Print

నకిలీ వార్త! ''శనివారం విశ్రాంతిదినము''

చరిత్ర, లేఖనము, మరియు ఖగోళశాస్త్రాల యొక్క జాగ్రత్తయైన అధ్యయనం శనివారము లేఖనాల యొక్క ఏడవ దినపు సబ్బాతు కాదని, లేదా ఆదివారం రక్షకుని పునరుత్థాన దినం కాదు అనే భయంకరమైన వాస్తవాన్ని తెలుపుతుంది!

life-saverఆర్థర్ S. మాక్స్వెల్, చరిత్ర యొక్క ఫలితాన్ని మార్చిన, యుద్ధ సమయంలో చేసిన ఒక ఊహాగానము యొక్క కథను చెప్పాడు. మాక్స్వెల్ ప్రకారం, స్పానిష్ యుద్ధనౌకా సమూహం, ఉప దళాధిపతి లార్డ్ నెల్సన్ నేతృత్వంలో చిన్న, వెలుపలికి తపాకులు పెట్టియున్న బ్రిటిష్ నౌకలను వెంటాడుతున్నాయి. స్పానిష్ నౌకలు బ్రిటీష్ నౌకలను మించియుండెను మరియు సులభమైన విజయం ఊహించబడెను. అకస్మాత్తుగా, ఒక బ్రిటీష్ నావికుడు నీటిలో పడిపోయాడు. పరిస్థితులను బట్టి, చాలా మంది కమాండర్లు నౌకాయానం కొనసాగించారు. ఒకరి ప్రాణం కోసం అందరి ప్రాణాలను ప్రమాదంలోనికి నెట్టుట ఎందుకు?

అయితే, జరిగింది ఇది కాదు. బ్రిటిష్ నావికుని రక్షించడానికి ఆదేశం ఇవ్వబడెను. బ్రిటిష్ ఓడలు నెమ్మదించాయి. ఒక ప్రాణరక్షక-పడవ క్రిందికి దించబడి, ఒంటరి వ్యక్తిని రక్షించుటకు పంపబడినది.

ఇది చూస్తూ, ఒక నావికుని యొక్క ప్రాణాన్ని రక్షించటకై ఎవరైనా ఓటమి ప్రమాదాన్ని కొనితెచ్చుకొందురా అని స్పానిష్ కమాండర్ నమ్మలేకపోయాడు. బ్రిటీషు కమాండర్ సముద్రంపై ఖచ్చితంగా అదనపు బలగాలను కలిగియుండవచ్చునని అతడు భావించాడు. వారు ఎందుకు నిలిచిపోయిరి మరియు ఒక వ్యక్తిని రక్షించుటకు ఎందుకు సమయాన్ని తీసుకొనిరి? అతడి తప్పుడు ఊహాగానం కారణంగా, బ్రిటీషు నౌకలతో మరొక రోజు పోరాడవచ్చును అనుకొని, వాటిని పట్టుకొనకుండా స్పానిష్ నౌకలు వెనుతిరిగి పారిపోయెను.

అంతిమంగా, ట్రఫాల్గార్ యుద్ధంలో బ్రిటీషుతో యుద్ధం చేయుటకు స్పెయిన్ ఫ్రాన్సుతో కలిసినప్పుడు, స్పానిష్ నౌకాదళం యొక్క వాస్తవిక నిర్మూలనకు ఈ ఊహాగానం కారణమాయెను. ట్రఫాల్గార్ వద్ద బ్రిటీష్ విజయం, నెపోలియన్ యొక్క సముద్ర వ్యూహాన్ని మరియు దాడి ప్రణాళికలను నాశనం చేసింది. . . [ఇది] నెపోలియన్ యొక్క సామ్రాజ్యానికి పరిమితిని ఏర్పరచింది మరియు అతని పతనానికి దారితీసింది. 1 స్పానిష్ కమాండర్ ఒకవేళ తాను ఆ తప్పుడు భావనను చేయకుండా ఉండి యుంటే, నెల్సన్ ముందుగానే ఓడిపోయేవాడు మరియు ట్రఫాల్గర్ యుద్ధం జరిగిన దానికి చాలా భిన్నంగా ఉండి యుండేది.

ఊహాగానాల వలన వచ్చు ప్రమాదం

ఊహాగానాలు చేయువారు తమ నమ్మకాలను అంచనా వేయుటకు ఖచ్చితంగా నిరూపించబడని తమకు తెలిసిన (లేదా నిజమైన-ఆలోచనలుగా-అంగీకరించిన) వాస్తవాలను ఉపయోగిస్తారు. ఒక తప్పుడు భావనను ఖచ్చితమైన సత్యంగా ఆమోదించినప్పుడు సమస్య తలెత్తుతుంది.

అంచనా: “తెలిసిన సమాచారాన్ని పొడిగించుట లేదా ఉజ్జాయింపు చేయుట ద్వారా అంచనా వేయుట.

అమెరికన్ హెరిటేజ్ డిక్షనరీ ఆఫ్ ది ఇంగ్లిష్ లాంగ్వేజెస్

కొన్ని ఊహాగానాలు సరదాగా ఉంటాయి. ఉదాహరణకు 1800 లలో డాక్టర్ డియోనైసిస్ లార్డ్నెర్స్ యొక్క హెచ్చరిక ప్రకారం, రైళ్ళలో పూర్తి వేగంతో ప్రయాణించు వారు ప్రాణవాయువు లేకపోవుట వలన ఊపిరాడక యుందురు. మరికొన్ని ఊహాగానాలు ప్రమాదకరంగా ఉంటాయి, సమస్త రక్తం ఒకే విధంగా ఉండునని 17 వ శతాబ్దంలో చేసిన ఊహాగానం, వైద్యులు జంతువుల రక్తాన్ని మానవులకు ఎక్కించుటకు దారితీసింది. దాని కారణంగా మానవులు మరణించారు. మరియు, మరింత విస్తృతంగా వ్యాపించిన ఊహాగానం, మరింత తప్పుదోవ పట్టించు శక్తిని పొందును.

నేడు, క్రైస్తవమత సామ్రాజ్యం ఒక మోసంలో పట్టబడింది. ఒక ఊహాగానంపై ఆధారపడిన ఒక మోసం. విచారకరంగా, ఈ ఊహాగానానికి 1,600 సంవత్సరాల కాలం మద్దతుగా నిలుస్తున్నందున, ఇది సత్యాన్ని వెల్లడిచేసే ప్రతివారిని నిశ్శబ్ద పరుచుటకు ప్రయత్నిస్తుంది.

ఆ ఊహాగానం ఏమిటంటే, ఆధునిక వారం, ఆదివారం నుండి శనివారం వరకు, సృష్ట్యారంభం నుండి ఆటంకం లేకుండా నిరంతరాయంగా తిరుగుతూ ఉన్నది అనేది. ఈ ఊహాగానం శనివారాన్ని లేఖనాల యొక్క ఏడవ రోజు సబ్బాతుగాను మరియు ఆదివారాన్ని- వారంలోని మొదటి రోజుగా- అనగా యహూషువః సమాధి నుండి తిరిగిలేచిన రోజుగాను నమ్మేలా చేసింది. ఈ మోసం ఊహాగానం యొక్క ప్రభావం. అయితే ఆ ఊహ అంతయు తప్పు.

సత్యమేమిటంటే, నేటి శనివారం సృష్టి వద్ద యహువః విశ్రాంతి తీసుకొన్న అసలైన సబ్బాతు కాదు. ఇది సీనాయి వద్ద 10 ఆజ్ఞలలో పొందుపరచబడిన మరియు యహూషువః, ఆయన శిష్యులు ఆచరించిన పురాతన విశ్రాంతిదినము కాదు, అలాగే మన సామాన్య యుగంలో మొదట శతాబ్దాలలోని ప్రారంభ క్రైస్తవులచే ఆచరించబడిన నిజమైన విశ్రాంతిదినము కూడా కాదు. అదేవిధంగా, ఆదివారం యహూషువః మరణం నుండి లేచిన పునరుత్థానాన దినము కాదు. ఇలాంటి మాటలు దిగ్భ్రాంతికి గురి చేస్తాయి మరియు మనుష్యులు వీటికి పెద్దగా ఆలోచించని ప్రతిచర్యను కలిగి ఉంటూ, వీటిని తప్పుగా కొట్టివేస్తారు. అయితే, చరిత్ర, లేఖనం మరియు ఖగోళశాస్త్రం కూడా నిరంతర వారాల చక్రం యొక్క ఊహను తప్పని రుజువు చేయుచుండెను.

ఇవి తప్పుగా అనిపించుట వలన వినిన వెంటనే ఈ మాటలను మత విరోధమైనవని కొట్టివేయుటకు బదులు - చరిత్రలో మరచిపోబడి మరియు గ్రంథాలలో మరచిపోబడి, కానీ పరలోకం దృష్టిలో ఇప్పటికీ భద్రంగా ఉన్న వాస్తవాలను జాగ్రత్తగా అధ్యయనం చేయుటకు WLC మిమ్మల్ని ఆహ్వానిస్తుంది. దయచేసి హృదయాన్ని తెరచి ఉంచండి: అనగా, ఒకవేళ ఇది నిజమని యహువః ఆత్మ మిమ్ము ఒప్పించుటకు ప్రయత్నిస్తే ఒప్పుకొనుటకు సిద్ధంగా ఉన్న మనస్సును. సాక్ష్యాలను జాగ్రత్తగా సమీక్షించి, వాటన్నిటినీ దగ్గరకు చేర్చి చూస్తున్నప్పుడు మీ మనస్సును సురక్షితంగా కాపాడుటకు మీరు యహువఃపై నమ్మికయుంచవచ్చు. ఆజ్ఞవెంబడి ఆజ్ఞ ఆజ్ఞవెంబడి ఆజ్ఞ సూత్రమువెంబడి సూత్రము సూత్రమువెంబడి సూత్రము కొంత ఇచ్చట కొంత అచ్చట.. (యెషయా 28: 10)

చరిత్రలో మరువబడెను

మా సంభాషణ నిరాశను మరియు ఆశ్చర్యాన్ని సమాన భాగాలుగా కలిగియుండెను. నేను నా స్నేహితునికి గౌరవమిచ్చాను. అతడు మంచి విద్యావంతుడు. దైవశాస్త్రంలో మాస్టర్ డిగ్రీని కలిగియున్నాడు. నేను అతనిని మేధోపరంగా నిజాయితీ గలవాడని, సత్యానికి మొదటి స్థానమిచ్చువాడని నమ్మాను. ఒక సెవెంత్ డే అడ్వెంటిస్టు పరిచారకుడుగా ఏదో ఒక దినాన కాక, ఒక నిర్దిష్టమైన దినాన (ఏడవ దినపు సబ్బాతులో) ఆరాధన చేయుట ఎందుకు ప్రాముఖ్యమైనదో అని అనేకసార్లు అతడు అతడు సువార్త సభలలో ప్రసంగించుటను నేను విన్నాను.

కాబట్టి, నేను బైబిలు కాలాలలో విశ్రాంతిదినము వేరే క్యాలెండర్ ద్వారా లెక్కించబడినట్లు తెలుసుకొన్న తరువాత, నేను మొదటిగా ఈ విషయాలన్నిటిని పంచుకోవాలనుకున్నది అతడితోనే. సత్యంపై అతని ప్రేమ మరియు అతడి పాండిత్యం వలన అతడు దీనిని కూడా వినును అని నేను తలంచితిని. (అయితే, మనకంటె తనకు ఎక్కువ తెలుసని నమ్మేవారితో పంచుకోవాలనుకొనుట తరచుగా కష్టంగా ఉంటుందని అప్పటికి నేను తెలుసుకోలేదు.)

మొదట అతడు, సృష్ట్యారంభం నుండి నిరంతర వారాల చక్రం అనేది ఒక అబద్దపు ఊహాగానం, అనే ఆలోచనను కొట్టి పారేసాడు.

“జూలియన్ క్యాలెండర్ గ్రెగోరియన్ కేలండరుగా మార్పు చెందినప్పుడు, వారంలోని ఏ ఒక్క దినమూ కోల్పోబడలేదు. అక్టోబర్ 4, గురువారంను, వెంటనే అక్టోబర్ 15, శుక్రవారం వెంబడించెను” అని నాకు ఇదివరకే తెలిసిన వాస్తవాలను వివరిస్తున్నాడు.

అతడు సరిగ్గానే చెప్పాడు, కానీ అతడు సరిపోవునంత వెనుకకు వెళ్ళుట లేదు. సత్యం మరుగైన గతంలో దాగి ఉంది, అయితే సత్యాన్ని కనుగొనేందుకు, కేవలం 400 సంవత్సరాల క్రితానికి మాత్రమే కాక మరింత లోతుగా త్రవ్వి మరియు మరింత వెనుకకు వెళ్ళుట అవసరం. వారాల చక్రంలో మార్పు, అలాగే వారం యొక్క పొడవులో మార్పు - ఆధునిక గ్రెగోరియన్ క్యాలెండర్ పరిచయానికి వెయ్యి సంవత్సరాల క్రితమే సంభవించినది.

అత్యంత అధునాతన సమాజాల వరకు అత్యంత పురాతన క్యాలెండర్లు సూర్య-చంద్ర క్యాలండర్లే. సౌర క్యాలెండరుకు మారిన మొదటి దేశం ఐగుప్తు, కానీ మొదట్లో, క్యాలెండర్లు ఎల్లప్పుడూ కొంత మార్గంలో ఖచ్చితమైన చంద్రమాన క్యాలెండర్లుగా (వీటిలో సంవత్సరం పొడవునా తగ్గుతున్న దినాలు గల నెలల సమస్య, మరియు ఊహించని సమయాల్లో వచ్చే ఋతువులు సమస్య ఉంటుంది) లేక సూర్య-చంద్ర క్యాలెండర్లుగా (సౌర సంవత్సరానికి లంగరు వేయబడిన నెలలను- చంద్రమానాలను కలిగి, చంద్రునికి జతచేయబడి కాలానుగుణ ఋతువుల "మార్పులను" నిరోధించు క్యాలండర్లు) ఉండేవి. ఈ వాస్తవాన్ని అనేక పురాతత్వవేత్తలు పదే పదే స్థాపించారు. వేల్స్ యూనివర్సిటీకి చెందిన Dr. నికోలస్ కాంపియన్ ఇలా రాశాడు: “శిలాయుగానికి చెందిన చంద్ర క్యాలెండర్లను మరియు ఏకశిలా స్మారక చిహ్నాలు, మెసొపొటేమియా యొక్క ఖగోళ నివేదికల సాక్ష్యాలను బట్టి, మతపర మరియు రాజకీయపర, రెండింటి సామూహిక ప్రయోజనాల కోసం, ఖగోళ శాస్త్ర వినియోగించినదానిని గూర్చి ప్రారంభ ఖగోళ రికార్డులలో స్పష్టంగా కనిపిస్తుంది.”

సమయం, నిరంతరాయంగా ఉంటుంది, నిజమే. అయితే, దానర్థం అది లెక్కించబడుతున్న పద్ధతి ఎల్లప్పుడూ నిరంతరాయంగా ఉంటుందని కాదు. ఆధునిక క్యాలెండరులోని వారాలు నిరంతరంగా తిరుగుతుంటాయి. కానీ, ఇది ఎల్లప్పుడూ ఇలానే లేదు, మరియు ఈ వాస్తవాన్ని స్థాపించుటకు మనము శిలాయుగపు చంద్ర క్యాలెండర్లకు తిరిగి వెళ్లవలసిన అవసరం లేదు.

