు, క్రీస్తుకు ముందు కూడా బాగా తెలిసి యున్నది, మరియు వారి ద్వారా జాగ్రత్తగా ఆచరించబడినది. దీనిని ఫిలో, జోసెఫస్, మరియు ముస్యుస్ లు చెప్పినదాని నుండి నేర్చుకోవచ్చును, మరియు వారి ద్వారానే కాక, వారికంటే)

ఈ ఉల్లేఖనం నుండి, మనము ఈ క్రింది విధంగా చెప్పవచ్చు:

1. పస్కా పండుగ వసంత విషువత్తుకు ముందుగా రాదు:
“. . . . మొదటి నెల మధ్యభాగంలో వసంత విషువత్తు తర్వాత పస్కా బలులను అందరూ ఒకేలా వధించాలి"
2. పౌర్ణమి తప్పనిసరిగా విషువత్తుకు తరువాత సంభవించును:

“ఇది పస్కా పండుగకు ఆవశ్యకమై ఉంది, సూర్యుడు మాత్రమే విషవత్తు విభాగం గుండా ప్రయాణించుట కాదు, కానీ చంద్రుడు కూడా తప్పనిసరిగా ప్రయాణించాలని ఆరిస్టోబులస్ జతచేసెను. అక్కడ రెండు విషవత్ విభాగాలు, వసంత మరియు శరదృతు విషవత్ విభాగాలు, నేరుగా ఒకదానికొకటి ఎదురెదురుగా ఉన్నట్లే, పస్కా పండుగ రోజున, నెలలో పద్నాలుగవ దినాన నియమింపబడినట్లు, సూర్యాస్తమయంతో మొదలై, చంద్రుడు సూర్యునికి ఎదురుగా ఉన్న స్థితిని పౌర్ణమిలలో కనబడునట్లుగా; కలిగి ఉండును, మరియు సూర్యుడు వసంత విషవత్తు యొక్క విభాగంలో ఉండును మరియు శరదృతు [విషవత్తులో] చంద్రుడు ఆవశ్యకతగా ఉండును.

ఒక విధంగా, ఇవి పూర్తిగా రెండు క్రొత్త సూత్రాల లాగా కనబడవచ్చు. ఈ ఉల్లేఖనాలను నిశితంగా పరిశీలిస్తే, ఇది వాస్తవానికి ఈ అంశంపై మనము ఇప్పటికే నేర్చుకున్నది మరింత ఖచ్చితమైన మార్గం అని వెల్లడిస్తుండెను, అనగా వసంత విషవత్తుకు అతి సమీపంలో ఉన్న న్యూ మూన్ దినముతో సంవత్సరం ప్రారంభమవునని వెల్లడిస్తుండెను. ఇక్కడ ప్రాధమిక దృష్టి పౌర్ణమి మీద ఉండాలి, ఇది ఖచ్చితంగా పస్కా మరియు పులియని రొట్టెల పండుగలతో ముడిపడి ఉంది. పౌర్ణమి చంద్ర నెలలో ఆధార ఉపస్థంభమై ఉన్నది; అది చంద్ర చక్రపు మధ్యభాగంను చూపుతుంది. ఒకవేళ పౌర్ణమి (చంద్ర చక్రం మధ్యలో) వసంత విషవత్తుకు కొంచెము ముందు వచ్చినా కూడా, ఆ తరువాతి న్యూ మూన్ దినము నిజానికి విషువత్తుకు దగ్గరగా ఉంటుంది. ప్రతి న్యూ మూన్ దినము మరియు విషువత్తునకు మధ్య రోజుల సంఖ్య లెక్కింపు అంత సులభం కాదు, ఎందుకంటే దినములు చంద్ర చక్రపు మధ్యభాగాన్ని ఖచ్చితంగా సూచించనందున. అంటే, చంద్ర నెలలో నిజమైన మధ్యభాగం (అంటే పౌర్ణమి) ఎల్లప్పుడూ నెలలో 14 వ రోజులో సంభవించదు; అలాగే ఇది ఎల్లప్పుడూ నెల 15 వ రోజులోను జరగదు. (నిజానికి, చంద్రుని నెల యొక్క 16 వ రోజు వరకు గాని చంద్రుడు 100% పూర్తి కానటువంటి అరుదైన సందర్భాలు కూడా ఉన్నాయి. మరింత వివరణకై ఇక్కడ క్లిక్ చేయండి). ప్రతి న్యూ మూన్ దినానికి మరియు విషువత్తుకి మధ్యగల రోజుల సంఖ్యను లెక్కించినట్లయితే మనము కొన్నిసార్లు తప్పులు చేస్తాము. పస్కా (చంద్ర నెలలో 14 వ రోజు) మరియు పౌర్ణమి రెండును విషువత్తు తర్వాత రావలెను అనేది నిజమైన పరీక్ష అని నిర్ధారించుకోండి. అరిస్టోబులస్ పేర్కొన్నప్పుడు సరిగ్గా చెప్పిన వివరణను క్రింద చూడుము.

“ఇది పస్కా పండుగకు ఆవశ్యకమై ఉంది, సూర్యుడు మాత్రమే విషవత్తు విభాగం గుండా ప్రయాణించుట కాదు, కానీ చంద్రుడు కూడా తప్పనిసరిగా ప్రయాణించాలని ఆరిస్టోబులస్ జతచేసెను. అక్కడ రెండు విషవత్ విభాగాలు, వసంత మరియు శరదృతు విషవత్ విభాగాలు, నేరుగా ఒకదానికొకటి ఎదురెదురుగా ఉన్నట్లే, పస్కా పండుగ రోజున, నెలలో పద్నాలుగవ దినాన నియమింపబడినట్లు, సూర్యాస్తమయంతో మొదలై, చంద్రుడు సూర్యునికి ఎదురుగా ఉన్న స్థితిని కలిగి ఉండును, పౌర్ణమిలలో కనబడునట్లుగా; మరియు సూర్యుడు వసంత విషవత్తు యొక్క విభాగంలో ఉండును మరియు శరదృతు [విషవత్తులో] చంద్రుడు ఆవశ్యకతగా ఉండును.

