Print

న్యూమూన్ లు, సబ్బాతులు & గ్రిగోరియన్ కేలండరు

“నిజముగా మీరు నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరింపవలెను; మిమ్మును పరిశుద్ధ పరచు యహువఃను నేనే అని తెలిసికొనునట్లు అది మీ తర తరములకు నాకును మీకును గురుతగును. కావున మీరు విశ్రాంతిదినము నాచరింపవలెను. నిశ్చయముగా అది మీకు పరిశుద్ధము; దానిని అపవిత్ర పరచువాడు తన ప్రజలలోనుండి కొట్టివేయబడును. ఆరు దినములు పనిచేయ వచ్చును; ఏడవదినము యహువఃకు ప్రతిష్ఠితమైన విశ్రాంతిదినము. ఆ విశ్రాంతిదినమున పనిచేయు ప్రతివాడును తప్పక మరణశిక్ష నొందును. ఇశ్రాయేలీయులు తమ తర తరములకు విశ్రాంతి దినాచారమును అనుసరించి ఆ దినము నాచరింపవలెను; అది నిత్యనిబంధన. (నిర్గమకాండము 31:12,13,14,16)

Contract (Covenant)

ఆయనకు - ఆయన ప్రజలకు మధ్య విశ్రాంతిదినము ఒక శాశ్వత ఒడంబడిక మరియు నిత్యమైన నిబంధన.

ఆయనకు ఆయన ప్రజలకు మధ్య విశ్రాంతిదినము ఒక శాశ్వత ఒడంబడిక మరియు నిత్యమైన నిబంధన. ఇది యహువః యొక్క విశ్వాసులను మిగిలిన ప్రపంచం నుండి ప్రత్యకపరిచే గుర్తుగా వున్నది. ఏదైనా ఒక దినము బైబిలు సబ్బాతు కాదుగాని “ఏడవ దినము నీ ఎలోహీం అయిన యహువఃకు విశ్రాంతిదినము” (చూడుము నిర్గమ 20:8). చాలామంది క్రైస్తవులు పునరుత్థానానికి గౌరవార్థముగా ఆదివారమున ఆరాధన చేస్తారు. వారు ఆదివారాన్ని ప్రభువు దినమనియు మరియు ఏడవ దినపు విశ్రాంతి దినము సిలువపై కొట్టివేయబడినది అనియు చెప్పుదురు. యహువః యొక్క ధర్మము శాశ్వతమైనది. యహూషువః భూమిపై వున్నపుడు విశ్రాంతి దినమును ఆచరించెను. కావున అపోస్తులు, ఆది క్రైస్తవులు అదేవిధంగా చేసిరి. మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభువైయున్నాడు (మత్తయి 12:8 KJV) అని ప్రకటించుట ద్వారా యహూషువః విశ్రాంతి దినము మీద యాజమాన్యమును కనపరుచుకొనెను. యేడవ దినము అయిన విశ్రాంతిదినము లేఖనముల యొక్క నిజమైన ప్రభవు దినము!

నిజమైన విశ్రాంతి దినము ఒక ప్రత్యేకమైన దినము కావున ఆ సరియైన దినమును లెక్కించుటకు సరియైన కాల కొలత పద్దతిని వుపయోగించుట చాలా ప్రాముఖ్యము. చరిత్రలో కాలమును కొలుచుటకు వేరు వేరు పద్దతులు వాడుకలో వుండేవి. ఆఫ్రికా మరియు దక్షిణమెరికాలలో మూడు మరియు ఐదు రోజుల వారములు వుండేవి. ఐగుప్తీయులు మరియు ఫ్రెంచి రిపబ్లిక్కులు పది రోజుల వారం గల సౌర కేలండరును వాడిరి. ఆధునిక ఇస్లామిక్ కేలండరు ఒక చంద్ర కేలండరు, కేవలము చంద్ర గమనము మీదనే ఆధారపడును. చంద్ర సంవత్సరము సూర్య సంవత్సరము కంటే తక్కువగుట వలన "రామదాన్" గ్రిగోరియన్ కేలండరు సంవత్సరముపై వెనుకకు ప్రయాణిస్తున్నట్లుండును. ఆకాశంలో సూర్యుడు ఒక విషవత్తు నుండి అదే విషవత్తు వరకు ప్రయణించి ఒక వలయమును పూర్తిచేయుటకు పట్టు సమయము ద్వారా గ్రిగోరియన్ కేలండరు కొలువబడుతుంది. ఇది ఒక సౌర కేలండరు.