గ్రహ వారం

నేడు మనం వినియోగిస్తున్న వారం “గ్రహ వారం” అని పండితులు చెప్పుచున్నారు. దీనికి కారణం వారం యొక్క రోజులకు వివిధ గ్రహాల పేర్లు, ఇంకా ఖచ్చితంగా, గ్రహ దేవతల పేర్లు పెట్టబడి యుండుట. ఆంగ్లంలో మంగళవారం, బుధవారం, గురువారం మరియు శుక్రవారాల పేర్లు: తిల్, వోడెన్, తోర్, మరియు వోడెన్ యొక్క భార్యయైన ఫ్రైగ్ అనే నార్స్ దేవతల నుండి తీసుకోబడ్డాయి. 2

జరిగిన సంఘటనలను బట్టి, దీనంతటినీ గ్రహించుట ఒక కష్టమైన అంశం, ఎందుకంటే ఒకసారి అధికారంలోనికి వచ్చిన తరువాత, రోమన్ కేథలిక్ సంఘం గ్రహ వారపు అన్యమత మూలాన్ని దాచిపెట్టాలని మరియు తద్వారా ఇది బైబిలు వారానికి కొనసాగింపు అని ప్రజలు నమ్మునట్లు చేయాలని కోరుకొనెను. (చాలామంది నేటి ఆధునిక శనివారం లేఖనాల యొక్క నిమైన సబ్బాతు అని అనుకొనుటలో దాని విజయాన్ని గమనించవచ్చు.) అన్యమత దినాల పేర్లను బైబిలు దినాల-పేర్లుగా మార్చుటలో తెలివిగా కృషి చేశారు. అనగా: "మొదటి రోజు," "రెండవ రోజు," "మూడవ రోజు," మొదలైనవి.

ఈ ప్రయత్నంలో, కేథలిక్ చర్చి పాక్షికంగా విజయవంతమైనది. నేడు అనేక భాషలలో, అసలైన "శనివారం" కు (లేదా సాటర్న్ దినానికి) బదులుగా "సబ్బాత్" అనే పదాన్ని చేర్చారు మరియు "ఆదివారం" కు (సూర్యుని దినానికి) బదులుగా "ప్రభువు దినం" అనే పదాన్ని సూచించారు.

అస్పష్టం చేయు: "గ్రహించుటను లేదా అర్థం చేసుకొనుటను కష్టతరం చేయుటకు గందరగోళంగా లేదా అపారదర్శకంగా చేయుట. అస్పష్టంగా లేదా మసకగా ఉండు; చీకటిగా మారు."

అయితే, అక్కడ ఏ పొరపాట్లు లేకుండా జాగ్రత్త పడ్డారు. నిజమైన బైబిల్ సబ్బాతును దాచిపెట్టి, మోసగించుటయే వారి అసలు ఉద్దేశ్యం. రట్జర్స్ విశ్వవిద్యాలయంలో సోషియాలజీ యొక్క ఇజ్రాయిల్ ప్రొఫెసర్ ఎవియేటర్ జెరుబావెల్, సెవెన్ డే సర్కిల్ (ఏడురోజుల వలయం) అనే పుస్తకాన్ని వ్రాశాడు: వారం యొక్క చరిత్ర మరియు అర్థం. దీనిలో, అతడు ఆధునిక వారంలోని అన్యమత మూలాలను అలాగే ఆ మూలాలను మరుగుగా ఉంచుటకు రోమన్ కేథలిక్ చేసిన ప్రయత్నాన్ని స్పష్టంగా తెలియజేశాడు. అతడు ఇలా వ్రాసాడు:

ప్రత్యేకమైన క్రైస్తవ ఇష్టాలతో వారాన్ని అందించుటకు స్పష్టమైన ప్రయత్నం చేసినప్పటికీ, సంఘం తన, యూదుల ఏడు రోజుల లయ రూపాన్ని సంరక్షించుటకు ఎంచుకున్నది. దీనిని ఏమాత్రం తేలికగా తీసుకోకూడదు; రోమీయుల సాంప్రదాయక ఎనిమిది-రోజుల వారాల చక్రానికి అనుగుణంగా క్రమం తప్పకుండా దానిని సమీకరించుటకు అది ఎంచుకున్నది. చివరికి, సబ్బాతును రద్దు చేయడంలో భాగంగా, యూదుల ఏడు రోజుల ఉనికికి గల కారణం (రైసన్ డిట్రే) ను కూడా సంఘం నాశనం చేసింది.

ఏడు రోజుల లయను పరిరక్షించుట అనేది, జుడాయిజంతో (యూదామతంతో) సంఘం యొక్క లోతైన, గ్రుడ్డి అనుబంధానికి స్పష్టమైన ఫలితం, అంతేకాకుండా దాని సభ్యత్వం లోని గణనీయమైన యూదా భాగాన్ని అవసరం లేకుండా వేరగుటను నివారించడానికి సంఘం చేసిన ఒక కార్యసాధక ప్రయత్నం. ఏదేమైనా, చాలా ఐరోపా భాషలలోని వారపు రోజుల పేర్లను పరిశీలించినప్పుడు అవి, మతపరమైన ఏడు-రోజుల చక్రం యొక్క పరిణామంను వీక్షించుటకు యూదుల వారం మాత్రమే కాక ఇతరములు కూడా ఉన్నవని మనకు గుర్తు చేస్తాయి. మనం చూచినట్లుగా, క్రైస్తవ మతం రోమా సామ్రాజ్యంలో పరిచయం చేయబడుతున్న సమయంలో, యూదా మరియు గ్రహ వారాల కలయిక ద్వారా ఏడు-రోజుల చక్రం ఉత్పత్తి చేయబడినది. అప్పటినుండి అది నాగరిక ప్రపంచమంతటా విస్తరించింది. 3

మరో మాటలో చెప్పాలంటే, ఆధునిక వారపు నిర్మాణం, గతంలో ఎలా లెక్కించబడెనో అనే దాని యొక్క స్వయంచాలక కొనసాగింపు కాక ఉద్దేశపూర్వక ఎంపికగా ఉండెనని జెరుబావెల్ చెప్పుచుండెను. యూదుల ఏడు రోజుల వారాన్ని అనుకరించుటకు ఉద్దేశపూర్వకంగా ఒక ఏడు రోజుల వారం ఎన్నుకోబడి, ఇతర వారపు-పొడవులు ఉద్దేశపూర్వకంగా తిరస్కరించబడ్డాయి.

ప్రజలకు ఆధునిక శనివారం బైబిల్ సబ్బాతు కాదు అనే చరిత్ర యొక్క వాస్తవాలను అందించినప్పుడు: అనేకులు, సాటర్న్ దినము యొక్క వాస్తవమైన గ్రహ సంబంధ పేరును గూర్చి కాక, అనేక భాషలలో వారం యొక్క ఏడవ రోజు పేరు "సబ్బాతు" గా సూచించబడుతుందనే నిరూపించదగిన వాస్తవాన్ని గూర్చి మాట్లాడుదురు. జెరుబావెల్ దీని గురించి కూడా వివరిస్తూ, ఇలా చెప్పాడు:

రోమన్ కేథలిక్ సంఘం వారంలోని రోజుల విషయంలో యూదుల సాంప్రదాయిక నామకరణ వ్యవస్థ కు అధికారికంగా అంటిపెట్టుకుని ఉన్నప్పటికీ, సంఘ పితరులు వ్రాసిన రచనలలో రెండవ శతాబ్దపు ప్రారంభంలోనే ఈ రోజులు గ్రహసంబంధమైన పేర్లతో గుర్తించబడ్డాయి మరియు కనీసం A.D. 269 నుండి క్రైస్తవులచే ఉపయోగించబడ్డాయి. వారంలోని రోజుల యొక్క అసలైన హెబ్రీ నామకరణాన్ని పునరుద్ధరించడానికి ఏకైక ముఖ్యమైన క్రైస్తవ సంస్థ ప్రయత్నించుట వలన పెన్సిల్వేనియా యొక్క మొదటి జనరల్ అసెంబ్లీ (స్పష్టంగా 1682 మరియు 1706 మధ్య, “ఫ్రెండ్స్ సొసైటీ” యొక్క ఆత్మకు ప్రాతినిధ్యం వహిస్తుంది) ద్వారా "అన్య నామములు" అధికారికంగా తొలగించబడినట్లు తెలుస్తోంది. యాదృచ్ఛికంగా, ఈ రోజు వరకు, క్వేకర్స్ ఇప్పటికీ వారి ఆదివారపు పాఠశాలలను "ఫస్ట్-డే పాఠశాలలు" అని పిలుచుదురు. మనకు శబ్దవ్యుత్పత్తిపరమైన ఆసక్తికరమైన వాస్తవాన్ని బట్టి వారంలోని దినాలకు గ్రీకు లేదా స్లావిక్ భాషలలో ఎటువంటి గ్రహ సంబంధిత నామములు లేవని తెలుస్తుంది, మరియు తూర్పు సంఘం మాత్రమే జ్యోతిష్య శాస్త్రం యొక్క గణనీయమైన ప్రభావాన్ని అణచివేయడంలో విజయం సాధించినట్లు కనబడుతుంది. రోమ్ స్పష్టంగా చాలా తక్కువ విజయం సాధించింది ఎందుకంటే, ఆంగ్ల, జర్మన్, డచ్, డానిష్, నార్వేజియన్, ఐస్లాండిక్, స్వీడిష్, ఫిన్నిష్, లాప్, హంగేరియన్, అల్బేనియన్, రుమెనియన్, ఇటాలియన్, ఫ్రెంచ్, కాటలాన్, స్పానిష్, బ్రెటన్, గేలిక్, వెల్ష్, మరియు కార్నిష్ మొదలైన వాటిలో వారంలోని కనీసం కొన్ని దినాలు గ్రహ సంబంధిత పేర్లను సూచిస్తున్నందున.

జ్యోతిషశాస్త్రం క్రైస్తవ మతం కంటే ముందుగా, బహుశా చాలా వేగంగా రోమన్ సామ్రాజ్యం అంతటా విస్తరించినదని, శబ్దవ్యుత్పత్తి వాస్తవం [భాషా చరిత్ర] ద్వారా స్పష్టమౌతుంది. అలా, నాల్గవ శతాబ్దం ప్రారంభంలో, చివరకు సామ్రాజ్యంపై సంఘం నియంత్రణ పొందేసరికి, వారం యొక్క ఏడు రోజుల నుండి గ్రహ మూలాలను పూర్తిగా తొలగించుటకు తీవ్రమైన మతపరమైన కృషి చేయుటకు అప్పటికే చాలా ఆలస్యమైనది . . . . చివరికి రోమన్ సామ్రాజ్యం యొక్క కేంద్రం వద్ద కూడా, అనగా లాటిన్ భాషా పదాలు పుట్టి వ్యాప్తి చెందే చోట, ఇది శనివారం (సబ్బాతు) మరియు ఆదివారం (ప్రభువు యొక్క దినం) యొక్క రెండు "కీలక" రోజులకు సంబంధించినంతవరకు మాత్రమే సంఘం గ్రహ నామములను అధిగమించగలిగింది. గ్రహ నామముల ప్రభావం ముఖ్యంగా రోమా సామ్రాజ్యం యొక్క అంచుల చుట్టూ మరింత స్పష్టంగా కనిపిస్తుంది, క్రైస్తవ మతం చాలా తరువాత మాత్రమే ఆ స్థితికి చేరుకుంది. ఇంగ్లీష్, డచ్, బ్రెటన్, వెల్ష్, మరియు కోర్నిష్, ఈ రోజు వరకు ఏడు రోజుల యొక్క అసలు గ్రహాల పేర్లను సంరక్షించిన ఏకైక యూరోపియన్ భాషలు, ఇవన్నీ గ్రహసంబంధ వారం విస్తరించుట మొదలుపెట్టిన మన యుగంలోని ప్రారంభ శతాబ్దాలలో క్రైస్తవ మతం యొక్క ప్రభావం లేని ప్రాంతాలలో మాట్లాడబడిన భాషలు. ఈ భాషలు ఏవీ సంఘాలతో అత్యంత దగ్గర సంబంధం కలిగియున్న గ్రీకు లేదా లాటిన్ భాషల నుంచి ఉద్భవించలేదు. యాదృచ్ఛికంగా, వాస్తవానికి, జూడో-క్రిస్టియన్ (యూదా-క్రైస్తవ) వారం యొక్క రెండు "కీలక" దినాలలో కనీసం ఒక దినానికి గ్రహ సంబంధ పేరును సంరక్షించిన ఇతర భాషలు -జర్మన్, గాలీవుడ్, డానిష్, నార్వేజియన్, ఐస్లాండిక్, స్వీడిష్, ఫిన్నిష్, హంగేరియన్, మరియు అల్బేనియన్ 4 భాషలు.

అనేక భాషలలో పాత "శనివారం" ను "సబ్బాత్" తో మరియు అసలు "ఆదివారం" ను "ప్రభువు యొక్క దినం" తో భర్తీ చేయుటకు కారణం ఇదే.

ఒక సర్వే ప్రకారం, కనీసం అరవై-ఐదు భాషలలో వారంలోని రోజులకు పూర్వపు అన్యమతాల యొక్క ఏడు గ్రహాల దేవతల యొక్క పేర్లు పెట్టారని తెలియుచున్నది— సూర్యుడు, చంద్రుడు, అంగారకుడు, బుధుడు, గురుడు, వీనస్ మరియు సాటర్న్. మరియు క్రైస్తవ మతం యొక్క ఆధిపత్యం ఉన్న దేశాలలో కూడా దినాలను ఆ అన్య దేవతల పేర్లపై పిలుచుట ఇప్పుడు సర్వ సాధారణమైపోయినది.

“గ్రహాలకు సంబంధించిన దినాలలో ప్రార్థించుట ఆకాశ నక్షత్రాల ఆరాధనలో ఒక భాగమై ఉంటుంది.”

రాబర్ట్ ఎల్. ఓడం, సాటర్ డే ఇన్ రోమన్ పాగానిజం, పేజి. 158.

ఏది ఏమయినప్పటికీ, ఆకాశ నక్షత్రాలకు వారపు రోజులను అంకితం చేయుట అనేది హెబ్రీ లేదా క్రైస్తవ మూలం అని అనుకొనుట అసంబద్ధంగా ఉంటుంది. ప్రాచీన యూదులు, ప్రారంభ క్రైస్తవులు, దినాలను అంకెలతో లెక్కించారని పరిశుద్ధ లేఖనాలు తెలియజేస్తున్నాయి, వాటిలో ఆరవ మరియు యేడవ దినాలు “సిద్ధపరచు” మరియు “సబ్బాతు” దినాలుగా సూచించబడతాయి.

క్యాలెండర్ యొక్క రోజుల పేర్లను ఒక అన్యమత మూలానికి ఆపాదించెననుటలో నిఘంటువులు, ఎన్సైక్లోపీడియాలు, మరియు ఇతర సాధారణ మూలాలు ఏకీభవిస్తున్నాయి. 5

మళ్ళీ, గతంలో చెప్పినట్లుగా: గ్రహ వారం బైబిలు వారం నుండి తీసుకోబడలేదు. ఇది అన్యమతం నుండి వచ్చింది. వారపు దినాల పేర్లను మార్చడం ద్వారా సంఘం ఈ వాస్తవాన్ని దాచడానికి ప్రయత్నించింది మరియు దీనిలో, అది పాక్షికంగా విజయవంతమయింది.

గ్రహ వారం యొక్క మూలాలు

ఆధునిక వారం బైబిలు వారం వలే అదే పొడవును కలిగి యున్నది. కానీ, సూచించిన విధంగా, వారంలోని రోజుల పేర్లు అలాగే వారం దేనిలో తిరుగుతుంది అనేవి లేఖనం

నుండి రాలేదు. జెరుబావెల్ ముందుగా చెప్పినట్లుగా: సంఘం తన యూదుసంబంధిత ఏడు రోజుల లయ రూపాన్ని సంరక్షించుటకు ఎంచుకున్నది. దీనిని ఏమాత్రం తేలికగా తీసుకోకూడదు; రోమీయుల సాంప్రదాయిక ఎనిమిది-రోజుల వారాల చక్రానికి అనుగుణంగా క్రమం తప్పకుండా దానిని సమీకరించుటకు ఇది ఎంచుకున్నది. ఈ విషయంపై మరింత తరువాత చెప్పుకోవచ్చు, కానీ ఆధునిక వారం బైబిలు వారం నుండి సహజంగా వచ్చినది కాదని అర్థం చేసుకొనుటకు ఇప్పటికి ఇది సరిపోతుంది. అయితే, అది అన్యమూలం నుండి తీసుకోబడినది మరియు అది బైబిలు వారం నుండి రానప్పటికీ బైబిలు వారపు పొడవుకు సమానంగా ఉండేలా ఉద్దేశపూర్వకంగా ఎంచుకున్నది.

