Print

అమావాస్యను లెక్కించుట: కంప్యూటర్ అవసరం లేదు? ఇబ్బంది లేదు!

“ఆయన అదృశ్య లక్షణములు, ఆయన నిత్య శక్తియు దేవత్వమును కూడా, జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుటవలన తేటపడుచున్నవి.” (రోమీయులకు 1:20). (Restored Names Version).

ఈ విలువైన (కానీ పడిపోయిన) ప్రపంచంలో జీవించుట ఎంత దీవించబడిన సమయం! జ్ఞానం అసమాంతర వేగంతో పెరుగుతోంది మరియు యహూషువః పరిశుద్ధాత్మ యొక్క మార్గదర్శకత్వం ఆయన రాకడ నిమిత్తం ఆత్రుతగా వేచి చూస్తున్న ఆయన తండ్రి పిల్లలందరినీ శుద్ధి చేయుచు మరియు సిద్ధం చేయుచున్నది! సత్యం యొక్క ప్రతి స్తంభము పునరుద్ధరించబడుతుంది.

ఇప్పటికి కొంతకాలం నుండి WLC ఆయన యొక్క సూర్య-చంద్ర కేలండరును ప్రకటిస్తోంది; అయితే, మేము ప్రారంభంలో నెల ప్రారంభము యొక్క సరైన పద్ధతిని (ఇది చాలా ముఖ్యమైన భాగం) చూడలేకపోయాము! మొదట కనిపంచు చంద్రవంక తరువాతి దినమును న్యూమూన్ దినము అని మేము ఇకపై నమ్ముటలేదు. చాలా ప్రార్థనాపూర్వకమైన అధ్యయనం తరువాత, న్యూమూన్ గా ఉండగల ఏకైక చంద్ర దశ, చీకటి దశకు (అనగా అస్ట్రనామికల్ న్యూ మూన్ లేదా కంజుంక్షన్ కు) తరువాతి క్షణం అని WLC తీర్మానించింది.

ఈ తీర్మానం ప్రధానంగా రెండు వాస్తవాలపై ఆధారపడి ఉంది:

(1) సూర్యునితో సముచ్ఛయం జరిగిన వెను వెంటనే చంద్రుడు కనిపించుట మొదలవుతుంది. అది కనిపించుట లేదు/ దానిని చూడలేక యున్నాము అనే వాస్తవం చంద్రుడు పునర్నిర్మాణం అవుతున్న వాస్తవికతను అసత్యం చేయలేదు.
(2) భూమిపైన ప్రతీ ప్రాంతంలో వారికి ఒక నిర్దిష్ట సమయంలో ఈ సముచ్ఛయం సంభవిస్తుంది.

ఈ రెండు వాస్తవాలు సముచ్ఛయం (అమావాస్య) జరిగిన మరుక్షణాన్ని బైబులు న్యూ మూన్ యొక్క సరియైన సమయమని తెలియజేస్తుండెను. మీ నిర్దిష్ట ప్రాంతం నుండి అమావాస్య తరువాతి వేకువజామును న్యూమూన్ గా ఉపయోగించడం అనేది wlc (ప్రపంచం యొక్క చివరి అవకాశం) వద్ద ఆమోదించబడిన ఏకైక పద్ధతి, ఈ విధానం మొత్తం ప్రపంచాన్ని ఒక 24 గంటల సమయ భాగంలో ఏకము చేయగలదు. (మరో మాటలో చెప్పాలంటే, ప్రపంచంలోని అన్ని దేశాలు ఒకే 24-గంటల కాలంలో న్యూ మూన్ దినపు రాకను అనుభవిస్తాయి.)

