Print

కాన్స్టాంటైన్ I & హిలెల్ II: మొత్తం ప్రపంచాన్ని మోసగించిన ఇద్దరు పురుషులు


ఇద్దరు(2) మనుష్యులు [కాన్స్టాంటైన్ + హిలెల్] ÷ 2 ప్రణాళికలు = 1 భారీ మోసము

 

క్రీ.శ 4 వ శతాబ్దంలో,కేలెండర్ల మార్పు ద్వారా, పురాతన సబ్బాతు శనివారానికి మార్చబడినది. ఈ మార్పు ద్వారా, లేఖనాల యొక్క నిజమైన సబ్బాతు కోల్పోబడెను.


ప్రపంచ చరిత్రలో జరిగిన గొప్ప మోసాలలో ఒకటైన ఈ మోసం దాదాపు 1,700 సంవత్సరాల క్రితం ఇద్దరు మనుష్యుల చర్యల ద్వారా జరిగినది. రోమన్ చక్రవర్తి కాన్స్టాంటైన్ ఒక విపరీతమైన చట్టంను చేసెను: అతను యహూషువః పునరుత్థాన దినమును  ఆదివారంనకు మార్పిడిక్రీ.శ 4 వ శతాబ్దంలో, కేలెండర్ల మార్పుద్వారా, పురాతన సబ్బాతు శనివారానికి మార్చబడినది. ఈ మార్పు ద్వారా, లేఖనాల యొక్క నిజమైన సబ్బాతు కోల్పోబడినది. చేయుట ద్వారా తన సామ్రాజ్యాన్ని ఐక్యం చేసి పస్కాను లెక్కించుటకు బైబిల్ కేలెండరు ఉపయోగించుటను నిషేధించెను. దీని పర్యవసానంగా కొన్ని వరుస ప్రతిచర్యలు సంభవించెను. బైబిల్ కేలెండరు మార్పు ద్వారా చేయబడిన ఈ చట్టం ఫలితంగా కలిగిన హింసలకు యూదు నాయకుడు హిలెల్ II స్పందించెను. ఈ పరిస్థితి అన్య శనివారంతో నిజమైన సబ్బాతును భర్తీ చేయుటకు కారణమాయెను. ఇది గొలుసు చర్యలు మరియు మహా సమతుల్య ప్రతిచర్యలై ఉండెను. గ్రెగోరియన్ కేలెండర్ ద్వారా ఆరాధించేది ప్రతి క్రైస్తవ మరియు యూదునిలో దాని శాఖలు నేటికినీ కొనసాగుతుండెను.

 

చర్య

 

 

కాన్స్టాంటైన్

కాన్స్టాంటైన్ విగ్రహపు ముఖముచరిత్ర గందరగోళ మహాసముద్ర ప్రవాహంలో నాల్గవ శతాబ్దం మిక్కిలి గొప్ప మార్పులకు కారణమైన శతాబ్దం. అన్యమతం ఆధిపత్య ప్రభావంతో మిగిలియుండగా, క్రైస్తవ మతం, రోమన్ సామ్రాజ్యంలో అతి పెద్ద ఉనికిని సంపాదించింది. చరిత్రలో ఈ ప్రత్యేక సమయం, అధికారం మరియు చొరవ గలిగిన ఎవరైనా ఒకరు దాని ప్రయోజనాన్ని పొందుకోనిమిత్తం (కాలం) పక్వమై ఉండెను.

సెయింట్ కాన్స్టాంటైన్ గ్రేట్ (సి 272 -. 337 క్రీ.శ) రోమన్ సామ్రాజ్యపు మొట్టమొదటి "క్రైస్తవ" చక్రవర్తిగా విస్తృతంగా పరిగణించబడెను. నిజానికి, అతను మొదట ఒక అన్యమతస్తుడై ఉండెను. అతను తన మరణానికి కొద్ది కాలం ముందు బాప్టీస్మమునకు అనుమతినిచ్చినా గానీ అతను రాష్ట్ర మతాధిపతిగా అతని స్థానంను నిలుపుకొని తన మరణము వరకు పోంటిఫెక్స్ మాగ్జిమస్ బిరుదును కలిగియున్నాడు.[1] కాన్స్టాంటైన్ తాను "మతమార్పిడికి" ఒప్పుకున్నట్టు చెప్పుకున్న తరువాత పొంటిఫెక్స్ మాక్జిమాస్ అధికారంను నిలబెట్టుకున్నాడని కాథలిక్కులు కూడా చెప్పారు. [2]

కాన్స్టాంటైన్ ఒక రాజకీయ ప్రణాళిక ఒక తెలివైన వ్యూహాకర్త కూడా. అతడు తన సామ్రాజ్యంలో గల రెండు అత్యంత ప్రభావవంతమైన వర్గాలను ఏకం చేయాలని కోరుకున్నాడు: అన్యమతస్థులు మరియు క్రైస్తవులు. యూదులు వివక్ష చూపబడే ఒక చిన్న వర్గంగా వుంటూ వారి ప్రభావం కొద్దిగానే ఉండెను. అలా, ఈసారి కాన్స్టాంటైన్ తన సామ్రాజ్యాంను ఐక్యం చేయుటకు చేసిన ప్రయత్నాలలో అన్యమతస్థులు మరియు పాశ్చాత్య, అన్యీకృత క్రైస్తవులు ఏకంగా కలిగియున్న సాధారణ ఆధారమును కనుగొనడంపై తాను దృష్టిసారించాడు. అతడు అన్యమత గ్రహవారమైన ఆదివారంలో దానిని కనుగొనెను.

ప్రారంభ జూలియన్ కేలెండర్, దాని ముందుగల రోమన్ రిపబ్లిక్ కేలండరు వలె ఒక ఎనిమిది రోజుల వారంను కలిగియుండేది. వారంలో రోజులు A నుండి H వరకు గల అక్షరాల ద్వారా సూచింపబడేవి. ఆ కాలంలో, కాలముల గమనములను తెలుసుకొనుటకు ఆయా దేశాలు వివిధ పద్ధతులను వుపయోగించేవి, మరియు రోమన్ సామ్రాజ్యంనందు, జూలియన్ కేలెండరులో ప్రాంతీయ వ్యత్యాసాలు ఉండేవి. క్రీ.పూ ఒకటో శతాబ్దంలో ఏడు రోజుల గ్రహవారం రోమ్ నకు మొదటిసారిగా పరిచయం చేయబడినది.[3]

గ్రహ వారం ఆవిర్భవించినప్పటికీ, ప్రారంభ జూలియన్ కేలెండరులో కొంత కాలం ఎనిమిది రోజుల వారం ఉపయోగించుట కొనసాగినది. "నుండియల్" [ఎనిమిది రోజుల] చక్రం చివరకు ఆధునిక ఏడు రోజుల వారంచేత భర్తీ చేయబడెను, అది క్రీ.పూ 45 లో జూలియన్ కేలెండర్ అమల్లోకి వచ్చిన తరువాత ప్రారంభ చక్రవర్తుల కాలంలో మొదటిగా ఇటలీనందు వాడుకలోకి వచ్చింది [4].నుండియల్ [ఎనిమిది రోజుల] అక్షరాల వ్యవస్థ ఏడు రోజుల వారం కోసం కూడా స్వీకరించబడెను .... "కొంతకాలం, [ఏడు రోజుల] వారం మరియు నండియల్ [ఎనిమిది రోజుల] చక్రం రెండూ వుండేవి, అయితే క్రీ.శ. 321 లో కాన్స్టంటైన్ ద్వారా వారము అధికారికంగా ఆమోదించబడినపుడు ఎనిమిది రోజుల చక్రం ఉనికిని కోల్పోయినది."[5]  ఏడు రోజుల గ్రహసంబంధ అన్య వారమును రోమన్లు తెలుసుకొని​​ ప్రాంతీయంగా ఉపయోగిస్తున్న అదే సమయంలో [యహూషువః భూమిపై ఉన్నపుడు మరియు ఆయన తరువాత వెంటనే గల కాలంలో] జూలియన్ కేలెండర్ కూడా వాడుకలో ఉంటూ ఒక ఎనిమిది రోజుల వారంను కలిగి ఉండేది.

ఈ నిజము పురాతత్వ సాక్ష్యంతో బలపరచబడుతుంది. జూలియన్ ఫాష్తి/రాళ్ళపై చెక్కిన కేలండర్లు నేటికినీ ఉనికిలో ఉంటూ ఎనిమిది రోజుల వారాలను లేదా ఎనిమిది రోజుల మరియు ఏడు రోజుల వారాల రెండు జాబితాలు ఒకే కేలండరుపై యుండుటను చూపించుచుండెను.

