Print

సూర్యాస్తమయం వద్ద సబ్బాతు? అసంగతము మరియు అసాధ్యము!

ఇటీవలి సంవత్సరాలలో పెరుగుతున్న కాంతి బైబిలు దినము- మరియు అలా, విశ్రాంతిదినము వేకువజామున ప్రారంభమవునని వెల్లడి చుంచేయుడెను. యహూషువః యొక్క మరణ మరియు సమాధి సంఘటనల యొక్క కాలక్రమానుసార వృత్తాంతము యహూషువః దినాలలోని యూదులు ఇంకా సబ్బాతును వేకువతో ప్రారంభిస్తుండెనని పరిష్కారముగా నిరూపించుచుండెను.

coup de grâceరు "కూ డి గ్రాస్" (coup de grâce) గురించి విన్నారా? జర్నలిస్టులు అప్పుడప్పుడూ రాజకీయాలు వేడెక్కినపుడో లేదా మరొక విషయంలోనో ఒక కూ డి'టాట్ (coup d'état) / ప్రభుత్వాన్ని పడద్రోసే చివరి దెబ్బ గురించి నివేదిస్తారు. కానీ "కూ డి గ్రాస్" దీనికి  భిన్నంగా ఉంటుంది. ఈ "కూ డి గ్రాస్" అనగా  వేగంగా చంపడానికి కొట్టే అంతిమ దెబ్బ.

యుద్ధభూమిలో వైద్య సదుపాయం అసంపూర్ణంగా మరియు అభివృద్ధికి దూరంగా ఉన్నప్పుడు ఇది తిరిగి ప్రారంభమాయెను. సాధారణంగా, "కూ డి గ్రాస్" అనగా, ఒక స్పష్టంగా మరణించబోవుచున్న సైనికుని వీలైనంత త్వరగా మరియు నొప్పి లేకుండా చంపుట కోసం చేసే దయగల హత్య. ఈ పదబంధం ఆధునిక వాడుక వరకు, పరిణమించెను, దీని అర్ధం "అత్యంత బలహీన లేదా అధ్వాన స్థితిలో వున్న దానిని చివరగా ముగించు లేదా నాశనం చేసే ఒక చర్య లేదా సంఘటన"1

సబ్బాతు సూర్యాస్తమయం నుండి సూర్యాస్తమయం వరకు 24 గంటల సమయం అనే వాదన, తెలుసుకునే కొద్దీ బలహీనమౌతూ.. బలహీనమౌతూ, ఈ ఆచరణకు ప్రాధమిక ఆధార వచనమయిన, లేవీయకాండము 23:32, ఇతర ఆధారాల మధ్య, సందర్భం నుండి తొలగించబడెను, మరియు చివరికి అది ఏడవ-దినపు సబ్బాతునకు వర్తించలేదు.

అస్తమయం నుండి  అస్తమయం వరకు సబ్బాతు అనే నమ్మికను శాశ్వతంగా ధ్వంసం చేసే "కూ డి గ్రాస్ (coup de grâce), రక్షకుని యొక్క మరణ మరియు సమాధి చేయు వృత్తాంతంలో కనబడుతుంది. ఈ ముఖ్యమైన  సంఘటనల యొక్క కాల వృత్తాంతం, సబ్బాతు ఘడియలు సూర్యాస్తమయంతో కాదు, ఉదయంతో ప్రారంభమవునని సంపూర్ణ ఖచ్చితత్వం తో స్థాపిస్తుంది.

 

కాల వృత్తాంతం

 


యహూషువః మరణము:

"ఇంచుమించు మూడు గంటలప్పుడు యహూషువః ఏలీ, ఏలీ, లామా సబక్తానీ అని బిగ్గరగా కేకవేసెను. ఆ మాటకు నా దేవా, నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివని అర్థము... యహూషువః మరల బిగ్గరగా కేకవేసి ప్రాణము విడిచెను." (మత్తయి 27:46 & 50, KJV).

యంత్ర గడియారాలు కనుగొనక ముందు, పగటిని సమానంగా 12 భాగాలుగా విభజించారు. అందుకు యహూషువః అడిగెను, పగలు పండ్రెండు గంటలున్నవి గదా? (యోహాను 11: 9, KJV). ఆయనతో ఎవరూ వాదించారు. అందరూ ఒక సన్-డయల్/ఎండ గడియారంను చూడగలరు మరియు దినము వెలుగు వచ్చుటతో మొదలవునని  తెలుసుకొనెదరు. కాబట్టి, శీతాకాలపు "గంటలు" వేసవికాలపు గంటల కంటే తక్కువ ఉండేవి.

యహూషువః పస్కా, అబీబు 14 న "తొమ్మిదవ గంటకు" మరణించారు. ఇది మధ్యాహ్నం సుమారు మూడు గంటలకు, సమానం. ఆ సంవత్సరపు కాలమానం ప్రకారం, వెర్నల్ ఈక్వినోక్స్ (దగ్గరలో) తరువాత, అది నిజానికి మద్యాహ్నం మూడు గంటలకు కొంచెం ఎక్కువ. సబ్బాతు సూర్యాస్తమయం వద్ద ప్రారంభమవుతుందని వాదించే వారు యహూషువః శిలువపై నుండి దించబడి, సూర్యుడు క్షితిజ సమాంతర రేఖ క్రిందికి చేరే/అస్తమయ సమయంలోగా సమాధిలో పాతిపెట్టబడెనని నమ్మెదరు. యెరూషలేములో ఆ సంవత్సరపు కాలమానం ప్రకారం, సూర్యుడు 6:59 pm మరియు 7:19 pm కు అస్తమించెను. జాగ్రత్తగా పరిశీలించి చూస్తే రక్షకుని మరణంకు మరియు సూర్యాస్తమయంకు మధ్య గల సుమారు నాలుగు గంటల వ్యవధిలో, గ్రంథంలో నమోదైన సంఘటనలన్నీ జరుగుట అసాధ్యమని బయలు పడుతుంది.

3:07

యహూషువః 3 p.m కు కొంచెం తరువాత మరణించెను.

 

 

యహూషువః దేహాన్ని అడుగుట

"యహూషువః శిష్యుడుగానున్న అరిమతయియ యోసేపు అను ఒక ధనవంతుడు సాయంకాలమైనప్పుడు వచ్చి  పిలాతు నొద్దకు వెళ్లి, యహూషువః దేహమును తనకిమ్మని అడుగగా, పిలాతు దానిని అతని కప్పగింప నాజ్ఞాపించెను. "(మత్తయి 27: 57-58, KJV)

దినము వేకువతో ప్రారంభమవునని వెల్లడి చేసే రెండు లేఖన భాగములు గ్రంధంలో ఉన్నవి, వాటిలో శిలువ సంఘటన ఒకటి. అయితే, సంప్రదాయం మరియు తప్పు తర్జుమాల ద్వారా, సబ్బాతు  సూర్యాస్తమయం వద్ద ప్రారంభమవుతుందని సమర్ధించు వారి ద్వారా ఈ వాక్య భాగాలు మలచి చూపబడెను.

సాంప్రదాయము: ఆదికాండము 1 లో గల "అస్తమయమును ఉదయమును కలుగగా మొదటి [రెండవ, మూడవ,...,] దినమాయెను" అనే పునరావృత వాక్య పదబంధం వలన  ప్రజలు సంప్రదాయబద్ధంగా దినము సూర్యాస్తమయం వద్ద ప్రారంభమవుతుంది భావిస్తున్నారు. అయితే ఈ పదబంధం కాంటెక్ట్స్ నుండి తొలగించబడెను. ఆదికాండము మొదటి అధ్యాయం లో, యహూవః ఒక రోజులో ఏమి వుంటుందో అప్పటికే వివరించారు: అది వెలుగు! "మరియు ఎలోహిం అక్కడ లెట్ వెలుగు కమ్మని చెప్పి కాంతి ఉంది. "దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. వెలుగు మంచిదైనట్టు దేవుడుచూచెను; దేవుడు వెలుగును చీకటిని వేరుపరచెను. దేవుడు వెలుగునకు పగలనియు, చీకటికి రాత్రి అనియు పేరు పెట్టెను. (ఆదికాండము 1: 3-5, KJV)"

సృష్టికి ముందుగానున్న అబేధ్యమైన కఠిక చీకటినుండి, మొదటి దినము "యహూవః వెలుగు కమ్మని పలుకగా" ప్రారంభమాయెను. తన తదుపరి చర్యగా చీకటి నుండి వెలుగును విభజించెను. అప్పుడు అతను విభజన చేసిన రెండు భాగాలకు పేర్లు పెట్టెను. "వెలుగునకు పగలనియు, చీకటికి రాత్రి అనియు పేరు పెట్టెను." అందువలన, "దినము" చీకటితో  మొదలవునని వాదించేవారు యహూవః వేరు చేసిన దానిని తిరిగి కలుపుచున్నారు.

"అస్తమయమును ఉదయమును కలుగగా మొదటి [రెండవ, మూడవ,...,] దినమాయెను" అనే పదబంధాన్ని వెలుగు "దినముగా" వుంటూ పగటి భాగమై యుండగా, "రాత్రి" చీకటి భాగము అనే సందర్భ ఆధారంగా అర్థం చేసుకోవాలి.

"సాయంత్రం"గా అనువదించబడి మరియు రాత్రి గంటలన్నియూ అర్ధయిచ్చునట్లు తప్పుగా భావించే ఈ పదం, "ఎరెబ్" అనే హిబ్రూ పదంనుండి నుండి వచ్చినది.

ఈ పదం అస్తమించ బోవుచున్న సూర్యుని  వెంటనే వచ్చి, దాన్ని వెంబడించే దిన భాగంను సూచిస్తుంది. ... "సాయంత్రం" అనే పదబంధం [వాచ్యంగా, "సాయంత్రాల మధ్య"] అర్థం  సూర్యాస్తమయం మరియు చీకటి మధ్య కాలం. అంటే "ట్విలైట్."2

ఆంగ్లంలోకి అనువది పదం చీకటి, అని నైట్ సృష్టికర్త కాలంగా సూచించవచ్చు కాదు అది సూర్యాస్తమయం ముందు మొదలవుతుంది ఎందుకంటే! కాంతి రోజు నియమాలు; చీకటి రాత్రి నియమాలు. అందువలన, ఇప్పటికీ ఆకాశంలో కాంతి ఏ బిట్ ఉంది, అది ఇప్పటికీ డే గా లెక్కింపబడుతుంది.

