Print

పరలోకపుపరిశుద్ధ దినములు

అంతట మోషే గుడారమును తీసి పాళెము వెలుపలికి వెళ్లి పాళెమునకు దూరముగా దానిని వేసెను. దానికి ప్రత్యక్షపు గుడారమని [గుడార- మో'ఎడిమ్] పేరు పెట్టెను. ( నిర్గమ 33:7-11 చూడుము). ఇది పాళెమునకు మధ్యలో వుండే గుడారము కాదు. అప్పటికి అటువంటి అతిపరిశుద్ద-స్థలము ఇంకా నిర్మించబడలేదు. గుడార-మోఎడిమ్ అనేది ఒక ప్రత్యేక "ఉద్దేశ్యం" కోసం నిర్మించబడిన ఒక సాధారణ గుడారము: అది యహువః ను ఆయన నియామక కాలములయందు కలుసుకొనుట. మో’ఎడిమ్ ఇలా భాషాంతరం చేయబడెను: ఎడారిలో గుడారమునియామక కాలము, సమాజ కూటము, సమావేశము, దినములు, సూచన, సమాజ మందిరము, కాలము మరియు పండుగ. అయినప్పటికీ, ఈ పదముల జాబితా ఆ హీబ్రూ పదము యొక్క పూర్తి అర్ధమును పట్టుకొనలేదు.

"మో'ఎడ్ అనేపదము విస్త్రుతార్ధంలో మత సమావేశాలు అన్నింటినీ సూచించును. ఇది ప్రత్యక్ష గుడారముకు  సంబంధించినది…..[యహువః] ఇశ్రాయేలీయులకు తనచిత్తమును తెలియజేయుటకు విశేషమైన సమయముల యందు ప్రత్యక్షమాయెను. “ఇది యహువః యొక్క ప్రజల ఆరాధనా సమావేశాలకు సామాన్య పదము” ("Lexical Aids to the Old Testament," Hebrew-Greek Key Word Study Bible, p. 1626.)

 మో'ఎడ్ యొక్క వివిధ అర్ధాలలో, "నియామక కాలము" అనేది అత్యంత మూలాధారమైనది"(Mo'ed, #4150, The New Strong's Expanded Dictionary of Bible Words.)

ఆరాధన కొరకు నియమించిన దినముల విషయంలో సృష్టికర్త చాలా ప్రత్యేకమైన ఆలోచనను కలిగియున్నారు. సృష్ట్యారంభములో సృష్టికర్త ఆయన యొక్క నియామక కాలములను [మో'ఎడిమ్] లెక్కించుటకు ఒక కాలసూచక వ్యవస్థను, ఒక కేలండరును సృష్టించెను.

“మరియు [యహువః] పగటిని రాత్రిని వేరుపరచునట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగును గాకనియు, అవి సూచనలను, కాలముల [నియామకకాలముల] ను, దినసంవత్సర ములను సూచించుటకై యుండు గాకనియు., . . . పలికెను". (ఆదికాండము1:14).

ఆకాశంలోని జ్యోతులు వాటి గమనము ద్వారా సమయమును కొలుచుటకు రూపించబడెను. గమనము లేకుండా కాల కొలత లేదు. సూర్యుడు దినములను మరియు సంవత్సరములను కొలుచుటకు ఇవ్వబడెను. చంద్రుడు సంవత్సరంలో భాగమైన నెలలను లేదా చంద్రమానాలను కొలుచును. ఆరు పని దినాల తరువాత ఒక ఏడవ దినపు సబ్బాతు వుండుట వారపు నమూనా అయివుండెను. నెల మధ్యలో వుండే ఈ చిన్న “కాలపు-విభాగము” సృష్ట్యారంభములో రూపింపబడెను.

సూర్యుడు మరియు చంద్రుడుఆధునిక అన్య/ పాపల్ కేలండరు నిరంతరము తిరిగే వారాల చక్రములను కలిగియున్నది. సృష్టి యొక్క కేలండరులో వారాల చక్రము ప్రతీ న్యూమూన్ దినానికీ పునః ప్రారంభమవును. అలా, ఏడవ దినపు సబ్బాతునకు లేఖనాలలో ప్రతీసారీ ఒక తారీఖు ఇవ్వబడెను, అది ఎల్లప్పుడూ నెలయొక్క 8, 15, 22, 29 తేదీలలో వచ్చును.

పరలోక రూపకర్త చంద్రున్ని ప్రత్యేకంగా ఆయన యొక్క ఆరాధనా కాలము [ఆయన మో'ఎడిమ్] లను లెక్కించుటకు సృష్టించెను.

“ఋతువులను [కాలములను #4150] తెలుపుటకై ఆయన చంద్రుని నియమించెను.” కీర్తనలు KJV 104:19

మరో విధంగా చెప్పాలంటే,

"మో'ఎడిమ్, ఆరాధనా కాలములను తెలుపుటకై ఆయన చంద్రుని సృజించెను."

లేఖనాలు ఆరాధన కొరకు తొమ్మిది నియామక కాలములను చూపిస్తున్నవి.

ఈ దైవ నిర్ణయ కాలములను కేవలము చంద్రుని ద్వారా లెక్కించే కేలండరుపై మాత్రమే కనుగొనుటకు వీలవుతుంది. ఏడవ దినపు సబ్బాతు మరియు వార్షిక పండుగలు అన్నియు ఆయన యొక్క మో'ఎడిమ్ లేదా నియామక కాలములు అని లేవీకాండము 23 పేర్కొనుచున్నది.