రోమ్ విస్తరణ మరియు ఎనిమిది రోజుల వారం యొక్క క్షీణత ఏకకాలంలో జరుగుతూ,,,. అప్పుడే రోమ్ నకు పరిచయంచేయబడిన జ్యోతిష్య [గ్రహసంబంధ] వారము మరియు ఏడు రోజుల క్రైస్తవ వారాము రెండూ బహుగా జనరంజకంగా మారుతూ  వచ్చినవి. రోమీయుల ఎనిమిది రోజుల వారం మరియు పై రెండు ఏడు రోజుల వారములు కొంత కాలం ఒకే సమయంలో వాడుకలో ఉన్నట్లు సూచిస్తున్న ఆధారాలున్నాయి. అయితే, ఈరెండు వారాలు సహజంగా ఒకదానితో మరొకటి కలిసి కొనసాగడం ఎంతోకాలం సాధ్యం కాలేదు. వాటిలో ఒకదానిని స్పష్టంగా వదిలివేయవలసి వచ్చినది. మనందరికీ తెలిసినట్లుగానే, తరువాత ఎనిమిది రోజుల వారము శీఘ్రముగా చరిత్ర పుటల నుండి అదృశ్యమైనది. [6]

ఇది ఒక తక్షణమే జరిగిన మార్పు కాదు. ఏడు రోజుల గ్రహ వారం మంచి ఆదరణ పొందుచుండంతో, రోజులను సూచించుటకు అక్షరాలను ఉపయోగించటం (A నుండి G వరకు) పక్కకు నెట్టబడి గ్రహ దేవతల పేర్లతో వారం యొక్క రోజులకు పేర్లు పెట్టుట జరిగెను.

“ఆదివారము ఒక పవిత్ర దినముగా గల వారమును అన్యులు స్వీకరించుటలో, ఐరేనియన్[పర్షయన్] రహస్యాల యొక్క ప్రచార వ్యాప్తి ఎంతగానో పాత్ర వహించెను అనటంలో సందేహం లేదు. ఇతర ఆరు దినాలకు మనము వుపయోగించు పేర్లు, అకస్మాత్తుగా మిత్రాయిజం దక్షిణ రాజ్యములలో అనుచరులను సంపాదించిన సమయంలో వాడుకలోనికి వచ్చెను. దీని విజయము, తద్వారా కలిగిన యాదృచ్చిక దృగ్విషయముల సంబంధమును నిరూపించుటలో......లేదు.”. [7]

క్రైస్తవులు సమాధులపై తారీఖులను వ్రాసేటప్పుడు సౌర జూలియన్ తేదీ మరియు దానికి సమానమైన బైబిల్ సూర్యచంద్ర కేలండర్లోని తేదీ రెండు తారీఖులను వ్రాయటం జరిగేదని పురాతత్వ ఆధారాలు సూచిస్తుండెను. క్రీ.శ 269 నవంబర్ 5, శుక్రవారం నాటి అటువంటి ఒక వ్రాత ఇలా చెప్పుచుండెను: "క్లాడియస్ మరియు పాటెర్నస్ యొక్క పరిపాలనలో, నవంబర్ నోన్స్ న, వీనస్ దినాన  మరియు చంద్ర నెలయొక్క 24 వ రోజున, ల్యూసీస్ తన అతి ప్రియమైన కుమార్తె సవవేరాకును మరియు తన పవిత్ర ఆత్మకును [ఈ జ్ఞాపికను] ఉంచెను. ఆమె 55 సంవత్సరాల, 11 నెలల, [మరియు] 10 రోజుల [వయసులో] మరణించెను." [8]

టైటస్ స్నాన వాటికల నుండి రోమీయుల స్టిక్ కేలండరుక్రీ.శ. 79-81 లో నిర్మించబడిన టైటస్ చక్రవర్తి యొక్క స్నానవాటికలనుండి లభించిన ఈ స్టిక్ కేలండరు, తన కొడవలిని పట్టుకొనియున్న సాటర్న్ ను, వారంలోని మొదటి రోజు యొక్క దేవునిగా (శనివారంను) సూపిస్తుండెను. తరువాతి రోజుగా సూర్య దేవుడు (ఆదివారం) ఉండగా, దాని తరువాత చంద్ర దేవత (సోమవారం) మూడవ రోజుగా ఉండెను.

ఈ పరిస్థితిని కాన్స్టాంటైన్ తన రాజకీయ ప్రణాళికను ముందుకు తీసుకుని వెళ్ళుటకు ప్రయోజనంగా మలచుకున్నాడు. ఇది అన్యమతానికంటే క్రిస్టియన్ వర్గానికి ఎక్కువ అనుకూలంగా ఉండే ఒక సున్నితమైన సంతులన చర్య. మొట్టమొదట, అతను సూర్యుని యొక్క దినాన్ని [డైస్ సోలిస్, లేదా ఆదివారంను] గౌరవిస్తూ కొన్ని చట్టాల పరంపరను చేపట్టారు. అసలు/మొదటి గ్రహ వారంలో, నిజానికి వారానికి మొదటి రోజుగా శనివారం ఉండేది. ఆదివారం వారం రెండవ రోజు గానూ మరియు శుక్రవారం ఏడవ రోజు గానూ ఉండేది.

సూర్యుడు, నిజానికి, కాన్స్టాంటైన్ యొక్క వ్యక్తిగత చిహ్నమైయుండెను. అతను సోల్ ఇంవిక్టస్ (ఓటమి ఎరుగని సూర్యుడు) గుర్తును తన నాణేలపై చెక్కించునకొనెను మరియు అది అతని జీవితాంతం తన వ్యక్తిగత ముద్రగా [అధికారిక ముద్రకింద వ్రాయబడు వాక్యంగా] ఉండినది. ఆదివారంను గొప్పచేయుటను అన్యమతస్థులు అంగీకరించిరి మరియు అప్పటికే దానికి కొందరు క్రైస్తవులు కూడా రాజీ పడియున్నారు. రెండవ శతాబ్దపు చివరి నాటికి, అనేక క్రైస్తవులు (ముఖ్యంగా పశ్చిమాన) ఇప్పటికే రక్షకుని యొక్క పునరుత్థాన దినముగా ఆదివారంను ఆరాధిస్తూ వచ్చారు.  కాన్స్టాంటైన్ అన్య మతంను మరియు క్రైస్తవ మతం ఏకం చేయుటకు ఈ ఆరంభమే అవసరమైయుండెను.

"కాన్స్టాంటైన్ యొక్క ఆదివారపు చట్టంను గొప్పచేయరాదు. అతను ఆదివారంను పాటించవలసినదిగా ఆజ్ఞాపించుట, లేదా జనులు దానిని అపవిత్రం చేయడాన్ని నిషేధించుట అనేది సబ్బాత్ [సబ్బాటోన్] పేరుతో గానీ లేదా డైస్ డొమిని [ప్రభువు దినము] పేరుతో గానీ కాదు, కానీ దాని పాత జ్యోతిష మరియు అన్యనామం అయిన డైస్ సోలిస్ (ఆదివారం) పేరట మాత్రమే. తద్వారా ఆచట్టం క్రైస్తవులకు వలే హెర్క్యులస్, అపోలో, మరియు మిత్రాస్ ఆరాధకులకు కూడా వర్తించెను. తన చట్టంలో నాలుగవ ఆజ్ఞకు సంబంధించి గాని లేదా లేదా క్రీస్తు యొక్క పునరుత్థానం గురించిగాని ఎలాంటి ప్రస్తావన లేదు." [9]

తన ఆదివారపు చట్టం వలన కాన్స్టాంటైన్ ఒక క్రైస్తవుడుగా చూడబడ్డాడు కానీ తన ఆదివార" చట్టం"ను ఉద్దేశపూర్వకముగా అస్పష్టముగా (ద్వంద్వార్ధంగా) తయారుచేసెను - అతను అన్యమతస్థులకు మరియు క్రైస్తవులకు ఇరువురికీ అది ఆమోదయోగ్యంగా ఉండాలని కోరుకున్నాడు!