పైన: ఇది విషువత్తు తర్వాత మొదటి పౌర్ణమి వద్ద ఏమి జరుగుతుంది అనే దానికి ఒక ఉదాహరణ. ఆకుపచ్చ వృత్తం సూర్యుని మరియు చంద్రుని యొక్క అపసవ్య దిశను సూచిస్తుంది. సూర్యుడు మరియు చంద్రుడు రెండూ ఖగోళ భూమధ్యరేఖను (ఎర్ర గీత ద్వారా ప్రాతినిధ్యం వహించబడిన) దాటెను మరియు "విషవత్తు స్థానాలవద్ద" ఒకదానికొకటి ఎదురుగా ఉన్న స్థితిలో ఉండెను, యూసేబియాస్ ప్రకారం, అరిస్టోబులస్ వివరించినట్లుగా వసంత విషవత్ వద్ద సూర్యుడు మరియు శరదృతువు విషువత్ లో చంద్రుడు ఉండెను.

ఇది చాలా అద్భుతంగా ఉంది! వసంత విషువత్తుకు అతి సమీపంలో ఉన్న న్యూ మూన్ ద్వారా మనము నూతన సంవత్సరాన్ని లెక్కించు విధానంను పరిగణనలోకి తీసుకుంటే, సరిగ్గా వివరించినట్లుగా పస్కాను మరియు పౌర్ణమిని విషవత్తు తరువాత ఉంచడం జరుగుతుంది, యుసేబియస్ గ్రంథస్థం చేసిన కేలండరు వివరాలకు ఇది అనుగుణంగా ఉంటుంది. (విషువత్తు తర్వాతి న్యూ మూన్ ఎల్లప్పుడూ క్రొత్త సంవత్సరాన్ని ప్రారంభించినట్లైతే, మొదటి నెల యొక్క పౌర్ణమికి ముందు వసంత విషవత్తు ఉండవలసిన అవసరాన్ని గురించి అరిస్టోబులస్ చేసిన ప్రకటన తక్కువ అర్ధమవుతుంది. దీని అవసరం ఉండదు. వసంత విషవత్తు తర్వాతి న్యూ మూన్ దినము ఎల్లప్పుడూ సంవత్సరాన్ని ప్రారంభించినట్లయితే, మొదటి నెలలో పౌర్ణమి సహజంగా విషవత్తు తర్వాత వారాల తరువాత పడితుంది. ఈ ప్రమాణాల గురించి వ్యాఖ్యానించుట అవసరమని అరిస్టోబులస్ ఆలోచించుటలో గల వాస్తవం, మొదటి నెల యొక్క పౌర్ణమి కొన్ని సార్లు వసంత విషవత్తుకు దగ్గరలో పడవచ్చునని సూచిస్తుంది.)

గమనిక: బైబిల్ క్యాలెండర్ సూత్రాలతో యూసేబియస్ యొక్క వ్యాఖ్యానం అనుకూలంగా ఉండుటతో పాటుగా, పస్కా ఎల్లప్పుడూ విషువత్తుకు తరువాత వచ్చును అనేది చాలా తార్కికమైనదని స్థిరపరుస్తుంది, దీనిలో ప్రతి సౌర సంవత్సరంకు ఒకే ఒక పస్కా మాత్రమే వచ్చునని హామీ ఇవ్వబడుతుంది.

(2సి) వసంత విషవత్తు తర్వాతి మొదటి న్యూ మూన్ ద్వారా క్రొత్త సంవత్సరంను లెక్కించు విధానంతో చారిత్రక చిట్టా ఏకీభవిస్తుందా?

లేదు. వసంత విషవత్తు తర్వాత మొదటి న్యూ మూన్ ద్వారా క్రొత్త సంవత్సరం లెక్కింపు:

(2డి) వసంత విషవత్తుకు అతి సమీపంలో ఉన్న న్యూ మూన్ ద్వారా క్రొత్త సంవత్సరంను లెక్కించు విధానంతో చారిత్రక చిట్టా ఏకీభవిస్తుందా?

అవును. వసంత విషవత్తుకు అతి సమీపంలో ఉన్న న్యూ మూన్ ద్వారా క్రొత్త సంవత్సరంను లెక్కించు విధానం (ఇది సరిగ్గా వర్ణించబడినది మరియు ఇది ఎల్లప్పుడూ పౌర్ణమిని మరియు పస్కాను విషువత్తు తర్వాత ఉంచుతుంది) ఫిలో, జోసెఫస్, మరియు యుసేబియస్ యొక్క సాక్ష్యాలతో సరిపోతుంది.

ముగింపు:

ప్రారంభ చరిత్రకారుల సాక్ష్యం సూచిస్తున్నదేమిటి అంటే వసంత విషవత్తుకు అతి సమీపంలో ఉన్న న్యూ మూన్ ద్వారా క్రొత్త సంవత్సరం లెక్కించబడుతుంది (ఇది సరిగ్గా వర్ణించబడినది మరియు ఇది ఎల్లప్పుడూ పౌర్ణమిని మరియు పస్కాను విషువత్తు తర్వాత ఉంచుతుంది). క్రొత్త సంవత్సరంను విషువత్తు తరువాత వచ్చు మొదటి న్యూ మూన్ పద్దతిలో లెక్కించుటకు కట్టుబడి ఉన్నవారు, ఫిలో మరియు జోసెఫస్ యొక్క సాక్ష్యాలతో సామరస్యంను కలిగియుండలేరు.

(3) సూర్యుడు, చంద్రుడు మరియు నక్షత్రములు సమయంను సూచించుటకు ఉపయోగించబడునని లేఖనాలు తెలియజేస్తుండెను. (ఆది.1:14-16)

(3ఎ) వసంత విషవత్తు తరువాతి మొదటి న్యూ మూన్ ద్వారా క్రొత్త సంవత్సరంను లెక్కించు విధానంలో ఈ మూడూ పరిగణనలోకి తీసుకోబడతాయా (సూర్యుడు, చంద్రుడు మరియు నక్షత్రములు)?

లేదు. ఈ విధమైన లెక్కింపు పద్ధతిని పట్టుకొని వ్రేలాడుతూ ఉండువారు మొదటి శతాబ్దపు పస్కాతో నక్షత్రాలు ఏ విధంగా సంబంధం కలిగి ఉన్నాయో అనే (అంటే మేష రాశి యొక్క సూచన) జోసెఫస్ సాక్ష్యంను ఖచ్చితంగా నిర్లక్ష్యం చేయాలి.

(3బి) వసంత విషవత్తుకు అతి సమీపంలో ఉన్న న్యూ మూన్ ద్వారా క్రొత్త సంవత్సరంను లెక్కించు విధానంలో ఈ మూడూ పరిగణనలోకి తీసుకోబడతాయా (సూర్యుడు, చంద్రుడు మరియు నక్షత్రములు)?

