"ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై యుండెను." ...దీని అర్థం ఏమిటి? బైబిల్ కోణం నుండి తెలుసుకోండి!
అక్రమమైన చట్టాలను పాటించేలా మరియు నిరంకుశ విధానాలను సమర్ధించేలా క్రైస్తవులను మోసగించుటకు రోమా 13 విస్తృతంగా ఉపయోగించబడుతుంది. అయితే, వాస్తవానికి ఇటువంటి వివరణలు లేఖనాలకు విరుద్ధం. దైవిక చట్టాన్ని ఉల్లంఘిస్తూ మానవ చట్టాన్ని పాటించాలని యహువః ఎన్నడూ, ఎవ్వరికీ ఆదేశించలేదు.
అపోస్తలుల చరిత్ర యొక్క ఈ ఉత్కంఠభరితమైన భాగం మానవ పెదవులచే రూపొందగల అతి ముఖ్యమైన ప్రశ్నను కలిగి ఉంది. ఈ ప్రశ్న ఆరోగ్యాన్ని, సంపదను, కీర్తిని లేక మానవ శక్తి మరియు గొప్పతనం యొక్క ఉన్నత స్థానాన్ని పొందుటకు నేను ఏమి చేయాలి అనేదానికోసం కాదు; కానీ వీటన్నిటి కంటే అనంతమైనది: “రక్షింపబడుటకు నేను ఏమి చేయాలి?”
యహువః కుమారునికి సంబంధించి అడగవలసిన అతి ముఖ్యమైన ప్రశ్న అతని ఆవిర్భావం గురించి. అతడు ఎక్కడ నుండి వచ్చాడు, ఎప్పుడు మరియు ఎలా? మానవుని వలె కనిపించుటకు ముందు నిత్యత్వమందంతటను యహువః వలె నిత్యము ఉనికిలో ఉన్న వ్యక్తికి మరియు తల్లి గర్భంద్వారా ఉనికిలోనికి వచ్చిన వ్యక్తికి మధ్య చాలా వ్యత్యాసం ఉంటుంది. నిజమైన మానవుడు, నిర్వచనం ప్రకారం, తన తల్లి గర్భంద్వారా ఉనికిని ప్రారంభిస్తాడు!
సువార్తను నమ్ముట రక్షింపబడుటకు; సువార్తను నమ్ముట శిక్షింపబడుటకు కాదు. కుమారుడిని నమ్ముట నిత్యజీవము పొందుట కొరకు; కుమారుడిని నమ్మకపోవుట నిత్యజీవము పొందుటకు కాదు కానీ యహువః ఉగ్రతకు లోనవుటకు. అందువలన, ఒకడు దేనిని విశ్వసిస్తున్నాడో లేదా విశ్వసించుటలేదో అనేది ఈ ప్రస్తుత జీవితానికి మించిన పరిణామాలను కలిగి ఉన్న చాలా ముఖ్యమైన విషయం. కానీ ఒకడు దేనిని నమ్మాలి? యహూషువః యొక్క సువార్త ఏమిటి? “కుమారుని నమ్ముట” అంటే ఏమిటి?
నిజమైన సబ్బాతును అంగీకరించే వారందరికీ మానవ శక్తితో పరిష్కరించలేని సమస్యలు ఎదురవుతాయి. తన పిల్లలు ఆయనను వెదుకునట్లు యహువః అలాంటి పరీక్షలను అనుమతిస్తాడు. అధిగమించలేని సమస్యలు నిబంధనను- నెరవేర్చు యహువః యొక్క శక్తి ద్వారా పరిష్కరించబడినప్పుడే ఒక వ్యక్తి విశ్వాసం బలపడుతుంది మరియు నేడు విశ్వాసం అనేది యః పిల్లల యొక్క గొప్ప అవసరత.
శ్రమల కాలంలో సంఘటనలు చాలా దుర్భరంగా ఉంటాయి, ఎలా అంటే, క్రీస్తు రావడానికి సమయం ఆసన్నమైందని అనేకులు తలంచుదురు, ముఖ్యంగా గొప్ప శ్రమలకు ముందు ఆయన వచ్చునని బోధించు సంఘ జనులు అలా తలంచుదురు. వారు వేచి ఉందురు మరియు ఏ రోజునైనా ఆయన వచ్చునని ఎదురు చూచెదురు!
శ్రమలకు ముందు సంఘ ఎత్తుబాటు సిద్ధాంతాన్ని తిరస్కరించడానికి పంతొమ్మిది కారణాలు!
