రూపాంతరం యొక్క రహస్యం క్రీస్తుతో యాహువఃలో దాచబడుట. ఇది దయతో యహువః అందించిన నిబంధన, తద్వారా విశ్వాసి దైవిక ధర్మశాస్త్రాన్ని ఖచ్చితంగా పాటిస్తున్నట్లుగా పరిగణించబడును.
|
అధికశాతం క్రైస్తవులు సువార్త యొక్క మంచి వార్తను గురించి ఆలోచించినప్పుడు, వారు క్షమాపణ అనే అమూల్యమైన బహుమానమును గురించి ఆలోచిస్తారు, ఇక్కడ విశ్వాసి యొక్క పాపాలు క్రీస్తు రక్తం ద్వారా తొలగించబడి మరియు అతడు ఎప్పుడూ పాపం చేయనివానివలె యహువః ముందు నిలబడతాడు. అయితే, యహువః యొక్క బహుమానం, జీవగ్రంధంలో వ్యక్తుల యొక్క జాబితాపై క్రీస్తు రక్తాన్ని చిలకరించే దైవిక సిరా పాత్ర కంటే చాలా విస్తారమైనది.
విధేయత అవసరమా?
ప్రకటన గ్రంథం నిత్యజీవానికి గల షరతులను స్పష్టంగా నిర్దేశిస్తుంది: జీవ వృక్షమునకు హక్కుగలవారై, గుమ్మములగుండ ఆ పట్టణములోనికి ప్రవేశించునట్లు తమ వస్త్రములను ఉదుకు కొనువారు ధన్యులు. (ప్రకటన గ్రంథము 22:14)
నిత్యజీవానికి లేదా నిత్య మరణానికి గల షరతులు ఎన్నడూ మారవని సాతానుకు తెలుసు: విధేయులు జీవించుదురు; అవిధేయులైనవారు మరియు మరణింతురు. సాతాను దైవిక ధర్మశాస్త్రం విషయంలో గందరగోళాన్ని సృష్టించాడు. ఒక వైపు, అతడు చాలా మంది భక్తిపరులైన క్రైస్తవులను తాము రక్షింపబడాలంటే ఈ జీవితంలో పాపము చేయనివారిగా ఉండాలని నమ్మునట్లు నడిపిస్తాడు. వారు హృదయపూర్వకంగా యహువఃకు విధేయులవ్వాలని మరియు సరైనది చేయాలని కోరుకుంటున్నందున, ఈ తరగతి క్రైస్తవులు క్రియల తగాదాలో చిక్కుకొనుట చాలా సులభం. యహువః పరిశుద్ధుడు మరియు వారు కారు అని వారికి తెలుసు కాబట్టి, వారు పవిత్రంగా ఉండు నిమిత్తం మరింత స్వీయ-తిరస్కరణ ప్రయత్నాలు చేస్తారు, దైవిక జీవితాలను గడపడానికి స్వీయ-తిరస్కరణ కీలకం.
మరొక తరగతి క్రైస్తవులు ఇతర ఊహలను కలిగియుండును. పడిపోయిన మానవుడు పాపం చేయకుండా ఉండుట అసాధ్యం అని వారు గ్రహిస్తారు. అందువల్ల, ఇది అసాధ్యం కాబట్టి, యహువః ఇకపై విధేయతను కోరుటలేదని వారు నొక్కి చెప్పుదురు. ఈ తరగతి క్రైస్తవుడి కోసం, ధర్మశాస్త్రం “సిలువకు వ్రేలాడదీయబడింది” అని మరియు ఇకపై దానికి కట్టుబడి ఉండనవసరం లేదు అనే అబద్ధాన్ని సాతాను సిద్ధం చేశాడు.
రక్షింపబడాలంటే పాపరహితులై ఉండాలి -------------------------------------------------------------- ధర్మశాస్త్రం ఇకపై అవసరం లేదు
రెండు వర్గాలూ పొరపాటుగా ఉన్నాయి. యోహాను జయించినవారిని చూపించాడు మరియు వారు దైవిక ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నారని నిస్సందేహంగా చెబుతున్నాడు: “యహువః ఆజ్ఞలను యహూషువఃను గూర్చిన విశ్వాసమును గైకొనుచున్న పరిశుద్ధుల ఓర్పు ఇందులో కనబడును.” (ప్రకటన 14:12 చూడండి.)
సమాధానం క్రీస్తు!
