యూదుల పండితులు శనివారాన్ని
లేఖనాల యొక్క పురాతన, అసలు సబ్బాతు కాదని గుర్తించిరి.
మార్క్ ట్వైన్, ఒక ప్రఖ్యాత నవలారచయిత మరియు హాస్యగాడు, ఒకసారి ఇలా గమనించాడు: "సాధారణంగా ఒక తత్తరపాటు లేని ప్రసంగాన్ని సిద్ధం చేయాలంటే మూడు వారాల కంటే ఎక్కువ సమయం పడుతుంది." ప్రసంగాలలో గాని వాదనలలో గాని మనసులను ఒప్పించే విధంగా మాట్లాడాలంటే తప్పకుండా చాలా ఆలోచన మరియు సిద్ధపాటు ఉండాలని ప్రజా వక్తలు తొందరగానే నేర్చుకుంటారు. ప్రజా వక్తలు కొన్ని రకాల వాదనలను వినియోగించకూడదని గ్రహిస్తారు ఎందుకంటే, వారు భావోద్వేగాలను చూపునప్పుడు, వారు తార్కికతను (యుక్తిని) కోల్పోవుదరు. అలా, చివరికి, వారు ఎవరినీ ఒప్పించలేరు.
లూనార్ సబ్బాతు విధానమును తరచూ వ్యతిరేకిస్తూ వినిపిస్తున్న ఒక వాదన ఏమిటంటే: "యూదులు ఎప్పుడూ నిజ విశ్రాంతిదిన క్రమమును కోల్పోలేదు అని!”. అలాంటి ఒక వాదన దేనినీ నిరూపించ లేదు! నిజానికి, ఇది వాదోపవాదనల యొక్క రెండు నియమాలను ఉల్లంఘించును:
సత్యమేమిటంటే, సగటు యూదుడు దేనిని నమ్ముచున్నాడు అనే దానితో సంబంధం లేకుండా చూసినప్పుడు, శనివారం బైబిలు యొక్క సబ్బాతు కాదు. యూదుల పండితులు ఎప్పుడూ సబ్బాతును "కోల్పోలేదు" కానీ వారు ఉద్దేశపూర్వకంగా తెలిసియుండియే సబ్బాతును లెక్కించే కేలండరును మార్చుకున్నారు. మరియు అది చాలా కాలం క్రితం జరిగింది, మరియు అనేక యూదులు తమకు ఈ కేలండర్ల మార్పు వలన ప్రభావితమయ్యే ప్రతి విషయము తెలియదు.
నైసియా సభ [సిర్సా స్ప్రింగ్ / వేసవి, 325 AD] క్రైస్తవ మతం యొక్క చరిత్రలో అత్యంత విశిష్టమైనది. ఆ సమయంలో, సంఘమును అసభ్యత ముట్టడించినది. ప్రారంభ క్రైస్తవుల యొక్క స్వచ్ఛమైన, అపొస్తలిక్కు విశ్వాసం పలుచగా మారినది. నైసియా సభ యూదామతపు చరిత్రలో కూడా విశిష్టమైనదే, సభ తర్వాత, బైబిలు యొక్క నిజమైన కాలములను పాటించాలనుకునే వారి చుట్టూ తీవ్రమైన హింసలు చుట్టిముట్టెను.