కాలమును కొలుచుట కొరకైతే పై పద్ధతులలో దేనిని వినియోగించినా తప్పులేదు. అవి కేవలము వేరు వేరు పద్ధతులలో సమయాలను కొలుచును. ఉదాహరణకి మొట్రిక్ పద్దతిలో మీటర్లు ఇంపీరియల్ పద్ధతిలో యార్డ్లు వాడబడును. అయిననూ రెండు పద్ధతులూ పొడవునే కొలుచును. అలాగునే సమయ కొలతకు కూడా వేర్వేరు పద్ధతులు వాడవచ్చును. అయితే నిజమైన విశ్రాంతిదినము అనేది ఒక ప్రత్యేక దినము, ఒక ప్రత్యేక కాల కొలత పద్ధతి తప్పనిసరిగా ఉపయోగించబడును. ఒక వ్యక్తి కుడి ప్రక్క యేడవ ఇంటికి వెళ్లుమని చెప్పబడినప్పుడు అతడు వేరే వీధి లోనికి వెళ్లినచో అతడు సరియైన చిరునామాను కనుగొనలేడు. అతడు యేడవ ఇంటిని లెక్కించే ముందు తాను సరియైన వీధిలో వుండాలి. నిజమైన ఏడవ దినపు సబ్బాతును తెలియజేసే ఒకే ఒక కాల సూచక పద్దతి సృష్టి యొక్క సూర్య - చంద్ర కేలండరు. కేవలము బైబిలు కేలండరు మాత్రమే యహువఃకును ఆయన ప్రజలకును సూచనగా వున్న సరియైన దినమును ఖచ్చితముగా లెక్కించును.

ఆధునిక కేలండరులో ఏడవ దినము శనివారము అనేది నిజమే. ఐతే, ఇది శనివారాన్ని లేఖనాల యొక్క ఏడవ దినపు సబ్బాతుగా చేయలేదు. గ్రహ సంబంధమైన అన్య వారాల నుండి ఆధునిక వారము వచ్చినది. జూలియన్ కేలండరు దీనిని స్వీకరించినప్పుడు ఈ యేడు రోజల గ్రహ సంబంధవారము అసలు శనివారముతో మొదలయ్యేది. ఈ ఆధునిక గ్రిగోరియన్ కేలండరు నిజమైన యేడవ దినపు సబ్బాతును తెలియజేయ లేదు. ఎందుకంటే దీనిలో బైబిలు యొక్క కాలసూచక వ్యవస్థ అయిన చంద్ర నెలలు అనే కీలకమైన అంశము లేదు. సృష్టికర్త కేలండరులో ప్రతి నెల న్యూమూన్ దినముతో ప్రారంభమవును. ప్రతి క్రొత్త నెల యొక్క మొదటి దినము న్యూమూన్ దినము.

“అందుకు దావీదు – రేపటి దినము అమావాస్య (న్యూమూన్ దినము); అప్పుడు నేను తప్పక రాజుతోకూడ కూర్చుండి భోజనము చేయవలెను; అయితే ఎల్లుండి సాయంత్రము వరకు చేనిలో దాగుటకు నాకు సెలవిమ్ము.”

​“మరియు యోనాతాను దావీదుతో ఇట్లనెను-రేపటి దినము అమావాస్య (న్యూమూన్ దినము); నీ స్థలము ఖాళిగా కనబడును గదా”;

​“కాబట్టి దావీదు పొలములో దాగుకొనెను; అమావాస్య (న్యూమూన్ దినము) వచ్చినప్పుడు రాజు భోజనము చేయకూర్చుండగా ​మునుపటివలెనే రాజు గోడదగ్గర నున్న స్థలమందు తన ఆసనము మీద కూర్చుని యుండెను. యోనాతాను లేవగా అబ్నేరు సౌలునొద్ద కూర్చుండెను; అయితే దావీదు స్థలము ఖాళిగా నుండెను. (మొదటి సమూయేలు 20:5,18,24,25)

నెల యొక్క హిబ్రూ పదమైన "కోదేష్" యొక్క నిజమైన అర్థం:

“న్యూమూన్; నెల "కోదేష్" = ఒక నెల లేదా ఒక న్యూమూన్ నుండి మరో న్యూమూన్ వరకు. (Chodesh, #2320, The New Strong’s Expanded Dictionary of Bible Words.)

బైబిలు నెల న్యూమూన్ తో మొదలవుతుంది కాబట్టి, వారపు విశ్రాంతి దినాలు చంద్రునితో ఆంతర్య సంబంధంను కలిగియుంటాయి. న్యూమూన్ దినము వారాల చక్రమును పునః ప్రారంభించును. యహువః ఆకాశంలో జ్యోతులను కాలాన్ని కొలుచుటను తెలియజేయుటకు సృష్టంచెను.