అవును. ఈ పద్ధతి మొదటి శతాబ్దపు పస్కాతో నక్షత్రాలు ఏ విధంగా సంబంధం కలిగి ఉన్నాయో అనే (అంటే మేష రాశి యొక్క సూచన) జోసెఫస్ సాక్ష్యంకు అనుగుణంగా ఉంది.

గమనిక: జోసెఫస్ కాలం నుండి నక్షత్రాలు సంబంధించి సూర్యుని యొక్క పురోగతి మారిప్పటికీ, సంవత్సరం ప్రారంభంను నిర్ధారించు విషయంలో మనము ఇంకా నక్షత్రాలను ఉపయోగించుకోవచ్చు. పస్కా పండుగ సమయంలో సూర్యుడు మేష రాశిని చేరుకునే అరుదైన సందర్భాలు సాధ్యమయ్యే అవకాశం ఉన్నప్పటికీ, నేడు చాలా తరచుగా/ ఎక్కువగా సూర్యుడు పస్కా సమయంలో మీన రాశిలో ఉంటుండెను. నేడు సూర్యుడు వసంత విషువత్తు సంభవించు సమయంలో మీన రాశిలోను, మరియు శరదృతు విషవత్తు సంభవించు సమయంలో కన్య రాశిలోను ఎల్లప్పుడూ ఉంటుండెను.

ముగింపు:

వసంత విషవత్తుకు అతి సమీపంలో ఉన్న న్యూ మూన్ ద్వారా క్రొత్త సంవత్సరంను లెక్కించు విధానం లేఖనానికి అనుగుణంగా ఉంటుంది, మరియు మొదటి శతాబ్దపు పస్కాతో నక్షత్రాలు ఏ విధంగా సంబంధం కలిగి ఉన్నాయో అనే (అంటే మేష రాశి యొక్క నక్షత్ర మండలట) చారిత్రక అభిప్రాయానికి అనుగుణంగా ఉంది.

(4) మెటానిక్ చక్రం ప్రకారం, 19 ఏళ్ల చక్రంలో ఏడు అధిక మాసాల (ఎంబోలిస్మిక్) సంవత్సరాలు ఉంటాయి: 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19

(4ఎ) వసంత విషవత్తుకు అతి సమీపంలో ఉన్న న్యూ మూన్ ద్వారా క్రొత్త సంవత్సరంను లెక్కించు విధానంలో మెటానిక్ చక్రం కనబడుతుందా?

అవును. ఇది కేవలం మన సృష్టికర్త యొక్క అద్భుత రూపకల్పనకు రుజువు. మెటానిక్ చక్రం యొక్క స్థాపన కేలండరు లెక్కింపు యొక్క ఏ ప్రత్యేక పద్ధతిని రుజువు చేయదు, కానీ దీనిని అధ్యయనం చేయడం విలువైనది, ఎందుకంటే ఇది ఎంబోలిస్మిక్ (అధిక మాసాల) సంవత్సరాల యొక్క గొప్ప పథకంలో మనము ఎక్కడ ఉన్నామో మనకు చూపిస్తుంది. (చూడండి మెటానిక్ సైకిల్ చార్ట్.)

(5) 2014 లో మొత్తం రెండు చంద్ర గ్రహణాలు (తరచుగా "రక్త వర్ణ చంద్రులు" అని పిలుస్తారు) మరియు 2015 లో మొత్తం రెండు చంద్ర గ్రహణాలు (అన్ని కలిసి 4; ఒక "టెట్రాడ్") ఉండబోవుచున్నవి. ఈ చాలా అరుదైన సంఘటన నూతన సంవత్సరంను నిర్ణయించు/ లెక్కించు విధానంను సరిచేసుకొనమని యహువః యొక్క విశ్వాసులకు సూచించే సంకేతంగా ఉందా?

లేఖనాలు ఆకాశంలోని జ్యోతులకు అద్భుత ప్రాముఖ్యతనివ్వడంతో, ఈ గ్రహణాలు వాస్తవానికి, దైవిక గుర్తు అని నిర్ధారించుట అసమంజసమైనది కాదు, మరియు అవి వార్షిక పండుగలతో కలసి వచ్చుట వాటికవే వచ్చునవి కాదు.

నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించియున్నాడు వాటికన్నిటికి పేర్లు పెట్టుచున్నాడు. మన అదోనాయ్ గొప్పవాడు ఆయన అధిక శక్తిగలవాడు ఆయన జ్ఞానమునకు మితిలేదు. (కీర్తనల గ్రంథము 147:4,5).

మీకన్నులు పైకెత్తి చూడుడి వీటిని ఎవడు సృజించెను? వీటి లెక్కచొప్పున వీటి సమూహములను బయలు దేరజేసి వీటన్నిటికిని పేరులు పెట్టి పిలుచువాడే గదా. తన అధిక శక్తిచేతను తనకు కలిగియున్న బలాతిశయము చేతను ఆయన యొక్కటి యైనను విడిచిపెట్టడు. (యెషయా గ్రంథము 40:26)

(5 ఎ) వసంత విషవత్తుకు తరువాతి మొదటి న్యూ మూన్ ద్వారా క్రొత్త సంవత్సరంను లెక్కించినప్పుడు ఈ రెండు సంవత్సరాలలోను, ఈ గ్రహణాలు పులియని రొట్టెల పండుగల యొక్క మొదటి దినముతోను మరియు పర్ణశాలల పండుగల యొక్క మొదటి దినముతోను కలిసి సంభవిస్తాయా?

కాదు. అవి 2014 లో జరిగే పండుగలతో మాత్రమే కలిసి ఉంటారు. 2015 లో పండుగల కంటే ఒక నెల తరువాత వస్తాయి.

(5 బి) వసంత విషవత్తుకు అతి సమీపంలో ఉన్న న్యూ మూన్ ద్వారా క్రొత్త సంవత్సరంను లెక్కించినప్పుడు ఈ రెండు సంవత్సరాలలోను, ఈ గ్రహణాలు పులియని రొట్టెల పండుగల యొక్క మొదటి దినముతోను మరియు పర్ణశాలల పండుగల యొక్క మొదటి దినముతోను కలిసి సంభవిస్తాయా?

అవును. అవి రెండు సంవత్సరాలలోను (2014 & 2015) పండుగలతో కలిసి వస్తాయి.