నైసియా సభ వద్ద క్రైస్తవ మతమును తన మాతృ మూలముకు అనుసంధానిస్తూ వున్న చిట్ట చివరి బంధము తెంచి వేయబడెను. ఈస్టర్ వేడుక ఇప్పటి వరకు, చాలా వరకు యూదుల సన్హెద్రిన్ ద్వారా లెక్కించబడు యూదులు పస్కాను జరుపుకునే అదే సమయంలో జరుపబడుతూ వచ్చుచున్నది; కానీ భవిష్యత్తులో దీని ఆచారం మొత్తం యూదుల కేలండరుకు వేరుగా ఉంటూ స్వతంత్రంగా చేయబడును.1
రోమా చక్రవర్తి కాన్స్టెంటైన్ ది గ్రేట్, తన వ్యక్తిగత, రాజకీయ ప్రణాళికను ముందుకు తీసుకెళ్లేందుకు సభను ఏర్పాటు చేసెను. క్రైస్తవులు వారి ఆధ్యాత్మిక వారసత్వ సంబంధం కలిగియున్న యూదామతం నుండి పూర్తిగా వేరవ్వాలని అతడు కోరుకొనెను. భవిష్యత్తులో ఏ మతపరమైన ఆచారము యూదుల కేలండరు ద్వారా లెక్కించబడరాదని అతడు ప్రకటించాడు:
పండుగలలోకెల్లా పవిత్రమైన దీనిని [ఈస్టర్] యూదుల ఆచరణ చొప్పున పాటించాలి అంటే అది తగని విధముగా లెక్క దాటిపోవుచున్నది. ఇదిమొదలుకుని ఈ అప్రియమైన ప్రజలతో దేనిలోనూ స్వారూప్య సంబంధమును కలిగి యుండరాదు. మన రక్షకుడు మనకొరకు వేరొక మార్గమును చూపియుండెను. వారి నియమాల [లెక్కింపు] సాయం లేకుండా మనము పస్కా జరుపుకునే స్థితిలో లేమని యూదా ప్రజలు అతిశయించుట అనుచితము. 2
ఈ ప్రకటన పురాతన కాలనిర్ణయ పద్ధతి మీద సుదీర్ఘమైన మరియు విపత్కరమైన ప్రభావాలను చూపించెను. కాన్స్టెంటైన్ యొక్క కుమారుడు, కన్స్టేంటియస్, ఇంకా ముందుకు వెళ్ళెను. అనగా కాన్స్టెంటైన్ క్రైస్తవ ఆచారములయందు యూదుల కేలండరు వాడుకను చట్టవిరుద్ధం చేస్తే, కన్స్టేంటియస్ యూదులు కూడా దానిని ఉపయోగించకుండా బహిష్కరించెను!
"కన్స్టేంటియస్ (క్రీ.శ 337-362 ) హయాంలో, యూదులపై వేధింపులు ఎంత తారాస్థాయికి చేరుకొనెనంటే. . . తీవ్రమైన శిక్ష 3 యొక్క భాధవలన కేలెండరు లెక్కింపు నిషేధించబడింది [జరిగినది]. శనివారం సృష్టి యొక్క పురాతన సబ్బాతు కాదు, లేక మోషే లేదా యహూషువఃల సబ్బాతు కూడా కాదు. తీవ్రమైన హింస వలన, యూదులు తామే, తమ ఆధ్యాత్మిక సమయ గణన పద్ధతిని మార్పుచేసిరి. మతగురువు హిలెల్ II, సన్హెద్రిన్ అధ్యక్షుడు, చివరికి శనివారంను విశ్రాంతిదినముగా అంగీకారించుటకు దారితీసిన మార్పులకు బాధ్యుడైయండెను.
"యూదయ బాధాకరమైన పరిస్థితి ఏమిటంటే ఇంకా పూర్తిగా పరిశీలించని పితరుడు హిలెల్ యొక్క స్వయం పునరుద్ధరణ చర్యయే. "న్యూమూన్ దినములను మరియు లీపు సంవత్సరాలను లెక్కించుట మరియు దూతలు ద్వారా వాటిని (పండుగ సమయాలను) పొరుగు ప్రాంతాల సమాజాలకు ప్రకటించుట ఇప్పటి వరకు రహస్యంగా కొనసాగుతున్నది." "కన్స్టేంటియస్ వేధింపుల సమయంలో ఈ పద్ధతి అసాధ్యమైనదిగా మరియు పనికిరానిదిగా కూడా నిరూపించుకున్నాయి. ఎప్పుడైతే లీపు సంవత్సరపు తారీఖును సన్హెద్రిన్ నిర్ణయించుట నిషేదించబడనినదో, అప్పుడు సుదూర దేశాలలో వున్న యూదుల సమాజాలు ముఖ్యమైన మత నిర్ణయాలకు సంబంధించిన విషయాలలో పూర్తి అయోమయంలో పడెను. "అన్ని ఇబ్బందులను మరియు అనిశ్చితి నిలిపుదల చేయుటకు, హిలెల్ II ఒక చివరి మరియు స్థిర కేలండరును ప్రవేశపెట్టెను. . . అలా రోమా మరియు పర్షియా సామ్రాజ్యాలయందంతటా చెదిరియున్న సమాజాలు తమ పూర్వీకులతో కలిగియున్న చివరి బంధమును ఈ పితరుడు, (హిలెల్౹౹) తన సొంత చేతితో నాశనం చేసెను. 4