తప్పు తర్జుమా: దినము సూర్యాస్తమయంతో  మొదలు కాదని రెండవ సారి లేఖనాలలో  స్పష్టం చేయునది యహూషువః సమాధి యొక్క సంఘటన. ముఖ్యంగా, అరిమతయియ యోసేపు వెళ్లి దేహం కోసం పిలాతును  అడిగినప్పుడు. ఈ గ్రీకు పదం కోసం ఆంగ్లంలో ఒక ప్రత్యక్ష అనువాదం లేనందున, అనువాదకులు "సాయంకాలం/even" అనే పదమును ఉపయోగించుకోవాలని ఎంచుకునిరి. ఇది ఆదికాండము 1 లో ఉపయోగించిన పదం "అస్తమయం" లాగా అనిపించింనప్పటికీ, ఫలితం మాత్రం గందరగోళ మరియు దినము సూర్యాస్తమయం వద్ద ప్రారంభమవును అనే ఒక నిరంతర నమ్మకానికి దారితీసెను.

అయితే, దీనికి లేఖనాల ఆధారము లేదు. నిజానికి, సబ్బాతు సూర్యాస్తమయంతో మొదలవదని మత్తయి యొక్క ఈ సంక్షిప్త లేఖన భాగము తేటగా నిర్ధారిస్తుంది. మళ్లీ  లేఖన భాగమును జ్ఞాపకం చేసుకోండి: "అరిమతయియ యోసేపు అను ఒక ధనవంతుడు సాయంకాలమైనప్పుడు వచ్చి  పిలాతు నొద్దకు వెళ్లి, యహూషువః దేహమును తనకిమ్మని అడుగగా, పిలాతు దానిని అతని కప్పగింప నాజ్ఞాపించెను." (మత్తయి 27: 57-58, KJV)

ఇక్కడ "సాయంకాలం" అనే పదం  ఓప్సియోస్/opsios అనే గ్రీకు పదం నుండి వచ్చినది, ఒకేలా వున్నా, వినియోగంలో మాత్రం ఇది ఆదికాండము 1 లో ఉపయోగించిన హిబ్రూ పదానికి సమానమైన అర్థాన్ని కలిగిలేదు. ఈ పదానికి అర్థం “Nightfall [చీకటి పడుట]... పదం నిజంగా 'సాయంత్రం ఆఖరిని/చివరిని'  సూచిస్తుంది, యూదుల ద్వారా లెక్కించబడు రెండు సాయంకాలాల తరువాత. (మొదటిది 3 గంటల నుంచి సూర్యాస్తమయం వరకు, రెండవది సూర్యాస్తమయ సమయం తరువాత). ఇది సాధారణ అర్థం. యొక్క అయితే, ఇది రెండు విధాలుగానూ ఉపయోగిస్తారు."3

ఏ ఇతర కాలానుసార సాక్ష్యము కూడా లేకుండా, ఆ పదం ఒక్కటే సబ్బాతు సూర్యాస్తమయంతో మొదలు కాదు అని సరిపడునంతగా శాశ్వతంగా స్థాపిస్తుంది,  ఎందుకంటే ఆ పదం యొక్క సాధారణ వాడుక సూర్యాస్తమయం తర్వాత వరకు కూడా దేహమును తీసుకొను అనుమతి కొరకు యోసేపు పిలాతును చేరుకోలేదని తెలుపుతుంది.

ఈ అధ్యయనం యొక్క ఉద్దేశ్యం, అరిమతయియ యొక్క జోసెఫ్ సూర్యాస్తమయం తర్వాత పిలాతు వెళ్లినట్లు నిరూపించడానికి కాదు. కాని ఇది సూర్యాస్తమయానికి ముందు యహూషువః యొక్క సమాధి కార్యక్రమం పూర్తగుట అసంభవమని చెప్పడమే. ఓప్సియోస్/opsios యొక్క సాధారణ వాడుక సూర్యాస్తమయం తరువాత ను సూచిస్తుంది. కానీ అప్పుడప్పుడు మధ్యాహ్నపు మధ్య నుండి సూర్యాస్తమయం వరకు గల కాలానిగి ఉపయోగించినందున, ఇక్కడ ముందుగా వున్న సమయానాకి  ఉపయోగించబడుతుంది. మళ్ళీ, ఈ పదం యొక్క సాధారణ ఉపయోగం ఇది కాదు, కానీ  అప్పుడప్పుడు దీనిని ఆలస్య మధ్యాహ్న (సూర్యాస్తమయానికి ముందున్న) గంటలను సూచించడానికి వినియోగించినందున, అది మా అధ్యయనానికి ప్రారంభ స్థానమైవుంది.

వాదనల విషయమై, ఈ అధ్యయనమంతటా, స్వల్పంగా, అత్యధిక సాంప్రదాయవాద కాల కొలతలు అన్నివేళలా తీసుకొనబడెను.

రక్షకుని మరణ సమయంలో అక్కడ ఆయన అనుచరులలో ఎవరెవరు వున్నారనేది లిఖించే విషయంలో సువార్తలలో శ్రద్ధ తీసుకొనెను. అరిమతయ యోసేపు గానీ, నికోదేము గానీ అక్కడ ఉన్నట్లు ఏ సువార్తలోనూ వ్రాయబడలేదు.. అలాంటి అధిక గొప్పవారైన అనుచరులు అక్కడ వుండి వుంటే, వారిని గూర్చి చాలా ఖచ్చితంగా లిఖించబడును.

ఆ సంవత్సరపు సమయంలో గంటల నిడివి  కారణంగా, యహూషువః మధ్యాహ్నం 3:10 గంటలకు సమయంలో మరణించారు. అరిమతయియ యోసేపునకు ఆయన మరణంను గూర్చి తెలుసుకొనుటకు సమయం తీసుకుని వుండును. పైగా రక్షకుని మరణాన్ని ఆశగా చూసిన తరువాత యెరూషలేమునకు తిరిగి వచ్చిన యూదులు, తరువాత చీకటి మరియు భూకంపం ద్వారా భయకంపితులైరి.  "చూచుటకై కూడివచ్చిన ప్రజలందరు జరిగిన కార్యములు చూచి, రొమ్ము కొట్టుకొనుచు తిరిగి వెళ్లిరి." (లూకా 23:48, KJV). ఇప్పటికీ ఆ వార్త యోసేపును చేరుకోవడానికి సమయం తీసుకుని వుంటుంది.

ఇది యహూషువః మరణించారని  తెలుసుకొనుటకు యోసేపునకు కనీసం 45 నిమిషాలు లేదా ఒక గంట పట్టవచ్చునని చెప్పుట తగనిది కాదు. ఇది ఖచ్చితంగా అతనికి, పరిపూర్ణ షాక్ నుండి మరియు శోకం నుండి తేరుకుని, తదుపరి చేయవలసిన పనిని నిర్ణయించుకొనుటకు కొద్దిగా సమయం తీసుకుని వుంటుంది. అతను ఈ సమయంలో, నికొదేముతో సంప్రదించి ఉండవచ్చు కూడా. మేము నిజమైన మానవ భావోద్వేగాలు మరియు స్పందనను, నిజమైన మానవ హృదయ దృష్టితో మాట్లాడుతున్నాము. ఒకవేళ యోసేపు రక్షకుని యొక్క మరణంను గూర్చి అతి తక్కువ సమయంలో తెలుసుకున్నాడే అనుకున్నా, అతను వార్తను అందుకున్న క్షణమే, దేహం నిమిత్తం వెళ్ళెను అని ఊహించుకోవటం వాస్తవిక కాదు. అతడు  కనీసం కొద్ది సమయం రోదిస్తుా గడిపి ఉండును. అప్పుడు తన ఇంటి నుండి పిలాతు ఉన్న దగ్గరకు నడిచి వెళ్ళుటకు కొన్ని నిమిషాలు పడతాయి. అతను మధ్యాహ్నం 4:30 కంటే ముందుగా వచ్చి యుండలేడు.

జోసెఫ్ బాగా పెద్ద స్థాయి యూదుడై  ఉండవచ్చు, కానీ పిలాతు అప్పటికి అతనికి పైఅధికారి . పిలాతును కలుసే అనుమతి పొందుటకు యోసేపు యొక్క అభ్యర్థనను పంపడానికి మరియు ఒక సమాధానం తిరిగి వచ్చుటకు కొన్ని నిమిషాలు పట్టును.

న్యాయబద్ధంగా అంచనా వేసినా, యోసేపు 4:30 గంటలప్పుడు పిలాతు కొరకు వెళ్లియుంటే, అతి త్వరగానే పిలాతును కలిసినా, ఇలా కొంత సమయం గడచి అది 4:45 p.m కు చేరుతుంది.

 

4:45 

ఎంత ముందుగా చూసినా యోసేపు పిలాతుతో సమావేశమైన సమయం 4:45 p.m, లేదా బహుశా తర్వాత అవవచ్చు.

 

 

పిలాతు ఆశ్చర్యపోవుట మరియు నమ్మలేకుండుట

శిలువ ద్వారా మరణం అనేది వేదనకు గురిచేస్తూ మరియు నెమ్మదిగా చంపబడే ప్రక్రియ. "క్రూసిఫై" అనే పదం "కష్టమైన" అనే పదం నుండి వచ్చినది, ఇది చాలా తీవ్రమైన వేదనను సూచిస్తుంది. కండరాలు  కుశించిపోయి మరియు చివరికి బాధితులు ఊపిరాడక చనిపోవును, దీనికి సాధారణంగా అనేక రోజులు పట్టును. అయితే, యహూషువః  మరణించుట ఊపిరాడక కాదు. ఆయన గుండె  నొప్పితో (ఆగుటతో) మరణించారు.