ఈ అసాధ్యమైన గందరగోళానికి సమాధానం యహూషువః. మోక్షం యొక్క బహుమానాన్ని అంగీకరించడానికి మీరు ఎంచుకున్నప్పుడు, గత పాపాలకు అవసరమైన క్షమాపణ కంటే ఎక్కువ మీకు అందించబడుతుంది. యహువః ధర్మానికి పరిపూర్ణంగా కట్టుబడి ఉన్న యహూషువః యొక్క పాపము లేని జీవితం కూడా మీ ఖాతాలోనికి జమ అవుతుంది. పౌలు ఇలా వ్రాశాడు:
మీరు క్రీస్తుతో కూడ లేపబడినవారైతే పైనున్న వాటినే వెదకుడి, అక్కడ క్రీస్తు ఎలోహీమ్ కుడిపార్శ్వమున కూర్చుండియున్నాడు. పైనున్న వాటిమీదనేగాని, భూసంబంధమైనవాటిమీద మనస్సు పెట్టుకొనకుడి; ఏలయనగా మీరు మృతిపొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడ ఎలోహీమ్ యందు దాచబడియున్నది. మనకు జీవమై యున్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడ మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు. (కొలొస్సయులు 3: 1-4 చూడండి.)
క్రీస్తుతో యహువః లో దాచబడుట. ధర్మాన్ని గౌరవించే వ్యక్తిగా పరిగణించబడాలని ఎవరైనా కోరుకుంటే తాను ఆశించవలసిన ఏకైక మార్గం ఇదే. మరియు రక్తం మన పాపాలను కప్పినట్లుగానే, ఇది కూడా దయ యొక్క బహుమానం, మరియు విశ్వాసం ద్వారా అంగీకరించే వారందరికీ ఇది ఉచితంగా లభిస్తుంది. క్రీస్తుతో యహువఃలో దాచబడుట అనగా ప్రాయశ్చిత్త బల్యర్పణపై గల విశ్వాసంలో పూర్తిగా మునిగిపోవుట, అంటే, మన పాపాలు యహూషువః నీతితో కప్పబడి ఉంటాయి. ఇది గత పాపాలకు మాత్రమే కాదు. పడిపోయిన మానవ స్వభావం యొక్క సహజ ఫలితం అయిన పాపాలు మరియు లోపాలు మరియు వైఫల్యాలకు కూడా.
యహువః లో క్రీస్తుతో తమను దాచుకున్న వారందరూ, యహూషువః తిరిగి వచ్చినప్పుడు, ఉన్నత స్వభావమును బహుమానంగా పొందుతారు. అప్పుడు, మరియు అప్పుడు మాత్రమే, వారు పూర్తిగా పాపము చేయని జీవితాలను జీవిస్తారు.
పౌలు కొరింథీయులతో ఇలా అన్నాడు:
సహోదరులారా, నేను చెప్పునది ఏమనగా రక్తమాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించు కొననేరవు; క్షయత అక్షయతను స్వతంత్రించుకొనదు.
ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను; మన మందరము నిద్రించము గాని నిమిషములో, ఒక రెప్పపాటున, కడబూర మ్రోగగానే మనమందరము మార్పుపొందుదుము. బూర మ్రోగును; అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పుపొందుదుము.
క్షయమైన యీ శరీరము అక్షయతను ధరించు కొనవలసియున్నది; మర్త్యమైన యీ శరీరము అమర్త్యతను ధరించు కొనవలసియున్నది. (1 కొరింథీయులకు 15:50-53 చూడండి.)
ఇది ఎలా పూర్తయింది
దావీదు పాపి. అతను బహుభార్యత్వం చేసినవాడు, అబద్దీకుడు, వ్యభిచారి మరియు హంతకుడు. ఇంకా, అతడికి అనేక పాపాలు ఉన్నప్పటికీ, అతడు యః యొక్క హృదయానుసారుడు అని లేఖనం చెబుతుంది. అతడు యః యొక్క ధర్మశాస్త్రమును ప్రేమిస్తున్నందున అతడు యః యొక్క హృదయానుసారుడు.
యహువః యొక్క ధర్మశాస్త్రం అనగా చేయవలసిన లేక చేయకూడని క్రియల యొక్క పెద్ద జాబితా కాదు. ఇది ఆయన ప్రేమ పాత్ర యొక్క ప్రతి! దావీదు దీనిని గ్రహించి ఇలా పాడాడు: నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియముగానున్నది దినమెల్ల నేను దానిని ధ్యానించుచున్నాను. (కీర్తనల గ్రంథము 119:97). మీరు యః యొక్క సొంత హృదయానుసారుడు కావాలనుకుంటే, ఆయన ధర్మశాస్త్రం (ఆయన స్వభావం) లో ఆనందించాలి, మీరు ఆయన వాక్యంలో సమయం గడపాలి. ఇది చాలా సులభం మరియు ఇది ఒక ఎంపిక. యహువః నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది అది ప్రాణమును తెప్పరిల్లజేయును; యహువః శాసనము నమ్మదగినది అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును. (కీర్తనల గ్రంథము 19:7).