నిజానికి కేవలం యూదులు శనివారమున ఆరాధించుట వలన జనులు దానినే నిజమైన సబ్బాతుగా ఎందుకు అనుకుంటున్నారో అనే వాస్తవమును 1,600 సంవత్సరాల క్రితం జరిగిన ఈ మార్పు వివరిస్తుంది. అయితే, హిలెల్ యొక్క చర్య పూర్తి కేలెండరు మార్పు అని యూదుల పండితులకు బాగా తెలుసు:
వసంత కాలం వచ్చునపుడు వచ్చే న్యూమూన్ దినమును, కొత్త నెలను పరిశీలించుట ద్వారా, కొత్త సంవత్సరంను ప్రకటించుట సన్హెద్రిన్ ద్వారా మాత్రమే వీలగును. హిలెల్ II, అనే సన్హెద్రిన్ చివరి అధ్యక్షుని సమయంలో, రోమీయులు ఈ పద్థతిని నిషేధించిరి. అందువలన హిలెల్ II తన స్థిర కేలెండరును నెలకొల్పవలసిన అవసరం ఏర్పడినది. అలా భవిష్యత్తు సంవత్సరాల కేలెండర్లను సన్హేద్రిన్ ముందస్తుగానే నిర్ణయించగలిగే అవకాశం కలిగెను. 5
ఇది తగినంతగా ఉద్ఘాటించడం సాధ్యం కాదు: యూదుల పండితులకు వారు ఇప్పుడు ఉపయోగిస్తున్న కేలండరు నిర్గమకాండము వద్ద యహువః చేత స్థాపించబడి, మోషే ద్వారా ధృవీకరించబడినది కాదని పూర్తిగా తెలుసు. ఈ వ్యాసంలోని చారిత్రక ఆధారాలన్నియు పూర్తిగా యూదుల రచనలలోని వారి వాంగ్మూలాల నుండి తీసుకోబడినవి. శనివారం బైబిలు యొక్క సబ్బాతు కాదని వారికి తెలుసు మరియు వారు తమ చరిత్రలో లిఖించిరి.
కేలండరు మార్పు:
సబ్బాతు మార్పు అనేది ప్రత్యేకించి ఒక కేలండరు మార్పు అని యూదుల పండితులకు తెలుసు. రబ్బీ లూయిస్ ఫిన్కెల్స్టెయిన్ ఒక గౌరవనీయమైన మరియు బాగా ప్రసిద్ధిచెందిన యూదా పండితుడు. ప్రపంచ యూదుల సమాజముల ద్వారా ఫిన్కెల్స్టెయిన్ ప్రపంచ ఉత్తమ "యూదా మత దీపాలు" గా ప్రాతినిధ్యం వహించిన 120 మంది అగ్ర యూదులలో ఒకనిగా ఎన్నుకోబడ్డాడు. ఫిబ్రవరి 20, 1939 న డాక్టర్ లెరోయ్ ఫ్రూమ్ కి వ్రాసిన ఒక లేఖలో, ఫిన్కెల్స్టెయిన్ అనాయాసంగా ఇలా ఒప్పుకున్నాడు: "యూదుల క్యాలెండరు నాలుగో శతాబ్దంలో నిర్ణయించబడింది." 6
హెన్రిచ్ గ్రీట్జ్, తన పెద్ద, ఆరు సంపుటాల (అమెరికా యూదు సమాజం ప్రచురించిన) గ్రంధంలో ఇలా ఒప్పుకున్నాడు: "కేలండరు గణన మరియు మత సంబంధమైన వస్తువాణిజ్యం కూడా నాలుగో శతాబ్దంలో నిషేధించబడెను". 7
నేడు పోపు సంబంధమైన గ్రిగోరియన్ కేలండరులో ప్రతి వారానికి ఏడు రోజులు గల నిరంతర వారాల చక్రం ఉండుట వలన, అనేక మంది ఏడు రోజుల హెబ్రీ వారానికి ఇది ఏదోవిధంగా సరిపోతూ వుందని అనుకుంటున్నారు. అందువలన వారు, శనివారంను లేఖనాల యొక్క ఏడవ-రోజు సబ్బాతయి వుండాలని తేల్చారు. ఇలాంటి అంచనాలు సరైనవి కాదని నిర్ధారణ అవుతుంది. అయితే, సౌర కేలెండరుకు మరియు బైబిలు యొక్క సూర్య-చంద్ర కేలెండరుకు ఉన్న నిర్మాణాల మధ్య గల ప్రాథమిక తేడాలను గూర్చి సరిగా అవగాహనను కలిగిలేకపోవుట వలన ఇలాంటి అంచనాలు ఉద్భవిస్తాయి.