A stick calendar found in the Baths of Titus in Rome

రోమ్ లోని టైటస్ యొక్క స్నానవాటికలలో ఉన్న స్టిక్ క్యాలెండర్

గ్రహ వారం లేఖనాలకు వేరుగా, తన సొంతంగా ఒక చరిత్రను కలిగి ఉంది. గ్రహాల వారం మొదటిసారి ఉపయోగించబడి మరియు జూలియన్ క్యాలెండరులోనికి అంగీకరించబడుట ప్రారంభమైనప్పుడు, కొత్త ఏడు రోజుల వారం శనివారంతో ప్రారంభమయ్యేది! గమనించండి, ఉదాహరణకు, ఈ "స్టిక్" క్యాలెండర్ టైటస్ యొక్క స్నాన వాటికలులో లభించినది, ఇది A.D.81 లో రోమ్ లో నిర్మించబడినది. పై భాగంలో అడ్డంగా వారంలోని రోజుల వరుసలో, ఏడు గ్రహ దేవతలు ఉన్నాయి. చూపిన మొట్టమొదటి దేవుడు సాటర్న్. అతడు ఒక పొడవైన కొడవలిని కలిగి ఉన్నాడు ఎందుకంటే, అతడు "పంటల యొక్క దేవుడు" గా భావించబడ్డాడు.

వరుసలో తరువాతి దేవుడిగా, వారంలో రెండవ రోజున, సోల్ లేదా సూర్యదేవుడు, కాంతి కిరణాలతో నిండియున్నాడు. మూడవ రోజు చంద్ర దేవత, లూనా, నెల పొడుపును కిరీటంగా ధరించి ఉనద్ని. ఇతర దేవుళ్లు క్రమంలో అనుసరిస్తారు: అంగారకుడు, యుద్ధ దేవుడు, ఇనుప టోపీ ధరించి; బుధుడు, తన రెక్కల ఇనుప టోపీని ధరించి మరియు ఒక వైద్యవృత్తి చిహ్నాన్ని పట్టుకొని; గురుడు, తన వాడుకయైన పిడుగుల కట్టను పట్టుకొని; అంతిమంగా, వారం యొక్క చివరి రోజున, ప్రేమ యొక్క దేవత, వీనస్ ఉండును.

ఆధునిక వారము లేఖనం నుండి తీయబడలేదని ఇది స్పష్టంగా తెలుపుతుంది, ఎందుకంటే అది జూలియన్ క్యాలెండరులో ఉపయోగించుట మొదలయ్యే సమయానికి అది సాటర్న్ డే (శనివారంతో) ప్రారంభమయ్యేది మరియు వీనస్ దినం, శుక్రవారంతో ముగిసేది. కేవలం తరువాత మాత్రమే ఆదివారంతో మొదలై మరియు శనివారంతో ముగియునట్లు వారం ప్రామాణికం చేయబడినది.

ప్రారంభ జూలియన్ వారం

రక్షకుడు భూమి మీద జీవించిన కాలానికి జూలియన్ క్యాలెండరు చాలా క్రొత్త ఆవిష్కరణ. రోమీయులు ​​మొదట రోమన్ రిపబ్లిక్ క్యాలెండరును ఉపయోగించారు, ఇది హెబ్రీ క్యాలెండరైన సూర్య-చంద్ర క్యాలండర్ వంటిది.

రోమన్ రిపబ్లిక్ క్యాలెండర్ చంద్ర దశల ఆధారంగా ఉండేది. పొంతిఫులుగా పిలువబడిన, రోమీయుల అన్య పూజారులు క్యాలెండరును నియంత్రించు బాధ్యతను కలిగియుండేవారు . . . .

జూలియస్ సీజర్ సమయానికి, నెలలు ఋతువులతో పూర్తిగా సంబంధం లేకుండా ఉండేవి. జూలియస్ సీజర్ పోంటిఫెక్స్ మాగ్జిమస్ (ప్రధాన పూజారి) గా తన హక్కును ఉపయోగించి, గజిబిజియైన మరియు తప్పైన క్యాలెండరును సంస్కరణ చేసాడు. 6

అలెగ్జాండ్రియా ఖగోళ శాస్త్రవేత్త అయిన సోసిజెన్స్ ను సమయాన్ని లెక్కించే ఒక నూతన విధానమును రూపించమని జూలియస్ సీజర్ ఆహ్వానించాడు.

చంద్ర క్యాలెండరును పూర్తిగా తొలగించుటకు సోసిజెన్స్ నిర్ణయించుకొనెను. నెలలు కాలానుగుణంగా ఏర్పాటు చేయబడెను మరియు ఈజిప్టు క్యాలెండరు వలె ఒక సౌర (సోలార్) సంవత్సరం ఉపయోగించబడింది . . . ఏ [క్యాలెండర్] సంస్కర్త అయినా ఎదుర్కోవలసిన గొప్ప కష్టాలు ఏమిటంటే, నెలలను చంద్రుని దశలలో ఉంచి మరియు సంవత్సరాలను ఋతువులకు అనుగుణంగా కొనసాగేలా ఉండునట్లు చేస్తూ, క్యాలండర్ మార్పును చేయుట. సమర్థవంతమైన కాలానుగుణ క్యాలెండరును రూపొందించడానికి సాంప్రదాయిక లెక్కింపులో మూలాధార విరామం అవసరమవుతుంది. 7

Julius Cæsar Statue

అన్యమత, సౌర, జూలియన్ క్యాలెండరుకు, రోమన్ రిపబ్లిక్ యొక్క చంద్ర-ఆధారిత క్యాలెండరును పక్కన పెట్టుటకు బాధ్యుడైన వాని పేరు పెట్టబడినది.

కొత్త క్యాలెండర్ జూలియస్ సీజర్ పేరుమీద "జూలియన్" క్యాలెండర్ అని పిలువబడింది. క్రీ.పూ. 45 లో, నెలలను తిరిగి కాలాల యొక్క సరైన అమరికలోనికి తీసుకువచ్చుటకు క్యాలెండరుకు పూర్తి 90 రోజులు చేర్చబడ్డాయి. కానీ ఇక్కడ చాలా మంది ప్రజలు తెలుసులేకపోతున్న ఒక ముఖ్యమైన విషయం ఉంది. కొత్త జూలియన్ క్యాలెండరులో నిరంతర వారార చక్రం ఉంది. . . కాని ప్రతి వారానికి ఎనిమిది రోజులు ఉన్నాయి! ప్రారంభ కాలానికి చెందిన జూలియన్ క్యాలెండర్లు ఆధునిక క్యాలెండర్లు వలె గడులుగా నిర్మించబడలేదు, కాని తేదీలు నిలువు వరుసలలో ఉంచబడి, దినములు A నుండి H వరకు గల అక్షరాలతో సూచించబడేవి. 8

ఇది చరిత్ర మరియు పురాతత్వ శాస్త్రం ద్వారా సులభంగా స్థాపించబడు వాస్తవం. వాస్తవానికి, ప్రారంభ జూలియన్ క్యాలెండర్లలో, ఇప్పటికీ ఉనికిలో ఉన్న ప్రతి ఒక్కటి, (ఫాస్టి అని పిలువబడేది) ఎనిమిది రోజులను ప్రదర్శిస్తున్నాయి. అంతేకాక, అవి కైసరు అగస్టస్ కాలం నుండి టిబెరియస్ సీజర్ వరకు లేదా క్రీ.పూ. 32 నుండి క్రీ.శ. 37 వరకు సూచిస్తున్నవి. ఇది భూమిపై యహూషువః జీవించిన కాలానికి కలుస్తుంది. యహూషువః దినాలలో రోమీయులు జూలియన్ క్యాలెండర్ యొక్క ఎనిమిది రోజుల వారాన్ని ఉపయోగించారు. పాలస్తీనాలో ఉన్న రోమా సైన్యాలు ఉపయోగించినది దీనినే. యహూషువః దినాలలో యూదులకు ఈ క్రింది రెండు క్యాలెండర్లు తెలుసి యున్నవి:

  1. నిరంతర ఎనిమిది-రోజుల వారాల చక్రంతో ఉన్న రోమా విజేతల సౌర క్యాలెండర్; లేదా,
  2. నిర్గమకాండం వద్ద మళ్లీ స్థాపించబడిన సృష్టి యొక్క సూర్య-చంద్ర క్యాలెండర్; ఇది ప్రతి న్యూమూన్ దినాన పునఃప్రారంభమయ్యే ఏడు రోజుల వారాన్ని కలిగియుండును.

యూదులు ఏ క్యాలెండరును ఉపయోగించిరని మీరు అనుకుంటున్నారు? డెడ్ సీ పత్రాలలో ఎక్కువగా భాగం రెండు వేర్వేరు కాల గణన పద్ధతుల పరస్పర మనుగడను గూర్చి వ్రాయబడి యుండుట గమనించదగ్గ విషయం. ఆ సమయంలో పాలస్తీనాలో కనీసం రెండు రకాల వేర్వేరు క్యాలెండర్లు ఉన్నాయని చెప్పుటకు ఇది చాలును. యూదులు రోమన్ పాలకులు ఉపయోగించిన క్యాలండరుకు వేరైయున్న క్యాలెండరును ఉపయోగించిరనే విషయాన్ని కూడా ఇది సూచిస్తుంది.



ప్రారంభ జూలియన్ క్యాలెండర్ నుండి ఈ రాతి శకలాలు ఆగష్టు నుండి డిసెంబరు వరకు నెలలను చూపుతున్నాయి. రోజులు A నుండి H వరకు గల అక్షరాలతో సూచించబడినవి. ఎనిమిది రోజుల వారపు నిడివి కలిగియున్న ప్రారంభ జూలియన్ క్యాలెండరును ఈ రాతి శకలాలపై స్పష్టంగా చూడవచ్చు.

జూలియన్ క్యాలెండర్ అన్య మరియు సౌర సంబంధమైనది. నేడు ఉపయోగిస్తున్న గ్రెగోరియన్ క్యాలెండర్ కూడా దానివలె, అన్య మరియు సౌర సంబంధమైనదే. ఇది అన్య, సౌర జూలియన్ క్యాలెండరుతో దాదాపు సమానంగా ఉంటుంది, మరియు దీనికి యహువః యొక్క బైబిలు సంబంధిత సూర్య-చంద్ర క్యాలెండరుతో ఎటువంటి పోలిక లేదు.

సమాధులపై చెక్కబడిన శాసనాలు

క్రైస్తవుల సమాధులపై చెక్కబడిన శాసనాలు ప్రాచీన క్రైస్తవులు జూలియన్ క్యాలెండర్ మరియు బైబిల్ క్యాలెండర్ రెండిటి గూర్చియు మరియు రెండు క్యాలెండర్ల యొక్క వారపు చక్రాల మధ్య గల వ్యత్యాసమును గూర్చియు ఎరిగియుండిరనే అదనపు పురాతత్వ ఆధారాన్ని అందిస్తున్నాయి. కాబట్టి, వారు ఆరాధన నిమిత్తం బైబిల్ క్యాలెండరును, వ్యాపారాలను నిర్వహించుకొనుటకు జూలియన్ క్యాలెండరును ఎంచుకున్నట్లు చెప్పుట అసమంజసం కాదు. క్రీ.పూ. 269 నుండి ఇన్స్క్రిప్షన్స్ లాటినే క్రిస్టె వెతెర్స్, ఎర్నస్ట్ డీల్ లో, క్రింది సమాధి శాసనాలు కనుగొనబడినవి:

క్లాడియస్ మరియు పేటర్నస్ యొక్క పాలనలో, నవంబర్ నోన్స్ న, వీనస్ దినాన, మరియు చంద్ర నెల యొక్క 24 వ రోజున, లూసెస్ తన ప్రియమైన కుమార్తె సేవెరాకు మరియు తన పవిత్రాత్మకు [ఈ జ్ఞాపికను] ఉంచెను. ఆమె 55 సంవత్సరాల, 11 నెలల [మరియు] 10 రోజుల వయసులో మరణించింది. 9

ఇది రోమ్ లో కనుగొనబడిన పురాతనమైన క్రైస్తవ సమాధి శాసనాలలో ఒకటి, మరియు మనోహరమైనది ఎందుకంటే ఇది రెండు వేర్వేరు తేదీలను ఇస్తుంది! నవంబర్ "నోన్స్" నవంబర్ 5 ను సూచిస్తుంది. ఇది ఆ సంవత్సరం, "వీనస్ రోజు" లేదా శుక్రవారం నాడు పడినది. ఆ ప్రత్యేకమైన చాంద్రమానంలో, ఇది బైబిలు వారంలోని "రెండవ దినంగా" ఉండి, మరియు చంద్ర నెలలో 24 వ తేదీకి అనుగుణంగా ఉంటుంది.

ఇది చాలా ముఖ్యం ఎందుకంటే, “ఆ రెండవ దినం” శుక్రవారం నాడు పడి ఉంటే, ఏడవ దినము-మరియు సబ్బాతు అన్యమత బుధవారం లేదా "మెర్క్యురీ రోజు" న పడుతుంది!

యూదుల పండితుల యొక్క ఒప్పుకోలులు

చాలా కాలంగా, యూదులు శనివారాన్ని విశ్రాంతి దినముగా ఆరాధిస్తున్న వాస్తవం శనివారమే బైబిలు సబ్బాతు అని "నిరూపించుటకు" ఉపయోగించబడుతుంది. అయితే, ఇది వలయ తార్కికం కంటే ఎక్కువ కాదు, అనగా: యూదులు సబ్బాతు దినాన ఆరాధింతురు. అందువలన, శనివారము విశ్రాంతి దినము ఎందుకంటే యూదులు ఆదినమున ఆరాధన చేయుదురు.

వాస్తవానికి, శనివారం లేఖనాల యొక్క అసలు సబ్బాతు కాదని యూదుల పండితులకు బాగా తెలుసు. యూదుల పండితులు వ్రాసిన క్రింది మాటలన్నీ, దీనిని గూర్చిన ప్రాముఖ్యతను అందించుచుండెను.

డాక్టర్ LE ఫ్రూమ్ కు ఫిబ్రవరి 20, 1939 న [రబ్బీ లూయిస్] ఫింక్లెస్టీన్ [అమెరికా యూదుల మతసంబంధమైన సెమినరీ యొక్క] వ్రాసిన లేఖలో, తక్షణం ఇలా ఒప్పుకున్నాడు: "ప్రస్తుత యూదుల క్యాలెండర్ నాల్గవ శతాబ్దంలో స్థాపించబడినది." మైమోనిడెస్ మరియు ఇతర కాల శాస్త్రవేత్తలు ఆధునిక యూదా క్యాలెండరు "సూర్యుడు మరియు చంద్రుని యొక్క సగటు కదలికలపై ఆధారపడెనని, నిజమైన క్యాలెండరు పక్కన పెట్టబడెనని" అంగీకరిస్తున్నారు. 10,11

Maimonides (1135-1204), rabbi, philosopher and physician

మైమోనైడ్స్ (1135-1204), రబ్బీ, తత్వవేత్త మరియు వైద్యుడు.