"ముందుకు అటువంటి చట్టం ఎలా వుండుననే కాన్స్టాంటైన్ పధకరచనను కనుగొనడం కష్టం కాదు. క్రైస్తవ చర్చి పండుగల మీద అది ఒక ప్రత్యేక గౌరవంగలదిగా చెప్పబడుతుంది [10], మరియు అది అన్యమతస్థులకు కూడా తమ స్వల్ప వరంగా మంజూరు చేయబడినట్లు వుండెను. నిజానికి ఈ శాసనాలలో ఒక అన్యుడు రాయలేనిది ఏఒక్క విషయమూ లేదు. ఈ చట్టం అంతయూ కాన్స్టాంటైన్ తన ప్రత్యేక రక్షిత దేవునిగా స్వీకరించిన అన్యమత దేవత- ఆపొల్లో/సూర్యునికి గౌరవార్థంగా వుంది. ఆ దినము యొక్క పేరు దానిలోనే ఈ సందిగ్ధతను కలిగి యుంది. ఆది వారము (డైస్ సోలిస్) అనే పదము క్రైస్తవులలోను అలాగే అన్యుల మధ్యనూ వాడబడుతూ వుండేది.[11]

ఈ ఏడు రోజుల గ్రహసంబంధ వారం మార్పునకు ఒక వాహనంగా మారింది. ఈ గ్రహసంబంధ వారం పరిచయంతో ఎనిమిది రోజుల జూలియన్ మరియు ఏడు రోజుల బైబిల్ వారం రెండూ పక్కన ఉంచబడ్డాయి. ఈ వారం అన్యమతం నుండి వచ్చినది, నేడు క్రైస్తవులు భావిస్తున్నట్లు బైబిలు నుండి కాదు. "ఒకదానికొకటి అవసరత గల రాష్ట్ర మరియు చర్చిల సయోధ్యకు సమయము సమీపించినది. దీనిలో కాన్స్టాంటైన్ తన యొక్క మేథా నైపుణ్యమును చూపించెను. అతడు చర్చికి శాంతిని ప్రకటించి, దానిని ఒక రాష్ట్రంగా గుర్తించి, దానికి సామ్రాజ్యవాద శక్తిని ప్రకటించెను."[12]

కాన్స్టాంటైన్ యొక్క ఆదివారం చట్టం అన్యమతస్థులను అనేక క్రైస్తవులతో సఖ్యపరచెను; అయితే, అది రక్షకుని యొక్క మరణ దినమును ఎప్పుడు జరుపుకోవాలి అనే విషయంలో, వంద సంవత్సరాలపాటు మండుతున్న వాదనను తీసుకొని వచ్చెను. ఈ సమయం వరకు చాలామంది క్రైస్తవులు, ముఖ్యంగా సామ్రాజ్యము యొక్క తూర్పు భాగంలోని క్రైస్తవులు బైబిలు యొక్క సూర్యచంద్ర కేలెండరు ద్వారా లెక్కించబడే ఏడవ-రోజు విశ్రాంతిదినమును అలాగే యహువః యొక్క వార్షిక పండుగలను ఆచరించేవారు. ఆదివారం ఆరాధనను స్వీకరించినవారు కూడా పస్కాను లెక్కించేందుకు బైబిల్ కేలెండరును ఉపయోగించేవారు!

ఈష్టరు: అన్య పస్కా

ఈష్టరు: అన్య పస్కా

ఇది రెండు కేలెండర్ల విషయంలో జరిగిన దీర్ఘకాలిక వాదన.

క్రీ.శ రెండవ శతాబ్దం నుంచి అక్కడ పస్కాల్(ఈష్టరు) వార్షికోత్సవం జరుపుకునే తేదీ గురించి అభిప్రాయాల విభేదం ఉండేది. మరణము, సమాధిచేయుట, పునరరుద్ధానం; అత్యంత పురాతన ఆచరణ ప్రకారం ఈ పండుగలు సంవత్సరం సంవత్సరం (ప్రతీయేడాదీ) జూలియన్ వారపు పేర్లతో సంబంధం లేకుండా, చంద్రమాసం యొక్క పద్నాలుగు, పదిహేను మరియు పదహారు దినాలలో వస్తూ వుండేవి. రోమ్ యొక్క బిషప్, ఆదివారంను ఒక చర్చి ఉత్సవంగా పాటించాలనే తన కోరికను విస్తరిస్తూ, వార్షిక వేడుకలు ఎల్లప్పుడూ చంద్ర నెలయొక్క పదునాలుగవ దినము తరువాత వచ్చే శుక్రవారం, శనివారం మరియు ఆదివారంల యందు జరిగాలని ఆదేశించెను. ... ఈ వివాదం కాన్స్టాంటైన్ రోమన్ బిషప్పుల తరపున జోక్యం చేసుకొని మరియు ఇతర సమూహంను బహిష్కృతం చేసే వరకు, దాదాపు రెండు శతాబ్దాల పాటు కొనసాగింది. [13]

 పశ్చిమాన చర్చిలు అన్య ఈస్టరు ఆదివారంనకు బదిలీ చేసుకొనగా అదే సమయంలో ఆసియాలోని చర్చిలు అబీబు 14 న పస్కాను ఆచరించుటను చాలాకాలం కొనసాగించారని కైసరయ యొక్క యూసెబియస్ ఒక ప్రకటన తెలియజేయచుండెను:

ఆ సమయంలో [రెండవ శతాబ్దపు చివరిలో] ఆసియాలోని సమస్త పరిసయ్యులు, పాత సంప్రదాయ పద్దతిలో, చంద్రుని యొక్క 14వ దినాన, పస్కా గొర్రెను వధించుటకు యూదులు  ఆజ్ఞాపించబడిన దినాన, రక్షకుని పస్కా పండుగగా ఆచరింపవలెని చెప్పబడెను. ఆదినాన వారి ఉపవాసంను ముగించవలెను, అది (జూలియన్) వారంలోని ఏపేరిట రోజునైనా సంభవించును. కానీ అది ప్రపంచంలోని మిగతా సంఘముల యొక్క ఆచారంచొప్పున మరియు నేటికీ ఆచించబడుతున్న విధంగా మాత్రము కాదు. [14]

జూలియన్ కేలెండర్ యొక్క నిరంతర వారాల చక్రం అనగా

అబీబు 14 న వచ్చు బైబిల్ పస్కా జూలియన్ వారంలోని ఏ రోజునైనా వచ్చును అని అర్థం. తత్పలితంగా, అబీబు 16 పునరుత్థాన దినము, ఎల్లప్పుడూ ఆదివారం రోజున రాదు. జూలియన్ కేలెండర్లో ఈస్టర్ వేడుక ఆచరించుటకు ఒత్తిడిచేస్తూ ఆజ్జాపించినవారు, సమస్త క్రైస్తవులు అబీబు 14న పస్కాకు బదులుగా, ఈస్టర్ ఆదివారంను పునరుత్థాన దినంగా ఆచరించాలని ప్రకటించారు. అలా యేసు యొక్క పునరుత్థానాన్ని గౌరవించుటకు ఏర్పాటుచేయబడిన ఒక అన్యమత సెలవుదినం ద్వారా యహూషువః యొక్క మరణంకు జ్ఞాపకార్ధంగా ఉన్న యహువః నియామక దినమును భర్తీచేసెను.

ఫాదరీలు మరియు బిషప్పుల సమాజాలు ఈ విషయంలో ఒక సమ్మతితో, ఒక మతపరమైన ఆజ్ఞకు పరస్పరం ఒక అంగీకారంలో ఐక్యమాయెను, అది ప్రభువు రహస్య యొక్కపునరుత్థాన దినోత్సవంను ప్రభువు దినము [ఆదివారం] నాడు తప్ప మరి ఏ ఇతర దినమునందునూ జరుపుకుండా చేయాలి మరియు మనము ఈ రోజున పస్కా ఉపవాసంను ముగించుట ఆదరించాలి అని.[15]

పునరుత్థానము: ఈష్టరా? లేక ప్రధమపనల దినమా?

పునరుత్థానము: ఈష్టరా?
లేక ప్రధమపనల దినమా?

పశ్చిమ బిషప్పులు ఆక్రమమైన ఆజ్ఞను ప్రవేశపెట్టిన వెంటనే బైబిల్ కేలండరును ఆచరించే వారు తమ నిరసనను తెలిపారు. పాలిక్రేట్స్ రోమ్ యొక్క బిషప్పు విక్టర్ నకు పంపిన ఒక లేఖలో, పస్కా దినమును లెక్కించుట కోసం బైబిల్ కేలెండర్ ఉపయోగించడం గురించి తన  దృఢమైన నమ్మకం నిర్ధారించాడు. ఆయన లేఖ నేటి క్రైస్తవులకు ప్రత్యేకమైన ప్రాముఖ్యత కలిగి ఉంది ఎందుకంటే ప్రియమైన యోహాను మరియు అపొస్తులుడైన ఫిలిప్ వంటి వారు పస్కాను ఆచరించారని తెలియజేస్తుంది!