లూనార్ సబ్బాతు |
యూదుల పండితులకు, నాల్గవ శతాబ్దం నుండి మొదలుకొని వెనుకకు సృష్టి ప్రారంభంవరకు గల నిజమైన విశ్వాసుల ద్వారా అనుసరింపబడిన సబ్బాతు, నిరంతర వారాల చక్రం యొక్క భాగం కాదని తెలుసు. అయితే, నెలలు చంద్రుని దశలను వెంబడించేవి. వారాల వలయాలు కూడా ప్రతి నెలారంభమునకు వాటికవే పునఃప్రారంభమయ్యేవి. అందువలన, ఏడవ-రోజు విశ్రాంతి అనేది ఆధునిక శనివారం వలె నిరంతర వారాల చక్రంలోని భాగం కాదు.
"న్యూ మూన్ ఇప్పటికీ ఉంది, మరియు సబ్బాతు నిజానికి (మొదట్లో) చంద్రుని దశలమీద ఆధారపడి ఉండేది . . . నిజానికి, న్యూ మూన్ దినాన్ని కూడా సబ్బాతు వలెనే జరుపుకునేవారు; రాను రాను సబ్బాతు మతపరమైన ధ్యాన మరియు బోధనల యొక్క దినంగా, మానవత్వం యొక్క రోజుగా, ఆత్మ యొక్క శాంతి మరియు ఆనంద కారకమైన దినంగా మరింత ప్రాదాన్యత సంతరించుకోగా, న్యూమూన్ ప్రాధాన్యత క్రమంగా తగ్గినది. 8
యూదులు నేటికినీ వారి మతపరమైన వార్షిక పండుగలను లెక్కించేందుకు సూర్యచంద్ర కేలండరును ఉపయోగించుదురు. అందువలన, పస్కా మరియు ప్రాయశ్చిత్తార్ధ దినము నిరంతర వారాల చక్రాలు గల గ్రెగోరియన్ కేలండరుపై ఒక తేదీ నుండి మరొక తేదీనకు మారును. వారపు విశ్రాంతి దినాలయితే, ఇక చంద్రుని దశలతో ఏమాత్రం సంబంధాన్ని కలిగి యుండవు.
యూదులు శనివారంన పూజించుట వలన బైబిలు వారాల చక్రం ఎప్పుడూ నిరంతరంగా కొనసాగుతున్నదని, వార్షిక పండుగలు మాత్రం చంద్రునితో సంబంధం కలిగియున్నవని ప్రజలు ఊహించుకొను చున్నారు. ఇది యూదా పండితులు ద్వారా పంచుకోబడిన ఊహ కాదు. |
ఇక్కడ, చాలామంది శనివారంను బైబిలు సబ్బాతు అని నిరూపించడానికి ప్రయత్నిస్తూ, ఒక తప్పు చేస్తున్నారు. యూదులు శనివారంన పూజించుట వలన బైబిలు వారాల చక్రం ఎప్పుడూ నిరంతరంగా కొనసాగుతున్నదని, వార్షిక పండుగలు మాత్రం చంద్రునితో సంబంధం కలిగియున్నవని ప్రజలు ఊహించుకొను చున్నారు. ఇది యూదా పండితులు ద్వారా వచ్చిన ఒక ఊహ కాదు. పురాతన సబ్బాతు నిరంతర వారాల చక్రంలో భాగం కాలేదు, ఎందుకంటే అది చంద్రుని దశలకు కలపబడి యుండెను అనేది యూదుల పండితులకు బాగా తెలుసు. ఈ ఆశ్చర్యకరమైన నిజాన్ని యూనివర్సల్ జ్యూయిష్ ఎన్సైక్లోపీడియాలో గల ఈ ఉదాహరణ తెలియజేస్తుంది: "సబ్బాతు దినము ప్రతిష్ఠితమైన ఒక దగినముగా మరియు ఏడు సంఖ్యకు గల ప్రాముఖ్యత గణనీయంగా వృద్ధి చెందుటతో, వారము మరింతగా మరింతగా దాని చంద్ర సంబంధ విధానము నుండి విడిపోయినది . . . . " 9