నార్త్ క్వీన్స్లాండ్, నవంబర్ 14, 2012 న కైర్న్స్ కు ఉత్తరాన ఉన్న Ellis Beach నుండి మొత్తం సూర్య గ్రహణం కనిపించింది. (AAP చిత్రం / బ్రియాన్ క్యాస్సీ)

మీ ప్రాంతంలో UTC అమావాస్యకు తరువాతి వేకువజామున మీకు న్యూమూన్ దినము ప్రారంభమౌనని WLC నమ్ముతుంది. మళ్లీ, సముచ్ఛం/ అమావాస్య ఒక నిర్దిష్ట సమయంలో జరుగుతుంది మరియు ఇది భూమిపై ప్రతిఒక్కరికీ అదే విధానం. ఇది సాధారణంగా కోఆర్డినేటెడ్ యూనివర్సల్ టైమ్ (UTC) లేదా గ్రీన్విచ్ మీన్ టైమ్ (GMT) లో నమోదు చేయబడుతుంది. మీరు UTC లో ఇచ్చిన సమయాన్ని మీ స్థానిక సమయానికి మార్చాలి.

ఉదాహరణ: సముచ్ఛయం/ అమావాస్య జనవరి 11, 2013 19:44 UTC న సంభవించింది. కైరో, ఈజిప్ట్ లో (UTC +2 కలుపబడి), జనవరి 11 న 21:44 (9:44 PM) స్థానిక సమయంలో అమావాస్య సంభవించింది. దీని అర్థం జనవరి 12 వ తేదీన 5:27 am కు (ఖగోళ వేకువజాము) ప్రారంభమవుతుంది.

ఇప్పుడు మీ ప్రాంతంలో సముచ్ఛయ/ అమావాస్య సమయం మీకు తెలుస్తుంది, కానీ ఖండన స్థానం ఎక్కడ? ఒక దినము వేకువజాముతో మొదలవుతుందని లేఖనము తేటపరుస్తుంది. ఈ బైబిలు పరిధిలో ఉంటూ, WLC ఖగోళ వేకువజామును (ఇక్కడ "వేకువజాము" అని పిలువబడింది) ఒక తేదీనకు ముగింపుగాను మరియు మరుసటి దినమునకు ప్రారంభముగాను నియమించింది. ఇలా ఉంటూ ఉంటూ, న్యూ మూన్ దినపు ప్రారంభానికి కూడా ఈ ప్రాంతము ఆధార స్థానంగా ఉన్నది. వేకువజామునకు ముందు సముచ్ఛయం/ అమావాస్య సంభవిస్తే, అప్పుడు న్యూ మూన్ దినము వేకువజాముతో ప్రారంభమవుతుంది. సముచ్ఛయం/ అమావాస్య వేకువజాము తర్వాత జరిగితే, న్యూమూన్ దినము ఆ తరువాతి వేకువజామున ప్రారంభమవుతుంది. ఈ పద్దతి నిజంగా యహువః ను మరియు ఖగోళ వ్యవస్థను అనుమతిస్తుంది. సమయ నిర్ణేతగా ఉండటానికి ఆయన దానిని (ఖగోళ వ్యవస్థను) దాని స్థానంలో ఉంచెను మరియు అది తేదీ రేఖను సృష్టించటానికి ఆయనను అనుమతిస్తుంది.

ఉదాహరణ: మీరు UTC అమావాస్యను ఒకసారి మీ స్థానిక సమయానికి మార్చిన తర్వాత, మీ స్థానంలో ఫిబ్రవరి 10 న వేకువజాముకు ముందు అమావాస్య సంభవించినట్లయితే, అది కేవలం కొన్ని నిమిషాల ముందు అయినా సరే, మీ న్యూ మూన్ దినము ఫిబ్రవరి 10 న వేకువజాముతో ప్రారంభమవుతుంది. ఫిబ్రవరి 10 న వేకువజాము తర్వాత అమావాస్య జరిగితే, అది కేవలం కొద్ది నిమిషాల తరువాత జరిగినా సరే, మీ న్యూమూన్ దినము ఫిబ్రవరి 11 నవేకువజాముతో ప్రారంభమవుతుంది. అందువల్ల, ఒక 24 గంటల కాలంలో మొత్తం ప్రపంచమంతటను న్యూ మూన్ దినము ప్రారంభమవుతుంది.