“ఎలోహీం పగటిని రాత్రిని వేరుపరచునట్లు ఆకాశవిశాల మందు జ్యోతులు కలుగును గాకనియు, అవి సూచనలను కాలములను దిన సంవత్సరములను సూచించుటకై యుండు గాకనియు పలికెను.”(ఆది కాండము 1:14KJV).

కాలములు అనే పదము 'మోఎడ్' అనే హిబ్రూ పదము నుండి వచ్చినది.

మోఎడ్లేదా మోఅడాహ్’=సమాజ కూటము, పండుగ, నియామకము, గుర్తు. "యూదుల పర్వదినములు క్రమమైన వ్యవధులలో ఉండుటవలన, ఈ [మోఎడ్] పదము దాని సమీపముదేనని గుర్తించారు….. [మోఎడ్] అనే పదము విస్త్రుతార్ధంలో అన్ని ఆరాధనా సమావేశాలను సూచించును. ఇది ప్రత్యక్ష గుడారమునకు సంబంధించినది….. [యహువః] ఇశ్రాయేలియులకు తనచిత్తమును తెలియజేయుటకు విశేషమైన సమయములయందు ప్రత్యక్షమాయెను. “ఇది యహువః యొక్క ప్రజల ఆరాధనా సమావేశాలకు సామాన్య పదము.” (#4150, Hebrew-Greek Key Word Study Bible)

moon and earth

ఋతువులను[మోఎడ్]తెలుపుటకై ఆయన చంద్రుని నియమించె ను(కీర్తనల గ్రంథము104:19NKJV)

చంద్రుని కాలములను లేదా మోఎడ్ లను లెక్కించుటకు సృజించిన నిజాన్ని కీర్తనల గ్రంథము బలపరచుచున్నది.

“ఋతువులను [మోఎడ్] తెలుపుటకై ఆయన చంద్రుని నియమించెను” (కీర్తనల గ్రంథము104:19 NKJV).

న్యూమూన్ దినాలు లేఖనాలయందంతటా వారపు విశ్రాంతిదినాలకు అనుసంధానించబడి యున్నవి. అవి ప్రత్యేకమైన (ఆరాధనా) వర్గానికి చెందినవి.

“అదోనాయ్ యహువః సెలవిచ్చునదేమనగా తూర్పు తట్టు చూచు లోపటి ఆవరణపు గుమ్మము,పనిచేయు ఆరు దినములు మూయబడియుండి, విశ్రాంతి దినమునను అమావాస్య/ న్యూమూన్ దినమునను తీయబడి యుండ వలెను”. (యెహెజ్కేలు 46:1)

వార్షిక పండుగలు కూడా న్యూమూన్ దినాలతో విడదీయలేని విధముగా కలపబడియున్నవి. ఎందుకంటే వాటిని చంద్ర నెలలతో తప్ప వేరొక విధంగా లెక్కంచుట అసాధ్యము.

“అమావాస్య (న్యూమూన్) నాడు కొమ్ము ఊదుడి మనము పండుగ ఆచరించు దినమగు పున్నమనాడు కొమ్ము ఊదుడి. అది ఇశ్రాయేలీయులకు కట్టడ యాకోబు యొక్క ఎలోహీం నిర్ణయించిన చట్టము.” (కీర్తనల గ్రంథము 81:3,4)

న్యూమూన్ దినము యహువఃకు నిబద్ధతను చూపే (అప్పగించుకునే) దినము. న్యూమూన్ దినాలయందు వ్యాపారములు చేయబడలేదు. మతాచారాల ద్వారా వ్యాపారాలపై విధించే పరిధుల వలన భక్తిహీనులైన కొందరు ఇశ్రాయేలియులు తరచుగా అసహనానికి గురయ్యేవారు.

“తూము చిన్నదిగాను రూపాయి యెక్కువదిగాను చేసి, దొంగత్రాసు చేసి, మనము ధాన్యమును అమ్మునట్లు అమావాస్య యెప్పుడై పోవునో, మనము గోధుమలను అమ్మకము చేయునట్లు విశ్రాంతిదినము ఎప్పుడు గతించిపోవునోయని” చెప్పుకొను వారలారా (ఆమోసు 8:5 NKJV).

ప్రతి చంద్రనెల న్యూమూన్ దినముతో ప్రారంభమగుట వలన, నెలల యొక్క తారీఖులు ప్రతీసారీ వారము యొక్క అదే రోజులలో వచ్చును. ప్రతి నెలకు మొదటిది న్యూమూన్ దినము. దీని తరువాత పనిదినాల వారము యొక్క మొదటి దినము [ప్రతీ నెలయొక్క రెండవ దినము] వచ్చును. ఏడవ దినపు సబ్బాతు ప్రతి చంద్రనెల యొక్క 8, 15, 22 మరియు 29 తారీఖులలో వచ్చును. ఇది లేఖనాలందంతటనూ చిత్రించబడెను.