మీరు యః వాక్యంలో సమయం గడపుటకు ఎంచుకున్నప్పుడు, ఆయన ఆత్మ మిమ్మల్ని మార్పు చెందిస్తుంది. మీ సృష్టికర్త మీ పునః సృష్టికర్త అవుతారు.
మీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధజలము చల్లుదును, మీ విగ్రహములవలన మీకు కలిగిన అపవిత్రత అంతయు తీసివేసెదను. నూతన హృదయము మీ కిచ్చెదను, నూతన స్వభావము మీకు కలుగజేసెదను, రాతిగుండె మీలోనుండి తీసివేసి మాంసపు గుండెను మీకిచ్చెదను. నా ఆత్మను మీయందుంచి, నా కట్టడల ననుసరించువారినిగాను నా విధులను గైకొను వారినిగాను మిమ్మును చేసెదను. (యెహెజ్కేలు 36:25,26,27).
మీరు యః వాక్యమును మరియు ఆయన స్వభావమును ధ్యానిస్తూ ఎంత ఎక్కువ సమయం గడిపితే, అంత ఎక్కువ ప్రశంశను మరియు ప్రేమను పొందుతారు. మరియు, మీరు యహువఃతో ఏకత్వం కలిగి ఉండటమే తప్ప మరి దేనినీ కోరుకోని స్థితికి చేరుకున్నప్పుడు, ఆయన దానిని మీ అత్యున్నత ప్రయత్నంగా అంగీకరిస్తాడు. పడిపోయిన స్వభావంలో గల అనివార్యమైన పాపాలు మరియు వైఫల్యాలు మీకు వ్యతిరేకంగా లెక్కించబడవు. యహూషువః యొక్క పరిపూర్ణ జీవితం మీ ఖాతాకు జమ అవుట ద్వారా అద్భుతమైన లావాదేవీ జరుగుతుంది. పౌలు వ్రాసినప్పుడు ఇదే వివరిస్తున్నాడు:
పనిచేయక, భక్తిహీనుని నీతిమంతునిగా తీర్చు వానియందు విశ్వాసముంచు వానికి వాని విశ్వాసము నీతిగా ఎంచబడుచున్నది. ఆ ప్రకారమే క్రియలు లేకుండ యహువః ఎవనిని నీతిమంతుడుగా ఎంచునో ఆ మనుష్యుడు ధన్యుడని దావీదుకూడ చెప్పుచున్నాడు. ఏలాగనగా తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. యహువః చేత నిర్దోషియని ఎంచబడినవాడు ధన్యుడు. (రోమీయులకు 4:5-8)
యహూషువః రక్తం మన పాపాలను కప్పివేస్తుంది. కానీ ఇంకా ఏమిటంటే, ఆయన పరిపూర్ణత మన అసంపూర్ణతను కప్పివేస్తుంది. యహూషువః జీవితంలో సంపూర్ణంగా నెరవేర్చబడిన యహువః యొక్క ధర్మము మరియు సంకల్పము మనకు అందించబడి, ఆజ్ఞలను సంపూర్ణంగా పాటిస్తున్నట్లుగా యహువః మనలను చూచునట్లు చేయును, (నిజానికి మనం పడిపోయిన స్వభావంలో ఉన్నందున మనం ఎప్పుడైనా ఏదో ఒక దానిలో విఫలమవుతాము).
ఈ వర్ణించలేని బహుమానం గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథంలో మన పేర్లు నిలిచియుండునట్లు అనుమతిస్తుంది. యహూషువః యొక్క సంపూర్ణ విధేయత మన క్రియల జాబితాలోనికి చేర్చబడినందున, పట్టణంలోనికి ప్రవేశించి జీవన వృక్ష ఫలమును భుజించుటకు హక్కు కల్పిస్తుంది., అయితే “గొఱ్ఱెపిల్లయొక్క జీవగ్రంథమందు వ్రాయ బడినవారే దానిలో ప్రవేశింతురు గాని నిషిద్ధమైన దేదైనను, అసహ్యమైనదానిని అబద్ధమైనదానిని జరిగించు వాడైనను దానిలోనికి ప్రవేశింపనే ప్రవేశింపడు." (ప్రకటన 21:2, 1599 జెనీవా బైబిల్)