పిలాతుకు ఈ విషయం తెలియదు. కాబట్టి, దేహమును తీసుకొనుటకు అనుమతి కోసం అడిగినప్పుడు "పిలాతు అతను అప్పటికే మరణించెనా అని ఆశ్చర్యపడెను." (మార్కు 15:44, NKJV). కాబట్టి పిలాతు ఎవరైనా  శిలువపై ఇంత త్వరగా మరణించునని నమ్మలేదు. అతను "పిలాతు ఆయన ఇంతలోనే చనిపోయెనా అని ఆశ్చర్యపడి యొక శతాధిపతినితన యొద్దకు పిలిపించిఆయన ఇంతలోనే చనిపోయెనా అని అతని నడిగెను. శతాధిపతివలన సంగతి తెలిసికొని, యోసేపునకు ఆ శవము నప్పగించెను. "(మార్కు 15: 44-45, 1599 జెనీవా బైబిల్).

ఇందుకు కొంత సమయం పట్టింది. పిలాతు యరూసలేం లో నివశించలేదు. అతను కైసరయలో నివసించువాడు. అతను యూదుల అల్లర్లు మరింత ఎక్కువగా అవకాశం ఉండు, జాతీయ పండుగలు సమయాల్లోనే  యెరూషలేమునకు వచ్చినట్లు నివేదికలు సూచిస్తున్నాయి. ఇటీవలి పురావస్తు అన్వేషణలు ప్రకారం ఆంటోనియా కోటలో పిలాతు నివశించినట్లు ముందు సూచించిన దృష్టాంతంను తిరస్కరించెను మరియు అవి పిలాతు హేరోదు అంతిపాస్ యొక్క ఒక అతిథిగా హేరోదు నిర్మించిన కోటలో వున్నట్లు సూచిస్తుండెను.

హేరోదు అంతిపాస్ యొక్క అతిథిగా పిలాతు బసచేసినట్లు చెప్పబడిన, హేరోదు కోట యొక్క నమూనా

రాజభవనానికి ప్రవేశం పొంది పిలాతుతో మాట్లాడేందుకు ఈ అధ్యయనంలో కేటాయించిన 15 నిమిషాల కంటే ఎక్కువ పట్టినట్లుండెను. ఆ సమయంలో యోసేపు  పిలాతును కలుసుటకు లోపలికి వెళ్ళుట, తూర్పు ఆసియా  ఆచారానుగుణంగా శుభాకాంక్షలు మార్పిడి చేసుకున్న తరువాత, తన అభ్యర్థనను పేర్కొనడం, దానికి పిలాతు విభ్రాంతిగా ప్రశ్నించడం, అప్పుడు పిలాతు గోల్గోతా అధికారిగా వున్న శతాధిపతిని పిలుచుటకు పంపడానికి ఒక దూత కోసం ఆదేశం ఇచ్చుట వినెను, దీనంతటికీ ఎక్కువ సమయం గడచి యుండేది. చాలా ముందుగానే, ఇది యోసేపు పిలాతును కలుసుటకు వచ్చి  అనుమతి కోరడం ప్రారంభించిన సమయాన్ని బట్టి, సాయంత్రం 5:00 గంటలు, లేదా కొంచెం ఎక్కువ 5:15 గంటలు, లేదా ఇంకా తర్వాత ఉండును.

అయితే,వాదనల వషయమై,  మేము ఒక సంప్రదాయబద్ధమైన 5:00 గంటల సమయాన్ని వుంచాము.

శిలువ వేసిన ప్రదేశం హేరోదు స్థానం నుండి ముఖ్యంగా 1 కిలోమీటరు  (లేదా ఒక మైలు కంటే తక్కువ) వుండెను.4.  ఒక ఆరోగ్యకరమైన సైనికుడు నిమిషాలలో అక్కడికి ప్రయాణించ గలడు, ప్రత్యేకించీ అతడు గుర్రంపై ప్రయాణిస్తే. కానీ పస్కా మరియు పులియని రొట్టెల పండుగలకు యెరూషలేముకు తరలి వచ్చిన గుంపు గుంపుల యాత్రికుల ద్వారా కలుగు అసౌకర్యం వలన శతాధిపతి ప్రయాణం నెమ్మదించెనని గుర్తుంచుకోవాలి. ఆ సమయంలో (1)సందేశాన్ని ఇచ్చి పంపబడుట కోసం, ఒక దూతను పిలువనంపుట, (2) జన సమూహాల మధ్యలో తనకు మార్గం ఏర్పాటు చేసుట, (3) ఆజ్ఞ బయలు వెళ్లుట (4) శతాధిపతి తాను వెళ్ళే వరకు ఉండేందుకు మరో సైనికుని నియమించడం కోసం ఆదేశాలు ఇచ్చుట, (5) ఆపై శతాధిపతి సమూహాల వెంబడి తన సొంత దారిని ప్రయాణించుట. అలా సమయం కనీసం 5:15 pm అవుతుంది.

 

5:15 

పిలాతుకు సమాధానం చెప్పుటకు శతాధిపతి చేరుకున్న సమయం, అది కనీసం 5:15 p.m  గంటలప్పుడు ఉండెను.

 

 

యోసేపు దేహమును తీసుకొనుటకు పిలాతు అనుమతి మంజూరు చేయుట

"శతాధిపతివలన సంగతి తెలిసికొని, యోసేపునకు ఆ శవము నప్పగించెను." (మార్కు 15:44, 1599 జెనీవా బైబిల్)

అరిమతయియ యోసేపుకు యహూషువః మృతదేహాన్ని విడుదల చేసేందుకు శతాధిపతికి పిలాతు కేవలం ఒక శబ్ద ఆదేశం ఇచ్చెనో లేదా చర్మకాగితంపై ఆజ్ఞను వ్రాసి ఇచ్చెనో అని తెలుసుకొనుట అసాధ్యం. ఏమైనా, శతాధిపతి ప్రవేశం చేయుట, పిలాతు యొక్క ప్రశ్నలకు సమాధానం ఇస్తూ, రక్షకుని యొక్క మరణంపై తనకు హామీ ఇచ్చుట, పిలాతు అనుమతి మంజూరు చేయుట, మరియు యోసేపు తన సెలవు పుచ్చుకొనుట, త్వరగా గడచిన ఈ క్రయలకు సమయం కనీసం మరొక 15 నిమిషాలు పడితే, అలా 5:30 pm కు చేర్చును. ఒక వేళ పిలాతు ఆదేశం వ్రాయడానికి శాస్త్రి కోసం పంపి, మరియు అతని ఉంగరపు ముద్రతో ముద్రించి ఆజ్ఞ ఇచ్చి ఉంటే, అప్పుడు  తిరిగి యోసేపు కోటను నిష్క్రమించుటకు కనీసం మరొక 15 నిమిషాల సమయం ముందుకు ఉండేది.

 

 

5:30

యోసేపు పిలాతునొద్ద నుండి 5:30 p.m కు ముందే బయటకి వెళ్ళలేదు.

 

Direct route from Herod's Palace to Golgotha

గొల్గోతా ప్రదేశం హేరోదు స్థానం నుండి 1 కిలోమీటరు వుండెను. ఎవరైనా అప్పుడు  ప్రయాణం చేస్తే, పస్కా మరియు పులియని రొట్టెల పండుగలకు యెరూషలేముకు తరలి వచ్చిన గుంపు గుంపుల యాత్రికుల ద్వారా కలుగు అసౌకర్యం వలన ప్రయాణం నెమ్మదించును.

 

 

సమాధి చేయుటకు యోసేపు సిద్ధం చేయుట

"శతాధిపతివలన సంగతి తెలిసికొని, యోసేపునకు ఆ శవము నప్పగించెను. అతడు నారబట్ట కొని, ... " (మార్కు 15: 45-46, KJV)

యోసేపు వెంటనే గోల్గోతాకు వెళ్ళ లేదు. ఒక దోషిగా నేరం మోపబడిన దేహంను  తీసుకొనుటకు అనుమతి ఇస్తారో లేదో అతనికి తెలియదు. అనుమతి పొందిన తరువాత, అతను క్రిందివి చేసెను:

1) అతడు ఇంటికి తిరిగి వచ్చి శిలువ నుండి దేహంను తొలగించడానికి అవసరమైన పరికరాలు మరియు సరఫరా సేకరించుటకు  తన సేవకులకు సూచనలు అందించి, దేహంను సమాధి ప్రాంతానికి తీసుకుని వచ్చి, మరియు అక్కడ శుభ్రపరచి మరియు ఖననం కోసం సిద్ధం చేయుట.

 

2)  నికోదేముకు ఖననం కొరకు సుగంధ ద్రవ్యాలను తీసుకురావాలని తెలిసినా, అతడు నికోదేముకు మాట పంపెను.

 

3) అతను వెళ్ళి (లేదా ఒక దాసుని పంపి) మరియు ఖనన వస్త్రాలు కొనుగోలు చేసెను. (మార్కు 15:46)

కొందరు యోసేపు పస్కా మధ్యాహ్నపు చివరిన ఖననం కోసం వస్త్రాలు ఎలా కొనుగోలు చేయగలడని ప్రశ్నించవచ్చు, ఇక్కడ గుర్తించవలసిన మూడు ముఖ్యమైన పాయింట్లు ఉన్నాయి. యోసేపు సూర్యాస్తమయం తర్వాత పిలాతు వద్దకు వెళ్లెనని సూచిస్తున్న పదం ఆప్సయోస్/opsios యొక్క సాధారణ వాడుకను అంగీకరించినపుడు ఇవి ఈ దృష్టాంతంలో సమానంగా వర్తిస్తాయి.

1) పస్కా ఒక పని రోజు

 

2) దుకాణాలు అప్పటికీ తెరచి ఉన్నవి; లేదా,

 

3) అతడు, తక్షణ ఖననం నిమిత్తం యూదుల కఠినమైన తప్పనిసరి ఖనన అవసరాలను రాత్రి యందునూ అతనికి విక్రయించుటకు సంకోచించని దుకాణ యజమానులను పిలవగలుగును.

యోసేపు సూర్యాస్తమయం తర్వాత ఖనన వస్త్రాలు కొనుగోలు చేయుట ఎంచదగినదే. ఎప్పుడూ డబ్బు సంపాదనకు ప్రసిద్ధి చెందిన కొందరు కఠినమైన యూదులు, అప్పటికీ  సూర్యాస్తమయం తర్వాత దుకాణాలు తెరచి యుంచేవారు. ఆమోసు 8 లో యూదులను రాత్రి అమ్మకం కోసం ఖండించ లేదు. అయితే, వారు సబ్బాతు యొక్క పవిత్ర గంటలు త్వరగా గతించుట కోరుటను ఖండించెను.