యుసేబియాస్ చెప్పారు:

కానీ పాలిక్రేట్స్ నేతృత్వంలో ఆసియా యొక్క బిషప్పులు, తమకు పాత తరాలచేత అందించబడిన పురాతన సాంప్రదాయాన్ని అనుసరించాలని నిర్ణయించుకొనెను. అతను స్వయంగా రోమ్ యొక్క బిషప్పు విక్టర్ నకు మరియు చర్చికి పంపిన ఒక లేఖలో తనకు ఏవిధమైన సంప్రదాయం అందించబడెననే దానిని గురించి ఈ క్రింది పదాలను వ్రాసెను:

 

మేము ఖచ్చితమైన రోజును పాటిస్తాము; ఒక దినమును చేర్చడం లేదా తీసివేయడం చేయము. ఆసియాలో కూడా గొప్ప జ్యోతులు మరణమాయెను, వారు మరలా ప్రభువు దినాన, ఆయన పరలోకం నుండి నుండి మహిమతో రాబోయే రోజున తిరిగి లేచెదరు, మరియు పరిశుద్ధులందు చూడబడుదురు. వీరిలో పన్నెండు అపొస్తలులలో ఒకడైన పిలిప్పు, . . . మరియు, అంతేకాక, సాక్షి మరియు ఒక గురువు అయిన ప్రభువు మీద ఆనుకొని ఎఫెసీలో మరణించిన యోహాను కూడా ఉన్నారు. మరియు ప్రధాన గురువు మరియు హతసాక్షి అయిన స్ముర్నలోని పోలికార్పు . . . వీరందరూ ఏవిధమైన మార్పులు చేయకుండా, సువార్త ప్రకారం పస్కా యొక్క పదునాలుగవ దినమున గమనిస్తూ విశ్వాసం యొక్క నియమం క్రింద నడుచుకొనిరి. [16]

ఆసియాలో విశ్వాసులు పస్కాను లెక్కించుటలో బైబిల్ కేలెండరును విడిచిపెట్టుటకు నిరాకరించి ఉంటే, వారు అదేవిధంగా అదే కేలండరుపై లెక్కించవలసిన నిజమైన సబ్బాతును విడనాడుటకు కూడా నిరాకరించారు అని చెప్పవచ్చు. వెంటనే రోమ్ యొక్క బిషప్ " వారితో ఏకీభవించు అసంఖ్యాకమైన చర్చిలను, సమస్త ఆసియానందు గల పరిసయ్యులను వికల్పమైనవారిగా చూపించి వారిని సాధారణ ఐక్యత నుండి కత్తిరించుటకు ప్రయత్నించెను; మరియు అతను ఉత్తరాలు వ్రాస్తూ అక్కడ పూర్తిగా బహిష్కరించమని సమస్త బ్రదరన్లకు ప్రకటించాడు." [17]

పునరుత్థానం ఎప్పుడు జరిగెననే దానిపై ఎప్పుడూ ఏ వాదన జరగలేదు అనేది గమనించవలసిన విషయం. అది సూర్యచంద్ర కేలండరుపై అబీబు16 న జరిగినదని ఇరువురికీ తెలుసు. అసమ్మతి అనేది పైన తెలిపిన విధంగా, ఎప్పుడు దానిని జరుపుకోవాలి అనేదానిపైనే ఉంది. తేదీలు కేలెండర్లు ద్వారా స్థాపించబడతాయి, కాబట్టి చివరికి, ఆ వేడుకను గుర్తించటానికి ఏ కేలెండర్ ఉపయోగించాలి అనేదానిపైనే ఈ వివాదము ఉంది. క్రైస్తవులను మరియు అన్యులను నిజంగా ఏకం చేయడానికి శిలువ వేయడం మరియు పునరుత్థానాన్ని పాటించవలసిన విధానంను బైబిల్ సూర్యచంద్ర కేలండర్ నుంచి అన్యమత కేలెండరైన, జూలియన్ సౌర కేలెండరునకు బదిలీ చేయవలసి వచ్చింది. క్రీ.శ 321 లో ఆదివారంను మహిమపరచే ఉత్తర్వులను చేసిన నాలుగు సంవత్సరాల తరువాత, కాన్స్టాంటైన్ ఈ వివాదంను స్థిరపరచేందుకు 325 లో నైసియా సభను ఏర్పాటుచేశాడు.

ఇకపై రక్షకుని యొక్క బలియాగంను సూర్యచంద్ర కేలండరులోని అబీబు 14, 15 మరియు 16 రోజులలో గమనించబడదు. భవిష్యత్తులో, అటువంటి జ్ఞాపకార్ధాలు మార్చి 20-22 నుండి ఏప్రిల్ 22-25 మధ్యలో తిరుగుతూ వుండే జూలియన్ కేలెండర్ యొక్క శుక్రవారం, శనివారం మరియు ఈస్టర్ ఆదివారంలకు బదిలీ చేయబడెను. రోమ్ యొక్క బిషప్, తనకు ఎక్కువ శక్తిని మరియు ప్రభావంను కోరుచూ, తన ప్రభావ బలంను కాన్స్టాంటైన్ తో కలిపారు. "కాన్స్టాంటైన్ సమయానికి, చర్చిలోని మతబ్రష్టం ఒక స్నేహపూర్వక పాలకుని (అవసరమైన బలమైన శక్తిని సరఫరా చేయుటకు) కోసం సిద్ధంగా ఉంది." [18]

కాన్స్టాంటైన్ ఇకపై తారీఖులను లెక్కించడానికి యూదు కేలండరు విధానం ఉండరాదని దృఢముగా చెప్పెను.

నైస్ (నైసియా) సభవద్ద క్రైస్తవ మతమునకు దాని పితరులతో గల చిట్ట చివరి బంధం పూర్తిగా తెగిపోయెను. ఈష్టరు పండుగ ఇప్పటివరకు ఎక్కువ ప్రాంతంలో యూదుల పస్కా ఆచరించే అదే సమయంలో అనగా సిన్హెద్రియన్ [Sanhedrin] ద్వారా లెక్కించి నిర్ణయించిన తారీఖులలో జరుపబడుతుంది. కానీ ఇకపై ఈ ఆచరణకు స్వస్తిచెప్పి యూదుల కేలండరు నుండి పూర్తిగా వేరుగా స్వతంత్రంగా వుండాలి; పండుగలలోకెల్లా అతి పవిత్రమైన దీనిని యూదుల ఆచరణ చొప్పున అనుసరించినచో అది తగని రీతిలో లెక్క దాటిపోవుచున్నది. ఇది మొదలుకొని ఈ అప్రియమైన ప్రజలతో దేనిలోనూ స్వారూప్య సంబంధము కలిగి యుండరాదు. మన రక్షకుడు మనకు వేరొక మార్గము చూపించి యుండెను. వారి నియమాల (లెక్కింపు) సాయం లేకుండా మనము పస్కా  జరుపుకునే స్థితిలో లేమని యూదా ప్రజలు అతిశయించుట అనుచితము. ఈ వ్యాఖ్యలు చక్రవర్తి కాన్స్టాంటైన్ కు ఆపాదించడమైనది. "ఇది యూదుల విధిని నిర్ణయించగల చర్చి యొక్క మార్గదర్శక సూత్రములుగా (మారెను)" [19]

 

కాన్స్టాంటైన్, వాటి అలల ప్రభావాలు నేటికినీ ప్రతిధ్వనించుచున్న మూడు పనులను చేశాడు:

1. డైస్ సోలిస్ (ఆదివారం) ను వారంలోని మొదటి రోజుగానూ, డైస్ సాటర్నిని (శనివారంను) వారంలోని చివరి రోజుగానూ గల ఏడు రోజుల గ్రహ వారంను స్థిరపరిచెను.
2. ఈస్టరును ఘనపరచి, నిజమైన పస్కా మరియు అన్యమత ఈస్టరు ఎప్పుడూ ఒకే రోజున రాకుండు విధంగా స్థిరపరిచెను.
3. డైస్ సోలిస్ ను అన్యమతస్థులకు మరియు క్రైస్తవులకు ఇరువురికీ ప్రార్థనా దినంగా ఏర్పాటు చేసెను.

దీర్ఘకాలిక ప్రభావంగా 'ఈస్టర్ సండే' క్రీస్తు పునరుత్థాన దినంగా క్రైస్తవ రూపావళి లోనికి ప్రవేశించినది. ఈ కాల కొలత యొక్క పునరేఖీకరణ ఫలితార్ధం ఏమిటంటే ఈస్టర్ సండేకు ముందున్న, శనివారము, నిజమైన బైబిల్ సబ్బాతుగా శాశ్వతంగా మారింది. ఇది కాన్స్టంటైన్ ఆదివారపు చట్టము యొక్క నిజమైన మహత్వము మరియు ఇది నిరంతర వారాల చక్రము ఎల్లప్పుడూ వుండేవి అనుకునే ఆధునిక ఊహాగానము యొక్క పునాదిని స్థాపించెను. [20]

కాన్స్టాంటైన్ యొక్క చర్యల ఫలితాలకు నిజానికి సామ్రాజ్యపు అన్యమత వర్గాలవారు మొగ్గుచూపారు. అయితే, రోమ్ యొక్క అవినీతి బిషప్పులు ఈ చర్యల ఫలితాలు క్రైస్తవులకు కూడా అనుకూలం అయ్యేలా చేయగలరు. "కాన్స్టాంటైన్ సమయానికి, చర్చిలోని మతబ్రష్టం ఒక స్నేహపూర్వక పౌర పాలకుని (అవసరమైన బలమైన శక్తిని సరఫరా చేయుటకు) కోసం సిద్ధంగా ఉంది." [21] సృష్టి మరియు మోషే నుండి తరాలుగా వస్తున్న నిజమైన సూర్యచంద్ర కేలండరు కోల్పోనదబడినది.