కొత్త నెలలను ప్రారంభించుటకు సూచిక స్థానంగా అమావాస్యను ఉపయోగించే పద్దతిపై/ ఆలోచనపై కొన్ని అభ్యంతరాలు తలెత్తాయి. నెలను ప్రారంభించు విషయంలో లెక్కింపు ఒక సమగ్రమైన పాత్రను పోషించినట్లు చరిత్ర చూపిస్తున్నప్పటికీ, పలువురు లూనార్ సబ్బతీయులు చంద్రుని దృశ్య వీక్షణల మీద ఆధారపడి ఉండాలని నొక్కి చెప్పుచున్నారు. బహుశా, ఇది చాలా సాధారణ వాదన, మరియు WLC కొద్దికాలం క్రితమే ఆమోదించిన ఒక అభ్యంతరం. వాస్తవానికి అమావాస్య సంఘటనను కంటితో చూడలేము; అందువలన, అది తప్పనిసరిగా తీసివేయబడాలి. అయితే, మేము వివరించినట్లుగా, సూర్య గ్రహణాలు అనేవి కనిపించే అమావాస్యలు, అందువల్ల వాటిని అప్పుడప్పుడు చూడవచ్చు, మరియు అవి ఎప్పుడు కలుగునో చాలా ముందుగానే ఊహించదగును. పూర్వీకులు ఉపయోగించిన కళాఖండాలను మరియు పద్ధతులను పరిశీలిస్తే, నెలలు మరియు వాటి వ్యవధులు చాలా ముందుగానే తెలియబడి ఉంటూ ఉండేవి. సూర్యుని మరియు చంద్రుని కదలికలను అంచనా వేయడానికి అవసరమైన సూత్రాలు పురాతన పద్ధతులలో చాలా తక్కువ వ్యత్యాసంతో ఉంటాయి. అయితే గణిత సూత్రాలు ఒకే విధంగా ఉంటాయి.

కాబట్టి, మీరు ఇలా అనవచ్చు; "న్యూమూన్ ని అంచనా వేయడానికి మన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఎంతో బాగుంది కాని ప్రాచీన హెబ్రీయులు ఖచ్చితంగా చంద్ర-సౌర సముచ్ఛయంను/ అమావాస్యను ఎలా అంచనా వేసారు?"

అవును, మన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాలు అమావాస్యను కనుగొను విషయంలో చాలా సమర్థవంతమైన పాత్రను పోషిస్తాయి, అయితే ఇంకా సరళమైన మరియు అత్యంత సాధారణ గృహ ఉపకరణాల ద్వారా కూడా సముచ్ఛయం(అమావాస్య) జరిగే సమయాన్ని ముందుగా నిర్ణయించవచ్చును. యహువః తన నమ్మకమైన ప్రజలకు నేడు పరలోకం యొక్క ఉపాయములను అధ్యయనం చేయుటకు మరియు అర్థం చేసుకొనుటకు అధునాతన పరికరములను మరియు పరీక్షించిన జ్ఞానం యొక్క శాఖలను ఇచ్చెను. సూర్యుడు, చంద్రుడు మరియు నక్షత్రాల కదలికల గురించి మనం గ్రహించుటకు సహాయపడుటకు మనకు అందుబాటులో ఉన్న ప్రతి ఉపకరణంను ఉపయోగించగలము మరియు తప్పక ఉంపయోగించాలి. చంద్రుని యొక్క కదలికలు మరియు దశలు చాలా ఖచ్చితమైనవి మరియు ఆధారపడదగినవి కావున, ఇది వాటిని ఆకాశంలో పెద్ద గడియారం వలె పనిచేయునట్లు చేస్తుంది. చంద్రుని దశలన్నింటిలోకి చివరి-పావు దశ తరువాత నుండి తగ్గిపోతున్న నెలవంకను చివరగా తగ్గుటవరకు గమనించి, మరియు వాటికి మరియు తూర్పున పెరుగుతున్న సూర్యుడికి మధ్య ఉన్న దూరాలను కొలవగలము. మొట్టమొదటి కనిపించే నెలవంక (FVC) ను చూచుటకు ఉన్న ఒకే ఒక అవకాశంనకు బదులుగా, చంద్ర నెల యొక్క 22 వ తేదీన సబ్బాతు తరువాత గల రోజులలో అనేక కొలత వీక్షణలను చూడగల అవకాశం ఉంది. కొలతలు సూర్యుడు వచ్చునప్పుడు లేదా అంతకంటే కొద్దిగా ముందుగానే పూర్తిచేయబడతాయి. ఇక్కడ దశలవారీగా ఉన్నాయి:

1 (ఎ). సెంటీమీటర్లగా విభాగించబడ్డ ఒక కొలత టేపును లేదా రూళ్ళ కర్రను చేతి పొడవంత దూరంలో పట్టుకుని, ఆకాశంలోని సూర్యుడికి మరియు తగ్గుతున్న చంద్రవంకకు మధ్యలో కోణీయ విభజనను కొలవవలెను. అనేక రీడింగులను/ కొలతలను తీసుకొని వాటిని పట్టిక చేయవలెను. సరిగ్గా సూర్యుని మధ్యభాగానికి మరియు చంద్రుని మధ్యభాగానికి కొలవాలి.

1 (బి). గృహ ఉపకరణాలు లేనప్పుడు; అలాంటప్పుడు, మనమే ఒక సాధనం, ఎందుకంటే మనం "భయంకరముగా మరియు అద్భుతముగా చేయబడినందున", ప్రతి ఒక్కరీకీ నిజంగా వారి చేతులు అవసరమై ఉంది. చేతి యొక్క పొడవుతో కొలిచి చూసినప్పుడు, మీ చేయి మరియు వేళ్లు కోణీయ విభజనను ఖచ్చితంగా కొలిచే సాధనంగా పనిచేస్తాయి! మన శరీరం యొక్క నిష్పత్తులు అన్నియు సృష్టి యొక్క క్రమంలో కొలతవేయబడినవి. మీ శారీరక ఎత్తు ఎంత అనేది దీనిపై ఏ వ్యత్యాసంను చూపదు. భుజాల వద్ద నుండి ఒకని పూర్తి చేతి పొడవు తీసుకుంటే, అది కోణీయ విభజన లేదా సూర్యుని మరియు చంద్రుడి మధ్య డిగ్రీల దూరంను కొలిచే ఒక ఆశ్చర్యకరమైన ఖచ్చితమైన ఉపకరణంగా పనిచేస్తుంది.

చేతి యొక్క పొడవు వద్ద చూసినప్పుడు ఒక వ్యక్తి యొక్క చిటికెన వేలు 1° కోణీయ విభజనకు చాలా దగ్గరగా ఉంటుంది. చూపుడు, మధ్య మరియు ఉంగరపు వేళ్లు కలిసి 5° విభజనను సూచిస్తాయి, అయితే ఒక బిగించిన పిడికిలి 10° ను ప్రదర్శిస్తుంది. చిటికెన మరియు చూపుడు వేలు మరియు చిటికెన మరియు బొటనవేలు మధ్య దూరంను ఉపయోగించి 15° మరియు 25° కోణాలు కొలవబడతాయి. ఎక్కువ ఖచ్చితత్వం కోసం, సూర్యుని మరియు చంద్రుని రెండు లోపల అంచుల మధ్య కొలతలను నిర్ధారించుకోండి.

A - ఒక చిటికెన వేలు 1° కోణీయ విభజనకు చాలా దగ్గరగా ఉంటుంది.

B - చూపుడు, మధ్య మరియు ఉంగరపు వేళ్లు కలిసి 5° విభజనను సూచిస్తాయి.

C - ఒక బిగించిన పిడికిలి 10° కోణీయ విభజనను ప్రదర్శిస్తుంది.

D - నాలుగు వ్రేళ్ళను వ్యాప్తి చేయట ద్వారా, చిటికెన మరియు చూపుడు వేళ్ల మధ్య దూరం 15° కోణీయ విభజనను సూచిస్తుంది.

E - చిటికెన మరియు బొటనవ్రేలును సాధ్యమైనంతవరకు విస్తరించుట ద్వారా 25° కోణీయ విభజనను కొలుచును.

2. తరువాతి దశ సాపేక్షంగా సరళమైన గణితంగా ఉంటుంది. ఇక్కడ సూత్రం యొక్క క్లుప్త వివరణ ఉంది.