దేశమందు బీదలను మింగివేయను దరిద్రులను మాపివేయను కోరువారలారా, తూము చిన్నదిగాను రూపాయి యెక్కువదిగాను చేసి, దొంగత్రాసు చేసి, మనము ధాన్యమును అమ్మునట్లు అమావాస్య యెప్పుడై పోవునో, మనము గోధుమలను అమ్మకము చేయునట్లు విశ్రాంతిదినము ఎప్పుడు గతించిపోవునోయని చెప్పుకొను వారలారా, (ఆమోసు 8: 4, 5, KJV)

అన్ని దుకాణాలు మామూలుగా సూర్యాస్తమయంనకే మూసివేసి ఉంటే, వారు పవిత్ర గంటలు హడావిడిగా గడవాలని ఎటువంటి కోరికను వ్యక్తం చేయరు ఎందుకంటే,  ఏమైనప్పటికీ మరుసటి రోజు వరకు దుకాణాన్ని తెరవడం సాధ్యం కాదని అందరికీ తెలుసు గనుక.

Skull Hill Golgotha

గొల్గోతా, పుర్రె ఆకారపు కొండ, హేరోదు స్థానం నుండి 1 కిలోమీటరు వుండెను.

ఒక వేళ దుకాణాలు మూసివేశారే అనుకుంటే,  వారి ఇళ్లలో ఖననానికి సంబంధించిన వస్త్రాలను అమ్మే వారి యొద్దకు యోసేపు వెళ్లి యుండెను. అనేక దేశాలలో, ఈ రోజు కూడా, యజమానులు వారి దుకాణాల పైన లేదా వెనుక నివసిస్తున్నారు. ఆలస్య-మధ్యాహ్నం లేదా సాయంత్రం ఖననం వస్త్రాలు కొనుగోలు చేయుట అతనికి కష్టతరమైన విషయం కాదు. కానీ ఆ దుకాణదారుడు తన పెద్ద కుటుంబం మరియు స్నేహితులతో పస్కా పండుగలో వుండుట (లేదా జరుపుకొనుటకు సిద్ధంగా వుండుట) వలన, ఇంకాస్త ఎక్కువ సమయం తీసుకుని ఉండును. గమనిస్తే,  అనవసరమైన డొంక దారులు లేకుండా సూటిగా ఎక్కడకి వెళ్లాలి అనేది యోసేపునకు తెలుసు, ఇది కొంత సమయం తీసుకుని ఉండును. యెరూసలేము  విశాలమైన నేరుగా వీధులు నిర్మించబడియున్న ఒక ఆధునిక నగరం కాదు. దాని వీధులు, ఇరుకైన వంపులతో, మరియు స్టాళ్లు మరియు యాత్రికుల రద్దీతో ఉండును.

గోల్గోతా కేవలం నగర ద్వారం నుండి కొన్ని వందల మీటర్ల దూరంలో వుండెను. అయితే, ఇది హేరోదు యొక్క కోటకు పూర్తిగా ఒక కిలోమీటరు ఉంది. ఇపుడు యోసేపు నడచిన అదనపు దూరాలకు ఆ ఒక కిలోమీటరు దూరంను కలిపితే, తన ఇంటికి తిరిగి వచ్చి,  ఖనన వస్త్రాలు కొనుటకు కనుగొన వెళ్లి, తిరిగి ఇంటికి వచ్చి అవసరమైన మిగతా వాటిని సేకరించి, నగర ద్వారం వద్దకు ప్రయాణం చేసి, ఇదంతా అదనపు సమయం గడచుటను జోడిస్తుంది.

యోసేపు పిలాతునొద్ద తన సెలవు తీసుకున్నప్పటి నుండి, అతను గోల్గోతాకు  వెళ్లినప్పుటికి కనీసం రెండు గంటలు పట్టును, మరింత, ఎక్కువై యుండవచ్చు. అది యోసేపు  మరియు నికోదేముకు ద్వారం వద్ద కలుసుకుని  మరియు కలిసి కల్వరికి కొనసాగారని అనుకొనుట సరియైనదే. యోసేపు మొదట పిలాతు వద్దకు వెళ్ళినప్పటినుండి తరువాత సంభవించిన ఇతర కార్యకలాపాలను కలుపుకుంటే, తన సేవకులతో పాటు అవసరమైన సామగ్రిని ఒకటి లేదా రెండు గాడిదలపై గోల్గోతాకు తీసుకెళ్లేందుకు ప్రారంభమయ్యే సమయానికి అది అతనిని దాదాపు 7:30 pm కు చేరుస్తుంది.

ఈ ప్రక్రియలో జరిగిన వాస్తవిక సమయాభావం లను జాగ్రత్తగా పరిశీలిస్తే, అది సూర్యాస్తమయ సమయానికి (6:59 - 7:19 సాయంత్రం) సమాధి చేయుట అసాధ్యమనేది త్వరగా స్పష్టమవుతున్నది. అందువలన, ఒకవేళ  ముందరి/earlier గంటలు మరియు అత్యల్ప  సమయంలో జరిగెనని భావిస్తే, యోసేపు నగరం వెలుపలకి వెళ్ళిన సమయానికే సూర్యుడు అస్తమించెను.

 

7:30

 

యోసేపు తన సేవకులు మరియు సరుకులతో గొల్గొతాకు సూర్యాస్తమయం తరువాత బయలుదేరెను.

 

 

దేహంను శిలువపై నుండి దించడం‌

"... ఆయనను దింపి  ..." (మార్కు 15:46, KJV)

ఇది గోల్గోతాను చేరుకోవడానికి యోసేపునకు, నికోదేము మరియు సేవకులకు ఎంతో సమయం తీసుకో లేదు. తర్వాత అంతా, అది యెరూసలేము లోనికి ప్రధాన రహదారి వెంట జరిగినది. దేహమును దించుటకు పిలాతు యొక్క అనుమతితో అక్కడ చేరుకున్న తరువాత వారు ఒక పెద్ద పనిని కలిగియున్నారు.

యహూషువః మరణించిన కొంత సేపటి తరువాత, మరుసటి రోజు సబ్బాతు మరియు పులియని రొట్టెల పండుగలోని మొదటి రోజు కావున శవములలో ఏదియూ శిలువ మీద ఉండకుండునట్లు నిర్ణయించిన ఉత్తర్వులను యూదులు ఆచరించు చుండెను.

ఆ దినము సిద్ధపరచుదినము; మరుసటి విశ్రాంతి దినము మహాదినము గనుక ఆ దేహములు విశ్రాంతి దినమున సిలువ మీద ఉండకుండునట్లు, వారి కాళ్లు విరుగగొట్టించి వారిని తీసివేయించుమని యూదులు పిలాతును అడిగిరి. కాబట్టి సైనికులు వచ్చి ఆయనతో కూడ సిలువవేయబడిన మొదటి వాని కాళ్లను రెండవవాని కాళ్లను విరుగగొట్టిరి. వారు యేసునొద్దకు వచ్చి, అంతకుముందే ఆయన మృతిపొందియుండుట చూచి ఆయన కాళ్లు విరుగగొట్టలేదు గాని. (యోహాను 19: 31-33, KJV)

ఈ ప్రకరణము సబ్బాతు  సూర్యాస్తమయం వద్ద మొదలు కాదు అనే అదనపు ఆధారాలను ఇప్పటికీ అందిస్తుంది. కింది నిజాలను గమనించండి:

  1. పిలాతు ఎవరైనా శిలువపై ఇంత త్వరగా మరణిస్తారా అని ఆశ్చర్యపోయాడు, అందువలన అతను తనను ప్రశ్నించడం కోసం శతాధిపతి కోసం పంపాడు.
  2. శతాధిపతి యహూషువః మరణాన్ని ధ్రువీకరించాడు.
  3. యోసేపు పిలాతు వద్దకు వెళ్లుటకు ముందే యూదులు అతని వద్దకు నిందితుల కాళ్ళను విరగగొట్టే అనుమతి కోసం వెళ్ళారా? అప్పుడు గవర్నర్ యహూషువః మరణంను నిర్ధారించడానికి శతాధిపతి కోసం పంపనవసరం ఉండేది కాదు. అతని కాళ్లు విరిగుట వలన కలిగిన శ్వాస స్థంభన కారణంగా  మరణించినట్లు అతడు అప్పటికే గ్రహించి యుండాలి.

అలా యోసేపు దేహమును తీసుకొనుటకు అనుమతి పొందిన తరువాత5, యూదులు ఇతర ఇద్దరు  ఖైదీల చావుని త్వరపరచుటకు  అనుమతి కోసం పిలాతు వద్దకు వెళ్ళిరి.

ఆయనను సిలువవేసిన స్థలములో ఒక తోట యుండెను; ఆ తోటలో ఎవడును ఎప్పుడును ఉంచబడని క్రొత్తసమాధియొకటి యుండెను.

ఆ దినము యూదులు సిద్ధపరచు దినమైనందున; ఆ సమాధి సమీపములో ఉండెను గనుక వారు దానిలో యహూషువః ను ఉంచిరి. (యోహాను సువార్త 19:41,42)

యోసేపు యహూషువః యొక్క ఖననం కోసం నికొదేముతో సంభాషిస్తున్న సమయంలో యూదులు దాదాపు తమ అభ్యర్థనను పిలాతును తెలిపిరి.

శిలువ నుండి రక్షకుని యొక్క దేహంను తొలగించడం ఒక సమయం తీసుకునే, మిక్కిలి శ్రమతో కూడిన పనియై ఉండెను. యహూషువః ఎముకలలో ఒక్కటైనను విరగలేదు అని గ్రంధంలో ప్రవచనాధారంగా లిఖించబడెను. యోసేపు, నికోదేము మరియు వారి సేవకులు, శరీరం తొలగించడం కోసం చాలా జాగ్రత్త తీసుకోవాల్సి ఉంది, అది చెక్కలో లోతుగా దిగిన పెద్ద మేకులను తొలగించుట తేలికైన పని కాదు. నిజానికి, పురావస్తు శాస్త్రజ్ఞులు తెరచిన ఒక ఎముకలను ఉంచే స్థలం ossuary/(ఎముక బాక్స్) లో ఇప్పటికీ ఎముకలు కలిగి యున్నవి. స్పష్టంగా, ఎవరైతే, దేహమును సమాధి చేసిరో వారికి శీలలు తొలగించుటకు సాధ్యం కాలేదు లేదా ప్రయత్నం చాలలేదని భావించబడెను.