ప్రతి న్యూమూన్ దినానికీ వారములు తిరిగి ప్రారంభమవుట వలన లూనార్ సబ్బాతు గ్రిగోరియన్ వారములో అటూ ఇటూ తేలియాడునట్లు కనబడును. అయితే, నిజానికి, గ్రిగోరియన్ నెలలే ఎంతో స్థిరమైన పద్దతిలో వున్న చంద్ర నెలల మీద అల్లాడుచున్నవి. సృష్టికర్త తన పరిపూర్ణ కాలనిర్ణయ పద్దతిని రూపకల్పన చేసినప్పుడు, ఆయన సూర్యుని మరియు చంద్రుని రెండింటినీ ఉపయోగిస్తూ ఒక ఖచ్చితమైన మరియు సుందరమైన కేలండరును నిర్మించెను: అది సూర్య-చంద్ర కేలండరు; దీనిలో చంద్రుడు నెలలను, సూర్యుడు సంవత్సరాలను క్రమబద్దీకరించును.

నిజమైన ఏడవదినపు సబ్బాతుకు శనివారము ఒక మోసపూరితమైన నకిలీ రూపకల్పన. గ్రిగోరియన్ కేలండరు ఒక సౌరకేలండరు. దీనిలో కాల సూచనకు కేవలం సూర్యుడు మాత్రమే వుపయోగించబడును. కనీసం న్యూమూన్ దినాన్ని కూడా ఈ గ్రిగోరియన్ కేలండరు చూపలేదు. ఇక అది ఏడవ దినపు సబ్బాతును తెలియజేయుటలో ఖచ్చితంగా వాడబడదు. కాలమును లెక్కంచుటకు ఏదేనీ ఒక కేలండరు వాడబడినప్పటికీ, కేవలము సృష్టియొక్క సూర్య చంద్ర కేలండరు నందుగల సూర్య-చంద్రుల సంయుక్త ధర్మము వలన మాత్రమే పరలోకపు పరిశుద్థ “మోఎడ్” [వారపు విశ్రాంతిదినాలు మరియు వార్షిక పండుగలు] లను నిర్ధారణ చేయగలము.

సాతాను తాను కాలములను- ధర్మమును మార్చివేయుదునని ప్రకటించాడు. (దానియేలు 7:25 చూడుమ). అతడు మోసపూరితమైన కాల కొలత (గ్రిగోరియన్ కేలండరు) పద్ధతిద్వారా ప్రపంచాన్ని నడిపిస్తూ దానిని జరిగించి యున్నాడు.

యహువః చెప్పారు: "​యహువఃనైన నేను మార్పులేనివాడను" (మలాకీ 3:6). సబ్బాతు సృష్టి ప్రారంభంలో వున్నట్లే ("కాబట్టి ఎలోహీం ఆ యేడవ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరచెను; ఏలయనగా దానిలో ఎలోహీం తాను చేసినట్టియు, సృజించి నట్టియు తన పని అంతటినుండి విశ్రమించెను") నేటికినీ విధించబడి వుండెను. రాబోవు నిత్యత్వంలో పరలోకరాజ్యములో భక్తులందరూ సృష్టికర్తను ఆయన కేలండరు ద్వారా ఆరాధన చేయుటను కొనసాగించుదురు. అప్పుడు సబ్బాతును లెక్కించుటకు వాడబడు కేలండరు లూని-సోలార్ = సౌర-చంద్ర కేలండరై వుండును. సర్వ ప్రేమ; సర్వ ఆనందం; అనంత సంతోషముల యొక్క మూలమును తిరిగి పొందినపుడు, ఒక సమైక్యమైన సృష్టినుండి ప్రేమ మరియు కృతజ్ఞతలు శ్రావ్యంగా ప్రవహించు సమయంలో న్యూమూన్ దినములు మరియు వారపు విశ్రాంతి దినములు మరొక్కసారి సంతోష ఉత్సవాలుగా మరియు కృతజ్ఞతలు తెలిపే సమయాలుగా వుండును.

“నేను సృజింప బోవు క్రొత్త ఆకాశమును క్రొత్త భూమియు లయముకాక నా సన్నిధిని నిలుచునట్లు నీ సంతతియు నీ నామమును నిలిచియుండును. ఇదే యహువః వాక్కు, ప్రతి అమావాస్య/ న్యూమూన్ దినమునను ప్రతి విశ్రాంతి దినమునను నా సన్నిధిని మ్రొక్కుటకై సమస్త శరీరులు వచ్చెదరు అని యహువః సెలవిచ్చుచున్నారు. (చూడుము: యెషయా 66:22,23).