Print

ఇశ్రాయేలూ, వినుము! మంచి వేదాంతశాస్త్రం యొక్క మొదటి సూత్రం

ఇది WLC యేతర వ్యాసం. బయటి రచయితల వనరులను ఉపయోగించినప్పుడు, బైబిలుకు మరియు డబ్ల్యుఎల్‌సి ప్రస్తుత నమ్మకాలకు 100% అనుగుణంగా ఉండెనని భావించిన వాటిని మాత్రమే మేము ప్రచురిస్తాము. కాబట్టి అలాంటి వ్యాసాలను డబ్ల్యుఎల్‌సి నుండి నేరుగా వచ్చినట్లుగా పరిగణించవచ్చు. యహువః యొక్క అనేక మంది సేవకుల పరిచర్య ద్వారా మేము ఎంతగానో ఆశీర్వదించబడ్డాము. అయితే ఈ రచయితల యొక్క ఇతర రచనలను అన్వేషించమని మేము మా సభ్యులకు సలహా ఇవ్వము. అటువంటి రచనలు, లోపాలను కలిగి ఉన్నందున మేము వాటిని ప్రచురణల నుండి మినహాయించాము. విచారకరంగా, లోపం లేని మంత్రిత్వ శాఖను మనం ఇంకనూ కనుగొనలేదు. డబ్ల్యుఎల్‌సి వి కాని కొన్ని ప్రచురించబడిన వ్యాసాలు / ఎపిసోడ్లు చూసి మీరు దిగ్బ్రాంతి చెందినచో, సామెతలు 4:18 జ్ఞాపకం చేసుకోండి. మన మార్గంలో మరింత కాంతి వెలువడు కొద్దీ ఆయన సత్యాన్ని గూర్చిన మన అవగాహన అభివృద్ధి చెందుతూ ఉంటుంది. మేము సత్యాన్ని ప్రాణం కంటే ఎక్కువగా ఆదరిస్తాము మరియు అది దొరికిన చోటు ఏదైనా అక్కడ వెతుకుతాము.

ఇశ్రాయేలూ, వినుము

ఒక శాస్త్రి యహూషువఃను ఆజ్ఞలన్నిటిలో ప్రధానమైనది ఏదని అడుగుతాడు. మెస్సీయ ఇలా సమాధానమిచ్చాడు. “ప్రధానమైనది ఏదనగా "ఇశ్రాయేలూ, వినుము; మన దేవుడైన యహువః అద్వితీయ ప్రభువు. నీవు నీ పూర్ణహృదయముతోను, నీ పూర్ణాత్మతోను, నీ పూర్ణవివేకముతోను, నీ పూర్ణబలముతోను, నీ దేవుడైన యహువఃను ప్రేమింపవలె ననునది ప్రధానమైన ఆజ్ఞ. రెండవది, నీవు నిన్నువలె నీ పొరుగువానిని ప్రేమింపవలెననునది రెండవ ఆజ్ఞ."   (మార్కు  12: 29-31). మెస్సీయ తన జవాబును  ఆజ్ఞలన్నిటి ప్రాతిపదికన తెరిచి చెప్పెనని గమనించడం చాలా ముఖ్యం - షెమా: “ఇశ్రాయేలూ, వినుము! మన దేవుడైన యహువః అద్వితీయుడైన యహువః.” క్రీస్తు బోధనకు షెమా ప్రవేశ ద్వారం లాంటిది. కాబట్టి యహూషువః యొక్క నిజమైన అనుచరులుగా ఉండాలని మరియు ఇశ్రాయేలు యొక్క యహువఃను ఆత్మతోను మరియు సత్యముతోను ఆరాధించాలనుకునే మనందరికీ షెమా గురించి సరైన అవగాహన పొందడం అవసరం. ఇశ్రాయేలీయుల ఏకైక దేవున్ని మనం తెలుసుకోవాలి. ఆయన నిజంగా (రహస్యంగా) ముగ్గురు కాదు, కానీ ఒక్కడు అని గుర్తించి అర్థం చేసుకోవడం ద్వారా ఇది ప్రారంభమవుతుంది. త్వరగా లేదా తరువాత ప్రతి మానవుడు యహూషువః యొక్క తండ్రియైన యహువః ఒక్కడే అనియు, ఆయన “అద్వితీయ సత్య దేవుడు” (యోహాను 17: 3) అనియు గుర్తించాలి.