మరియు యహువః మోషేకు ఈలాగు సెల విచ్చెను. నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము: మీరు చాటింపవలసిన [యహువః] "నియామక కాలములు ఇవే"; ఈ కాలములయందు మీరు పరిశుద్ధ సంఘములుగా కూడవలెను; నా నియామక కాలములు ఇవి.

Biblical Lunar-Solar Calendar

ఏడవ దినపు సబ్బాతునకు లేఖనాలలో ప్రతీసారీ ఒక తారీఖు ఇవ్వబడెను, అది ఎల్లప్పుడూ నెలయొక్క 8, 15, 22 మరియు 29 తేదీలలో వచ్చును.

ఆరు దినములు పనిచేయవలెను; వారము వారము ఏడవ దినము విశ్రాంతి దినము; అది పరిశుద్ధసంఘపు దినము. అందులో మీరు ఏ పనియైనను చేయకూడదు. మీ సమస్త నివాసములయందు అది [యహువః] నియమించిన విశ్రాంతి దినము.

ఇవి యహువః నియామక కాలములు, నియమించిన కాలములను బట్టి మీరు చాటింపవలసిన పరిశుద్ధ సంఘపు దినములు [మో'ఎడిమ్] ఇవి.

మొదటి నెల పదునాలుగవ దినమున సాయంకాలమందు యహువఃకు పస్కాపండుగ జరుగును. ఆ నెల పదునయిదవ దినమున యహువఃకు పొంగని రొట్టెల పండుగ జరుగును. . . . మరియు విశ్రాంతి దినమునకు మరునాడు యాజకుడు [యహువః] యెదుట పనను అల్లాడింపవలెను . . . .

మీరు విశ్రాంతి దినమునకు మరునాడు మొదలుకొని, అనగా అల్లాడించు పనను మీరు తెచ్చిన దినము మొదలు కొని ఏడు వారములు లెక్కింపవలెను.. లెక్కకు తక్కువ కాకుండ ఏడు వారములు ఉండవలెను.                                                   ఏడవ విశ్రాంతి దినపు మరుదినము ‘వరకు’ మీరు ఏబది దినములు లెక్కించి [యహువః] కు క్రొత్తఫలముతో నైవేద్యము అర్పింపవలెను. [Fenton Translation]

ఏడవ నెలలో మొదటి దినము మీకు విశ్రాంతి దినము. అందులో జ్ఞాప కార్థశృంగధ్వని వినినప్పుడు మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను . . . ఈ యేడవ నెల పదియవ దినము పాపము నిమిత్తమైన ప్రాయశ్చిత్తార్థ దినము; అందులో మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను . . .                                                                              

నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము ఈ యేడవ నెల పదునయిదవ దినము మొదలుకొని యేడు దినముల వరకు యహువః కు పర్ణశాలల పండుగ . . .

'ఇవి యహువః నియామక కాలములు, నియమించిన కాలములను బట్టి [సబ్బాతుతో పాటు] మీరు చాటింపవలసిన పరిశుద్ధ సంఘపు దినములు ఇవి.' (లేవీయకాండము 23 చూడుము.)

ఏడవ దినపు సబ్బాతు మరియు వార్షిక (సంవత్సర) పండుగలు అన్నియు ఆయన యొక్క మో'ఎడిమ్: ఆరాధన కొరకు నియమించిన నియామక కాలములని లేవీకాండము 23 స్థాపించుచున్నది. అవన్నియు అమూల్యమైన బహుమానములు; అవి సృష్టికర్త రూపించిన జ్యోతి, చంద్రుని ద్వారా లెక్కించబడతాయి.

"[ఎలోహీం] ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగును గాకనియు, అవి సూచనలను, కాలము [నియామక కాలము] లను . . .  సూచించుటకై యుండు గాకనియు . . . పలికెను." (ఆదికాండము1:14).

ఆకాశంలోని జ్యోతులను కాలమును కొలుచుటతో పాటు, తిరుగుబాటుదారుల నుండి విధేయులను వేరుచేసే క్రియకు సూచనగా సృష్టికర్త నియమించెను. యహువః యొక్క కేలండరు వ్యవస్థ చీకటి సంబంధుల నుండి వెలుగు సంబంధులను వేరుపరిచే గురుతుగా వున్నది.

నిత్యత్వంలో అంతటనూ, ఆయన నియామక కాలముల [ఆయన మో'ఎడిమ్] యందు ఆరాధన చేయుట ద్వారా సృష్టికర్తకు తమ విధేయతను ప్రతిజ్ఞ చేయుటకు విశ్వమంతయూ ఐక్యమవును.

నేను సృజింపబోవు క్రొత్త ఆకాశమును క్రొత్త భూమియు లయముకాక
నా సన్నిధిని నిలుచునట్లు నీ
సంతతియు నీ నామమును నిలిచి యుండును ఇదే
యహువః వాక్కు.
"ప్రతి అమావాస్యదినమునను ప్రతి విశ్రాంతిదినము నను నా
సన్నిధిని మ్రొక్కుటకై సమస్త శరీరులు వచ్చె దరు అని యహువః
సెలవిచ్చుచున్నారు."
(యెషయా గ్రంథమ 66:23)

సృష్టికర్తకు మీ విధేయతను ప్రతిజ్ఞ చేయాలని అనుకుంటున్నారా? పరలోకంలో మరియు భూమిపై ఆయన యొక్క నమ్మకమైన భక్తులతో చేరండి. సృష్టికర్తను ఆయన నియమించిన కాలాలలో ఆరాధించండి. అవి ఆయన గడియారము ద్వారా తెలియబడును. ఆ గడియారము చంద్రుడు.