ఫలితం

కాన్స్టాంటైన్ యొక్క క్రైస్తవ ఐక్యతా సూత్రం యొక్క ఫలితం వేగంగా కనిపించసాగింది. పస్కాను లెక్కించడానికి బైబిల్ కేలెండర్ ఉపయోగంను తీసివేయుటకు అంగీకరించని వారందరూ, తమను అణచివేయుటకు ఉక్కుపాదం మోపుటను అనుభవించిరి. కాన్స్టాంటైన్ యొక్క కుమారుడు, కాన్స్టాంటియస్, తన తండ్రి యొక్క చట్టంను ఒక అడుగు ముందుకు తీసుకు వెళ్ళి అతడు బైబిల్ కేలెండర్ వాడుకను యూదుల నుండి కూడా తొలగించెను. చరిత్రకారుడు డేవిడ్ సైడర్ స్కై ఇలా గమనించారు: " కాన్స్టాంటియస్ క్రింద ఇక పాత కేలెండరును వర్తింపచేయుట ఇక సాధ్యంకాదు." [22]

"తరువాతి సంవత్సరాల్లో, యూదులు 'ఇనుము మరియు అగ్ని మార్గములో వెళ్ళిరి.’ క్రైస్తవ చక్రవర్తులు యూదు కేలెండర్ యొక్క లెక్కింపును నిషేధించి, మరియు పండగ దినముల ప్రకటనను అనుమతించలేదు. గ్రేట్జ్ ఇలా చెప్పారు, "యూదు సమాజాలు వారి పండుగలకు సంబంధించిన ముఖ్యమైన మత నిర్ణయాల విషయాలలో పూర్తిగా అనుమానస్పద స్థితిలో మిగిలారు." తక్షణ పర్యవసానంగా హిబ్రూ కేలెండరు యొక్క స్థాపన మరియు గణన హిలెల్ II ద్వారా జరిగెను". [23]

రూపం మార్చుకొనుట: క్రైస్తవులు అన్యులుగా మార్పునొందుట

రూపం మార్చుకొనుట: క్రైస్తవులు
అన్యులుగా మార్పునొందుట

కాన్స్టాంటైన్ క్రియ అపోస్టోలిక్ క్రైస్తవులపై కూడా ప్రభావం చూపింది. టెర్ట్యులియన్ ఇలా చెప్పెను:[24]  అన్యులలో కలిసిపోతున్న క్రైస్తవులు ఇప్పటికే (రెండవ శతాబ్దం మొదట్లో) వారి ఆరాధనను "సూర్యుని దినానికి" మార్పిడి చేసుకొనుచుండగా మిగిలిన వారు నిజమైన సబ్బాతునకు 1,000 సంవత్సరాల పాటు వ్రేలాడుతుండిరి. నైసియా కౌన్సిల్ కు దాదాపు 40 సంవత్సరాల తర్వాత లవొదికయ కౌన్సిల్ (సి. 363-364) క్రైస్తవులు సబ్బాతు రోజున పని చేసుకుని మరియు ప్రభువు యొక్క దినాన పనినుండి విశ్రమించాలని కోరుతూ ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ ఉత్తర్వును ఆంగ్లంలోకి అనుసరిస్తే, ఇలా తెలియజేస్తుంది:

క్రైస్తవులు యూదుల వలె చేయరాదు మరియు శనివారం నందు తీరికగా ఉండరాదు, కానీ ఆ రోజున పని చేసుకోవాలి; కానీ ప్రభువు దినమును వారు గౌరవించాలి, ముఖ్యంగా క్రైస్తవులుగా, వీలైతే ఆ రోజున ఏపనియు చేయకూడదు. అయితే, వారు యూదులు లాగా  కనబడితే మాత్రం, వారు క్రీస్తు నుండి బయటకు త్రోసివేయ బడతారు.

రోమన్ కాథలిక్ బిషప్ మరియు పండితుడు, కార్ల్ జోసెఫ్ వాన్ హెఫెలీ (1809-1893 ప్రకారం), పైన వాక్యంలో "శనివారం" అనే పదం యొక్క ఉపయోగంను తప్పుగా ఉపయోగించెనని చెప్పారు. అసలైన దానిలో ఉపయోగించిన పదం సబ్బాత్ లేదా సబ్బాటో అనేది డైస్ శాటర్ని లేదా శనివారం కాదు.

క్వోడ్ నాన్ ఓపోర్టెట్ క్రిష్టియానోస్ జుడాయైజెరె ఎట్ ఓటియారె ఇన్ సబ్బాటో/Sabbato, సెడ్ ఒపెరారి ఇన్ యోడెమ్ డై. ప్రెఫెరెంటెస్ ఆటెమ్ ఇన్ వెనెరేషనె డామినికం డయెం సి వాక్రె వోలారింట్, ఉట్ క్రిష్టియాని హోక్ ఫాసియట్; క్వోడ్ సి రెపిర్టి ఫ్యూరింట్ జుడాయైజిరె అనథిమా సింట్ అ క్రిష్టో.

 

కేలెండర్ మార్పు సమయంలో క్రైస్తవులు సబ్బాతుగా ఉండుట విషయంలో శనివారంతో గందరగోళ పడలేదు. డైస్ శాటర్ని/శనివారం ఇటీవల అన్యమత గ్రహ వారం మొదటి రోజు నుండి చివరి రోజుకు తరలించబడుట జరిగిందని అప్పటి అందరికీ తెలుసు. . . సబ్బాటో అనేది యూదుల సూర్యచంద్ర కేలండరులో ఏడవ రోజుగా ఉండగా అధికారంలో వున్న ఎవరునూ దానితో దేనినీ కలపలేరు. అలాగే, ఇవి రెండు విభిన్న కేలెండరు వ్యవస్థల మీద ఉన్న రెండు వేర్వేరు రోజులై ఉన్నాయి. [25]

కాన్స్టాంటైన్ మరియు కాన్స్టాన్టియస్ యొక్క మతపరమైన ఉత్తర్వులకు రోమ్ యొక్క రాజకీయ శక్తి మద్దతు నిచ్చెను. వివాదం ఆదివారం మరియు శనివారంల మధ్య అని కొందరు పండితులు తప్పుగా భావించుచుండగా, ఆ కాలంలో ప్రజలకు బైబిలు యొక్క సూర్య చంద్ర కేలండరు ఉనికి మరియు దానిని ఎలా ఉపయోగించాలనేది బాగా తెలుసు అని చారిత్రక వాస్తవికత తెలియజేస్తుంది. తూర్పున లేదా రోమన్ సామ్రాజ్యం యొక్క పరీవాహ ప్రాంతాల అవతల అనేకమైన విశ్వాసులు బైబిలు కాలమానాన్ని పరిత్యజించుటను అసహ్యించుకునిరి. "సబ్బాతు ఆచరణను కష్టంగా భావించి ఒక మార్గం కోసం చూస్తున్న  క్రైస్తవులు [జూలియన్] వారంలో మొదటి రోజు దిశగా ఎక్కువ అభిమానంతో కదిలారు. కానీ సామ్రాజ్యం శివార్లలో, సెమిటిజం వ్యతిరేకత ఉనికిలో లేని ప్రాంతాల్లో గల ఇతర విశ్వాసులు ఏడవ రోజు సబ్బాతును గౌరవించుటను కొనసాగించారు." [26]


స్పందన


హిలెల్ II

క్రైస్తవులు ఉపయోగించే బైబిలు కేలెండరు చివరికి కోల్పోవుటకు దారితీసిన పరిణామాల వెనుక కాన్స్టాంటైన్ ఒక శక్తిగా వుంటే, అలాంటపుడు మరో వ్యక్తి, ఒక యూదుడు, జరుగుతున్న పరిణామాలకు స్పందన చూపవలసిన బాధ్యత కలిగి యున్నాడు.

"వసంత కాలం వచ్చునపుడు వచ్చే న్యూమూన్ ను, కొత్త నెలను గమనించటం ద్వారా కొత్త సంవత్సరంను ప్రకటించుట సన్హెద్రిన్ ద్వారా మాత్రమే వీలగును. హిలెల్ II, సన్హెద్రిన్ చివరి అధ్యక్షుని సమయంలో, రోమన్లు ​​ఈ పద్థతిని నిషేధించిరి. అందువలన హిలెల్ II తన స్థిర కేలెండరును నెలకొల్పవలసి వచ్చెను, అలా, దాని ప్రభావంగా భవిష్యత్తు సంవత్సరాల కేలెండర్లను సన్హేద్రిన్ ముందస్తుగానే నిర్ణయించగలిగే అవకాశం కలిగెను.

"జ్యూయిష్ కేలెండర్ మరియు సెలవులు (కలిపి సబ్బాత్.): ది జ్యూయిష్ కేలెండర్ కేలెండర్ మార్చడం,"
http://www.torah.org.