యహువః “మన దేవుడు” అని యహూషువః చెప్పుటను గమనించండి. ఇది నిజమైన దేవుడు ఎవరో మరింత నిర్వచిస్తుంది. క్రైస్తవ విశ్వాసం యొక్క యూదు స్థాపకుడిగా యహూషువః మాట్లాడాడు. ఇశ్రాయేలీయుల దేవుడే యహూషువః యొక్క దేవుడు కూడా. యహూషువః కేవలం తోరా నుండి వచ్చిన భాగాలను ఉదహరించటం మాత్రమే చేయలేదు; ఆయన వాటిలో నివసించాడు. యహూషువః తన దేవున్ని పూర్ణ హృదయంతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ శక్తితో, పూర్ణ ఆత్మతో ప్రేమించాడు. మరియు యహూషువః తన పొరుగువారిని తనను వలె ప్రేమించాడు. మనము అనుసరించుటకు ఆయన ఒక మాదిరిని ఇచ్చాడు. మనం నిజంగా యహూషువఃను ప్రేమిస్తే, ఆయన విశ్వాసాన్ని పంచుకోవడం ద్వారా ఆయన మాదిరిని అనుసరించాలని మనం కోరుకోవాలి.  యహూషువః మాదిరిగానే యహువఃను ప్రేమించాలని, అలాగే యహూషువః మాదిరిగానే మన పొరుగువారిని కూడా ప్రేమించాలని మనం ఆశపడాలి. కానీ దానర్ధం నిజమైన దేవుడు ఎవరో మనం తెలుసుకొనుట. మెస్సీయ స్వయంగా‌ దీనిని ఇలా నిశ్చయంగా ప్రకటించాడు: “అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును, నీవు పంపిన యహూషువః క్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము.” (యోహాను 17: 3).

ఈ వాక్యంలో యహూషువః తన తండ్రితో మాట్లాడుతూ ఆయనను అద్వితీయ సత్యదేవుడు అని పిలుస్తాడు. అప్పుడాయన తనను తాను ఆ సత్య దేవుడు పంపిన వ్యక్తిగా పేర్కొన్నాడు.  “మాత్రమే” అనగా, తండ్రి తప్ప మరెవరూ కూడా నిజమైన దేవుడు కాదు. ఖచ్చితంగా ఎవరూ - వేరే వ్యక్తి లేరు. యహూషువః యొక్క ఆ మాటలు మనకు విలువైన స్పష్టమైన నిర్వచనాన్ని అందిస్తాయి మరియు ఏదైనా మరొక అర్ధాన్ని కాదు.  ఇశ్రాయేలీయుల ఏకైక దేవుడు తండ్రి తప్ప మరెవరూ కాదు. యహూషువః చెప్పారు.  ఇశ్రాయేలీయుల ఏకైక దేవుడు యహూషువఃకు కూడా దేవుడు:

“నా దేవుడును మీ దేవుడునైన వాని యొద్దకు ఎక్కిపోవు చున్నానని వారితో చెప్పుమనెను.” (యోహాను సువార్త 20:17).

“మన ప్రభువైన యహూషువః క్రీస్తు యొక్క దేవుడైన మహిమ స్వరూపియగు తండ్రి..” (ఎఫెసీయులకు. 1:17).

“మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారము.” (యోహాను సువార్త 4:22). ఇతర యూదులతో పాటు, యహూషువః తన దేవున్ని ఆరాధించాడు.

“నా దేవా, నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి?” (మత్తయి సువార్త 27:46).

మరియు యహూషువః పరలోకానికి తీసుకువెళ్ళబడిన తరువాత కూడా, తండ్రి ఇప్పటికీ తన యహువః:

“జయించు వానిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసెదను... మరియు నా దేవుని పేరును, పరలోకములో నా దేవుని యొద్దనుండి దిగి వచ్చుచున్న నూతనమైన యెరూషలేమను నా దేవుని పట్టణపు పేరును, నా క్రొత్త పేరును వాని మీద వ్రాసెదను.” (ప్రకటన. 3:12).

బంగారు స్థంభాలు

శతాబ్దాలుగా, చాలామంది క్రైస్తవులు తండ్రితో పాటు యహూషువః కూడా నిజమైన దేవుడు అని నమ్ముతున్నారు. దీనిని రుజువు చేసే భాగాలు బైబిల్లో ఉన్నాయని వారు నమ్ముతారు. కానీ విశ్వాసులు యహూషువః చెప్పినదానిని గ్రహించి - అతని చాలా సరళమైన ప్రకటనలను అంగీకరిస్తే - అప్పుడు వారు “రుజువులు” అని భావించే వాటినన్నిటికీ రుజువులు లేవని కనుగొంటారు. యహూషువః మెస్సీయ చెప్పినదానిని మనం నమ్ముదుమా? లేదా మనము ఆయన స్పష్టమైన మాటలను తిరస్కరించి మరియు వాటిని క్రైస్తవ సంప్రదాయంతో భర్తీ చేయుదుమా?