న్యూ మూన్ ఇప్పటికీ, మరియు సబ్బాతు నిజానికి మొదట్లో చంద్రుని దశలమీదే ఆధారపడి ఉండేది . . . నిజానికి, నెలపొడుపు దినాన్ని కూడా సబ్బాతు వలె జరుపుకునేవారు, రాను రాను సబ్బాతు మతపరమైన ధ్యాన మరియు బోధనల యొక్క దినంగా , మానవత్వం యొక్క రోజుగా, ఆత్మ యొక్క శాంతి మరియు ఆనంద కారకమైన దినంగా మారి మరింత ప్రాధాన్యతను సంతరించుకోగా, స్యూమూన్ ప్రాధాన్యత క్రమంగా తగ్గినది. 12

సబ్బాతు దినము ఒక ప్రతిష్ఠితమైన దగినముగా మారుట మరియు ఏడు సంఖ్యకు గల ప్రాముఖ్యత గణనీయంగా వృద్ధి చెందుటతో , వారం మరింత మరింతగా దాని చంద్ర సంబంధ విధానము నుండి విడిపోయినది . . 13

సంవత్సరం యొక్క నెలలు చంద్ర నెలలుగా ఉన్నాయి మరియు నెలపొడుపు (ఖోదేష్, దీనికి "నెల" అని అర్ధం వచ్చును) తో ప్రారంభమయ్యాయి. రాజుల కాలంలో నెలారంభ దినము రెండు రోజుల ఉత్సవంగా ఆచరించబడినది (I సమూయేలు 20:24-47.) 14

ఎగువ ఉల్లేఖనాలను గమనిస్తే, ప్రస్తుత యూదుల క్యాలెండర్ నాల్గవ శతాబ్దానికి ముందు ఉపయోగించినదానికి భిన్నంగా ఉందని రబ్బీ ఫింక్లెస్టీన్ బహిరంగంగా పేర్కొనుచుండెను. మరియు మైమోనిడెస్ అయితే ఇంకా ముందుకు వెళ్ళి అసలు క్యాలండర్ “ప్రక్కన పెట్టివేయబడినది" అని చెప్పాడు.

తొలి క్రైస్తవ (రోమన్ క్యాథలిక్) సంఘం నాల్గవ శతాబ్దంలో అధికారం పొందిన తరువాత పెట్టిన తీవ్రమైన శ్రమల కారణంగా ఇది జరిగింది. మళ్ళీ, చరిత్ర యొక్క ఈ వాస్తవాల విషయంలో యూదులు చాలా బహిరంగంగా మాట్లాడుదురు, తీవ్రమైన శ్రమల కారణంగా వారు క్యాలెండరును మార్చిరని అంగీకరిస్తున్నారు.

కన్స్టేంటియస్ పరిపాలనలో (క్రీ .శ. 337-362) యూదులపై వేధింపులు ఎంత తారాస్థాయికి చేరుకొనెనంటే , . . తీవ్రమైన శిక్ష యొక్క బాధ వలన క్యాలండర్ గణన నిషేధించబడినది. [జరిగినది ] 15.

వసంతకాలం వచ్చునప్పుడు వచ్చే స్యూమన్ ను, కొత్త నెలను గమనించుట ద్వారా కొత్త సంవత్సరంను ప్రకటించుట సన్హెద్రిన్ ద్వారా మాత్రమే వీలగును. అయితే, హిలెల్ II, సన్హెద్రిన్ చివరి అధ్యక్షుని సమయంలో రోమన్లు ఈ పద్ధతిని నిషేధించిరి. అందువలన హిలెల్ II తన స్థిర క్యాలెండరును నెలకొల్పవలసి వచ్చెను, అలా, దాని ప్రభావంగా భవిష్యత్తు సంవత్సరాల క్యాలెండర్లను సన్హెద్రిన్ ముందస్తుగానే నిర్ణయించగలిగే అవకాశం కలిగెను.16

(మరింత సమాచారం కోసం చదవండి: “కాన్స్టాంటైన్ I & హిలెల్ II: మొత్తం ప్రపంచాన్ని మోసగించిన ఇద్దరు పురుషులు”)

క్యాథలిక్ పండితుల ఒప్పుకోలులు

Council of Nicæa

నైసియ సభ ఇప్పటివరకు జరిగిన అత్యంత ప్రభావవంతమైన సంఘ సభలలో ఒకటిగా ఇప్పటికీ పరిగణించబడుతుంది.

చాలినంత ఆసక్తికరంగా, రోమన్ క్యాథలిక్ పండితులు కూడా క్రైస్తవ్యం యొక్క ఆరాధనా దినాన్ని ప్రభావితం చేసిన క్యాలెండర్ మార్పుకు తామే కారణమనే వాస్తవం విషయంలో చాలా స్పష్టంగా ఉన్నారు.

ఇది నైసియా సభ వద్ద జరిగెను మరియు హైన్రిక్ గ్రేట్స్, 1893 లో జ్యూయిష్ పబ్లికేషన్ సొసైటీ ఆఫ్ అమెరికా ప్రచురించిన, “యూదుల స్మారక చరిత్ర” అనే తన రచనలో చాలా చక్కగా వివరించాడు!

అప్పుడు నీస్ [నైసియా] యొక్క మొదటి సాధారణ స్నాతకోత్సవంలో ప్రపంచం ఇంతవరకు కలలోకూడా చూడని దృశ్యాన్ని చూసింది, ఇందులో వారి ప్రధాన చక్రవర్తితో పాటు అనేక వందల బిషప్పులు మరియు పూజారులు ఉన్నారు. క్రైస్తవ మతం దాని విజయాన్ని జరుపుకోవాలని అనుకున్నది, అయితే దాని బలహీనత మరియు అంతర్గత విచ్ఛేదనను బహిరంగపరుచుటలో మాత్రమే విజయం సాధించింది. ఈ సందర్భంలో, దాని మొట్టమొదటి అధికారిక ప్రదర్శన, దాని ఆధ్యాత్మిక మరియు భౌగోళిక అధికారుల యొక్క వైభవమైన సమావేశంలో, అక్కడ దాని అసలు పాత్ర యొక్క ఆధారాలేవీ మిగల లేదు . . . ఇకపై తారీఖులను లెక్కించడానికి యూదుల కేలండరు విధానం ఉండరాదని కాన్స్టాంటైన్ దృఢముగా చెప్పెను.

నైస్ (నైసియా) సభవద్ద క్రైస్తవ మతమునకు దాని పితరులతో గల చిట్ట చివరి బంధం పూర్తిగా తెగిపోయెను. ఈష్టరు పండుగ ఇప్పటివరకు ఎక్కువ ప్రాంతంలో యూదుల పస్కా ఆచరించే అదే సమయంలో అనగా సిన్హెద్రియన్ [సన్హెద్రిన్] ద్వారా లెక్కించి నిర్ణయించిన తారీఖులలో జరుపబడుతుంది. కానీ ఇకపై ఈ ఆచరణకు స్వస్తిచెప్పి యూదుల కేలండరు నుండి పూర్తిగా వేరుగా స్వతంత్రంగా వుండాలి; పండుగలలోకెల్లా అతి పవిత్రమైన దీనిని యూదుల ఆచరణ చొప్పున అనుసరించినచో అది తగని రీతిలో లెక్క దాటిపోవుచున్నది. ఇది మొదలుకొని ఈ అప్రియమైన ప్రజలతో దేనిలోనూ స్వారూప్య సంబంధమును కలిగి యుండరాదు. మన రక్షకుడు మనకు వేరొక మార్గము చూపించి యుండెను. వారి నియమాల (లెక్కింపు) సాయం లేకుండా మనము పస్కా జరుపుకునే స్థితిలో లేమని యూదా ప్రజలు అతిశయించుట అనుచితము. ఈ వ్యాఖ్యలు చక్రవర్తి కాన్స్టాంటైన్ కు ఆపాదించడమైనది. "ఇది యూదుల విధిని నిర్ణయించగల చర్చి యొక్క మార్గదర్శక సూత్రములుగా (మారెను)" 17

యూదులు మరియు భక్తిపరులైన క్రైస్తవులు తమ ఆరాధన కోసం ఉపయోగించు క్యాలెండరులోని మతపరమైన మార్పుకు నైసియా సభలోని రోమన్ క్యాథలిక్ బిషప్పుల చర్యలు నేరుగా బాధ్యత వహించెననుటలో ఎటువంటి సందేహం లేదు. కాల శాస్త్రవేత్త అయిన, డేవిడ్ సార్డెర్కీ ఇలా వివరించారు: " కాన్స్టాన్స్ యొక్క హయాంలో పాత క్యాలండరును వినియోగించుట ఇక ఏమాత్రం సాధ్యపడలేదు." 18

తరువాతి సంవత్సరాల్లో, యూదులు “శ్రమలు మరియు శోధనల” మార్గములో వెళ్ళిరి. క్రైస్తవ [పోపు సంబంధ రొమా] చక్రవర్తులు యూదుల క్యాలెండరు యొక్క లెక్కింపును నిషేధించి, మరియు పండగ దినముల ప్రకటనను అనుమతించలేదు. గ్రేట్జ్ ఇలా చెప్పారు, "యూదా సమాజాలు వారి పండుగలకు సంబంధించిన ముఖ్యమైన మత నిర్ణయాల విషయాలలో పూర్తిగా అనుమానస్పద స్థితిలో మిగిలారు." తక్షణ పర్యవసానంగా హెబ్రీ క్యాలెండర్ యొక్క స్థాపన మరియు గణన హిలెల్ II ద్వారా జరిగెను". 19

నైసియా యొక్క ఉత్తర్వులు, "యూదయలోని ధర్మశాస్త్ర ఆచరణను నాశనం చేశాయి", సూర్యుడు మరియు చంద్రుని మార్గాన్ని అనుకరించే మోషే యొక్క పురాతన క్యాలండర్ చివరికి వసంత విషవత్ కు సంబంధించిన లెక్కల ద్వారా భర్తీ చేయబడింది. ఈ విషవత్ స్థానం నుండి, [క్యాథలిక్] సంఘం తన మతపరమైన క్యాలెండరును మరియు ఈస్టరు పండుగను నిర్మాణం చేసింది. నైసియా సభ యొక్క నిజమైన ప్రాముఖ్యతను వివరించుట చాలా సులభం, మరియు యూదుల కాల వ్యవస్థపై అది నడుస్తున్నందున, సంఘం యూదుల లెక్కింపు విధానం నుండి బయటపడాలని మరియు ఒక స్థానచలనం గల పండుగకు మార్పుచెందాలని కోరుకున్నప్పటికీ, చివరికి, అది యూదుల మరియు రోమన్ క్యాథలిక్కుల పండుగలు రెండూ ఒకే స్థానంనుండి లెక్కించబడేలా చేసినది: అది వసంత విషవత్ / వెర్నల్ ఈక్వినోక్స్. 20

నామమాత్ర క్రైస్తవ మతానికి అన్యులను ఒప్పించేందుకు , రోమ్ , దాని సాధారణ విధానాన్ని అనుసరిస్తూ , క్రైస్తవ మరియు అన్య పండుగలను ఏకంచేయుటకు చర్యలను తీసుకొనెను, మరియు క్యాలెండర్ యొక్క క్లిష్టమైన, కానీ, సమర్థవంతమైన సర్దుబాటు ద్వారా, అన్య మతం మరియు క్రైస్తవ మతం - ఇప్పటివరకు విగ్రహారాధన లో మునిగియున్నాయి - చాలా ఇతర విషయాలలో వలె దీనిలో కూడా, చేతులు కలిపాయి.

అలెగ్జాండర్ హిస్లోప్, ది టు బాబిలోన్స్, పే. 105, ప్రాముఖ్యత ఇవ్వబడింది.

క్యాథలిక్ పండితులకు ఇది తెలుసు. అందుకే, అమెరికన్ క్యాథలిక్ క్వార్టర్లీ రివ్యూ ఒక ప్రకటనను ప్రచురించినది: "ఆదివారం … పూర్తిగా క్యాథలిక్ సంఘం యొక్క సృష్టి." 21 లేదా, “ఎక్లేసిస్టికల్ రివ్యూ” లో ప్రచురించబడినట్లు:

“వారు [ప్రొటెస్టంట్లు] ఆదివారాన్ని పవిత్రంగా కాపాడుకొనుటను తమ బాధ్యతగా పరిగణింతురు. ఎందుకు? ఎందుకంటే అలా చేయమని క్యాథలిక్ సంఘం వారికి చెప్పుటవలన. వారికి ఇతర కారణం లేదు . . . . సబ్బాతును పాటించవలసిన దైవిక చట్టానికి పూర్తి వేరుగా ఆదివారాన్ని ఆచరించుట ఒక మతపరమైన చట్టంగా మారింది . . . . ఆదివారపు చట్టం యొక్క రచయిత. . . క్యాథలిక్ సంఘం.” 22

ఇది ముఖ్యమైనది, ఎందుకంటే ఆదివారం యహూషువః పునరుత్థాన దినం కాదు. శనివారం-సబ్బాతీయులు నాల్గవ ఆజ్ఞకు ఇప్పటికీ కట్టుబడి ఉన్నామని మరియు ఒకడు ఏ రోజున ఆరాధన చేయుచున్నాడు అనేది యహువః కు ముఖ్యమని చెప్పుచుండగా, చాలామంది ఆదివారపు ఆరాధికులు "నేను అన్ని దినాలలోను ఆయనను ఆరాధింతును" అని నొక్కి చెబుతూ అటువంటి వాదనలను త్రోసివేయుదురు.

ఇది ఒక అజ్ఞానంపై ఆధారపడిన వాదన. మొదటిగా, నాల్గవ ఆజ్ఞ కేవలం ఏడవ రోజున ఆరాధన చేయుడని మాత్రమే చెప్పుట లేదు కాని, ఏడవ దినాన పని చేయకూడదు కాబట్టి మిగతా ఆరు దినాలలోను తప్పక పని చేయవలెనని చెప్పుచుండెను. అంతేకాకుండా, ఆదివారపు ఆరాధన కొరకు సంప్రదాయబద్ధంగా ఇవ్వబడిన కారణం యహూషువః యొక్క పునరుత్థాన దినం ఆదివారం అనే వాదనపై ఆధారపడియున్నది. అయితే, మనము చూసినట్లుగా, ఆదివారం ఎనిమిది రోజులు ప్రారంభ జూలియన్ క్యాలెండరులో ఉనికిలో లేదు. అందువలన, మన రక్షకుడు ఆ దినాన లేచియుండలేదు. ఆదివారం ఆరాధనకు ఎలాంటి ఆధారము లేదు. రోమీయులు ఎల్లప్పుడూ చెప్పుచున్నట్లుగా ఇది ఒక రోమన్ క్యాథలిక్కుల యొక్క సాంప్రదాయం మాత్రమే.

Catholic author and radio host, Patrick Madrid

క్యాథలిక్ రచయిత మరియు రేడియో అతిధి, పాట్రిక్ మాడ్రిడ్.

వాస్తవానికి ఆధునిక క్యాథలిక్ పండితులకు కూడా ఈ విషయాలు తెలుసు. పాట్రిక్ మాడ్రిడ్ ఒక అమెరికన్ రోమన్ క్యాథలిక్ రచయిత మరియు రేడియో హోస్ట్. జనవరి 5, 2006 న, మాడ్రిడ్ గ్లోబల్ క్యాథలిక్ రేడియో నెట్వర్క్ అయిన, EWTN లో ఉన్నాడు. “ఓపెన్ లైన్”, లో ఫోన్లకు సమాధానమిచ్చే ఒక రేడియో కార్యక్రమంలో, ఒక శ్రోత ఒక ప్రశ్నతో ఫోన్ చేసాడు: ఈ శ్రోత యొక్క బావమరిది క్యాథలిక్ సంఘం సబ్బాతును శనివారం నుండి ఆదివారానికి మార్చిందని చెప్పాడు. మాడ్రిడ్ సమాధానమిస్తూ, ఇకపై బైబిల్ సబ్బాతునందు ఆరాధించవలసిన అవసరం లేదని క్యాథలిక్ సంఘం యొక్క ఒక వివరణను ఇవ్వటంతో, అతడికి చరిత్ర మరియు లేఖనాల వాస్తవాలు బాగా తెలుసునని అర్థమవుతుంది. అతడు ఇలా చెప్పాడు:

మీ బావమరిదికి బహుశా అర్థం కాని విషయమేమిటంటే క్యాథలిక్ సంఘం ఆ [సబ్బాత్] ఆజ్ఞను మార్చలేదు. విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించాలనే ఆజ్ఞను క్యాథలిక్ సంఘం ఆచరిస్తుంది, అయితే, అది ప్రభువు యొక్క దినాన అలా చేయును, మరియు మొట్టమొదటి క్రైస్తవులు ఆ ఆజ్ఞను పాటించుటను శనివారం నుండి ఆదివారానికి బదిలీ చేసారు.