యోసేపు మరియు నికోదేము అవసరమైన ఎంత సమయమైనా జాగ్రత్తగా గౌరవ భావంతో శిలువ నుండి శరీరం తొలగించడానికి ఖర్చు చేసి యుండవచ్చును. వారు పస్కా పండుగ భోజనానికి వెళ్ళడానికి పరుగెత్తటం లేదు. వారు వారి జీవితాలలో అత్యంత ముఖ్యమైన సంఘటనలో నిమగ్నమైరి. వారు అప్పుడు  సేవకులను ఏర్పరచి దగ్గరగానే ఉన్న దీనిలో తోటలోని సమాధి వద్దకు మోసుకుని వచ్చిరి. ఇది పూర్తగుటకు సులభంగా ఒక గంట సమయంను తీసుకుంటుంది, అలా సమయం 8:30 గంటలకు చేరుతుంది.

 

 

8:30

దేహాన్ని ఇకపై ఏమాత్రము పాడవకుండా దించడం ఒక కష్టతరమైన పని. దీనిని పూర్తి చేయడానికి కనీసం వారికి 8:30 p.m వరకు సమయం పట్టవచ్చును.

 

 

ఖననం కోసం దేహంను శుభ్రపరచుట

"దానిని క్రిందికిదించి, సన్నపు నారబట్టతో చుట్టి, తొలిచిన రాతి సమాధిలో ఉంచెను. అందులో ఎవడును అంతకుమునుపెప్పుడును ఉంచబడలేదు." (లూకా 23:53, KJV)

సమాధి చేయూటకు శరీరమును సిద్ధపరచుట  ఎల్లప్పుడూ సమయం-తీసుకునే ప్రక్రియ. మరణంకు ముందు రక్షకుడు తీవ్రమైన శిక్ష వలన బాధపడుట మరియు దీనికి యూదుల ఖనన ప్రక్రియ యొక్క ఆచారాలు కూడా తోడవుట వలన అది ఇంకా ఎక్కువ సమయం పట్టి ఉండేది. యోసేపు చాలా సంపన్నమైన వ్యక్తైనందున ఒక ప్రశాంతమైన తోటలో అతని భార్య మరియు తన కొరకు ఒక తొలిచిన  సమాధిని తాజాగా తయారు చేయించుకొనెను. ఆ ప్రదేశంలో, వర్షపు జలాన్ని సేకరించు అతి పెద్ద జలాశయం వుంది. వారికి నీరు పుష్కలంగా అందుబాటులో ఉండెను, అయితే అప్పటికే శరీరం బాగా చిరిగి వుండుట వలన

శుభ్రపరచుట కష్టమైన మరియు చాలా సమయాన్ని తీసుకునే పని. ప్రతి బకెట్ నీటిని తగ్గించి పెంచాల్సి వుంటుంది; జుట్టు మరియు గడ్డంల మధ్యలో ఉండిపోయిన గడ్డలు కట్టిన రక్తంను కడగవలెను. సంప్రదాయ ప్రక్షాళన అంటే త్వరగా కడిగివేయుట కాదు గానీ ప్రక్షాళనకు అవసరమైన సమయం కనీసం రెండు గంటలు తప్పనిసరై ఉంటుంది. ఈ సమయానికి, అది రాత్రి 10:30 వద్ద ఉంటుంది.

 

10:30

దేహంను శుభ్రపరచుట కష్టతరమైన మరియు సమయం తీసుకొనే ప్రక్రియ, ఇది సమయాన్ని 10:30 p.m కు తీసుకు వెళ్ళును.

 

 

ఖననం కోసం శరీరాన్ని వస్త్రముతో చుట్టడం

"మొదట రాత్రివేళ ఆయన యొద్దకు వచ్చిన నీకొదేము కూడ బోళముతో కలిపిన అగరు రమారమి నూట ఏబది సేర్ల యెత్తు తెచ్చెను. అంతట వారు యేసు దేహమును ఎత్తికొని వచ్చి, యూదులు పాతిపెట్టు మర్యాద చొప్పున ఆ సుగంధద్రవ్యములు దానికి పూసి నార బట్టలు చుట్టిరి.  "(యోహాను 19: 39-40, KJV)

The Garden Tomb

తోట సమాధి.

శరీరాన్ని పూర్తిగా పరిశుద్ధపరచిన తరువాత, మరొక కష్టమైన పని దేహాన్ని చుట్టు వస్త్రాలతో చుట్టుట మరియు సుగంధ ద్రవ్యాలను పూయు పనులు ఇంకా మిగిలి ఉండెను.

పాశ్చాత్య ప్రపంచంలో శవపేటికలలో దేహాలను  ఉంచునట్లు కాకుండా, శరీర భాగాలు ఒక దానితో మరో భాగం తాకకుండా చూడాలి. చేతులు మరియు కాళ్ళు అన్నియు వస్త్రముతో వేరుచేయబడును. ముఖము వలెనే చేతులు మరియు కాళ్ళు సాధారణంగా వేరుగా చుట్టబడును. ఇది కొంచెం కష్టమైన ఆచార ప్రక్రయ, మరియు అది లాజరు పునరుజ్జీవం పొందుకున్న తరువాత గ్రంథం ఇచ్చిన వివరణను బట్టి నిర్ణయించవచ్చు.

"చనిపోయినవాడు, కాళ్లు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడినవాడై వెలుపలికి(నడచి)  వచ్చెను; అతని ముఖమునకు రుమాలు కట్టియుండెను. అంతట యేసు మీరు అతని కట్లు విప్పిపోనియ్యుడని వారితో చెప్పెను.  "(యోహాను 11:44, KJV)

యూదు ఆలోచనలలో, ఖననం ప్రక్రియ అత్యంత ప్రాముఖ్యమైనది. అయితే ఒకని

శరీరం సరిగా సమాధి చేయబడకపోతే, ఆ వ్యక్తిని యహూవః యొక్క శాపం పొందినవానిగా భావించేవారు. అందువలన, ఒక దేహమును, ముఖ్యంగా ఇష్టమైన వారి యొక్క దేహమును సమాధి చేయునపుడు, సరిపోవునంత క్షుణ్ణంగా మరియు అతి జాగ్రత్తగా చేయుదురు.

ప్రతి ఒక్కరూ సుగంధ ద్రవ్యాలతో చుట్టి ఖననం చేయబడరు. కేవలం రాజులు మరియు చాలా

సంపన్నులు మాత్రమే సుగంధాలతో స్థోమతను బట్టి పూయబడతారు. హిజ్కియా రాజు తన నిధి భాండాగారంలో సుగంధ ద్రవ్యాలను నిల్వ వుంచేవాడు. అది అతని ఆస్తిలో భాగంగా పరిగణించబడెను. "రక్షకుని దేహానికి పూయుటకు నికోదేము వాడినట్లు పేర్కొనబడిన సుగంధ ద్రవ్యాలు [యోహాను 19: 39,40] 'మిర్ మరియు అలో' (బోళము & అగరు), ఇక్కడ రెండవ పదం అలో అనగా కలబందలతో తయారైన ఔషధమని అర్థం చేసుకోవచ్చు, కానీ అది మిక్కిలి-సువాసన భరితమైన అగరు చెట్టు/Aquilaria agallochum"6 యొక్క చెక్క. కొందరు పరిశోధకులు నికోదేము తెచ్చిన సుగంధ ద్రవ్యాలు విలువ నేటి మార్కెట్ లో 200,000 డాలర్ల పైనే వుండునని సూచించారు.7

ఒక "వంద పౌండ్ల సుగంధ ద్రవ్యాల బరువు" ఒక అపారమైన పరిమాణం గల అత్యంత ఖరీదైన సుగంధ ద్రవ్యం! మిర్ ఒక ద్రవ పదార్థం. అగరు పొడిగా/పౌడర్ చేయబడింది. సుగంధ ద్రవ్యాలనుపయోగించి ఒక మృత దేహాన్ని వస్త్రాలతో చుట్టే ప్రక్రియ గుప్పెళ్లతో తీసి ధూపము విసిరినట్లు చేసే ఒక త్వరితమైన క్రియ కాదు. శరీరంలోని ప్రతి భాగాన్ని విడి విడిగా అనేక పొరలతో చుట్టి చేయాలి. సుగంధ ద్రవ్యాల యొక్క ద్రవ మిశ్రమం మరియు పొడి  జాగ్రత్తగా మరియు గౌరవ భావంతో, ప్రతి పొరకు పూయసెను. ఇది ఒక చాలా సమయాన్ని తీసుకునే ప్రక్రియ.

సుగంధ ద్రవ్యాలనుపయోగించి వస్త్రాలతో  దేహంను చుట్టే పని పూర్తిచేయుటకు సులభంగా రెండు గంటలు (లేకపోతే మరింత సమయం) వరకు తీసుకొనెను. అందువలన అలా వారు చేరుకున్న సమయం అర్ధరాత్రికి తరువాతకు చేర్చెను.

 

 

 

12:30

సుగంధ ద్రవ్యాలనుపయోగించి వస్త్రాలతో దేహంను చుట్టుట అనేది అత్యంత సమయం తీసుకునే ప్రక్రియ. దీనిని వారు పూర్తి చేయడానికి కనీసం 12:30 pm వరకు సమయం పట్టును.

 

 

సమాధి చేయుట

"దానిని క్రిందికిదించి, సన్నపు నారబట్టతో చుట్టి, తొలిచిన రాతి సమాధిలో ఉంచెను. అందులో ఎవడును అంతకుమునుపెప్పుడును ఉంచబడలేదు. "(లూకా 23:53, KJV)

శరీరం చుట్టబడిన తరువాత, చివరిగా దేహాన్ని సమాధిలో వుంచడానికి కొన్ని నిమిషాలు మాత్రమే పడుతుంది. రాతిని దాని స్థానంలోనికి దొర్లించుట, రక్తంలో తడిసిన వస్త్రాలను చుట్టిపెట్టుట, మరియు రక్షకుని మ్రానుపై నుండి దించడానికి ఉపయోగించిన పరికరాలను సేకరించడం, ఇదంతా పెద్దగా సమయం తీసుకోలేదు. 12:50 గంటలకు, విచారంతో నిండిన ఆ గుంపు ఇంటి వైపు సాగిరి.