క్రొత్తగా నిర్మించబడు భూమిపై దేవాలయం ఉండదు అనే ఊహను సాతాను ప్రోత్సహించాడు. ఆవిధంగా, సృష్టికర్త హృదయం యొక్క లోతైన కోరిక తెలియబడలేదు మరియు ప్రశంసించబడలేదు.
జచయించినవారికి ఇవ్వబడు గొప్ప బహుమానం అమరత్వం కాదు. బదులుగా, ఆ బహుమానం, భూమిపై రాబోయే రాజ్యంలో యహువః సమక్షంలో జీవించే అవకాశమై యున్నది. యహువఃతో కలిసి జీవించుటకు సన్నాహకంగా రక్షణను అంగీకరించుటకు మీరు మీ విశ్వాసాన్ని అవలంబించినప్పుడు, ఆ చర్య మీకు నీతిగా లెక్కించబడుతుంది.
రక్షకుడు తిరిగి వచ్చిన తరువాత వెయ్యేళ్ల పాలనలో తప్పిపోయినవారికి ఏమి జరుగుతుందో లేఖనం వెల్లడిస్తుంది . . . మరియు అది తండ్రి ప్రేమ యొక్క లోతును తెలుపుతుంది.
వ్యభిచారులైన చెడ్డ తరమువారు సూచక క్రియను అడుగుచున్నారు. ప్రవక్తయైన యోనానుగూర్చిన సూచక క్రియయే గాని మరి ఏ సూచక క్రియయైనను వారికి అనుగ్రహింపబడదు. యోనా మూడు రాత్రింబగళ్లు తిమింగిలము కడుపులో ఏలాగుండెనో ఆలాగు మనుష్యకుమారుడు మూడు రాత్రింబగళ్లు భూగర్బములో ఉండును. (మత్తయి 12:39-40, NKJV)
చర్చి బెంచీలపై కూర్చున్న చాలా మంది క్రైస్తవులు యహువఃను గూర్చి తమ అభిప్రాయం కేవలం బైబిల్ నుండి మాత్రమే ఉద్భవించినదని నమ్ముదురు. అయితే, త్రిత్వ దేవునిపై వారి విశ్వాసం యొక్క మూలాలు లేఖనాల నుండి కాక, గ్రీకు తత్వశాస్త్రం నుండి వచ్చెనని వారు ఎప్పటికీ అనుమానించరు.
చారిత్రాత్మకంగా, ఇశ్రాయేలుతో సంఘానికి ఉన్న సంబంధానికి సంబంధించి రెండు ప్రధాన సిద్ధాంతాలు ఉన్నాయి. ప్రత్యామ్నాయ/భర్తీ వేదాంతంలో, ఇశ్రాయేలు స్థానాన్ని సంఘం భర్తీ చేస్తుంది, అలా ఇశ్రాయేలుకు విమోచన భవిష్యత్తు ఉండదు. విభజన వేదాంతంలో (దైవసంకల్పం యొక్క ఒక అంశం), యహువః సంకల్పంలో 1 ఇశ్రాయేలుకు భవిష్యత్తు ఉండుటవలన, ఇశ్రాయేలుకు మరియు సంఘానికి మధ్య వ్యత్యాసం ఉంటూ, ఇది అన్ని కాలాలలో కాపాడబడి, రెండూ ఎన్నడూ దేనికది వేరుగా ఉన్నవి.
ఈ రెండు ప్రజాదరణ పొందిన దృక్పథాలు తప్పుగా ఉన్నాయా? ఈ రెండిటికి మధ్యస్థ సత్యం ఉందా?
యహూషువః ప్రకారం, ఆయన మొత్తం పరిచర్య యొక్క ఉద్దేశ్యం ఏమిటి? మీరు ఆశ్చర్యపోవచ్చు!
ఒకవేళ, మీరు ఒక చిన్న సమూహంగా, మీ సొంత కుటుంబంతో, లేదా మీరు ఒంటరిగా ఆరాధన చేస్తున్నా, ఇంట్లోనే ఆరాధిస్తూ విశ్రాంతిదినపు గొప్ప ఆశీర్వాదాన్ని పొందవచ్చు.
ఒక ఆత్మ మరణించినప్పుడు, ఇక మీదట దానికి ఏమీ తెలియదని [స్పృహ ఉండదని] గ్రంథం వెల్లడిస్తుంది. బాధ లేదా ఆనందం లేదు. జీవమునిచ్చువాడు తన శక్తితో తిరిగి జీవంలోనికి పిలుచు వరకు ఆత్మ “నిద్రిస్తుంది”.