 

యెరూషలేం యొక్క వినాశనానికి ముందు,

ప్రధాన యాజకుడు కేలెండరు బాధ్యతను వహిస్తూ ఉండేవాడు. "సన్హేద్రిన్ (రబ్బీనికల్ సుప్రీం కోర్టు) యెరూషలేములో పాలిస్తున్నప్పటికీ, అక్కడ కేలెండర్ వ్యవస్థ లేదు. వారు ఒక లీపు సంవత్సరంను ప్రకటించాలో లేదోనని తెలుసుకొనుటకు ప్రతి సంవత్సరమూ అంచనా వేసుకునేవారు".[27]  యాజకత్వము ఇకపై లేనపుడు ఈ పని, సంహేద్రిన్ అధ్యక్షునిపై పడినది. ""కాన్స్టాన్టియస్ హయాంలో (క్రీ.శ 337-362) యూదుల వేధింపులు ఎంత తారాస్థాయికి చేరుకునెనంటే. . . తీవ్రమైన శిక్ష యొక్క బాధ వలన కేలెండరు గణన నిషేధించబడింది [జరిగినది]." [28]  ఈ పరిస్థితికి ప్రతిస్పందనగా, హిలెల్ II, క్రీ.శ 359 లో, ఒక అసాధారణ నిర్ణయం తీసుకునెను, అది పురాతన బైబిలు కేలెండరును సవరించుట. అలా క్రైస్తవులతో యూదులు మరింత సులభంగా కలిసి ఉండవచ్చు.


హిలెల్ II తరువాత

హిలెల్ యొక్క కొత్త కేలెండర్ వ్యవస్థ ప్రకారం,

సుదూర సమాజాలు ఇకమీదట, ఒక కొత్త నెల

ఎప్పుడు ప్రారంభమవునో తెలుసుకొనుటకు

సంహేద్రిన్ అధ్యక్షుని యొక్క సమాచారం కోసం

ఎదురు చూడవలసిన అవసరం లేదు. ప్రతి సమాజపువారును ఒక కొత్త నెల ఎప్పుడు ప్రారంభమవునో అలాగే 13 వ నెల ఎప్పుడు కలపవలసియున్నదో వారే తెలుసుకొనగలుగలరు.


"స్థిర" కేలెండరు

హిలెల్ కేలెండరును "స్థిర" పరచినప్పుడు , లీపు సంవత్సరాలను శాశ్వత పద్ధతిలో అమర్చు ఏర్పాటునుచేసెను.[29]   హిలెల్ కు మునుపు19 సంవత్సరాల మెటోనిక్ చక్రమును అనుసరించి ఈ విధంగా లీపు సంవత్సరాలను ఉపయోగించిరి అనేది తెలియబడుచున్నది, కానీ నిరూపించబడలేదు. "హిలెల్ తన కేలెండరును [పరిశీలనల ద్వారా కాకుండా] గణిత మరియు ఖగోళ లెక్కలపై [ఆధారపరచెను]. ఈ కేలెండరు, ఇప్పటికీ వినియోగంలో వుండెను, నెలల నిడివి మరియు అధిక మాసములను చేర్చుట 19 సంవత్సరాల చక్ర కాలంలో ప్రమాణీకరించబడును, తద్వారా చాంద్రమాన కేలెండరు సౌర సంవత్సరాలతో సంబంధం కలిగి వుంటుంది."[30] అతను ఒక 13 వ నెలను (అధికమాసంను) 19 సంవత్సరాల కాలచక్రంలో 3 వ, 6, 8, 11 వ, 14 వ, 17 వ మరియు 19వ సంవత్సరంలలో సమకూర్చెను.

కానీ హిలెల్ 19-సంవత్సరాల అధికమాసముల చక్రాన్ని తెలిసేలా చేయుట కంటే ఎక్కువే చేశాడు, అది దీనిని అందరూ అన్ని సంభావ్యతలలో వుపయోగించునట్లు చేయుటయే. అతను పురాతన సబ్బాతును పాటించవలసిన దినాన్ని చంద్ర నెలయొక్క 8 వ, 15 వ, 22 వ మరియు 29 రోజుల నుండి, జూలియన్ నెలలలోని ప్రతి శనివారంనకూ బదిలీ చేసెను. ఈ మార్పు మరోదానిని తప్పనిసరి చేసెను: వాయిదా యొక్క నియమాలు. వారపు సబ్బాతు సూర్య చంద్ర కేలండరు నుండి శనివారంనకు మార్చివేయబడెనని ఈ "వాయిదా నియమాల" అవసరత స్పష్టంగా సూచిస్తున్నది.,ఈ అనవసరత హిలెల్ కేలెండరు "స్థాపంచుటకు" ముందు లేదు. యూనివర్సల్ యూదుల ఎన్సైక్లోపీడియా ప్రకారం, "న్యూ మూన్ ఇప్పటికీ (చంద్రునిపై ఆధారపడియుంది), మరియు సబ్బాతు మొదట్లో చంద్ర దశల మీద ఆధారపడి ఉండేది."[31]   సబ్బాతు మరియు వార్షిక పండుగలు రెండింటినీ సూర్యచంద్ర కేలెండరుపై లెక్కించినప్పుడు ఈ "వాయిదా నియమాల" అవసరత ఉండదు. వార్షిక పండుగలను ఒక కేలెండరుపై లెక్కిస్తూ, వారపు సబ్బాతును మరో కేలండరుపై లెక్కించుటవలన "ఈ వాయిదా నియమాల" అవసరతను కలిగించే విభేద పరిస్థితులు ఏర్పడతాయి.

వాయిదా యొక్క నియమాలు:
 
1. ఒక యూదుల క్రొత్త సంవత్సరం, శృంగధ్వని పండుగ ఆదివారం, బుధవారం, లేదా శుక్రవారాలలో రాకూడదు.

2. 7వ నెల యొక్క న్యూ మూన్, లేదా మొలాడ్, ఆదివారం, బుధవారం, లేదా శుక్రవారములయందు పడినచో దానిని మరుసటి రోజు వరకు వాయిదా వేయాలి.

3. ఒక సాధారణ సంవత్సరంలో 7వ నెల యొక్క మొలాడ్ మంగళవారం 3 a.m. మరియు 204/1080 భాగాలు లేదా తరువాత సంభవిస్తే, న్యూ మూన్ దినము గురువారం వరకు వాయిదా వేయబడును.

4. ఒక లీపు సంవత్సరానికి తరువాత వచ్చు ఒక సాధారణ సంవత్సరంలో, 7 వ నెల యొక్క మొలాడ్ సోమవారం ఉదయం 9 (a.m) మరియు 589/1080 భాగాల తరువాత వస్తే న్యూ మూన్ మంగళవారం వరకు వాయిదా వేయబడును.

ఈ వాయిదా నియమాలు లేకపోతే, వార్షిక పండుగలు శనివారంతో పోట్లాడవలసి వస్తుంది. ఉదాహరణకు: శృంగధ్వని పండుగ (ఏడవ నెలయొక్క న్యూమూన్ దినము) ఆదివారంవస్తే, పర్ణశాలల పండుగ చివరి రోజు శనివారం వస్తుంది. ఇది పండుగ చివరి రోజు యొక్క సంప్రదాయ ఆచారముతో సంఘర్షణపడుతుంది. అందువలన, వాయిదా నియమాలలో మొదటి మరియు రెండవ నియమాలు అవసరమవుతాయి. వాయిదా నియమాలలో మూడవది ఒక సాధారణ సంవత్సరంలో 355 రోజుల కంటే ఎక్కువ వుండకుండునట్లు సహాయపడుతుంది. వాయిదా నియమాలలో నాల్గవ నియమం ఒక లీపు సంవత్సరము తరువాత వచ్చు సాధారణ సంవత్సరం 383 రోజుల కంటే తక్కువ వుండకుండునట్లు సహాయపడుతుంది.[32]

ఈ "స్థిర" కేలెండర్ అత్యంత క్రమపరచబడినదై ఉండెను.

"సంవత్సరపు పొడవు మరియు రోష్ హాషనాః వారంలో ఏదినాన వచ్చుననే వాటిని బట్టి సరిగ్గా పద్నాలుగు వేర్వేరు హిబ్రూ కేలెండర్ సంవత్సరాల నమూనాలు ఉన్నాయి. నియమాలు క్లిష్టముగా వుండుటవలన, ఒకే నమూనా వరునగా కొన్ని సంవత్సరాల కాలంలో అనేక సార్లు పునరావృతం అవుట, మరియు అప్పుడు మరలా చాలా కాలం వరకు మళ్ళీ రాకపోవుట జరుగుతుంటుంది. అయితే యూదు కేలెండరు చాలా ఖచ్చితమైనదై వుంది అని అంటారు. కొన్ని ఇతర కేలెండర్లలో లాగా దీనిలో కాలమును "కోల్పోవుట" లేదా  "పొందుట" జరగదు". [33]

ఇది హిలెల్ II ద్వారా మనుగడ చర్యగా భావించబడింది. కాన్స్టాంటైన్ యొక్క కుమారుడు, కాన్స్టాన్టియస్ యొక్క క్రూరమైన వేధింపులకు ప్రతిస్పందనగా ఇది తయారు చేయబడింది.