సబ్బాతు చంద్రుని దశలకు దగ్గరగా అనుసంధానించబడి యుండుట నుండి నిరంతరం తిరిగే శనివారంనకు బహుశా హిలెల్ II సమయంలో కేలండరును స్థిరపరచినపుడు మార్చబడియుండెను. అతడు కేవలం వారి కేలండరు నియమాలను తెలియజేయుట మాత్రమే కాక ఇంకా ఎక్కువే చేశాడు. ఇంకా, అతడు శనివారం సబ్బాతును పరిచయం చేయుటకు గల బాధ్యుడుగా కనిపిస్తున్నాడు, ఎందుకంటే అతడు కేలండరును స్థిరపరచినప్పుడు "వాయిదా నియమాల" ను పరిచయం చేశాడు. ఆ సమయంలో "వాయిదా నియమాలు" ప్రవేశపెట్టబడ్డాయి. హిలెల్ ౹౹ కాలం వరకు "వాయిదా నియమాల" అవసరత లేదు ఎందుకంటే వార్షిక ఉత్సవాలు మరియు వారపు విశ్రాంతి దినాలు ఒకే, సూర్య-చంద్ర కేలండరులో జరుపబడేవి. అయితే, వార్షిక పండుగలను సూర్య-చంద్ర కేలండరు ద్వారా లెక్కిస్తూ, ఏడవ రోజు సబ్బాతును వేరే, సౌర కేలండరుపై లెక్కించుట వలన, సంధర్భానుసార విభేదాలు తలెత్తుతాయి. అందువలన "వాయిదా నియమాల" అవసరతలు కొత్తగా ఉత్పన్నమవుతాయి.
సద్దూకయ్యులు: కేలండరు అధికారులు
అప్పుడప్పుడు ఒక మంచి ఆలోచనలు గల వ్యక్తి ఇలా వాదించవచ్చు: యహూషువః కాలంలో కేలండరు తప్పుగా ఉండి ఉంటే, ఆయన దానిని తప్పకుండా సరిదిద్ది ఉండేవాడు కదా!" అయితే ఇది ఒక సత్యాన్ని వెల్లడి చేయుచున్నది: మొదటి శతాబ్దంలో ఇశ్రాయేలీయులు ఉపయోగించిన కేలండరు సృష్టి యొక్క కేలండరై ఉంది. ఆ సమయంలో, ఎల్లపుడూ ఒక సద్దూకయ్యుడైన, ప్రధాన యాజకుడు, కేలండరు బాధ్యతను వహించేవాడు. అతడు న్యూమూన్ దినాన్ని ప్రకటించుటకును, అవసరతను బట్టి ఒక పదమూడవ నెలను జతచేయుటకు బాధ్యతను కలిగియుండేవాడు. సద్దూకయ్యులలో తప్పు లేకపోలేనప్పటికీనీ, యహూషువః వలెనే వారు కూడా మానవులు కల్పించిన మౌఖిక చట్టపు సంప్రదాయాలను (ఓరల్ లాను) తిరస్కరించారు. వారు మోషే పుస్తకాలను మాత్రమే దైవీక అధికార మూలాలుగా భావించేవారు.
పరిసయ్యులు విధించిన "మానవులు కల్పించిన సంప్రదాయాలు" మానవజాతిపై ఒక మోయలేని భారంను మోపుచూ, అవి తమ సృష్టికర్త నుండి వారిని వేరుచేసే విధంగా ఉన్నవని యహూషువః స్పష్టంగా చూశారు. ఆయన పదేపదే మరియు బలముగా పరిసయ్యులు విధించిన నియమాలు మరియు సంప్రదాయాల సమూహాలను వ్యతిరేకించి మాట్లాడెను. ఈ మానవ నిర్మిత నిబంధనలు భారంగానూ మరియు సత్యానికి ఒక అవరోధంగానూ ఉన్నాయి. యహూషువః తన మరణానికి కొంతకాలం ముందు ఈ మోసగాళ్ల హృదయాలను చేరుకోవడానికి ఒక చివరి ప్రయత్నం చేసారు. దీనిపై మత్తయి 23 లో గ్రంథస్థం చేయబడిన ఆయన యొక్క సంభాషణ రాతి హృదయాలను సత్యమైనవిగా చేయడానికి ఒక హృదయాలను తొలిచే ప్రయత్నంమై ఉండెను.