అన్నింటికీ ముందు, పాత నిబంధన అవసరతల మధ్య స్పష్టమైన విరామం ఉండుట వలన: ఆచారాలు మరియు మోషే నిబంధన సబ్బాతు ఆరాధనను మరియు జంతు బలులను, మరియు ఆ విధమైన విషయాలను కోరును. క్రైస్తవ్యం యూదామతం (జుడాయిజం) కంటే ఎంతో ప్రత్యేకమైనదని చూపుటకు వారు కోరుకొనిరి. ఇది యూదామతం నుండి వచ్చినది, అయితే ఇది దానికి భిన్నమైనది . . . . ప్రభువు యొక్క పునరుత్థాన మరియు మరణ వేడుకను ఆయన మరణం నుండి లేచిన దినాన జరుపుకొనుట అత్యంత సముచితమైనదిగా అనిపించింది.

మనము గుర్తుంచుకోవాల్సిన మరో విషయం ఏమిటంటే, సెవెన్త్-డే అడ్వెంటిస్టులతో సహా మనము అనుసరించే క్యాలెండర్ క్యాథలిక్ సంఘం రూపొందించిన క్యాలెండర్ మాత్రమే కాక, ఇది సౌర సంవత్సరంపై ఆధార పడిన క్యాలెండరుగా ఉంటుంది, చంద్ర సంవత్సరం కాదు. క్రీస్తు సమయంలో ఆచరించిన యూదుల క్యాలెండర్ చంద్ర క్యాలెండరును అనుసరిస్తుంది, దీనిలో సౌర క్యాలెండర్ కంటే కొన్ని దినాలు తక్కువగా ఉంటాయి.

కాబట్టి గొప్ప హాస్యాస్పదం ఏమంటే, సెవెంత్-డే అడ్వెంటిస్టులు కూడా మెస్సీయ దినాలలో యూదులు ఆరాధన చేసిన సబ్బాతు రోజున ఆరాధించుట లేదు, ఎందుకంటే చంద్ర క్యాలెండరు (అనుసరించుట) నుండి మారినప్పటి నుండి ఇప్పుటికి చాలా రోజులు తగ్గించబడ్డాయి. 23

ఈ మొత్తం విషయం శనివారం మరియు ఆదివారం మధ్య యుద్ధం కంటే చాలా పెద్దది. ఇది అబద్ధ ఆరాధన యొక్క పూర్తి వ్యవస్థకు సంబంధించినది: అన్య సూర్య ఆరాధనకు మరియు సర్వశక్తిమంతుని యొక్క పరిశుద్ధమైన బైబిల్ ఆరాధనకు మధ్య జరుగుతున్న యుద్ధం.

ప్రారంభ క్యాలెండర్ చరిత్ర యొక్క వాస్తవాలను నా సెవెంత్-డే అడ్వెంటిస్ట్ పాస్టర్ మిత్రుడికి చూపినప్పుడు, అతను చాలా సేపు నిశ్శబ్దంగా ఉన్నాడు. చివరిగా అతడు చెప్పాడు: “నీవు సరిగ్గానే చెప్పావు. అయితే దేవుడు కోరుకొనేదంతా, సమాజం వాడుతున్న ఏదేని ఒక కేలండరుపై ఏడవ దినమును పరిశుద్ధంగా ఆచరించాలి.

నేను ఆశ్చర్యపోయాను. అలాంటి ఒక ప్రకటన, ఖచ్చితమైన, నిర్దిష్టమైన రోజున ఆరాధించాలనే తండ్రి కోరికకు స్పష్టంగా పూర్తి విరుద్ధంగా ఉంది.

లేఖనాలలో మరచిపోబడెను

బైబిలును చదువునప్పుడు దాదాపు ప్రతి ఒక్కరు చేయు ఒక తప్పు ఉంటుంది. ఇది చాలా సాధారణమైనది మరియు మనం అర్థం చేసుకోగలది. అదేమిటంటే, జనులు బైబిలు చదువుతున్నప్పుడు, తాము ఒక నిర్దిష్టమైన సైద్ధాంతిక "అద్దాలను" ధరించి ఉంటారు. ఈ అద్దాలు వారి వ్యక్తిగత సాంస్కృతిక మరియు విద్యాపరమైన నేపథ్యాలచే సృష్టించబడతాయి మరియు అవి వారు చదువు వాటిని ఎలా అర్థం చేసుకోవాలో అనేదాన్ని రూపొందిస్తాయి.

preacher in front of congregation

క్రైస్తవులు శనివారం లేదా ఆదివారంనాడు ఆరాధన చేస్తారు, ఎందుకంటే వారము నేడు ఉన్నట్లుగానే యహూషువః దినాల నుండి నిరంతరం తిరుగుతూ మరియు అంతరాయం లేకుండా ఉండెనని అనుకొనుట వలన.

సబ్బాతు విషయంలో తప్ప మరెక్కడా ఇది స్పష్టంగా కనిపించలేదు. 1940 నుండి మొత్తం ప్రపంచం గ్రెగోరియన్ క్యాలెండరును ఉపయోగించుటలో ఏకమైనది. అందువల్ల, ప్రజలు లేఖనంలో సబ్బాతును గురించి చదివినప్పుడు, అది ఆధునిక వారంలో ఏడవ రోజును సూచిస్తుండెనని వారు భావిస్తున్నారు: శనివారం. అయితే, ఈ ఊహ, తప్పు.

బైబిలు క్యాలెండరుకు మరియు ఆధునిక క్యాలెండరుకు మధ్య ఉన్న అతి పెద్ద వ్యత్యాసం వాటి వేర్వేరు పద్దతుల వారముల చక్రాలలో కనుగొనబడింది. ముందు చెప్పినట్లుగా, ఆధునిక క్యాలెండరులో నిరంతర వారాల చక్రం ఉంటుంది. దీనర్థం, ప్రతి నెల వారంలోని ఏదో ఒక రోజుతో మొదలవుతుంది. బైబిలు క్యాలెండరులో అలా ఉండదు. యహువః క్యాలెండరులో ప్రతి కొత్త నెలకు వారపు చక్రం పునః ప్రారంభమవుతుంది. మరింత ఏమిటంటే, సూర్యుడు మీద స్థాపించబడిన, ఆధునిక క్యాలెండరుకు, వారంతోనైనను లేక ప్రకృతిలో మరిదేనితోనైనను ఎటువంటి సంబంధము ఉండదు. దీనికి విరుద్ధంగా, యహువః క్యాలెండరులోని వారాల చక్రం సరిగ్గా చంద్రుని యొక్క దశలతో ముడివేయబడి ఉంటుంది.

బైబిలు క్యాలెండర్ ఎలా పని చేస్తుందోనని చాలా సులభమైన రీతిలో వివరించే ఒక్క వచనమూ లేఖనంలో లేదు: ఇది ఊహించబడిన జ్ఞానం. ప్రతి ఒక్కరూ ఆ క్యాలెండరును ఉపయోగించారు. అప్పటి క్యాలెండర్ ఎలా పనిచేస్తుంది అని, ఆయా కాలాలలో ఎక్కువగా వివరించవలసిన అవసరం ఉండదు. అలాగే, నేడు గ్రెగోరియన్ క్యాలెండర్ ఎలా పని చేస్తుందో వివరించుట తప్పనిసరి కాదు, ఎందుకంటే ప్రతి ఒక్కరికి అది తెలుసు.

అయితే, ఆధారాలు ఉన్నాయి మరియు బైబిలు అంతటా ధారాళంగా చెల్లాచెదురుగా ఉన్నాయి. ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ సూత్రం వెంబడి సూత్రం అనే బైబిలు సూత్రాన్ని వర్తింపజేసినప్పుడు, తేడాలు చాలా స్పష్టంగా కనిపిస్తాయి.

నెలారంభ దినాలు

“ఆధునిక క్యాలెండరులో లేని ప్రత్యేక వర్గానికి చెందిన దినాలను గూర్చి అనేక వచనాలు బైబిలులో ఉన్నాయి: అవి నెలారంభ దినాలు. స్పష్టంగా, సమయ గణనకు వేరొక మార్గం ఉపయోగించబడింది. ఇది సృష్టి వారంలో నాలుగవ రోజున ప్రారంభమైంది: “ఎలోహీం పగటిని రాత్రిని వేరుపరచునట్లు ఆకాశవిశాల మందు జ్యోతులు కలుగును గాకనియు, అవి సూచనలను కాలములను దిన సంవత్సరములను సూచించుటకై యుండు గాకనియు . . . పలికెను; ఆ ప్రకారమాయెను.” (ఆదికాండం 1:14, 15, NKJV)

"సూచనలు" అని అనువదించబడిన పదం ఓత్ అనే హెబ్రీ పదం నుండి వచ్చినది, దీనికి ఒక గుర్తు, స్మారకము, దారిచూపుట, సూచన లేదా చిహ్నం అని అర్థం. అలాగే "కాలములు" అని అనువదించబడిన పదం మరింత ముఖ్యమైనది. ఇది హెబ్రీ పదమైన మో’ఎడ్ నుండి వచ్చినది, దీనికి ఒక నియామక సమయం లేదా నిశ్చయించిన కాలం, ప్రత్యేకంగా, ఒక పండుగ అని అర్ధం. ఇది లేవీయకాండము 23 అంతటా వాడబడుతూ, యహువః యొక్క పండుగలను సూచిస్తుంది: “మరియు యహువః మోషేకు ఈలాగు సెల విచ్చెను, నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము మీరు చాటింపవలసిన యహువః నియామక కాలములు ఇవే; ఈ కాలములయందు మీరు పరిశుద్ధ సంఘములుగా కూడవలెను; నా నియామక కాలములు ఇవి. (లేవీయకాండము 23: 1-2.) మొట్టమొదట ఇవ్వబడిన పండుగ వారపు పండుగ, ఏడవ-దినపు సబ్బాతు. ఆ తరువాత ఇవ్వబడినవి వార్షిక పండుగలు.

“యూదుల పండుగలు క్రమమైన వ్యవధులలో జరిగును కాబట్టి, ఈ పదం వాటితో సన్నిహిత సంబంధంను కలిగి ఉన్నట్లు గుర్తించబడింది…. మో’ఎడ్ అనే పదము విస్త్రుత కోణంలో అన్ని ఆరాధనా సమావేశాలను సూచించును. ఇది ప్రత్యక్షగుడారముతో దగ్గరి సంబంధంను కలిగియుండెను…... [యః] ఇశ్రాయేలీయులకు తన చిత్తమును తెలియజేయుటకు విశేషమైన సమయములయందు ప్రత్యక్షమాయెను. “ఇది యః యొక్క ప్రజల ఆరాధనా సమావేశాలకు సామాన్య పదము.” 24

సృష్టిలో యహువః చేత స్థాపించబడిన క్యాలెండర్ యొక్క పునాది చంద్రుని యొక్క గమనము. సమయాన్ని గమనము ద్వారా మాత్రమే కొలుస్తారు. చంద్రుని కదలికను పరిశీలించుటకు గల కారణం పవిత్ర దినాలను ఏర్పాటు చేయడమే! “ఋతువులను తెలుపుటకై ఆయన చంద్రుని నియమించెను” (కీర్తనలు 104: 19) ఇక్కడ మళ్ళీ, "ఋతువులను" అని అనువదించబడిన పదం మో’ఎడ్, లేదా, “యః యొక్క ప్రజల ఆరాధన సమావేశాలు.”

పనితీరును బట్టి న్యూమూన్ దినాలు బైబిలు యొక్క సూర్య- చంద్ర కాలవ్యవస్థ యొక్క అతి ముఖ్యమైన దినాలు, ఎందుకంటే వీటి ద్వారానే నెలల ప్రారంభము మరియు వారపు చక్రాల ప్రారంభము తెలియబడును. ఈ వాస్తవాలు చాలా మంది క్రైస్తవులకు తెలియని కారణంగా, క్రైస్తవ పండితులకు కూడా తెలియకుండా ఉంటాయని అర్థం కాదు:

నెల అనేది చంద్రునితో ముడిపెట్టబడిన కొంత ప్రత్యేకమైన సమయం. "నెల" కు వాడబడిన హెబ్రీ పదానికి "చంద్రుడు" అని కూడా అర్థం గలదు . . . . నెలకు మరియు చంద్రునికి మధ్య సంబంధానికి కారణం ఒక నెల ప్రారంభం ఒక కొత్త చంద్రునితో గుర్తించబడుటయే. బైబిలు కాలాల్లోని ప్రజలు చంద్రుని జాగ్రత్తగా పరిశీలన చేసిరి. 25

వారాల చక్రం

క్యాలెండరును గూర్చి చదివేవారి మెదడుకు వారాల చక్రాలలోని వ్యత్యాసాలను గ్రహించుట మొదటిగా కష్టతరమైన విషయంగా ఉంటుంది. 26 మరియు ఇంకా, వారు వాటిని గూర్చి ప్రసంగాలలో ఎన్నడూ బోధించనప్పటికీ, పండితులకు ఈ వాస్తవాలను గూర్చి బాగా తెలుసు. ఎమిల్ G. హిర్చ్, జ్యూయిష్ ఎన్సైక్లోపెడియాలో “వారం: చంద్ర దశలతో సంబంధం” అనే పేరుగల ఒక వ్యాసంలో ఇలా పేర్కొనెను:

ఏడు రోజులు గల వారం చంద్ర నెలతో అనుసంధానించబడి, దానిలో, దాదాపు నాలుగవ భాగమై ఉన్నది. నెలలోని ఈ నాలుగు భాగాలు (క్వాడ్రిపార్టైట్ డివిజన్) హెబ్రీయులు మరియు ఇతర ప్రాచీన ప్రజల మధ్య స్పష్టంగా ఉపయోగంలో ఉంది; అయితే ఇది ఇతరులలో పూర్వం ఎక్కడ ఉద్భవించిందో స్పష్టంగా తెలియలేదు. దీనిని గూర్చి ఆలోచించుట అనవసరమైనప్పటికీ, ఇది బబులోనియుల నుండి ఉద్భవించెనని అనుకోవచ్చు, అలాగే చంద్రుని యొక్క నాలుగు దశల పరిశీలనలు రెండు వరుస నెలపొడుపుల మధ్య ఏడు రోజులు గల నాలుగు విభాగాలను విడగొట్టే విధానాన్ని రూపొందించుటలో హెబ్రీయులను సంచారకాలంలో సహజంగా మరియు స్వతంత్రంగా నడిపించెను . . . [లేవీయకాండము 23:15] లో పెంతెకోస్తు లెక్కింపులో లెక్కకు తక్కువ కాకుండా, "పూర్తి" ("టెమిమోట్") వారాలు ఉండాలి, అనే మాట వలన వారాలు ఆ విధంగా లెక్కించబడతాయని అర్థమవుతుంది.

ఈ ఉల్లేఖనం చాలా ఆసక్తికరంగా ఉంటుంది, ఎందుకంటే, మొదటిగా, ఇది పురాతన వారాల చక్రాన్ని సరిగ్గా చంద్ర దశలతో కలుపుతుంది; మరియు, రెండవదిగా, పెంతెకోస్తుకు "పూర్తి" వారాలు అవసరమవుట అనేది నేడు వాడబడుతున్న వారాల చక్రం స్వయంచాలకంగా పూర్తి వారాలను అందించలేదని హేతుబద్ధంగా తెలియజేస్తుంది.