"రోమన్ మరియు పర్షియన్ సామ్రాజ్యాలందతటా చెదిరియున్న యూదు సమాజాలవారు కలిగియున్న చివరి బంధంను ప్రధానగురువు తన సొంత చేతితో నాశనం చేసెను. అతను తమ సొంత గౌరవం కన్నా యూదామతం కొనసాగుటనే ముఖ్యముగా ఇష్టపడి, అందువలన తన పూర్వీకుల యొక్క విధులను విసర్జించెను. . .చాలా చింతించదగినదై యుండెను. సిన్హెద్రియన్ సభ్యులు ఈ ఆవిష్కరణకే మొగ్గుచూపారు.[34]

హిలెల్ II కేలెండరును "స్థిర" పరచినప్పుడు, కేవలం అతడు మాత్రమే, సన్హేద్రిన్ అధ్యక్షుడిగా,

భవిష్యత్ కాలంలో పూర్తిగా శనివారంన పూజించే విధంగా ప్రభావశీలంగా యూదులకు అనుమతినిచ్చెను.


 

ఫలితం

 

నేడు, 1,700 సంవత్సరాల పైగా గడచిన తరువాత, కాన్స్టాంటైన్ చర్య మరియు దానికి హిలెల్ II ద్వారా కలిగిన స్పందన, ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా వందల మిలియన్ల ప్రజలను ప్రభావితం చేయుచుండెను.

 

• కేథలిక్కులు పునరుత్థానంనకు గౌరవార్ధంగా ఆదివారంన ఆరాధిస్తారు. ఇది సూర్యచంద్ర కేలండరుపై లెక్కించే పస్కాను ఆచరించు విధానము నుండి ఒక అన్య, సౌర కేలండరుపై లెక్కించే ఈస్టరును పాటించేలా కాన్స్టాంటైన్ చేసిన చర్యవలన కలిగినది.

• యూదులు శనివారమున పూజించుటను తాల్మూడిక్ చట్టం సమర్థిస్తుంది ఎందుకంటే, ఒకనికి నిజ సబ్బాతు ఎప్పుడు వచ్చునో తెలియనప్పుడు అతడు ఏడు రోజులలో ఒక దినమును సబ్బాతుగా ఆచరించవచ్చుననే చట్టంవలన.

• చాలా మంది ప్రొటెస్టంట్లు ఆదివారమున పూజించుటలో కేథలిక్కులను వెంబడిస్తూ, ఆధునిక, గ్రిగోరియన్ వారపు మొదటి రోజును, పునరుత్థానపు దినమని అనుకుంటూ వుంటారు.

• శనివారపు ఆరాధనచేసే ప్రొటెస్టంట్లు శనివారపు సబ్బాతును ఎందుకు ఆచరించుదురంటే, అది ఆధునిక వారములోని 7వ రోజు మరియు యూదులు శనివారపు ఆరాధనను చేయుచుండెను గనుక అది బైబిలు సబ్బాతు అని అనుకొనట వలన.

• అదేవిధంగా, ముస్లింలు, ప్రార్థనల కొరకు మసీదులకు శుక్రవారం వెళ్ళుట ద్వారా అన్యమత పాపల్ గ్రిగోరియన్ కేలండరును ఆచరిస్తూ గౌరవిస్తుండెను.


ఆధునిక గ్రెగోరియన్ కేలెండర్ ఉపయోగించి నిజమైన ఏడవ-దినపు సబ్బాతును కనుగొనుట సాధ్యం కాదు. ఈ సౌర కేలెండరు అనగా ఒక అన్య పద్ధతిలో సమయంను లెక్కంచుట కంటె మరేమీ కాదు. ప్రారంభ జూలియన్ కేలెండరు అన్యమతస్థుల కోసం, అన్యమతస్తుల స్థాపించారు. ఇది మతసంబంధమైన వాడుక కోసం నైసియ కౌన్సిల్ వద్ద అధికారికంగా స్థాపించబడినది. ఇది తరువాత కాలంలో పోప్ గ్రెగొరీ XIII యొక్క ఆదేశం మేరకు జెసూయిట్ ఖగోళ శాస్త్రవేత్త, క్రిస్టోఫర్ క్లావియస్ ​​ద్వారా సర్దుబాటు చేయుట జరిగినది. అందుకే దీని పేరు, గ్రెగోరియన్ కేలండరు. జూలియన్ కేలండరు (అలా దాని నుండి వచ్చిన గ్రెగోరియన్ కేలండరు) అన్యాచారాలపై  స్థాపించబడినదని, మరియు బైబిల్ కేలండరుతో ఇది ఎలాంటి సంబంధం కలిగి లేదు అని క్లావియస్ ​​ధ్రువీకరించాడు.

గ్రెగోరియన్ కేలండరు గురించి తన వివరణలో, క్లావియస్ ఇలా ​​ఒప్పుకున్నాడు: జూలియన్ కేలండరు చర్చి యొక్క మతపరమైన కేలండరుగా అంగీకరించబడినప్పుడు, బైబిలు కేలండరు తిరస్కరించబడినది: "కాథలిక్ చర్చి ఎన్నడూ పస్కాను జరుపుకొనే విషయంలో [యూదుల] హక్కును ఉపయోగించలేదు, కానీ ఎల్లప్పుడూ దాని వేడుక నిమిత్తం చంద్రుని [35] మరియు సూర్యుని యొక్క చలనములను గమనించెను, అలా అది రోమ్ యొక్క అత్యంత పురాతన మరియు అత్యంత పవిత్ర పొంతిఫులచే పవిత్రపరచబడెను, (కానీ) నైసియా యొక్క మొదటి కౌన్సిల్ ద్వారా కూడా ఇది నిర్ధారించబడెను." [36] "రోమ్ యొక్క అత్యంత పురాతన మరియు అత్యంత పవిత్ర పొంతిఫులు" గా ఇక్కడ చెప్పబడిన వారు, కాన్స్టాంటైన్ పోంటిఫెక్స్ మాగ్జిమస్ (హెడ్) గా వున్న అన్య సమాజపు పొంతిఫులను చూచించుచుండెను.

చక్రవర్తికాన్స్టాంటైన్ ఐక్యతను కోరుకొనెను.

అతను క్రైస్తవ ఐక్యతా సూత్రం ద్వారా మరియు యహూషువః మరణము గుర్తుచేసుకొనుటలో

బైబిలు కేలెండరును వినియోగించుటను నిర్మూలించుట ద్వారా ఈ లక్ష్యాన్ని సాధించాడు.

హిలెల్ II యూదామతపు భౌతిక మనుగడను కోరుకొనెను. అతడు అన్యాచారాలతో రాజీ పడుట మరియు బైబిలు కేలెండరును

సవరించుట ద్వారా తన లక్ష్యాన్ని సాధించారు.

ఈ చర్య వెంబడి జరిగిన ప్రతిచర్యల కారణంగా జనసమూహములలో శనివారం బైబిలు యొక్క సబ్బాతు అనే భావనకు అలాగే ఆదివారం రక్షకుని పునరుత్థాన దినమనే భావనకు కూడా దారితీసెను. అలా, క్రైస్తవులు మరియు యూదులు ఒకేలా అన్యమత సౌర కేలెండర్లను ఉపయోగించి వారి ఆరాధన రోజులను లెక్కిస్తూ, యహువః యొక్క నిజమైన సబ్బాతును నిర్లక్ష్యం చేశారు.

పవిత్ర సబ్బాతు దినమందు సృష్టికర్తను ఆరాధించాల కోరుకునేవారు ఎవరునూ

ఆరాధన దినాలను లెక్కించేందుకు యహువఃను గౌరవించని, మరియు ఆత్మను నాశనం చేసే ఈ నాశనకరమైన హేయవస్తువును వుపయోగించరు. సృష్టి యొక్క సూర్య-చంద్ర కేలెండరు మాత్రమే నిజమైన సబ్బాతు ఉండే సరియైన స్థానమును సూచించును. మానవుని యొక్క సంప్రదాయాలను పక్కన విడచిపెట్టుము. యహువః యొక్క వాక్యంను మాత్రమే అంగీకరించుము మరియు ఆయన యొక్క కాలనిర్ణయ పద్ధతి ద్వారా ఆయనను ఆరాధించుము.