ఫలితంగా మానవ నిర్మిత నియమాలను మరియు సంప్రదాయాలను దైవ చట్టంతో సమంగా చేయటానికి ప్రోత్సహించుటను ఆధ్యాత్మికంగా తగ్గిస్తూ తొలగించెను. "అయ్యో, వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, ఒకని మీ మతములో కలుపుకొనుటకు మీరు సముద్రమును భూమిని చుట్టివచ్చెదరు; అతడు కలిసినప్పుడు అతని మీకంటె రెండంతలు నరక పాత్రునిగా (మూలభాషలో-నరకకుమారునిగా) చేయుదురు" (మత్తయి సువార్త 23:15).
చివరకు, పరిసయ్యులు విజయాన్ని సాధించారు. బైబిలు కేలండరుకి భాధ్యత వహిస్తూ వచ్చిన సద్దూకయ్యులు, యెరూషలేము నాశనం తర్వాత లేకుండా రద్దుచేయబడిరి.
"(క్రీ.శ 70)లో ఆలయం నాశనం చేయబడిన తరువాత యూదుల వ్యవహారాలన్నిటి నియంత్రణను పరిసయ్యుల చేతికి వదిలి, సద్దూకయ్యులు కొంతకాలంలో పూర్తిగా అదృశ్యమైరి. ఇకనుంచి యూదుల జీవితం పరిసయ్యుల కోణంలో క్రమబద్దీకరించబడెను; ...పాత సన్హేద్రిన్ కి ఒక సరికొత్త విధానం ఇవ్వబడెను. పాత యాజక సంప్రదాయ పద్దతి కొత్త మతపరమైన సంప్రదాయాలతో భర్తీ చేయబడెను... యూదామత భవిష్యత్ అంతటి యొక్క పాత్ర, యూదుని జీవితం మరియు ఆలోచన విధానాలను పరిసయ్యవాదం రూపించెను" (Abot 1: 1). 10
పరిసయ్యులు ఒకే ఒక మరియు పూర్తి అధిపతులుగా ఉంటూ వారి నియమాలను మరియు నిబంధనలను ప్రవేశపెట్టిరి. పరిసయ్యుల మౌఖిక సాంప్రదాయాలు, తాల్ముడ్ లో నమోదుచేయబడి, రబ్బీనిక్ జుడాయిజంగా మార్పుచెందెను. నేటి యూదులు ఉపయోగించే కేలండరు అసలు కేలండరు యొక్క వక్రీకరణ తప్ప మరేమీ కాదు. ఇది తాల్ముడ్ లో లిఖించబడిన పరిసయ్యుల మానవ నిర్మిత సాంప్రదాయాల వలన పాడుచేయబడినది! రబ్బీ లూయిస్ ఫిన్కెల్స్టెయిన్, ముందుగా ఇలా పేర్కొన్నాడు:
పరిసయ్యులు తాల్మూడిజంగా మారెను...[అయితే] పురాతన పరిసయ్య ఆత్మ మార్పు లేకుండా నిలిచి యున్నది. ఎప్పుడైతే ఒక యూదుడు ... తాల్మూడ్ ను చదువూతాడో అప్పుడు, అతడు నిజానికి పురాతన పాలస్తీనా విద్యాలయాలు ఉపయోగించిన వాదనలనే మళ్ళీ తిరగవేయుచున్నాడు. [పరిసయ్యుల] సిద్ధాంత ఆత్మ ఆయువుపట్టుగా మిగిలెను . . . పాలస్తీనా నుండి బబులోనుకు; బబులోనుకు నుండి ఉత్తర ఆఫ్రికాకు, అక్కడనుండి ఇటలీ, స్పెయిన్, ఫ్రాన్స్ మరియు జర్మనీలకు, వీటినుండి పోలాండ్, రష్యా, తూర్పు ఐరోపా ఇలా సాధారణంగా, పురాతన పరిసయ్యవాదం ప్రయాణించినది. 11
తాల్మూడ్ సంప్రదాయం ఇలా బోధిస్తుంది: ఒకడు సబ్బాతు ఎప్పుడు అనే క్రమమును కోల్పోయి ఉంటే, తాను చేయవలసినదల్లా ప్రతి ఏడు రోజులకొకసారి ఆరాధన చేయవలెను. ఏడవ-రోజు సబ్బాతుగా శనివారంను పాటించుటను సమర్థించేందుకు ఈ బోధన హేతుబద్ధతగా ఉపయోగపడుతూ వుంది.