తారీఖుల యొక్క ఋజువు

ప్రతి నెల మొదటి దినము (న్యూ మూన్ దినము) ఎల్లప్పుడూ వారాల చక్రాన్ని పునఃప్రారంభించుట వలన, విశ్రాంతి దినము ఎల్లప్పుడూ ప్రతి చంద్ర నెలలో అదే తేదీలలో వస్తుంది. న్యూ మూన్ దినము ఒక ప్రత్యేక తరగతికి చెందినది, మరియు అది ఆరాధనా దినము. అందువలన ప్రతి నెలలో రెండవ దినము పనివారంలోని మొదటి దినము. గ్రెగోరియన్ క్యాలెండరు కూడా, అప్పుడప్పుడు ఇలాంటి నెలవారీ అమరికను కలిగి ఉంటుంది. ఉదాహరణకు, ఏప్రిల్ 2017 అలాంటి నెలయే:

2017 గ్రెగోరియన్ ఏప్రిల్ నెల అమరికకు మరియు సూర్య-చంద్ర నెలలు అమరికకు మధ్య గల ఒకే తేడా ఏమిటంటే, సూర్య-చంద్ర క్యాలెండరులో ప్రతి నెలా నెలవారీ మరియు వారపు అమరిక ఇలాగే ఉంటుంది. ప్రతి నెలలో మొదటి దినం న్యూ మూన్ ఆరాధన కాబట్టి, ఏడవ దినపు సబ్బాతు ఎల్లప్పుడూ చంద్ర నెలలో 8, 15, 22 మరియు 29 వ దినాలలో పడుతుంది. ఏడవ దినపు సబ్బాతు కోసం లేఖనంలో చెప్పబడిన ప్రతిసారీ, అది ఎల్లప్పుడూ ఈ తేదీలలోనే వస్తున్న వాస్తవం ద్వారా ఇది బలపరచబడుతుంది. అదనంగా, పరిసర లేఖనాల ద్వారా ఏడవ దినపు సబ్బాతును అంచనా వేయుటకు వీలైన ప్రతి సందర్భంలో కూడా, సబ్బాతు అదే తేదీలలో వస్తుంది. ఇది నిరంతర వారాల చక్రంతో అసాధ్యం. 27

మరచిపోబడిన విశ్రాంతి దినము

"బైబిలు గ్రంథంలో సబ్బాతులు మరియు న్యూ మూన్లు సూచించబడిన ప్రతిచోటా, చంద్రుని లేదా నెల యొక్క రెండవ దినము ఎల్లప్పుడూ 1 వ పనిదినం, మరియు నెలలోని 8, 15, 22 మరియు 29 వ దినాలు సందేహం లేకుండా విశ్రాంతిదినాలు!"

జాన్ D. కీసెర్, "బైబిల్ ప్రూఫ్ ఫర్ ది లూనార్ సబ్బాత్."

ఆసక్తికరంగా, శనివారం నిజమైన సబ్బాతు కాదనే వాస్తవాన్ని అంగీకరించుటకు కష్టతరమైన సమయాన్ని వెచ్చించు ప్రజలు దాని ప్రాముఖ్యతను స్పష్టంగా అర్థం చేసుకుంటున్నారు; శనివారాన ఇప్పటికే ఆరాధన చేయువారు, తమ అసమ్మతి తెలుపుదురు: “దేవుడు సబ్బాతును మరచిపోబడుటను ఎన్నడూ అనుమతించలేదు! అది అసాధ్యం! అందువలన, శనివారం విశ్రాంతిదినమై ఉండాలి.”

తార్కికంగా ఇది అవాస్తవం. శనివారం నిజమైన విశ్రాంతి దినము కాదని నిరూపణ అవుట మాత్రమే కాక, విశ్రాంతి దినము మరచిపోబడునని లేఖనాలలో యహువః తానే స్వయంగా ప్రకటించారు మరియు ఆయనే అది మర్చిపోబడును అని భరోసా ఇచ్చెను!

బబులోనీయులలో పడిపోయినప్పుడు యెరూషలేమునకు జరిగినదాని నిమిత్తం ప్రవక్తయైన యిర్మీయా విలపిస్తున్నాడు. కానీ "బబులోను" అబద్ధ ఆరాధన యొక్క మొత్తం మౌళిక సదుపాయాలకు చిహ్నంగా కూడా ఉండుటవలన యిర్మీయా యొక్క విలాపం ద్వితీయ, ప్రవచనాత్మక నెరవేర్పును కలిగి ఉన్నది. అది అసలైన పురాతన సబ్బాతు యొక్క జ్ఞానం, నిజంగా, కోల్పోయిన సమయానికి వర్తిస్తుంది.

అదోనాయ్ శత్రువాయెను: ఆయన ఇశ్రాయేలును నిర్మూలము చేసియున్నాడు, దాని నగరులన్నిటిని నాశనముచేసియున్నాడు: దాని కోటలను పాడుచేసియున్నాడు, యూదా కుమారికి అధిక దుఃఖప్రలాపములను ఆయన కలుగజేసియున్నాడు.

ఒకడు తోటను కొట్టివేయునట్లు తన ఆవరణమును ఆయన క్రూరముగా కొట్టివేసి యున్నాడు, తన సమాజస్థలమును నాశనము చేసియున్నాడు. యహువః సీయోనులో నియామక కాలము విశ్రాంతిదినము మరువబడునట్లు చేసియున్నాడు కోపావేశుడై రాజును యాజకుని త్రోసివేసి యున్నాడు. (విలాపవాక్యములు 2:5-6)

విశ్రాంతి దినము మరచిపోబడునని ప్రకటించినది లేఖనాలలో ఇక్కడ ఒకచోట మాత్రమే కాదు. హోషేయ గ్రంధంలో, యూదా ప్రజలను, ఇతర ప్రేమికుల వెంట తిరిగే అవిశ్వాసురాలైన భార్యతో పోల్చుతూ వారి విశ్వాసఘాతకాన్ని చూపించెను. విశ్వాసులకు యహువ దైవీక భర్తయై ఉన్నారు. “నిన్ను సృష్టించినవాడు నీకు భర్తయైయున్నాడు. సైన్యములకధిపతియగు యహువః అని ఆయనకు పేరు. “ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ ఎలోహీం నీకు విమోచకుడు సర్వలోకమునకు ఎలోహీం అని ఆయనకు పేరు.” (యెషయా 54: 5)

తప్పుడు ఆరాధన వైపుకు తిరగుట ద్వారా, యహువః యొక్క "కన్యక" (విశ్వాసులు) ఆయనకు విశ్వాసఘాతకురాలాయెను.

హోషేయ రెండవ అధ్యాయంలో అనేక సౌందర్యవంతమైన వాగ్దానాలు నమోదు చేయబడి ఉన్నాయి. మనము ఆ వాగ్దానాలను చదవుటకు ఇష్టపడతాము; మనము వాటికి హక్కు పొందాలనుకుంటాము. అయితే, వాటిని సందర్భానుసారంగా చదివాలి, మరియు ఆ సందర్భం మొదటిగా ఆధ్యాత్మిక అవిశ్వాసం నిమిత్తం నింద వేయుచున్నది.

నేను దాని బట్టలను పెరికివేసి పుట్టిన నాటివలె దానిని దిగంబరురాలినిగా చేసి, పాడు పెట్టి యెండిపోయిన భూమి వలెను ఉంచి, దప్పిచేత లయపరచకుండునట్లు, మీ తల్లితో వేడుకొనుము, వేడుకొనుము,

మీ తల్లి పోకిరి చూపు చూడకయు దాని స్తానములకు పురుషులను చేర్చుకొనకయునుండునట్లు మీరు ఆమెతో వాదించుడి; అది నాకు భార్య కాదు, నేను దానికి పెనిమిటిని కాను;

అదినాకు అన్నపానములను గొఱ్ఱె బొచ్చును జనుపనారయు తైలమును మద్యమును ఇచ్చిన నా విటకాండ్రను నేను వెంటాడుదుననుకొనుచున్నది. (హొషేయ 2: 2, 3, 5 KJV)

ఆధ్యాత్మిక వ్యభిచారానికి శిక్ష ఏమిటి? సబ్బాతు బహుమానమును తీసివేయుట:

దాని విటకాండ్రు చూచుచుండగా నేను దాని పోకిరితనమును బయలుపరతును, నా చేతిలో నుండి దాని విడిపించువాడొకడును లేకపోవును.

దాని ఉత్సవ కాలములను పండుగలను అమావాస్యలను విశ్రాంతి దినములను నియామక కాలములను మాన్పింతును. (హొషేయ 2:10,11)

"న్యూ మూన్" దినాలు అనేవి, విశ్రాంతి దినాలను మరియు "పవిత్ర పండుగలను (మో'డిమ్) లెక్కించుటకు క్యాలెండరు యొక్క స్పష్టమైన సూచికలుగా ఉన్నాయి. పూర్వపు క్రైస్తవ సంఘం అన్యమతత్వంతో రాజీపడుట ద్వారా తన భక్తిసంబంధమైన పవిత్రతను కోల్పోయినది. ఇది సాతాను యొక్క మోసపూరితమైన సమస్త మోసాలకు తూములను తెరిచింది. సత్యానికి విలువనీయక దానిని కాపాడుకొనకపోవుట ద్వారా, ఆయన ప్రజలు దానిని కోల్పోయారు. పరలోక సత్యాన్ని చూడవలసినంత ప్రతిష్టాత్మకంగా చూడనప్పుడు; [యః] అది తీసివేయబడును. ఆయన దానిని మరచిపోబడునట్లు చేయును. 28 మరియు ఖచ్చితంగా అదే జరిగినది.

నాలుగవ శతాబ్దంలో మతాధికారులు లౌకిక అధికారులతో తమ అధికారాన్ని ఏకం చేస్తూ అన్యమత వారాన్ని దత్తత తీసుకొన్న సమయం, బైబిలు క్యాలెండరును వెంబడించుటను కోరుకొన్న ప్రజలందరిపై తీవ్రమైన హింసలకు దారితీసింది. రాబర్ట్ ఓడాం యొక్క “సండే ఇన్ ది రోమన్ పగనిజం” అనే అతని ప్రారంభ రచనలో ఇలా వ్రాసాడు: "ఒక ఆధ్యాత్మిక మేధావి అన్యమత ప్రపంచంపై నియంత్రణను కలిగి ఉండుట వలన, అన్ని కాలాలలో అత్యంత ప్రాచుర్యం పొందిన సూర్యుని ఆరాధన కొరకు అన్య గ్రహ వారము సరైన సమయములో పరిచయం చేయబడాలని, మరియు సూర్యుని దినము ఉన్నతమైన దినముగా మరియు మిగతా అన్నిటి కన్నా పవిత్రమైనదిగా ఉండాలని ఆదేశించెను. ఖచ్చితంగా ఇది అకస్మాత్తుగా జరిగినది కాదు.” 29

పవిత్రమైన భక్తి సంబంధమైన క్రైస్తవ మతం నుండి అన్యమత క్యాలెండర్ సూత్రాలతో ముడిపడిన క్రైస్తవ మతానికి జరిగిన ఈ నెమ్మదైన మార్పు నేడు సృష్టికర్త యొక్క నిజమైన క్యాలెండరుకు సంబంధించిన జ్ఞానం లేకపోవుటకు అత్యంత ఎక్కువ బాధ్యత కలిగియున్నది. అన్యమత నిరంతర వారాల చక్రపు చరిత్ర చరిత్రలో చాలా వెనుకన ఉన్నందున, ఈ నిరంతర వారపు చక్రం ఎల్లప్పుడూ ఉనికిలో ఉండెనని భావించబడుతుంది. జూలియన్ క్యాలెండర్ యొక్క చారిత్రక వాస్తవాలు మర్చిపోబడెను మరియు శనివారం బైబిలు సబ్బాతు అని "నిరూపించుటకు" వలయ తార్కికం ఉపయోగించబడుతుంది: i.e., ఆధునిక గ్రెగోరియన్ వారం నిరంతరం తిరుగుతున్న ఏడు రోజుల వారాలను కలిగి యున్నది, అందువలన వారాలు ఎల్లప్పుడూ నిరంతరంగా తిరుగుతూ ఉన్నాయి. అప్పుడు, శనివారం, నాలుగవ ఆజ్ఞ యొక్క "ఏడవ దినపు సబ్బాతు" అయి ఉండాలి. 30

పరలోకపు క్యాలండర్

లేఖనాల అంతటా, విశ్రాంతి దినము ప్రాముఖ్యమైనది. ఆదికాండం నుండి ప్రకటన వరకు, ఇది బంగారు దారం, అందరితో యః యొక్క వాగ్దాన విశ్రాంతిని నేయుచున్నది. ఈ భూమిపై ఎవరైనా, ఎప్పుడైనా మరియు ఎక్కడైనా, విశ్రాంతి దినము ఎప్పడు వచ్చును అని తెలిసికొనగలుగునట్లు భూమ్యాకాశములకు సృష్టికర్త, పాలకుడు అయిన యహువః ఒక కాల సూచక వ్యవస్థను ప్రవేశపెట్టక యుండిన యెడల సమస్తము అర్ధరహితంగా ఉంటుంది. సోవియట్ యుగంలో కెజిబి ద్వారా బంధించబడి, చెరసాలలో ఉంచబడిన ఒక శనివారపు-సబ్బాతు పరిచారకుడు ఈ విషయాన్ని బాగా వివరించెను. మొదట, అతడు ఏకాంత నిర్బంధంలో ఉంచబడ్డాడు. తరువాత, అతను గులాగ్ కు పంపబడ్డాడు. సబ్బాతు ఆచరణ అతడికి ముఖ్యమైనది కాబట్టి ప్రతిరోజును జాగ్రత్తగా పరిశీలన చేసేవాడు. మరియు అతడు గడుస్తున్న ప్రతి దినాన్ని చాలా జాగ్రత్తగా లెక్కించుకొనేవాడు, అలా సబ్బాతు ఎప్పుడు వచ్చునో గుర్తించగలుగుటకు. అయితే, చివరికి, అతడు క్రమాన్ని కోల్పోయాడు. వారు పెట్టిన బాధల వలన సమయాన్ని మరచిపోయాడా, లేక వేరే కారణమా అనేది ఇక్కడ విషయం కాదు. కారణమేమైనప్పటికీ, అతడు చివరికి తాను వారంలో ఏ రోజులో ఉన్నాడు అనే లెక్కను కోల్పోయాడు.

ఓహ్, అప్పుడు కావలివారు అతడిని ఎంత హాస్యం చేసియుందురు! కనికరం లేకుండా బాధపరిచారు. అతడు నిజంగా మానసిక వేదనను అనుభవించాడు. అతడు యహువఃను ప్రేమిస్తున్నాడు మరియు ఆయనను గౌరవించాలని కోరుకున్నాడు. అతడు తన విశ్వాస విషయంలో రాజీ పడుటకు నిరాకరించుట వలన ఖైదుగా ఉన్నాడు. అయితే, ఇప్పడు అతడు సబ్బాతు ఎప్పుడో మర్చిపోయాడు మరియు ఆ దినాన పని చేయుచున్నాడో లేదో అతనికి తెలియలేదు.

ఇది నిజమైన సబ్బాతును గూర్చి మరియు యహువః యొక్క నిజమైన క్యాలెండరును గూర్చి తెలియకపోవుట వలన సంభవించినది. ఏ ఒక్కరూ అజ్ఞానంలో ఉండుట ఆయన చిత్తం కాదు. లేక ఆదాము మరియు అవ్వలు ఒక చెట్టుపై కూర్చొని లెక్కించుకొనుటకు ఒక కాగితపు ముక్కను ఇవ్వలేదు. ఎంతో ప్రాముఖ్యమైన దానిని అంత సులభంగా నాశనం చేయబడు లేక సులభంగా మార్చబడు దానిలో ఉంచడు.

గుర్తుంచుకోండి, యహువః, అన్నిటికీ సృష్టికర్త. ఆయన ఆదాము మరియు అవ్వలకు ఒక కాగితంపై ముద్రించిన ఒక క్యాలెండరును ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆయన సృష్టి యొక్క ఆకాశ కాగితంపై తన సమయ-సూచక వ్యవస్థను పొందుపరిచి, ఈ భూమిపై ఎక్కడ ఉన్నవారైనా చూడగలగునట్లు దానిని ఆకాశంలో అమర్చాడు.

ఒక క్యాలెండరుగా చంద్రుని యొక్క విధి కీర్తన 104: 19 మరియు ఆదికాండము 1: 14-15 లో స్పష్టంగా వ్రాయబడినది. చంద్రుని పనితీరు యొక్క మార్పులేని స్వభావం మరొక కీర్తనలో కూడా సూచించబడుతుంది: అది శాశ్వతంగా చంద్రుని వలెను, మరియు ఆకాశంలోని నమ్మకమైన సాక్షి వలెను స్థిరపరచబడును. (కె.జె.వి, కీర్తనలు 89:36)

యహువః తన సమయ-సూచక వ్యవస్థను ఒక కాగితపు ముక్కకు లేదా ఒక రాతి పలకకు అప్పగించుననుటలో ఏ విధమైన అర్ధమూ ఉండదు, అలాగే ఆయన తన పరిశుద్ధమైన విశ్రాంతి దినమును లెక్కించే పద్ధతిని తన శత్రువు, లూసిఫెర్ యొక్క సంరక్షణలోనికి అప్పగించునని భావించుట సమస్త తర్కమును దాటి పోతుంది.