భూమి మీద ఒక పూర్తి వలయంను (360°) పూర్తి చేయుటకు సూర్యునికి 24 గంటలు పడుతుంది. ఇది గంటకు 15° (360° / 24 = 15°) కి సమానం. అయితే, చంద్రునికి ఒక పూర్తి వలయంను సంపూర్తి చేయుటకు సుమారు 24 గంటలు మరియు 50 నిమిషాలు పడుతుంది. ఇది గంటకు 14.5° కు సమానం (360° / 24.83333333333 = 14.5 °). [గమనిక: 24.83333333333 అనగా దశాంశ రూపంలో 24 గంటల, 50 నిమిషాలు]

దీనర్థం చంద్రుడు ప్రతి గంటకు సూర్యుని కంటె 0.5° డిగ్రీలను కోల్పోతుంది. మరొక మార్గంలో చెబితే, సూర్యుడు ప్రతి గంటకు చంద్రుని కంటే 0.5 డిగ్రీలు ఎక్కవగును. పర్యవసానంగా, చంద్రుడు ప్రతి రోజు సుమారు 12° కోల్పోవును (.5 °x 24 గంటలు). అందువల్ల చంద్ర నెల, అనగా ఒక అమావాస్య నుండి మరొక అమావాస్యకు గల కాలం, సగటున 29.5 రోజులు (రోజుకు 360°/12° = సుమారు 30 రోజులు). జ్ఞాపకముంచుకోండి, మనము ఇక్కడ సంఖ్యలను లెక్కిస్తున్నాము.

ఇప్పుడు, మన కొలతలకు తిరిగి వెళ్దాం. సగటు కొలతను తీసుకొని ఆ సంఖ్యను 0.5 చేత విభజించాలి (ప్రతి గంటకు చంద్రునిపై సూర్యుడు పొందే డిగ్రీల సంఖ్య); ఫలితంగా వచ్చిన సంఖ్య, కొలత కొలియబడిన సమయం నుండి అమావాస్య వరకు ఎన్ని గంటలో వెల్లడిస్తుంది.

3. అప్పుడు, అవసరమైతే, అమావాస్య వరకు ఎన్ని రోజులు ఉండెనో చూచుటకు ఆ సంఖ్యను 24 ద్వారా విభజించాలి.

ఉదాహరణ: సూర్యుడు మరియు చంద్రుడు 25° కోణీయ విభజనను కలిగి ఉండెను అని మీరు ఖచ్చితంగా కొలిచిరి.

కేవలం 25° ను 0.5° (ప్రతి గంటకు చంద్రునిపై సూర్యుడు పొందు డిగ్రీల సంఖ్య) చేత విభజించాలి, అది 50 కి సమానం. ఇది అమావాస్య వరకు ఉన్న గంటల సమయం! తేలిక!

అవసరమైతే, అమావాస్య వరకు ఎన్ని రోజులు ఉందో చూచుటకు మీరు 50 ని 24 (ఒక రోజులోని గంటలు గంటలు) ద్వారా విభజించవచ్చు. 50 గంటలు. ÷ 24 గంటలు = 2.1, ఇది కొలత సమయం నుండి అమావాస్య వరకు గల రోజుల దూరం.

ప్రతి సంస్కృతిలోని పురాతన ప్రజలు నేడు సగటు మనిషి కలిగియున్న దాని కంటే ఆకాశ జ్యోతులను గూర్చిన గొప్ప అవగాహనను కలిగి ఉన్నారని ఖచ్చితంగా చెప్పగలం. యహూషువః యొక్క పరిశుద్ధాత్మ ప్రతి దైవిక నియమంను మన హృదయాల్లో పునరుద్ధరిస్తోంది. తేలికగా మరియు ఖచ్చితత్వంతో అమావాస్య సమయాన్ని లెక్కించుటకు యహువః మనలో ప్రతి ఒక్కరినీ అవసరమైన సాధనములతో మరియు మనస్సుతో దైవచిత్తానుసారంగా రూపకల్పన చేసెను. అందరూ ఆయనను ఆయన మరియు కుమారుని స్తుతించుడి.

న్ను నిర్మించినవాడవు నీవే. నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను నీ కార్యములు ఆశ్చర్యకరములు. ఆ సంగతి నాకు బాగుగా తెలిసియున్నది.నా అంతరింద్రియములను నీవే కలుగజేసితివి నా తల్లి గర్భమందు న (కీర్తనలు 139:13-14)