తాల్మూడిక్ సంప్రదాయం ఇలా బోధిస్తుంది: ఒకడు సబ్బాతు ఎప్పుడు అనే క్రమమును కోల్పోయి ఉంటే, తాను చేయవలసినదల్లా ప్రతి ఏడు రోజులకొకసారి ఆరాధన చేయవలెను. ఏడవ-రోజు సబ్బాతుగా శనివారంను పాటించుటను సమర్థించేందుకు ఈ బోధన హేతుబద్ధతగా ఉపయోగపడుతూ వుంది. |
తాల్ముడ్ కు, పురాతన విద్యాలయాలు (అనగా పరిసయ్యుడు) నిర్వహించిన స్థానం నుండి దాని అధికారం పుట్టినది. ఆ విద్యాలయాల (బాబిలోనియా మరియు పాలస్తీనా రెండింటి) యొక్క ఉపాధ్యాయులు... పాత సన్హెద్రిన్ యొక్క నిజమైన వారసులు. . . . ప్రస్తుత యూదా ప్రజలను పురాతన సన్హెద్రిన్ లేదా తరువాత విద్యాలయాలతో పోల్చి చూస్తే, ఇప్పుడు అటువంటి “నివసిస్తున్న అధికారిక కేంద్రంను” కలిగి లేరు. అందువలన, యూదా మతాన్ని గూర్చి ఏవైనా నిర్ణయాలు చేయవసివస్తే తప్పక అలాంటి అధికార కేంద్రం వున్నపుడు ఆ అధికారులు చేసిన బోధనైన తాల్ముడ్ ను చివరిగా మళ్లీ ఆధారం చేసుకోవాలి." 12
తాల్మూడ్ పరిసయ్యుల సంప్రదాయాల నుండి వచ్చినదని ఫిన్కెల్స్టెయిన్ స్వయంగా పేర్కొనుచున్నాడు గమనించండి. ఇవే "మునుష్యుల సంప్రదాయాలను” రక్షకుడు తన పరిచర్య కాలంలో గట్టిగా వ్యతిరేకించారు. ఈ పరిసయ్యుల సాంప్రదాయాలే యూదులు అసలైన సబ్బాతును ప్రక్కన పెట్టుటకుగల విశిష్టమైన కారణాలైయున్నవి. తాల్మూడ్ లోని ట్రాక్టేట్ సబ్బాత్ 7 వ అధ్యాయం ఇలా తెలియజేస్తుంది: "ఎడారిలో ప్రయాణిస్తున్న ఒక వ్యక్తి సబ్బాతు క్రమమును తప్పిపోయి సబ్బాతు ఏ రోజునో తెలీయకుండిన యెడల, అక్కడ (అతడు అలా గమనించిన దినం) నుండి ఆరు రోజులు లెక్కించి, ఏడవ రోజున ఆచరించాలి." 13
సృష్టికర్త కేలండరు |
యూదులు చేయుచున్నారు కాబట్టి విశ్వాసులు శనివారమునే సబ్బాతు అని నమ్మాలనే వాదన, యూదులు ఎప్పుడూ నిజ సబ్బాతునందు తప్ప మరిదేనియందును ఆరాధించలేదు అనుకొనే తప్పు భావనమీద ఆధారపడియున్నది. అయితే ఈ ఊహలు తప్పు అని యూదుల ద్వారా చేయబడిన వారి ప్రకటనలే ఋజువు చేయుచున్నవి. నిజానికి వారు సబ్బాతును లెక్కించే కేలండరును మార్చివేసిన తరువాత నిజమైన సబ్బాతును మార్చివేసిరి.