 

 

 

12:50

పురుషులు మరియు స్త్రీలు దాదాపు 12:50 p.m కు యెరూషలేమునకు తిరిగి వచ్చియుందురు.

 

Women return from Garden Tomb 

తోటలోని సమాధి నుండి స్త్రీలు తిరిగి వచ్చుటకు 15 నుండి 20 నిమిషాల సమయం తీసుకుని యుండును.

 

 

స్త్రీలు

"అప్పుడు గలిలయనుండి ఆయనతో కూడ వచ్చిన స్త్రీలు వెంట వెళ్లి ఆ సమాధిని, ఆయన దేహము ఏలాగుంచబడెనో చూచి తిరిగి వెళ్లి, సుగంధ ద్రవ్యములను పరిమళ తైలములను సిద్ధపరచి, ఆజ్ఞచొప్పున విశ్రాంతిదినమున తీరికగా ఉండిరి."(లూకా 23: 55-56, KJV).

మధ్య ప్రాచ్య/Middle Eastern సంస్కృతుల్లో, కుటుంబ సభ్యులే దేహాలను సమాధికి సిద్ధం చేస్తారు. మరణించిన మనిషి ఒక మహిళ అయితే దేహంను కుటుంబ సభ్యులలోని మహిళలు సిద్ధం చేస్తారు, మరణించిన మనిషి ఒక పురుషుడైతే కుటుంబంలోని పురుషులు సిద్ధం చేస్తారు. వివిధ ఆధారాలు అరిమతయియ యోసేపు యహూషువః యొక్క కుటుంబానికి చెందిన వాడని తెలుపుతున్నాయి, కాబట్టి రక్షకుని యొక్క ఖననంలో ఆయన పాల్గొనుటకు కారణం ఉంది.

మహిళలు దూరంగా ఉండి పోయి సమాధి ప్రక్రియలో పాలుపంచుకోలేదని లేఖనాలలో లిఖించబడెను. వారు ఖననం కోసం చాలా చేయాలని ఎంతో కోరిక కలిగి ఉన్నారు కానీ ఆపని పురుషులు చేయవలసిన పనియై ఉండెను. బదులుగా, వారు ఒక గౌరవప్రదమైన దూరం నుండి వీక్షించారు.  శరీరం చుట్టబడిన తరువాత పూసుటకు సుగంధ ద్రవ్యాలు మరియు లేపనాలు సేకరించడానికి నిర్ణయించుకొనెను.

సమాధి వద్ద రాతిని దాని స్థానానికి దొర్లించిన తరువాత అక్కడ మరింత పని ఏమీ ఉండదు. మహిళలు బహుశా ఇంటికి పురుషుల రక్షణ మధ్య తిరిగి వచ్చి యుంటారు. ఇది ఒక తొందరపాటు ప్రయాణం కాదు. వారు రాత్రంతా  మేల్కొని వున్నారు. వారు మానసిక, మానసికంగా, మరియు శారీరకంగా అయిపోయిరి. నిజానికి, మహిళల నివాసం ఎక్కడ ఉన్నదో గుర్తించుట వీలు కాలేదు, అయితే వారు మేడగదికా సాధారణ సమీపంలో నివసించి యుంటే, వారు సమాధి ఉన్న స్థలం నుండి ఒక కిలోమీటరు పైగా ఉంటుంది. ఒకవేళ వారు నగరం దిగువున నివశించియుంటే, అప్పుడు  ఇంటికి తిరిగి వచ్చుటకు, మరింత ఎక్కువ సమయం పట్టును. తక్కువ దూర (అడ్డుదారిన) ప్రయాణమైనా, వారు సమాధినుండి వారి ఇళ్లకు చేరుకొనుటకు సుమారు 15-20 నిమిషాల సమయం పడుతుంది.

మహిళలు తాము తదుపరి చేయవలసిన పనిని గురించి చర్చించడానికి సమయాన్ని జాగ్రత్తగా  ఉపయోగించి ఉండవచ్చు. వారు వారి ప్రియమైన బోధకుని యొక్క శరీరంను అభిషేకించాలని కోరుకొనెను. వారు ఆయనను తమవంతుగా కూడా కొంత (చిన్నగా)  గౌరవించాలని కోరుకొనెను. తిరిగి వచ్చిన తరువాత వారి ఇళ్లలో అందుబాటులో వున్న అభిషేక సుగంధాలకోసం శ్రద్ధగా తయారు

ప్రాచీన యెరూషలేము యొక్క ఈ నమూనా చిత్రంలో మేడ గది ప్రాంతము దిగువ కుడి మూలన వుంది. అలాగే ఎగువ ఎడమ భాగాన హేరోదు ప్యాలెస్ ను గమనించండి.

వెదకిరి. మహిళలు "సుగంధ ద్రవ్యాలు మరియు పరిమళ తైలాలను" తయారు చేశారని లూకా సువార్తలో అంటాడు. అయితే, వారు చేతిలో వున్న మట్టుకు సమీకరించి వాటిని పోల్చుకుని చూసిన తరువాత, అవి తగినంత మోతాదులో లేనట్లు గ్రహించిరని లేఖనాలలో వ్రాయబడిన దానిని బట్టి అర్థమవుతుంది. ఆ సమయంలో ఏమీ చేయలేకపోయారు ఎందుకంటే సబ్బాతు ఉదయం ప్రారంభమవు చున్నది. వారు "ఆజ్ఞ ప్రకారం విశ్రాంతిదినాన తీరికగా వుండిరి" (లూకా 23:56)

సబ్బాతు గతించి మార్కెట్ స్టాళ్లు మరియు వ్యాపార కార్యకలాపాలు ప్రారంభమైన  తరువాత  మహిళలు "ఆయనకు పూయవలెనని పరిమళ ద్రవ్యములను కొనుగోలు చేసిరి" (మార్కు 16: 1, KJV). వారు  యహూషువః మృతదేహాన్ని అభిషేకించుటకు  సమాధియొద్దకు తిరిగి రావాలని ఎంత కోరిక కలిగియున్నను, వారు వేచి ఉన్నారు. ఎందుకంటే వారికి అవసరమైన అదనపు సుగంధాలను సబ్బాతు గడిచే వరకు కొనుగోలు చేయలేరు. ఆయనను గౌరవించడం అంటే ఆయన ఆజ్ఞలకు లోబడుటయే అని వారికి తెలుసు. అతను ఇలా అన్నాడు, "మీరు నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞలను గైకొందురు." (యోహాను 14:15, NKJV). "విశ్రాంతి దినానికి ప్రభువును" గౌరవించుటకు వారు సబ్బాతు రోజును పవిత్రంగా ఆచరించిరి.

గతంలో పేర్కొన్న విధంగా, మహిళలు పురుషులతో యెరూషలేమునకు తిరిగి వచ్చిరని ఊహించుట హేతుబద్ధమైనది. తిరిగి వెళ్లేటప్పుడు వారికి 15 నిమిషాల పట్టడం వలన అలా వారు తిరిగి ఇంటికి ఉదయం 1:05  వచ్చారు. మహిళలు వారి వ్యక్తిగత గృహాలకు చేరుకుని, వారు కలిగియున్న సామాగ్రిని ఒకచోట చేర్చి, అప్పుడు వారికి తక్కువైన సామాగ్రిని గుర్తించుకొని అలా సబ్బాతు గతించిన తరువాత కొనుగోలు చేయవలసిన వాటిని గుర్తించిరి. అది అర్ధ రాత్రి కావున,  సహజంగా ఏ దుకాణాలు తెరచి వుండవు. సహేతుకంగా మాట్లాడితే, ఇది కనీసం ఒక గంట సమయం తీసుకుని, అలా సమయాన్ని 2 a.m కు కొంచెం తరువాతకు చేరుస్తుంది.

 

2:00 

న్యాయమైన సమయ అంచనాల ద్వారా, స్త్రీలు వారు సిద్ధపరచిన వాటిని ప్రక్కన పెట్టినపుడు సమయం 2 a.m. అయి ఉండెను.

 

 

సబ్బాతు ఉదయించుట(ప్రారంభం)

"ఆ దినము సిద్ధపరచు దినము విశ్రాంతిదినము ఆరంభం కావచ్చెను." (లూకా 23:54, KJV)

యహూషూవః మరణం మరియు ఖననాలను  గూర్చి సువార్తలలో చాలా సంక్షిప్తంగా తెలపబడింది. సమాధి ప్రక్రియలో వినియోగమైన సమయం మొత్తం కేవలం సూచనల రూపంలోనే తెలపబడెను. అయితే, సందర్భాల జాబితాను ఒకదాని వెంట ఒకటి తీసినప్పుడు మరియు ముఖ్యమైన పదాలను  గ్రీకులో చూసినప్పుడు, నిజాలు స్పష్టమాయెను: యహూషువః ఖననం సూర్యాస్తమయం ముందు పూర్తికాలేదు. ఓప్సియోస్/opsios యొక్క అత్యంత సాధారణమైన ఉపయోగంను ఆమోదిస్తే, అది మొత్తం రాత్రి దాదాపు పట్టినట్లు విశదమౌతుంది! రాత్రి సమయాల్లో సంభవించిన ప్రతిదీ వారం లోని ఆరవ రోజులోని భాగంగా భాభాంచబడెను. లూకా సువార్త ప్రకారం, మరుసటి రోజు (సబ్బాతు వేకువజాము)  ప్రారంభమయ్యే వరకు వారు పూర్తి చేయలేదు.8 ఇది అలా ఉన్నప్పటికీ ఆంగ్ల అనువాదంలో  స్పష్టంగా లేదు, అయితే అసలైన గ్రీకు దీనిని ప్రశ్న లేకుండా స్థాపిస్తుంది. 