ముగింపు:

ఈ చివరి దినాలలో ఆకాశంలో జరుగుతున్న సంకేతాలను విస్మరించుట అనేది యహువః విశ్వాసుల యొక్క బాధ్యతా రాహిత్యమే అవుతుంది. సృష్టిలో ప్రతి దానిని నియంత్రించేది మరియు ఏర్పాటు చేసేది యహువః యొక్క హస్తం మాత్రమే. ఈ చివరి క్షణాలలో, యహువః యొక్క విశ్వాసులు తప్పనిసరిగా ఆకాశంలో జరిగే అన్ని దృగ్విషయాలపై ముఖ్యంగా జాగ్రత్త కలిగియుండాలి, మరియు గమనించాలి.

పైన ఆకాశమందు మహత్కార్యములను క్రింద భూమిమీద సూచక క్రియలను రక్తమును, అగ్నిని, పొగ ఆవిరిని కలుగజేసెదను. అదోనాయ్ ప్రత్యక్షమగు ఆ మహాదినము రాకమునుపు సూర్యుడు చీకటిగాను చంద్రుడు రక్తముగాను మారును. (అపొస్తలుల కార్యములు 2:19,20).

గమనిక: వసంత విషవత్తుకు అతి సమీపంలో ఉన్న న్యూ మూన్ ద్వారా క్రొత్త సంవత్సరంను లెక్కించు విధానానికి ఇది తప్పనిసరిగా సాక్ష్యం కావాలని లేదు, ఎందుకంటే గతంలోను చంద్ర గ్రహణాల యొక్క (గతంలో 1967-1968) టెట్రాడ్లు ఉన్నాయి, అవి ఈ లెక్కింపు విధానమును ఉపయోగించినప్పుడు పండుగలతో కలిసి రాలేదు, అయితే ఈ దృగ్విషయాన్ని గమనించుట చాలా ఆసక్తికరంగా ఉంటుంది.

బైబిలు యొక్క క్రొత్త సంవత్సరం, నిర్గమకాండం 34:22 ఆధారంగా, వసంత విషవత్తునకు సమీపంలో ఉన్న న్యూ మూన్ ద్వారా లెక్కించబడతుందని, Wlc నమ్ముతుంది. ఈ విషయముపై ఇవ్వబడిన చారిత్రక వ్యాఖ్యానం కేవలం లేఖనాల ఆధారంగా చెప్పబడినది మాత్రమే.


 
అభ్యంతరాలకు సమాధానాలు (విస్తరించుటకు క్లిక్ చేయండి).

(1) ప్రశ్న / అభ్యంతరం: వసంత విషవత్ కు అతి సమీపంలో గల న్యూ మూన్ దినము క్రొత్త సంవత్సరం యొక్క నిజమైన సూచిక అయినట్లయితే, ఏ న్యూ మూన్ దగ్గరగా ఉంది అనేది ముందుగా ఎలా తెలుస్తుంది? పూరాతన ఇశ్రాయేలీయులు దీనిని ఎలా కనుగొనేవారు?

 

జవాబు: ఇవి చాలా మంచి ప్రశ్నలు. పస్కా పండుగను ఎప్పుడు ఆచరించాలి అనేది విశ్వాసం కలిగిన ఇశ్రాయేలీయులకు ముందుగానే బాగా తెలిసివుండాలి. పస్కా వసంత విషవత్ కి చాలా దగ్గరలో ఉన్నప్పుడు (ఉదా. ఆ రోజు తర్వాత), యెరూషలేము వెలుపల నివసిస్తున్న ఇశ్రాయేలీయులు విషువత్ సంభవించే సమయానికి ముందే వారి ప్రయాణాన్ని ప్రారంభించాలి. న్యూ మూన్లకు సంబంధించి సంవత్సరం ప్రారంభంను స్పష్టంగా ప్రకటించగల వసంత విషవత్ ఎప్పుడు సంభవించునో అనే దానిని ఇశ్రాయేలీయులు ముందుగా ఎలా గ్రహించి యుండిరో ఇప్పుడు మనకు స్పష్టంగా తెలియదు . అయితే ఒక విషయం చాలా ఖచ్చితమైనది: ప్రాచీన ఇశ్రాయేలీయులకు ఖగోళానికి సంబంధించి అద్భుతమైన అవగాహన ఉంది. మనము, నేడు, అందుబాటులో ఉన్న సమస్త సాంకేతికతతో సగటు ఇశ్రాయేలీయుని సాధారణ జ్ఞానం ఏమిటో అనే దానిని మాత్రమే సమీపించగలుగుతున్నాము.

 

నేటి, మన అజ్ఞానం తిరుగుబాటు మరియు అవిధేయత ద్వారా వచ్చిన జ్ఞానం యొక్క నష్టానికి ఋజువు తప్ప ఏమీ కాదు. పూర్వీకులవలె ఖగోళం యొక్క జ్ఞానాన్ని అర్థం చేసుకోవటంలో గల మన అసమర్థత, బైబిల్ సంవత్సరం వసంత విషవత్తుకు దగ్గరగా ఉన్న న్యూ మూన్ నుండి మొదలవును అని తెలియజేసే అసంఖ్యాకమైన సాక్ష్యాలను ఏవిధంగానూ నిరాకరించలేదు.

 

బహుశా, వసంత విషవత్తు ఎప్పుడు వచ్చునో కనుగొనుటకు వారు శరత్కాల విషువత్తు2 [ఆకురాల్చు కాలపు విషువత్తు] నుండి 180 రోజులు లెక్కించి, ఆ తరువాత దానికి సంబంధించిన న్యూ మూన్లు ఎప్పుడు పడును అనేదానిని లెక్కించియుండవచ్చు. ఉదాహరణకు, శరత్కాల విషువత్తు పర్ణశాలల పండుగలోని మొదటి రోజున (7 వ చాంద్రమానపు 15 వ తేదీన) సంభవించినట్లయితే, అప్పుడు వారు ఈ క్రింది సమీకరణాన్ని వెంబడించి యుందురు:

  • 180 రోజులు = శరత్కాల విషువత్తు నుండి వసంత విషవత్తు వరకు సుమారుగా గల రోజులు సంఖ్య
  • 180 - 15 రోజులు (7 వ నెలలో సుమారుగా మిగిలిన రోజులు) = 165. వసంత విషువత్తు వరకు 165 రోజులు మిగిలి ఉన్నాయి (8 వ నెల న్యూ మూన్ వరకు).
  • 165 రోజులు - 29.5 (చంద్ర నెలలో సుమారుగా గల రోజులు) = 135.5 రోజులు వసంత విషవత్తు వరకు, 9 వ నెల న్యూ మూన్ దినం వరకు మిగిలి ఉన్నాయి.
  • 135.5 రోజులు - 29.5 (చంద్ర నెలలో సుమారుగా గల రోజులు) = 106 రోజులు, వసంత విషువత్తు వరకు, 10 వ నెలలో న్యూ మూన్ వరకు మిగిలి ఉన్నాయి.
  • 106 రోజులు - 29.5 (చంద్ర నెలలో సుమారుగా గల రోజులు) = 76.5 రోజులు, వసంత విషవత్తు వరకు, 11 వ నెలలో న్యూ మూన్ వరకు మిగిలి ఉన్నాయి.
  • 76.5 రోజులు - 29.5 (చంద్ర నెలలో సుమారుగా గల రోజులు) = 47 రోజులు, వసంత విషువత్తు వరకు, 12 వ నెల న్యూ మూన్ రోజు వరకు మిగిలివున్నాయి.
  • 47 రోజులు - 29.5 (చంద్ర నెలలో సుమారుగా గల రోజులు) = 17.5 రోజులు వసంత విషువత్తు వరకు, తరువాతి నెలలో న్యూ మూన్ దినము వరకు మిగిలివున్నాయి.
  • 17.5 రోజులు 14.77 కంటే ఎక్కువ, ఇది చంద్ర నెలలోని దినాలకు దాదాపుగా సంఖ్యలో సగం ఉండుట వలన ఇది 13 వ నెలయై ఉండును మరియు తరువాతి న్యూ మూన్ దినము (వసంత విషవత్తుకు 12 రోజుల తర్వాత) క్రొత్త సంవత్సరంగా ఉండును.

గమనిక: 19 సంవత్సరాల నమూనా (మెటానిక్ సైకిల్) లోని ప్రస్తుత స్థితి ఖచ్చితత్వంతో స్థాపించబడిన తర్వాత, భవిష్యత్తు సంవత్సరాలలోని నెలలు (మరియు ఆవిధంగా ప్రతి సంవత్సరంలోని మొదటి నెల) ముందుగానే బాగా తెలియును.


ఈ పద్ధతిలో గణితాన్ని చేయడం వలన మాత్రమే ఖచ్చితంగా సంవత్సరం ప్రారంభంను (వసంత విషవత్తు చంద్రుని నెల మధ్యలో పూర్తిగా పౌర్ణమికి సమీపంగా ఉండే క్రొత్త సంవత్సర ప్రారంభంను) ఊహించి యుండకపోవచ్చును, కానీ, మళ్ళీ, ఖగోళానికి సంబంధించిన వారి జ్ఞానం తిరిగిలేకుండా మనకంటే ఉన్నతమైనది. ఇక్కడ మళ్ళీ, పూర్వీకులవలె ఖగోళం యొక్క జ్ఞానాన్ని అర్థం చేసుకోవటంలో గల మన అసమర్థత, బైబిల్ సంవత్సరం వసంత విషవత్తుకు దగ్గరగా ఉన్న న్యూ మూన్ నుండి మొదలవును అని తెలియజేసే అసంఖ్యాకమైన సాక్ష్యాలను ఏ విధంగానూ నిరాకరించలేదు అనేది పునరావృతమవుతుంది.


 

(2) ప్రశ్న / అభ్యంతరం: వసంత విషవత్తు యొక్క "ప్రారంభం" సంవత్సరానికి మొదటి నెల అని ఫిలో పేర్కొనెను. వసంత విషవత్తు తర్వాతి న్యూమూన్ క్రొత్త సంవత్సరంను ప్రారంభించును అని ఇది సూచించుటలేదా?

 

"మోషే సంవత్సరం యొక్క మొదటి నెలను వసంత విషవత్తు ప్రారంభంలో ఉంచెను, ప్రధాన గౌరవం ఆరోపించెను, కొందరు సమయానికి సంబంధించి సంవత్సరం యొక్క కాలానుగుణ విప్లవాలకు చేయునట్లు కాకుండా, మానవుని మీద ప్రకాశించుటకు కలిగించిన ప్రకృతి యొక్క ఆశీర్వాదాలు మరియు సౌందర్యాల మీద ఇదీ ఆధారపడును . . . ఈ నెలలో, నెలలోని పదునాలుగవ రోజున, చంద్రుని రూపము పూర్ణముగా మారునప్పుడు పస్కా, పవిత్ర సార్వత్రిక పండుగను జరుపుకుంటారు. . . "(Philo, On The Life Of Moses II, Section XLI (222-224), http://www.earlychristianwritings.com/yonge/book25.html)


జవాబు: ఇది ఒక అద్భుతమైన ప్రశ్న. (WLC వాస్తవానికి మొదట్లో అదే విధంగా ఈ వ్యాఖ్యానాన్ని తప్పుగా వివరించింది.) మొదటి చూపులో, సంవత్సరం యొక్క మొదటి చాంద్రమాసం వసంత విషవత్తుతో మొదలవునని ఫిలో మాట్లాడుతున్నట్లుగా కనిపిస్తుంది. అయితే, ఫిలో, ఇక్కడ, చంద్ర నెలలను గూర్చి చెప్పుటలేదు; ఎందుకంటే; చంద్ర చక్రానికి విషువత్తు ఎప్పుడు సంభవిస్తుంది అనేదానితో సంబంధం ఉండదు, మరియు తత్ఫలితంగా, న్యూ మూన్ వసంత విషవత్తుతో ఎల్లప్పుడూ కలిసి ఉండదు. ఫిలో, ఇక్కడ, స్పష్టంగా సౌర నెలలను సూచిస్తుండెను, చంద్ర నెలలు కాదు. రాశిచక్రంలోని సూర్యుని స్థానాన్ని బట్టి ఒక సౌర నెల నిర్ణయించబడుతుంది; మొదటి సౌర నెల వసంత విషవత్తుతో ప్రారంభమవుతుంది. ఫిలో కాలంలో, మొదటి సౌర నెల మేషం(జోసెఫస్ చే సూచించినట్లుగా), తర్వాత వృషభ, మిధున మొదలైనవి ఉండెను. ప్రతి సౌర సంవత్సరం యొక్క మొదటి సౌర నెల వసంత విషవత్తుతో ప్రారంభమవుతుంది.