విశ్రాంతి దినము ఒక మానవుడు ప్రవేశపెట్టిన నియమం కాదు. ఇది సృష్టికర్త స్థాపించిన దైవీక నియమము. అందువలన భూమిపైగల ఏ అధికామైనా, అది పోప్ లేదా యూదుడు అవవచ్చు, వేరొక ఆరాధన దినమును గాని లేదా ఆ ఆరాధనా దినమును లెక్కించుటకు భిన్నమైన పద్ధతినిగాని ఏర్పాటుచేయుటకు హక్కుకలిగి లేదు. సబ్బాతు సృష్టికర్తకు మరియు ఆయన నమ్మకమైన ప్రజలకు మధ్య ఒక శాశ్వతమైన గురుతుగా వున్నది. "మీరు నేను నియమించిన విశ్రాంతిదినములను ఆచరింపవలెను; మిమ్మును పరిశుద్ధపరచు యహువఃను నేనే అని తెలిసికొనునట్లు అది మీ తరతరములకు నాకును మీకును గురుతగును. కావున మీరు విశ్రాంతిదినము నాచరింపవలెను. నిశ్చయముగా అది మీకు పరిశుద్ధము." (నిర్గమకాండము 31: 13-14) ".
ఆయనకు విధేయతను చూపుతూ మరియు ఆయన విశ్రాంతి దినమందు ఆరాధన చేస్తూ తమ సృష్టికర్తను గౌరవించాలని కోరుకునేవారందరూ, యూదుల సాంప్రదాయాలను లేదా కేథలిక్కుల కేలండరును చూడరు. అయితే వారు సృష్టి వద్ద ఏర్పాటు చేయబడిన అసలైన సూర్య-చంద్ర కేలండరు ద్వారా లెక్కించబడే పవిత్ర సబ్బాతు దినమందు ఆయనను ఆరాధన చేయుదురు.
1 హెన్రిచ్ గ్రీట్జ్, యూదుల చరిత్ర, వాల్యూమ్. 2, పే. 563, ఉద్ఘాటన కలదు.
2 గ్రీట్జ్/Graetz, వాల్యూమ్. 2, పేజీలు. 563-564.
3 యూదుల ఎన్సైక్లోపెడియా, నుండి సారాంశంగా "క్యాలెండర్."
4 గ్రీట్జ్/Graetz, వాల్యూమ్. 2, పేజీలు. 572-573, ఉద్ఘాటన సరఫరా.
5 "జ్యూయిష్ క్యాలెండర్ మరియు హాలీడేస్ (కలిపి సబ్బాత్.): ది జ్యూయిష్ క్యాలెండర్ చేంజింగ్ ది క్యాలెండర్ ," http://www.torah.org, ఉద్ఘాటన సరఫరా.
6 బాక్స్ 6, ఫోల్డర్ 4; గ్రేస్ అమాడాన్ కలెక్షన్, (కలెక్షన్ 154), అడ్వెంటిస్ట్ రీసెర్చ్ సెంటర్, అండ్రూస్ యూనివర్సిటీ, Berrien Springs, మిచిగాన్.
7 గ్రీట్జ్/Graetz, వాల్యూమ్. 2, పే. 571.
8 యూనివర్సల్ యూదుల ఎన్సైక్లోపెడియా, "సెలవులు" పే. 410.
9 యూనివర్సల్ యూదుల ఎన్సైక్లోపీడియా, వాల్యూం. X, "వీక్," పేజీలు. 482.
10 "పరిసయ్యులు," యూదు ఎన్సైక్లోపీడియా, వాల్యూం. IX, (1901-1906 సం.), పే. 666.
11 లూయిస్ ఫిన్కెల్స్టెయిన్, పరిసయ్యులు: The sociological background of their faith, (ఫిలడెల్ఫియా: అమెరికా, 1946 జ్యూయిష్ పబ్లికేషన్ సొసైటీ), వాల్యూమ్. 1, మొదటి సంచికకు ఫార్వార్డ్ చేయండి. పేజి XXI, ఉద్ఘాటన సరఫరా.
12 లూయిస్ ఫిన్కెల్స్టెయిన్ యూదులు - వారి చరిత్ర, కల్చర్, అండ్ రెలిజియన్, (ఫిలడెల్ఫియా: అమెరికా, 1949 జ్యూయిష్ పబ్లికేషన్ సొసైటీ), వాల్యూమ్ 4, పే. 1332.