ఇక్కడ "ప్రారంభమాయెను/drew on" అనే పదం  గ్రీకు పదం... (epiphosko) నుండి తీసుకోబడింది మరియు దీని నిర్వచనం: కాంతి పెరగడం ప్రారంభమవుట; తెల్లవారుట ప్రారంభం"9  ఇది # 2017 ... (epiphauo)  యొక్క ఒక రూపం, దీనర్ధం "ప్రకాశించు ... కాంతినిచ్చు."10  ప్రక్రియను ప్రారంభించు నిమిత్తం, దేహంను తీసుకొనే అనుమతి పొందుటకు సాయంకాలం వరకు వారు వేచి ఉండుట, క్రిందికి దించి, శుభ్రపరిచి చుట్టడం  మొ౹౹., పనులు చేయడానికి వారికి రాత్రి గంటలు పట్టెను. సబ్బాతు ప్రారంభమయ్యే వరకు అనగా ఉదయ కాంతి పెరగడం ప్రారంభమయ్యే వరకు  వారు ఆకార్యము పూర్తి చేయలేకపోయారు.11

న్యూ స్టాంగ్స్ ఎక్స్ పాండెడ్ డిక్షనరీ ఆఫ్ బైబిల్ వర్డ్స్ అనే నిఘంటువు దీనిని ఇలా విస్తరించి వివరించింది... epiphosko అనగా " సబ్బాతు సమీపమాయెను అనే దాన్ని తెలియచేస్తుంది".12 ఈ పదం సబ్బాతు సమీపించుటను సూచిస్తూ ఉంటే, మరియు ఆ పదం దానికదే ఉదయించుట అనే అర్థాన్నిస్తే ఇక ముగింపు స్పష్టంగా ఉంటుంది: సబ్బాతు కాంతి ఉదయించుటతో ప్రారంభమవును; సూర్యుడు అస్తమించు తదుపరి వచ్చే చీకటితో కాదు.

యెరూషలేములో, ఆ సంవత్సరపు సమయంలో సూర్యోదయం, 5:54 6:27 గంటలకు మధ్య సంభవించినది. అయితే డాన్-వెలుగు ప్రారంభమవుట ఇంకా ముందే జరిగెను. ఏప్రిల్ లో యెరూషలేములో ఖగోళ ప్రాతఃకాలం/తెల తెల్లవారు ఉదయం 5:05 గంటలకు (నెల ప్రారంభంలో) మరియు ఉదయం 4:25 గంటలకు (నెల చివరిలో, రోజులు వేసవి కాలం వైపు పొడిగించుకునే కొలది) వచ్చినది.

ముందుగా పేర్కొన్న విధంగా, ఉద్దేశపూర్వకంగా తక్కువ సమయ అంచనాలను ఈ అధ్యయనం కోసం ఎంపిక చేయబడెను. కృత్రిమంగా సమయాల్ని చేర్చి కాలాన్ని పెంచవలసిన అవసరత ఇక్కడ లేనేలేదు. మొత్తం ప్రక్రియ  సూర్యాస్తమయం ముందు పూర్తి కావచ్చు లేదా కాలేక పోవచ్చు. యోసేపు సూర్యాస్తమయం ముందు శరీరం తీసుకోవాలని అనుమతి కోరెనని భావిస్తే, ఇప్పుడు మహిళలు అభిషేక సుగంధ ద్రవ్యాలు సిద్ధపరిచే ఇప్పటికి మనలను తీసుకు వచ్చెను. వారు వారి యొద్ద తగినంత లేదని మరియు రాత్రి మధ్యలో మరింత కొనుగోలుకు వీలు పడదని తెలుసుకున్నారు.

సబ్బాతు గడిచి కొనుగోలు జరిగేంతవరకు వారు వేసిన ప్రయత్నాలను పక్కన పెట్టిరి. మా లెక్కల ద్వారా, ఇది సూర్యాస్తమయం తర్వాత ఏడవ గంట. అయితే అద్భుతంగా , మా సంప్రదాయక అంచనాలు దానిలో సగం అనగా నాలుగు గంటలే చూపించెను. వేరేలా చెప్పాలంటే, ఈ ప్రక్రియలో నిజానికి ఈ అధ్యయనంలో అనుమతించిన దానికంటే ఎక్కువ సమయం పట్టినట్లు లేఖనాలు స్పష్టం చేయుచుండెను!

వారు వారి సన్నాహాలను పక్కన పెట్టడంతో  విశ్రాంతి దినపు ఉదయం మొదలవుతున్నదని బైబిల్ స్పష్టంగా చెపుతుంది. అందువలన, పురుషుల ద్వారా సమాధి కార్యక్రమం పూర్తి చేయబడినపుడు వారు యెరూషలేమునకు తిరిగి వచ్చుటకు, మరియు మహిళలు వారు కలిగియున్న అభిషేక తైలాలు సమీకరించి మరియు మరింత సుగంధ ద్రవ్యం  అవసరమైనదని గ్రహించినప్పటికి సమయం  నిజానికి ఉదయం 5 గంటలకు దగ్గరగా ఉంది! సబ్బాతు, Abib 15, వెలుగుతో ప్రారంభమాయెను మరియు మహిళలు ఆజ్ఞను ప్రకారం విశ్రాంతి తీసుకొనెను.

 

5:00

మొత్తం ప్రక్రియ ముగిసే సరికి సబ్బాతు (ప్రాతఃకాలం) ప్రారంభమైంది లేదా, దాదాపు ఉదయం 5 గంటలని బైబిలు చెపుతుంది!
పేర్కొన్న జాబితా యొక్క కార్యకలాపాలన్నీ రాత్రంతా జరిగెను.


 

 

పునరుత్థానం

"విశ్రాంతిదినము గడచిపోగానే మగ్దలేనే మరియయు యాకోబు తల్లియైన మరియయు సలోమేయు వచ్చి, ఆయనకు పూయవలెనని సుగంధద్రవ్యములు కొనిరి. వారు ఆదివారమున పెందలకడ (లేచి, బయలుదేరి) సూర్యోదయమైనప్పుడు సమాధియొద్దకు వచ్చుచుండగా. "(మార్కు 16: 1-2, KJV)

దినము సూర్యాస్తమయంతో కాదు వేకువజామున ఆరంభమవునని ఇంకా ఒక చివరి నిర్ధారణ ఇక్కడ ఉంది. "విశ్రాంతిదినము గడచిపోయిన తరువాత ఆదివారమున, తెల్లవారుచుండగా మగ్దలేనే మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చిరి." (మత్తయి 28: 1, KJV).  ఇక్కడ "తెల్లవారుచుండగా" అని సూచించడానికి ఉపయోగించిన పదబంధం లూకా 23:54 లో ఉపయోగించిన విశ్రాంతిదినము "ఆరంభం కావచ్చెను" అనే ఖచ్చితమైన పదం నుండి వచ్చింది, ఎందుకంటే విశ్రాంతిదినము  ప్రారంభమాయెను గనుక మహిళలు వారి సన్నాహాలను పక్కన పెట్టెను. దీని అర్థము, కాంతి పెరగడం ప్రారంభమవుట: - ప్రాతఃకాలం/వేకువ ప్రారంభం ".13

"టువార్డ్" అనే ఆంగ్ల పదం ఒక దాని వైపు కదలికను సూచించే ఒక పదము. ఇది గ్రీకు పదం, EIS కు ఒక మంచి అనువాదం, ఇది కూడా ఒక స్థానాన్ని చేరుకొనే చలనంను వ్యక్తంచే (సూచి) స్తుంది.14 మొదటి దినము  సాయంత్రం ముందు సూర్యాస్తమయం వద్ద ప్రారంభమై వుంటే ఈ పదం వాడబడి ఉండేవికాదు. ఇది కేవలము వెలుగుగా "వారం లోని మొదటి దినము వైపు ప్రాతఃకాలం మొదలైంది" అనగా దినం ప్రారంభమైంది.

యూదులు సూర్యాస్తమయం వద్ద వారి రోజు ప్రారంభిస్తారు, వారు ప్రతి రోజు సూర్యాస్తమయం సమయంలో ప్రారంభించవచ్చు, వారం మొదటి రోజుతో సహా. అయితే, మత్తయి 28: 1 స్పష్టంగా తెలియజేస్తుంది, విశ్రాంతిదినము గడిచిపోయిన (ఇది రాత్రికి ముందు వెలుగు పోయినపుడు ముగిసింది) తరువాత వారంలో మొదటి దినంవైపు వెలుతురు పెరుగుతూ వుండగా (రాత్రికి ముందున్న సూర్యాస్తమయం వద్ద వారంలో మొదటి దినము ప్రారంభంకాలేదు), ఆ స్త్రీలు యహూషువఃను అభిషేకించుటకు సమాధియొద్దకు తిరిగి వచ్చిరి. ఇది అబీబు 14 ప్రధమ పనల పండుగ దినము.

He is not here! He has risen! 

ఆయన ఇక్కడ లేడు! ఆయన లేచియుండెను!

"నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచునట్లు నా కన్నులు తెరువుము. " (కీర్తన 119: 18, KJV)

సర్వజ్ఞుడైన యహూవః జ్ఞానం అతని ఏకైక కుమారుని మరణానికి సంబంధించిన ప్రతి అంశంను ఆలోచనాపూర్వకంగా రూపకల్పన చేసెను. సబ్బాతు యొక్క నిజం దాదాపు 2,000 సంవత్సరాల పాటు దాగి ఉంటుందని తన దివ్యదృష్టికి ముందే తెలుసు. ఒక నిస్వార్థ జీవితం యొక్క చాలా చివరి పని ఏదనగా, జాగ్రత్తగా అధ్యయనం చేసినప్పుడు, చివరి తరం విశ్వాసులకు సబ్బాతు ఎప్పుడు ప్రారంభమవుననే సత్యాన్ని తెలియజేయు, ఒక కాలానుగుణంగా జరిగిన సంఘటనల జాబితాను ఇచ్చుట.

శుక్రవారం సాయంత్రం సూర్యాస్తమయం నుండి  శనివారం సాయంత్రం సూర్యాస్తమయం వరకు సబ్బాతును ఆచరించు శనివారం సబ్బాతీయులు యహూషువః మరణానికి సంబంధించిన వృత్తాంతములోని ప్రతి అంశమును మధ్యాహ్నం 3 గంటల నుండి  సూర్యాస్తమయం వరకు దాదాపు 7 p.m లోపు (నాలుగు గంటల కంటే తక్కువ కాలంలో!) ఇనుమడించాలని చూసెదరు. అయితే, ఇది  అసాధ్యమైన పని. పైన వివరించినట్లు, అత్యంత  సాంప్రదాయబద్ధమైన సమయ అంచనాలు ఈ ప్రక్రియంతటికీ కనీసం తొమ్మిది గంటల సమయం తీసుకుని ఉండేదని బహిర్గతం చేయుచుండెను!  మరియు, అంతేకాక మొత్తం ప్రక్రియకు అంచనావేసినదానికంటే  కంటే ఎక్కువ సమయం పట్టిందని ఖగోళ ప్రాతఃకాల (ఉషోదయ) సమయాల ద్వారా నిరూపించబడింది.