ఇశ్రాయేలూ, వినుము!  మన దేవుడైన యహువః అద్వితీయుడైన యహువః, ఆయన తండ్రి మరియు వేరొక దేవుడు లేడు. వేరే వ్యక్తి లేడు. యహూషువః యొక్క ఏకైక నిజమైన దేవుడు "ఒక్కడై ఉన్నవాడు, నిజమైన దేవుడు." "నిజమైన దేవుడు ఒక్కడు మాత్రమే." భాష మరి దేనినైనా స్పష్టం చేయగలదా?

ఇశ్రాయేలీయుల మరియు యహూషువః యొక్క ఏకైక దేవున్ని, తండ్రియును, సర్వశక్తిమంతుడును నిత్యుడును అయన యహువఃను స్వీకరించుదుమా? లేక ఆయన పక్కన మరికొందరు దేవుళ్ళు ఉన్నారని చెప్పుదుమా?

యహూషువః దేవుడు అని మీరు నమ్మకపోతే, మీరు రక్షింపబడలేరని మీరు భయపడుతున్నారా?  భయపడవద్దు, ఎందుకంటే అది బైబిలు చెప్పేది కాదు. అపొస్తలుడైన యోహాను నుండి ఇలా ఎందుకు వ్రాసామో గమనించండి: “యహూషువః దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును, నమ్మి ఆయన నామమందు జీవము పొందునట్లును ఇవి వ్రాయబడెను.” (యోహాను 20:31)

ఏదేమైనా యహూషువః దేవుడే అయి ఉండాలి అనే ఆలోచన ఎటువంటి బైబిల్ ప్రాతిపదిక లేకుండా మళ్లీ మళ్లీ చెప్పబడిన నినాదం. యహువః రక్షకుడిని తన నిబంధనల ప్రకారం ఎన్నుకుంటాడు, మన నిబంధనల ప్రకారం కాదు.

మెస్సీయ, యహువః యొక్క మానవ కుమారుడు. ఇది మన మోక్షానికి అవసరమైన యహూషువః యొక్క నిర్వచనం. యహువః స్వయంగా అపొస్తలుడైన పేతురుకు యహూషువః యొక్క గుర్తింపును వెల్లడించాడు: “అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తువని చెప్పెను. అందుకు యహూషువః సీమోను బర్‌యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచెనేకాని నరులు నీకు బయలు పరచలేదు.” (మత్త. 16: 16-17)

యహూషువః మెస్సీయ, యహువః కుమారుడు, యహువః నియమించిన మరియు అందించిన బలి గొర్రెపిల్ల. ఆయన త్యాగం పూర్తిగా సరిపోతుంది.  యహువః అలా నియమించాడు. నిజమైన యహువః గొర్రెపిల్ల బలి అర్పించబడిన శతాబ్దాల తరువాత అన్య ఊహాగానాల ఉత్పత్తి అయిన, ఊహాత్మకమైన “దేవుడైన గొర్రె పిల్ల” మీకు ఖచ్చితంగా అవసరం లేదు. అన్నిటి తరువాత, యహువః మరణించలేడు, మరియు మరణించే రక్షకుడు లేకుండా పాపానికి ప్రాయశ్చిత్తం లేదు.

ఈ ముఖ్యమైన విషయం గురించి మరింత తెలుసుకోవడానికి, WLC యొక్క కంటెంట్ డైరెక్టరీని సందర్శించండి: ది ట్రినిటీ (డాక్ట్రినల్ ఎర్రర్)


ఇది జాన్ సలోవ్స్కీ రాసిన వ్యాసం. డబ్ల్యుఎల్సి వ్యాసం కాదు.

మేము అసలు వ్యాసం నుండి సమస్త అన్య నామములను మరియు తండ్రి - కుమారుడు అనే శీర్షికలను తొలగించి, వాటి స్థానాన్ని అసలు నామములతో భర్తీ చేసాము. ఇంకా, ఇక్కడ ఇవ్వబడిన లేఖనాలలో తండ్రి మరియు కుమారుని నామములను బైబిల్ యొక్క మొదటి ప్రేరేపిత రచయితలచే వ్రాయబడిన విధంగా మేము పునరుద్ధరించాము. -డబ్ల్యుఎల్‌సి బృందం.