 

తరువాత ఈ పాసేజ్ లో, ఈ నెలలో పద్నాలుగవ రోజున…. "పస్కా పండుగ జరుపుకుంటారు" అని ఫిలో చెప్పెను. ఇక్కడ ఫిలో స్పష్టంగా మొట్టమొదటి చంద్ర నెలను సూచిస్తుండెను. కలిసి చూసినప్పుడు, మనము జోసేఫస్ నుండి ముందుగా నేర్చుకున్నది ఏమిటో దానినే ఫిలో పునఃప్రసారం చేస్తున్నాడని మనము చూస్తాము: పస్కా మొదటి సౌర నెలలో (మొదటి చాంద్రమానం యొక్క 14 వ రోజున) ఆచరించబడెను (సూర్యుడు మేషం లో ఉన్నప్పుడు). వసంత విషవత్తు తర్వాతి మొదటి న్యూ మూన్ ద్వారా నూతన సంవత్సరం లెక్కింపును గురించి ఈ ప్రకటన ఏదీ చెప్పదు.

 

(3) ప్రశ్న / అభ్యంతరం: "వసంత విషవత్తు నుండి" నెలలు లెక్కించబడతాయని ఫిలో చెబుతుంది. సంవత్సరాన్ని ప్రారంభించే వసంత విషవత్తు తర్వాత కొత్త మూన్ అని ఇది సూచిస్తోందా?

 

"(లేఖనం ) వసంత విషవత్తు నుండి నెలల చక్రాన్ని లెక్కించుటను సరైనదని భావిస్తుంది. అంతేకాక, (ఈ నెల) 'మొదటి' మరియు 'ప్రారంభ' నెల అని చెప్పబడింది, ఎందుకంటే ఈ (పదాలు) ఒకదానితో ఒకటి వివరించబడెను, ఎందుకంటే ఇది క్రమంలోను మరియు శక్తిలోను మొదటిదిగా చెప్పబడింది, అదేవిధంగా వసంత విషవత్తు నుండి ప్రారంభమయ్యే సమయం క్రమానికి మరియు శక్తికి ప్రారంభముగా కనబడుతుంది. మరియు ఖగోళ శాస్త్రంలో పండితులైన వారు ముందు చెప్పబడిన కాలానికి ఈ పేరును ఇచ్చారు. వారు మేషరాశిని రాశిచక్రం యొక్క శిరస్సుగా చెప్పుదురు ఇందులో సూర్యుడు వసంత విషవత్తుని ఏర్పరచునట్లు కనిపించును" (Philo, Supplement II, Questions and Answers on Exodus, translated by Ralph Marcus, Ph.D., Harvard University Press, Cambridge, MA:, 1953, pp. 2-3.)
 


జవాబు:
ఇక్కడ, మళ్ళీ, ఫిలో చంద్ర నెలల చక్రాల గురించి ప్రస్తావించడం లేదు, కానీ మునుపటి "ప్రశ్న / అభ్యంతరం" లో మనం చర్చించినట్లు, వసంత విషవత్తుతో మొదలయ్యే సౌర నెలల చక్రాన్ని గూర్చి ప్రస్తావించారు. దీని యొక్క తదుపరి రుజువును ఫిలో ప్రస్తావించిన ఈ వాక్యంలో కనుగొనవచ్చు: “మేషరాశి రాశిచక్రం యొక్క శిరస్సు“. ఇది మొదటి శతాబ్దంలో, సౌర సంవత్సరానికి మొదటి నెలగా ఉన్నది. మళ్ళీ, ఈ ప్రకటన వసంత విషవత్తు తర్వాత మొదటి న్యూ మూన్ నుండి నూతన సంవత్సరపు లెక్కింపును గురించి ఏమీ చెప్పలేదు.


 

(4) ప్రశ్న / అభ్యంతరం: వసంత విషవత్తుకు దగ్గరగా ఉన్న న్యూమూన్ ను నూతన సంవత్సరంగా పరిగణనలోకి తీసుకోవడం వలన అది ప్రధమ పనల దినానికి అవసరమైన బార్లీ పంట పక్వతకు ("అబీబ్") కావలసిన సమయాన్ని కలిగియుండదు.

జవాబు: ఈ అంశంపై చాలా చెప్పవచ్చు, కాని అసత్యాన్ని బహిర్గతం చేయడానికి మనం ఒక అమూల్యమైన ఈ సమయాన్ని వెచ్చించుట అవసరం లేదు. మనము "అబీబు" మరియు మొదటి పనల అర్పణలను గూర్చి వాస్తవానికి లేఖనం ఏమి చెబుతుందో చూడాలి.

 

అప్పుడు . . . . జనుప యవలచేలును చెడగొట్టబడెను గాని గోధుమలు మెరపమొలకలు ఎదగనందున అవి చెడగొట్ట బడలేదు. (నిర్గమకాండము 9:31,32)

 

ఆబీబనునెలలో ఈ దినమందే మీరు బయలుదేరి వచ్చితిరిగదా. (నిర్గమకాండము 13:4)

 

పులియని రొట్టెల పండుగ నాచరింపవలెను. నేను నీ కాజ్ఞాపించినట్లు ఆబీబు నెలలో నీవు ఐగుప్తులోనుండి బయలుదేరి వచ్చితివి గనుక ఆ నెలలో నియామక కాలమందు ఏడు దినములు పులియని రొట్టెలను తినవలెను. నా సన్నిధిని ఎవడును వట్టిచేతులతో కనబడకూడదు. (నిర్గమకాండము 23:15)

 

మీరు పొంగని వాటి పండుగ ఆచరింపవలెను. నేను నీ కాజ్ఞాపించినట్లు ఆబీబునెలలో నియామక కాలమందు ఏడు దినములు పొంగనివాటినే తినవలెను. ఏలయనగా ఆబీబు నెలలో ఐగుప్తులోనుండి మీరు బయలుదేరి వచ్చితిరి. (నిర్గమకాండము 34:18)

 

నీవు యెహోవాకు ప్రథమఫలముల నైవేద్యమును చేయు నప్పుడు సారమైన భూమిలో పుట్టిన పచ్చని వెన్నులలోని ఊచబియ్యమును వేయించి విసిరి నీ ప్రథమఫలముల నైవేద్యముగా అర్పింపవలెను. (లేవీయకాండము 2:14)

 

ఆబీబు నెలను ఆచరించి నీ దేవుడైన యెహోవాకు పస్కాపండుగ జరిగింపవలెను. ఏలయనగా ఆబీబునెలలో రాత్రివేళ నీ దేవుడైన యెహోవా ఐగుప్తులొ నుండి నిన్ను రప్పించెను.(ద్వితీయోపదేశకాండము 16:1)