ఆధునిక "గ్రెగోరియన్" సౌర క్యాలెండర్ ఒక పోప్ సంబంధిత ఆవిష్కరణ. ఇది పోప్ గ్రెగొరీ XIII అనే పేరుతో ఉంది కూడా! ఇది మొదటిగా ప్రవేశపెట్టబడినప్పుడు, కేవలం మూడు దేశాలు మాత్రమే ఆమోదించాయి మరియు అవన్నీ క్యాథలిక్ దేశాలు. క్యాథలిక్ గా ఉండుటవలన ఇతర దేశాలు దీనిని తిరస్కరించినవి.

మరియు ఇంకా, జూలియన్ క్యాలెండర్ ఒక అన్యమత సౌర క్యాలెండరు కావున అది కూడా మంచిది కాదు. సృష్టి యొక్క సూర్య-చంద్ర క్యాలెండర్ మాత్రమే యః యొక్క నిజమైన మో’ఎడిమ్, ఆరాధన కోసం పరలోకం నియమించిన కాలాలను చూపించే సామర్థ్యాన్ని కలిగి ఉన్నది.

సమయం అంతయు చలనంపై ఆధారపడెను. ఆవిధంగా, నాలుగు రకాల క్యాలెండర్లు మాత్రమే ఉన్నాయి. క్యాలెండర్ పద్ధతులన్నియు క్రింది ఏదో ఒక దానిపై ఆధారపడును:

నక్షత్ర: నక్షత్రాల సాపేక్ష కదలికలను గమనించుట ఆధారంగా నక్షత్ర క్యాలెండర్లు సమయాన్ని సూచిస్తాయి. హిందూ క్యాలెండర్ నక్షత్ర, మరియు సౌర, రెండిటి కలయికతో ఏర్పడు పద్ధతిని ఉపయోగిస్తుంది.

సౌర: సౌర క్యాలెండర్లలో, (సూర్యుడు ఋతువుల చక్రాల ద్వారా), 365 రోజులలో తిరిగి దాని ప్రారంభ స్థానానికి వచ్చుటకు పట్టు కాలంపై సంవత్సరం ఆధారపడుతుంది. జూలియన్ మరియు గ్రెగోరియన్ క్యాలెండర్లు సౌర సమయ గణన యొక్క రెండు ఉదాహరణలు. ఒక సోలార్ క్యాలెండరులో, వారపు చక్రం ప్రకృతిలో దేనితోను ఎటువంటి సంబంధమును కలిగియుండదు.

చంద్ర:
చంద్ర క్యాలెండర్ చంద్రుని దశలపై మాత్రమే ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే 354 రోజుల చంద్ర సంవత్సరం, 365 రోజుల సౌర సంవత్సరానికంటే తక్కువగా ఉంటుంది, చంద్ర క్యాలెండరులోని నెలలకు ఋతువులతో పొందిక ఉండదు. ముస్లింలు ఉపయోగించే క్యాలెండరు చంద్ర క్యాలెండరు, దీనిలో రామదాన్ పండుగ ప్రతి సంవత్సరం ఒక నెల వెనుకకు జరుగుతుంటుంది.

సౌర-చంద్ర:
వినియోగంలో ఉన్న సమస్త క్యాలెండర్లలో సౌర-చంద్ర క్యాలెండర్లు అత్యంత సొగసైనవి మరియు ఖచ్చితమైనవి. వారాల చక్రం మరియు నెలలు చంద్రుని యొక్క కదలికలపై ఆధారపడి ఉంటాయి, సంవత్సరం సూర్యుడికి లంగరు వేయబడివుంటుంది. అందువలన, ఒక ఖచ్చితమైన చంద్ర క్యాలెండరులో ఎటువంటి ఋతువుల వెనుకబాటు ఉండదు. బైబిలు క్యాలెండర్ సౌర-చంద్ర క్యాలెండరు.

పరలోకంలో నమోదు చేయబడింది

సత్యం చెల్లాచెదురుగా మరియు శతాబ్దాల అసత్యంలో, మరియు ఊహాగానాలలో ఖననం చేయబడెను. సత్యం యొక్క చెదిరిపోయిన వివిధ "క్లిష్టమైన ముక్కలను" సమీకరించుటలో సహనం మరియు శ్రద్ధగల దృష్టి అవసరమౌతుంది. అయితే, శనివారం బైబిలు సబ్బాతు కాదనే సందేహానికి అనుగుణంగా సహాయపడే మరో రెండు ఆధారాలు నక్షత్రాలతో నిండిన ఆకాశంలో నమోదు చేయబడి ఉన్నాయి. ఆ రెండు: శిలువ వేయబడిన తేదీ, మరియు అంతర్జాతీయ తారీఖు రేఖ.

శిలువ వేయబడిన తేదీ

"స్పేస్-టైమ్ కంటిన్యువమ్" లోని విబేధాల గురించి సరదాగా వైజ్ఞానిక-కల్పన (Science fiction) ఊహాగానాలను పక్కన పెడదాం. నిజమే, సమయం, నిరంతరాయంగానే ఉంటుంది. అందువల్ల చాలామంది ఆధునిక ప్రజలకు, నిరంతర వారాల చక్రం లేని క్యాలండర్ వ్యవస్థను అర్థం చేసుకొనుట చాలా కష్టమవుతుంది. ఆధునిక వారాల చక్రం ఎల్లప్పుడూ ఉనికిలో ఉండెనని ప్రజలు అనుకొందురు. అందువలన, చరిత్రలో జరిగిన సంఘటనలను గుర్తుకు తెచ్చునప్పుడు కూడా వారు ఆధునిక క్యాలెండర్ తేదీల పరంగా ఆలోచింతురు.

ఉదాహరణకు, మారథాన్ యుద్ధమును తీసుకోండి. సాధారణంగా అంగీకరించిన తేదీ క్రీ.పూ. సెప్టెంబరు 12, 490. మీరు సమస్యను గమనించారా? నిజానికి, ఈ తేదీతో (ఊహాగానాలను పక్కన పెడితే) అనేక సమస్యలు ఉన్నాయి. అంతేకాకుండా, జూలియన్ క్యాలెండరులో సెప్టెంబరు అని పిలవబడిన నెల ఉన్నప్పటికీ, పై తేదీ జూలియన్ క్యాలెండర్ ఉనికిలోకి వచ్చుటకు దాదాపు 450 సంవత్సరాల ముందటిది.

చివరగా, క్రీ.పూ. 490 లో గల గ్రీకు క్యాలెండరులో "సెప్టెంబర్" నెల లేదు. గ్రీక్ క్యాలెండర్, ఇశ్రాయేలీయుల క్యాలెండరు వలె సూర్య-చంద్ర క్యాలండరు మరియు విభిన్న గ్రీకు నగర-పరిస్థితుల మధ్య కొన్ని వైవిధ్యాలతో ఉండేది. ఏథెన్సులోని నెలలు ఇలా పిలవబడ్డాయి:

హేకాటోంబియన్

మెటాగైట్నియన్

బోడ్రోమియన్

ప్యానేప్సన్

మైమక్టేరియన్

పోసిడాన్

గామెలియన్

యాంథెస్టిరియన్

ఎలాఫిబోలియన్

మునీషియన్

థార్జలియన్

 

An early Greek calendar from c.a. 1600 B.C.E.

c.a. 1600 క్రీస్తు పూర్వపు ప్రారంభ గ్రీకు క్యాలెండర్.

గమనించండి, వాటిలో ఒకటీ "సెప్టెంబర్" లేదు. కాబట్టి మారథాన్ యుద్ధం సెప్టెంబర్ 12 న జరిగింది అంటే అర్థం ఏమిటి?

ఆధునిక క్యాలెండర్ వాస్తవంగా వినియోగంలోనికి రాక మునుపు దాని తేదీలను ఉపయోగించుట నిజానికి ఒక ఉపయోగకరమైన సాధనం. ఇది నేటి ఆధునిక సమయ సూచిక పద్ధతిని అనుసరించి, చరిత్రలో ఒక సంఘటన ఎప్పుడు సంభవించినది, అని ప్రజలు అర్ధం చేసుకొనుటకు ఉపయోగపడుతుంది. ఆధునిక క్యాలెండర్ తేదీలను ఉపయోగించి వెనుకకు లెక్కించుటను ఒక ప్రోలేప్టిక్ క్యాలెండరును ఉపయోగించుట అందురు. ఒక ప్రోలేప్టిక్ క్యాలెండర్ వాస్తవంగా అది పరిచయమువుటకు ముందుకు, దాని తేదీల వ్యవస్థను వెనక్కి తీసుకువెళ్ళే ఒక క్యాలెండర్. అయినప్పటికీ, దీనిని ఉపయోగిస్తున్నప్పుడు, ఇది ఎప్పుడు జరుగుతున్నదీ తెలుసుకోవడం ముఖ్యం. నేటి విశ్వాసులు, ఆయన శుక్రవారం సిలువ వేయబడ్డాడని "రుజువు" చేయుటకు యహూషువః యొక్క సమయం వరకు వెనక్కి లెక్కించుటకు ప్రయత్నించారు. మరికొందరు కూడా ఇదే పని చేసి, ఆయన బుధవారం సిలువ వేయబడ్డారని "నిరూపించటానికి" ప్రయత్నించారు.

ఇప్పటికే వివరించినట్లుగా, జూలియన్ క్యాలెండరులో అప్పటికి "శుక్రవారం" లేదా "బుధవారం" ఇంకా ప్రవేశపెట్టబడలేదనే వాస్తవం రెండింటినీ అసాధ్యం చేస్తుంది. భూమిపై యహూషువః జీవించిన కాలానికి, జూలియన్ క్యాలండరు అప్పటికీ ఎనిమిది రోజుల వారాన్ని కలిగియుండేది. అందువలన, రక్షకుడు తన ప్రాణాన్ని శుక్రవారం లేదా బుధవారం నాడు త్యాగం చేసాడు అనే ఏవైనా వాదనలు ప్రోలేప్టిక్ తేదీలపై ఆధారపడి ఉంటాయి తప్ప మరేమీ కాదు.

అయినప్పటికీ, వారంలో ఆరవ రోజున యహూషువః సిలువ వేయబడెను అనేది నిజం. లేవీయకాండము 23 పస్కా యొక్క తేదిని ఇస్తుంది. “మొదటి నెల పదునాల్గవ దినమున యహువఃకు పస్కా పండుగ జరుగును.” (లేవీయకాండము 23: 5, కె.జి.వి) సూర్య-చంద్ర క్యాలెండరులో, ప్రతి నెల 14 వ దినము ఎల్లప్పుడూ వారంలోని ఆరవ దినమై ఉంటుంది. కాబట్టి, ఏ సందేహం లేకుండా, ఏడవ దినపు సబ్బాతుకు ముందు రోజున యహూషువః మరణించెను.

కేవలం ఈ కారణంగానే, యూదుల నాయకులు శిలువ వేయబడిన ముగ్గురు మనుష్యుల కాళ్ళను విరగగొట్టించుటకు పిలాతును అడిగారు, తద్వారా వారు ఊపిరాడక వెంటనే మరణించునట్లు మరియు త్వరగా ఖననం చేయగలుగునట్లు. “ఆ దినము సిద్ధపరచుదినము; మరుసటి విశ్రాంతి దినము మహాదినము గనుక ఆ దేహములు విశ్రాంతి దినమున సిలువ మీద ఉండకుండునట్లు, వారి కాళ్లు విరుగగొట్టించి వారిని తీసివేయించుమని యూదులు పిలాతును అడిగిరి.” (యోహాను 19: 3, KJV)

పస్కా పండుగకు తరువాతి దినము ఏడవదిన సబ్బాతు మాత్రమే కాదు, అది పులియని రొట్టెల పండుగలోని మొదటి దినము కూడా. “ఆ నెల పదునయిదవ దినమున యహువః కు పొంగని రొట్టెల పండుగ జరుగును; ఏడు దినములు మీరు పొంగని వాటినే తినవలెను” (లేవీయకాండము 23:6.) వేరే మాటలో చెప్పాలంటే, అది ఒక మహా విశ్రాంతి దినము.

సిలువ మరణం ఏ సంవత్సరంలో సంభవించినది అనే విషయమై వాదనలు జరుగుతూనే ఉన్నాయి ఎందుకంటే, మళ్ళీ మళ్ళీ, వారు చంద్ర నెలలో 14 వ రోజు (అబిబ్ 14 న పస్కా పండుగ) ఒక ప్రోలేప్టిక్ శుక్రవారంతో సమానంగా ఎప్పుడు వచ్చినదో చూచుచుండుట వలన. యునైటెడ్ స్టేట్స్ నావల్ అబ్జర్వేటరీ యొక్క అంతరిక్ష శాస్త్ర అప్లికేషన్స్ డిపార్టుమెంటు నుండి గణనలను ఉపయోగించి, రక్షకుడు సిలువ వేయబడుటకు సాధ్యమయ్యే ఒకే సంవత్సరమైన క్రీ.శ. 31 లో, 31 చంద్రనెల యొక్క 14 వ దినాన, ఒక ప్రోలేప్టిక్ శుక్రవారం రాలేదు అని నిరూపించుటకు ఇక్కడ అవకాశం ఉంది. ఇవి ఖగోళశాస్త్ర వాస్తవాలు మరియు పరలోకంలో భద్రపరచబడి, సులభంగా లెక్కించబడతాయి ఎందుకంటే ఇవి చాలా ఊహాజనితంగా ఉంటాయి.

అలాంటి చాలా ముఖ్యమైన విషయాల విషయంలో యహువః చివరి తరాన్ని అజ్ఞానంలో ఉంచడు. 2,000 సంవత్సరాల క్రితం చంద్రుని కదలికలను ఎంతో ఖచ్చితంగా తెలుసుకునే విధంగా ఆయన మనకు ఖగోళశాస్త్ర సూత్రాలను స్థాపించాడు! మరియు ఇవే కదలికలను, ఒక సౌర-చంద్ర క్యాలెండరుకు వర్తింపజేసినప్పుడు మరియు సిలువ వేయబడన దినం కోసం ఆధునిక వారంతో పోల్చినప్పుడు, ఆయన చంద్ర వారంలోని ఆరవ దినమున సిలువ వేయబడినప్పటికీ, ఆ సిలువ మరణం శుక్రవారం నాడు సంభవించలేదు.

ఇది ముఖ్యమైనది ఎందుకంటే ఇది రెండు అదనపు వాస్తవాలను స్థాపిస్తుంది:

  1. రక్షకుని సిలువ మరణ సమయంలో అప్పటికి ఆచరించబడుతున్న పురాతన సబ్బాతు ఒక శనివారం కాదు;

  1. ఆదివారపు ఆరాధన కోసం ఇవ్వబడిన కారణమైన— యహూషువః యొక్క పునరుత్థాన దినము—ఒక ఆదివారం కాదు.

కేవలం ఈ రెండు వాస్తవాలు ఆధునిక సౌర క్యాలెండరును ఉపయోగించి ఆరాధన దినాలను లెక్కించడంలో ఉన్న లోపాన్ని వెల్లడి చేస్తాయి. శనివారము నిజమైన, బైబిలు యొక్క పురాతన సబ్బాతు కాదు, మరియు ఆదివారం యహూషువః పునరుత్థాన దినము కాదు అందువలన, అది పునరుత్థానానికి గౌరవార్ధంగా ప్రత్యేకంగా ఆరాధించే ఒక దినము కాదు.

అంతర్జాతీయ తారీఖు రేఖ

అంతర్జాతీయ తారీఖు రేఖ అనేది ఆధునిక క్యాలెండరును ఉపయోగించి బైబిలు సంబంధ సబ్బాతును స్థాపించలేరు అనుటకు అత్యంత స్పష్టమైన, అత్యంత వినోదభరితమైన ఋజువులలో ఒకటి. ఇది ఒక మనిషి చేసిన ఆవిష్కరణ. ఇది పూర్తిగా అస్థరమైనదిగా ఉంటుంది మరియు ఆర్ధిక సౌలభ్యం విషయమై ఇది అనేక సార్లు మార్పు చేయబడినది.