[1] ఇప్పుడు పోప్ దని చెప్పుకొనుచున్న, ఈ టైటిల్,  పురాతన రోమ్ నుండి వచ్చినది . పోంటిఫెక్స్ మాగ్జిమస్ అనే టైటిల్ అన్య రోమన్ మతపు పొంతిఫులకు ప్రధాన పూజారిదై ఉంది. అది ఒక మతపరమైన అలాగే రాజకీయ అధికారమై యుండెను.

[2] న్యూ కాతోలిక్ ఎన్సైక్లోపీడియా, వాల్యూం. 4, పేజీలు. 179-181. కార్పస్ ఇన్సెరిప్షనం లాటినేరియం 1863 సంపుటి నందు నమోదైన వివిధ శాసనాలు.., వాల్యూం 2, పే. 58, # 481; "కాన్స్టాంటైన్ I", ది న్యూ స్టాండర్డ్ ఎన్సైక్లోపీడియా, వాల్యూం. 5. వీటిని కూడా చూడండి క్రిస్టోఫెర్ B. కోల్మన్, కాన్స్టాంటైన్ ది గ్రేట్ అండ్ క్రిష్టియానిటీ, పే. 46.

​​[3] రాబర్ట్ L. ఓడోమ్, సన్డే ఇన్ రోమన్ పాగనిజం లో చూడండి, " ప్లానెటరీ వీక్ ఇన్ ఫస్ట్ సెంచరీ బీ.సీ."

[4] పి Brind'Amour, లీ కేలండర్ రొమైన్: recherchés chronologiques, 256-275.

[5] https://en.wikipedia.org/wiki/Roman_calendar#Nundinal_cycle

[6] ఎవియేటర్ జెరుబావెల్, సెవెన్ డే సర్కిల్, పే. 46, ఉద్ఘాటన సరఫరా.

[7] ఫ్రాంజ్ కమోంట్, టెక్సెటెస్ ఎట్ మోనుమ్నెట్స్ ఫిగరెస్ రేలేటిఫ్స్ ఆక్స్ మిస్టరెస్ మిత్రా, వాల్యూమ్. 1, పే. 112, ఉద్ఘాటన సరఫరా.

[8] ఇ డీల్, ఇన్క్రిప్షనేస్ లాటినే క్రిస్టియనే వెటెరెస్, వాల్యూమ్. 2, పే. 193, నెం 3391. వీటిని కూడా చూడండి జె.బి. డి రోసీ, ఇన్క్రిప్షనేస్ క్రిస్టియనేక్ ఉర్బిస్ రోమె, వాల్యూమ్. 1, భాగం 1, పే. 18, నెం 11.

జె.బి. డి రోసీ.

[9] ఫిలిప్ స్కాఫ్, హిస్టరీ ఆఫ్ క్రిస్టియన్ చర్చ్, వాల్యూం. III, p. 380, ఉద్ఘాటన సరఫరా.

[10] ఈ సమయానికి, పశ్చిమాన అన్య క్రైస్తవులు యహూషువః పునరుత్థాన దినంగా చాలాకాలం నుండి ఆదివారంన జరుపుకుంటూ ఉండెను.

[11] జే వెస్ట్ బరీ -జోన్స్, రోమన్ అండ్ క్రిస్టియన్ ఇంపీరియలిజం, పే. 210, ఉద్ఘాటన సరఫరా.

[12] మైఖేల్ I. రోస్తోవ్ట్, ది సోషల్ అండ్ ఎకనామిక్ హిస్టరీ ఆఫ్ ది రోమన్ ఎంపైర్, పేజి. 456.

[13] ఓడొం, op. సిట్., పేజి. 188, ఉద్ఘాటన సరఫరా.

[14] యూసేబియాస్, చర్చి హిస్టరీ, పుస్తకం V, చాప్టర్ 23, వర్సెస్. 1, ఉద్ఘాటన సరఫరా.

[15] ఐబిడ్., వి. 2.

[16] ఐబిడ్., చాప్టర్ 24, వర్సెస్. 1-4, 6, ఉద్ఘాటన సరఫరా.

[17] ఐబిడ్., వి. 9.

[18] మైఖేల్ I. రోస్తోవ్ట్, ది సోషల్ అండ్ ఎకనామిక్ హిస్టరీ ఆఫ్ ది రోమన్ ఎంపైర్, పేజి. 456.

[19] హెన్రిచ్ గ్రేట్జ్, హిస్టరీ ఆఫ్ ది జ్యూస్, (ఫిలడెల్ఫియా: అమెరికా, 1893 జ్యూయిష్ పబ్లికేషన్ సొసైటీ), వాల్యూమ్. 2, పేజీలు. 563-564, ఉద్ఘాటన సరఫరా.

[20] ఎలైన్ వార్నహాల్ట్ & లారా లీ వార్నహాల్ట్ -జోన్స్, కేలెండర్ ఫ్రాడ్, "బైబిల్ కేలెండర్ ఔట్లాడ్" ఉద్ఘాటన సరఫరా.

[21] రోస్తోవ్ట్, op. సిట్., పేజి. 456.

[22] డేవిడ్ సైడర్ స్కై, ఆస్ట్రోనామికల్ ఆరిజన్ ఆఫ్ జ్యూయిష్ క్రోనాలజీ పి. 651, ఉద్ఘాటన సరఫరా.

[23] గ్రేస్ ఆమేడాన్, రిపోర్ట్ ఆఫ్ కమిటీ ఆన్ హిస్టారికల్ బేసిస్, ఇన్వాల్వమెంట్, అండ్ వాలడిటీ ఆఫ్ ది అక్టోబర్ 22, 1844, పోసిషన్". పార్టు 5, సెక్షన్ బి, పేజి. 17-18, బాక్స్ 7, ఫోల్డర్ 1, గ్రేస్ ఆమేడాన్ కలెక్షన్, (కలెక్షన్ 154), అడ్వెంటిస్ట్ రీసెర్చ్ సెంటర్, అండ్రూస్ యూనివర్సిటీ, బెర్రిన్ స్ప్రింగ్స్ , మిచిగాన్.

[24] జె పి మింగే, పెట్రోలాజియ లాటినే Vol. 1 లో టెర్టూలియన్, అపోలాజియ, చాప్. 16. 369-372; ఆంటే-నైసెన్ ఫాదర్స్ ప్రామాణిక ఆంగ్ల అనువాదంలో వాల్యూమ్. 3, పే. 31.

[25] వార్న్ హాల్ట్, op. సిట్, "చేంజింగ్ ది కేలెండర్: పాపల్ సైన్ ఆఫ్ అథారిటీ.

[26] లెస్లీ హార్డింగే, Ph.D., బ్రిటన్ లోని సెల్టిక్ చర్చి, పే. 76. స్కాట్లాండ్ లో క్రైస్తవులు వారు పదకొండవ శతాబ్దంలో రోమన్ కాథలిక్ రాణి వచ్చే వరకు పస్కాను లెక్కించేందుకు బైబిల్ కేలండరును ఉపయోగించుట కొనసాగించిరి.

[27] http://www.chabad.org/library/article_cdo/aid/526875/jewish/The-Jewish-Year.htm

[28] జూయిష్ ఎన్సైక్లోపెడియా, నుండి సారాంశంగా "కేలెండర్, హిస్టరీ హాఫ్", http://jewishencyclopedia.com/articles/3920  ఉద్ఘాటన సరఫరా.

[29] రబ్బినికల్ కేలెండర్ ("హిలెల్ II యొక్క) ఎలా లెక్కిస్తారు అనే వివరణ కొరకు చూడండి. http://www.jewfaq.org/calendr2.htm

[30] జుడాయిజం 101, "ది జ్యూయిష్ కేలెండర్," www.jewfaq.org

[31] యూనివర్సల్ జూయిష్ ఎన్సైక్లోపెడియా, "హాలిడేస్" పే. 410.

[32] http://www.ironsharpeningiron.com/postponements2.htm

[33]http://www.chabad.org/library/article_cdo/aid/526875/jewish/The-Jewish-Year.htm

[34] గ్రేట్జ్, op. సిట్., సంపుటి. II, p. 573.

[35] "ఈస్టర్ ఒక స్థానబ్రంశ పండుగ, అనగా ఇది ప్రతి సంవత్సరం ఒకే తేదీన జరిగేది కాదు అని అర్థం. ఈస్టర్ యొక్క తేదీని ఎలా లెక్కిస్తారు? నైసియా కౌన్సిల్ (క్రీ.శ 325) లో దీనిని, (వసంత) విషవత్తు/equinox తరువాత లేక ముందు వచ్చే పౌర్ణమి, అనగా పస్కా పౌర్ణమి, తరువాత వచ్చు ఆదివారమున ఈస్టర్ తేదీని స్థిరపరిచారు." http://catholicism.about.com/od/holydaysandholidays/f/Calculate_Date.htm

[36] క్రిస్టోఫర్ క్లావియస్, రొమాని కేలండారి ఎ గ్రెగొరియొ XIII పి యమ్ రెస్టిటూటి ఎక్ప్లికేటో, పే. 54.