 

బ్రౌన్-డ్రైవర్-బ్రిగ్స్ హెబ్రీ నిఘంటువు ప్రకారం, అబీబ్ యొక్క అర్ధం కేవలం: "(1) తాజా, లేత బార్లీ వెన్నులు, బార్లీ; (2) వెన్నులు-వచ్చు నెల, పంట యొక్క పచ్చదనం, నిర్గమ మరియు పస్కా నెల ... " The root of Abib is Strong's #H3, దీనర్ధం "తాజాదనం, తాజా ఆకుపచ్చ, ఆకుపచ్చ రెమ్మలు లేదా పచ్చదనం." (Brown-Driver-Briggs' Hebrew Dictionary)

 

అబీబుకి అర్థం "పక్వత" అని కాదు, లేదా పక్వానికి వచ్చినప్పటి నుండి 16 రోజులు 3 అని కాదు. ఇది కేవలం లేత లేదా ఆకుపచ్చ అని అర్థం. ఇది, నిజంగా, కీలకమైన అంశంగా ఉంది. మోషే అబీబు యొక్క బార్లీ స్థితిని (నిర్గమకాండము 9:31) నమోదు చేసినప్పుడు, ఆయన బార్లీ పంట మొలకెత్తెను అని చెప్పెను; అదీ ఆకుపచ్చదై మరియు పెరుగుతున్నది. అందుచేత అది నాశనమయ్యింది, మరియు గోధుమలు (ఇంకా మొలకెత్తనందున) నాశనమవ్వలేదు (నిర్గమకాండము 9:32). లేఖనం "అబీబు నెల" ను గురించి సూచిస్తున్నప్పుడు, దానిని పంటలు పరిపక్వం చెందుతున్న నెలగా లేదా పరిపక్వత ప్రారంభమతున్న నెలగా మాత్రమే సూచిస్తుంది.

 

మనము చెప్పుకోవలసిన రెండవ ముఖ్యమైన అంశము ప్రధమ పనల అర్పణకు సంబంధించిన యహువః యొక్క సూచనలను గూర్చి.

 

మరియు యహువః మోషేకు ఈలాగు సెలవిచ్చెను; నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము నేను మీ కిచ్చుచున్న దేశమునకు మీరు వచ్చి దాని పంటను కోయునప్పుడు మీ మొదటి పంటలో ఒక పనను యాజకుని యొద్దకు తేవలెను. యహువః మిమ్ము నంగీకరించునట్లు అతడు యహువః సన్నిధిని ఆ పనను అల్లాడింపవలెను. విశ్రాంతిదినమునకు మరుదినమున యాజకుడు దానిని అల్లాడింపవలెను. మీరు ఆ పనను అర్పించుదినమున నిర్దోష మైన యేడాది పొట్టేలును యహువఃకు దహనబలిగా అర్పింపవలెను. దాని నైవేద్యము నూనెతో కలిసిన రెండు పదియవ వంతుల గోధుమపిండి. అది యహువఃకు ఇంపైన సువాసనగల హోమము. దాని పానార్పణము ముప్పావు ద్రాక్షారసము. మీరు మీ ఎలోహీంకి అర్పణము తెచ్చువరకు ఆ దినమెల్ల మీరు రొట్టె యేమి పేలాలేమి పచ్చని వెన్నులేమి తినకూడదు. ఇది మీ తరతరములకు మీ నివాసస్థలములన్నిటిలో నిత్యమైన కట్టడ. (లేవీయకాండము 23: 9-14 చూడండి.)

 

తేటగా ఇక్కడ, "పరిపక్వత చెందిన " బార్లీని గూర్చిన ప్రస్తావనే లేదు. ఇక్కడ కేవలం, ఏర్పాటు చేయబడిన దినాన యాజకుని యొద్దకు ప్రధమ పనను తీసుకొని వచ్చుటను గూర్చి మాత్రమే ప్రస్తావించబడెను, మరియు ఇది జరిగే వరకు పంటల నుండి ఏమియు తినకూడదు.

 

నిజాయితీగల బైబిలు విద్యార్థులుగా మరియు సత్యాన్వేషులుగా, క్యారైట్ యూదుల సాంప్రదాయంకి మరియు పురాతన పాలస్తీనాలో పంటల పండే విధానానికి అనుకూలంగా, మనము వసంత విషవత్తుకు దగ్గరగా ఉన్న న్యూమూన్ నుండి క్రొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది అనే సాక్ష్యాల యొక్క బరువును/ఆధారమును విస్మరించలేము.

 

(5) ప్రశ్న / అభ్యంతరం: పాలస్తీనాలోని బార్లీ పంట పరిపక్వత చెందు వరకు నూతన సంవత్సరం ప్రకటించబడలేదని నేను ఎల్లప్పుడూ బోధించబడితిని. మీరు ఎందుకు బార్లీ యొక్క పరిపక్వతను పరిగణనలోకి తీసుకోలేదు?

జవాబు: పాలస్తీనా బార్లీ యొక్క పరిపక్వత చుట్టూ నూతన సంవత్సరం విశిష్టంగా తిరుగుతుంది అనే భావనతో అనేకమైన భరించలేని సమస్యలు ఉన్నాయి:

  • గ్రంథంలో ఎక్కడా "బార్లీ పంట చట్టం" ను గురించిన ఒక ప్రస్తావనే లేదు.
  • ఆకాశంలోని జ్యోతులు "కాలాలను, దినములను, సంవత్సరాలను సూచించుటకు కొరకు ఉన్నవని ఆదికాండము 1:14 తెలియజేస్తుంది. ప్రధమ పనల దినం కోసం బార్లీ పంట పక్వానికి రావాల్సి ఉందని మనము తార్కికంగా నిర్ధారించుకొను సమయంలో, ఐగుప్తును వడగండ్లతో బాధించినప్పుడు బార్లీ పంట పరిపక్వతకు దగ్గరగా ఉందని సంధర్భానుసారం ధృవీకరించవచ్చు. (నిర్గమ.9: 22-31)
  • లేఖనంలో ఎక్కడా పంటపై (అనగా బార్లీపై) "కాలాలు, దినాలు, మరియు సంవత్సరాలు ఆధారపడి ఉంటాయని వ్రాయబడలేదు."
  • "సంవత్సరాలు" అనే భావన పాపానికి-పూర్వం, జలప్రళయానికి-పూర్వం, పాపానికి-పూర్వం (ఆదికాండము 1:14); జలప్రళయానికి కనీసం 1,500 సంవత్సరముల ముందు (నిర్గమనమునకు 2,500 సంవత్సరముల ముందు,) ప్రవేశపెట్టబడినది. నూతన సంవత్సరమును నిర్ణయించుకొనుటకు జలప్రళయానికి ముందటి ప్రపంచం బార్లీ మీద ఆధారపడి ఉందని భావించట సహేతుకమైనదిగా అనిపించడం లేదు. అయతే, "కాలములను, దినములను, సంవత్సరాలను" నిర్ణయించుకొనుటకు ఆకాశంలోని జ్యోతులపై, యహువః నియమించబడిన క్యాలెండర్ మీద ఆధారపడి ఉండెననేది అర్థవంతంగా ఉంటుంది.
  • నోవాహు జలప్రళయానికి ముందు (బార్లీ పంట లేకుండా) కాలాన్ని ఖచ్చితంగా కొలవగలిగాడు. ఇశ్రాయేలీయులు వారి అరణ్య ప్రయాణ సమయంలో (బార్లీ పంట లేకుండా) కాలాన్ని ఖచ్చితంగా కొలవగలిగారు. ఇశ్రాయేలు ప్రజలు అరణ్యంలో పస్కాను ఎలా ఆచరించారో నిర్గమకాండం 9: 1-14 వివరిస్తుంది.
  • పాలస్తీనా బార్లీ యొక్క పరిపక్వత సంవత్సర ప్రారంభం అని సూచించుట ఈ క్రింది రెండు విషయాలలో ఒకదానిని సూచించుటయే అవుతుంది: (1) పాలస్తీనా యొక్క భౌగోళిక ప్రాంతానికి వెలుపల నివసిస్తున్నవారు పూర్తిగా ఇంటర్నెట్ టెక్నాలజీపై ఆధారపడాలి (పాలస్తీనా బార్లీ స్థితి యొక్క సాక్ష్యాలను పొందటం కోసం; నేటి వ్యవసాయ పద్ధతుల యొక్క స్వభావం కారణంగా ఇది చాలా అనూహ్యమైనది కాబట్టి) (2) యహువః యొక్క విశ్వాసులు, "కడవరి వర్షాలు" రెండు వేల సంవత్సరాల క్రితమే కురిసినట్లు ప్రకటించు గ్రెగోరియన్ క్యాలెండర్ కు సమాంతరంగా ఉండు మానవుని యొక్క సంప్రదాయం మరియు మానవుని యొక్క చరిత్ర విధానమును అంగీకరించాలి. ఒక విధంగా చెప్పాలంటే నూతన సంవత్సర ప్రారంభంను నిర్ధారించుటకు మనకు గ్రెగోరియన్ క్యాలెండర్ అవసరం అని, అలా నూతన సంవత్సరాన్ని ప్రారంభించుటలో గ్రెగోరియన్ క్యాలెండర్ లేకుండా సంతృప్తికరమైన తేదీలను మనం తెలుసుకోలేము అని ఇది సూచిస్తోంది. బైబిలు నూతన సంవత్సరంను పరిగణనలోకి తీసుకోవటానికి యహువః యొక్క విశ్వాసులు మానవుని యొక్క ఊహాజనిత లేదా పాపల్ గ్రెగోరియన్ క్యాలెండర్ పై ఆధారపడాలని సూచించట ఆమోదయోగ్యం కాదు. విశ్వాసులు ఇంటర్నెట్ సాంకేతిక పరిజ్ఞానపై మరియు మధ్యప్రాచ్యంలోని ఆధునిక వ్యవసాయ పద్ధతులపై ఆధారపడాలని సూచించడం కూడా ఆమోదయోగ్యం కాదు.
  • "బార్లీ కోత చట్టాన్ని" అనుసరించాలంటే ఇశ్రాయేలీయులు కనానులో ప్రవేశించే ముందు (ఇశ్రాయేలీయుల యొక్క అరణ్య యాత్రలో సహా) తమ సంవత్సరాన్ని సరిగ్గా ప్రారంభించలేదని అనుకోవాలి, లేదా సంవత్సరం ప్రారంభాన్ని పరిగణనలోకి తీసుకునే పద్ధతి వాగ్దాన భూమిలోకి (కనానులోనికి) ప్రవేశించినప్పుడు మార్చబడెను అని భావించాలి. ఇది ఒక అసంబద్ధ ప్రతిపాదన. అంతవరకూ, అనగా, ఇశ్రాయేలీయులు ఇంకా కనాను దేశంలోనికి ప్రవేశించకముందే, నూతన సంవత్సరంను ప్రారంభించుటకు సొంతగా ఊహించుకొనిన బార్లీ పంట యొక్క లెక్కపై ఆధారపడిరని మనం నమ్మాలా? నూతన సంవత్సరాన్ని గుర్తించడానికి పాలస్తీనా బార్లీ పంట అవసరం అని లేఖనంలో ఎక్కడా చెప్పబడలేదు. ఆకాశంలోని జ్యోతుల ద్వారా సంవత్సరాలు నిర్ణయించబడాలని బైబిల్ సాధారణ భాషలో పేర్కొంది. "మరియు ఎలోహీం, పగటిని రాత్రిని వేరుపరచునట్లు ఆకాశవిశాల మందు జ్యోతులు కలుగును గాకనియు, అవి సూచనలను కాలములను దిన సంవత్సరములను సూచించుటకై యుండు గాకనియు పలికెను." (ఆదికాండము 1:14)

1 నిర్గమకాండము 9:31 లో వడగళ్ళ ద్వారా నాశనం చేసినప్పుడు బార్లీ మరియు అవిసె పరిపక్వతకు దగ్గరలో ఉన్నట్లు నమోదు చేయడెను. దీనిని బట్టి, ఇది వసంతకాలం లేదా వసంతకాలానికి సమీపంలో ఉందని మనకు తెలుస్తుంది.

2 శరదృతు విషువత్తుకు మరియు వసంత విషవత్తుకు మధ్య సుమారు 180 రోజులు ఉంటాయి.

3 ప్రధమ పనల అర్పణ మొదటినెల 16 వ రోజున చేయబడాలి, అది పులియని రొట్టెల పండుగలోని సబ్బాతునకు తరువాతి దినం. (లేవీయకాండము 23: 9-11 చూడండి).