ఒక నాలుగు గంటల సమయం వ్యవధిలో  జరిగిన ప్రతిదానిని ఇనుమడింపజేయుటకు మార్గం లేదు. ఇంకా అలా చేయుట, లేఖనాలలో లిఖించబడ్డ ఈ క్రింది నిజాలకు  విరుద్ధంగా పని చేయుటయే.

  1. ఓప్సియోస్/opsios అనే పదం యొక్క సాధారణ వాడుకను అంగీకరించి ఉంటే, అరిమతయియ యోసేపు సూర్యాస్తమయము  తరువాత వరకు దేహం కొరకు అనుమతి కోసం పిలాతు వద్దకు వెళ్లలేదు. (మత్తయి 27: 57-58). యోసేపు సూర్యాస్తమయ ముందు పిలాతు వద్దకు వెళ్ళాడు అనుకున్నా, అది అప్పటికీ ఒక ఇరుకైన, నాలుగు గంటల సమయంలోకి సంఘటనల యొక్క మొత్తం వృత్తాంతంను సరిపోయేటట్లు చేర్చుట అసాధ్యం.
  2. దేహం కొరకు అనుమతి పొందిన తరువాత, యోసేపు ఖనన వస్త్రాలు కొనుగోలు చేయుటకు వెళ్లెను. (మార్కు 15:46)
  3. ఖనన ప్రక్రియ సుదీర్ఘమైనది, అప్పటికే ఒక కొత్త దినం (ఉషోదయం) ప్రారంభమవుట వలన స్త్రీలు వారి సన్నాహాలను పక్కనపెట్టి  సబ్బాతునందు విశ్రాంతి తీసుకొనిరని గ్రంధం చెప్పుచున్నది. (లూకా 23:54)
  4. సబ్బాతు గడచిన తరువాత, స్త్రీలు వెళ్లి దేహమును అభిషేకించుటకు మరింత సుగంధ ద్రవ్యాలను కొన్నారు. (లూకా 23:56 మరియు మార్కు 16:1)
  5. "వారంలో మొదటి దినము ప్రారంభమవుచుండగా (తెల్లవారుచుండగ) ఆ స్త్రీలు యహూషువఃను అభిషేకించుటకు సమాధియొద్దకు తిరిగి వచ్చిరి" (మత్తయి 28:1)

బైబిలు దినము, మరియు ఏడవ-రోజు విశ్రాంతిదినము సూర్యాస్తమయం వద్ద కాదు వేకువతో ప్రారంభమవునని యహూషువః మరణము మరియు సమాధి చేయుటల యొక్క కాలక్రమణిక సంఘటనలు స్థిరపరచు చుండెను. ఇది గత సంప్రదాయాలను  మరియు ఊహలను మరియు లోపాలను పక్కన పెట్టి, పవిత్ర సబ్బాతు గంటలకు స్వాగతం పలికే సమయం: వేకువన వెలుగు వచ్చుట మొదలుకొని, వెలుతురు రాత్రి వద్ద వీడే వరకు. దీనికి వేరైనది ఏదైనా, అది కేవలం తప్పుడు భావన ఆధారమైన సాంప్రదాయమే.

 

సూర్యాస్తమయం నుండి సూర్యాస్తమయం వరకు సబ్బాతు అని పట్టుకొని వేలాడే వారు వారి విధానమును నిరూపించడానికి ఒక ప్రత్యామ్నాయ "కాల వృత్తాంత" ఆధారాలను చూపించమని WLC సవాలు చేస్తుంది. ఇది తప్పనిసరిగా యహూషువః మరణ సమయం 3 p.m కు మరియు సూర్యాస్తమయంకు  (సుమారు 7 p.m) మధ్యగల సమయంలో సమస్తము ఇమిడే విధంగా వారి ఆధారాలు వుండాలి. అది నిజమై ఉంటే, అది నిరూపించబడుతుంది. లేకపోతే, సంప్రదాయ నమ్మకాలను, తిరిగి పరీక్షించుకొనడానికి ఇదే సమయం.

 


సంబంధిత సమాచారం:


1 మెర్రియం-వెబ్స్టర్ నిఘంటువు.

2 ది న్యూ స్ట్రాంగ్స్ ఎక్స్ పాండెడ్ డిక్షనరీ ఆఫ్ బైబిల్ వర్డ్స్. 2001 ఎడిషన్, #6153, ఉద్ఘాటన సరఫరా.

3 ↑ ఐబిడ్., # 3798, ఉద్ఘాటన సరఫరా.

4 రోమన్ కాథలిక్కులు ద్వారా  శిలువ వేసిన  "సంప్రదాయ" గోల్గోతాగా ప్రచారం చేసిన స్థానంను  వివిధ కారణాల కారణంగా తోసిపుచ్చవచ్చు, వీటిలో ఒకటి అది నగరం యొక్క తక్షణ పశ్చిమాన ఉంది. యూదుల శుద్ధీకరణ సంప్రదాయ చట్టాలు అలాగే గాలి సంబంధిత కారకాల రీత్యా యెరూసలేము  యొక్క పశ్చిమము వైపు ఎవరూ ఖననం చేయకూడదని నిర్ణయించబడింది. యహూషువఃను శిలువ వేసిన స్థలానికి సమాధి దగ్గరగా వున్నదని బైబిలు  స్పష్టంగా చెపుతుంది. ఇది చేశారు దీనిలో సమాధి, ఇది నేటి సంప్రదాయ ప్రాంతాన్ని అసలైన శిలువ అమలు పరచిన ప్రాంతం కాదని తోసిపుచ్చుతుంది.

5 యోహాను 19  సైనికులు ఇతర ఇద్దరి మనుష్యుల యొక్క కాళ్ళు విరగ గొట్టినట్లు సూచిస్తుంది, కాని కానీ అతను అప్పటికే మరణించినందున యహూషువః కాళ్ళను విరగగొట్ట లేదని వివరిస్తుంది.

వచనం 38 ఇలా చెప్పుచూ అనువాదం  చేయబడెను అది, "అటుతరువాత" ... అరిమతయియ యోసేపు, తాను యహూషువః దేహమును తీసికొనిపోవుటకు పిలాతు నొద్ద సెలవడిగెను. పిలాతు సెలవిచ్చెను. గనుక అతడు వచ్చి యహూషువః దేహమును తీసికొనిపోయెను. ఇక్కడ మళ్ళీ అనువాద సమస్యలు తలెత్తుతాయి. ఈ "అటుతరువాత" అని అన్వయించబడిన పదం నిజానికి "అనుసరించుట"  'సమక్షంలో' అనే అర్ధాలను సూచిస్తుంది  ... (gen. సాంగత్యము, లేదా acc. పరంపర). ఇది దానితో కలిసి; మధ్యస్థ స్థానంను ఆక్రమించెను. "(స్ట్రాంగ్స్ ఎక్స్ పాండెడ్ డిక్షనరీ, # 3326, ఉద్ఘాటన సరఫరా).

వేరేలా చెప్పాలంటే, అది ఒక గతిస్తున్న సమయంలో, ఒకేసారి వివిధ సంఘటనలు, స్పష్టంగా చెప్పబడిన కాలానుసారమైన వృత్తాంత క్రమం లేకుండా అన్నీ ఒకేసారి  ఆవరించి సంభవించుటను వర్ణిస్తుంది. ఇంకా, మార్కు యొక్క వివరణను పరిగణనలోకి తీసుకోవడం ద్వారా యూదులు పిలాతు దగ్గరకు ఎప్పుడు వెళ్ళారన్నది ఇప్పటికీ ఖచ్చితంగా చూపగలము, ఇది యోసేపు అతడి వద్దకు వెళ్లే సమయానికి ఏ ఖైదీల మరణ విషయము పిలాతునకు తెలియదు అని నిరూపిస్తుంది.

6 స్మిత్'స్ బైబిల్ డిక్షనరీ.

7 నికోదేము వెళ్లి ఖననం నిమిత్తం సుగంధ ద్రవ్యాలు కొన్నట్లు బైబిలు తెలపలేదు. ఇంకా, ఇది, ఆ రోజులలో ధనవంతులు వారి సంపదను ఎలా సంరక్షించుకునేవారో చూపుతుంది. డబ్బు జమ చేయడానికి ఏ బ్యాంకులు లేనపుడు, వారు కొనగల "నిజమైన" సొత్తును కొనుగోలు చేసి అవసరమైనప్పుడు, అమ్మబడుట సర్వసాధారణమైనది.

8 లూకా నిజానికి, ఆ మనుష్యులు రాతిని పొర్లించుటను వివరించే పదాలకు వెంటనే సబ్బాతు (ఉదయించుట) ప్రారంభమాయెనని వ్యాఖ్యానించాడు. అయితే, అన్ని సువార్త  వాక్యములను పరిగణనలోకి తీసుకోవాలి. నిజానికి పాతిపెట్టినపుడు జరిగిన సంఘటనలన్నీ రాత్రి గంటల అన్నిటియందు/whole night hours జరిగెను, కాని ఒక నిర్దిష్ట సమయంలో జరిగినట్లు చూపలేదు.

9 ది న్యూ స్ట్రాంగ్స్ ఎక్స్ పాండెడ్ డిక్షనరీ ఆఫ్ బైబిల్ .  # 2020, 1990 ఎడిషన్.

10 ఐబిడ్.

11ఇలెయిన్ వార్న్ హాల్ట్ మరియు లారా లీ వార్న్ హాల్ట్ -జోన్స్, గ్రేట్ క్యాలెండర్ కాంట్రవర్సీ, పే. 40.

12 Op. సిట్., # 2020, ఉద్ఘాటన సరఫరా.

13 ఐబిడ్.

14 స్ట్రాంగ్స్ ఎక్స్ పాండెడ్ డిక్షనరీ # 1519.