అంతర్జాతీయ తారీఖు రేఖ యొక్క పూర్తి అస్థిరమైన స్వభావమును తెలియజేస్తూ, యునైటెడ్ స్టేట్స్ యొక్క జాతీయ మహాసముద్ర మరియు వాతావరణ పరిపాలన శాఖ ఇలా చెప్పెను:

1884 లో స్థాపించబడిన అంతర్జాతీయ తారీఖు రేఖ, పసిఫిక్ మహాసముద్రం గుండా వెళుతుంది మరియు భూమిపై ఉత్తర-దక్షిణ రేఖను 180 డిగ్రీల రేఖాంశంతో అనుసరిస్తుంది. ఇది ప్రధాన ధృవరేఖ నుండి — (1852 లో గ్రీన్విచ్, ఇంగ్లాండ్ లో స్థాపించబడిన సున్నా డిగ్రీల రేఖాశం నుండి) ప్రపంచం చుట్టూ అర్ధ భాగంలో ఉంటుంది.

అంతర్జాతీయ తారీఖు రేఖ వరుసగా రెండు క్యాలెండర్ తేదీలను వేరుచేసే "విభజన రేఖ" గా పనిచేస్తుంది. మీరు తారీఖు రేఖను దాటినప్పుడు, మీరు భిన్న రకాల కాల ప్రయాణికుడు అవుతారు! పశ్చిమానికి దాటితే, మీరు తర్వాత రోజుకు వెళతారు; తిరిగి వెనక్కి దాటితే మీరు "తిరిగి మీ ముందు రోజుకు వెళతారు."

ఆ పేరు ఉన్నప్పటికీ, ఈ తారీఖు రేఖకు చట్టపరమైన అంతర్జాతీయ హోదా లేదు మరియు దేశాలు తాము గమనించే తేదీలను స్వేచ్ఛగా ఎంచుకోవచ్చు. తారీఖు రేఖ సాధారణంగా ఉత్తరం ధృవం నుండి దక్షిణ ధృవం వరకు ప్రయాణిస్తున్నప్పుడు, తూర్పు రష్యా మరియు అలస్కా యొక్క అలుషియన్ దీవులు వంటి రాజకీయ సరిహద్దులను (వంకరటింకరగా) చుట్టుముడుతుంది. 32

రష్యా యొక్క అత్యంత తూర్పు భాగం వాస్తవానికి అలస్కా యొక్క అత్యంత పశ్చిమ భాగం కంటే మరింత తూర్పుకు ఉంటుంది! అంతర్జాతీయ తేదీ రేఖ పటాన్ని ఒక్క క్షణం చూస్తే అది ఎంత అస్థిరమైనదో కనబడుతుంది.



అంతర్జాతీయ తారీఖు రేఖ యొక్క మార్గమును చూపిస్తున్న ప్రపంచ పటం, ఇది పసిఫిక్ మహాసముద్రం గుండా వంకర టింకరలుగా ప్రయాణిస్తుంది.

ఇటీవల, అంతర్జాతీయ తారీఖు రేఖ 2012 లో మార్చబడింది. ఇది సమోవాలోని శనివారపు-సబ్బాతును ఆచరిస్తున్న క్రైస్తవులకు సమస్యగా మారింది. వారు కొత్త ఏడవ రోజు సబ్బాతును ఆరాధించారా? లేక, పాతదానికి కొనసాగించాలా, అనగా, ఇప్పుడు క్రొత్త తేదీనందు, ఆదివారమున ఆరాధించాలా?

అంతర్జాతీయ తారీఖు రేఖ ఊహాత్మకమైనది మరియు పూర్తిగా అస్థిరమైనది. యహువః అత్యంత ముఖ్యమైన ఆయన యొక్క సబ్బాతును, మార్చివేయబడుటకు అత్యంత అవకాశమున్న ఆధునిక క్యాలెండరుపై (ఒక సాధారణ ఓటుతో, ఇది మార్చబడగలదు) ఆధారపరడునట్లు అనుమతించెనని భావించుట చాలా హాస్యాస్పదంగా ఉంటుంది.

మీరు గ్రెగోరియన్ క్యాలెండర్ ద్వారా మీరు సబ్బాతును లెక్కించిన యెడల, మీకు మానవ-నిర్మిత అంతర్జాతీయ తారీఖు రేఖ అవసరం. అయితే, మీరు నెలలను ప్రారంభించుటకు, అలాగే సబ్బాతును లెక్కించుటకు, చంద్రునిని ఉపయోగించినట్లయితే, అలాంటి కృత్రిమ పరికరం అవసరం లేదు. కాలములను (మో'ఎడిమ్) నెలకొల్పుటకు చంద్రుడు సృష్టించబడెను. ఒకడు భూమిపై ఎక్కడ నివశిస్తున్నాడో సంబంధం లేకుండా ఇది ఖచ్చితంగా పనిచేయును.

ఒకే ఒక్క నిజ సబ్బాతు

మిధ్యా-మతం మిధ్యా-విజ్ఞాన శాస్త్రం వలె ఉంటుంది. ఇది ఒక నకిలీ, నిజం వలె నటించే ఒక మోసం. మిధ్యా-విజ్ఞాన శాస్త్రంలో అలాగే మిధ్యా-మతంలో, ఒక పరికల్పన ఊహాగానం మీద ఆధారపడి ఉంటుంది మరియు తరువాత నిజం వద్దకు వచ్చుట కంటే పరికల్పనను నిరూపించుటకు ప్రయత్నాలు జరుగుతాయి. అయినప్పటికీ, ఊహ సరైనది కానట్లయితే, "రుజువు" ఎంత మొత్తంలో ఉన్నప్పటికీ తప్పును సత్యంగా మార్చలేదు.

అదే విధంగా, శనివారాన్ని “సబ్బాతు” గా పిలిచే సుదీర్ఘ సాంప్రదాయం, దానిని సత్యంగా మార్చలేదు. ఆధునిక యూదులు నేడు శనివారమున ఆరాధించు వాస్తవం, వారి పండితులు ఇప్పటికే ఒప్పుకున్నదాని కంటే ఎక్కువ నిరూపించ లేదు: బైబిలు క్యాలెండరు ద్వారా వారు ఇకపై ఆరాధించరు.

పురావస్తు శాస్త్రం, లేఖనం మరియు ఖగోళశాస్త్రం యొక్క వాస్తవాలు సత్యాన్ని ప్రదర్శిస్తున్నాయి: బైబిలు యొక్క అసలైన సబ్బాతు చంద్రుని కదలికలపై ఆధారపడిన, సౌర-చంద్ర క్యాలెండరు ద్వారా లెక్కించబడుతుంది. దీనర్థం శనివారం “నీ ఎలోహీం అయిన యహువఃకు విశ్రాంతిదినము” (నిర్గమకాండము 20:10) కాదు, ఆదివారం యహూషువః పునరుత్థాన దినం కూడా కాదు అని. ఇవి రెండును ఆరాధనకు నకిలీ దినాలు, యహువఃకు మాత్రమే చెందవలసిన ఆరాధనను స్వాధీనపరచుకొనుటకు సాతాను ద్వారా ఏర్పాటు చేయబడినవి.

ఏదేమైనా, అసౌకర్యంగా ఉండుననే కారణంగా సత్యాన్ని గుర్తించకూడదనుకునేవారిని ఈ వాస్తవాలు ఇప్పటికీ ఒప్పించలేవు. అబ్రహం లింకన్ ఒకసారి ఇలా గమనించాడు: “ఒక నిజాయితీ గల వ్యక్తి తాను పొరపాటు చేశాడని గుర్తించినప్పుడు, అతడు తప్పుగా ఉండుటను లేదా నిజాయితీగా ఉండుటను నిలిపివేయును.” ప్రతి ఊహాగానమును మరియు పక్షపాతమును ప్రక్కన పెట్టమని WLC మీకు విజ్ఞప్తి చేస్తుంది. సత్యాన్ని ముందుగా ఉంచండి మరియు గొర్రెపిల్ల ఎక్కడికి వెళ్ళునో అక్కడికి ఆయనను వెంబడించండి.

ఇప్పుడు నిర్ణయం మీదే. మీ ముందున్న వాస్తవాలతో, మీరు ఏమి నిర్ణయించుకొందురు? ముగింపులో, డాక్టర్ మార్టిన్ లూథర్ కింగ్- జూనియర్ యొక్క మాటలు చాలా స్పష్టంగా ఉన్నాయి: "పిరికితనం ప్రశ్న అడుగుతుంది: ఇది సురక్షితమేనా? సౌకర్యం ప్రశ్న అడుగుతుంది: ఇది రాజకీయమేనా? గర్వం ప్రశ్న అడుగుతుంది: ఇది ప్రముఖమైనదేనా? కానీ మనస్సాక్షి ప్రశ్న అడుగుతుంది: ఇది సరైనదేనా? మరియు ఒకడు సురక్షితమైన, లేదా రాజకీయమైన, లేదా ప్రముఖమైన వాటికోసం నిర్ణయం తీసుకోకూడదు; కానీ ఒకడు, అది సరైనది కనుక దానిని తీసుకోవాలి.”


1 http://www.bbc.co.uk/history/british/empire_seapower/trafalgar_01.shtml

2 “కొందరు పండితులు ఆమె పేరు ఫ్రిగ్ అని చెబుతారు; ఇతరులు అది ఫ్రెయా అని చెబుతారు; ఫ్రిగ్ మరియు ఫ్రెయా రెండు వేర్వేరు దేవతలని ఇతర పండితులు చెబుతారు. ఆమె పేరు ఏమైనప్పటికీ, ఆమె తరచుగా వీనస్, ప్రేమ, అందం మరియు సంతానోత్పత్తి యొక్క రోమన్ దేవతతో సంబంధం కలిగి ఉంది. 'శుక్రవారం' పాత ఆంగ్లము యొక్క ‘Frīgedæg' నుండి వచ్చింది.” (https://www.livescience.com/45432-days-of-the-week.html)

3 ఎవియేటర్ జెర్బావెల్, ది సెవెన్ డే సర్కిల్, పే. 23, ప్రాముఖ్యత ఇవ్వబడింది.

4 ఐబిడ్, పేజీ. 23-24, ప్రాముఖ్యత అందించబడెను.

5 రాబర్ట్ ఎల్. ఓడమ్, సండే ఇన్ రోమన్ పాగనిజం, "ది అగాన్ ప్లానెటరీ వీక్," http://4angelspublications.com/Books/SiRP/CHAPTER%201.pdf, emphasis supplied.

6 ఎలైన్ ఓర్న్హోల్ట్ & లారా లీ ఓర్న్హోల్ట్-జోన్స్, క్యాలెండర్ మోసం, “టైమ్స్ గ్రేటెస్ట్ కాన్స్పిరసి థియరీ: ది కంటిన్యుయస్ వీక్లీ సైకిల్.”

7 “జూలియన్ క్యాలెండర్”, ఎన్సైక్లోపీడియా బ్రిటానికా, ప్రాముఖ్యత అందించబడెను.

8 క్యాలెండర్ ఫ్రాడ్, OP సిట్. పేజి 31.

9 Inscriptiones Latinæ Christianæ Veteres, Vol. 2, p. 118, #3033.

10 క్యాలెండర్ ఫ్రాడ్, op cit.

11 మైమోనిడేస్, Kiddusch Ha-hodesch, Tr. మహ్లెర్, వీన్, 1889.

12 “హాలీడేస్,” యూనివర్సల్ జ్యూయిష్ ఎన్సైక్లోపీడియా, పేజీ. 410.

13 ది యూనివర్సల్ జ్యూయిష్ ఎన్సైక్లోపీడియా, ఇసాక్ లాండ్మాన్ (ed.), వాల్యూం. X, “వీక్,” (1943 ed.), పేజీ. 482.

14 ది యూనివర్సల్ జ్యూయిష్ ఎన్సైక్లోపీడియా, “క్యాలండర్,” పేజీ. 631.

15 “క్యాలండర్,” ది జ్యూయిష్ ఎన్సైక్లోపీడియా, ప్రాముఖ్యత అందించబడింది.

16 “జ్యూయిష్ క్యాలెండర్ అండ్ హాలీడేస్ (సబ్బాత్ తో కలిపి)” : ది జ్యూయిష్ క్యాలెండర్; చేంజింగ్ ది క్యాలండర్, www.torah.org, ప్రాముఖ్యత ఇవ్వబడింది.

17 హీన్రిచ్ గ్రెట్జ్, హిస్టరీ ఆఫ్ ది జ్యూస్, వాల్యూమ్. II, pp. 563-564, ఉద్ఘాటన సరఫరాచేయబడెను.

18 డేవిడ్ సైడర్ స్కై, ఆస్ట్రనామికల్ ఆరిజన్ ఆఫ్ జ్యూయిష్ క్రానాలజీ, ప్యారిస్, 1913, పేజీ. 651, ఉద్ఘాటన సరఫరాచేయబడెను.

19 గ్రేస్ అమెడాన్, "హిస్టారికల్ బేసిస్, ఇన్వాల్వ్మెంట్, అండ్ అక్టోబర్ 22, 1844, పొజిషన్" పై కమిటీ రిపోర్టు, పార్ట్ V, సెక్షన్. B, పేజీ. 17-18, ప్రాముఖ్యత ఇవ్వబడింది; బాక్స్ 7, ఫోల్డర్ 1, గ్రేస్ అమెడాన్ కలెక్షన్, సెంటర్ ఫర్ అడ్వెంటిస్ట్ రీసెర్చ్, ఆండ్రూస్ విశ్వవిద్యాలయం, బెర్రిన్ స్ప్రింగ్స్, మిచిగాన్.

20 ఐబిడ్.

21 జనవరి, 1883

22 ఫిబ్రవరి, 1914

23 ఒక రాతప్రతిని వినడానికి, ఇక్కడ క్లిక్ చేయండి.

24 మో’ఎడ్ (# 4150), ది కీ వర్డ్ స్టడీ బైబిల్, కింగ్ జేమ్స్ వర్షన్, "లెక్సికల్ అయిడ్స్ టు ది ఓల్డ్ టెస్ట్మెంట్."

25 నెల్సన్ యొక్క ఇల్యూస్ట్రేటెడ్ బైబిల్ డిక్షనరీ, థామస్ నెల్సన్ పబ్లిషర్స్, 1986, ప్రాముఖ్యత ఇవ్వబడింది.

26 బైబిలు క్యాలెండర్ ఎలా పనిచేస్తుందో మరింత వివరించుట ఈ వ్యాసం యొక్క పరిధిని దాటిపోతుంది. మరింత సమాచారం కోసం, ఇక్కడ క్లిక్ చేయండి.

27 ఈ అంశంపై ఒక వివరణాత్మక మరియు లోతైన అధ్యయనం కోసం, చూడండి వారపు సబ్బాతు దినాలు చంద్రుని ద్వారా నిర్ణయించబడుతాయి అనే ఆర్నాల్డ్ బోవెన్ మరియు మాథ్యూ జాన్జెన్ ల రచలలో చూడండి.

28 ఎలైన్ వార్న్హోల్ట్ & లారా లీ వార్న్హోల్ట్-జోన్స్, ది గ్రేట్ క్యాలెండర్ కాంట్రావర్సీ, p. 87, అసలైన ఉద్ఘాటన.

29 ఓండమ్, ఓప్ సిట్., పే. 157.

30 క్యాలెండర్ ఫ్రాడ్, ఆప్ సిట్. p. 44.

31 సిలువ వేయబడిన సంవత్సరంగా క్రీ.శ. 31 మాత్రమే ఎందుకు సాధ్యమవుతుందనే వివరణాత్మక విశ్లేషణ కోసం, చదవండి: “క్రీస్తు నిజంగా ఎప్పుడు సిలువ వేయబడ్డారు?” “When Was Christ Really Crucified?”

32 http://oceanservice.noaa.gov/facts/international-date-line.html